బరువు తగ్గడానికి ఎలాంటి ఆహరం తీసుకోవాలి..
బరువు తగ్గడానికి ఎలాంటి ఆహరం తీసుకోవాలి? బరువు తగ్గడానికి చాలామంది చాలా రకాల కార్యక్రమాలు చేస్తుంటారు. కానీ మనం తీసుకునే ఆహరం సమానంగా తీసుకుంటేనే బరువు పెరుగుదలను తగ్గించవచ్చు. దీనికి కావలసింది కేవలం సరైన మాంసకృత్తులు మరియు పోషక విలువలున్న ఆహరం మాత్రమే. మీరు తీసుకునే ఆహరం యొక్క ప్రణాళిక అనేది మీ యొక్క బరువు తగ్గడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. బరువు తగ్గడానికి మరి ఎలాంటి డైట్ ప్రణాళికను వాడాలో ఇపుడు తెలుసుకుందాం. వెజ్ - శాకాహారం:- ఉదయం వేళలో... బ్రేక్ ఫాస్ట్ : 1: ఒక కప్పు కాఫీ లేదా పాలతో బ్రెడ్ ను తీసుకోవడం. 2: పండ్లు లేదా టమాటాలు వంటి తాజా కూరగాయలు తీసుకోవడం. మధ్యాహ్నం - లంచ్ : 1: గ్రీన్ వెజిటబుల్ సోర్ మిల్క్ (దహి) తో రెండు చిన్న చపాతీలు తినాలి. 2: రెండు లేదా మూడు చిన్న దోసకాయలు, క్యారెట్ వంటివి తినాలి. 3: ఒక కప్పు అన్నం మరియు ఒక కప్పు పప్పు ఆహారంగా తీసుకోవాలి. రాత్రి - డిన్నర్ : 1: సూప్ (టమోటా, పాలకూర మరియు స్వీట్ కార్న్) మరియు పాపడ్ తీసుకోవచ్చు. 2: ఒక కప్పు శాకం మరియు రెండు చపాతీలు తీసుకోవాలి. మాంసాహారం:- ఉదయం వేళలో... బ్రేక్ ఫాస్ట్ : 1: రెండు లేదా మూడు ఉడికించిన గుడ్లు తీసుకోవచ్చు. 2: ఒక కప్పు కాఫీ లేదా పాలతో బ్రెడ్ ను తీసుకోవడం. మధ్యాహ్నం - లంచ్ : 1: మాంసం లేదా ఒక ఫిష్ యొక్క చిన్న చిన్న ముక్కలు, రెండు చపాతీ మరియు దాల్ తీసుకోవాలి 2: ఏదైనా తక్కువ కాలరీలు మాంసాహార క్రమాలలో సూప్ మరియు పాపడ్ తీసుకోవచ్చు. రాత్రి - డిన్నర్ : 1: తక్కువ కాలరీలు కల్గిన మాంసాహార సూప్ మరియు పాపడ్ తీసుకోవచ్చు. 2: చికెన్ 100గ్రాములు మరియు రెండు చపాతీలు, ఒక కప్పు సూప్ ఆహారంగా తీసుకోవచ్చు. ఈ విధంగా చేయడం వలన ఎలాంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ లేకుండానే, ఆరోగ్యంగా ఉంటూనే మీ బరువును మీరు తగ్గించుకోవచ్చు.
read moreమాతృత్వానికి మందు..ద్రాక్ష పండు
మాతృత్వానికి మందు..ద్రాక్ష పండు జీవితంలో ఎంత సాధించినా..ఏం చేసినా స్త్రీ జీవితానికి సార్థకతను ఇచ్చేది మాతృత్వమే. కానీ మారిన జీవన విధానాలు..యాంత్రిక జీవనం కారణంగా ఎంతో మంది మహిళలు మాతృత్వాన్ని అందుకోలేకపోతున్నారు. ఆహారపు అలవాట్లతో పాటు ఎన్నో వ్యాధులు మహిళలకు తియ్యని ఆనందాన్ని దూరం చేస్తున్నాయి. ముఖ్యంగా ఎండోమెట్రి యోసిస్తో ఆడవారి బాధ వర్ణనాతీతం. విపరీతమైన కడుపునొప్పి, నెలసరి సక్రమంగా లేకపోవడం ఎండోమెట్రియోసిస్ లక్షణాల్లో కొన్ని. గర్భం ధరించాలంటే పక్వదశలో ఉన్న అండాలను విడుదల చేయాల్సి ఉంటుంది..కానీ ఈ వ్యాధి కారణంగా అండాలు పక్వదశకు చేరకుండానే విడుదలవుతున్నట్లు పరిశోధనలో తేలింది. ఫాలికల్స్‌లో ఉండే ద్రవాల కారణంగా అండాలు దెబ్బతింటున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. మందులకు లొంగని ఈ వ్యాధిని ద్రాక్ష పండ్లు తినడం ద్వారా అరికట్టవచ్చు అంటున్నారు సౌతాంప్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు..ఎలుకలకు అధిక మోతాదులో ద్రాక్ష పండ్లు ఇచ్చి వీరు చేసిన పరిశోధన సత్ఫాలితాల్ని ఇచ్చింది. మహిళలు వీలైనంత ఎక్కువగా ద్రాక్షపండ్లు తినడం ద్వారా శరీరానికి చేరే మెలటోనిన్ ద్వారా పరిస్థితిలో మార్పు వచ్చిందట. అలాగే సంతానం లేని స్త్రీలు కిస్మిస్ పండ్లు తినడం వల్ల అండాశయం లోని లోపాలు తొలగుతాయి.. అంతేకాకుండా మూత్రాశయంలో అమ్మోనియా పెరగదు. రాళ్లు కూడా రావని వైద్యులు అంటున్నారు. ద్రాక్ష పండ్లతో పాటు బ్లూబెర్రీలు, వేరుశెనగ కూడా మంచివేనట.
