వర్షాకాలం నెలసరిలో శుభ్రత ఇలా!

వర్షాకాలం నెలసరిలో శుభ్రత ఇలా! మహిళల్లో నెలసరి అనేది సాధారణమైన సమస్య. అయితే మారుతున్న ఋతువులను బట్టి వారు నెలసరిసమయంలో ఎదుర్కొనే ఇబ్బందులు వేర్వేరుగా ఉంటాయి. వేసవిలో, చలికాలంలో, వర్షాకాలంలో వాతావరణంలో జరిగే మార్పులు మహిళలను నెలసరి సమయాల్లో పలురకాల ఇబ్బందులకు గురిచేస్తాయి. ప్రస్తుతం అన్నిచోట్లా కొనసాగుతున్న వర్షాల ప్రభావం వల్ల వాతావరణం చాలా చల్లగానూ చుట్టుపక్కల ప్రాంతాలు చిత్తడిగానూ ఉంటాయి. నెలసరి సమయాల్లో నిరంతరం మార్చుకునే ప్యాడ్ లు, టాంపాన్ ల వల్ల యోని ప్రాంతాన్ని పదే పదే నీటితో శుభ్రం చేసుకుంటూ ఉండటం వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, రిప్రొడక్టివ్ ట్రాక్ ఇన్ఫెక్షన్ వంటి యోని ఇన్ఫెనెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. కేవలం ఇది మాత్రమే కాకుండా వర్షాకాలంలో కొన్ని అలవాట్ల వల్ల మహిళలకు నెలవారీ సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. వాటి గురించి తెలుసుకుని దూరంగా ఉండటం ఎంతైనా మంచిది. యోని ప్రాంతాన్ని శుభ్రంగా పొడిగా ఉంచుకోవాలి!! ◆ శుభ్రత అంటే చాలామంది దృష్టిలో పదేపదే జాగ్రత్త పడటం. కానీ అది చాలా తప్పు. అది అతి శుభ్రత అవుతుంది.  ◆వాతావరణంలో తేమశాతం ఎక్కువైతే సహజంగానే PH స్థాయిలు తగ్గుతాయి.  నెలసరి సమయాల్లో ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లడం, ప్యాడ్ లేదా టాంపాన్ మార్చుకున్న ప్రతిసారి యోనిని కడగడం చేస్తారు. అయితే మెత్తని శుభ్రమైన పొడిబట్టతో యోని చుట్టూ ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేసుకోవాలి. ◆యోనిలో సహజంగా తేమను నిర్వర్తించడానికి మంచి బాక్టీరియా ఉంటుంది. కానీ అతిజాగ్రత్త వల్ల సబ్బులు,  ఇతర వాష్ లను ఉపయోగించి పదే పదే శుభ్రం చేయడం వల్ల అక్కడ మంచి బాక్టీరియా పోయి ఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది. బిగుతుగా ఉన్న వస్త్రాలను దూరం ఉంచాలి!! ◆ బిగుతుగా ఉన్న టాప్స్ వేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ చాలామంది బిగుతుగా ఉన్న జీన్స్, లెగ్గింగ్స్ వంటివి వేసుకోవడం వల్ల యోని ప్రాంతంలో మెల్లగా చెమట శాతం పెరుగుతుంది.  ◆అప్పటికే యోని ప్రాంతంలో ఉన్న తేమకు ఈ చెమట జతకలిస్తే  ఇన్ఫెక్షన్ కు కారణమయ్యే బాక్టీరియా చాలా తొందరగా వృద్ధి చెందుతుంది. ◆ నెలసరి సమయాల్లో యోని ప్రాంతాల్లో తేమ అయినా, చెమట ద్వారా ఏర్పడే తేమ అయినా తగినంత గాలి ప్రవాహం ఉంటేనే అవి ఆరిపోతాయి. కాబట్టి వదులుగా ఉన్న దుస్తులు వేసుకోవాలి.కాటన్ దుస్తులు ధరిస్తే మరింత మంచిది. పొడిగా ఉంచే మార్గం!! ◆ యోని ప్రాంతం పొడిగా ఉండాలంటే వేసుకునే ప్యాడ్ లేదా టాంపాన్ లను పూర్తిగా తడిచిపోయేవరకు ఉంచుకోకూడదు.  ◆ ఇంటి పనులు చేసేటప్పుడు ధరించిన దుస్తులు ఏమాత్రం తడి తగిలినా వాటిని మార్చుకోవాలి. అవాంచిత రోమాలు!! ◆చాలామంది బయటకు చెప్పుకోవడానికి చాలా షేమ్ గా భావించే విషయం. యోని ప్రాంతంలో అవాంచిత రోమాలు.  ◆నెలసరి సమయంలో ఎక్కువగా ఉన్న అవాంచిత రొమాల వల్ల తడిశాతం ఎక్కువగా ఉండిపోయి ఇన్ఫెక్షన్లు తొందరగా వస్తాయి. ◆ అందుకని ఆరోగ్యకరమైన పద్ధతుల్లో వాటిని తొలగించుకోవడం ముఖ్యం. చాలామంది చేసే పొరపాట్లు!! ◆ దిగువ, పేద తరగతి కుటుంబాలలో మహిళలు, అమ్మాయిలు చాలామంది ఇంట్లో ఉన్న వస్త్రాలను నెలసరి సమయాలలో వాడుతారు. పైగా వాటిని ఉతికి ప్రతి నెలా వాటినే ఉపయోగిస్తారు. ◆ ప్రతిసారి ఇలా ఉపయోగించడం వల్ల యోని ప్రాంతం చాలా తొందరగా సున్నితత్వాన్ని కోల్పోతుంది. ◆ చర్మం కందిపోవడం, యోని ప్రాంతం తేమ ఎక్కువగా ఉండటం, బాక్టీరియా పెరుగుదల వేగంగా జరిగే అవకాశాలు ఉంటాయి.  ఇవి మాత్రమే కాకుండా యోని సంబంధ జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి మహిళలు వర్షాకాలంలో నెలసరి సమయాల్లో జాగ్రత్తగా ఉండాలి. శరీరంలో తేమ స్థాయి నిలకడగా ఉండేలా చూసుకోవాలి. దురద, మంట ఇతర సమస్యలు ఏవైనా ఎదురైతే గైనకాలజిస్ట్ ను కలవాలి.                                                ◆నిశ్శబ్ద.

read more
Acne అంటే ఏమిటి...

Acne అంటే ఏమిటి...    మొటిమలు వయస్సు వచ్చిందంటే ముఖం పై వచ్చే మొటిమల ను acne అని వైద్య పరిభాషలో అంటారు.మొటిమలు అనగానే మొలిచినట్టు గా ఎర్రటి  టికురుపులు ,లేదా తెల్లటి కురుపుల మాదిరిగా ఉంటాయి.దీనికి మరో పేరు పిమ్ పుల్స్ చర్మం వస్తాయి.మొటిమలు కారణంగా శాశ్వతంగా ఉండి  మచ్చలు ఏర్పడతాయి. మొటిమలు లక్షణాలు... మొటిమలు 1౦ నుండి 13 సంవత్సరాల వయస్సు ఉన్నవారికి వస్తూ ఉంటాయి.లేదా 5నుండి 1౦ సంవత్సరాల స్త్రీ పురుషులలో వస్తుంది.అయితే పురుషులకంటే స్త్రీలే దీనిబారిన పడుతూ ఉంటారు దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. స్త్రీలు ఎక్కువగా మొటిమల తో బాధ పడుతూ ఉంటారు.అయితే దీనికి కారణం వారు ఎక్కువగా వాడె సౌందర్య సాధనాల వల్ల,లేదా స్తీలలో వచ్చే నెలసరి సమస్యల వల్ల  హార్మోన్లలో వచ్చే మార్పు మొటిమలు వస్తూ ఉంటాయి. ము ఖం పైన మొటిమలు రావడం సహజం అయితే కొన్ని సందర్భాలలో మెడ,చాతి, వీపు వెనుక భాగం,భుజాలు, తల లోన కన పడే ప్రాంతం లో. మొటిమలకు చికిత్స... ఈ మధ్య కలం లో అన్నిటా వ్యాపారాత్మక ధోరణి పెరగడం వల్ల మొటి మకు చేసే చికిత్స,చాలా చికిత్సలు వైద్య పరంగా పెద్దగా ప్రభావ వంతంగా పని చేసిన దాఖలాలు లేవు.చాలా తీవ్రంగా మొటిమలు వచ్చిన కొరికొస్తెరొయిడ్స్. ఇసొత్రెతిఒనొఇన్,యంటి బాయిటిక్స్,ఓరల్ కాంట్రాసెప్టివ్ రెటి నోఇడ్స్.వాడతారు. అసలు మొటిమలు అని ఎలా పరీక్షించాలి... సారీరక పరీక్ష ద్వారా పరేక్షిస్తారు.దీనికోసం ఏ ఇతర పరీక్ష పద్దతులు లేవు. ఆధునిక వైద్య శాస్త్రం అభివృద్ధి చెందిన మొటిమలకు సరైన చికిత్స లేదని చెప్పాలి.

read more
సాయంకాలం ఎలాంటి స్నాక్స్ తీసుకోవాలి?

