ఆ ‘రెండే’ వచ్చే ఎన్నికల్లో టీడీపీకి అధికారం నిలబెట్టేవి

Publish Date:May 30, 2017

Advertisement

 

మహానాడు ముగిసింది. తెలుగు దేశం పార్టీ మహా సంబరం కూడా అయిపోయింది. యధావిధిగా ఘుమఘుమలాడే వంటకాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. కాని, అదే రేంజ్లో ఘాటైన రాజకీయ ఉపన్యాసాలు చెవిన పడలేదని కొందరు బాధపడ్డారు. అయితే, టీడీపీ అభిమానులు మాత్రం మహానాడు ఘనంగా ముగియటంతో హ్యాపీగా ఫీలయ్యారనే చెప్పాలి. కాకపోతే, అధికారంలోకి వచ్చిన మూడో ఏడు నడుస్తున్న ఈ కీలక సమయంలో జరిగిన మహానాడు సారాంశం ఏంటి?

 

మహానాడులో బోలెడు మాటలు, ఇంకా చాలా తీర్మానాలు వినిపించి వుండవచ్చు. కాని, మొత్తం సంబరం అంతా ఒక్క వాఖ్యంలో మాట్లాడేసుకోవాలంటే… అది చంద్రబాబు చెప్పిన ‘’ అమరావతి, పోలవరం … రెండు నాకు రెండు కళ్లు! ‘’ అన్నది. ఈ ఒక్క స్టేట్మెంట్ వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశానికి మళ్లీ అధికారం ఎలా వస్తుందో చెప్పగలదు. అదే సమయంలో ఏ అంశాలు నిర్లక్ష్యం చేస్తే జనం మనసులో మార్పు ఆలోచన చోటు చేసుకుంటుందో ఆ రహస్యం కూడా అందులోనే దాగుంది!

 

నవ్యాంధ్రగా ఏర్పడ్డ ఏపీ ఇప్పుడు అస్థిత్వ పోరాటంలో వుంది. అసెంబ్లీ, సెక్రటేరియట్ కూడా లేని స్థితిలో సరికొత్త ప్రస్థానం మొదలు పెట్టాల్సి వచ్చింది. అందుకు కారణమైన జాతీయ కాంగ్రెస్ ను ఆంధ్రా ప్రజలు సున్నా సీట్లతో కోలుకోలేని విధంగా శిక్షించారు. అదే సమయంలో నవ్యాంధ్రకు నవ్యమైన ఆత్మవిశ్వాసం కలిగించే గొప్ప బాధ్యత కూడా అనుభవం, దూరదృష్టీ వున్న చంద్రబాబుపై పెట్టారు. జగన్ని కాదని అధికారం ఇచ్చారు. అందుకే, అమరావతి తన రెండు ప్రాధాన్యాల్లో ఒకటని చెప్పారు బాబు. అయితే, కేవలం ఒక రాజధాని నిర్మాణం మాత్రమే అమరావతి అనిపించుకోదు. అమరావతి రూపంలో ఆంధ్రులకి ఎంతో అవసరమైన అవకాశల వెల్లువ మొదలవ్వాలి. అదంత తేలికైన విషయం కాకున్నా పని చేసే సత్తా వున్న ప్రతీవారికీ ఉద్యగం ఇప్పించగలగటమే  సీఎంకు అతి పెద్ద సవాల్! ఆ ఛాలెంజ్ కాని సమర్థంగా ఎదుర్కొంటే రానున్న ఎన్నికలు నల్లేరు పై నడకే!

 

చదువుకున్న యువత ఉద్యోగం కోరితే రైతులు కన్నీరు తుడిచే సాగునీరు కోరతారు. అందుకే, చంద్రబాబు పోలవరం కూడా ప్రస్తావించారు. ఒక్క పోలవరం పూర్తైతే యావత్ ఆంధ్ర రాష్టం స్థితి, గతే మారుతుంది. ఇది అందరూ ఒప్పుకునేదే. సాగునీరు, తాగు నీరు రెండూ జనానికి అంది సస్యశ్యామలం అవుతుంది తెలుగు నేల. కరువు రహిత రాష్ట్రం కూడా అవుతుంది. కాని, పోలవరం పూర్తి అసాధ్యం కాకపోయినా అసాధారణ విషయమే. చంద్రబాబు ఎంతో పట్టుదలతో భగరీథ ప్రయత్నం చేస్తే తప్ప అది సాకారం కాదు. కాని, ఒక్కసారి పోలవరం పూర్తి అయితే మాత్రం అది టీడీపీకి ఖచ్చితంగా పెద్ద వరమే అవుతుంది!

 

సీఎం చంద్రబాబు మహానాడులో చెప్పినట్టు వచ్చే ఎన్నికల లోపు అమరావతి, పోలవరం ఎంత వరకూ సాకారం అవుతాయో తెలియదుగాని … ఆయన కార్యదక్షతతో వాటిని నిర్మిస్తే మాత్రం సరికొత్త ఆంధ్ర రాష్ట్రం నిర్మాణం జరిగినట్టే! అలాగే, తెలుగు దేశం కూడా మరిన్నేళ్లు తెలుగు దేశానిదే!