read moreనెలసరి సమయానికి రావడం లేదా..?
నెలసరి సమయానికి రావడం లేదా..? రుతుక్రమం.. నెలసరి.. బహిష్టు పేరేదైనా సరే ఇది కేవలం స్త్రీ శరీరంలో జరిగే సహజ శారీరక మార్పుకాదు.. దాన్ని స్త్రీత్వానికీ, మాతృత్వానికీ ప్రతీకగానే చూస్తుంది భారతీయ సమాజం. అందుకే నెలసరి రాకపోవడం అమ్మాయిలనీ.. మానసికంగా, శరీరకంగా కృంగదీస్తుంది. ఇందుకు గల కారణాలు.. చికిత్స విధానం.. తదితర వివరాల కోసం ఈ వీడియో చూడండి. https://www.youtube.com/watch?time_continue=2&v=_m9rabrQ3Ro
read moreకోల్డ్‌తో బాధ పడుతున్నారా..
కోల్డ్ అనేది సర్వ సాధారణమైన లక్షణం. ఇది పెద్ద జబ్బేం కాదు, అయితేనేం పట్టిందంటే పీడిస్తుంది. తెగ సతాయిస్తుంది. జలుబు చేసేది ముక్కుకే అయినా ముఖమంతా ఏదో పాకుతున్నట్టు యమా చేరాకేస్తుంది. కోల్డ్ వల్ల శరీరమంతా అలసిపోయినట్టు అవుతుంది. మనసు స్థిమితంగా ఉండదు. తిండి తినాలనిపించదు, ఎవరితో మాట్లాడాలనిపించదు. నిద్ర పట్టడం కష్టమౌతుంది. ఇంత ఇబ్బంది పెట్టే కోల్డ్ గురించి ఓ నానుడి ఉంది. దీనికి మందు వాడకపోతే ఏడు రోజుల్లో తగ్గుతుంది, వాడితే వారంలో తగ్గుతుంది- అని. అంటే కోల్డ్ కు ఔషధం వేసుకున్నా లాభం లేదనేది తాత్పర్యం. అనేకమంది అనుభవాలు ఆ మాట నిజమే అనిపించేలా చేశాయి. అలాగని మెడిసిన్లు వేసుకోకుండా కోల్డ్ ను ముదరబెట్టుకుంటే ఆనక బాధపడక తప్పదు. దీర్ఘకాలంపాటు జలుబు కనుక తగ్గకపోతే, అది న్యుమోనియాకు దారితీస్తుంది. పూర్వకాలం సంగతి ఎలా ఉన్నా, ఇప్పుడు కోల్డ్ కు చాలానే మందులున్నాయి. మందుల సంగతి అలా ఉంచితే అనేక గృహ చిట్కాలు కూడా ఉన్నాయి. పసుపు, పటిక బెల్లములను సమంగా తీసుకుని నిప్పుల మీద వేసి ఆ పొగను పీల్చినట్లైతే పడిశం సమస్య నివారణ అవుతుంది. మిరియాలను నూరి, బెల్లంతో కలిపి ముద్దగా చేసి తింటే కోల్డ్ తగ్గుతుంది. ఒకవేళ అది మరీ ఘాటుగా ఉంటుంది, తినలేము అనుకుంటే వేడి పాలలో మిరియాల పొడి వేసుకుని తాగినా ఫలితం ఉంటుంది. గులాబీ రేకలను నువ్వుల నూనెలో మరిగించి , దించి వడపోసి నిలువ చేసుకోవడం ఇంకో పధ్ధతి. ఈ గులాబీ తైలాన్ని రెండు పూటలా రెండు చుక్కలు ముక్కులో వేస్తే, జలుబు తగ్గుతుంది. తుమ్ములు కూడా అరికడతాయి.కొందరికి డస్ట్ ఎలర్జీల్లాంటివి ఉంటాయి. పిండి, కారం లాంటివి జల్లించినా, కాస్త అటక దులిపినా వెంటనే ఎలర్జీ బయటపడిపోతుంది. ఆఖరికి సాంబ్రాణి పొగ కూడా పడనివారు ఉంటారు. అలాగే కొందరికి ఎండలో తిరిగితే వెంటనే ఎలర్జీ వస్తుంది. మరి కొందరికి కొన్ని వాసనలు సరిపడవు. ఇంకొందరికి కొన్ని పదార్ధాలు తింటే ఎలర్జీ వస్తుంది. వీళ్ళందరికీ దాదాపుగా కోల్డ్ మొదటి లక్షణంగా ఉంటుంది. కనుక ఏది సరిపడటంలేదో, దానికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ముక్కు అంటూ ఉన్నాక జలుబు చేయకుండా ఉండదు. కానీ చీటికిమాటికి కోల్డ్ వస్తుంటే ఆలోచించాల్సిందే. డాక్టర్‌ను సంప్రదించాలి. రెసిస్టేన్స్ పవర్ తగ్గితే కూడా త్వరగా కోల్డ్ చేస్తుందని గ్రహించాలి. మొత్తానికి ఎక్కువకాలం పాటు రొంప వదలకుండా బాధిస్తుంటే, లోపల ఏదో అనారోగ్యం పొంచి ఉందని గ్రహించి తగిన శ్రద్ధ తీసుకోవాలి.
