బరువు తగ్గాలని అనుకునేవారికి గుడ్ న్యూస్.. ఇలా చేస్తే ఎంతో ఈజీగా..

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే బరువు తగ్గడం చాలా ముఖ్యం. బరువు పెరిగేకొద్దీ అనేక వ్యాధుల బారిన పడవచ్చు. అధిక బరువు రక్తపోటు నుండి మధుమేహం, ఇంకా కొన్ని రకాల క్యాన్సర్ల వరకు అన్నింటికీ ప్రధాన కారణమవుతుంది. పరిగా ధికా బరువు ఉంటే తమ పనులు తాము చేసుకోవడంలో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకే అధిక బరువును వదిలించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఆశించిన ఫలితం పొందేవారు తక్కువే. కానీ బరువు తగ్గడం చాలా సులభం అనే విషయం మీకు తెలుసా??  బరువు తగ్గడం ఈజీ అంటున్నారేంటి పిచ్చా?? అని నిందించాల్సిన పనిలేదు. నిజంగానే బరువు తగ్గడం సులువు. అయితే విషయమంతా బరువు తగ్గడానికి పాటిస్తున్న విధానాలలోనే ఉంది.  చాలామంది బరువు తగ్గడానికి ఫుడ్ స్కిప్ చేయడం నుండి జిమ్‌లో గంటలు గడపడం వరకు ఎన్నో చేస్తారు. కానీ వీటి వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. అందుకే సరైన పద్ధతులను శ్రద్ధగా పాటించడం చాలా ముఖ్యం. ఇది బరువు పెరగకుండా నిరోధించడమే కాకుండా ఇతర శరీరక ప్రయోజనాలను కూడా  చేకూరుస్తుంది. బరువు తగ్గాలని అనుకునేవారు అసలు బరువు ఎందుకు పెరుగుతున్నాం అనే విషయం గురించి ఆలోచించాలి.  రోజువారీ చేసే పనులు ద్వారా ఖర్చయ్యే దానికంటే ఎక్కువ కేలరీలు తీసుకుంటే, అది బరువు పెరగడానికి కారణమవుతుంది. అంటే మొదట బరువు పెరగకుండా నియంత్రించాలి. ఎప్పుడైతే బరువు పెరగడం ఆగుతుందో అప్పుడు బరువు తగ్గడానికి చేసే ప్రయత్నాలు పనిచేయడం మొదలుపెడతాయి. రోజు ఏమి తింటున్నారు?? ఎంత పని చేస్తున్నారు?? శారీరక శ్రమ ఎంత ఉంది??. వ్యాయామం వల్ల ఎలాంటి మార్పులు వస్తాయి.. ఇవన్నీ గమనించుకోవడం చాలా ముఖ్యం.  సాధారణంగా బరువు తగ్గాలని అనుకునేవారు ఆహారంలో కేలరీలు తగ్గుతాయి అనే భ్రమతో తిండి తగ్గిస్తుంటారు. దీనివల్ల ప్రయోజనాలు చేకూరకపోగా ఇతర ఆరోగ్య సమస్యలు కారణం అవుతుంది.  కాబట్టి బరువు తగ్గాలి అంటే కేలరీలు తక్కువ ఉండి, కడుపు నింపే ఆహారాలు తీసుకోవాలి. దీనీవల్ల శరీరంలో  కేలరీలు పేరుకుపోవు, అధికబరువు క్రమంగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇందుకోసం రోజులో తీసుకునే చక్కెర-తీపి పానీయాలు, బేకరీ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ వంటివి తగ్గించుకోవాలి. వీటికి బదులు సలాడ్స్, పండ్లు, పండ్ల రసాలు తీసుకోవాలి. ఇవి బరువు తగ్గించుకోవడానికి  ప్రయోజనకరంగా ఉంటాయి. వ్యాయామం తప్పనిసరి.. బరువు తగ్గడానికి ఎన్ని పద్ధతులు ఫాలో అయినా వాటికి జతగా వ్యాయామం ఉండాల్సిందే. ఇది బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. కేలరీలు పొదుపుగా తీసుకుంటూ ఒంట్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కరిగించడం వల్ల బరువు చాలా ఈజీగా తగ్గుతారు. ఆహార మార్పుల ద్వారా మాత్రమే బరువు తగ్గడం సాధ్యం కాదు. బరువు తగ్గడానికి అందుబాటులో  ఉన్న మరొక గొప్ప  మార్గం యోగ. ప్రతిరోజు యోగ చేస్తూ డైట్ ఫాలో అయితే బరువు తగ్గడం చూసి ఎవరికి వారు ఆశ్చర్యపోతారు.  కాబట్టి ఆహారంలో కేలరీలు తగ్గించడం, వ్యాయామం చేస్తూ కొవ్వును కరిగించడం, డైట్ మెనూ ఫాలో అవ్వడం ఇవి పాటిస్తే అద్బుతమే..                               ◆నిశ్శబ్ద.

