హోం మంత్రి కుమారుడి పేరిట బ్లాక్ మెయిలింగ్
Publish Date:Apr 2, 2012
Advertisement
హోం మంత్రి కుమారుడిపేరిట ఒక గ్రానైట్ వ్యాపారిని బ్లాక్ మెయిల్ చేస్తున్న సాగిరెడ్డి రామకృష్ణరెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో కూడా హోంమంత్రి కుమారుడు కార్తిక్ పేరును ఉపయోగించి కొంతమంది వ్యక్తులు ఇటువంటి బ్లాక్ మెయిలింగ్ కి దిగుతుండడంతో హోంమంత్రి సబితాఇంద్రారెడ్డి ఆందోళనకు గురవుతున్నారు. తాజా సంఘటనలో సంతమాగులూరుకి చెందిన గడ్డం నారపరెడ్డి అనే వ్యక్తికి రామకృష్ణారెడ్డి ఫోన్ చేసి తాను హోమంత్రి కొడుకు కార్తిక్ రెడ్డినని గ్రానైట్ క్వారీ రిలీజ్ రద్దు చేసుకోకపోతే మీ కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడు. దీంతో బెంబేలెత్తిన నారపరెడ్డి పోలీసులను ఆశ్రయించగా వారు సేల్ ఫోన్ కాల్స్ ను గుర్తించి నిందితుడ్ని చిలకలూరిపేటలో అరెస్ట్ చేశారు. ఇటువంటి వ్యవహారాలూ హోమంత్రికి, ఆమె కొడుకు కార్తిక్ రెడ్డికి తలనొప్పులుగా మారాయి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎలా చేయాలో వారికి అర్థంకాడవం లేదు. దీనికి తోడు కార్తిక్ రెడ్డి వ్యవహార శైలి కూడా కొంత వివాదస్పదంగానే ఉంది. ఆయన కొన్ని భూసెటిల్ మెంట్లు చేస్తున్నాడరన్న ఆరోపణలు వచ్చాయి. ఇటువంటి వార్తలు పత్రికల్లో రావడంతో రామకృష్ణరెడ్డి వంటి వ్యక్తులు దీన్ని ఆసరాగా చేసుకుని కార్తిక్ రెడ్డి పేరుతో బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్నారు.
http://www.teluguone.com/news/content/ap-home-minister-son-kartik-reddy-24-13085.html