read moreHealth Benefits of Green Peas
Health Benefits of Green Peas Green peas are not just the greenish part of your plate. Instead, they are little powerhouses of energy and nutrition. Green Peas is encompassed with many health benefits that not many people are aware of. We have listed a few good things that green peas can do to your health. Take a quick look !!! 1. Peas Helps in Managing Weight. It is low on fat and also contains high protein, fiber and micro-nutrients. A whole cup of green peas contains less than 100 calories. 2. Green Peas contains coumestrol, a health-protective polyphenol that prevents stomach cancer. 3. Green peas's high fiber and protein content helps in regulating blood sugar. 4. Green Peas is a great food for anti-aging and prevention of wrinkles on skin. 5. Components like vitamin B1 and folate, B2, B3, and B6 present in green peas can reduce homocysteine levels which is a major risk factor in heart diseases. 6. Green peas helps in regulating metabolism and also prevents constipation. It also improves bowel health and peristalsis. 7. Green peas plays a vital role in bone health. One cup of peas contains 44% of Vitamin K which in turn helps in anchoring Calcium inside the bones. Green peas helps in preventing osteoporosis.
read moreపెళ్లయ్యిందా... ఫిగర్ గురించి టెన్షన్ పడుతున్నారా...!
పెళ్లయ్యిందా... ఫిగర్ గురించి టెన్షన్ పడుతున్నారా...! టీనేజీ అమ్మాయిలు తమ ఫిగర్ గురించి టెన్షన్ పడుతూ ఉంటారు. ఎక్కడ లావైపోతారో, ఎక్కడ ఫిగర్ పాడైపోతుందోనని ఎప్పుడూ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఫిట్ నెస్ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతూ ఉంటారు. మరి పెళ్లయ్యి, ఇళ్లలో ఉండే మహిళల సంగతేంటి? వాళ్లకి ఫిట్ నెస్ అవసరం లేదా? ఈ విషయం చాలామంది గృహిణులు ఆలోచించరు. కాస్త కేర్ తీసుకోవచ్చు కదా అంటే... ఎక్కడ కుదురుతుంది అనేస్తారు సింపుల్ గా. ఇంట్లో పనంతా చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి, భర్తకి కావలసినవన్నీ సమకూర్చాలి, ఉదయం నుంచీ ఉరుకులు పరుగులతోనే సరిపోతుంటే ఇక అందంగా తయారయ్యే అవకాశం ఎక్కడ దొరుకుతుంది అంటుంటారు. నిజానికి కేర్ తీసుకోమనేది అందం కోసం కాదు... ఆరోగ్యం కోసం. అవును. ఫిట్ నెస్ అనేది ఫిగర్ ని పర్ ఫెక్ట్ గా ఉంచుకోవడం కోసమే కాదు... ఫ్యూచర్ ని సంతోషంగా గడపడం కోసం. ఈ విషయం అర్థం కాని ఎంతోమంది గృహిణులు తమ ఒంటి మీద ఏమాత్రం శ్రద్ధ చూపకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. ఆకర్షణ కోల్పోవడంతో పాటు అనారోగ్యాల బారిన కూడా పడుతుంటారు. నిజానికి ఫిట్ గా ఉండటానికి పని గట్టుకుని జిమ్ లకి వెళ్లక్కర్లేదు. పనులన్నీ మానేసుకుని వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేదు. మనం చేసే పనుల్లోనే చక్కని వ్యాయామం ఉండేలా చూసుకోవచ్చు. కొద్దిపాటి జాగ్రత్తలతోనే అందాన్ని ఆనందాన్ని మన దగ్గర కట్టి పడేసుకోవచ్చు. ముందుగా మీరు ఆహారపు అలవాట్ల మీద దృష్టి పెట్టండి. పనుల హడావుడిలో పడి ఏదో తినేశాంలే అనిపించకుండా ఓ క్రమ పద్ధతిలో తినడం అలవర్చుకోండి. మూడు నాలుగు గంటలకోసారి ఆహారం తీసుకోండి. వీలైనంత వరకూ ఆహారంలో గింజలు ఉండేలా చూసుకోండి. ప్రొటీన్లు ఎక్కువగా, చక్కెర తక్కవగా