  బాదం పప్పులు : మీకు సాయంకాలం పూట ఆకలి అయితే బాదం పప్పులు తినండి. ఇది చక్కటి చిరుతిండి. ఎందుకంటే కడుపూ నిండుతుంది,అదే విధంగా మీకు కూడా కాస్త ఆకలి తీరి, శక్తి కూడా వస్తుంది. ఆపిల్ : రోజుకో ఆపిల్ తింటే డాక్టర్ కి దూరంగా ఉండడమే కాక, మీ క్యాలరీల స్వీకరణ కూడా తగ్గుతుంది. ఒక యాపిల్ కేవలం 100 కేలరీలు కలిగి వుంటుంది. అందుకని రోజుకో ఆపిల్ తినండి. ఎందుకంటే దాంట్లో వుండే కరిగే పీచు పదార్ధం వల్ల వాతావరణంలోని కాలుష్య కారకాల నుంచి రక్షణ అందుతుంది, కొలెస్టరాల్ ను కూడా తగ్గిస్తుంది. వేరుశనగ పప్పులు : వేరుశనగలు చాలా ఆరోగ్యకరమైన, పోషక విలువలున్న చిరుతిండి. కనుక రోజుకు కొన్ని వేరుశనగలు తినండి. వాటిలో కేవలం 74 కేలరీలే వుంటాయి. అంతే కాదు, ఇవి తక్కువ గ్లూకోస్ కలిగి వుంటాయి కనుక శక్తిని నెమ్మదిగా విడుదల చేస్తాయి. దాని వల్ల చాలా సేపు కడుపు నిండిన అనుభూతి వుంటుంది. ద్రాక్ష పళ్ళు : కడుపు నిండి, తక్కువ కేలరీలు కావాలంటే ద్రాక్ష పళ్ళు సరైన మార్గం. ఒక 30 ద్రాక్ష పళ్ళు తినండి, ఎందుకంటే అవి రక్తహీనతను, అలసటను, కీళ్ళ నెప్పులను, కీళ్ళ వాతాన్ని, రుమాటిజంను, తగ్గించడానికి దోహదం చేస్తాయి, కేవలం 100 కేలరీలు మాత్రమె కలిగి వుంటాయి. పుచ్చకాయ : పుచ్చకాయలు మంచి డైట్ స్నాక్ గా చెప్పుకోవచ్చు. ఒక పుచ్చకాయలో కేవలం 88 కేలరీలు మాత్రమె వుంటాయి. అవి నీటితో తయారవుతాయి, అందువల్ల చాలా తక్కువ కేలరీలు వుంటాయి. టమాటో సూప్ : మీకు తినడం ఇష్టం లేకపోతె, టమాటో సూప్ తాగండి, ఎందుకంటే అది చాలా తేలిగ్గా తయారు చేయవచ్చు, కేవలం 74 కేలరీలు మాత్రమె కలిగి వుంటుంది. చెర్రీ : ఈ చిన్ని రుచికరమైన పళ్ళు పుష్కలంగా విటమిన్లు కలిగి వుంటాయి, తక్కువ కొవ్వు పదార్ధం కలిగి వుంటాయి. 25 చెర్రీలలో కేవలం 100 కేలరీలే వుంటాయి. బ్లూ బెర్రీలు : ఈ అధ్బుత పదార్ధం ఒక కప్పులో 83 కేలరీలు వుంటాయి. బ్లూ బెర్రీలలో పుష్కలంగా యాంటీ ఆక్సిడేంట్లు వుండి, వార్ధక్య ప్రక్రియను మందగింప చేస్తాయి, మీ గుండెను రకరకాల జబ్బుల నుంచి కాపాడతాయి. కివీ పండు : ఈ ఆరోగ్యకరమైన పండులో విటమిన్ సి పుష్కలంగా అందుతుంది. రెండు కివీ పళ్ళను సాయంత్రం స్నాక్ గా తీసుకోండి. ఇవి కడుపు నింపుతాయి. వీటిలో కేవలం 58 కేలరీలే వుంటాయి. కాబట్టి సాయంత్రపు స్నాక్ గా దీన్ని తీసుకోండి. అంతేకాక కివి పళ్ళు జీర్ణక్రియకు సాయం చేస్తాయి. స్పష్టమైన, ఆరోగ్యకరమైన మేని ఛాయను కూడా ఇస్తాయి.

read more
చెప్పుకోలేని సమస్యకు చెప్పుకోదగ్గ పరిష్కారం!

చెప్పుకోలేని సమస్యకు చెప్పుకోదగ్గ పరిష్కారం!     పైల్స్... ఈ సమస్య ఉందని పైకి చెప్పుకోడానికే సిగ్గు చాలామందికి. ముఖ్యంగా మహిళలు అయి మరీ ఇబ్బంది పడతారు. దురద, నొప్పి, మంట వేధిస్తున్నా చూపించుకోడానికి సిగ్గేసి డాక్టర్ దగ్గరకు కూడా వెళ్లరు. అలా అని నిర్లక్ష్యం చేస్తే ఇది సర్జరీ వరకూ తీసుకెళ్తుంది. కాబట్టి ఈ చిట్కాలను పాటించండి. పైల్స్ ని మీ నుంచి దూరంగా పంపించేయండి. - ముందు ఆహారంలో ఉప్పు, పులుపు, కారం తగ్గించేయండి. పీచు పదార్థాలను పెంచండి. రోజుకు నాలుగైదు లీటర్ల నీటిని తాగండి. ఫ్రూట్స్, నట్స్, స్ప్రౌట్స్ ఎక్కువ తీసుకోండి.  - తగినంత నిద్రపోండి. మానసిక ఒత్తిడి, ఆందోళన వల్ల కూడా పైల్స్ ఇబ్బంది పెడతాయి. - స్మోకింగ్, డ్రింకింగ్ లాంటి అలవాట్లకు చెక్ పెట్టండి. కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ కూడా తగ్గించండి. - అంజూరపు పండ్లను రాత్రంతా నీటిలో నాబెట్టి, ఉదయాన్నే పరగడుపున ఆ నీళ్లు తాగితే సుఖ విరేచనం అవుతుంది. రోజూ అలా చేయడం వల్ల మెల్లగా పైల్స్ తగ్గిపోతాయి. - నీటిలో నాలుగు బిర్యానీ ఆకులు, మూడు వెల్లుల్లి రేకులు వేసి మరిగించాలి. ఈ నీటిని రోజుకు మూడుసార్లు పైల్స్ ఉన్న చోట రాస్తే మెల్లగా వాపు, నొప్పి తగ్గిపోతాయి. - టీ ట్రీ ఆయిల్ లో ఆముదం కానీ బాదం నూనె కానీ కలిపి రాసినా ఫలితం ఉంటుంది. కలబంద గుజ్జు రాసినా మంచిదే. - పైల్స్ నొప్పి భరించలేనిదిగా ఉంటే... వేడిపాలలో నిమ్మరసం కలుపుకుని మూడు గంటలకోసారి చొప్పున రోజంతా తాగండి. బాధ తగ్గుముఖం పడుతుంది. - రోజూ పడుకునే ముందు నిమ్మరసంలో దూది ముంచి పైల్స్ మీద పెట్టుకోండి. దీనివల్ల కొద్ది కాలానికి సమస్య తీరిపోతుంది.      ఇన్ని చేసినా తగ్డకపోతే సమస్య ముదిరినట్టు లెక్క. అప్పుడు మాత్రం సిగ్గు పడకుండా డాక్టర్ దగ్గరకు వెళ్లండి. లేదంటే మరీ ముదిరిపోయి పరిస్థితి చేయి దాటవచ్చు! -Sameera  

read more
మహిళల కోసం మూడురోజుల ప్రామిస్!!

మహిళల కోసం మూడురోజుల ప్రామిస్!!   ఈ ప్రపంచం ఎంత డవలప్ అయిందంటే మహిళలు మూడురోజులు అని చెప్పగానే ఠక్కున అది నెలసరి సమస్యనే కదా!! అని 90% మంది ఎంతో సులువుగా గ్రహించేస్తారు. ఆడవాళ్ళ పీరియడ్స్ గురించి, పడక గదిలో సెక్స్ గురించి మాట్లాడినంతగా ఈమధ్య కాలంలో వేరే ఏ విషయం మాట్లాడటం లేదు ప్రజలు, సెలెబ్రెటీలు, రచయితలు, సామాజిక కార్యకర్తలు ఇట్లా అందరూ కూడా. అయితే ఆడవారి నెలసరి అనే విషయం గురించి మాట్లాడిన  వ్యక్తులు, దాని గురించి ఎంతో అవగాహనా ప్రసంగాలు చేసే వ్యక్తులు సామాజిక మాద్యమలలో కూడా ఈ విషయం గురించి సపోర్ట్ ఇచ్చేవారు కూడా చివరికి తమ తమ ఇళ్లలో ఆడవాళ్లు అదే నెలసరి సమస్యలో ఉన్నపుడు వారి బాధను, వారి పరిస్థితిని అర్థం చేసుకుని సపోర్ట్ ఇచ్చేవారు చాలా తక్కువేనని చెప్పవచ్చు. దీనిని బట్టి చూస్తే ఏ విషయం అయినా మాటలు చెప్పడం ఎంతో తేలిక అని అర్థమవుతుంది. ఇకపోతే మహిళల నెలసరి విషయం ఒకప్పుడు ఎంతో గోప్యత కలిగినది. ఆ తరువాత దాని గురించి స్వేచ్ఛగా మాట్లాడినా ఆ నెలసరిని ఎదుర్కొనే మహిళలు మాత్రం దాన్ని ఎదుర్కొని తీరాల్సిందే. మగవాళ్ళు, సామాజిక కార్యకర్తలు, అవగాహనా సదస్సులు ఇట్లా ఎందరు ఎన్ని మాట్లాడినా, స్త్రీల నెలసరి గురించి, వారి సమస్యల గురించి ఎంత నీతులు చెప్పినా అవేవి కూడా స్త్రీల నెలసరి సమయంలో వారి సమస్యలు పరిష్కరించలేవు అనే విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది మాటల సమాజం అయినపుడు, కేవలం మాటల్లో ఏదేదో చెప్పేసి తరువాత వారి మానాన వారిని వదిలేస్తే, నెలసరి వల్ల కలిగే ఎమోషన్స్, చిరాకు, అసహనం, ఆ మూడు రోజులు శరీరంలో కలిగే మార్పులు ఇవ్వన్నీ కూడా వాళ్ళను వదిలిపోవు. కేవలం సమాజం మాట్లాడుకోడానికి ఈ టాపిక్ అన్నట్టుగా ఉంటాయి సమాజం మాటలు. అందుకే ఈ విషయంలో స్త్రీల పట్ల కావాల్సింది మాటల పరంపర కాదు చేతల తోడ్పాటు.  మూడ్స్ ను అర్థం చేసుకోవాలి!! మూడ్ అనగానే ఏదో పడకగదిలో రొమాన్స్ గుర్తొస్తే అంతకంటే అథములు లేరని అనుకోవచ్చు. ఇక్కడ మూడ్ అంటే మానసిక పరిస్థితి. మహిళల నెలసరి సమయంలో అది మారుతూ ఉంటుంది. ఎంతగా అంటే కోపం, చిరాకు, అసహనం, ఏడుపు, బాధ వంటివి వెంటవెంటనే మారిపోతూ ఉంటాయి. శరీరంలో జరిగే హార్మోన్ల ప్రభావమే దీనికి కారణం. కాబట్టి నెలసరిలో ఇలాంటివి ఉంటాయని మాటలు చెప్పకుండా, ఆ స్థితిలో ఉన్న ఇంట్లో ఆడవాళ్లకు కోపరేట్ చెయ్యాలి. సాధారణ సమయాల్లో మాదిరిగా చిన్నవాటికి ఆడవాళ్ళ మీద కొప్పడటం, విమర్శించడం, తిట్టడం వంటివి చేయకూడదు. ఆ సమయంలో మరీ సున్నితంగా ఉంటారు చాలా తొందరగా బాధపడిపోతారు.  విశ్రాంతి ఆవశ్యకత తెలుసుకోవాలి!! ఇటీవల కాలంలో నెలసరి అయితేనేం, సాధారణ రోజుల్లానే గడిపేయచ్చు ఇదిగో ఈ ఎనర్జీ డ్రింక్, ఇదిగో ఈ టాబ్లెట్స్, ఇవిగో ఈ సానిటరీ పాడ్స్ అంటూ ఎన్నో యాడ్స్ టీవీ లలో వస్తుంటాయి. ఇంకా సామాజిక మాద్యమలలో కూడా దీని గురించి ఓ తెగ చర్చిస్తారు. నెలసరిలో ఆడవాళ్లు అన్నీ చేయచ్చు అని ఊదరగొడతారు. అయినా నెలలో మూడు రోజులు శరీరంలో కలిగే మార్పులతో ఎంత దృఢమైన ఆడవాళ్లు అయినా ఎంతో కొంత మానసికంగా ఇబ్బంది పడుతున్నపుడు ఆ మూడు రోజులను ఆడవారి విశ్రాంతికి వదిలేస్తే ఏమి నష్టం వస్తుంది ఈ సమాజానికి. ప్రతి ఇంట్లో మగవాళ్ళు ఆ మూడు రోజులు కూడా ఎలాంటి పని చేసుకోలేక పేలుతున్న ప్రసంగాలేనా మహిళలు ఆ రోజుల్లో కూడా అన్ని చేయవచ్చు అని చెప్పడం వెనుక ఉద్దేశం. శరీరంలో మార్పులు కలిగే ఆ మూడురోజులు శరీరానికి కష్టం లేకుండా విశ్రాంతి ఇవ్వడం వల్ల మిగిలిన రోజులను ఎంతో ఉల్లాసంగానూ, మరెంతో చురుగ్గానూ గడిపేయచ్చు. ఇంకా మరొక ముక్కలో చెప్పాలంటే ఒక వెహికల్ ను రిపేర్ చేయిస్తూ డ్రైవ్ చేయడం చేస్తామా?? లేదు కదా. అలాంటిదే ఇది కూడా.  ఆరోగ్యం విషయంలో తోడ్పాటు!!  ఆరోగ్యం ఎప్పుడు ఎలా దెబ్బతింటుందో చెప్పలేం. ముఖ్యంగా మహిళలకు వచ్చే సమస్యలలో 90% ఈ నెలసరి క్రమం తప్పడం, హార్మోన్ల సమస్యలు, మానసిక ఒత్తిడి వంటి వాటి వల్లనే వస్తాయి. కాబట్టి మహిళలు నెలసరి విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటే అంత ఆరోగ్యంగా ఉండగలుగుతారు.  ఆహారం ఔషధం!! నెలసరి సమయంలో కోల్పోయే రక్తం తిరిగి అభివృద్ధి చెందడానికి ఐరన్ పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే ప్రోటీన్లు, విటమిన్లు అన్ని కూడా తాజా పదార్థాల నుండి లభ్యమయ్యేలా జాగ్రత్త తీసుకోవాలి. ఇవన్నీ తెలుసుకున్నాక  మహిళలకు ఆ మూడు రోజులు తోడ్పాటు అందిస్తామని మీకు మీరు ప్రామిస్ చేసుకోండి. ఆ మాట మీద నిలబడి సపోర్ట్ ఇవ్వండి. మీ ఇంటి మహాలక్ష్ములు నెలసరిని ఒత్తిడి లేకుండా దాటేస్తారు.  ◆ వెంకటేష్ పువ్వాడ

