పరకాలలో టార్గెట్ గా మారిన 'కొండా'
Publish Date:May 12, 2012
Advertisement
పరకాల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలో ఉన్న తాజమాజీ కొండా సురేఖ పోటీలో ఉన్న మిగిలిన అన్నిపార్టీలకూ టార్గెట్ గా మారారు. ఒకవైపు ఈమె రాజీనామా వల్లే ఎన్నికలోచ్చాయని చెబుతూ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అధినేత జగన్మోహనరెడ్డి అరెస్టు అయితే సురేఖ సంగతేంటని ఓటర్లను పలు పార్టీల నాయకులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా సురేఖకు నిలకడ ఉండదని ప్రచారమూ చేస్తున్నారు. జగన్ జైలుకు వెళితే ఆ పార్టీని నమ్మి మీరెలా ఓటేయగాలుగుటారో ఒక్కసారి ఆలోచించమని కరపత్రాలతోనూ ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా సరే మీకోసమే ఎన్నికల్లో నిల్చున్నానని చెబుతూ కొండా సురేఖ ఇంటింటికి తిరుగుతుంటే ఆమె ప్రచారం పూర్తికాగానే మిగలిన పార్టీలు వెళ్ళి పై ప్రశ్నలను సంధిస్తున్నారు. దీంతో ఇప్పటివరకూ ధీమాగా పనిచేసిన వై.ఎస్.ఆర్. కార్యకర్తలు ఈ పార్టీల ప్రచారంవల్ల తమ భవిష్యత్తు ఎలా ఉంటుందన్న సందేహంలో పడ్డారు. సురేఖతో పాటు ప్రచార కార్యక్రమాలు ఆపకుండానే వీరందరూ తమ పరిస్థితిపై అంచనాలు వేసుకుంటున్నారు. అయితే ఈ నియోజకవర్గం నుంచి సురేఖతో పాటు బిజెపి, తెలుగుదేశం, కాంగ్రెస్, టి.ఆర్.ఎస్. అభ్యర్థులు రంగంలో ఉన్నారు. బిజెపి తన ఎన్నికల ప్రచారాన్ని భరోసాయాత్రతో ప్రారంభించింది. ఈనెల 25వ తేదీనుంచి జిల్లాస్థాయి ప్రముఖులతో ప్రచారాన్ని ముమ్మరం చేసుకోవాలని నిర్ణయించుకుంది. అలానే తెలుగుదేశం పార్టీ కూడా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ కొండా సురేఖ భవిష్యత్తు అగాథమేనని విమర్శిస్తోంది. ఆ పార్టీ సీనియర్లు మాజీమంత్రి కడియం శ్రీహరి, తెలంగాణా ఫోరమ్ కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే పూజలతో ప్రచారం ప్రారంభించింది. జగన్ లానే సురేఖ కూడా ఇరకాటంలో పడటం ఖాయమని ఆ పార్టీ నాయకులు తమ ప్రచారంలో విమర్శిస్తున్నారు. చివరగా టి.ఆర్.ఎస్. తన మొత్తం ప్రచారంలో ఎక్కువభాగం కొండా సురేఖ రాజీనామా వల్లే ఎన్నికలోచ్చి ప్రజలపై భారం పడిందని విమర్శిచింది. పైగా ఆ పార్టీ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు అయితే కొండాను ఘాటుగా విమర్శించారు. అసలు జాక్ అంటే జగన్ యాక్షన్ కమిటీనా అని ఆయన సురేఖను ప్రశ్నించారు. ఈ జాక్ వల్లే ఎన్నికలోచ్చాయని ఓటర్లు గుర్తుంచుకోవాలని కోరారు.
http://www.teluguone.com/news/content/all-parties-targeting-konda-surekha-in-parakala-24-13979.html