 

 

By
en-us Political News

  
ఎలాన్ మస్క్.. సోషల్ మీడియా వేదికగా..   ప్రియమైన ప్రధాని అంబానీ  అంటూ  షేర్ చేసిన పోస్ట్ పెను సంచలనంగా మారింది.  భారతదేశానికి నిజమైన బాస్ అంబానీయే అంటూ.. ఆ విషయాన్ని తాను గుర్తించలేకపోయానని, క్షమించమంటూ ఎలాన్ మస్క్ ఆ పోస్టులో తన వ్యంగ్య వైభవాన్నంతా కుమ్మరించారు.
తమ దారికి రాకపోతే ఇరాన్ ను ప్రపంచపటంలో లేకుండా చేస్తాం అంటూ హెచ్చరించిన నోటితోనే నోబెల్ శాంతి బహుమతికి తన కంటే అర్హుడెవరున్నారని ప్రశ్నిస్తున్నారంటే ట్రంప్ ధైర్యానికి మెచ్చుకోవలసిందేనని అంటున్నారు.
కోనసీమ కంటే ఓ అడుగు ముందుకు వేసి పచ్చదనం, పారిశ్రామీకరణలో దేశంలోనే నంబర్ వన్ గా రాయలసీమ రూపుదిద్దుకోబోతోందని చంద్రబాబు ఘంటాపధంగా చెబుతున్నారు.
ఇక భీమిలిలో మరో ప్రధాన సవాలు కూటమి పార్టీల  బలం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉండటంతో, స్థానిక స్థాయిలో ఆ పార్టీల మధ్య ఉన్న సమన్వయం స్థానిక ఎన్నికల్లో వైసీపీకి తలనొప్పగా మారుతుందని అంటున్నారు.  
 డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో జనసేనాని పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న విధానాలు, ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణే ఈ వలసలకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామం జనసేన శిబిరంలో ఆనందోత్సాహాలను, నూనత ఉత్తేజాన్నీ నింపుతుంటే, వైసీపీ శిబిరం డీలా పడుతోంది. ఆ పార్టీ నేతలు కార్యకర్తలలో నిరుత్సాహం, నిస్తేజం పెరుగుతోంది.  
సొంత నియోజకవర్గంలోనే పార్టీని కాపాడలేక బొత్స మల్లగుల్లాలు పడుతున్నారు. స్థానిక ఎన్నికల వేళ చీపురుపల్లి వైసీపీలో  మొదలై, కొనసాగుతున్న వలసలు ఆయన ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి.  
ఎన్నికల సంఘం వ్యవహారాల్లో పారదర్శకత, స్వతంత్రత కోసం చట్ట సవరణ అవసరమంటూ సామాజిక మాధ్యమ వేదికగా ఆయన షేర్ చేసిన ట్వీట్  పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పార్లమెంటులో మద్దతు ఇస్తూ.. బయట మాత్రం  వ్యతిరేకిస్తున్నట్లు కనిపించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నం ఈ ట్వీట్ కళ్లకు కట్టింది.  
2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత వైసీపీ  రాష్ట్రంలో   రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి శతధా  ప్రయత్నిస్తోంది.  ఈ తరుణంలో ప్రజా సమస్యల ప్రాతిపదికన జరిగే  వామపక్షాలు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడం ఆ పార్టీకి రాజకీయంగా ఒకింత సానుకూలత వస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   
కేంద్ర పెద్దల కరుణా కటాక్షాల కోసం కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. గత నెలలో హస్తిన వెళ్లి పెద్దలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ, అది ఫలించ లేదు. కేంద్ర పెద్దల అప్పాయింట్ మెంట్ దొరకకపోవడంతో జగన్ హస్తిన పర్యటనకు వెళ్లలేదు.
ఇటీవలి కాలంలో మీడియాకు ముఖం చాటేయడమే కాకుండా, పార్టీ వ్యవహారాల్లో కూడా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న సజ్జల తీరును వారు ఉదహరిస్తున్నారు.   ఇటీవలి కాలంలో సజ్జల సైలెన్స్ పార్టీ వర్గాలను సైతం విస్మయ పరుస్తున్నది.
స్థానిక సమరంలో సత్తా చాటాలంటే ఇవేమీ పెద్దగా పని చేయవని భావిస్తున్న జగన్ తన ఆశలన్నీ తెలుగుదేశం కూటమిలో కీలక భాగస్వామి అయిన జనసేనపై ఆశలు పెట్టుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇందులో భాగంగానే సోషల్ మీడియా వేదికగా  జనసేన అధినేత, జనసైనికులను రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతున్నారు.
తమ నియామకాలకు సంబంధించి   చట్టబద్ధమైన డాక్యుమెంట్లు ఉన్నాయనీ,  క్రీడా కోటా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్న జగన్‌ మోహన్ రెడ్డి, వైసీపీ నేతల ఆరోపణలను సక్ష్యాలతో సహా తిప్పి కొట్టారు.  ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి క్రీడా కోటాలో ఉద్యోగాలు రావడానికి వీలేదంటూ వైసీపీ చేసిన, చేస్తున్న వ్యాఖ్యలు.. ఆ పార్టీ నేతల అజ్ఝానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.