read more
గర్భస్రావానికి 24 వారాలు...

గర్భస్రావానికి 24 వారాలు... ' ఇక మహిళలు గర్భస్రావానికి 24 వరాలు మాత్రమే గడువు విదిస్తూ కేంద్రం ఎం టి పి చట్టం 19 71 ని సవరించింది.ఈ మేరకు టెర్మినేషన్ ఆఫ్ ప్రేగ్నేన్చి చట్టం 2౦21 ని సెప్టెంబర్ 24 నుండి అమలు లోకి తెచ్చింది. గతం లో ఉన్న 1971 ఎం టి పి ప్రకారం గర్భస్రావానికి 2౦ వరాలు మాత్రమే గడువు ఉండగా దీనిని సవరిస్తూ మరో నాలుగు వారాలు గడువును పెంచింది. అయితే గర్భ శ్రావం చేసుకోడానికి గల కారణాలను సూచిస్తూ ఎవరు గర్భ స్రావాన్ని చేసుకో వచ్చో చట్టంలో పేర్కొంది.ముఖ్యంగాలైంగిక దాడులకు గురి అయిన వారు.  మానభంగానికి గిరి అయిన వారు.మైనర్లు అంగవైకల్యం గల మహిళలు. మానసిక రోగులు,ఎవరైతే మానసిక సమాస్యలతో బాధ పడుతున్నారో.ఆయా సందర్బాన్ని బట్టి గర్భం లో ఉన్న పిండాన్ని తొలగించడం ప్రమాదం తో కూడుకున్నదని ఒక్కో సారి ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని సవరణ చట్టం లో పేర్కొన్నారు.కాగా సవరణ చట్టం లో ఎవరైతే పిల్లలు శారీరకంగా మానసిక తీవ్ర అంగ వైకల్యం తో బాధ పడుతున్నారో,లేదా ఇతర అనారోగ్య సమస్యల తో బాధ పడేవారు,వివాహం లో ఇబ్బందులు,ఆతరువాత వచ్చిన మార్పు పరిణామాల నేపధ్యం లో అవాంచిత గర్భం వచ్చినప్పుడు అది తీవ్ర సమస్యగా మారవచ్చు. ఆసమయంలో అత్యవసరంగా గర్భ శ్రావం చేయాల్సి వస్తే చట్ట ప్రకారం వారు గర్భ శ్రావం చేసుకో వచ్చని కేంద్రం చట్టం లో పేర్కొంది.వైద్య పరంగా గర్భస్రావం టెర్మినేషన్ ఆఫ్ ప్రేగ్నేన్చి యాక్ట్ 2౦21 సెప్టెంబర్ 24 నుండి అమలు లోకి వస్తుందని చట్టం లో పేర్కొన్నారు. 

read more
గర్భిణులు వీటిని ఎక్కువగా తీసుకుంటే..

గర్భిణులు వీటిని ఎక్కువగా తీసుకుంటే..   పుట్టబోయే పాపాయి ఆరోగ్యంగా అందంగా పుట్టాలని కాబోయే అమ్మలు ఎంతో ఆశగా ఎదురుచూస్తారు. నెలతప్పిన నాటి నుంచి ప్రసవమై పాపాయి చేతుల్లోకి వచ్చేవరకు ప్రతి క్షణం కడుపులోని బిడ్డకోసమే పరితపిస్తారు. బిడ్డ ఆరోగ్యానికి కావల్సిన ఆహారం తీసుకుంటూ.. డాక్టర్లు చెప్పిన మందులన్నీ క్రమం తప్పకుండా వేసుకుంటారు.  అయితే కొందరు పాపాయి పరిమితికి మించి తీసుకునే మందుల వల్ల మంచి కన్నా చెడే ఎక్కువగా జరుగుతుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. గర్భిణులు విటమిన్ ఎ సప్లిమెంట్లు ఎక్కువగా తీసుకుంటే పిల్లలు వికారంగా పుట్టే ప్రమాదం ఉందని వైద్యపరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఇలాంటి శిశువుల్లో క్యాన్సర్ కారకాలు చేరే ప్రమాదం కూడా ఉంది. విటమిన్ ఎ సప్లిమెంట్స్  ఎక్కువగా తీసుకునే గర్భిణిలకు పుట్టే శిశువులకు పుట్టుకతోనే శారీరకలోపాలు, అనారోగ్య సమస్యలు ఉంటాయి.  అలాగే  బీటా కెరోటిన్‌ ను పరిమితికి మించి తీసుకుంటే చిన్నారుల్లో ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.    కొంతమంది మహిళలు చర్మ సౌందర్యం కోసం ‘విటమిన్‌ ఇ’ సప్లిమెంట్లు తీసుకుంటారు. అయితే ప్రతి రోజూ క్రమం తప్పకుండా  విటమిన ఇ తీసుకునే వాళ్లకి ‘ఆల్కాజ్‌ మొటాలిటీ’...అంటే ఏ ఆరోగ్య సమస్యతోనైనా ప్రాణాలు కోల్పోయే అవకాశాలు పెరుగుతాయి. ఇందుకు కారణం విటమిన్‌ ఇ సప్లిమెంట్లను వాడటం వల్ల శరీరంలో టాక్సిసిటీ పెరుగుతుంది. రోజుకి 30 మైక్రో యూనిట్ల విటమిన్‌ ఇ మాత్రమే అవసరం. ఇంతకు మించితే శరీరంలో టాక్సిసిటీ పెరుగుతుంది. అయితే గర్భిణులు వీటిని వేసుకోకపోవడమే అన్ని విధాల మంచిది. అయితే తప్పనిసరై విటమిన్ ఇ తీసుకోవల్సి వస్తే  టాబ్లెట్ గా కాకుండా నేరుగా చర్మం అప్లై చేసే వాటిని వాడటం మంచిది. దీని వల్ల శరీరంలో టాక్సిసిటీకి అవకాశం ఉండదు పైగా మంచి ఫలితం కూడా ఉంటుంది.   మనకు రోజు మొత్తానికి సరిపడా ‘విటమిన్‌ డి’తో కలిసిన క్యాల్షియం పరిమాణం 600 నుంచి 800 మైక్రో యూనిట్లు. గర్భిణులు కూడా క్యాల్షియంను ఇదే పరిమాణంలో తీసుకోవాలి. శరీరానికి కావల్సిన క్యాల్షియం ఆహారం ద్వారా తీసుకోగలిగితే అదనంగా సప్లిమెంట్ల అవసరం ఉండదు. కాల్షియం, విటమిన్‌డి ఎక్కువగా తీసుకుంటే ‘హైపోకాల్సీమియా’ సమస్య  ఉత్పన్నం అవుతుంది. అంటే శరీరంలో కాల్షియం నిల్వలు పేరుకుపోయి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడవచ్చు. ఇతర అనారోగ్య సమస్యలు రావచ్చు.   బీ కాంప్లెక్స్‌: బి1, బి2, బి6, బి12 అనే ఎన్నో రకాలు ఉంటాయి. వీటన్నింటినీ మల్టీవిటమిన్ గా చాలావరకుతీసుకుంటారు. అయితే ఆహారంగా తేలికగా లభించే బి కాంప్లెక్స్ ఎక్కువగా తీసుకోవాలి. శరీరానికి అవసరమైన దాంట్లో కేవలం యాభై శాతం మాత్రమే సప్లిమెంట్స్ గా మిగతా యాభై శాతం ఆహారం ద్వారా తీసుకుంటే మంచిది. అయితే గర్భిణులు బీ కాంప్లెక్స్‌  సప్లిమెంట్స్  ఎంత మేరకు వాడాలి అన్నది డాక్టర్ సూచన ప్రకారమే వేసుకోవాలి. విటమిన్లు ఆరోగ్యానికి మంచివే అయితే పరిమితి మించితే పాపాయి ఆరోగ్యానికి ముప్పు తేస్తాయి. డాక్టర్ సలహా లేనిదే ఏ మాత్రలు వాడవద్దు. పొగతాగే అలవాటు, మద్యం సేవించే అలవాటు ఉండే వారికి పుట్టబోయే పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. ఆరోగ్యవంతమైన పిల్లలు కావాలనుకునే మహిళలు దురలవాట్లకు దూరంగా ఉండాలి. నెల తప్పగానే చాలామంది మహిళలు బెడ్ రెస్ట్ అంటూ పూర్తిగా రెస్ట్ తీసుకుంటారు. ఇది సరి కాదు. కాబోయే అమ్మల శారీరక వ్యాయామం, మానసిక ఆనందం కడుపులోని బిడ్డను ఆరోగ్యంగా ఉంచుతుంది. తేలికపాటి పనులు చేయడం, మంచి పుస్తకాలు చదవడం, సంగీతం వినడం, పాజిటివ్ గా ఆలోచించడం వల్ల పాపాయి ఆరోగ్యంగా పెరుగుతుంది.

read more
లింగ వివక్షతో అమ్మాయిలను హత్య చేస్తున్నారు...