ఉండాలి. పండ్లు, కూరగాయలకు ప్రాధాన్యతనివ్వాలి. మసాలాలు, కారం, నూనె తగ్గించేయండి. ఇక వ్యాయామం సంగతి. మీరు చేసే పనుల్లోనే వ్యాయామం ఉండేలా చూసుకోండి. మిక్సీలు, గ్రైండర్లు వచ్చాక రోళ్లు పక్కన పెట్టేశాం. కానీ ఒక్కసారి మళ్లీ వాటిని వాడి చూడండి. చేతులకు ఎంత గొప్ప వ్యాయామమో తెలుస్తుంది. వీలైతే బట్టలు కూడా వాషింగ్ మెషీన్లో కాకుండా చేత్తోనే ఉతకండి. అపార్ట్ మెంట్లో ఉంటుంటే లిఫ్ట్ వాడకండి. మెట్లు ఎక్కి దిగండి. కూరగాయలకు, సరుకులకు మీవారినో పిల్లల్నో పంపకుండా మీరే వెళ్లి రండి. చిన్న చిన్న దూరాలకు కూడా ఆటోలు బస్సులు ఎక్కకుండా నడిచి వెళ్లండి. ఏ మధ్యాహ్నం పూటో టీవీ చూడాలని కూర్చుంటారు కదా! అప్పుడు రిమోట్ వాడకండి. చానెల్ మార్చుకోవాలనుకున్నప్పుడు టీవీ దగ్గరకు వెళ్లి వస్తూ ఉండండి. బైటికి వెళ్లినప్పుడు సెల్ వాడినా... ఇంట్లో వాడటానికి ఓ ల్యాండ్ లైన్ పెట్టించుకోండి. అది రింగయినప్పుడల్లా పరుగు పరుగున వెళ్లడం కంటే మంచి వ్యాయామం ఏముంటుంది! ప్రపంచం ముందుకు వెళ్తుంటే మమ్మల్ని వెనక్కి వెళ్లమంటున్నారేంటి అనుకోకండి. మంచి జరుగుతుందనుకుంటే నాలుగడుగులు వెనక్కి వేయడంలో తప్పు లేదు. జిమ్ కి వెళ్లే సమయం, వ్యాయామం చేసే తీరిక లేనప్పుడు కనీసం లైఫ్ స్టయిల్ ని మార్చుకుంటే మేలు జరుగుతుంది. ఫిట్ నెస్ పెరుగుతుంది. అనారోగ్యం మీకు దూరంగా పరిగెడుతుంది. వర్తమానంతో పాటు భవిష్యత్తు కూడా ఆనందంగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. - Sameera
read moreకూర్చున్న చోటే ఎక్సర్ సైజ్
కూర్చున్న చోటే ఎక్సర్ సైజ్ రోజూ వ్యాయామం ఆరోగ్యానికి మంచిదని తెలిసినా కూడా.. ఈ ఉరుకుల పరుగుల రొటీన్ జీవితంలో ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోం. అయితే కదలకుండా ఒకేచోట కూర్చుని చేసే ఉద్యోగాల్లో స్టిఫ్ షోల్డర్ వంటివి చాలా ఇబ్బంది పెడుతున్నాయి ఈమధ్య. ఆ ఇబ్బందులని అధిగమించాలంటే... ఎప్పుడు, ఎక్కడ, ఏ కాస్త సమయం దొరికినా కూడా కూర్చున్న చోటనే చిన్న చిన్న కదలికల్ని చేయటం మంచిది అంటున్నారు నిపుణులు. ఎలా అంటే ... 1. ప్రతి అరగంటకి ఒకసారి కూర్చున్న భంగిమను మార్చాలి. అలాగే కళ్ళు ఆర్పి, తెరవటం చేయాలి. 2. ప్రతి గంటకి ఒకసారి కుర్చీలోంచి లేచి అటు, ఇటు నడవాలి. వీలు కాకపొతే ఓ ఐదు నిముషాలు నిల్చోవాలి. 3. అలాగే కుర్చీలో కూర్చుని మెడని పైకప్పు కేసి సాగదీయాలి. అంటే పైకప్పు వైపు చూస్తుండాలి అన్నమాట. 4. ఇక అప్పుడప్పుడు మెడని ఒక పక్కనుంచి మరో పక్కకి అడ్డంగా తిప్పాలి. 5. భుజాలని అప్పుడప్పుడు గుండ్రంగా తిప్పాలి. అలాగే మణికట్టు దగ్గర చేతుల్ని తిప్పాలి. ఇలా ఆఫీసులో, ఇంట్లో, బయట ఎక్కడ వున్నా మోచేతులు, మోకాళ్ళు, భుజాలు, మణికట్టు, మెడ ఇలా జాయింట్స్ ని కదుపుతూ చిన్న చిన్న ఎక్సర్ సైజులు చేస్తే ... పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలనుంచి బయటపడచ్చు అంటూ సూచిస్తున్నారు నిపుణులు. - రమ
read moreఆ సమయంలో ఇలా రిలాక్స్ అవ్వండి
ఆ సమయంలో ఇలా రిలాక్స్ అవ్వండి వాకింగ్ అన్నిటకంటే మంచి వ్యాయామం అంటారు నిపుణులు. కానీ సిటీలో ఉండేవాళ్లకు వాకింగ్ చేయడం కష్టమే. దగ్గర్లో ఏదైనా పార్క్ ఉంటే ఓకే. లేదంటే ట్రాఫిక్ ఉండే రోడ్లలో, వాహనాల రొద, దుమ్ము ధూళిలో నడక అసాధ్యం. అందుకే ఎక్కువమంది జిమ్ ల మీద ఆధారపడేవాళ్లు రోజు రోజుకీ పెరుగుతున్నారు. రోజూ ఉదయాన్నే అక్కడికి వెళ్లిపోయి ప్రశాంతంగా కాసేపు వ్యాయామం చేసుకోవడంలే ఉండే సుఖమే వేరు కదా! అయితే జిమ్ లో చేరాలనుకునేవాళ్లు, చేరినవాళ్లు ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోవడం మంచిది. ముందుగా ఆలోచించాల్సింది దుస్తుల గురించి. జిమ్ కి వేసుకునే దుస్తులు బిగుతుగా ఉండాలని చాలామంది అనుకుంటారు. కానీ కాదు. ముఖ్యంగా ఆడవాళ్లయితే చాలా అసౌకర్యంగా ఫీలయ్యే అవకాశం ఉంది. కదలికలకు, కొన్నిసార్లు శ్వాస తీసుకోడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అందుకే కాస్త వదులుగా ఉండేవే వేసుకోవాలి. అలాగే షూ కూడా సౌకర్యవంతంగా ఉండేవి ధరించాలి. వ్యాయామానికి ముందు వార్మప్ చాలా అవసరం. నేరుగా వెళ్లి మొదలుపెట్టేస్తే వెనువెంటనే గుండె వేగం పెరిగి శ్వాసలో ఇబ్బంది ఏర్పడుతుంది. శరీరం త్వరగా శక్తిని కోల్పోయి ఆయాసం వచ్చేస్తుంది. అందుకే వార్మప్ చేశాకే వ్యాయామం మొదలు పెట్టాలి. అలాగే శరీరాన్నిహైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. జిమ్ కి వెళ్లడానికి ముందు కొద్దిగా నీళ్లో, జ్యూసో తాగండి. అలా అని కడుపు నిండేలా తాగకూడదు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మొదట్లో మనకు మనమే ఎక్విప్ మెంట్ ని యూజ్ చేయాలని ప్రయత్నించకూడదు. కచ్చితంగా ఇన్ స్ట్రక్టర్ ని అడిగి, వాళ్లు చెప్పిన విధంగానే చేయాలి. ఎలా పడితే అలా చేసేస్తే కండరాలు పట్టేస్తాయి. ఎముకలు డ్యామేజయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. అలాగే ఒకేసారి ఎక్కువ వ్యాయామం చేసేయాలని అనుకోకూడదు. మెల్లగా మొదలుపెట్టి సమయం పెంచుకుంటూ పోవాలి. లేదంటే విపరీతంగా ఒళ్లు నొప్పులు వచ్చి వ్యాయామం చేయడమే కష్టమైపోతుంది. అదే విధంగా వ్యాయామం చేస్తున్నంతసేపూ మనసుని రిలాక్స్ చేయడం చాలా అవసరం. శరరం కష్టపడుతోంది కదా ఆ ఒత్తడిని మనసు మీద పడనివ్వకూడదు. అందుకే అయితే మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. లేదంటే వ్యాయామం చేస్తున్నంతసేపూ చక్కని సంగీతం వినండి. చాలా జిమ్స్ లో ఈ సౌకర్యం ఉంది. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటేనే జిమ్ లో మీ అనుభవం ఆనందంగా ఉంటుంది. ఫలితం తృప్తికరంగా ఉంటుంది. - Sameera
read moreఈ జ్యూసులు తాగితే సన్నబడటం ఖాయం
ఈ జ్యూసులు తాగితే సన్నబడటం ఖాయం! బరువు తగ్గడం పెరిగినంత తేలిక కాదు. నోరు కట్టేసుకుని, కడుపు కాల్చుకుని ఎంత కష్టపడినా తగ్గని బరువును చూసి తెగ బెంగపడుతుంటారు చాలామంది. అలాంటివారికి డాక్టర్లు ఓ శుభవార్త చెబుతున్నారు. నోటికి రుచిగా కొన్ని జ్యూసులు తాగుతూ కూడా బరువు తగ్గొచ్చంటున్నారు. ఇదిగో... ఇవే ఆ జ్యూసులు. - గోరువెచ్చని నీళ్లలో ఆరెంజ్ జ్యూస్ కలుపుకుని, కొద్దిగా తేనె చేర్చి తాగుతూ ఉంటే క్రమక్రమంగా బరువు తగ్గుతారట. - పైనాపిల్ జ్యూస్ ఆకలిని తగ్గిస్తుందట. కాబట్టి రోజుకోసారి పైనాపిల్ జ్యూస్ తాగితే ఆహారాన్ని అధిక మోతాదులో తీసుకోకుండా మనల్ని మనం నియంత్రించుకోవచ్చు. - ద్రాక్షపండ్ల రసం శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుందట. - నిమ్మరసంలో ఉప్పు, తేనె చేర్చి పరగడుపున తాగినా కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. - జామకాయలో ఉండే విటమిన్ సి బరువును తగ్గించడంలో ఎక్స్ పర్ట్. - అవకాడో జ్యూస్ క్యాలరీలను కరిగిస్తుంది. - టొమాటోలను ఉడికించి, గ్రౌండ్ చేసి, కొద్దిగా బెల్లం కలుపుకుని మూడు పూటలా తాగినా మంచి ఫలితముంటుంది. చూశారు కదా? రుచికి రుచి... మంచికి మంచి. కాబట్టి తరచూ ఈ ఫ్రూట్ జ్యూసులు తాగండి. అయితే ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి. ఎప్పుడూ ఎందులోనూ పంచదార మాత్రం కలపవద్దు. కలిపారో... జ్యూస్ తాగడం వల్ల ఏ ఉపయోగం ఉండదు. -Sameera
read moreరోజూ స్కిప్పింగ్ చాలు.. ఆరోగ్యం సూపర్..