read more
గుట్కా తింటే గుటుక్కే!

నోటి క్యాన్సర్... తల మెడ భాగాలకు వచ్చే క్యాన్సార్ లలో నోటి క్యాన్సర్ ముఖ్యమైనది.నోటి లోపలి భాగాన్ని ఓరల్ కావిటి అంటారు. నోటి వెనుక గొంతు పై భాగాన్ని ఓరో ఫారింక్స్ అంటారు. నోటి క్యాన్సర్ రానే కూడదు కాని వచ్చిందంటే మాత్రం చాలా త్వరగానే అతి ప్రమాదకరం గా పరిణమిస్తుంది. అసలు నోటి లోపలి భాగాలు ఏమిటి. *పెదాలు ,దంతాలు, చిగుళ్ళు. *పెదాల లోపలి పోర,బుగ్గల లోపలి పోర. *నాలుకకింది నోటి అడుగు భాగం. *నోటి పై భాగం అంగుటి. *జ్ఞాన దంతాల వెనుక ఉండే స్వల్ప భాగం. గొంతు పై భాగాన ఉండే ఒరోఫర్యర్ లో కింది భాగాలు ఉంటాయి. *నాలుక వెనుక మూడోవంతు భాగం. *మెత్తటి అంగుటి. *టాన్సిల్. *ఓరో ఫారింక్స్  నోటి క్యాన్సర్ నోటిలో ఎబాగామైనా రావచ్చు. సాధారణంగా నాలుకమీద లేక నాలుక కింద గాని క్యాన్సర్ ప్రారంభ మౌతుంది.దాదాపు నోటి క్యాన్సర్లు అన్ని కూడా నోరు, పెదాల పై భాగం పొరల లోని చదును కణాలు ఫ్లాట్ సెల్ల్స్ స్కుమౌస్ కణాలు నుండి మొదలు అవుతాయి.అందుకు నోటి క్యాన్సర్స్ ను స్కుమౌస్ సెల్ కార్సినోమా గా వ్యవహరిస్తారు.సాధారణంగా నోటి క్యాన్సర్ ఇతర శరీర భాగాలకు వ్యాపించడం లింఫ్ వ్యవస్థ ద్వారా జరుగుతుంది. లింఫ్ నోడ్స్ లోకి ప్రవేశించిన క్యాన్సర్ కణాలు వాటిలో స్వాచమైన నీటిలా ఉండే లింఫ్ ద్రవం ద్వారా ఇతర శరీర భాగాలకు వెళ్లి అయాభాగాలకు క్యాన్సర్ ను వ్యాపింప చేస్తాయి.  నోటి క్యాన్సర్ లక్షణాలు... నోటి క్యాన్సర్ సాధారణంగా తెల్లటి మచ్చతో ప్రారంభ మౌతుంది. దీనిని ల్యుకో ప్లేకియా లేక చిన్న గడ్డతో కూడా ప్రారంభం కావచ్చు.ఈ మచ్చ లేదా గడ్డ వద్ద నొప్పి అంటూ ఏమీ ఉండదు కానీ ఒక్కోసారి మంట పెడుతూ ఉంటుంది.గడ్డ పెరిగి కొన్నాళ్ళకి పుండుగా తయారయి లేదా డని చుట్టూ భాగం గట్టిగా ఏర్పడి గద్దమధ్య పగిలి అక్కడ నుంచి రక్తం కారడం,కణితి పక్క కణజాలం భాగాలకు వ్యాపించడం జారుతుంది ఈ విషయాన్ని పరిసీలించాకుంటే తెలియదు. నోటి క్యాన్సర్ కు కారణాలు... నోటి క్యాన్సర్ కొందరికి ఎందుకు వస్తుంది. కొందరికి ఎందుకురాడు.అన్న ఖచ్చితమైన సమాధానం అంటూ లభించదు.అయితే నోటి క్యాన్సర్ అంటు వ్యాధి కాదు.ఈ కింది అలవాట్లు ఉన్న వారికి నోటి క్యాన్సర్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయాని పరిశోదనలు చెపుతున్నాయి. పొగాకు... నోటి క్యాన్సర్ రావడానికి ఎక్కువ సందర్భాలలో పొగాకు ప్రాధాన కారణంగా ఉంటుంది.