లింగ వివక్షతో అమ్మాయిలను హత్య చేసారు...   లింగ వివక్షతో4.7 మిలియన్ల బాలికలను హత్య చేసారు.జన్మ  నివ్వకుండా చంపేశారు. కొడుకు పై ఉన్న వ్యామోహం తల్లి గర్భంలో నుండి బయటకు రాకుండా అంటే ఈప్రపంచం లోకి రాకుండానే బ్ర్రోన్న హత్యకు గురి అయ్యింది.ఆడపిల్లకు జన్మనివ్వకుండా అబార్ షాన్ చేసుకున్న తల్లి తండ్రుల ను చూసి సిగ్గు తో తలవంచుకోవాలి.సమాజం మారింది ఆధునిక త భావాలు విద్యావంత్తులైన వాళ్ళు విచక్షణ తో ఆలో చిస్తారని భావించిన ప్పటికి ప్రపంచంలో  ఆడపిల్లల పుట్టుజను అడ్డుకోడం అన్నది మహాపాపం అని అంటారు.ఈ పాపాల పట్టికలో మొదటి రెండు స్థానాలాలో చైనా భారాత్ లు ఉండడం విశేషం.మనది ఖర్మ భూమి అని పుణ్య భూమి అని చెపుతారు .యత్ర నార్యస్తు - పూజ్యంతే,త్సత్ర దేవత రమంతే అని మన ఉపైశాత్తులులలో పేర్కొన్నారు. అంటే దాని ఆర్ధం ఎక్కడైతే స్త్రీలు పూజిమ్పబడ తారో అక్కడ దేవతలు నాట్యం చేస్తారు.లేదా దేవతలు నివాసం ఉంటారు.అని కానీ అన్డుజు భిన్నంగా దేశంలో ఆడ బిడ్డలను పురిట్లోనే చ్చంపెస్తున్న ఘటన వెలుగు చూడడం మనమందరం సిగ్గుతో తలవంచుకోవాల్సిన విషయం అని చెప్పక తప్పదు. ఇది ఆరోపనా మాత్రం కాదు ప్రపంచవ్యాప్తంగా జరిపిన  సర్వేలో వెలువడ్డ పచ్చి నిజం. కొన్ని దేశాలలోని సంఘాలు మగ పిల్లకే అధిక ప్రాధాన్యతను ఇవ్వడం ఆడపిల్లపట్ల వివక్షచూపడం దురదృష్టకరం. మగపిల్లలు అయితే ముద్దు ఆడపిల్ల అయితే వద్దు అన్న ఆలోచన 197౦ లోనే పురుడుపోసుకుంది.మగపిల్లలను మరీ ఎంపిక చేసుకుని ఆడపిల్ల అని తెలియగానే బ్రూణ హాత్యలకు పాల్పడం అబార్షన్ చేయించుకున్న తల్లి- తండ్రులు నిర్ణయం తీసుకున్న ఫలితం నేడు కనిపిస్తుంది.అని నేడు ఆడపిల్లల కొరత ఏర్పడుతోందని అది పురుషులకు అనుగుణంగా  నిర్ణయాలు జరుగు తున్నాయని అంటున్నారు విమర్శకులు. ఇలాంటి వివక్ష దుస్థితి నేటికి చాలా దేశాలలో కొనసాగుతోంది.ఒక నూతన పరిశోదన లో అంచనా ప్రకారం దాదాపు 4.7 మిలియన్ల బాలికలను ప్రపంచ వ్యాప్తంగాకోల్పోయామని.ఇది 2౦3౦ నాటికి 21 ౦౦ అంటే సతాబ్దానికి డని సంఖ్య 22 మిలియన్లు పెరిగినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని ఈ పద్ధతి ఇలాగే కొనసాగే అవకాసం ఉందని దీని పరిశోదనలు చేస్తున్న శాస్త్రజ్ఞులు పురుషులే   అధిక సంఖ్యలో ఉంటె పెళ్ళిళ్ళు జరుగు తయా లేదా అన్నది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పురుషులే అధిక సంఖ్యలో ఉండడం మూలంగా సంఘ వ్యతిరేఖ శక్తులుగా మారే అవకాసం ఉందనిఒకరకమైన వైలెన్స్ ఏర్పడే అవకాసం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.కాగా యు ఎన్ ఓ ఇప్పటికే పిల్లలను ఎంపిక చేసుకుని జన్మ నిచ్చే విషయంలో ఇది అత్యంత ప్రమాదకర ప్రక్రియ గా పేర్కొంది.స్త్రీ పురుషుల వివక్ష చూపడం అన్యాయమని పేర్కొంది. 2౦2౦ న యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ స్టేట్స్ లో ఈ అంశాన్ని ప్రచురించింది.తమకు పుట్టిన బిడ్డ  మగబిడ్డ ఆడబిడ్డ అన్న విషయాన్ని స్కాన్ లో తెలుసుకుని మరుక్షణం కొడుకతే ముద్దు ఆడపిల్లైతే వద్దు అని అనుకుంటున్నారేమో.మగపిల్ల వాడికి ప్రాధాన్యత  లేదా ఆడపిల్లకు జన్మనిచ్చేందుకు నిరాకరించడం వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోలేమన్న భావన కలిగి ఉండడం దురదృష్టకరం. ఒక వేళ ఆడపిల్ల ఉన్నప్పటికీ మళ్ళీ ఆడపిల్ల కాకుండా మగపిల్లవాడి కోసం ప్రయత్నించడంగమనించవచ్చు.మగపిల్ల వాడికోసం ప్రయత్నించడం గమనించవచ్చు.మగపిల్లల పట్ల ప్రేమ చూపడం,మొగ్గుచూపడం వివక్ష చూపడం అత్యంత ప్రమాదకరమని రచయితలు నిశితంగా విమర్శించారు. 197౦ -2౦ 17 మధ్యలో జరిగిన పరిశోదనలో 45 మిలియన్ల ఆడపిల్లలను పుట్టకుండానే మరణించారని తల్లి తండ్రుల ఎంపిక ప్రకారం జరిగిందని పేర్కొన్నారు.ఇలా ఆడపిల్లలు పుట్టకుండా మిస్ అయిన ఘటనలో జాబితాలో 95% ఎక్కువకేసులు చైనా భారాత్ లోనే జరగడం ఆస్చార్యాన్ని కలిగిస్తుంది. కొంత మంది శాస్త్రజ్ఞులు 1 2 దేశాలాలో జననాల పై రేషన్ విధించినట్లు సమాచారం.మరల 4.7 మిలియన్ల ఆడపిల్లలు జన్మకు నోచుకోక  పోవడం అలాగే పురుషులకు అధిక సంఖ్యలో జన్మ నిచ్చారని అంచనా. గతంలో జరిగిన ఘటనలు బాలురు బాలికల పుట్టుక పై వివక్ష చూపడం వల్ల పురుషులు అధిక సంఖ్యలో ఉండడం వల్ల కొందరు కొందరు ఫిమేల్ గా మార్పిడులు చేయించుకున్న ఘటనలు చూసాం సెక్స్ మార్పిడికి పాల్పడడం లేదా హోమో సెక్స్ పెర్సానాలితీకి మారడం వంటి ఘటనలు విన్నాం.ఒకో సారి స్త్రీలు వద్దనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.చైనా భారాత్ లో ఈ పరిస్థితి కి దారి తీస్తుందని యు ఎన్ ఆ నివేదికలో పేర్కొంది. ఈ రకమైన ఆలోచన హానికారక మై నప్పటికీ రచయితల అభిప్రాయం ప్రకారం  21౦ ౦ నాటికి పురుషుల సంఖ్య తగ్గి  ఆడపిల్ల పుట్టుక మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని అవిదాదాపు 5.7 మిలియన్లకు చేరవచ్చు.అని తేల్చి చెప్పారు. రానున్నది బహాయంకరం కలామేనా?----- రానున్నది అత్యంత భయంకరమైన కాలంగా పేర్కొన్నారు రానున్న భావిష్యత్తు  ఊహించుకోజలమని ఆడపిల్లల కొరత కారణంగా ఈ కొరత ప్రపంచం మొత్తంలో 2 2 మిలియన్లుగా చేరవచ్చని అంచనా వేస్తున్నారు.శతాబ్దం చివరికి మరో 17 దేశాలు స్త్రీపురుషుల వ్యత్యాసం పెరిగే అవకాసం ఉందని మగ ఆడపిల్లల మధ్య రేషియో మరింత పెరిగే అవకాసం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పుట్టుకలలో సెక్స్ రేషియో కొంత పెరిగి తగ్గినప్పటికీ చాలా ఘటనలు తీవ్రంగా ఉండవచ్చు.ఇతర దేశాల పై ప్రభావం పడే అవకాసం ఉంది. పాకిస్తాన్ నైజీరియా కు చెందిన డాక్టర్ ఫ్రెంగ్క్యూయింగ్ చావు స్టేటస్ తేశియన్ కింగ్ అబ్దుల్లా యూనివెర్సిటి సైన్స్ అండ్ టే క్నాలజీ మక్కా సౌదీ అర్రేబియా కు చెందినా మరికొంతమంది రచయితలు పాల్గొన్నారు. డాక్టర్ చావ్ సాస్త్జ్హరగ్నుల ద్వారా అంచనా వేయగల మోడల్స్ యునైతేడ్నేషన్స్ పోపులేషణ్ విభాగం న్యూయార్క్.జాతీయ విశ్వ విద్యాలయం  సింగపూర్ సెంటర్ డి సైన్స్ హ్యుమన్స్ డిల్లి,మసాచూత్స్ వ్విశ్వవిద్యలయం వారికి చెందిన డాటాబేస్ 3.26 రికార్డులను 2౦4 దేసాలా నుండి తీసుకున్నారు.ప్రపంచ జనాభాలో 3 వ వంతు  పురుషుల జనాభా అని తేల్చారు. ఆర్ధిక సాంఘిక సామాజిక పర్నమాలపై ప్రభావం చూపిస్తుంది. స్త్రీలు దొరకరు ----- పుట్టుకలలో స్త్రీపురుషులలో వివక్ష బాలికల మరణాలు ఎక్కువ కావడం వల్ల స్త్రీలు తగ్గిపోతారు. సహజంగా పురుషులు ఎక్కువగా ఉంటారు. చాలామంది పురుషులకు భార్యలు దొరకని స్థితి లేదా భార్యలు కోల్పోయే స్థితి.సంఘ వ్యతిరేక శక్తులుగా మారే స్థితి దీర్ఘకలంగానిలదోక్కుకోలేక పోవడం సామాజిక వరూధి సాధించలేక పోవడం.జెండర్ వివక్ష లో స్త్రీపురుషుల మధ్య వ్యత్యాసం నిలువరించేందుకు చట్ట పరంగా కొన్ని నిబందనలు రూపొందించాల్సిన అవదరం ఉంది.  

read more
ఫిట్ నెస్ అవసరమే... కానీ...

