విజయమ్మతో యుద్ధానికి కాంగ్రెస్ కొత్త అస్త్రాలు?

Publish Date:May 31, 2012

Advertisement

వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్. విజయమ్మతో మాటల యుద్ధానికి కాంగ్రెస్ కొత్త అస్త్రాలను ఎంచుకుంటోంది. ప్రత్యేకించి తమ పార్టీలోని మహిళల్లో వక్తలూ, సమయస్ఫూర్తిగా మాట్లాడే నేర్పు ఉన్న వారిని ఎంపిక చేస్తోంది. దీనిలో భాగంగానే సికింద్రాబాద్ ఎమ్మెల్యే సినీనటి జయసుధ పేరును తెరపైకి వచ్చింది. ఈమెను సిఎం కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్సా సత్యనారాయణ ఎంపిక చేశారు. జయసుధను రాజకీయతెరకు దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి పరిచయం చేశారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఆమె గెలుపునకు బాటలు వేశారు. అందుకని ఆ విశ్వాసంతోనే జయసుధ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరటానికి సిద్ధపడి తర్వాత ఆగిపోయారు.



ఇటీవల వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డిని అక్రమాతుల కేసులో అరెస్టు చేశాక విజయమ్మ పార్టీ తరుపున ప్రచారంలో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో ఆమె చేసే విమర్శలకు జయసుధ ఇకపై  కాంగ్రెస్ తరుపున ఘాటుగా సమాధానమిస్తారు. ఈమె తరువాత విజయమ్మను ఎదుర్కొనేందుకు కేంద్రమంత్రి పురందరేశ్వరి కూడా రంగంలోకి వచ్చే అవకాశాలున్నాయి. ఇటీవల తన కుమారుడి కోసం అమెరికాలోని యూనివర్సిటీకి వెళ్ళిన ఆమె తిరిగి స్వదేశానికి వస్తున్నారు. ఆమె తిరిగి వచ్చాక విజయమ్మను విమర్శలతో ఎదుర్కొంటారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ తరుపున ఎంపి రేణుకా చౌదరి, గంగాభవానీ విజయమ్మను ఎదుర్కొనే పనిలో నిమగ్నమయ్యారు. ఓ మహిళను ఎదుర్కొనేందుకు పార్టీలోని మహిళలయితే సరిపోతుందని సిఎం కిరణ్, బొత్సా వ్యూహం ఎంత మేరకు సఫలీకృతమావుతుందో మాత్రం తెరేపైనే చూడాలి.

By
en-us Political News

  
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో  దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.   
గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది. 
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.
హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఏనుగు దంతాల అక్రమ విక్రయాల వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు.
హైదరాబాద్‌ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి.
హైదరాబాద్ రాజకీయాల్లో ఓట్ల తొలగింపు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
ఏడడుగులు కలిసి నడిచిన నాటి నుంచి ఒకే బాటగా జీవన పయనం సాగించిన ఆ వృద్ధ దంపతులు..   అంతిమ అడుగు కూడా కలిసే వేశారు. కలిసి బతికిన వారు కలిసే తనువు చాలించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.