రోగాలు రాకుండా చూసుకోవడం ఎలా ?
అసలు రోగం రానే కూడాడు వచ్చిందా శరీర తత్వాన్ని బట్టి ఆ వ్యక్తి లో రోగ నిరోధక శక్తి ఉంటె మాత్రమే రోగాల నుండి తట్టుకోగలడు. అయితే అసలు రోగాలు రాకుండా చూసుకోవడం ముఖ్యం అంటున్నారు నిపుణులు అది ఎలా సాధ్యం? సాధ్యమే అని అంటున్నారు నిపుణులు... మన చుట్టూ ఉండే వాతావరణం లో ఎన్నో రకాల వైరస్ లు బాక్టీరియా,ఫంగస్, పరాసైట్స్ , లాంటివి అదృశ్యంగా దాగి వుంటాయి . మన శరీరం లోకి ప్రవేశించడానికి తహ తహ లాడుతూ ఉంటాయి. సాధారణ జలుబు నుండి ఫ్లూ దాకా ఎన్నో వ్యాధులు గాలిలో తేలియాడే వైరస్లు మూలంగానే సోకుతాయి వీటి బారినుంచి. శరీరాన్ని రక్షించేది మన శరీరంలో ఉండే రోగ నిరోధక వ్యవస్థ ను పటిష్ట పరుచుకోవడంద్వారా శరీరాన్ని మనం రోగాల బారినుండి రక్షించుకున్న వాళ్ళ మౌతాము. మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకున్న వాళ్ళ మౌతాము.ఆరోగ్యం గురించి ఆలోచించ దల్చుకున్నాప్పుడు మొదట రోగ నిరోధక వ్యవస్థ మీద దృష్టి నిలపాల్సి ఉంటుంది. మతి మాటికి ఇన్ఫెక్షన్ కి గురి అవుతూ మీ శరీరం రోగాల బారిన పడుతుంటే మీ లోని రోగ నిరోధక వ్యవస్థ బలహీన పడిందని దానిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అర్ధం చేసుకోవాలి. శారీరక వ్యాయామం... రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేసుకోవాలంటే ఎక్సర్ సైజ్ లు చక్కగా ఉపక రిస్తాయి. శారీరక వ్యాయామం చేయడం మూలంగా మీలో రోగనిరోదక సామర్ధ్యం పెరగడమే కాకుండా శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. గుండె,ఊపిరి తిత్తుల కండరాలు బల పడతాయి. 1) వ్వయస్సు పెరుగుతున్న కొద్దీ సహజంగానే మనలో రోగాల్ని తట్టుకునే శక్తి పోతుంది.ఎక్సర్ సైజ్ లు తరిగిపోవాదాన్ని అడ్డుకుంటాయి. 2) అమెరికాలో జరిపిన ఒక పరిశీలనలో రెగ్యులర్ గా ఎక్సర్ సైజ్ లు చేస్తూ తగిన ఫిట్నెస్ సాధించిన వాళ్ళ లో 7౦ఏళ్ళు పై బడిన అమ్మమ్మ లలో రోగాల్ని నిలువరించే శక్తి వాళ్ళలో సగం వయస్సు ఉన్న స్త్రీల స్థాయిలో ఉన్నట్లుగా తెలిసింది. అలాగే ఏ పనిపాటా చేయని అదే వయస్సులో ఉన్న మిగతా ముసలి వాళ్ళ కంటే 55% ఎక్కువ స్థాయిలో ఉన్నట్లు ఉన్నట్లు సమాచారం. మరో విషయం ఏమిటి అంటే మంచి ఫిట్ నెస్ లో ఉన్న 7౦ ఏళ్ళు పై బడ్డ వృద్ధులు అంతా 6౦ ఏళ్ళు పై బడ్డాక ఎక్సర్ సైజ్ లు చేయడం మొదలు పెట్టారు. దానిని బట్టి అర్ధమయ్యింది ఏమిటి అంటే ఎక్సర్ సైజ్ ను ప్రారంభించడానికి వాటిద్వారా బెనిఫిట్ పొందడానికి ఒక వయస్సు అంటూ ఏమీ లేదు. ఏ వయస్సు నుంచి అయినా వయో వృద్ధులు సైతం ప్రారంభించ వచ్చు. ఏది చేసినా అతిగా వద్దు... కొంతం మంది క్రీడా కారులు ముఖ్యంగా పరుగు పందేలాలో పాల్గొనే వాళ్ళు ఎక్కువగా శ్వాస సంబంధమైన ఇన్ఫెక్షన్ కి గురి అవుతూ ఉండడం కనిపిస్తుంది. దీనికి కారణం వాళ్ళు అతిగా ట్రైనింగ్ లో పాల్గొనడం తప్ప మరొకటి కాదు. రోగ నిరోధక శక్తి వ్యవస్థను కుంగ దీసేది ఎక్సర్ సైజు లు కాదు. ఎక్సర్ సైజ్ లలో తీవ్రత అని గుర్తించాలి. ఎక్సర్ సైజ్ ల విషయం లో ఎప్పుడైనా మితాన్ని మితాన్ని పాటించడం మంచిది. అయితే మితం అంటే ఎంత ? వారం లో అయిదు రోజులు పాటు తడవకు 45 నిమిషాల చొప్పున చురుకుగా ఎక్సర్ సైజులు చేసే చేసే వాళ్ళను సరిపడా ఎక్సర్ సైజులు చేస్తున్న వారికింద తీసుకోవచ్చు. ఇలాంటి వారి యొక్క రక్తాన్ని ల్యాబ్ లో పరీక్షించి నప్పుడు అందులో ఇన్ఫెక్షన్ తో పోరాడే తెల్ల రక్త కణాలు ఉంటాయి. అవి చురుకుగా పనిచేస్తున్నట్లు వేల్లదియ్యింది. అమెరికాలో జరిగిన మరొక పరిశోదనలో అయిడ్స్ తాలూకు హెచ్ ఐ వి తో బాధ పడుతున్న వ్యక్తుల్ని పది వారాల పాటు సాధారణ ఎక్సర్ సైజ్ ప్రోగ్రాములలో పాల్గొనే టట్లుగా చేసినప్పుడు వాళ్ళ లో టి సెల్ కణాల సంఖ్య పెరిగి నట్లుగా వెల్లడి అయ్యింది. ( రోగ నిరోధక వ్యవస్థ లో ఈ టి సెల్ల్స్ చాలా ముఖ్యమైనవి. ఇవి శరీరంలో రోగాలతో పోరాడే గుణాన్ని క్రమబద్దీకరించడమే కాకుండా వైరల్ ఇన్ఫెక్షన్ ని పారద్రోలడానికి ఉపక రిస్తుంది. ఈ కణాల సాంఖ్య పడిపోవడం ఎయిడ్స్ వ్యాధి ప్రాధాన లక్ష్యం ) జలుబు ఫ్లూ ... జలుబూ-ఫ్లూ లాంటి అంటూ వ్యాధులు గాలి లోని వైరస్ ల ద్వారా సోకుతాయి. మనకు ఇతరుల నుంచి చాలా త్వరగా సోకుతాయి. చాలా త్వరగా సంక్రమించే అంటూ వ్యాధులు ఇవి. ఇవి చలికాలం లో ఎక్కువగా సోకుతూ ఉంటాయి. ఇందుకు కారణం చలికాలం లో మనం తలుపులు అన్నీ వేసుకుని అందరం లోపలే ఉండి పోవడమే. దీనికి కారణం అఫీస్ లోగాని ఇళ్ళలో గాని ఒకరి గాలిని మరొకళ్ళు పీల్చుకుంటూ వైరస్ వ్యాప్తికి తోడ్పడు తూ ఉంటాము. ఇలాంటి రోజుల్లో కిటికీ తలుపులు అన్నీ తెరచి వుంచుకోవాలి గాలి వస్తూ పోతూ ఉంటె జలుబుఅంటుకోదని నిపుణులు సూచిస్తున్నారు. తెల్ల రక్త కణాలు... రోగ నిరోధక శక్తి యొక్క ప్రాధాన ఆయుదం . రక్తంలో ఉండే లెఉకాక్ సైక్లేస్ అనబడే తెల్ల రక్త కణాలు ఇవి శరీరంలోకి ప్రవేశించిన శత్రువును అంటే వైరస్ ,బాక్టీరియా కావచ్చు ,ఫంగి పరాసైట్ ఏదైనా కావచ్చు నిర్మూలించే ప్రయాత్నం చేస్తాయి. కొన్ని తెల్ల రక్త కణాలు శత్రువును చుట్టూ ముట్టి నాశనం చేయడానికి ప్రయత్నిస్తే మరికొన్ని ప్రత్యేకమైన యాంటీ బాడీస్ ని తయారుచేసి వాటి ద్వారా నాశనం చేయడానికి ప్రయత్నిస్తాయి.