  ఫిట్ నెస్ అవసరమే... కానీ...     ఫిట్ నెస్ అవసరమే. ఫిట్ గా ఉండటం కోసం డైటింగ్ చేయడమూ అవసరమే. కానీ డైటింగ్ పేరుతో చేయకూడనివి చేయడం ప్రమాదం. సన్నగా అవ్వాలన్న తాపత్రయంతో కొన్ని పొరపాట్లు చేసి, చిక్కులు కొని తెచ్చుకుంటోన్న అమ్మాయిల సంఖ్య ఈ మధ్య పెరుగుతోందని ఓ తాజా నివేదికలో వెల్లడయ్యింది. దీనికి కారణం డైటింగ్ పట్ల సరైన అవగాహన లేకపోవడమే అంటున్నారు నిపుణులు. మరేం చేయాలి? డైటింగ్ చేయాలనుకుంటే కనుక ముందుగా ఓసారి డాక్టర్ ని తప్పక సంప్రదించాలి. ఎంత బరువు ఉన్నారు, ఎంత తగ్గాలి, ఏయే వ్యాయామాలు చేయాలి, ఏమేం తినాలి... ఇలా ప్రతి ఒక్కటీ డాక్టర్ ని అడిగి తీరాలి. ఎందుకంటే కొందరి శరీరం కొన్ని రకాల వ్యాయామాలను తట్టుకోలేకపోవచ్చు. కొన్ని రకాల ఆహారం కొందరికి మేలు చేయకపోవచ్చు. అందుకే మీ శరరీ తత్వాన్ని బట్టి మీరేం చేయాలనేది డాక్టర్ ని అడిగాకే డైటింగ్ మొదలు పెట్టండి. కొంతమందికి త్వరగా తగ్గిపోవాలన్న ఆతృత ఉంటుంది. దాంతో ఒకేసారి ఎక్కువ డైటింగ్ చేసేస్తుంటారు. అలా చేస్తే మొదటికే మోసం వస్తుంది. ఏదైనా మెల్లగా మొదలుపెట్టి పెంచుకుంటూ పోవాలి. ఒక్కసారిగా ఆహారపు అలవాట్లు మార్చేస్తే నీరసం వచ్చేస్తుంది.  డైటింగ్ అంటే మరీ కడుపు మాడ్చేసుకోనక్కర్లేదు. బలవర్ధకమైన ఆహారాన్ని కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తీసుకోవడమే డైటింగ్. ఘనాహారాన్ని మెల్లమెల్లగా తగ్గించుకుంటూ ద్రవాహారాన్ని మెల్లమెల్లగా పెంచుకుంటూ పోవాలి. అలాగే కొన్ని రకాల ఫ్యాట్స్ ఆరోగ్యానికి మంచిది. వాటిని చెడు చేసే ఫ్యాట్స్ అనుకుని పొరబడి తినకుండా ఉండకండి. ఏది తినాలో ఏది తినకూడదో ముందు క్లారిటీ తెచ్చుకోండి.     కొన్నిసార్లు ఎంత డైటింగ్ చేసినా బరువు తగ్గరు. అలాంటప్పుడు డైట్ ప్లాన్ చేంజ్ చేసుకోవాలి తప్ప వాటినే తింటూ ఉండిపోకూడదు. ఎప్పటికప్పుడు బరువు చెక్ చేసుకుంటూ ఉంటే ప్లాన్ చేంజ్ చేయాలా లేదా అన్నది తెలుస్తుంది. కొందరైతే ఆహారం తగ్గించేసి ప్రొటీన్ షేకులూ, విటమిన్ ట్యాబ్లెట్లూ వేసేసుకుంటూ ఉంటారు. ఆ పొరపాటు ఎప్పుడూ చేయవద్దు. ఆహారాన్ని ఏదీ రీప్లేస్ చేయలేదన్న విషయాన్ని మర్చిపోకండి. చాలామంది చేసే తప్పేంటంటే... డైటింగ్ పేరుతో అన్నీ కంట్రోల్ చేసేస్తారు. ఆ తర్వాత దేనికో టెంప్ట్ అయ్యి తినేస్తుంటారు. ఇలాంటప్పుడు ఎక్కువ చెడు జరుగుతుంది. తినకూడదు అనుకున్నవాటి జోలికి అస్సలు వెళ్లకండి. లేదంటే డైట్ కంట్రోల్ చేసి ఉపయోగం ఉండదు. ఫ్రెండ్స్ బలవంత పెట్టారనో, ఇంట్లో పార్టీ ఉందనో కాంప్రమైజ్ అయిపోతే ఇక అంతే. నిజానికి ఎంత మెల్లగా తగ్గుతారో అంత వేగంగా బరువు పెరుగుతారు. అది ఎప్పుడూ మనసులో ఉంచుకోవాలి. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది విశ్రాంతి, నిద్ర. డైటింగ్ చేసేవాళ్లకు కచ్చితంగా విశ్రాంతి ఉండాలి. నీరసంగా ఉందని ఒళ్లు మొరాయిస్తున్నా వ్యాయామం చేసేయడం, తిండి తినకుండా పని చేసేయడం వంటివి చేయకండి. అంతేకాదు... కంటికి సరిపడా నిద్రపోవాలి. లేదంటే ఆరోగ్యం దెబ్బ తింటుంది. నిజంగా ఫిట్ గా ఉండాలంటే ఈ తప్పులేవీ చేయకండి. డైటింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండండి. చక్కని ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి. లేదంటే ఏదో అనుకుంటే ఏదో అవుతుంది. తర్వాత బాధపడాల్సి వస్తుంది.  

read more
మందులే కదా అని మింగేయకండి!

మందులే కదా అని మింగేయకండి!        పెయిన్ కిల్లర్... ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయంలో వేసుకోవాల్సి వస్తుంది. అయితే పెయిన్ కిల్లర్స్ విషయంలో చాలామంది చేసే తప్పు... మళ్లీ మళ్లీ వేసేసుకోవడం. ఒక ట్యాబ్లెట్ వేస్తే నొప్పి తగ్గింది కదా అని ఎప్పుడు నొప్పి వచ్చినా అదే ట్యాబ్లెట్ వేసేసుకుంటూ ఉంటారు. అది ఎంత ప్రమాదమో ఊహించరు. నిజానికి ఈ మందులు వెంటనే ఉపశమనాన్ని ఇస్తాయి. కానీ మోతాదు మించితే చెప్పలేనని సమస్యలు తెచ్చిపెడతాయి. పొట్టలోని లోపలి పొరలు, రక్తనాళాల్ని దెబ్బ తీస్తాయి. మూత్రపిండాల్లోని నాళాలు కూడా దెబ్బ తింటాయి. కొందరిలో అయితే హై బీపీ వస్తుంది. గుండె పనితీరుపై ఒత్తిడి పెరిగి గుండె జబ్బులు వచ్చే ప్రమాదమూ ఉంది. అలాగే రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడే ప్లేట్ లెట్స్ దెబ్బ తింటాయి. ఇది ఒక్కోసారి తీవ్ర ప్రమాదానికి దారి తీస్తుంది. ఇవి మాత్రమే కాక.. నిద్ర పట్టకపోవడం, పీడకలలు రావడం, నోరు ఎండిపోయి అస్తమానం దాహం వేయడం, మలబద్దకం, కళ్లు తిరగడం, వికారం, వాంతులు, ఊరకే అలసిపోవడం వంటి రకరకాల సమస్యలు మొదలవుతాయి. ఇవి మందుల వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ అని తెలియక చాలామంది హైరానా పడిపోతుంటారు.  కాబట్టి పెయిన్ కిల్లర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ ని అడక్కుండా ఎలాంటి పెయిన్ కిల్లర్ వాడకండి. డాక్టర్ కనుక వాడమని ఏదైనా మందు రాస్తే ఎంత మోతాదు వాడాలి, ఎప్పుడెప్పుడు వాడాలి వంటి వివరాలు తప్పకుండా అడిగి తెలుసుకోండి. మందులు కొనేటప్పుడు ఎక్స్ పయిరీ డేట్ తప్పకుండా చూసుకోండి. షీట్ మీద సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఏమైనా రాశాడేమో బాగా చదవండి.  పరగడుపున పెయిన్ కిల్లర్ ఎప్పుడూ వేసుకోవద్దు. అలాగే వేసుకున్న తర్వాత వీలైనంత ఎక్కువ నీరు తాగాలి. మందు వేసుకున్న తర్వాత ఏదైనా సైడ్ ఎఫెక్ట్ వస్తే డాక్టర్ కి తప్పకుండా చెప్పాలి. ఒకవేళ అది మీకు పడదు అనుకుంటే వెంటనే మారుస్తారు. అలాగే పడని ఆ మందు పేరును ఎక్కడైనా రాసి పెట్టుకోండి. ఎప్పుడైనా ఏ డాక్టరైనా పొరపాటున ఆ మందు రాస్తే మళ్లీ వాడేయకుండా జాగ్రత్త పడొచ్చు. అలాగే కోర్సు వాడటం పూర్తయినా సమస్య తీరకపోతే మళ్లీ డాక్టర్ దగ్గరకు వెళ్లండి తప్ప మీ అంతట మీరే కోర్సును కంటిన్యూ చేసేయొద్దు.  ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే పెయిన కిల్లర్ తో ఏ సమస్యా ఉండదు. కానీ నిర్లక్ష్యం చేశారో... ప్రాణాలో పోసే మాత్రలే ప్రాణాల మీదికి తీసుకొస్తాయి గుర్తుంచుకోండి.  -Sameera

read more
యాంటీ బాయిటిక్స్‌తో జాగ్రత్త!