రోజూ స్కిప్పింగ్ చాలు.. ఆరోగ్యం సూపర్.. రకరకాల వ్యాయామాలపై దృష్టి సారిస్తూ, కొందరు తమ శరీర సౌష్టవాన్ని సంరక్షించుకుంటుంటే., ఇంకొందరు మాత్రం రోజూ ఒకే వ్యాయామాన్ని రోజు అనుసరిస్తూ తమ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకుంటున్నారు. ఇది ఏలా సాధ్యం... * శరీరం మొత్తానికి ఓకేసారి వ్యాయామం, తాడాట (స్కిప్పింగ్)తో సాధ్యమవుతుందని ఫిట్నెస్ ఎక్స్‌పర్ట్‌లు సూచిస్తున్నారు. * శరీరంలోని అవయవాల కదిలికను వేగవంతం చేయ్యటంతో పాటు వాటి మధ్య సమన్వయానికి స్కిప్పింగ్ తోడ్పడుతుందట. * రోజు స్కిప్పింగ్ చేయ్యటం వల్ల శరీరం ధృడత్వాన్ని సంతరించుకోవటంతో పాటు పూర్తి స్థాయిలో ఫిట్‌గా తయారవుతుంది. ఎముకలు గట్టిపడటంతో పాటు చర్మంపై ఏర్పడ్డ ముడతలు తొలగిపోతాయి. * స్కిప్పింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. పాదాలకు రక్షణ లేకుండా స్కిప్పింగ్ చేయ్యటం వల్ల పాదాలకు నొప్పి కలుగుతుంది. దాంతోపాటు పగుళ్లు ఏర్పడతాయి. * ముఖ్యంగా కాంక్రీట్ నేలపై స్కిప్పింగ్ చేసే సందర్భంలో బూట్లు వేసుకోవటం మంచింది. * బరువు తగ్గించటంలో స్కిప్పింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. * స్కిప్పింగ్ ప్రారంభించే ముందు ఐదు నిమిషాల పాటు వార్మప్ చేయ్యటం వల్ల శరీరం ఉల్లాసంగా ఉంటుంది.
read moreబరువు తగ్గాలంటే ఇవి తాగాల్సిందే!
బరువు తగ్గాలంటే ఇవి తాగాల్సిందే! పెరిగినంత త్వరగా తరిగేది కాదు బరువు. కాస్త జంక్ ఫుడ్ తింటే వచ్చేసే ఒళ్లు... నానా తంటాలు పడినా తగ్గదు. ఎక్సర్ సైజులనీ, డైటింగనీ ఎంత కష్టపడాలో. అయితే మీ కష్టాన్ని తగ్గించే మార్గం ఒకటుంది. రోజుకొకటి చొప్పున కొన్ని వారాల పాటు రోజూ ఉదయాన్నే పరగడుపున ఈ జ్యూసులు తాగేయండి. ఫలితం మీకే తెలుస్తుంది. 1. నాలుగు టొమాటోలు, ఓ కీర దోసకాయ, గుప్పెడు కొత్తిమీర ఆకులు కలిపి మెత్తగా బ్లెండ్ చేయాలి. దీనిలో కొద్దిగా నీళ్లు, ఉప్పు, మిరియాల పొడి కలిపి తాగాలి. 2. ఒక బీట్ రూట్, ఒక కట్ట పాలకూర, గుప్పెడు కొత్తిమీర ఆకుల్ని నీటితో కలిపి జ్యూస్ లా చేసుకోవాలి. దీనిలో కాస్తంత ఉప్పు కలిపి సేవించాలి. 3. ఓ యాపిల్, ఒక అరటిపండు, నీళ్లు కలిపి జ్యూస్ లా చేసుకోవాలి. దీనిలో కొద్దిగా నిమ్మరసం పిండి, చిటికెడు ఉప్పు వేసి తాగేయాలి. 4. క్యారట్, బీట్ రూట్, క్యాప్సికమ్ ఒక్కోటి చొప్పున తీసుకోవాలి. వీటిలో కొన్ని నల్లద్రాక్షలు, చిన్న అల్లం ముక్క కూడా వేసి మిక్సీ పట్టాలి. దీనిలో నీళ్లు కలిపి పల్చగా చేసుకుని తాగాలి. 5. పుచ్చకాయ, పుదీనాలను నీళ్లతో కలిపి మిక్సీలో వేసి జ్యూస్ చేసుకోవాలి. దీనిలో కొద్దిగా నిమ్మరసం, కాసింత మిరియాల పొడి వేసి సేవించాలి. 6. యాపిల్, కీరా, పాలకూరల్ని నీళ్లతో కలిపి జ్యూస్ చేసుకోవాలి. దీనిలో కాస్త నిమ్మరసం, ఉప్పు కూడా కలిపి తాగాలి. 7. టొమాటోలు, పాలకూర, క్యారెట్, మిరియాలు, ఉప్పు కలిపి చేసిన జ్యూస్ కూడా ఎంతో మంచిది. ఈ ఏడు జ్యూసుల్నీ రోజుకొకటి చొప్పున తాగి చూడండి. శరీరంలోని అదనపు కొవ్వు కరిగిపోయి మెల్లమెల్లగా బరువు తగ్గిపోతారు. శరీరంలో తేమ పెరిగి చర్మం తళుకులీనుతుంది. ఒంట్లో శక్తి పుంజుకుంటుంది. అయితే ఒకటి. తాగలేకపోతున్నాం అని వీటిలో చక్కెర మాత్రం కలపకండి. కలిపారో... ఇక ఇవి తాగడం వల్ల ఉపయోగం ఉండదు. - Sameera