చుట్ట,బీడీ,సిగరెట్, పైపు,సిగార్ హుక్కా,గుట్కా పొగాకు సేవనం నస్స్యం పీల్చడం మొదలైన పొగాకు సంబందమైన అలవాట్లు కూడా నోటి క్యాన్సర్ రావడానికి కారణాలుగా నిపుణులు నిర్ధారించారు.ముఖ్యంగా దీర్ఘకాలం పాటు అతిగా పొగతాగే వారికి మద్యం తాగే వారికి రిస్క్ మరింత ఎక్కువగా ఉంటుందని మాద్యం పోగాతాగాడం రెండు అలవాట్లూ కలిసి ఉండడం అదీ అధికంగా ఉన్నవాళ్ళకు నోటి క్యాన్సర్ తేలికగా వస్తుంది.ఇక్కడ గమనించాల్సిన విష్యం ఒకటి ఉంది శ్రీకాకుళం జిల్లలో కాలుతున్న చుట్టభాగాన్ని నోటిలో పెట్టుకుని పొగాకు సేవించడం ఒక ఆన వాయితీగా ఉంది వీళ్ళు నోటిక్యాన్సర్  వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని దీనిని చుట్ట క్యాన్సర్ గా పేర్కొన్నారు. మధ్యం... మధ్యం ముట్టని వల్ల కంటే మధ్యం తాగే వారికి నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ మాధ్యమం ఎంత ఎక్కువ తాగితే అంత ఎక్కువ పరిమాణం  ఉంటుందనిరిస్క్ అంతే ఎక్కువ.మాద్యం పొగాకు రెండూ అలవాట్లూ కలిసి ఉంటె నోటి క్యాన్సర్ త్వరగా వస్తుంది. అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైరస్ ఇన్ఫెక్షన్లు... హ్యూమన్ పాపిలోమా వైరస్ ఒకరేఅకమైన వైరస్ మూలంగా నోరు గొంతు క్యాన్సర్ కలగ వచ్చు. లైంగిక కలాపాల వల్ల సంక్రమించే వైరస్ లు నాలుక అడుగుభాగాన గొంతు వెనుక భాగాన టాన్సిల్స్ కి మెత్తటి అంగిటి వచ్చే క్యాన్సర్లు ఎక్కువగా హెచ్ పి వి ఇన్ఫెక్షన్ల మూలంగానే వస్తాయి. వక్కపొడి కిళ్ళీ నమలడం వంటి అలవాటు ఉన్న వాళ్ళకి రిస్క్ మరింత ఎక్కువ ఉంటుంది క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నది దీని ఆర్ధం. క్యాన్సర్ చికిత్చ... నోటి క్యాన్సర్ చికిత్చ ప్రారంభ దశలో గుర్తిస్తే రోగికి సర్జరీ ద్వారా రేడియో తెరఫీ ద్వారా కాని చికిత్చ చేస్తారు.క్యాన్సర్ ముదిరితే పరిస్థితిని బట్టి కొన్ని సందర్భాలలో రేడియో తెరఫీ,లేదా కీమో తెరఫీ తార్గేతేడ్ తెరఫీ వంటి చికిత్చాలు చేస్తారు.మీ అలా వాట్లే మీనోటి క్యాన్సర్కు కారణం గా మారచ్చు.        అస్సాం లో పెరుగుతున్న నోటి క్యాన్సర్ బాదితులు.. గౌహతికి చెందినా బి బి సి ఆసుపత్రిలో 56 మంది రోగులకు ఓరల్ మౌత్ క్యాన్సర్ చికిత్చ చేసారు. అదీ 25 సం వత్చరాలనుండి 4౦ సం వత్చరాల వయసు ఉన్నవారు కావడం ఆందోళనకలిగిస్తోంది. అని నిపుణులు అంటున్నారు.