Publish Date:May 31, 2012
బాలయ్య హీరోగా నిర్మించిన అధినాయకుడు చిత్రం తమకు అభ్యంతరంగా ఉందన్న ఫిర్యాదుల సంఖ్య పెరుగుతోంది. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే ఈ చిత్రంలోని డైలాగ్ లపై తీవ్రంగా స్పందిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేశారు. ఈ చిత్ర ప్రదర్శన నిలిపివేసి ఉప ఎన్నికల తరువాత రిలీజ్ చేసుకోవాలని వారు సలహా ఇస్తున్నారు. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఇబ్బందికరంగా ఉన్నాయని సమైక్యాంధ్ర జెఎసి కూడా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది. అలానే ఆంధ్రాయూనివర్శిటీ విద్యార్థులు కూడా ఈ సినిమాపై అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉందని దీనిలో ఇతర పార్టీలను కించపరిచే విధంగా దృశ్యాలు ఉన్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ఈ సినిమాలో విగ్రహాల రాజేకీయమేమిటని బాలయ్య చెప్పిన పంచ్ డైలాగ్ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీని ట్రయల్ లోనే వణికించిందని వారి ఫిర్యాదు ద్వారా తేటతెల్లమవుతోంది. ఏమైనా ఎన్నికల సమయంలో విడుదలయ్యే సినిమాలో ఇతర పార్టీల తప్పులు కాక ఒప్పులు చూపుతారా అని సినీపందితులు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రశ్నిన్స్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/balakrishna-adhinayakudu-24-14487.html
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.
గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది.
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.
హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఏనుగు దంతాల అక్రమ విక్రయాల వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు.
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి.
హైదరాబాద్ రాజకీయాల్లో ఓట్ల తొలగింపు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
ఏడడుగులు కలిసి నడిచిన నాటి నుంచి ఒకే బాటగా జీవన పయనం సాగించిన ఆ వృద్ధ దంపతులు.. అంతిమ అడుగు కూడా కలిసే వేశారు. కలిసి బతికిన వారు కలిసే తనువు చాలించారు.