read moreసన్నబడాలా... ఈ థియరీ ఫాలో అవ్వండి!
సన్నబడాలా... ఈ థియరీ ఫాలో అవ్వండి! సన్నబడాలి. కానీ కష్టపడకూడదు. బద్దకమేసి కాదు. టైమ్ లేక. ఇప్పుడు ఇదే చాలామందికి ఉన్న సమస్య. బరువు పెరుగుతున్నామని తెలిసినా తగ్గడానికి సమయం వెచ్చించలేని పరిస్థితి. అలాంటివారి కోసమే ఇది. సన్నబడటానికి ఒక సింపుల్ పద్ధతి... ఫుడ్ రీప్లేస్ మెంట్. అవును. మీరు సహజంగా తినే కొన్ని రకాల ఆహార పదార్థాలను వేరే వాటితో రీప్లేస్ చేస్తే చాలు... పనైపోతుంది. - రోజూ ఉదయం కాఫీ, టీలలో వేసుకునే పాల నుంచి డెబ్భైకి పైగా క్యాలరీలు వస్తాయి. కాబట్టి పాలు కలిపిన కాఫీ, టీల బదులు లెమన్ టీ, గ్రీన్ టీ వంటివి తాగండి. - గారెలు, మైసూర్ బజ్జీలకు ఫుల్ స్టాప్ పెట్టి ఇడ్లీ, దోశలు బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోండి. దోశలు నూనె లేకుండా కాల్చాలి సుమా! - పాలతో ఏదైనా పదార్థం చేస్తుంటే కనుక మామూలు పాలను స్కిమ్డ్ మిల్క్ తో రీప్లేస్ చేయండి. దానివల్ల ఓ కప్పుకు దాదాపు డెబ్భై రెండు క్యాలరీల చొప్పున తగ్గుతాయి. - చికెన్, ఫిష్ లాంటి వాటిని ఫ్రై చేసే బదులు గ్రిల్ చేయండి. కూరలు కూడా వండొద్దు. ఎందుకంటే ఓ కప్పు చికెన్ కరీలో 250 క్యాలరీలు ఉంటే... గ్రిల్డ్ చికెన్ లో 114 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. మరి ఎంత మేలు! - మామూలు రైస్ ని బ్రౌన్ రైస్ తో రీప్లేస్ చేయండి. - సమోసాలు, పకోడీలు, చిప్స్ లాంటి స్నాక్స్ కి బదులు ఫ్రూట్స్ తీసుకోండి. ఫ్రూట్ చాట్, ఫ్రూట్ సలాడ్స్ లాంటివి తినడం వల్ల కడుపూ నిండుతుంది, బరువూ పెరగరు. - ఫ్రైడ్ ఎగ్ కంటే ఉడికించిన ఎగ్ ఎంతో మంచిది. బాయిల్డ్ ఎగ్ లో 78 క్యాలరీలు ఉంటే ఫ్రై చేసిన దానిలో 100 క్యాలరీలు ఉంటాయి. మరి ఏది బెస్ట్! - కూల్ డ్రింక్స్ ని మంచినీటితో రీప్లేస్ చేయండి. మంచినీరు చేసినంత సాయం ఏ పానీయమూ చేయదు. నీటి వల్ల క్యాలరీలు పెరగవు కానీ ఒక్క డ్రింక్ తాగినా నూట యాభైకి పైగా క్యాలరీలు పెరుగుతాయి. అందుకే దాహం వేసినప్పుడల్లా దాన్నే ఆశ్రయించండి తప్ప కూల్ డ్రింక్స్ వైపు చూడకండి. ఈ రీప్లేస్ మెంట్ థియరీ ఫాలో అయితే బరువు పెరగరు. ఆల్రెడీ ఉన్న బరువు తగ్గుతారు. ఎప్పుడూ తినే వాటిలో మార్పులు చేయడమే కాబట్టి పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. - Sameera
read moreపొడవుగా ఉన్న అమ్మాయిలు పారాహుషార్
పొడవుగా ఉన్న అమ్మాయిలు పారాహుషార్..!! మీరు పొడవుగా ఉన్న అమ్మాయా..? మీ ఫ్రెండ్స్ కన్నా హైట్‌గా ఉన్నారని కాస్తంత ప్రౌడ్‌గా ఫీలవుతున్నారా..? అంత సంబరపడిపోకండి..! మీ హైటే మీకు శాపంగా మారబోతోందని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు.. ఆడవారి పొడవుకి వారి ఆరోగ్యానికి సంబంధం ఉందని తాజా పరిశోధనలో తేలిందట.. అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. https://www.youtube.com/watch?v=Xbuu5mIXMeM
read moreProtein Rich Food