ఇది ప్రామాడ ఘంటికలు మొగిస్తోందని నోటిలో వచ్చే కేవిటి నోటి క్యాన్సర్ సహజంగా గుర్తించ వచ్చు సహజంగా 6౦ సంవత్చరాలు వయసు పై బడిన వారిలో రెండు సంవత్చారాల్ క్రితం చూసేవారమని ఇప్పుడు 4౦ సంవత్చారాల లోపు ఉన్న వారిలో నోటి క్యాన్సర్ కేసులు అధికసంఖ్యలో పెరగడం పై అమ్కాలజిస్ట్ లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యధికంగా పొగాకు సేవించడం ప్రాధాన కారణంగా యువత అలాగే గుట్కా కు అలవాటు పడడం క్యాన్సర్ కు కారణం. 2౦21 నాటి గణాంకాల ప్రకారం నార్త్ ఈస్ట్ లో అతిపెద్ద ఆసుపత్రి కి చెందిన క్యాన్సర్ నిపుణుడు డాక్టర్ బారు క్యాన్సర్ ఆసుపత్రి లో 56 మంది 25 సంవత్చారాల రోగులకు నోటి క్యాన్సర్ కు చికిత్చ ను డాక్టర్ నిర్వహించారు.మణి శ్రీ వ కృష్ణ త్రేయ వైద్య క్య్న్సర్ విభాగం ఎపిడమాలాజి యువతలో  క్యాన్సర్ కేసులు పెరగడాన్ని గుట్కాలు  నమలడం ప్రేస్టేజి గా తీసుకుని మరీ పోటి పది తినడం  ఒక కారణంగా పేర్కొన్నారు.అందులో నూ 25 ---4౦ సం మధ్య అస్సాం ఇతర ఉత్తరదేశంలోని రాష్ట్రాలలోని వారే అని నోటి క్యాన్సర్ రోగులు గుట్కా వాడకం వల్లే మరియు పొగాకు ఉత్పత్తుల్లో క్యాన్సర్ కు కారాణం గుట్కా ఇతరాపోగాకు ఉత్పత్తులు ఎక్కువగా యుక్త వయస్సులో ఉన్న వారే అని అంటే టీనేజ్ ఉంటున్నారని క్రిష్ణవర్మ తెలిపారు. ఇందులో ౩8 మంది పురుషులు 18 స్త్రీలు నోటి క్యాన్సర్ బారిన పడ్డ వారిలో 5 గురు మాత్రమే ప్రాధమిక స్థాయి లో ఉన్నవారే అని ఎక్కువ సంఖ్యలో ముదిరిపోయిందని.ఇతర క్యాన్సర్ల లాగానే ముదిరి పోయిందని చాలాకాలంగా ఉంది ఉండవచ్చని కృష్ణ అన్నారు.క్యాన్సర్ అవగాహన కార్యక్రమం లో భాగంగా పలువురు ప్రముఖులు కార్క్రమం లో పాల్గొని క్యాన్సర్ గుర్తించిన వెంటనే సత్వర చికిత్చ చేసుకోవాలని. ఇప్పటికే భారత్ లో 1.6 మిలియన్ల అంటే దాదాపు 1౦ లక్షల క్యాన్సర్ కేసులు సంవత్చారానికి పెరుగుతున్నాయని భగవతి ఆందోళన వ్యక్తం చేసారు అస్సాం చుట్టుపక్కల ప్రాంతాలలో ౩8,౦౦౦ కొత్త కేసులు ప్రతి సంవత్చారం గుర్తిస్తున్నారు.                              

read more
ads
Online Jyotish
Tone Academy
KidsOne Telugu
విటమిన్-సి లోపం వచ్చిందని గుర్తుపట్టడం ఎలా?

