నిన్న మొన్నటి వరకు ‘భాయి భాయి’ అని భుజాలు పూసుకు తిరిగిన కాంగ్రెస్ యం.ఐ.యం. పార్టీలు అఫీషియల్ గా ‘తలాక్’ చెప్పేసుకొన్నాక మొన్నజరిగిన శాశనసభ సమావేశాలలో ఒకరి మీద మరొకరు తల్వార్లు దూసుకొన్నారు. శంఖంలో పోస్తే గాని నీరు తీర్దం గానట్లు, సభలో మిగిలిన ఆ ముచ్చటకూడా పూర్తీచేసేసారు గనుక ఇక బహిరంగంగానే నిర్బయంగా తిట్టేసుకోవచ్చు. నోరార విమర్శలు చేసుకోవచ్చు.
అయితే, ఇంతకాలం కాంగ్రెసుతో అంటకాగిన యం.ఐ.యం.కి హట్టాత్తుగా కాంగ్రెస్ అంటే ఎందుకు వెగటు పుట్టుకోచ్చింది? స్వయంగా మతతత్వపార్టీ అయ్యుండి, తన ముద్రని కాంగ్రేసుకి ఎందుకు అంటగట్టింది? కాంగ్రెసుతో విడాకులు తీసేసుకోన్నాక కిరణ్ కన్నా జగన్ మంచోడు అని ఓ మాటనేసిమరీ బయటకొచ్చిన అసదుద్దీన్ అక్కడనుండి నేరుగా చంచలగూడలో ఉన్న జగన్ ఆఫీసుకి వెళ్ళాకపోవడంతో ఆతను ఇంకా కొన్ని సస్పెన్స్ సీన్స్ చూపించబోతునట్లు అర్ధమవుతోంది. అయితే, మొన్న ఆ సస్పెన్స్ కీ తెరదించుతూ ఈ నెల అంటే డిసెంబర్ లో నిజామాబాదులో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నట్లు తెలియజేసాడు.
అయితే, త్వరలో రాష్ట్రమంతా పర్యటించి కిరణ్ కుమార్ కి వ్యతిరేఖంగా ప్రచారం చేస్తానని అంతే గాకుండా రాబోయే ఎన్నికలలో వీలయినన్ని స్థానాలకి పోటిచేస్తామని ముందే చెప్పిన సంగతి గుర్తుకు తెచ్చుకొంటే, యం.ఐ.యం. కూడా వీలయినన్ని సీట్లు సంపాదించుకొని, మిగిలిన రాజకీయ పార్టీల మాదిరిగానే కేంద్రంలో, రాష్ట్రంలో చక్రం తిప్పేయాలని తహతహలాడుతునట్లు అర్ధమవుతుంది.
కాంగ్రేసుకి చిరకాలం తోక పార్టీగా మిగిలి పోవడంకంటే, రాష్ట్రం అస్తవ్యస్తంగా ఉన్నఈ తరుణంలోనే ఒక ట్రయల్ వేసి అదృష్టం పరీక్షించుకోవడం మంచిదని భావించినట్లు అర్ధమవుతోంది. అందుకే యం.ఐ.యం. కాంగ్రెసుతో పూర్తిగా తెగ తెంపులు చేసేసుకొని మరీ బయటకి వచ్చేసింది. అయితే, ఎన్నికల ముందో లేక తరువాతనో అవసరాని బట్టి మళ్లీ కలవడం పెద్ద కష్టమూ కాదు నేరము కాదు గనుక, ప్రస్తుతానికి యం.ఐ.యం. ఇలాగ నిర్ణయం తీసేసుకొని ఉండవచ్చును.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-akbar-owaisi-kiran-kumar-reddy-43-19512.html
ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికల ఫలితాలు రాజకీయంగా ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
విజయనగరం జిల్లాలో బొత్స కుటుంబ హవా.!
ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికల ఫలితాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాకిచ్చాయి.
విశాఖ వేదికగా జరగనున్న ఈ సదస్సు ద్వారా రాష్ట్రంలో అపారంగా ఉన్న పెట్టుబడి అవకాశాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక దిగ్గజాలకు బలంగా చాటిచెప్పాలన్నారు. విధాన రూపకర్తలు, గ్లోబల్ ఇన్వెస్టర్లు, పరిశ్రమలు, విద్యాసంస్థలు, స్టార్టప్స్ మధ్య బలమైన వారధిగా ఈ సదస్సు నిలవాలని చంద్రబాబు పేర్కొన్నారు.
మొత్తం 365 కౌంటింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంటుందని.. 19,885 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ నిఘాతో పాటు పోలీసు సిబ్బంది ధరించే బాడీవోర్న్ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంతో కాలంగా వెనుకబడి ఉన్న కాంగ్రెస్ పార్టీ, తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని విధంగా సంచలన విజయాలతో అందరి దృష్టిని ఆకర్షించింది.
రాప్తాడు బాలిక లక్ష్మి సాహసానికి గుర్తింపు.. చదువుకు అండగా ఆనంద్ మహీంద్రా.!
ఆచార్య ఎన్.జి. రంగా 127వ జయంతి సందర్భంగా జమీన్ రైతు పత్రిక సంపాదకులు డోలేంద్ర ప్రసాద్‌కు ఆచార్య ఎన్.జి. రంగా పురస్కారం ప్రదానం చేశారు.
ప్రస్తుతం అనంతపురంలో ఉన్న కియా తయారీ కేంద్రానికి ఏటా 3 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. అయితే, ఈ తాజా పెట్టుబడి ద్వారా ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత భారీగా పెంచాలని కియా లక్ష్యంగా పెట్టుకుంది.
పంచాయతీ ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, సజావుగా పూర్తి చేసేందుకు వీలుగా మూడు దశలలో ఎన్నికల నిర్వహణకు నిర్ణయించినట్లు పేర్కొంది. ఇందు కోసం దశలవారీగా నోటిఫికేషన్లను విడుదల చేయనుంది. తాజాగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్‌ను నవంబర్ 13, రెండో విడత నోటిఫికేషన్ ను నవంబర్ 18న, ఒక మూడో విడత నోటిఫికేషన్‌ను నవంబర్ 19వ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేయనుంది.
4 మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు 19 మున్సిపాలిటీలు నగర పంచాయతీలు ఉన్నాయి. గతంలో కొన్ని కారణాల వల్ల వాయిదా పడిన ఈ ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది.
నష్టంపై సమీక్షించిన సీఎం చంద్రబాబు.. కేంద్రానికి సమగ్ర నివేదిక.!
హరిత మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.!