జ'గన్' పేలితే కాంగ్రెస్ కుప్పకూలడం ఖాయం!

Publish Date:May 5, 2012

Advertisement

ఉప ఎన్నికలతో రాష్ట్రంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ నేత జగన్ భవితవ్యంతో పాటు 2014 ఎన్నికల ఫలితాలు ఏ విధంగా వుంటాయో తేలిపోతుందని పరిశీలకులు భావిస్తున్నారు. నేతలు ఎవరికివారే ఉప ఎన్నికలు రిఫరెండమ్ కాదని చెబుతున్నప్పటికీ సాధారణ ఎన్నికలకు కేవలం రెండు సంవత్సరాల వ్యవధి మాత్రమే ఉండటం వల్ల రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో పార్టీల బలాబలాలు కూడా బహిర్గతం అవుతాయని భావిస్తున్నారు.

 

 

నిజానికి ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలకు చెందిన పోటీగా మాత్రమే భావించాల్సి వుంటుంది. ఎందుకంటే ఉప ఎన్నికలు జరుగుతున్న 18 అసెంబ్లీ స్థానాలు, నెల్లూరు పార్లమెంట్ స్థానం కాంగ్రెస్ పార్టీకి చెందినవే. చిరంజీవి రాజీనామా చేసిన తిరుపతి స్థానం మినహాయిస్తే మిగిలిన 17 స్థానాలకు చెందిన కాంగ్రెస్ శాసనసభ్యులు కాంగ్రెస్ నుంచి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో ప్రవేశించినవారే. ఈ ఉప ఎన్నికల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తే అజ్గాన్ అనుసరిస్తున్న వైఖరిని ప్రజలు ఆమోదిస్తున్నారనుకోవాల్సి వస్తుంది.

 

 

ఇదే జరిగితే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కుప్ప కూలడం ఖాయమని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. జగన్ పార్టీ వచ్చే ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలిస్తే కాంగ్రెస్ నుంచి ఆ పార్టీలోని వలసలు ప్రారంభమవు తాయని ఇదే జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కుప్ప కూలడం ఖాయమని వారు భావిస్తున్నారు. ఒకవేళ మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధిస్తే వై.ఎస్.జగన్ ను, ఆయన పార్టీని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని భావించవచ్చు. ఈ రెండు పార్టీల మధ్య తెలుగుదేశంపార్టీ విజయం సాధించే పక్షంలో కాంగ్రెస్ ఓటింగ్ చీలడం ద్వారా తెలుగుదేశం పార్టీకి ఏ మేరకు లాభం చేకూరుతుందో అవగాహనకు వస్తుంది.

By
en-us Political News

  
ప్రతిపక్ష గొంతును నొక్కేసేందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం   భౌతిక దాడులు, అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.   ప్రజాస్వామ్య చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రతిపక్ష నాయకుల పట్ల పోలీసులు   దురుసుగా, అప్రజాస్వామికంగా వ్యవహరించారని మండిపడ్డారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ  విధానాలపై  పోరుబాటకు కేసీఆర్ పిలుపు ఇచ్చారు. పార్టీ నేతలు ప్రజాసమస్యలపై క్షేత్రస్థాయిలో ఆందోళనలకు సిద్ధం కావాలన్నారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు.  ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు,  రైతాంగ సమస్యలపై పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. 
కేవలం మాటల గారడీతో ప్రజలను మోసం చేసిన గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు, తమ వెయ్యి రోజుల సంక్షేమ పాలనకు మధ్య ఉన్న  వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని   పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి  రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలను, గణాంకాలతో సహా ప్రజలకు వివరించారు.
ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్, అలాగే బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి సొంతంగా తెలంగాణ రక్షణ సమితి పేరిట పార్టీ ఏర్పాటు చేసి సొంత అన్న కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలపై విమర్శల దాడి పెంచిన నేపథ్యంలో  బీఆర్ఎస్ తో పాటు కల్వకుంట్ల కుటుంబం కూడా డిఫెన్స్ లో పడింది.   ఇది నిస్సందేహంగా గులాబీ శిబిరాన్ని   బలహీనపరిచింది. 
గత పుష్కర కాలంగా  ఎలాంటి మార్పు లేకుండా ఒకే విధంగా కొనసాగుతున్న ఆటో  మీటర్ ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో  అధికారుల కమిటీ  సమర్పించిన నివేదిక సిఫారసుల మేరకు ఈ ప్రభుత్వం ఆటో మీటర్ చార్జీల పెంపు నిర్ణయానికి వచ్చింది.
ఐఫోన్‌ కొనాలనుకున్నాడు.. గంజాయితో జైలుకెళ్లాడు..!
 నెల రోజుల కిందటి  వరకూ  క్వింటాల్  రెండు వేల రూపాయలు పలికిన ఉల్లి ధర ఇప్పుడు 5వేల రూపాయలకు పెరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పాతబస్తీ గల్లీలోకి వచ్చిన ముఖ్యమంత్రి నేనొక్కడినే రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్..!
తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించినప్పటి నుండి నేటివరకు సాగిన రాజకీయ ప్రయాణం
మిర్యాలగూడ ధర్నాలో కేటీఆర్‌ కీలక ప్రకటన.. రైతుల కోసం పాదయాత్ర..!
ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబె ట్టారన్న ఆరోపణలపై సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.