అరటి చాలా శక్తివంతమైన పండు. దీన్ని తినడం వల్ల శరీరానికి ప్రాణశక్తి లభిస్తుంది. ఆకలిగా ఉన్నప్పుడు ఓ అరటిపండు తింటే చాలాసేపటి వరకు ఆకలి బాధ దూరంగా ఉంటుంది. ఇది మెత్తగా ఉండటం వల్ల చిన్న పిల్లల నుండి వృద్దుల వరకు ప్రతి ఒక్కరూ తినదగిన పండు. జీర్ణం కావడానికి సులువుగానే ఉంటుంది. ఎక్కువసేపు ఆకలిని అదుపులో ఉంచుతుంది. కండరబలాన్ని, పోషకాలను ఇస్తుంది. వర్కౌట్ తర్వాత అరటిపండు తినడం ఫిట్నెస్ ఫాలో అయ్యేవారికి తప్పనిసరి. పైపెచ్చు అరటిపండు మిగిలిన పండ్లతో పోలిస్తే ధర తక్కువే. కాబట్టి అందరూ కొనుక్కుని తినగలుగుతారు. కానీ అరటిపండు అందరికీ మంచిది కాదు. ఆయుర్వేదంలో అరటిపండు కొంతమందికి ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతుంది. అరటిపండు తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో? దీన్ని ఎవరు తినకూడదో తెలుసుకుంటే..
పోషకాలు..
అరటిపండు తినడం వల్ల విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, మాంగనీస్, విటమిన్ బి6తో పాటు గ్లూటాతియోన్, ఫినాలిక్స్, డెల్ఫిడినిన్, రుటిన్, నారింగిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి.
80వ్యాధులకు చికిత్స చేయగలదు..
పోషకాహార నిపుణులు అరటిపండులో ఉన్న గొప్పదానాన్ని చెబుతూ ఇది 80రకాల వ్యాధులకు చికిత్స చేయగలదని పేర్కొన్నారు. అరటి పండు వాత పిత్త దోషాన్ని సమతుల్యం చేస్తుంది. వాతం క్షీణించడం వల్ల దాదాపు 80 రకాల వ్యాధులు వస్తాయని ఆయుర్వేదంలో చెప్పబడింది. ఇది పొడిబారడం, ముడతలు పడటం, ఎముకలలో అంతరం, మలబద్ధకం, చేదు రుచి మొదలైన అనేక సమస్యలు ఇందులో ఉన్నాయి. వీటన్నింటికి అరటిపండు చికిత్స చేయగలుగుతుంది.
అరటిపండు ఎవరు తినాలంటే..
ఆయుర్వేదం ప్రకారం అరటిపండు చల్లని గుణం కలిగి ఉంటుంది. ఇది జీర్ణం కావడానికి బరువుగా ఉంటుంది. ఇది లూబ్రికేషన్గా పనిచేస్తుంది. శరీరం ఎండిపోయి, ఎప్పుడూ అలసిపోయినట్టు, బాగా నిద్రపోనట్టు, శరీరంలో ఎప్పుడూ మంటగా ఉన్నట్టు అనిపించేవారు, చాలా దాహంతో ఉన్నవారు, ఎక్కువ కోపంగా ఉన్నవారు అరటిపండును తినాలి. దీనివల్ల ఆ కోపస్వభావం, అతిదాహం వంటి సమస్యలు అణిచివేయబడతాయి.
ఎవరు తినకూడదంటే..
అరటిపండు కఫ దోషాన్ని పెంచుతుంది. కాబట్టి అధిక కఫ శరీర తత్వం గలవారు దీనిని తినకూడదు. పెరిగిన కఫం కారణంగా జీర్ణాశయంలో అగ్నితత్వం బలహీనంగా ఉంటే అరటి పండు దానిని మరింత నెమ్మదిస్తుంది. అధిక కొవ్వు, దగ్గు, జలుబు ఉన్నవారు, ఆస్తమా రోగులు దీనిని తినకూడదు. ఒకవేళ తినాలని అనిపిస్తే చాలా ఆలోచించి దీని పర్యావసానాలు ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉంటేనే తినాలి.
*నిశ్శబ్ద