యాంటీ బాయిటిక్స్‌తో జాగ్రత్త! సగానికి సగం మంది మహిళలకి తప్పుడు యాంటీ బాయిటిక్స్ఎందుకు ? నూతనంగా జరిగిన పరిశోధనలో సగానికి సగం మంది మహిళలు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ లకు తప్పుడు యాంటి బాయిటిక్స్ ఇచ్చినట్లు గమనించామని అన్నారు. ఇలా చాలా సార్లు చేసినట్లు తెలుస్తోంది. ల్యాబ్ రి పోర్ట్లు రాకముందే  మందులు ఇచ్చినట్లు సమాచారం. మహిళలు ఎవరైతే యోరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తో సత మత మౌతున్నారో యూరిన్ కల్చర్ టెస్ట్ చేయించి రిపోర్ట్ వచ్చిన తరువాతే యాంటీ బాయిటిక్స్ తీసుకోవాలే తప్ప ముందుగా కాదని సూచించారు. సగానికి సగం మంది మాహిళలు.యురినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ మొదలైన వెంటనే తప్పుడు యాంటీ యాంటీ బాయిటిక్స్ వాడడం గమనించామని ఇటీవలి జరిగిన పరిశోదనలో వెలుగు చూసింది.వాషింగ్ టన్  యూనివర్సిటీ సెంట్ లూయీస్ జర్నల్ లో ప్రచురించింది. ఇన్ఫెక్షన్ కంట్రోల్ వ్యాస్టిటూల్ ఎపిడమాలజీ ఆఫ్ సొసైటీ ఫర్ హెల్త్ కంట్రోల్ ఎపిడమాలజీ ఆఫ్ అమెరికా యురినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ పై ప్రజలు పోరాడు తున్నారని యాంటీ బాయిటిక్స్ ఇన్ఫెక్షన్ పై వినియోగం పై పరిశోదనలు అవసరమని నిపుణులు పేర్కొన్నారు. యాంటీ బాయిటిక్స్ చాలా ప్రమాదకరమని మందులు చాలా అలోచించి వేరొకరి సలహా  సంప్రదించాలని భావిస్తే తప్పకుండా సలహా  తీసుకున్న తరువాతే  మందులు తీసుకోవాలని డాక్టర్ కతేరినే కంప్బెల్ అన్నారు. ఎం పి హెచ్ డైరెక్టర్ ఆఫ్  లేబర్ హెల్త్ అండ్ బర్త్ మెటర్నల్ స్పెషల్  కేర్ యాలె న్యూ హిస్పిటల్కనెక్టెడ్ యంటిబాయిటిక్స్ రెసిస్టన్స్ ఉండాలని అంటే యంటి బాయిటిక్స్ తీసుకున్న తట్టుకునే శక్తి ఉండాలని  అన్నారు. ఈ మధ్య కాలం లో జరిగిన పరిశోధనలో పట్టణ, గ్రామీణ ప్రాంతాలాలో యాంటీ బాయిటిక్స్ వాడడం వల్లే వచ్చే మార్పులపై పరిశోదన చేయాలని ప్రణాళిక రూపొందించారు ఈ అంశం పై పరిశోధన చేస్తున్న శాస్త్రజ్ఞ్యులు ఒక ప్రాంతంలో మించి మారో ప్రాంతం లో ఉంటున్నాయని సమస్య ప్రస్తుత్తం బోర్డు పరిదిలో ఉందని తేల్చారు. దాదాపు 67౦-45౦ మంది మాహిళలు ఈ పరిశోదనాలో పల్గోన్నారని యాంటీ బాయిటిక్స్ తీసుకున్న వారే అని దీర్ఘకాలం పాటు యాంటి బాయిటిక్స్  వాడిన వారే అని పరిశోధకులు వెల్లడించారు. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్  సహాజంగా వచ్చే సమస్యే అని యాంటి బాయిటిక్స్ ఇవాల్సిన  అవసరం ఉందని ఆరోగ్యవంతమైన జనాభాకు వారిని గుర్తించాలని వారికీ సరైన వారికీ సరైన మార్గ దర్సకాలు సూచించాలని అసి స్టెంట్ట్ ప్రొఫెసర్ మెడిసిన్ సర్జరీ వాషింగ్ టన్ యునివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్  మాట్లాడుతూ అయినప్పటికీ గ్రామీణ పట్టణ ప్రాంతాలలో ఎక్కువగా వాడు తున్నారన్నా రన్న విషయాన్ని గమనించామని అన్నారు. యాంటి బాయిటిక్స్ ఇమ్పోటేంట్ మారుస్తుందని అన్నారు. అంటే దీని ఆర్ధం లక్షణాలను అభివృధి ని నియంత్రిస్తుందని నిపుణులు ఆభిప్రాయ పడ్డారు. ఈ మందు ల వాడకం వల్ల దీర్ఘకాలం తరువాత ప్రభావం చూపిస్తాయని అన్నారు. ఈ విషయంలో డాక్టర్ ఫెలిస్ గేర్నిష్ వేల మందికి చికిత్చ చేసినట్లు తెలిపారు. కాలిఫోర్నియా కు చెందిన డైరెక్టర్ ఇంటి గ్రెటివ్ మెడికల్ గ్రూప్ కు చెందిన ఈమె మైక్రోబ్లోంను  ఇబ్బంది పెడు తున్నదని ఆమె అన్నారు. స్త్రీలలో మాత్రమే అలా ఎందుకు జరుగుతుంది? అన్నప్రస్నకు  సమాధానంగా  డాక్టర్లు దీమిమి అర్ధం చేసుకోడంలో సంరక్షిన్చుకోడం లో విఫల మౌతున్నారని గర్నేష్ అన్నారు. లేదా వివిధ రకాల కంబి నేషన్ లో ఇచ్చే మందులు ఇవ్వడం వల్ల కారణం కావచ్చని. యురినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ యురిన్ కల్చర్ తరువాత చికిత్చ చేయాలని సూచించారు. యాంటి బాయిటిక్స్ అదేపనిగా వాడితే అయాప్రాంతలాలో తక్కువ ప్రభావం చూపుతాయని  నిపుణులు విశ్లేషించారు. ఉదాహరణకు అమాక్షొలిన్ మందు ను గేర్ష్ పేర్కొన్నారు. మొదట్లో ఆ మందు పని చేసిందని ఇప్పుడు ఆ మందు పెద్దగా ప్రభావ వంతంగా పని చేయడం లేదని ఇన్ఫెక్షన్ సృషించే స్ట్రైన్  మరింత బలంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితిలో ఉత్పత్తిదారులు కొన్ని పరిస్థితులు ఎదురౌతున్నాయని. అన్నారు' యాంటి బాయిటిక్స్ ను తట్టుకో గలిగే శక్తి రోగులకు ఉండాలని ఆవిధంగా ఉత్పత్తులు ఉండాలని అన్నారు.. అయితే చికిత్చ ఒక్కోసారి విఫలం అయ్యే అవకాశం ఉందని అభిప్రాయ పడ్డారు. యాంటి బాయిటిక్ తట్టు కునేందుకు ఆరోగ్య సంరక్షణ ఖర్చుతో కూడుకున్నదని పేర్కొన్నారు. ఈ పరిశోదన మంచి ఫలితాలు  ఇచ్చిందని ఆశాభావం వ్యక్తం చేశారు. యురినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ లు రకరకాల బ్యాక్టీరియా ఉంటుందని అది ఎదో తెలుసుకోవాలని  అప్పుడే ఏ యాంటీ బాయిటిక్స్ పని చేస్తాయో నిర్ణయించడం అసాధ్యమని.అన్నారు.  యురిన్ కల్చర్ చేసిన మూడు రోజులలో  బ్యాక్టీరియా ల్యాబ్ లో తెలుస్తుందని స్పష్టం చేసారు. యురినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్  చాలా సింపుల్ అయితే కిడ్నీ సమస్య కూడా ఉంటె సమస్య తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు  విశ్లేషించారు. ఈ పరిశోదన లో స్త్రీలు యు టి ఐ ద్వారా వచ్చే సమస్యలు మరింత తీవ్రం కాకూడదన్నదే లక్ష్యమని దీని ఆధారంగా నే ఏ యాంటీ బాయిటిక్స్ వినియోగించాలో నిర్దారిస్తామని అన్నారు. యాంటీ బాయిటిక్స్ కిడ్నీ పై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అన్న సందేహం వెలిబుచ్చారు. ఆర్ధిక ఇబ్బందుల వల్లే తిరిగి చికిత్స చేయించుకోలేక పోతున్నారనిఅన్నారు . చికిత్చ తీసుకోవాలా వద్ద అన్న ఆలోచనలో రోగులు ఉన్నరాని అన్నారు ఈ విధానంలో మార్పు తీసుకు రావాలని నిపుణులు అభిప్రయా పడ్డారు. ఇమ్యునిటీ విషయంలో ఏ మాత్రం సర్దుకు పోయినా గర్భం దాల్చిన సమయంలో సరైన చికిత్చ చేయక పోయినా సమస్యే అని హెచ్చరించారు. సరైన సమయం వచ్చే వరకు నిరీక్షించక తప్పదని అన్నారు.యురినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కు యాంటీ బాయిటిక్స్ ఇచ్చిన వారిపైన తీసుకున్న వారిపైన చార్యాలు తీసుకోవాలి? ఎవరిని మనం అనుమానించాలి? యురినరీ ట్రాక్ లక్షణం సత్వరం గుర్తించాలి. యూరిన్ కు ఎన్నిసార్లు వెళుతున్నారు? మూత్ర విసర్జన  చేసేటప్పుడు నొప్పి ఉంటుందా? ముఖ్యంగా యురిన్ కల్చర్కు ఒత్తిడి చేయండి. యురిన్ కల్చర్ వల్ల ఎటువంటి బ్యాక్టీరియా ఉందొ తెలుస్తుంది. అవసర మైన పక్షంలో మళ్ళీ మళ్ళీ పరీక్షాలు చేయించండి. కొద్ది సేపు వేచి చూడండి. వెంటనే చికిత్స చేయాల్సిన అవసరం లేదు. ఈసమస్యవంద సంవత్సరాలుగా  ఉంది ఉండవచ్చు. దీని వల్ల చనిపోరు దీనికోసం యురిన్ కల్చర్ రిపోర్ట్స్ వచ్చేవరకు హెర్బల్ రేమిదీస్ చేయించు కోవచ్చు సహజంగా శరీరంలో అవయవాలు వాటికీ అవే చికిత్చ  చేసుకుంటాయి ఈ పరిశోదన కేవలం మంచి చికిచ అందించాలన్నదే మాప్రయత్నం అని అంటున్నారు నిపుణులు. ఆతిగా యాంటీ బాయిటిక్స్ వాడితే అంతే.

