మద్రాస్ ఆర్మీ రెజిమెంట్ నుంచి ఆయుధాల చోరీ.. నలుగురు అరెస్ట్..!

Publish Date:Sep 11, 2026

Advertisement

చోరీ వెనుక రిటైర్డ్ ఆర్మీ అధికారి.. రెజిమెంట్ సిబ్బంది సహకారంతోనే దొంగతనం..?

హైదరాబాద్ శివార్లలో సంచలనం సృష్టించిన బొల్లారం ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మద్రాస్ ఆర్మీ రెజిమెంట్‌కు చెందిన ఆయుధాల చోరీ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు నలుగురిని అదుపు లోకి తీసుకున్నారు. ఈ కేసులో మద్రాస్ రెజిమెంట్ నుంచి రిటైర్ అయిన ఓ ఆర్మీ అధికారి కీలక సూత్రధారిగా ఉన్నట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. చోరీకి సంబంధించిన ఆయుధాలను మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ ప్రాంతాల్లోని రిటైర్డ్ ఆర్మీ అధికారి నివాసంతో పాటు ఇతర ప్రాంతాల్లో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

హైదరాబాద్ శివారు ప్రాంతంలో నివాసం ఉంటున్న ఈ విశ్రాంత ఆర్మీ అధికారి పాత్రపై దర్యాప్తు అధికారులు లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఈ చోరీ సాధారణ దొంగతనం కాదన్న అనుమానాలు వ్యక్తమ వుతున్నాయి. మద్రాస్ రెజిమెంట్‌లోని కీలక విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది సహకారంతోనే ఆయుధాలు బయటకు వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. మద్రాస్ రెజిమెంట్‌లోని బెల్ ఆఫ్ ఆర్మ్స్ ఇన్‌చార్జి సహకారంతోనే ఆయుధాల చోరీ జరిగినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా సైనికులకు బుల్లెట్లు అందించే అమ్యునిషన్ సెక్షన్ ఇన్‌చార్జి కూడా ఈ వ్యవహారంలో సహకరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

అంటే.. రెజిమెంట్‌లోని ఆయుధాల నిల్వ, వాటి కదలికలు, బుల్లెట్లకు సంబంధించిన వివరాలపై అవగాహన ఉన్న వ్యక్తుల సహకారంతోనే ఈ చోరీకి పక్కా ప్రణాళిక రచించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రిటైర్డ్ ఆర్మీ అధికారి సూత్రధారిగా వ్యవహరించగా.. రెజిమెంట్‌లోని కొందరి సహకారంతో ఆయుధాలు బయటకు తరలించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంలో మరికొందరి పాత్ర ఉందా?  వాటిని ఎవరికి విక్రయిం చేందుకు ప్రయత్నించారు? అనే కోణాల్లో కూడా విచారణ కొనసాగుతున్నది. 

ఈ కేసులో నలుగురు పట్టుబడటంతో దర్యా ప్తులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, బుల్లెట్లకు సంబంధించిన వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. బొల్లారం నుంచి ప్రారంభమైన ఈ ఆయుధాల చోరీ కేసు.. ఇప్పుడు మహబూబ్‌ నగర్, నాగర్‌కర్నూల్ వరకు విస్తరించడం, రిటైర్డ్ ఆర్మీ అధికారి పేరు తెరపైకి రావడం, అంతేకాకుండా రెజిమెంట్‌లోని కీలక విభాగాల సిబ్బంది సహకారం ఉన్నట్లు ఆరోపణలు రావడం ఈ కేసును మరింత సంచలనంగా మార్చింది.

 

 

[ Madras Army Regiment, Weapons theft case, Bollaram, Retired Army Officer, Mahabub Nagar, Nagarkurnool, Crime news, Minister Rajnath Singh,Telugu One, Telugu News ]
 

By
en-us Political News

  
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో  దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.   
గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది. 
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.
హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఏనుగు దంతాల అక్రమ విక్రయాల వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు.
హైదరాబాద్‌ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి.
హైదరాబాద్ రాజకీయాల్లో ఓట్ల తొలగింపు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
ఏడడుగులు కలిసి నడిచిన నాటి నుంచి ఒకే బాటగా జీవన పయనం సాగించిన ఆ వృద్ధ దంపతులు..   అంతిమ అడుగు కూడా కలిసే వేశారు. కలిసి బతికిన వారు కలిసే తనువు చాలించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.