ఈ ప్రక్రియ గురించి ప్రారంభ లో చదివే ఉంటారు. లెఉకొసైట్స్ రక్త ప్రవాహం తో పాటు మన శరీర మంతా కలయ తిరుగుతూ సూక్ష్మాతి సూక్ష్మ మైన రక్త నాళాల ద్వారా శరీర కణాల లోకి ప్రవహించి. శత్రు నిర్మూలన కోసం గస్తీ తిరుగుతాయి. అవసరం లేనప్పుడు లింఫ్ గ్రంధులతో కనెక్ట్ అయి వుంటే లింఫ్ నాళా లలోకి చేరుకుంటాయి. మెడ మొల చంక వద్ద ఉండే ఈ లింఫ్ గ్రంధులు ఇన్ఫెక్షన్ కు గురి అయినప్పుడు ఉబ్బి గావడ బిళ్ళలు గజ్జల్లో బిళ్ళ కింద కనిపిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుకునే మార్గాలు... * వారానికి మూడు రోజులు 2౦ నిమిషాల పాటు ఎక్సర్ సైజ్ లు చేయాలి. స్ట్రెచ్ చేయడం. శరీరాన్ని బల పరిచే మిగత ఎక్సర్ సైజ్ లను కూడా మరకూడదు. *ఎప్పుడూ మంచి మూడ్ లో ఉల్లాసంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. *రిలాక్సేషన్ టెక్నిక్ నేర్చుకోవాలి. *ఎదో ఒక హాబీ ని అలవరచుకుని తరచుగా అందులో నిమగ్నం కావాలి. *ప్రతి ఆరు వా రాలకి ఒక సారి కొద్ది రోజుల పాటు సెలవు తీసుకుని హాలిడే కింద ఎక్కడైనా సరదాగా గడపాలని సూచించారు. *వారంలో ఒక రాత్రి అయినా త్వరగా పడుకోవాలి. బాగా అలిసిపోయి నప్పుడు ఇన్ఫెక్షన్ మనల్ని కమ్ము కుంటాయి. ఒత్తిళ్లలో ఉన్నప్పుడు ఎక్కువసేపు మేలుకుని ఉండడం వల్ల ఇలా జరుగుతుంది. అందుకే అప్పుడప్పుడూ పడక మీద ఎక్కువసేపు రెస్ట్ తీసుకోవడం మంచిది. *జ్వరం జలుబు ఫ్లూ లాంటివి వచ్చినప్పుడు తగ్గి తగ్గ గానే పనుల్లో పాల్గొన కూడదు అలా చేయడం వల్ల డిప్రెషన్ కొన్నాళ్ళ పాటు అలసట మిమ్మల్ని వేదిస్తాయి. దీనికారణంగా మళ్ళీ మీరు ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం ఉంది. *పొగ త్రాగ కూడదు. పొగ తాగే వాళ్ళలో న్యుమోనియా,ఫ్లూ లాంటి వ్యాధులూ,దగ్గు, జలుబు, లాంటి వ్యాధులూ శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్ లూ అంటుకునే అవకాసం ఉంది. పొగ తాగే అల వాటు ఉన్న వాళ్ళు మిగిలిన వారికంటే సి విటమిన్ కొంచం అంటే 4౦ % ఎక్కువే తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అనారోగ్యం పై మూడ్స్ ప్రభావం... సున్నితమైన స్వభావాలు అంటే వోత్తిళ్ళకు తేలికగా లొంగి పోయే వాళ్ళ ను జలుబు జ్వరాలు ఎప్పుడు పడితే అప్పుడు తేలికగా పీడిస్తూ ఉండడాన్ని మనం గమనిస్తూనే ఉంటాము. *రోగ నిరోధక వ్యవస్థ మీద మన మూడ్స్ ప్రభావం కూడా చెప్పుకోదగ్గ రీతిలోనే వుంటుంది. ఎప్పుడూ కోపంతో చిరాకుతో వుండే వాళ్ళు తనకు తాను ప్రాముఖ్యతను ఫీలయ్యే వ్యక్తులు మాటి మాటికీ జ్వరం జలుబూ బారిన పడుతున్న వాళ్ళు టేక్షన్ ని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా జ్వరం బారిన పడతారు. ఎప్పుడూ ఉల్లాసంగా ఉండే వాళ్ళు పోజిటివ్ గా ఉండే వాళ్ళు ప్రతి విషయాన్ని తేలికగా తీసుకునే వాళ్ళు చీదతమనేది ఎరగకుండా ఆరోగ్యంగా ఉంటారు. అదే విధంగా డిప్రెషన్ తో వుండే వాళ్ళు గుండె జబ్బులకు లోనవుతున్నారు. ఎమోషన్స్ ను అణు చుకుంటూ పైకి ప్రశాంత చిత్తం తో కనపడడానికి చూసే వాళ్ళు క్యాన్సర్ బారిన పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉనాయని తేల్చారు. పోషక ఆహారం... రోగాలు రాకుండా ఉండడానికి అంటే రోగనిరోదక వ్యవస్థ పటిష్ట పడడానికి అన్నిటిలోకి శక్తి వంతమైనది సరైన పోషకాహారాన్ని తీసుకోవాలి.సరైన ఆహారాన్ని తీసుకోక పోవడం వల్ల రకరకాల జబ్బులు మన శరీరాన్ని లోన్గాదీసుకుంటాయి.గుండె జబ్బులు, పక్ష వాతం బ్రెస్ట్ క్యాన్సర్, పేగుల క్యాన్సర్, దంత క్షయం, డయాబెటిస్, మల బద్ధకం ఒస్టియో ప్రోరోసిస్, మొదలైన వన్నీ అయితే పోషక ఆహారాన్ని తీసుకోవడం వల్ల నిజంగా రోగ నిరోధక వ్యవస్థ బల పడుతుందా.పోషకాహార లోపం వల్ల రోగనిరోదక వ్యవస్థ బలహీన పడుతున్నది అన్నది మాత్రం ఖచ్చితంగా నిజం. హేతుబడ్డ మైన రీతిలో ప్రోటీన్లు తీసుకోవడం అవసరమే గాని దానికి విటమిన్లు, మినరల్స్, కలిపినంత మాత్రాన రోగనిరోదక శక్తి పెరుగుతుందని అనుకోవడం మాత్రం సందేహాస్పదం. అంటున్నారు ఆక్స్ఫర్డ్ లోని జాన్ రాడ్క్లిఫ్ హాస్పిటల్కు చెందిన కన్సల్టెంట్ ఇమ్యునలజిస్ట్ డాక్టర్ గ్రహం బర్డ్. అయితే గుండె జబ్బులు క్యాన్సర్ నుంచి కాపాడుకోవడానికి యాంటి ఆక్సిడెంట్ విటమిన్లు సి ఇ బీటా కేరొటీన్ తీసుకోవడం చాలా ముఖ్యం అని అందరూ ఒపుకుంటారు. బలమైన రోగ నిరోధక వ్యవస్త కు కొన్ని ఖనిజ లవణాలు కూడా అవసరమే.
read moreవేసవికాలం డయాబెటిస్ రోగులకు ప్రమాదమా?
వేసవికాలం వచ్చిందంటే మండే ఎండల వల్ల అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్దులు అసౌకర్యానికి గురవుతారు. అయితే వీరు మాత్రమే కాదు.. ఎండల ధాటికి డయాబెటిక్ రోగులకు కూడా చాలా ప్రమాదం పొంచి ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అసలు వేసవికాలంలో డయాబెటిస్ రోగులకు ఉండే ముప్పేంటి? డయాబెటిస్ రోగులు తీసుకోవల్సిన జాగ్రత్తలేంటి? తెలుసుకుంటే.. వేసవి కాలం డయాబెటిస్ రోగులపైన ప్రభావం చూపిస్తుంది. అధిక వేడి డయాబెటిక్ రోగులకు కష్టంగా ఉంటుంది. తరచుగా మూత్రవిసర్జన చేయాల్సి రావడం వల్ల శరీరంలో తేమను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడంలో ఇబ్బంది పడతారు. అందుకే ఈ వేసవిలో శరీర ఉష్ణోగ్రత, చక్కెర స్థాయిలను సమతుల్యంగా ఉంచుకోవడానికి కింది టిప్స్ పాటించాలి. పుష్కలంగా నీరు త్రాగాలి.. వేసవి కాలంలో నీరు బెస్ట్ ఫ్రెండ్. రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు త్రాగాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. అధిక ఉష్ణోగ్రతలు లేదా శారీరక శ్రమ కారణంగా ఎక్కువగా చెమటలు పడుతుంటే నీరు తీసుకోవడం పెంచాలి. హైడ్రేటింగ్ ఆహారాలు.. ఆహారంలో దోసకాయ, పుచ్చకాయ, నారింజ, టమోటా వంటి నీరు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను చేర్చాలి. ఈ ఆహారాలు హైడ్రేట్‌గా ఉంచడమే కాకుండా అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి. కెఫీన్ ఆహారాలు వద్దు.. కెఫిన్ కలిగిన కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్స్, శీతల పానీయాలకు దూరంగా ఉండాలి. ఇవి రక్తంలో చక్కెరపై చెడు ప్రభావాన్ని చూపి శరీరం డీహైడ్రేట్ అయ్యే ప్రమాదాన్ని పెంచుతుంది. కాటన్ దుస్తులు.. కాటన్ దుస్తులను ధరించాలి. తద్వారా శరీరం చల్లగా ఉంటుంది. చెడు శరీర ఉష్ణోగ్రత చక్కెర స్థాయిని పాడు చేస్తుంది. సన్‌బర్న్‌ను నివారించడానికి సన్‌స్క్రీన్ ఉపయోగించండి. షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి.. రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ ఉండాలి. వైద్యుల సలహా ప్రకారం మెడిసిన్ లేదా ఇన్సులిన్ మోతాదును తీసుకోవాలి. *రూపశ్రీ.
read moreబెండకాయలతో బోలెడంత ఆరోగ్యం..
