బంగాళాఖాతంలో మరో వాయుగండం: నవంబర్ 15 నాటికి తుపానుగా బలపడే అవకాశం.!
Publish Date:Nov 13, 2026
Advertisement
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతూ రాబోయే రెండు రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మధ్య అండమాన్ సముద్రం, దానికి ఆనుకుని ఉన్న అండమాన్ నికోబార్ దీవుల ప్రాంతంలో కొనసాగిన ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారిందనీ, ఇది వాయువ్య దిశగా పయనించి వచ్చే 24 నుంచి 48 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా ఆ తరువాత నవంబర్ 15 నాటికి వాయుగుండంగా బలపడుతుందని పేర్కొంది. ఇది కూడా చదవండి: తీరం దాటిన మురసు: బాపట్లలో వర్ష బీభత్సం: తెల్లవారు జామున చంద్రబాబు సమీక్ష.! దీని ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారుతుందనీ, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందనీ హెచ్చరించింది. అండమాన్ సముద్ర ప్రాంతంలో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని హెచ్చరించారు. అలాగే ఆగ్నేయ బంగాళాఖాతంలో రాబోయే కొన్ని రోజుల పాటు ఇదే తరహాలో ఈదురుగాలుల ప్రభావం ఉంటుందని స్పష్టం చేశారు. అయితే ఈ అల్పపీడనం ఏ దిశగా పయనిస్తుంది, తీవ్ర వాయుగుండంగా, తుపానుగా బలపడుతుందా అన్న విషయం ఇప్పుడే చెప్పలేమని వాతావరణ శాఖ పేర్కొంది. భవిష్యత్తులో ఈ వాయుగుండం మరింత బలపడితే తీర ప్రాంతాలపై పెను ప్రభావం చూపే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తీర ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారిక యంత్రాంగం కూడా అప్రమత్తం కావాలని హెచ్చరించింది. సముద్ర ప్రయాణాలు చేసే వారు మరియు నౌకాయాన రంగానికి చెందిన వారు వాతావరణ సూచనలను ఎప్పటికప్పుడు గమనించాలని కోరారు. మీకు నచ్చవచ్చు: మురసు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందాల పరిశీలన: నష్టం అంచనా, కేంద్రానికి నివేదిక.!
[Bay of Bengal, Depression, IMD Warning, Supertides, Wildwins, TeluguOne]
http://www.teluguone.com/news/content/bay-of-bengal-23-237021.html





