మూడేళ్ల తర్వాత భారత్‌కు పాక్ మంత్రి.. ఎందుకో తెలుసా?

Publish Date:Nov 14, 2026

Advertisement

భారత్‌, పాకిస్థాన్‌ దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగిన అనంతరం, భారత్‌ చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్' (Operation Sindoor) సైనిక చర్య తర్వాత తొలిసారిగా ఒక పాకిస్థాన్ కేంద్ర మంత్రి భారత్‌లో పర్యతించనున్నారు. నవంబర్ 20 నుంచి 22 వరకు దిల్లీ వేదికగా ప్రతిష్టాత్మకంగా జరగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) సివిలైజేషన్ డైలాగ్‌ ఫోరమ్ సమావేశాలకు పాకిస్థాన్ పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి ముసాదిక్ మసూర్ మాలిక్ (Musadik Masood Malik) హాజరుకానున్నారు. ఈ మేరకు పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.   

చివరిసారిగా 2023 మే నెలలో గోవాలో జరిగిన ఎస్‌సీఓ విదేశాంగ మంత్రుల సమావేశానికి అప్పటి పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టో జర్దారీ హాజరయ్యారు. ఆ తదుపరి గత మూడేళ్ల కాలంలో ఏ ఒక్క పాకిస్థాన్ మంత్రి కూడా అధికారికంగా భారత్‌లో పర్యటించలేదు. ఇప్పుడు ముసాదిక్ మాలిక్ పర్యటన ఖరారు కావడంతో, దాదాపు మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పాక్‌ మంత్రి నుంచి భారత్‌కు జరుగుతున్న తొలి అధికారిక పర్యటన ఇదే కావడం గమనార్హం.   

ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి బిష్కెక్ శిఖరాగ్ర సమావేశంలో పాకిస్థాన్ ఎస్‌సీఓ రొటేటింగ్ చైర్మన్‌షిప్‌ను స్వీకరించింది. అంతేకాకుండా 2027 ఆగస్టులో ఇస్లామాబాద్ వేదికగా జరగనున్న ఎస్‌సీఓ నేతల శిఖరాగ్ర సమావేశానికి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో భారత్ ప్రతిపాదించిన ఈ ప్రత్యేక సంస్కృతుల సంభాషణ వేదికకు (SCO Civilisational Dialogue) హాజరుకావాలని భారత్ పంపిన ఆహ్వానాన్ని పాకిస్థాన్ అంగీకరించింది. యూరేషియా ప్రాంతంలో సాంస్కృతిక సంబంధాలను, ప్రజల మధ్య పరస్పర బంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో ఈ వేదికను భారత్ ప్రారంభించింది.   

గత ఏడాది సెప్టెంబర్‌లో చైనా  టియాంజిన్ (Tianjin) వేదికగా జరిగిన ఎస్‌సీఓ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ సివిలైజేషన్ డైలాగ్ ప్రతిపాదనను తెచ్చారు. ప్రస్తుతం ఈ సమావేశాలకు ఎస్‌సీఓ సభ్య దేశాలతో పాటు డైలాగ్ పార్ట్‌నర్లు, పరిశీలకులు సహా దాదాపు 25 దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారు. కాగా, గత ఏడాది ఏప్రిల్‌లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోగా, ఆ తర్వాత దెబ్బతిన్న దౌత్య సంబంధాల నడుమ ముసాదిక్ మాలిక్ దిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశాల నేపథ్యంలో ఉద్రిక్తతల నడుమ ఇరు దేశాల మధ్య దౌత్య చర్చలకు మళ్లీ తెరలేస్తుందా లేదా అనేది సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది.   

 

మీకు నచ్చవచ్చు: పర్సు నాటకం.. నకిలీ బంగారు బిస్కెట్.. అసలు గొలుసుతో పరార్.!

 

 

[ Musadik Malik India visit, Pakistan minister India trip, SCO Civilisational Dialogue Delhi, Pakistan climate minister, Operation Sindoor, India Pakistan diplomacy ]
 

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.