చిన్నపిల్లలు బెండకాయలు తినమని మారాం చేస్తే చాలా మంది తల్లులు మాయ చేస్తారు. బెండకాయలు తింటే లెక్కలు బాగా వస్తాయని, తెలివితేటలు పెరుగుతాయని చెప్పి ఏదో ఒక విధంగా తినిపిస్తారు. నిజానికి బెండకాయలో ఉండే జిగురు మెదడు ఆరోగ్యానికి మంచిది. ఇక బెండకాయలు తింటే లెక్కలు బాగా రావడం, బుద్దిగా చదువుకోవడం అనే మాట అటుంచితే బోలెడు లాభాలు మాత్రం చేకూరుస్తాయి. క్రమం తప్పకుండా బెండకాయలు తింటూ ఉంటే కింది ఆరోగ్య ఫలితాలుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బెండకాయలు ఎముకలు బలంగా ఉండటంలో సహాయపడతాయి. వీటిలో విటమిన్-కె ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. బోలు ఎముకల వ్యాధి, ఎముకల బలహీనత వంటి సమస్యలు ఆమడ దూరంలో ఉంటాయి. బరువు తగ్గాలని అనుకునేవారికి బెండకాయలు ది బెస్ట్. ఎందుకంటే వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో కూడా రెండు రకాల ఫైబర్ లు ఉంటాయి. ఒకటి కరిగే ఫైబర్, రెండోది కరగని ఫైబర్. కరిగే ఫైబర్ జీర్ణాశయంలో జెల్ లాంటి పదార్థం ఏర్పరుస్తుంది. అది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. తద్వారా ఆహారం నుండి చక్కెరలు కూడా నెమ్మదిగా విడుదల అవుతాయి. ఈ ప్రాసెస్ లో కేలరీలు బర్న్ అవుతాయి. దీంతో బరువు పెరగరు. ఇక కరగని ఫైబర్ వల్ల మలబద్దకం సమస్య దూరం అవుతుంది. బెండకాయల్లో ఫోలెట్ సమృద్దిగా ఉంటాయి. ఈ కారణంగా ఇవి గర్భిణిలకు చాలా మంచివి. మహిళలో ఎక్కువగా ఎదురయ్యే ఎముక సంబంధ సమస్యలను ఇవి దూరం చేస్తాయి. మధుమేహం ఉన్నవాళ్లకు బెండకాయ బెస్ట్ ఫుడ్. వీటిలో ఉండే పీచు పదార్థం చక్కెరలు నెమ్మదిగా విడుదల అయ్యేలా చేస్తుంది. ఈ కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ లో ఉంటాయి. బెండకాయలలో ఉండే పైబర్, పోషకాలు కొలెస్ట్రాల్ ను నియంత్రణలో ఉంచుతాయి. క్రమం తప్పకుండా బెండకాయ తింటే కొలెస్ట్రాల్ లెవల్స్ ఊహించని విధంగా తగ్గుతాయి. దీని వల్ల గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. కంటి ఆరోగ్యానికి విటమిన్-ఎ చాలా అవసరం. ఈ విటమిన్-ఎ బెండకాయల్లో పుష్కలంగా ఉంటుంది. అందుకే బెండకాయలు రెగ్యులర్ గా తింటే కంటి చూపు మెరుగవుతుంది. పిల్లలకు ఇది చాలా మంచిది. బెండకాయలలో ఉండే పీచు పదార్థం జీర్ణ సమస్యలను అన్నింటిని దూరం చేస్తుంది. బెండకాయలలో విటమిన్-సి కూడా ఉంటుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఈ కారణంగా జబ్బులను ఎదుర్కోనే శక్తి శరీరానికి లభిస్తుంది. అన్నింటి కంటే ముఖ్యంగా బెండకాయలు తరచుగా తినేవారు యవ్వనంగా ఉంటారు.దీనికి కారణం బెండకాయలలో కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. శరీరానికి కొల్లాజెన్ బాగా అందుతుంటే చర్మం యవ్వనంగా ఉంటుంది. జుట్టు బాగా పెరుగుతుంది. *నిశ్శబ్ద.
read moreరోజంతా చురుగ్గా.. శక్తివంతంగా ఉండాలంటే.. ఈ ఆహారాలు బెస్ట్!
రోజంతా పాజిటివ్‌గా, యాక్టివ్‌గా ఉండటానికి మంచి ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆహారంలో పోషకాలను జాగ్రత్తగా చూసుకునే వ్యక్తులు శారీరక శక్తి పరంగా ఎప్పుడూ మెరుగ్గా ఉంటారు. అదే సమయంలో జంక్, ఫాస్ట్‌ఫుడ్‌తో రోజు ప్రారంభించే వారి శరీరం క్రమంగా వ్యాధులకు నిలయంగా మారుతుంది. ఊబకాయం, మధుమేహం, కొలెస్ట్రాల్, థైరాయిడ్ వంటి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. అందువల్ల ఆహారపు అలవాట్లను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కొన్ని ఆహారాలు తీసుకుంటే రోజంతా చురుగ్గా, ఎనర్జీగా ఉండవచ్చు. అలాంటి ఆహారాల గురించి తెలుసుకుంటే.. ఎనర్జిటిక్ ఫుడ్ విషయానికి వస్తే అందులో మొదటి పేరు అరటిపండు. అరటిపండు తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. అటిపండ్లను అల్పాహారంలో తీసుకోవచ్చు. చియా విత్తనాలు శరీరాన్ని శక్తివంతంగా ఉంచడంలో సహాయపడతాయి. ఈ విత్తనాలను వేయించి వాటిని స్నాక్స్‌గా తీసుకోవచ్చు. ప్రొటీన్, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, పీచు వంటి పోషకాలు చియా గింజల్లో లభిస్తాయి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా తగిన మోతాదులో ఉంటాయి. అల్పాహారంగా ఓట్స్ తినవచ్చు. ఇందులో ఉండే క్యాల్షియం, ఫైబర్, ప్రొటీన్ వంటి పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోజూ ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదని వినే ఉంటారు. అందుకే రోజూ అల్పాహారంలో యాపిల్ ను కూడా చేర్చవచ్చు. పీనట్ బటర్ ఈ మధ్యకాలంలో బాగా ఆదరణ పొందుతోంది. పీనట్ బటర్ తీసుకుంటే శరీరం ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులను పొందుతుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కండరాలు బలపడతాయి. ఇది ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న ఫీల్ కూడా ఇస్తుంది. *నిశ్శబ్ద.
read moreవేసవిలో ఏ డ్రింక్ బెస్ట్? నిమ్మకాయ లేక కొబ్బరి నీరా?
వేసవికాలం వచ్చిందంటే ఆరోగ్య పరంగా మామూలు కంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎండ వేడిమి కారణంగా, పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా శరీరంలో ఉష్ణోగ్రత విషయంలో కూడా మార్పులు వస్తాయి. శరీరంలో తేమ శాతం చాలా వేగంగా తగ్గిపోతుంది. మరీ ముఖ్యంగా ఏదైనా పనుల మీద బయటకు వెళ్లి వచ్చేవారికి ఈ సమస్య మరింత అధికంగా ఉంటుంది. దీనికారణంగా శరీరం డీహేడ్రేట్ కు లోనవుతుంది. తిరిగి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడానికి వివిధ రకాల పానీయాలు, మంచినీరు తాగుతుంటారు. ఇలా తీసుకునే వాటిలో కొబ్బరినీరు, నిమ్మకాయ నీరు ముఖ్యమైనవి. అయితే ఈ రెండింటిలో ఏది శరీరాన్ని ఎక్కువ హైడ్రేట్ గా ఉంచుతుంది? అసలు శరీరం డీహైట్రేషన్ కు ఎందుకు లోనవుతుంది? వివరంగా తెలుసుకుంటే.. శరీరం ఎందుకు డీహైడ్రేట్ అవుతుంది? వేడి వాతావరణంలో తీసుకునే ద్రవ పదార్థాల కంటే శరీరం కోల్పోయే ద్రవాలు ఎక్కువ ఉన్నప్పుడు శరీరంలో నీటి శాతం లోపిస్తుంది. ఇది డీహైడ్రేషన్ గా పిలవబడుతుంది. దీని వల్ల నీరు పొడిబారడం, అలసట, మైకం, హీట్ స్ట్రోక్ వంటి సమస్యలు ఎదురవుతాయి. నిమ్మరసం నీరు.. నిమ్మకాయ నీరు ఈ మధ్య కాలంలో చాలా విరివిగా తాగుతున్నారు. తరచుగా ఆరోగ్యం మీద స్పృహ ఉన్నవారు, బరువు తగ్గడానికి ట్రై చేస్తున్నవారు నిమ్మకాయ నీరు బాగా తాగుతారు. దానికి తగినట్టే ఇది గొప్ప ఫలితాలు ఇస్తుంది కూడా. నిమ్మకాయ నీటిలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర ప్రయోజనకరమైన పోషకాలతో పాటు ఘాటైన రుచిని ఇస్తుంది. నిమ్మరసం ప్రధాన ప్రయోజనాల్లో హైడ్రేట్ గా ఉంచడం మొదటిది. ఆర్ద్రీకరణకు నీరు చాలా అవసరం. కానీ నిమ్మకాయను జోడించడం వల్ల దాని ప్రయోజనాలను మెరుగుపరుస్తుంది. నిమ్మకాయలో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. ఇవి శరీరం కోల్పోయిన ద్రవాలను తిరిగి నింపడంలో సహాయపడతాయి. ఈ ఎలక్ట్రోలైట్‌లు శరీరం ద్రవ సమతుల్యతను కాపాడుకోవడంలో, శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కొబ్బరి నీరు.. కొబ్బరి నీరు ఉష్ణమండల ప్రాంతాలలో శతాబ్దాలుగా వినియోగించబడుతున్న సహజ పానీయం. కొబ్బరినీటిలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, సోడియం వంటి అవసరమైన పోషకాలు ఉంటాయి. ఇందులో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. కొద్దిగా తీపి రుచిని కలిగి ఉంటుంది. కొబ్బరి నీటిని హైడ్రేటింగ్ డ్రింక్‌గా పరిగణించడానికి ప్రధాన కారణాలలో ముఖ్యమైనది ఏంటంటే.. ఇందులో అధిక స్థాయిలో ఎలక్ట్రోలైట్‌లు ఉంటాయి. ఇది మానవ రక్తంతో సమానమైన ఎలక్ట్రోలైట్ కూర్పును కలిగి ఉన్నట్లు కనుగొనబడింది. ఇది తీవ్రమైన శారీరక శ్రమ లేదా చెమట తర్వాత శరీరాన్ని రీహైడ్రేట్ చేయడానికి సమర్థవంతమైన పానీయం. అంతేకాకుండా కొబ్బరి నీటిలో పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరం ద్రవ సమతుల్యతను కాపాడుకోవడానికి అవసరమైన ఖనిజం. శరీరంలోని నీటి స్థాయిలను నియంత్రించడంలో, డీహైడ్రేషన్‌ను నివారించడంలో సహాయపడుతుంది. ఏది బెస్టంటే.. నిమ్మకాయ నీరు, కొబ్బరి నీరు రెండూ వేసవి నెలల్లో హైడ్రేట్‌గా ఉంచడంలో సమానంగా ప్రభావవంతంగా ఉంటాయి. నిమ్మ నీటిలో కోల్పోయిన ద్రవాలను తిరిగి నింపడంలో సహాయపడే ఎలక్ట్రోలైట్‌లు ఉండగా, కొబ్బరి నీరు మానవ రక్తంతో సమానమైన ఎలక్ట్రోలైట్ కూర్పును కలిగి ఉంటుంది. ఇది సహజ హైడ్రేటర్‌గా మారుతుంది. తక్కువ కేలరీలు కావాలని చూస్తున్నట్లయితే.. కొబ్బరి నీళ్లతో పోలిస్తే నిమ్మరసం తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. అయితే.. తీవ్రమైన శారీరక శ్రమ లేదా చెమట పట్టిన తర్వాత త్వరితగతిన శరీరం హైడ్రేట్ కావాలని చూస్తున్నట్లయితే అధిక ఎలక్ట్రోలైట్ కంటెంట్ కారణంగా కొబ్బరి నీరు మంచి ఎంపిక. *నిశ్శబ్ద.
