బాల్కానీలో గుట్కా ఉమ్మేస్తూ కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి.!

Publish Date:Oct 26, 2026

Advertisement

మధ్యప్రదేశ్‌లోని విదిశ జిల్లాలో చోటుచేసుకున్న ఒక అనూహ్య దుర్ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. సాధారణమైన అలవాటు ప్రాణాల మీదికి తెచ్చిన ఈ ఉదంతంలో ఒక అరవయ్యేళ్ల వృద్ధుడు  ప్రాణాలు కోల్పోయాడు.

అద్దెకు ఉంటున్న ఓ నిర్మాణంలో ఉన్న భవనం బాల్కనీ భాగంలో నిలబడి గుట్కా ఉమ్మివేయబోయిన ఆ వృద్ధుడికి మృత్యువు అనూహ్య రూపంలో ఎదురైంది. కొద్ది క్షణాల ముందు వరకు సాధారణంగా ఉన్న వ్యక్తి క్షణాల వ్యవధిలోనే విగతజీవిగా మారడం అందరినీ కలచివేసింది.

ఈ ప్రమాదం వెనుక భవన నిర్మాణ తీరులోని లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భవనానికి అతి సమీపంగా వెళుతున్న 11 కేవీ హై-టెన్షన్ విద్యుత్ లైన్ల కారణంగానే ఈ దుర్ఘటన సంభవించింది. బాల్కనీ అంచు నుంచి బయటికి వంగి ఉమ్మివేసే క్రమంలో కరెంట్ షాక్ తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఉమ్మిలోని తేమ, ఉప్పు విద్యుత్ ప్రసరణకు కారణమని నిపుణులు తెలిపారు.

కరెంట్ షాక్ తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే, ఆ వృద్ధుడి నిర్జీవ దేహం భవనం అంచున నిట్టనిలువుగా వేలాడుతూ కనిపించింది. ఈ భయానక దృశ్యాన్ని తొలుత గమనించిన ఇరుగుపొరుగు వారు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా ఇరుక్కుపోయిన మృతదేహాన్ని సురక్షితంగా కిందకు దించి, తదుపరి విచారణ నిమిత్తం సమీప ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

ఈ ప్రమాదంపై స్థానిక ప్రజానీకం  చుట్టుపక్కల నివాసితులు తీవ్ర ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనసంచారం ఉండే నివాస ప్రాంతాల్లో హై-టెన్షన్ విద్యుత్ తీగలు ఇంత ప్రమాదకరంగా ఉండటంపై వారు అధికారుల తీరును తప్పుబడుతున్నారు.

ఇలాంటి ప్రాణాంతక పరిస్థితులపై సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే స్పందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి అనర్థాలు పునరావృతం కాకుండా విద్యుత్ లైన్లను వెంటనే సురక్షిత ప్రాంతాలకు మార్చాలని కోరుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ముమ్మరం చేశారు. నిర్లక్ష్య కారణాలపై కూపీ లాగుతూ చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నారు.

 

 

[ Vidisha Man, Electrocution Death, High Tension Wire Accident, Madhya Pradesh News, Gutkha Spitting Accident, Building Safety Hazards, Telugu One, Telugu News ]
 

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.