నేడు దేశంలో ని సగానికి పైగా యువత తక్కువ వయసులోనే జుట్టు ఊడిపోవడం, బట్టతల సమస్య ఎదుర్కుంటున్నారు.ఈ సమస్యవల్లె చాలామందికి పెళ్ళికూడా కాక పోవడం సంభవిస్తోంది అందరిముందు బట్టతల తో తిరగాలంటే సిగ్గుపడడం గమనించవచ్చు. ఇందుకోసం అందంగా కనపడడానికి బాగా జుట్టుపెరగాదానికి చేయని ప్రయాత్నం అంటూ లేదు అందుకోసం పడుతున్న పడరాని పాట్లు వర్ణనాతీతం చివరగా ఎదిక్కులేక హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ అంటే జుట్టు మార్పిడి చేయించుకోడానికి సిద్ధమౌతున్నారు.హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చేసేందుకు ఇబ్బిడి ముబ్బిడిగా పుట్టుకొస్తున్న నేపధ్యంలో మే నెలలో హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ వల్ల ౩5 సంవత్సరాల వ్యక్తి మృతి చెందం తీవ్ర కలకలం రేపింది. డిల్లి నార్త్ వెస్ట్ ప్రాంతం లోనిరోహిణి లో హెయిర్ టాన్స్ ప్లాంట్ చేస్తున్న సమయంలో రోగి మరణిం చడం పై డిల్లి హైకోర్ట్ తీవ్రంగా పరిగణిస్తూ కేంద్రం ప్రభుత్వాలు హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చేసేవారిపట్ల వైద్య నియమ నిబందనలు అనుగుణంగా ఉన్నాయో లేదో చూడాలని డిల్లి హైకోర్ట్ ఆదేశించింది. ఇందుకోసం జాతీయ స్థాయి ప్రమాణాలు నియమ నిబందనలకు అనుగుణంగా పరిశీలించాలని నష్నల్ మెడికల్ కమీషన్ కు ఆదేశాలు జారీచేసింది.
హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ సమయంలో ఎదురయ్యే సవాళ్ళను అధిగమించేందుకు అత్యవసర సమయంలో అందించాల్సిన చికిత్చలు కు సత్వరం అందించేందుకు సమీపంలో పెద్ద ఆసుపత్రులలో నిర్వహించాలని క్లినిక్ నిర్వాహకులకు సూచించింది.హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ వల్ల జీవితం అంతమై పోదు, మరనిస్తారాని కాదు నష్నల్ మెడికల్ కమీషన్ తీసుకున్న నిర్ణయం పట్ల హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ క్లినిక్ సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది ప్రముఖ ఆసుపత్రులలో హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ నిర్వహిస్తే ఇబ్బందులు తప్పవని ప్రైవేట్ ఆసుపత్రులలో హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ బృందం ఉంటుందని క్లినిక్లకు పెద్దసవాలు కాగలదని హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ డాక్టర్ చండి జైన్ గుప్తాఅన్నారు ప్రైవేట్ క్లినిక్లను కార్పోరేట్ పెద్ద ఆసుపత్రులు అనుమతించ బోవని ఆయా ఆసుపత్రుల నుండి సవాళ్లు తప్పవని డాక్టర్ మయాంక్ సింగ్ అన్నారు.హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ సమయం లో అనుసరించే పద్ధతి అలసటతో కూడుకున్నది పెద్ద పెద్ద వసతులు ఉన్నప్పుడు ఎంపిక సులభమని అన్ని సదుపాయాలు ఉన్న చోట అనుభవజ్ఞులైన వైద్యుల సేవలు అందుతాయని పి ఎస్ ఆర్ ఐ ఆసుపత్రి ఎల్లప్పుడూ స్వగాతిస్తుందని వైద్యులు అన్నారు.అయితే దీనికోసం నూతన విధి విధానాలు అమలు చేయాలని సరైన సదుపాయాలూ శిక్షణ లేని వారుహెయిర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జరీ నిర్వహించడం వల్ల ప్రజల ప్రాణాలకు హానికలిగే అవకాసం ఉంది.
డిల్లి లో సరైన సదుపాయాలు లేని ట్రాన్స్ ప్లాంట్ క్లినిక్ లు చాలానే ఉన్నాయాని పద్దతి ప్రకారం నిర్వహించే ట్రాన్స్ ప్లాంట్ కు 1.5 నుండి 2 లక్షలు అవుతుందని అంటున్నారు నిపుణులు.హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జరీ పరిశ్రమను నూతన జవసత్వాలు కల్పించడం నాణ్యత ప్రమాణాలు సాడుపాయాలు లేని ట్రాన్స్ ప్లాంట్ క్లినిక్ లపై ఉక్కు పాదం మోపడం అంటే నియంత్రించడం. జాతీయ ఆరోగ్య మిషాన్ ఎన్ ఎం సి నియమ నిబంధనల అనుగుణంగా పనిచేయాలని పేర్కొంది.ఈ విషయాన్ని మోడ్రన్ ఈస్థటిక్స్ స్వాగతించింది.ఇది కేవలం డే కేర్ సర్జరీ మాత్రమే అనిస్పష్టం చేసారు. ఎన్ ఎం సి నిబందనల ప్రకారం ట్రాన్స్ ప్లాంట్ క్లినిక్ కు సమీపం లో నర్సింగ్ హోం ఉండాలన్న నిబంధన విధించిందన్న విషయం గుర్తుచేశారు. అత్యవసర మైన పక్షం లో అవసరమైన సమయం లో చేర్చేందుకు అవసరమైన వైద్య సదుపాయాలు ఉండడం అత్యవసరమని పేర్కొంది తద్వారా రోగిని ప్రమాదం నుండి తపాయించావచ్చని పేర్కొంది. అయితే ట్రాన్స్ ప్లాంట్ లో సమయంలో ప్రమాదం జరగడం అరుదని డాక్టర్ గుప్తా అన్నారు.ఈ మధ్యకాలం లో దేశవ్యాప్తంగా చోటు చేసుకోవడం పై గుప్తా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు. సర్జరీ సమయం లో ప్రత్యేక పద్దతి అనుసరించాలాని బలమైన అనస్తీషియా బృందం ఉండాలాని ఎందుకంటే దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయాని చాలా క్లినిక్స్ లో డర్మటాలాజిస్ట్ లు లేదా ప్లాస్టిక్ సర్జన్స్ ఎనేస్తీషియా ఎక్స్ పర్ట్ గా వ్యవహరిస్తున్నారని వారి వద్ద సురక్షిత మైన వారు లేరని రోగులు తీవ్రమైన విచిత్ర మైన పరిస్థితులు ఎదుర్కోవడం సంభవిస్తుందని అందుకే అప్రమత్తం గా ఉండాలని ఎన్ ఎం సి హేచారించింది.ఎన్ ఎం సి నియనిబంధనలకు లోబడే ప్లాస్టిక్ సర్జన్లు ఉండాలి. అర్హత లేని వ్యక్తుల పై చట్టప్రకారం చర్యలు ఉంటాయాని ఎన్ ఎం సి హెచ్చరించింది.