read moreపచ్చిమిర్చి జ్యూస్ తాగితే జరిగే మ్యాజిక్ ఇదే..
షడ్రుచులలో కారానికి కూడా ప్రాధాన్యత ఉంది. అకార, ఉకార, మకారాలు కలిస్తే ఓంకారం అయినట్టు. ఉఫ్ ఉఫ్ మని ఉకారంతో నోరు ఊదుకుంటే అది కారం అవుతుంది. కారానికి కేరాఫ్ అడ్రస్ గా పచ్చిమిర్చి నిలుస్తుంది. పచ్చిమిర్చి ప్రపంచదేశాలలో కారం కోసం ఉపయోగించే కూరగాయ. అయితే ఇది భారతదేశంలో చాలా విస్తారంగా వాడబడుతుంది. పచ్చిమిర్చిని కూరల్లో, స్నాక్స్ లో విరివిగా ఉపయోగిస్తారు. అయితే పచ్చిమిరపకాయతో జ్యూస్ చేస్తారని, ఈ జ్యూస్ ను తాగడం వల్ల ఆరోగ్యానికి పెద్ద మ్యాజిక్కే జరుగుతుందని అంటున్నారు. ఇంతకీ ఈ మిరపకాయ జ్యూస్ కథేంటో తెలుసుకుంటే.. పచ్చిమిర్చి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఆహారం రుచిని పెంచడమే కాకుండా, ఇందులో ఉండే విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు మొదలైన వాటి వల్ల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. పచ్చిమిర్చిని మధ్యగా కట్ చేసి, కాసింత పంచదార, పుదీన, నిమ్మరసంతో కలిపి బాగా షేక్ చేసి జ్యూస్ తయారుచేసుకోవాలి. దీన్ని తీసుకుంటే బోలెడు ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయి. పచ్చిమిర్చిలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఈ జ్యూస్ లో నిమ్మరసం, పుదీనా కూడా వాడటం వల్ల ఇమ్యూనిటీ మరింత ఎక్కువగా ఉంటుంది. దీన్ని రోజులో సాయంత్రం సమయంలో టీ కాఫీ లాంటి పానీయాల స్థానంలో తీసుకుని శరీరానికి ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. పచ్చిమిర్చి చేర్చిన ఈ జ్యూస్ తీసుకుంటే బరువు తగ్గడం కూడా సులువు. ఇందులో క్యాప్సైసిన్ అనే రసాయం ఉంటుంది. ఇది జీవక్రియను పెంచుతుంది, బరువును అదుపులో ఉంచుతుంది. పచ్చి మిర్చిలో పొటాషియం, విటమిన్ ఎ మరియు కాల్షియం ఉంటాయి, ఇవి రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అలాగే నరాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. పచ్చిమిరపకాయల్లో మంచి మొత్తంలో పొటాషియం, ఫైబర ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. అందుకే అప్పుడప్పుడైనా ఈ పచ్చిమిర్చి జ్యూస్ ను తాగుతూ ఉండటం రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. *నిశ్శబ్ద.
read moreఎండ వేడి కారణంగా కాళ్లలో ఎదురయ్యే తిమ్మిర్లను తగ్గించడానికి టిప్స్!
ఉష్ణోగ్రత తగ్గుదల కారణంగా చాలా మంది శీతాకాలం లేదా రుతుపవన కాలంలో కాళ్ల తిమ్మిరి సమస్య గురించి కంప్లైంట్ చేస్తుంటారు. కానీ చలికాలంతో పోలిస్తే వేసవిలో కాళ్ల నొప్పులు తీవ్రమవుతాయని తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. మరీ ముఖ్యంగా ఈ కాలానుగుణ తిమ్మిర్లు ఎక్కువగా అథ్లెట్లు, గర్భిణీ స్త్రీలు, పిల్లలు, వృద్ధులపై ప్రభావం చూపుతాయి.వైద్యుల అభిప్రాయం ప్రకారం వేడిని బహిర్గతం చేయడం వల్ల కండరాల తిమ్మిరి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటిని నిర్లక్ష్యం చేయడం అస్సలు మంచిది కాదు.. అసలు పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా తిమ్మిర్లు ఎందుకు వస్తాయి. వీటిని ఎలా తగ్గించుకోవచ్చంటే.. వేసవి కాలంలో చాలావరకు పిల్లలకు సెలవులు ఉంటాయి. ఈ కారణంగా పెద్దలు కూడా అడపాదడపా సాధారణ రోజుల్లో కంటే వేసవిలో ఎక్కువ యాక్టీవ్ గా ఉంటారు. పిల్లలు పెద్దలు కలిసి ఫిజికల్ యాక్టీవ్ విషయంలో చురుగ్గా ఉంటారు. వ్యాయామాలు, జిమ్ తో పాటూ ఇతర యాక్టివిటీస్ కారణంగా కండరాల తిమ్మిరి వస్తుంది. విపరీతంగా చెమటలు పట్టడం, శరీరం నుండి ద్రవాలు బయటకు వేగంగా పోవడం వల్ల శరీరం తొందరగా డీహైడ్రేట్ అవుతుంది. కాళ్ల తిమ్మిర్లు తగ్గించుకోవడానికి మార్గాలు.. వేడి గాయాల గురించి అవగాహన పెంచుకోవాలి. దీని వల్ల వేడి గాయాలు అయినప్పుడు వెంటనే చికిత్స చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా చేస్తే కాళ్ల తిమ్మిర్లు వచ్చే అవకాశాలు తక్కువ. కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి రోజువారీ సప్లిమెంట్లను తీసుకోవడం.. రోజుకు కనీసం 10-12 గ్లాసుల నీరు త్రాగడం వంటి ఇతర ముందు జాగ్రత్త చర్యలు పాటించాలి. తగినంత ద్రవాలు లేనప్పుడు లేదా పొటాషియం లేదా కాల్షియం వంటి తక్కువ స్థాయి ఖనిజాలు లేనప్పుడు ఎక్కువ పని చేయడం వల్ల కూడా కండరాల తిమ్మిర్లు వస్తాయి. వ్యాయామం చేయడానికి ప్రయత్నించాలి. విశ్రాంతి తీసుకోవాలి. కండరాలను సున్నితంగా సాగదీయదీయడం, సున్నితంగా మసాజ్ చేయడం చేయవచ్చు. తిమ్మిరి తర్వాత తీవ్రమైన కాలు నొప్పి ఉంటే వ్యాయామం చేయకూడదు. కాళ్లలో తిమ్మిరి ఉండే ఆ ప్రాంతంలో హీటింగ్ ప్యాడ్‌ని ఎంచుకోవాలి. నిద్రపోతున్నప్పుడు అర్ధరాత్రి కాలు తిమ్మిరిని సమస్య వస్తే నిలబడి కండరాలను సాగదీయడం, మడమను నేలపై ఉంచి కాస్త నడవడం. కాలుపై బరువు పెట్టడం వంటి చర్యల ద్వారా తిమ్మిరిని వదిలించుకోవచ్చు. *నిశ్శబ్ద.
read moreలీచీ ఫ్రూట్ ఎప్పుడైనా తిన్నారా? దీంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటంటే!
