కేసీఆర్ కు లొంగిన కోదండరామ్!

Publish Date:May 31, 2012

Advertisement

తెలంగాణా జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ టి.ఆర్.ఎస్. అధినేత కేసీఆర్ వత్తిడులకు తలొగ్గాడు. టి.జె.ఎ.సి. తరుపున పరకాల ఉప ఎన్నికల్లో టి.ఆర్.ఎస్.కు మద్దతు ప్రకటించారు. మహబూబ్ నగర్ ఎన్నికల సమయంలో తెలంగాణా వాడం పేరు చెప్పి బిజెపికి పట్టంకట్టిన టి.జె.ఎ.సి.పై చంద్రశేఖరరావు ఆగ్రహించారు. తమకు ఉపయోగపడని కోదండరామ్ టి.జె.ఎ.సి.కి చైర్మన్ గా అవసరమో? కాదో తేల్చుకోవాలని కేసీఆర్ కార్యవర్గ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో కోదండరామ్ చైర్మన్ గా కొనసాగటానికి అవసరమైన మద్దతు కూడగట్టు'కోవటం చాలా కష్టమైంది. ఈ నేపథ్యంలో కెసీఆర్ పట్టును గ్రహించిన కోదండరామ్ పదవి దక్కించుకోవాలంటే టి.ఆర్.ఎస్. సహకారం అవసరమని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా పరకాల ఉప ఎన్నికలూ రావడంతో ఇక ఏకంగా టి.జె.ఎ.సి.మద్దతును టి.ఆర్.ఎస్. కు ప్రకటించారు. దీనికి తెలివిగా శాస్త్రీయపద్ధతిలో పరకాలలో టి.జె.ఎ.సి. సర్వే చేసిందనీ, ఆ సర్వేలో టి.ఆర్.ఎస్.కు అనుకూలంగా ఓట్లు ఉన్నారనీ, తెలంగాణావాదాన్ని గెలిపించుకునేందుకు టి.జె.ఎ.సి. టి.ఆర్.ఎస్.కు మద్దతు ఇస్తోందనీ వివరించారు. ఈ వివరణ విన్న తరువాత బిజెపి సమావేశం నుంచి బయటికి వచ్చేసి తాము పోటీలోనే కొనసాగుతామని ప్రకటించింది. తెలంగాణా తేవటానికి సామర్థ్యం ఉన్న తమను గెలిపిస్తారో? టి.ఆర్.ఎస్.ను గెలిపిస్తారో ఓటర్లే తెల్చుకున్తారని పేర్కొంది. అంతేకాకుండా టి.జె.ఎ.సి. వైఖరిపై ధ్వజమెత్తింది. అసలు కేసీఆర్ కోసమే కోదండరామ్ శాస్త్రీయత పేరుతొ అశాస్త్రీయమైన సర్వే ఫలితాలు ప్రకటించారని ఆరోపించింది.

By
en-us Political News

  
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో  దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.   
గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది. 
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.
హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఏనుగు దంతాల అక్రమ విక్రయాల వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు.
హైదరాబాద్‌ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి.
హైదరాబాద్ రాజకీయాల్లో ఓట్ల తొలగింపు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
ఏడడుగులు కలిసి నడిచిన నాటి నుంచి ఒకే బాటగా జీవన పయనం సాగించిన ఆ వృద్ధ దంపతులు..   అంతిమ అడుగు కూడా కలిసే వేశారు. కలిసి బతికిన వారు కలిసే తనువు చాలించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.