బొద్దింకల ఆందోళనకు ఆర్ఎస్ఎస్ మద్దతు?

Publish Date:Jul 25, 2026

Advertisement

విద్యా రంగ ప్రక్షాళన, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉవ్వెత్తున ఎగసిన యువత, విద్యార్థుల ఉద్యమానికి ఆర్ఎస్ఎస్ మద్దతుగా నిలుస్తున్నదా? కేంద్రంలో మోడీ సర్కార్ విధానాల పట్ల రాష్ట్రీయ స్వయం సేవక్  అసంతృప్తి వ్యక్తమౌతోందా?  ఆ కారణంగానే రాత్రికి రాత్రి మోడీ ఓ వీడియో సందేశం ద్వారా నీట్ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించాల్సి వచ్చిందా అంటే.. జరుగుతున్న పరిణామాలను ఉటంకిస్తూ పరిశీలకులు ఔననే విశ్లేషిస్తున్నారు. 

బీజేపీకి ఆర్ఎస్ఎస్ మెంటార్ అన్న సంగతి తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వం తీసుకునే ప్రతి కీలక విధానపరమైన నిర్ణయాల వెనుకా ఆర్ఎస్ఎస్ ఉంటుందని అందరూ అంగీకరిస్తారు. అయితే..   దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళన పట్ల  కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆర్ఎస్ఎస్  ఆసంతృప్తిగా ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు.  ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సంఘ్ పరివార్ పెద్దలలో అసహనం, అసంతృప్తి గూడుకట్టుకున్నాయంటున్నారు.  

ఇందుకు ఉదాహరణగా ఆరెస్సెస్ బ్యాక్ గ్రౌండ్ నుంచి ఎదిగి, ఇప్పటికీ ఆ సంస్థతో సన్నిహిత సంబంధాలు కలిగిన సీనియర్ బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషి కాక్రోచ్ ఆందోళనలకు మద్దతుగా బాహాటంగా చేసిన వ్యాఖ్యలను చూపుతున్నారు. విద్యార్థుల ఉద్యమం సమజసమేననీ, ఆ ఉద్యమంలో పస ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.   విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని,   వెంటనే వారితో చర్చలు జరపాలని ఆయన మోడీ సర్కార్ కు విస్పష్ట సూచన చేశారు.  పార్టీలో సీనియర్ మోస్ట్ నేత, అది కూడా ఆరెస్సెస్ మద్దతు ఉన్న బలమైన నాయకుడు మురళీ మనోహర్ జోషీ బాహాటంగా విద్యార్థుల ఉద్యమానికి మద్దతుగా గళం ఎత్తడమే మోడీ తీరు పట్ల ఆరెస్సెస్ ఆగ్రహంగా ఉందనడానికి నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ప్రస్తుత  పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో   వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు సహా పలు కీలక బిల్లుల ఆమోదం పొందాలని ఆర్ఎస్ఎస్ భావిస్తోంది. కానీ మోడీ సర్కార్ తీరు వల్ల  పార్లమెంట్ లో చర్చలు జరిగే అవకాశమే లేకుండా పోవడం పట్ల ఆరెస్సెస్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.  మరోవైపు విద్యార్థుల ఆందోళనను మోడీ సర్కార్ పట్టించుకోకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కోసం విద్యార్థుల డిమాండ్ ను పెడచెవిన పెట్టడం సాధ్యం కాదన్న భావన ఆరెస్సెస్ అగ్రనాయకత్వంలో వ్యక్తమౌతోందని అంటున్నారు.  

RSS support for the cockroaches protest, RSS serious on Modi, Dharmendra Pradhan resignation demand, Murli Manohar Joshi on student protest

By
en-us Political News

  
తమ నియామకాలకు సంబంధించి   చట్టబద్ధమైన డాక్యుమెంట్లు ఉన్నాయనీ,  క్రీడా కోటా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్న జగన్‌ మోహన్ రెడ్డి, వైసీపీ నేతల ఆరోపణలను సక్ష్యాలతో సహా తిప్పి కొట్టారు.  ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి క్రీడా కోటాలో ఉద్యోగాలు రావడానికి వీలేదంటూ వైసీపీ చేసిన, చేస్తున్న వ్యాఖ్యలు.. ఆ పార్టీ నేతల అజ్ఝానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.
సరిగ్గా స్థానిక సన్నద్ధత కీలకంగా మారుతున్న సమయంలోనే జగన్ సకుటుంబంగా యూరొప్  వెళ్లనుండటం కూడా ఆ పార్టీకి ప్రతికూలంగానే పరిణమించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు
తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ.. ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.   తెలంగాణలో దశాబ్దం పాటు అధికారంలో ఉన్న   బీఆర్ఎస్  2023 ఎన్నికలలో ప్రజాతీర్పు కారణంగా ప్రతిపక్ష పాత్రకు పరిమితం అయ్యింది. ఇక ఏపీలో 2024 ఎన్నికలలో ఘోర పరాజయాన్నిఎదుర్కొన్న వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిగిలింది.
ఉత్తరాంధ్ర రాజకీయ రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ముఖ్యనేతల మధ్య వ్యక్తమవుతున్న అసంతృప్తులు జగన్ లో ఆ ప్రాంతంలో పార్టీ ఉనికి మాత్రంగా కూడా మిగలదా అన్న భయాన్ని రాజేశాయంటున్నారు పరిశీలకులు. మరీ ముఖ్యంగా స్థానిక ఎన్నికల ముంగిట పార్టీ నుంచి వరుస వరసలు జగన్ ను కలవర పెడుతున్నాయి.  
బొత్స ఆశీస్సులతో విజయనగరం జిల్లాలో క్షేత్రస్థాయి రాజకీయ వ్యవహారాలను, పార్టీ వ్యవహారాలనూ చిన్న శ్రీను అదేనండి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావే చూసుకుంటున్నారు.
ఇండియా కూటమిలో  ప్రధాని అభ్యర్థి విషయంలో భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో సీపీఎం ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.  ఏది ఏమైనప్పటికీ వచ్చే సార్వత్రి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతనే ఈ విషయంలో క్లారిటీ వస్తుందంటున్న పరిశీలకులు, రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వం పట్ల ఇండియా కూటమి పార్టీలు ఒకదాని తరువాత ఒకటిగా న్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పరిస్థితులను బట్టి  నిర్ణయం తీసుకుంటాయయంటున్నారు.  
ఉండవల్లి వైఎస్ భక్తుడు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆ భక్తితోనే  అవసరం ఉన్నా లేకున్నా జగన్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవసరమైన మాట సాయం చేయడానికి ఉండవల్లి ఎప్పుడూ ముందుంటారు. జగన్ కు మేలు చేసేలా అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలు పారేస్తుంటారు. ఇదంతా ఎందుకు నేరుగా వైసీపీలో చేరి ఆ పని చేయొచ్చుకదా అంటే, ఆ పని మాత్రం చేయరు ఉండవల్లి.  
రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.