శరీరాన్ని ఆరోగ్యంగా,  ఫిట్‌గా ఉంచుకోవడానికి, ఆహారంలో పోషకాలు బాగా తీసుకోవాలి.  మనం తీసుకునే ఆహారం శరీరంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. పౌష్టికాహారాన్ని ఎక్కువగా తీసుకునే వ్యక్తులకు  తక్కువ అనారోగ్య సమస్యలు వస్తాయి.  ఆరోగ్యకరమైన, పోషకమైన ఆహారం శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది.  ఇందుకోసం విటమిన్-సి అవసరం. సమతులాహారం తీసుకుంటే శరీరానికి కావల్సిన విటమిన్-సి సులువుగా అందుతుంది. కానీ చాలామంది సమతులాహారం తీసుకోరు. అందుకే అనారోగ్యాలు తొందరగా వచ్చేస్తున్నాయి.  విటమిన్-సి శరీరానికి ఎలా మేలు చేకూరుస్తుందంటే.. విటమిన్ సి ని ఆస్కార్బిక్ యాసిడ్ అని కూడా పిలుస్తారు, ఇది శరీరంలో యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి కణాలను రక్షించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆహారం ద్వారా విటమిన్-సిని పొందడం ద్వారా శరీర రోగనిరోధక శక్తిని సులభంగా పెంచుకోవచ్చు. కణాలను రక్షించడంలో వాటిని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడటమే కాకుండా, చర్మం, రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా ఇది అవసరం. విటమిన్ సి లోపిస్తే.. శరీర రోగనిరోధక శక్తికి విటమిన్-సి చాలా అవసరం కాబట్టి, అది లోపిస్తే, అంటు వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. ఆహారంలో పోషకాహారం లేని వ్యక్తులలో విటమిన్ సి లోపం ఎక్కువగా ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా, డయాలసిస్ చేయించుకునే కిడ్నీ వ్యాధి ఉన్నవారు, ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వ్యక్తులు కూడా విటమిన్ సి లోపంతో బాధపడుతుంటారు. ధూమపానం చేసినప్పుడు ఏర్పడే ఫ్రీ రాడికల్ డ్యామేజ్‌ను తిరిగి సాధారణం చేయడానికి  ప్రతిరోజుకు అదనంగా 35 మిల్లీగ్రాముల విటమిన్ సి అవసరం అవుతుంది.  విటమిన్ సి  లోపం ఉందని ఎలా తెలుసుకోవాలంటే.. విటమిన్-సి లోపం వల్ల శరీరంలో అనేక దుష్ప్రభావాలు కలుగుతాయి. పెద్దలలో, విటమిన్ సి లోపం యొక్క లక్షణాలు వారాల నుండి నెలల వరకు డవలప్ అవుతాయి.  దీని కారణంగా బలహీనత, అలసట, చిరాకు, బరువు తగ్గడం, గాయాలు సరిగా మానకపోవడం, తరచుగా ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం వంటివి జరుగుతాయి. విటమిన్-సి లోపం వల్ల స్కర్వీ వ్యాధి వస్తుంది. ఇతర వ్యక్తుల కంటే ఎక్కువగా అనారోగ్యానికి గురైతే, ఇది విటమిన్-సి లోపానికి కూడా సంకేతం. విటమిన్ సి  ఎలా పొందాలంటే.. విటమిన్-సి కోసం, ఆహారంలో చాలా సులభమైన మార్పు చేసుకోవచ్చు. నారింజ, నిమ్మ వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కాకుండా, నల్ల మిరియాలు, స్ట్రాబెర్రీ, బ్రోకలీ, కివి, పైనాపిల్ మొదలైన వాటిని కూడా సులభంగా నెరవేర్చడానికి ఉపయోగించవచ్చు. తీసుకునే ఆహారంలో ఇవి తప్పక ఉండేలా చూసుకుంటే విటమిన్ సి లోపాన్ని అధిగమించవచ్చు.                                   ◆నిశ్శబ్ద.

read more
ప్యాక్డ్ జ్యూసుల గుట్టేంటో తెలిస్తే విస్తుపోతారు!