లీచీ ఆగ్నేయాసియాకు చెందిన ఉష్ణమండల పండు. ప్రత్యేకించి చైనాలో ఎక్కువగా కనిపిస్తుంది. రుచిలోనూ, వాసనలోనూ ఇది చాలా ఆకట్టుకుంటుంది. వెచ్చని, తేమతో కూడిన వాతావరణంలో వీటిని సాగు చేస్తారు. లీచీ ఫ్రూట్స్ భారతదేశం, థాయిలాండ్, వియత్నాం, ఫిలిప్పీన్స్ వంటి ప్రాంతాలలో సాగవుతున్నాయి. పెద్ద చెట్లపై గుత్తులుగా ఈ పండ్లు పెరుగుతాయి. వేసవి నెలల్లో ఈ పండ్లు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. లీచీ ఫ్రూట్స్ ను తినడం వల్ల ఆరోగ్య పరంగా కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుంటే.. రోగనిరోధక వ్యవస్థ.. లీచీలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. విటమిన్ సి తెల్ల రక్త కణాల ఉత్పత్తిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇవి శరీరాన్ని అంటువ్యాధులు, అనారోగ్యాల నుండి రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. లీచీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల సాధారణ జలుబు, ఫ్లూ, ఇతర అనారోగ్యాలను దూరం చేయవచ్చు. రోజంతా ఉత్సాహంగా, చురుగ్గా ఉండవచ్చు. యాంటీఆక్సిడెంట్లు.. లీచీలో ఫ్లేవనాయిడ్లు, ఫినాలిక్ సమ్మేళనాలు, విటమిన్ సి వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవటానికి, శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తటస్తం చేయడంలో సహాయపడతాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బులు, క్యాన్సర్, న్యూరోడెజెనరేటివ్ డిజార్డర్‌లతో సహా దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాదు చర్మం యవ్వనంగా ఉండటంలో కూడా సహాయపడతాయి. గుండె ఆరోగ్యం.. లీచీలో ఉండే అధిక స్థాయి పొటాషియం, డైటరీ ఫైబర్ గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. పొటాషియం సోడియం ప్రభావాలను ఎదుర్కోవడం ద్వారా రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. తద్వారా రక్తపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఫైబర్ కంటెంట్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన గుండెను ప్రోత్సహిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జీర్ణ ఆరోగ్యం.. లీచీలో ఉండే సమ్మేళనాలు జీర్ణక్రియకు సహాయపడతాయి. జీర్ణాంతర ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. ఇందులో ఫైబర్ మలబద్దకాన్ని నివారిస్తుంది. గట్ బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది. చర్మం.. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వల్ల లీచీ చర్మాన్ని కాంతివంతంగా, యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది. కొల్లాజెన్ ఉత్పత్తికి విటమిన్ సి చాలా అవసరం. ఇది చర్మ స్థితిస్థాపకతను నిర్వహించడానికి, అకాల వృద్ధాప్యాన్ని నివారించడానికి సహాయపడుతుంది. లీచీలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్ డ్యామేజ్‌తో పోరాడుతాయి. ముడతలు, గీతలు, వృద్ధాప్య మచ్చలను తగ్గిస్తాయి. ఆరోగ్యకరమైన, మెరిసే చర్మాన్ని, రంగును అందిస్తాయి. *నిశ్శబ్ద.
read moreచెప్పుల్లేకుండా పచ్చగడ్డి మీద నడిస్తే ఎన్ని బెనిఫిట్సో తెలుసా?
వాకింగ్ సాధారణంగా ఆరోగ్యం కోసం చాలామంది చేసే సింపుల్ వ్యాయామం. దీనికి ఎలాంటి ప్రత్యేక పరికరాలు అక్కర్లేదు. అయితే మరిన్ని అదనపు ప్రయోజనాలు కావాలంటే ఈ వాకింగ్ లో కూడా విభిన్న మార్గాలు అనుసరించాలి. అలాంటి వాటిలో గ్రొండింగ్ లేదా ఎర్తింగ్ కూడా ఒకటి. చెప్పులు లేకుండా ఒట్టి పదాలతో పచ్చగడ్డి మీద నడవడమే గ్రౌండింగ్. దీని వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుంటే.. కనెక్షన్.. చెప్పులు లేకుండా పచ్చగడ్డి మీద ఒట్టి పాదాలతో నడవడం వల్ల మనసుకు, శరీరానికి మధ్య కనెక్షన్ పెరుగుతుంది. మరీ ముఖ్యంగా భూమి నుండి ఎలక్ట్రాన్ లు శరీరానికి బదిలీ అవుతాయి.ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. శరీరంలో సహజంగా ఉండే విద్యుత్ శక్తి బ్యాలెన్స్ గా ఉండటంలో తోడ్పడుతుంది. స్ట్రెస్ తగ్గుతుంది.. పచ్చని గడ్డిపై చెప్పులు లేకుండా నడవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మనసు మీద శరీరం మీద భారం తగ్గినట్టు అనిపిస్తుంది. ఇది మానసిక స్థితిని బ్యాలెన్స్ గా ఉంచుతుంది. శక్తి ప్రవాహం.. మనిషి శరీరంలో ఉండే చాలా నరాలు పాదాల దగ్గర ముగుస్తాయి. అంటే శరీరంలో నరాలకు ముగింపు పాదాల భాగం. చెప్పులు లేకుండా ఒట్టి పాదాలతో నడిస్తే పాదాలలో ఉండే నరాల పిఫ్లెక్స్ పాయింట్లు యాక్టీవ్ అవుతాయి. ఇవి శరీరం అంతా మెరుగైన రక్తప్రసరణ, ఆక్సిజన్ సప్లై, శక్తి ప్రవాహానికి సహాయపడతాయి. భూమితో కనెక్షన్.. ఇప్పట్లో ఇంట్లో ఉంటున్నా కాళ్లకు చెప్పులు వేసుకుంటున్నారు చాలామంది. దీనివల్ల భూమికి, మనిషికి మధ్య కనెక్షన్ తగ్గిపోతోంది. కానీ చెప్పులు లేకుండా పచ్చగడ్డి మీద నడవడం వల్ల మళ్లీ భూమితో శరీరానికి అద్భుతమైన కనెక్షన్ ఏర్పడుతుంది. భూమి గురుత్వాకర్షణ బలం శరీరానికి అంది శరీరం దృఢంగా మారుతుంది. రోగనిరోధక శక్తి.. మట్టిలో సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవి శరీరానికి ఆరోగ్యాన్ని చేకూర్చేవి కూడా ఉంటాయి. పచ్చగడ్డి మీద నడవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. అనారోగ్యాలు ఎదురైతే వాటిని తట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది. ప్రకృతిలో ఆరుబయట నడవడం వల్ల మానసిక, శారీరక స్థితి మెరుగవుతుంది. *నిశ్శబ్ద.
read moreమామిడి కాయల గురించి మీకు తెలియని నిజాలివే!
పండ్లలో రారాజు మామిడి పండు. వేసవి వస్తోందంటే పిల్లా పెద్దలు ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు మామిడి పండ్ల కోసం.. ఇప్పుడు మార్కెట్లో మామిడి పండ్ల హడావిడి సాగుతోంది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం మామిడి పండ్ల సొంతం. పచ్చిగా ఉన్న మామిడి కాయలను పచ్చళ్ళు, పప్పు, కూరలు వండుతారు, పండిన వాటితో పానీయాలు, స్మూతీలు, షేక్ లు చేస్తుంటారు. ఎక్కువ మంది పండిన మామిడి కాయలు తినడానికి ఇష్టం చూపుతారు. కానీ పండిన మామిడి కంటే పచ్చి కాయను తినడమే మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అసలింతకూ ఈ రెండింటి వల్ల కలిగే ప్రయోజనాలేంటి?? రెండింటిలో ఏది బెస్టు.. ఆరోగ్యానికి ఏది మంచిది?? వివరంగా తెలుసుకుంటే.. పండిన మామిడి.. పండిన మామిడిలో విటమిన్ సి, ఎ పుష్కలంగా ఉంటాయి. పొటాషియం, మెగ్నీషియం, కాపర్, ఫోలేట్, విటమిన్ ఇ, బి మొదలైనవి కూడా సమృద్ధిగా ఉంటాయి. పండిన మామిడిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇందులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. మలబద్దకం, విరేచనాలు, జీర్ణ సంబంధ సమస్యలు తగ్గిస్తుంది. ఇది గుండె పనితీరును మెరుగు పరుస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అదే విధంగా థైరాయిడ్ సమస్యను దూరం ఉంచడంలో సహాయపడుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నా పచ్చి మామిడి కాయ బెస్ట్ అంటున్నారు.. పచ్చి మామిడి తింటే.. పచ్చిమామిడి కాయలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వేసవి కాలంలో పండిన మామిడి కంటే పచ్చి మామిడి బెస్ట్. సహజంగా గర్భవతులు పచ్చి మామిడి అంటే ఇష్టం చూపిస్తారు. ఇది వాంతులు, వికారం అరికట్టడంలో సహాయపడుతుంది. వేసవిలో ఎదురయ్యే వడదెబ్బ భయానికి పచ్చి మామిడి చాలా బెస్ట్. పచ్చి మామిడిని ఉడికించి చేసే ఆమ్ పన్నా.. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. కనీసం పచ్చి మామిడి ముక్కలమీద కాసింత ఉప్పు చల్లుకుని తింటే శరీరంలో ఐరన్, సోడియం క్లోరైడ్ వంటి ఖనిజాలు బయటకు వెళ్లకుండా ఉంటాయి. వేసవిలో పచ్చి మామిడి తీసుకోవడం వల్ల శరీరం నీరసానికి లోను కాకుండా శరీరంలో తేమ శాతం తగ్గకుండా హైడ్రేట్ గా ఉండచ్చు. రెండు రకాల మామిడి పళ్లు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ పచ్చి మామిడిని ప్రయోజనాలు ఎక్కువ. అలాగే పండిన మామిడిని అతిగా తీసుకుంటే వచ్చే సమస్యలూ ఎక్కువే.. ◆నిశ్శబ్ద.
read moreవేసవి కాలంలో తమలపాకు జ్యూస్ తాగితే కలిగే లాభాలేంటో తెలుసా?