read more
గర్భిణులు.. ఆస్తమా సమస్యలు

గర్భిణులు.. ఆస్తమా సమస్యలు స్త్రీలు గర్భిణిగా ఉన్నప్పుడు అస్తమా సమస్య వస్తే లక్షణాలు దృష్టిలో పెట్టుకోవాలి.గర్భస్థ సమయంలో ఆస్తమాకు కారణాలు లక్షణాలు తెలుసుకోవడం అవసరం. గర్భస్థ సమయంలో మహిళలు గర్భం లోని శిశువు ఇద్దరి ఆరోగ్యం పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ సమయం లో ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా అటు బిడ్డ తల్లికి ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. ప్రపంచ ఆస్తమా దినోత్సవం సందర్భంగా గర్భస్థ సమయం లో మహిళలలో అస్తమా సమస్య ఎందుకు వస్తుంది. ఇది ఒక ఊపిరి తిత్తులకు సంబందించిన సమస్య ఈ కారణం గా నే గుండెల్లో నొప్పి,ఊపిరి తీసుకోవడం లో ఇబ్బంది పడడం.దగ్గు వంటి లక్షణాలు చూడ వచ్చు.ఈ సమయం లో ఈ సమస్య గురించి తెలుసుకోవడం అవసరం.ఈ వ్యాసం అస్తమా గర్భిణీలలో లక్షణాలు అందుకు గల కారణాలు ఎలా ఉంటాయి.దీని బారిన పడకుండా తీసుకోవాల్సిన రక్షణ చర్యలు చేపట్టాలో తెలుసుకుందాం. గర్భిణిలో ఆస్తమాకు కారణాలు... స్త్రీలు ఎప్పుడై తే గర్భ ధారణ చేస్తారో గర్భావస్తలో ఉంటారోఆసమయంలో ఈస్ట్రోజన్,ప్రోజేస్టరాన్ హార్మోన్లు చాలా ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి అవుతుంది.ఈస్ట్రోజన్ వల్లే సైనస్ సమస్యలు ముక్కులు మూసుకు పోవడం వంటి సమస్యకు ఈస్ట్రోజన్ కారణం గా పేర్కొన్నారు వైద్యులు.ఊపిరి తీసుకోవాలంటే గర్భిణీలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.ఊపిరి తీసుకోలేక పోవడం లేదా ఊపిరి వదలడం కూడా ఒక్కోసారి ఇబ్బంది పెడుతుంది. ప్రోజేస్టాన్, ఈస్ట్రోజన్ హార్మోన్లు అధిక సంఖ్యలో ఉండడం వల్లే ఊపిరి తీసుకోవడం లో ఇబ్బంది పడుతున్నారని అందుకే గర్భస్థ సమయం లో గర్భిణీలు అస్తమా ను ఎదుర్కోవాల్సి వస్తుంది. గర్భస్థ సమయం లో అస్తమా లక్షణాలు... గర్భస్థ ఆస్తమా ఉన్న వారిలో కింద పేర్కొన్న లక్షణాలు ఉంటాయి.ఊపిరి తీసుకోవడం సమస్యగా ఉంటుంది. గుండెల్లో నొప్పి వచ్చినట్లుగా ఉంటుంది. త్వరగా అలిసి పోతారు. తీవ్రమైన తలనొప్పి . జలుబు దగ్గు తో ఇబ్బంది పడతారు. ఈ లక్ష ణాలు కనిపించిన వెంటనే డాక్టర్ వద్దకు తీసుకు వెళ్ళాలి. అస్తమా నుండి రక్షించుకోవడం ఎలా ?... దుమ్ము,ధూళి కి దూరంగా ఉండాలి.పౌష్టిక ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి. ఒక వేళా గతం లో మీకు శ్వాస సంభందిత సమస్యలు ఉంటె సమయానికి పరీక్షలు చేయించడం తప్పనిసరి. గర్భిణీలు ముఖ్యంగా పరుపెట్టడం,త్వరగా నడిచేందుకు ప్రయత్నం చేయడం చేయడం సరికాదు.లేదా సుదీర ప్రాంతలాకు బైక్ పైన బస్సుల్లో ప్రయాణం చేయకండి అలా చేస్త్ఘే ఏమాత్రం చిన్న దెబ్బ తగిలినా గర్భ స్రావం అవచ్చు. మీరు గర్భిణీగా ఉన్నప్పుడు మీరు డాక్టర్ సలహా లేకుండా మందులు వాడడం కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది.

read more
ఓ స్లీపింగ్ బ్యూటీ బాధ

ఓ స్లీపింగ్ బ్యూటీ బాధ   స్లీపింగ్‌ బ్యూటీ అనే జానపద కథ మనందరికీ తెలిసిందే! ఏళ్ల తరబడి సుదీర్ఘంగా నిద్రపోయే రాజకుమారి గురించిన కథే స్లీపింగ్‌ బ్యూటీ. కథ కాబట్టి వినడానికీ, చదువుకోవడానికీ బాగానే ఉంటుంది. కానీ నిజంగా ఎవరికన్నా అలాంటి అనారోగ్యం ఉంటే... అది భరించేవారికే తెలుస్తుంది. చెదిరిపోయిన కలలు ఇంగ్లండుకి చెందిన బెత్‌ గుడియర్‌ మహా చురుకైనా పిల్ల. ఎలాగైనా చైల్డ్‌ సైకాలజిస్టు కావాలన్నది ఆమె ఆశయం. బెత్‌ తన ఆశయాన్ని సాధిస్తుందనడంలో ఎవరికీ ఏ అనుమానమూ లేదు. ఎందుకంటే బెత్‌ చదువులో చాలా ముందుండేది. ఇదంతా ఐదేళ్ల క్రితం మాట. బెత్‌కి అప్పుడే 17 ఏళ్లు వచ్చాయి. స్నేహితుల మధ్యా, సన్నిహితుల మధ్యా ఆమె పుట్టినరోజు ఘనంగా జరిగింది. కానీ పుట్టినరోజు సంతోషం కొద్ది రోజుల్లోనే ఆవిరైపోయింది. ఓ రోజు బెత్‌ పడుకున్న మనిషి పడుకున్నట్లే ఉండిపోయింది. ఆ రోజు పడుకున్న బెత్‌ దాదాపు ఆరు నెలల వరకు సరిగా నిద్ర లేవనే లేదు.   స్లీపింగ్‌ బ్యూటీ సిండ్రోమ్‌ బెత్‌కి ఏమైందో ఆమె తల్లి జెనిన్‌కి అర్థం కాలేదు. భర్త తోడు లేకపోయినా అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తన కూతురి పరిస్థితి చూసి ఆమె మనసు తల్లడిల్లిపోయింది. మెదడులో కణితి కారణంగానో, రక్తస్రావంచేతనో ఆమె అలా నిద్రపోతోందేమో అని భయపడింది. బెత్‌ పరిస్థితి చూసి వైద్యులకి కూడా ఏమీ తోచలేదు. కానీ ఇంతలో ఒక వైద్యుడికి తాను విన్న స్లీపింగ్‌ బ్యూటీ సిండ్రోమ్‌ గుర్తుకురావడంతో... అదే ఇది అన్న నిర్ధరణకు వచ్చారు. ఇప్పటికీ రహస్యమే! సుదీర్ఘకాలం పాటు అకస్మాత్తుగా నిద్రలోకి జారుకునే ఈ స్లీపింగ్‌ బ్యూటీ సిండ్రోమ్‌కి కారణం ఏమిటన్నది ఇప్పటివరకు శాస్త్రవేత్తలకు తెలియనేలేదు. కాకపోతే ఇది జన్యవులలో లోపం వల్ల ఏర్పడుతుందనీ, శరీరంలో ఏదన్నా ఇన్ఫెక్షన్‌ సోకినప్పుడు ఈ రోగం ఒక్కసారిగా బయటపడుతుందనీ అనుమానిస్తున్నారు. నిద్రనీ, ఇంద్రియాలను నియంత్రించే మెదడులోని ధాలమస్‌, హైపోధాలమస్ అనే భాగాలు దెబ్బతినడం వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుందని తేలింది. 20వ శతాబ్దపు ఆరంభంలో కెల్విన్‌, లెవిన్‌ అనే ఇద్దరు వైద్యులు దీనిని గుర్తించడంతో... వారి పేరు మీదుగా Kleine–Levin syndrome (KLS) అన్న పేరు పెట్టారు. కానీ స్లీపింగ్‌ బ్యూటీ సిండ్రోమ్‌ అన్న పేరుతోనే ఇది ప్రచారంలో ఉంది. నూటికి కాదు కోటికి స్లీపింగ్‌ బ్యూటీ సిండ్రోమ్ ఎక్కడో లక్షల్లో ఒకరికి మాత్రమే సోకే అవకాశం ఉందట. సాధారణంగా 16 ఏళ్ల యుక్తవయసులో ఈ రోగం దాడి చేస్తుంది. ఈ వ్యాధి సోకినవారు వారాల తరబడి దీర్ఘనిద్రలో ఉండిపోతారు. రోజులో ఒకటి రెండు గంటలు మాత్రమే కాస్త మెలకువగా ఉంటారు. అది కూడా ఏదో మత్తులో ఉన్నవారిలాగా తూగుతూ ఉంటారు. ఆ కాస్త సమయమూ కాలకృత్యాలను తీర్చుకోవడం, ఆహారం తీసుకోవడంలో గడిచిపోతుంది. ఇలా కొన్నాళ్ల నిద్రావస్థ తరువాత మళ్లీ ఓ రెండు వారాలు మామూలుగా ఉంటారు. ఆ తరువాత మళ్లీ నిద్ర! ఇలా ఓ పదేళ్ల పాటు ఈ విషవలయం తప్పదు. అదృష్టం ఏమిటంటే ఓ పది, పన్నెండేళ్ల తరువాత రోగం దానంతట అదే తగ్గిపోతుంది. జీవితం వృధా స్లీపింగ్‌ బ్యూటీ సిండ్రోమ్‌కి ఇప్పటివరకూ తగిన చికిత్స ఏదీ అందుబాటులో లేదు. అందుబాటులో ఉన్న మందులు కూడా ఎంతవరకు క్షేమం అన్నదాని మీద అనేక అనుమానాలు ఉన్నాయి. అయితే ఈ రోగం వల్ల శారీరికంగా కలిగే బాధకంటే మానసికమైన వేదన ఎక్కువ. నిద్రావస్థ నుంచి బయటకు వచ్చిన తరువాత, రోగి మామూలు స్థితికి చేరుకోవడానికి కాస్త సమయం పడుతుంది. ఆ అయోమయం వల్లనైతేనేమీ, తన కాలం వృధా అయిపోయిందన్న బాధతో అయితేనేమి తీవ్రమైన క్రుంగుబాటులోకి కూరుకుపోయే ప్రమాదం ఉంది. పైగా ఆడుతూపాడుతూ తిరగాల్సిన యుక్తవయసులో, కెరీర్ మంచి ఊపులో ఉండే దశలో ఈ వ్యాధి దాడి చేయడం వల్ల వారి జీవితమే తలకిందులైపోతుంది. అలాంటి సమయంలో వారికి నేనున్నానన్న భరోసాని అందించడం అవసరం. అదృష్టవశాత్తూ బెత్‌కి అలాంటి భరోసా ఉంది. ఆమెను కంటికి రెప్పలా చూసుకునే తల్లి ఎలాగూ ఉంది, దానికి తోడు బెత్‌ గురించి తెలిసి ఆమెకు దగ్గరైన ఓ యువకుడు కూడా ఆమె బాగోగులను గమనించుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. తమ ప్రాణమైన బెత్ ఈ సిండ్రోమ్ నుంచి త్వరగా కోలుకోవాలని వారిద్దరూ ఆశిస్తున్నారు. - నిర్జర.  

read more
వ్యాయామం చేయకపోతే గుండె నొప్పి..