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పండ్లు, పండ్ల రసాలు చాలా మంచివని వైద్యులు చెబుతారు. ఆరోగ్యం మీద అంతో ఇంతో స్పృహ ఉన్నవారు కూడా పండ్లు, పండ్ల రసాల మీద ఆసక్తి చూపిస్తారు. చాలామంది పండ్లు తినడం కంటే పండ్ల రసాలు తీసుకోవడానికే మొగ్గు చూపుతారు. కానీ పండ్ల రసాలు తయారు చేసుకోవాలంటే బద్దకం వల్లా, అవి చేసుకునేంత సమయం లేకపోవడం వల్ల బయట దొరికే వాటికి ప్రాధాన్యత ఇస్తారు. బయట ప్యాక్ చేయబడిన జ్యుస్ ప్యాకేట్స్, బాటల్స్ మీద కూడా 100% ప్యూర్ అనే మాటను చూసి అవన్నీ ఆరోగ్యమే అనే ఆలోచనతో వాటిని బాగా కొని తాగుతూ ఉంటారు. అయితే  ప్యాకేజ్డ్ జ్యూస్‌ల ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి వాటిలో కొన్ని రకాల ప్రిజర్వేటివ్‌లు, కృత్రిమ చక్కెరలు ఉంటాయి.  ఇవి అనేక విధాలుగా హాని చేస్తాయి.  జ్యూస్ ల ద్వారా ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలని అనుకుంటే తాజా పండ్ల రసాన్ని మాత్రమే తీసుకోవడం ఉత్తమం. పిల్లలు, పెద్దలు కూడా బయటకెళ్లినప్పుడు పండ్ల రసాన్ని ఇష్టపడతారనడంలో సందేహం లేదు, ప్యాక్‌డ్ జ్యూస్‌లు శరీరానికి మేలు చేస్తాయని అనుకుంటాం కానీ నిజానికి దాని వల్ల మనం అనుకున్నంత ప్రయోజనం ఉండదు.  ప్యాకేట్స్, బాటల్స్ అందంగా కనబడుతూ ఆకర్షిస్తాయి, ఇక ఏ సెలబ్రిటినో వాటిని ప్రమోట్ చెడితే కొనుగోళ్లు జోరందుకుంటాయి. అయితే ఈ జ్యుస్ లు ముమ్మాటికీ హాని చేసేవే..  100% నిజమైన జ్యూస్‌ అంటూ ప్యాకేజ్డ్ జ్యూస్‌లు అమ్ముడవుతున్నాయి. అవన్నీ కూడా ఆమోదం తెలిపినవే అని, తక్షణ శక్తిని ఇస్తాయని ఎన్ని కబుర్లు చెప్పినా వాటిలో చక్కెర, రంగు, రసాయనాలు తప్ప ఇంకేమి ఉండదు.  చాలా వరకు ప్యాకేజ్డ్ పండ్ల రసాలలో ఆర్సెనిక్, సీసం వంటి రసాయనాలు ఉంటాయి.  ఇవి చాలా తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగిస్తాయి.  దాదాపు 24  రకాల పండ్ల రసాల బ్రాండ్లను పరీక్షించిన తరువాత అన్నింటిలోనూ సీసం శాతం ఎక్కువగా బయటపడింది. ఇవి పిల్లలలో న్యూరో డెవలప్‌మెంటల్ సమస్యలను కలిగిస్తాయి. మరీ ముఖ్యంగా ఆపిల్ జ్యుస్ కి సంబంధించిన బ్రాండ్లలో ఇది ఎక్కువగా ఉంటుంది.  ఖచ్చితంగా చెప్పాలంటే , ఆర్సెనిక్ అనేది పర్యావరణ కాలుష్యం, అలాంటిది మనిషికి ఇంకెంత ప్రమాదం చేకూరుస్తుందో అర్థం చేసుకోవచ్చు.  యాపిల్స్, ద్రాక్ష సహజంగా మట్టిలో ఉన్న, లేదా పురుగుమందుల కోసం ఉపయోగించే ఆర్సెనిక్‌ను సహజంగానే గ్రహిస్తుంది. ఇలాంటి వాటితో ప్యాక్డ్ జ్యుస్ లు తయారుచేస్తే అవి శరీరానికి మరింత హాని కలిగిస్తాయి.  ప్యాక్ చేయబడిన జ్యుస్ ల గుట్టు ఏంటో తెలుసా.. ప్యాక్ చేయబడిన జ్యూస్ లు బహుశా తక్కువ నాణ్యత గల పండ్ల నుండి తయారు చేయబడతాయి. ఈ జ్యూస్ లు మంచి రుచిని, సువాసనను కలిగి ఉంటాయి. తాగేకొద్ది తాగాలని అనిపిస్తుంది. రంగు కూడా టెంప్టింగ్ గా ఉంటుంది. కానీ అన్నీ కృత్రిమమే అనే విషయం గుర్తుంచుకోవాలి. ఇవన్నీ ఆరోగ్యానికి హాని కలిగించేవే.. డయాబెటిక్ లేదా అధిక బరువు ఉన్నవారు ప్యాక్డ్ జ్యూస్‌లను అసలు తీసుకోకూడదు. ఇంకా ఈ ప్యాక్ జ్యుస్ లు ఎక్కువగా తాగే వారికి తొందరగా డయాబెటిక్, అధిక బరువు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త.                                  ◆నిశ్శబ్ద.