భారతీయ సంస్కృతిలో తమలపాకులకు చాలా ప్రాముఖ్యత ఉంది. దేవుడి పూజలలోనూ, శుభకార్యాలలోనూ ఇది లేకుండా పని జరగదు. తమలపాకు చరిత్ర చూస్తే సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితమే తమలపాకు ఉనికిలో ఉంది. హృదయం ఆకారంలో ఉండే ఈ ఆకు పురాణాలలోనూ, మత గ్రంథాలలోనూ కనిపిస్తుంది. తమలపాకులతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఆయుర్వేదంలో కూడా ప్రాముఖ్యత సంతరించుకుంది. తమలపాకు జ్యూస్ తాగితే ఎన్నో లాభాలు పొందొచ్చు. అవేంటో తెలుసుకుంటే.. తమలపాకు ప్రయోజనాలు.. జ్వరం, జలుబు, ఛాతీ రద్దీ, శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనాన్ని అందించడానికి తమలపాకులను పురాతన కాలంలో ఉపయోగించారు. శ్వాస సమస్యలు ఉన్నవారు తమలపాకులతో పాటు లవంగాలను నీళ్లలో వేసి బాగా మరిగించి తాగాలి. దీని వల్ల చాలా వరకు ఉపశమనం పొందుతారు. గుండె జబ్బులతో బాధపడే వారికి కూడా ఈ ఆకు ఎంతో మేలు చేస్తుంది. దీని రసాన్ని తాగడం వల్ల గుండె జబ్బులకు చాలా మేలు జరుగుతుంది. తమలపాకును తినడానికి ఇష్టపడే వారు సాధారణ తమలపాకులను తినాలి, తీపి ఆకులను తినకూడదు. ఇది ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుంది. తమలపాకుల జ్యూస్ జీర్ణ ఎంజైమ్‌లను ప్రేరేపిస్తుంది. దీంతో ఆహారం తేలికగా జీర్ణమవుతుంది. సాంప్రదాయకంగా తమలపాకులను భోజనం తర్వాత తీసుకుంటారు. ఇది మౌత్ ఫ్రెష్‌నర్‌గా మాత్రమే కాకుండా ఆహారం జీర్ణం కావడానికి కూడా సహాయపడుతుంది. తమలపాకులో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి నోటిలోని బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడతాయి. తద్వారా కావిటీస్, చిగుళ్ల వ్యాధి వంటి దంత సమస్యలను నివారిస్తుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు తమలపాకులలో ఉంటాయి. ఇది కీళ్ల నొప్పి, వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. ఆయుర్వేదం ప్రకారం తమలపాకును తీసుకోవడం వల్ల శరీరంలో పెరిగిన యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఉంటుంది. *నిశ్శబ్ద.
read moreఅరటిపండుతో కలిపి ఈ ఆహారాలు అస్సలు తినకూడదు..
అరటిపండ్లు చిన్నా పెద్ద అందరికీ ఇష్టం. అన్ని తరగతుల వారికి అందుబాటులో ఉంటాయి. ఫలానా సీజన్ లోనే దొరుకుతాయనే బెంగ ఉండదు. పెళ్లిళ్లు, శుభకార్యాలు జరిగినా, దేవుడి ముందు నైవేద్యం పెట్టాలన్నా పెద్ద పీట అరటిపండ్లకే ఉంటుంది. చాలామంది ప్రతిరోజూ అరటిపండ్లు తింటూంటారు. డైట్ మెనూలో భాగం చేసుకుని ఉంటారు. వీటిలో పొటాషియం, ఫాస్పరస్, పెప్టిన్, గ్లూకోజ్, ప్రక్టోజ్, విటమిన్-సి, విటమిన్-బి6, ఫైబర్, ప్రోటీన్ మొదలైనవన్నీ ఉంటాయి. ఈకారమంగా ఇది మంచి పోషకాహార పండుగా పరిగణింపబడుతుంది. కానీ కొన్ని ఆహారాల కాంబినేషన్ ఆరోగ్యానకి మంచిది కాదని వైద్యులు చెప్పినట్టు.. అరటిపండుతో ఈ కింది ఆహారాలు తినడం అస్సలు మంచిది కాదు. ప్రూట్ సలాడ్ లో భాగంగా అరటిపండుతో పాటు బోలెడు పండ్లు తింటారు. అయితే వీటిలో సిట్రస్ పండ్లు ఉంటే మాత్రం కొంప మునిగినట్టే. అరటి పండును సిట్రస్ పండ్ల కాంబినేషన్ తో ఎప్పుడూ తినకూడదు. దీనివల్ల కడుపులో గందరగోళం, తలనొప్పి వంటి సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా నిమ్మ, స్ట్రాబెర్రీ, దానిమ్మ వంటి పండ్లతో అరటిని అవాయిడ్ చేయాలి. చాలామంది అరటిపండును బ్రెడ్ తో తింటుంటారు. బ్రెడ్ స్టైసెస్ మీద అరటిపండు ముక్కలు పెట్టి తేనె లేదా చాక్లెట్ సిరప్ వేసి పిల్లలకు కూడా అందిస్తుంటారు. కానీ అరటిపండ్లు, బేకింగ్ చేసిన ఆహారాలు కలిపి తినడం ఎంతమాత్రం మంచిది కాదు. బేక్ చేసిన ఆహారాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం, అరటిపండ్లు జీర్ణం కావడానికి తక్కువ సమయం పడుతుంది. రెండూ కలిపి తింటే జీర్ణాశయ సామర్థ్యం తగ్గిపోతుంది. భోజనం తిన్నతరువాత చాలామంది పండు తింటూంటారు. ఎక్కువగా అరటిపండుకే ప్రాముఖ్యత ఇస్తారు. అయితే మాంసాహారం తో అరటిపండు తిన్నా, మాంసాహారం తిన్నవెంటనే అరటిపండు తిన్నా అది చాలా చెడు చేస్తుంది. మాంసంలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ఇది అరటిపండుకు విరుద్దమైన ఆహారం. పైపెచ్చు మాంసాన్ని వండటానికి మసాలాలు కూడా ఉపయోగిస్తారు. మిల్క్ షేకులు ఈ కాలపు ఫెవరెట్ డ్రింకులు. శీతలపానీయాల వల్ల ఆరోగ్యం పాడవుతుంది, అందుకే మేము ఆరోగ్యంగా ఉండేందుకు మిల్క్ షేక్ లు తాగుతాం అని బడాయి పోయేవారు ఈ విషయం వింటే షాకవుతారు. అరటిపండును ఎక్కువగా మిల్క్ షేక్ లలో వాడతారు. కానీ పాలు , అరటిపండు కలిపి తినడం జీర్ణాశయానికి అస్సలు మంచిది కాదు. ఇది అనారోగ్యానికి దారితీస్తుంది. టాక్సిన్ లు విడుదల చేస్తుంది. ఫుడ్ పాయిజన్ కు కారణమవుతుంది. జీర్ణసంబంధ సమస్యలకు దారితీస్తుంది. *నిశ్శబ్ద.
read moreవేసవిలో విరివిగా లభించే మామిడి ఆకులతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో!
