బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు: బడి పిల్లలు ఏటా 53 రోజులు ట్రాఫిక్‌లేనే.!

Publish Date:Oct 1, 2026

Advertisement

దేశ ఐటీ రాజధానిగా విరాజిల్లుతున్న సిలికాన్ వ్యాలీ బెంగళూరులో ట్రాఫిక్ సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ఎదుర్కొనే నరకయాతన అంతాఇంతా కాదు. అయితే, ఈ రద్దీ కేవలం ఉద్యోగులకే పరిమితం కాకుండా పసిప్రాయంలోని స్కూల్ పిల్లలను సైతం తీవ్రంగా వేధిస్తోందని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. బెంగళూరు నగరంలో నెలకొన్న విపరీతమైన ట్రాఫిక్ జామ్‌ల కారణంగా చిన్నారులు తమ అమూల్యమైన కాలాన్ని రోడ్లపైనే కోల్పోతున్నారు. తాజా పరిశోధనల ప్రకారం.. నగరంలోని రద్దీ మార్గాల్లో ప్రయాణించే పాఠశాల విద్యార్థులు తమ జీవితంలో ఏటా దాదాపు 53 రోజులు (అంటే సుమారు 374 గంటలు) కేవలం ట్రాఫిక్‌‌లోనే వృథా చేస్తున్నట్లు తేలింది.

ముఖ్యంగా బెంగళూరులోని అత్యంత రద్దీగా ఉండే స్టేట్ హైవే-35 (వర్తూర్-గుంజూర్) మార్గంలో ఈ దుస్థితి మరింత స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి కూడా విద్యార్థులు దాదాపు రెండున్నర గంటల సమయం కేటాయించాల్సి వస్తోంది. ఉదయాన్నే స్కూల్ బస్సులు, వ్యాన్లలో ఎక్కే చిన్నారులు గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతున్నారు.ఈ దీర్ఘకాలిక ప్రయాణాల వల్ల విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా నిద్రలేకపోవడం, హోంవర్క్ చేసుకోవడానికి సమయం దొరకకపోవడం, మానసిక ఒత్తిడికి గురికావడం వంటి సమస్యలను చిన్నారులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలలకు వెళ్లే వయసులో విద్యపై దృష్టి పెట్టాల్సిన పిల్లలు, రోడ్లపై ట్రాఫిక్ కష్టాలతో సతమతమవ్వడం తల్లిదండ్రులను కలవరపెడుతోంది.

బెంగళూరు నగరంలో వేగంగా జరుగుతున్న పట్టణీకరణ, విపరీతంగా పెరుగుతున్న వాహనాల సంఖ్యే ఈ దయనీయ పరిస్థితికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను అభివృద్ధి చేయడంలో ప్రభుత్వాలు, స్థానిక యంత్రాంగాలు మరింత వేగంగా స్పందించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో విద్యార్థుల విద్యా ప్రమాణాలు మరింత దిగజారే అవకాశం ఉంది. కాబట్టి, నగరంలో పబ్లిక్ ట్రాఫిక్‌‌ను మెరుగుపరచడం, స్కూల్ బస్సుల రాకపోకలకు ప్రత్యేక కారిడార్లు లేదా ప్రత్యేక సమయాలను కేటాయించడం వంటి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు.

 

 

 

[ Bengaluru Traffic, Bangalore Traffic, Traffic Congestion, Bengaluru Traffic Jam, Student Life, Students Travel Time, 53 Days Wasted, Traffic Impact on Students, Bengaluru Education, Commuters, Road Traffic, Traffic Problems, Urban Mobility, Bangalore News, Karnataka News, Traffic Congestion in Bengaluru, Student Commute ]

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.