వ్యాయామం చేయకపోతే గుండె నొప్పి..   ఎవరైతే శరీర వ్యాయామం  చేయరో వాళ్ళు గుండె నొప్పితో మరణిస్తున్నారని ఒక అధ్యనంలో తేలింది. ప్రతి రోజు చాలా చురుకుగా ఉంటారో వాళ్ళలో గుండె నొప్పితో చనిపోయే అవకాశం తక్కువే  అని  వైద్యులు తేల్చిచెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన అధ్యయనంలో గుండె సమస్యలతోనే ఎక్కువమంది మరణిస్తున్నారని కనుగొన్నారు.  ఈ పరిశోదన పై యురోపియన్  జనరల్ లో ప్రచురించారు . శరీర వ్యాయామం మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుందని.  అది మనకు మేలు చేస్తుందని నిపుణులు తేల్చారు. శరీరవ్యాయామం గుండెకు వచ్చే వ్యాధులను గుండె పోటును నివారిస్తుందని అన్నారు. దీనిపై చేసిన  అధ్యయనంలో చైతన్యంగా అంటే యాక్టివ్ గా ఉన్న వారిలో గుండె నొప్పి వచ్చే అవకాసం తక్కువే అని  సెడన్ ట్రీ లైఫ్  వల్లే గుండె నొప్పికి ప్రధాన కారణంగా వైద్యులు పేర్కొన్నారు. యూరప్ లోని  ఆరోగ్య వంతులు శరీర వ్యాయామం చేసేవారు అప్పటికే గుండె నోప్పి వచ్చిన వారు 2 8 1 4 ౦  మంది వ్యక్తులపై చేసిన అధ్యయనం లో పలు అంశాలు కనుగొన్నారు. ఈ అధ్యయనం లో పాల్గొన్న వారిని వివిధ విభాగాలుగా  విభజించి అందులో అనువైన సమయంలో శరీర వ్యాయామం చేసేవారు తక్కువ, మధ్య తరగతి, ఉన్నత వర్గాల జీవన ప్రమాణాలు ఉన్నవారిని వేరువేరుగా విభజించారు. ఇందులో వారంలో ఒక రోజు వారు వచ్చే విధంగా నిర్ణయించారు. శరీర వ్యాయామం గుండె పోటు వల్ల మరణించే శాతం ఎంత ఉండవచ్చు అన్న అంశం పైనా 2 8 రోజుల పాటు అన్ని వర్గాల వారిని కేటగిరీల వారిని పరిశీలించామన్నారు . వచ్చిన వారి వయస్సు స్త్రీ, పురుషులు వేరుగా విభజించి వారిలో డయాబెటిస్ , బి పి.  వారి కుటుంబాల చరిత్ర, వారి గుండె సంబందిత  సమస్యలు  ఉన్నయా లేదా ? వారి పొడవు , ఎత్తు ఇతర అలవాట్లు సిగరెట్లు , మధ్య  పానం, కొలస్ట్రాల్ వారి సాంఘిక ఆర్ధిక పరిస్థితుల పై అధ్యనం చేసారు. 4 9 7 6 ( 1 7 .7%) మంది 2 8 రోజుల్లో మరణించినట్లు. కనుగోన్నారు. 3, 1 ౦ 1 ( 6 2 . 3 % ) అప్పటికప్పుడే మరణించారని అధ్యనంలో వెల్లడించారు. ఎక్కువ శాతం శరీర వ్యాయామం చేసిన వారిలో గుండె నొప్పి ఇన్స్ స్టాంట్  హార్ట్ అట్టాక్  వచ్చే అవకాశం  తక్కువే అని నిర్ధారించారు. 2 8 రోజులలో 3 6 % ,2 8 % వారిలో ఎక్కువగా మార్పు కనపడలేదని  డాక్తర్ కిం వాదేల్ట్ హాన్సెన్ బిస్ పబ్ జేర్గ్ అసుపత్రికి చెందిన సుపెన్ హగ్గెన్ డెన్మార్క్ మాట్లాడుతూ దాదాపు 1 8 % మంది రోగులు గుండె నొప్పితోనే 2 8 రోజుల్లో మరణించారని వారికీ తీవ్రమైన అనారోగ్య పరిస్థితులు ఉండడం వల్లే మరణించారని తేల్చి చెప్పారు. అయితే వారు శరీర వ్యాయామం కొంత అయినా చేసి ఉంటె  బతికి ఉండే అవకాశం ఉండేదని అన్నారు. మా  అధ్యయనం ద్వారా  తక్కువ సమయంలో నైనా అంటే కొంతసేపు అయినా  వ్యాయామం చేస్తే కొంతైనా లాభం పొందవచ్చని వారంలో ఒక్క రోజు అయినా  శరీర వ్యాయామం  అంటే తక్కువలో తక్కువ 7 5 నిమిషాలు ఏరోబిక్  చేయవచ్చని దీనికోసం పెద్దగా డబ్బు ఖర్చు చేయల్సిన అవసరం ఏమి లేదని  కొంత సమయం మాత్రం వ్యాయామం చేయాల్సిందే అని నిపుణులు సూచించారు.  కాగా శరీర వ్యాయామం పై మరిన్ని అధ్యనాలు చెయ్యాల్సిన అవసరం ఉందని  డాక్టర్ హాన్సెన్  అభిప్రాయ పడ్డారు.

read more
గులాబీ ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా ?

గులాబీ ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా ?     * ఆరు టీ స్పూన్ల గులాబీ రేకులను, ఆరు టీ స్పూన్ల సోపు గింజలను కలిపి నూరి రెండు కప్పుల నీళ్లలో వేసి మరిగించి, వడపోసి రోజుకు రెండుసార్లు తీసుకుంటుంటే క్రమంగా రక్తహీనత నుంచి బయటపడతారు. * ఒక టీ స్పూన్ గులాబీ నూనెను, నాలుగు టీ స్పూన్ల బాదం నూనెను కలిపి ఛాతి మీద ఉదయం, సాయంకాలాలు ప్రయోగించి మర్థనా చేసుకుంటుంటే గుండెనొప్పిలో హితకరంగా ఉంటుంది. * గులాబీ రెక్కలు 1 భాగం, పంచదార 2 భాగాలు తీసుకొని తగినన్ని కలిపి పానకం మాదిరిగా మారేంతవరకూ మరిగించి దింపి చల్లారనిచ్చి కొద్దిగా ఏలకులు, పచ్చకర్పూరం కలిపి ఒకటి రెండు కుంకుమ పువ్వు కేసరాలను కూడా చేర్చి నిల్వచేసుకోవాలి. దీనిని 1-2 టీస్పూన్ల మోతాదులో చన్నీళ్లకు కలిపి తీసుకుంటూ ఉంటే మూత్రంలో మంట, శరీరంలో వేడి వంటి పిత్తసంబంధ సమస్యలు తగ్గుతాయి. * ఒక కప్పు గులాబీ నీళ్లకు ఒక టీ స్పూన్ సోపు గింజలు, అర టీస్పూన్ ధనియాలు, 10 ఎండు ద్రాక్షలను కలిపి రాత్రంతా నానబెట్టి మర్నాడు ఉదయం వడపోసుకొని తీసుకుంటే గుండె దడ, ఆందోళన వంటివి తగ్గుతాయి. * గులాబీలు 100గ్రా., ద్రాక్షపండ్లు 100గ్రా. నీళ్లకు వేసి కషాయం కాచి చిటికెడు ఏలక్కాయ గింజల పొడికి కలిపి కొద్దికొద్దిగా చప్పరిస్తుంటే దీర్ఘకాలంనుంచి బాధించే తల నొప్పినుంచి ఉపశమనం లభిస్తుంది. * రెండు టేబులు స్పూన్ల గులాబీ పూల రేకులను ఒక గ్లాసు నీళ్లకు కలిపి కషాయం తయారుచేసి తీసుకుంటే ఆందోళన, నర్వస్‌నెస్ వంటివి తగ్గుతాయి. * రోజ్‌వాటర్‌ని, ఉల్లిపాయల రసాన్ని ఒక్కోటి ఒక్కో టీ స్పూన్ చొప్పున కలిపి పరిశుభ్రమైన దూది ప్యాడ్‌ని తడిపి మూసిన కనురెప్పలమీద పరుచుకుంటే కంటి మంటలు, ఎరుపుదనం, దురద వంటివి తగ్గుతాయి. * ఒక టేబుల్ స్పూన్ గులాబీ రెక్కలను ఒక కప్పు నీళ్లకువేసి మరిగించి తీసుకుంటే తల తిరగటం, తలనొప్పి వంటివి తగ్గుతాయి. * రోజ్‌వాటర్‌ని, వెనిగార్‌ని సమాన నిష్పత్తిలో చల్లని నీళ్లకు కలిపి, నూలు గుడ్డను తడిపి మడతలుపెట్టి నుదుటి మీద పరిస్తే శరీరం చల్లబడి జ్వరం తగ్గుతుంది. * రోజ్‌వాటర్‌కి తోక మిరియాల పొడి, శొంఠి పొడిని ఒక్కో టీ స్పూన్ చొప్పున కలిపి పేస్టుమాదిరిగా చేసి తల నొప్పిమీద ప్రయోగిస్తే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. * ఎండిన గులాబీ రెక్కలను పొడిచేసి తేనెకు కలిపి కొద్దికొద్దిగా చప్పరిస్తుంటే గొంతు నొప్పినుంచి ఉపశమనం లభిస్తుంది. * రోజ్‌వాటర్‌కి కుంకుమ పువ్వు, బాదం పలుకులను కలిపి మెత్తగా నూరి ముఖంమీద ఫేస్ ప్యాక్ మాదిరిగా ప్రయోగిస్తే ముఖ చర్మం కుసుమ కోమలంగా తయారవుతుంది. మంగు మచ్చలు, మొటిమలు వంటివి తగ్గుతాయి. * గులాబీలు వేసి నానబెట్టిన నీళ్లను సున్నపు తేటకు కలిపి, కమలాపండ్ల రసానికి చేర్చి తీసుకుంటే ఎసిడిటీవల్ల వచ్చే ఛాతినొప్పి, వికారం, అజీర్ణం, ఆమ్లపిత్తం వంటి సమస్యలు తగ్గుతాయి. * గులాబీ పూలరెక్కలు, అక్కలకర్ర పొడి వీటిని మూడేసి గ్రాముల చొప్పున కలిపి కొద్దికొద్దిగా నాలుక మీద వేసుకొని చప్పరిస్తుంటే నాలుక మీద ఉండే రుచి గ్రాహకాలు (టేస్ట్‌బడ్స్) చైతన్యవంతమవుతాయి. దీంతో ఆహార పదార్థాల రుచి తెలుస్తుంది.  

read more