పండ్లలో రారాజుగా మామిడిని చెప్పుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల మామిడిపండ్ల రకాలు ప్రసిద్ధి చెందాయి. మామిడి పండ్లు రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా చేకూరుస్తాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కేవలం మామిడి పండ్లు మాత్రమే కాదు.. మామిడి చెట్టులోని ప్రతి భాగం ఆరోగ్యపరంగా మంచిదే.. మామిడి ఆకులు కూడా ఆరోగ్యానికి అంతే ముఖ్యమైనవి. శాస్త్రీయంగా మామిడి ఆకులను మాంగిఫెరా ఇండికా అంటారు. భారతీయులు మామిడి ఆకులను పండుగలు, శుభకార్యాలలో తోరణాలు కట్టడానికి ఉపయోగిస్తారు. అయితే ఆయుర్వేదం మాత్రం మామిడి ఆకులను ఆరోగ్యం కోసం కూడా ఉపయోగిస్తుంది. అసలు మామిడి ఆకులలో ఉండే పోషకాలేంటి? మామిడి ఆకుల వల్ల కలిగే ప్రయోజనాలేంటి? పూర్తీగా తెలుసుకుంటే.. మామిడి ఆకులలో పోషకాలు.. మామిడి ఆకులలో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో స్టెరాయిడ్స్, ఆల్కలాయిడ్స్, రైబోఫ్లావిన్, థయామిన్, ఫినాలిక్, బీటా కెరోటిన్, ఫ్లేవనాయిడ్స్ మొదలైన సమ్మేళనాలు ఉంటాయి. మామిడి ఆకులలో టెర్పెనాయిడ్స్, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని వ్యాధి నుండి రక్షణ కల్పిస్తాయి. మంటతో పోరాడుతాయి. ప్రయోజనాలు.. మామిడి ఆకుల సారం చర్మం మీద సన్నని గీతలు, వృద్ధాప్య సంకేతాలు, చర్మం పొడిబారడాన్ని తగ్గిస్తుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది. ఇది ముఖం నుండి ముడతలు, ఫైన్ లైన్లను తగ్గిస్తుంది. మామిడి ఆకులలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా వల్ల కలిగే చర్మ ఇన్ఫెక్షన్లు, చికాకులకు చికిత్స చేయడంలో సహాయపడతాయి. డయాబెటిక్ పేషెంట్లలో బ్లడ్ షుగర్ లెవెల్ బ్యాలెన్స్ చేయడంలో మామిడి ఆకులు సహాయపడతాయి. ఈ ఆకులలో ఆంథోసైనిడిన్ అనే టానిన్ ఉంటుంది. ఇది మధుమేహం మొదటి దశలో ఉన్నప్పుడు చికిత్సలో సహాయపడుతుంది. ఎలా ఉపయోగించాలంటే.. ఒక కప్పు నీటిలో 10-15 మామిడి ఆకులను వేసి మరిగించాలి. తర్వాత ఆ నీటిని రాత్రంతా చల్లారనిచ్చి ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. దీన్ని గాల్, కిడ్నీ స్టోన్స్ చికిత్సకు ఉపయోగిస్తారు. ఇది మూత్రపిండాల్లో రాళ్లను విచ్ఛిన్నం చేయడంలో, మూత్రం ద్వారా వాటిని శరీరం నుండి తొలగించడంలో సహాయపడుతుంది. ఎలా ఉపయోగించాలంటే.. కొన్ని మామిడి ఆకులను తీసుకుని వాటిని పొడి చేయాలి. ఈ పొడిని నీటిలో కలపాలి. ఆ నీటిని రాత్రంతా అలాగే ఉంచి ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో త్రాగాలి. శరీరంలో నిల్వ ఉండే కొవ్వు స్థాయిని తగ్గించడం ద్వారా ఊబకాయాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. *నిశ్శబ్ద.
read moreవేసవిలో ఉదయాన్నే ఖాళీ కడుపుతో మారేడు ఆకులు తింటే ఏం జురుగుతుందో తెలుసా?
బిల్వపత్రి లేదా మారేడు ఆకులు దేవుడి పూజకు విరివిగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా పరమేశ్వరుడి పూజకు మారేడు దళాలు ఎంతో ముఖ్యం. ఎటువంటి ఆడంబరాలు లేకపోయినా బిల్వదళం అర్పిస్తే ఆ పరమేశ్వరుడు సంతోషిస్తాడని అంటారు. అయితే బిల్వదళం కేవలం పూజకు మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలామంచిది. వేసవికాలంలో ప్రతిరోజూ ఉదయమే బిల్వదళం ఖాళీ కడుపుతో తింటే బోలెడు ఆరోగ్యప్రయోజనాలుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అసలు బిల్వదళంలో ఉండే పోషకాలేంటి? దీన్ని వేసవిలో రోజూ ఉదయమే తీసుకుంటే కలిగే లాభాలేంటి? పూర్తీగా తెలుసుకుంటే.. పోషకాలు.. బిల్వదళాలలో కాల్షియం, ఫైబర్ వంటి పోషకాలు, విటమిన్లు A, C, B1, B6 పుష్కలంగా ఉంటాయి. ప్రయోజనాలు.. బిల్వపత్రం వేసవిలో ప్రతిరోజూ ఉదయాన్నే తీసుకుంటే ఉదర సంబంధ సమస్యలు ఏమున్నా అన్నీ సెట్ అవుతాయి. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. మరీ ముఖ్యంగా ఖాళీ కడుపుతో తీసుకుంటే ఫైల్స్ సమస్య ఉన్నవారికి చాలామంచిది. మీరు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో బిల్వదళాలను తీసుకుంటే అందులో ఉండే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు గుండెను వ్యాధుల నుండి రక్షిస్తాయి. అలాగే అధిక రక్తపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. బిల్వపత్రి ఆకుల స్వభావం చల్లగా ఉంటుంది. వీటిని తీసుకుంటే శరీరం రోజంతా చల్లగా ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో వీటిని తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. ఖాళీ కడుపుతో బిల్వ పత్రి ఆకులు తీసుకుంటే నోటిలో పుండ్లు సమస్య తగ్గుతుంది. డయాబెటిక్ పేషెంట్లు ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో బిల్వ పత్రి ఆకులను తీసుకోవచ్చు. ఇందులో ఉండే ఫైబర్, ఇతర పోషకాలు మధుమేహ రోగులకు చాలా మంచివి. అలాగే ఖాళీ కడుపుతో బిల్వ పత్రి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. *నిశ్శబ్ద.
read moreబ్లీడింగ్ డిజార్డర్స్ గురించి మీకెంత తెలుసు? దీని కారణాలు, రకాలేంటంటే!
మనిషి శరీరంలో ప్రాణం రక్తంలోనే ఉంటుందని అంటారు. ఏ చిన్న గాయం తగిలినా రక్తం బయటకు వస్తుంది. అయితే ఈ రక్తానికి సంబంధించి కొన్ని రుగ్మతలున్నాయి. వీటిని బ్లీడింగ్ డిజార్డర్స్ అని అంటారు. బ్లీడింగ్ డిజార్డర్స్ అనేది మనిషి శరీరంలో రక్తం సరిగ్గా గడ్డకట్టే సామర్థ్యాన్ని ప్రభావితం చేసే పరిస్థితులు. రక్తస్రావం జరిగిన ప్రదేశంలో రక్తం గడ్డ కట్టకుండా అధిక రక్తస్రావం జరుగుతుంది. ఈ రుగ్మతల గురించి అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ రుగ్మతలు జీవన నాణ్యతను గణనీయంగా ప్రభావితం చేస్తాయి. తీవ్రమైన రక్తస్రావం రుగ్మతలలో ప్రాణాంతక రక్తస్రావం కూడా కలిగిస్తాయి. రక్తస్రావం రుగ్మతల రకాలు.. హీమోఫిలియా: హీమోఫిలియా అనేది VIII లేదా IX గడ్డకట్టే కారకాల లోపం వల్ల ఏర్పడే జన్యుపరమైన రుగ్మత. హేమోఫిలియాలో రెండు ప్రధాన రకాలు ఉన్నాయి. హేమోఫిలియా A (కారకం VIII లోపం) హేమోఫిలియా B (కారకం IX లోపం). వాన్ విల్‌బ్రాండ్ వ్యాధి.. వాన్ విల్‌బ్రాండ్ వ్యాధి (VWD) అనేది రక్తం గడ్డకట్టడానికి సహాయపడే వాన్ విల్‌బ్రాండ్ కారకం లోపం లేదా పనిచేయకపోవడం వల్ల కలిగే అత్యంత సాధారణ రక్తస్రావం రుగ్మత. ప్లేట్‌లెట్ ఫంక్షన్ డిజార్డర్స్.. రక్తస్రావాన్ని ఆపడానికి ప్లేట్‌లెట్స్ సరైన ప్లగ్‌ని ఏర్పరచలేకపోవడం ద్వారా ఈ రుగ్మతలు వర్గీకరించబడతాయి. రక్తస్రావం రుగ్మతల లక్షణాలు.. చిన్న కోతలు లేదా గాయాల నుండి అధిక రక్తస్రావం. తరచుగా ముక్కు నుండి రక్తం కారుతుంది. మహిళల్లో అధిక ఋతు రక్తస్రావం. సులభంగా గాయాలు కావడం. కీళ్ళు లేదా కండరాలలో ఎటువంటి గాయం లేకుండా రక్తస్రావం మూత్రం లేదా మలంలో రక్తం. చికిత్స ఎంపికలు... నివారణ చర్యలు.. రక్తస్రావం రుగ్మతలు లేదా విపరీతంగా రక్తస్రావం అయ్యే ప్రవృత్తి ఉన్న రోగులలు గాయం లేదా ఆకస్మికంగా, కాంటాక్ట్ స్పోర్ట్స్/ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్లు, గాయాలకు దూరంగా ఉండాలి. పునఃస్థాపన చికిత్స.. తప్పిపోయిన గడ్డకట్టే కారకాలు లేదా రక్త భాగాలను భర్తీ చేయడం. డెస్మోప్రెసిన్ (DDAVP).. నిల్వ చేయబడిన వాన్ విల్లెబ్రాండ్ ఫ్యాక్టర్, ఫ్యాక్టర్ VIII విడుదలను ప్రేరేపించే సింథటిక్ హార్మోన్. యాంటీఫైబ్రినోలైటిక్ మందులు.. రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించడంలో సహాయపడతాయి. ఐరన్ సప్లిమెంట్స్.. అధిక రక్తస్రావం వల్ల కలిగే ఐరన్ లోపం అనీమియా చికిత్సకు ఉపయోగిస్తారు. శస్త్రచికిత్సా విధానాలు.. తీవ్రమైన కేసులకు లేదా సమస్యల చికిత్సకు ఇవి అవసరం కావచ్చు. *నిశ్శబ్ద.
read moreచల్లటి నీరు ఆరోగ్యానికి మంచిదేనా?