Protein Rich Food Spread out protein intake throughout the day instead of mega doses just once or twice. A serving of protein along with healthy carbs after a workout is a must to help tired muscles recover. Here are some tantalizing ways to work protein into your meals and snacks no matter what time of day you exercise. Below is a list of foods with the highest protein density, for more information, see the sections on other protein rich foods...
read moreఅందాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చే డ్రై ఫ్రూట్స్
అందాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చే డ్రై ఫ్రూట్స్ (Health and Beauty with Dry Fruits) మనలో చాలామంది ఆకలి తీర్చుకోడానికి ఏదో ఒకటి తింటాం. అంతేతప్ప మనం తీసుకున్న ఆహారంలో ఎన్ని కాలరీలు ఉన్నాయి, ఎంత ఆరోగ్యకరంగా ఉంది, శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుందా, మానసికంగా ఏమైనా మేలు చేస్తుందా లాంటివి బొత్తిగా ఆలోచించం. కొందరు ఆహారం విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటారు. అందుకు తగ్గట్టు వాళ్ళు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు. కనుక ఆకలి తీరితే సరిపోతుంది అనుకోకుండా ఎం తింటున్నాం, ఎంత పరిమాణంలో తింటున్నాం అనేది కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఇప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ ఎలా, ఎంత పరిమాణంలో తినాలో, వాటివల్ల ప్రయోజనం ఏమిటో తెలుసుకుందాం. ఖర్జూరం , అత్తి పండు , సీమబాదం:- అత్తిపండు, సీమబాదం డ్రైఫ్రూట్స్ చాలా మేలైనవి. వీటిల్లో ఏదో ఒకదాన్ని క్రమం తప్పకుండా ప్రతిరోజూ తీసుకోవాలి. వీటిలో ఐరన్, ఫైబర్, విటమిన్ ‘ఎ’, విటమిన్ ‘సి’ ఉన్నాయి. కంటి చూపును మెరుగుపరుస్తాయి. వీటిని కడిగి నీళ్ళలో నానబెట్టండి. మర్నాడు ఉదయాన ఆ నీళ్ళు తాగండి.. ఒకసారి ఒక రకం సరిపోతుంది. ప్రతిదీ టానిక్ లా పనిచేస్తుంది. బాదం:- బాదంలో పోషక విలువలు చాలా ఎక్కువ. కనుక రోజుకు ఐదు, ఆరు బాదం పప్పులు తినండి. విడిగానే కాదు, ఏ రూపంలో అయినా తినొచ్చు. బాదం పైపొరలో వగరు ఉన్నప్పటికీ దానిలో ఉండే ఫ్యాట్ అన్ శ్యాచురేటెడ్ కావడంతో అది కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఎంతో సహాయకారిగా ఉంటుంది. బాదంలో ఉండే కాపర్ పరిమాణం ఎనీమియాను పోగొడుతుంది. బాదంవల్ల ముఖానికి గ్లో వచ్చి సౌందర్యం ఇనుమడిస్తుంది.
read moreడెలీవరి అయిన తర్వాత ఏం తినాలి.?
డెలీవరి అయిన తర్వాత ఏం తినాలి.? తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానం.. శిశువు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు తల్లిపాలను మించింది లేదు. రోగ నిరోధక శక్తిని పెంపొందించి.. ఎన్నో రకాల వ్యాధులు రాకుండా ఉండేందుకు తల్లిపాలు దివ్యౌషధం. ఇంతటి విశిష్టత కలిగిన తల్లిపాలను బిడ్డకు ఎలా పట్టాలి.. పాలు పుష్కలంగా రావాలంటే ఏం తినాలి.. ఇలా చాలా అంశాలపై అందరికీ అవగాహన ఉండదు.. ఇలాంటి అంశాలపై మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.
read more