వేసవికాలం లో ఎండా వేడిమి తట్టుకోడానికి కాస్త ఏదైనా చల్లగా తాగాలని అందరూ అనుకుంటారు. అప్పుడే దాహం తగ్గుతుందని అనుకుంటారు.ఇంకొందరికి చల్లటి మంచినీళ్ళు అన్ని కాలాలలో తాగడం అలవాటు. చల్లటి నీళ్ళు అంటే కుండలో నీళ్ళు తాగడం కాదు,లేదా కొందరు ఐస్ ముక్కలు నీళ్ళలో వేసుకుని తాగితేనే తృప్తి అయితే ఎర్రటి ఎండలో కూల్ వాటర్ ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా యుక్తవయస్సులో దాని ప్రభావం పెద్దగా ఉండదు కాని వయస్సు పెరిగే కొద్ది ఖచ్చితంగా దీని ప్రభావం లివర్ మీద ఉంటుందని అలాగే చల్లటి కూల్ డ్రింక్స్,కూలింగ్ లో ఉన్న ఆహార పదార్ధాలు తీసుకుంటే హార్ట్ ఎట్టాక్ కి దారి తీస్తుందని జపాన్ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు జపాన్ శాస్త్రజ్ఞులు చేసిన పరిశోదనలో ఈ అంశాన్ని వెల్లడించారు. ఎండాకాలం లో చల్ల చల్లగా కూల్ డ్రింక్స్,బీర్లు,ఐస్ క్రీంలు,కూల్ కాఫీ,ఇవి చాలా ప్రమాదకర కరమైనవి అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చల్లని నీరు తాగడం వల్ల వచ్చే అనర్ధాలు... మన శరీర ఉష్ణోగ్రతకు సరిపడా సమాన మైన నీటిని మాత్రమే తాగాలి. గోరు వెచ్చటి నీటిని౩7 డిగ్రీల నీరు తాగాలి అలాకాకుండా కూల్ వాటర్ అంటే ఫ్రిడ్జ్ లో నీళ్ళు తాగడం వల్ల అది పొట్టలోకి చేరి పొట్టలో ఉన్న జఠరాగ్ని చల్ల బరుస్తుంది.జఠరాగ్ని చల్ల బడిందో మనం తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాదు ఈకారణం గానే పొట్టలో సమస్యలు వస్తాయి ఒక ఉదాహరణగా చెప్పాలంటే బాగా మండుతున్న పొయ్యిమీద అన్నం ఉడుకుతుంటే మధ్యలో అనిప్పులమీద నీళ్ళు పోస్తే ఏమౌతుంది పొయ్యి ఆరిపోతుంది అన్నం సరిగా ఉడకదు.జఠరాగ్ని మీద చల్లటి కూల్ కూల్ ఐస్ వాటర్ పోస్తే జఠరాగ్ని చల్లబడడమే కాదు తీసుకున్న ఆహారం అరగక పోగా శరీరం లోని అన్ని అవయవాలు పొట్టతో అనుసంధానించాబడి ఉంటాయి కాబట్టి శరీరము చల్లబడిపోతుంది అయితే సహజంగా శరీరంలో వాతావరణానికి అనుగుణంగా ఏ వేడిమి కి అయినా అడ్జెస్ట్ చేసుకుంటూ ఎదుర్కునే వ్యవస్థ ఉంది శరీరం చల్ల బడి పోకూడదు ఒక్కో సారి శరీరం చల్లబడిందా మళ్ళీ వేడిని పుట్టించాలి. కృత్రిమంగా మళ్ళీ వేడి పుట్టించాలి. చల్లటి నీళ్ళు త్రాగడం వల్ల శరీరం లో శరీరంలో మార్పులు ఏవిధంగా ఉంటాయి అంటే చల్లటి నీరు తాగిన తరువాత కడుపు చల్లని నీటి వేడి చేయాలంటే ప్రయత్నం చేస్తుంది దీనికోసం అదనపు శక్తి కావాలి.అదనపు శక్తి దానికి రక్తం నుండి లభించాలి.అంటే శరీరం లోని మిగతా అవయవాల లోని రక్తం అంత పొట్టమీద కేంద్రీకరించ బడుతుంది అంటే కొద్ది సేపు ఆయా భాగాలలో రక్త సరఫరా తగ్గుతుంది.గుండె యొక్క రక్తం పొట్టను చేరితే అప్పుడు గుండె పరిస్థితి ఏమిటి?రక్త ప్రసారం మెదడుకు రక్తం అందక పోతే ఆక్సిజన్ అందక సమస్య తీవ్రత మరింత పెరుగుతుంది. ముఖ్యంగా చల్లటి నీళ్ళు కూల్ డ్రింక్స్ తాగితే విరేచనం కాకపోగా మలబద్దకం వంటి సమస్యకు దారి తీస్తుంది.ఆతరువాత మల ద్వారం పూర్తిగా కుంచించుకు పోతుంది.అంతే కాక గ్యాస్టిక్, డయాబెటిస్, లివర్ సమస్యలు కూడా వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితి నుంచి బయట పడాలంటే చల్లటి కూల్ వాటర్ తాగక పోవడం ఐస్ ముక్కలు నీళ్ళలో వేసుకుని తాగడం ఐస్ క్రీం తినవద్దని అలాచేస్తే శరీరం సర్వనాశనం కావడం గ్యారంటీ.మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే చల్లటి నీరు ఐస్ క్రీమ్ల జోలికి వెళ్ళకండి తీసుకునే ముందు దాని ప్రభావం ఏమిటో ఒక్కసారి గమనించండి.బీ హ్యాపీ బీ హేల్తీ.
read moreమంజిస్టాతో రక్త శుద్ధి...
మంజిస్టా అసలు నామధేయం రుబియా కార్డిఫోలియా పెరెన్నెల్ క్లైంబర్ దీని తో లింఫ్ ను కదిలిస్తుంది.రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం లింఫ్ అంటే రస మరియు రక్త అంటే మొదటి టిష్యూ శరీరం ఇరుకుగా కదలలేని స్థితి లో ఉంటుంది.ఎందుకు అంటే డెటొక్షిఫయింగ్ ప్రాపర్టీ అలాగే తదనంతరం ఇతర ఇదు రకాల కణ జలాలను తీవ్ర ప్రభావితం చేయకముందే ప్రాధమిక స్థాయిలో శరీరం లోని కణజాలాలు వారసత్వంగా ఆయుర్వేదంఎందుకు ఉన్నత స్థానం ఇవ్వబడిందో లింఫ్ ఫ్లోయింగ్ లింఫ్ ఒక సీట్ లాంటిది ఇమ్మ్యున్ సిస్టమ్ ప్రభావితం చేస్తుంది. ఆరోగ్యం గా కనిపిస్తారు.శరీరం లోని చర్మం పని తీరు మెరుగు పడుతుంది.శరీరంలో చర్మం పెద్ద అవయవం అది డిటోక్షిఫై చేసే అవయవం. మంజిస్ట మొక్క చర్మం అంతా విస్థరించ గలదు. చాలా ప్రభావవంతం గా ఆర్టిరియల్,సర్క్యు లే టరీ సిస్టమ్,చర్మం పై పని చేస్తుంది. మంజీస్టాదీని పేరు సాహిత్యం పరం గా దీని అర్ధం ఎర్రటి ఎరుపు. అందుకే దీని వేరు ఎర్రగా ఉంటాయి. దీనిని ఆయుర్వేదంలో దీనిని లింఫ్ -మూవింగ్ ఈ మొక్కలో క్లీసింగ్ ప్రాపర్టీ ఇతర మొక్కల్లో ఎర్ర వెళ్ళు సీనో దస్ అమెరికనుస్ ను రెడ్ రూట్ గా పిలుస్తారు.దీనిని ఇది హై లింఫ్ మూవేర్స్ గా ఆయుర్వేదం లో ఉన్నత స్థానం ఉందని అంటారు ఆయుర్వేద వైద్యులు.మంజీస్టా సహజంగా గుత్తి రూపం లో ఉంటుంది. దీనిని ధాతువుగా చూస్తారు. కణ జాలం అలాగే శరీరంలో ఎక్కువగా ఉన్న పిత్త తత్వాన్ని, కఫంని నిలువరిస్తుంది. మీ శరీరంలో పిత్త తత్వాన్ని సారి చేస్తుంది. ప్రత్యేకంగా రక్తం పెంచు తుంది.పిత్త తత్వాన్ని బాలన్స్ చేయడం లో మంజిస్టా ప్రతిభ లేదా స్త్రీలలో వచ్చే నెల సరి సమస్యల పరిష్కారం చేయడం లో స్త్రీలకు సహాయ పడుతుంది మంజీష్టా.స్త్రీలలో వచ్చే రెప్రోడక్టివ్ సిస్టమ్ ముఖ్యం గా పిల్లాల పుట్టుక లింఫ్, మంజీస్ట ను ఉత్తమ మైన మూలికగా చర్మానికి పని చేస్తుంది.చర్మం లో వచ్చే దద్దుర్లు ఇతర సమస్యలు శరీరంలోని పూర్తిగా పునర్నిర్మిస్తుంది.
read more



.webp)





.webp)



.webp)
.webp)



.webp)


.webp)