read more
జుట్టు ఎందుకు తెల్లబడుతుంది... దీన్ని నివారించడానికి ఏమి చేయాలంటే..

దాదాపు అన్ని వయసుల వారిలోనూ జుట్టు సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. జుట్టు రాలడం నుండి జుట్టు బూడిద రంగులోకి మారడం వరకు, సమస్యలు చాలా సాధారణంగా కనిపిస్తుంటాయి.  అయితే దాని వెనుక కారణం మీకు తెలుసా? కాలుష్యం, ఆహార అలవాట్లు, ఒత్తిడి వంటి పరిస్థితులు జుట్టుపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా 50 ఏళ్ల తర్వాత జుట్టు తెల్లబడటం ప్రారంభిస్తుంది, కానీ కొందరిలో ఈ సమస్య 20-30 ఏళ్ల వయస్సులో లేదా అంతకంటే ముందే కూడా రావచ్చు. జుట్టు తెల్లబడటానికి గల  కారణాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. వృద్ధాప్యంలో సాధారణంగా వెంట్రుకల కుదుళ్లలో రంగు ఉత్పత్తి తగ్గడం ప్రారంభమవుతుంది.  ఈ కారణంగానే జుట్టు రంగు మారడమనే సమస్య ఏర్పడుతుందని వైద్యులు అంటున్నారు. కానీ ఇది ఎందుకు జరుగుతుంది?? దానిని ఎలా నిరోధించవచ్చు?? పూర్తిగా తెలుసుకుంటే.. జుట్టు కుదుళ్లలో వర్ణద్రవ్యం ఉత్పత్తి చేసే కణాలు ఉంటాయి, ఇవి జుట్టుకు నలుపు రంగును ఇచ్చే మెలనిన్ అనే రసాయనాన్ని తయారు చేస్తాయి. ఈ కణాలు చనిపోవడం వల్ల మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీని కారణంగా జుట్టు సమస్యలు మొదలవుతాయి, ముఖ్యంగా జుట్టు బూడిదరంగు లేదా తెల్లగా మారుతుంది.  ఒకసారి ఒక ఫోలికల్ మెలనిన్ ఉత్పత్తిని ఆపివేస్తే, అది మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం లేదు. చిన్న వయసులో వచ్చే సమస్యలు.. వయసు పెరిగే కొద్దీ జుట్టు తెల్లబడటం సహజమే, అయితే ఈ సమస్య చిన్న వయసులోనే ఎందుకు మొదలవుతుంది? అనే విషయాలు పరిశీలిస్తే.. అధిక ఒత్తిడిని తీసుకోవడం లేదా ఏదైనా అంతర్లీన ఆరోగ్య సమస్య వంటివి జుట్టు సమస్యలకు కారణమవుతాయి.  జుట్టు సమస్యలు ఎక్కువగా జన్యువులపై ఆధారపడి ఉంటాయని  నిపుణులు చెబుతున్నారు.  ఇది జుట్టు ఎప్పుడు నెరిసిపోతుందో నిర్ణయిస్తుంది. తల్లిదండ్రులలో ఎవరికైనా 30 సంవత్సరాల వయస్సులో జుట్టు నెరిసి ఉంటే, పిల్లలకు కూడా ముందుగా నెరిసిపోయే అవకాశం ఉంది.  తప్పక  తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు.. విటమిన్ B12 లోపం. న్యూరోఫైబ్రోమాటోసిస్ - నరాలు, ఎముకలు, చర్మాన్ని ప్రభావితం చేసే ఒక వారసత్వ వ్యాధి. బొల్లి సమస్య - ఈ పరిస్థితి మెలనోసైట్లు (వెంట్రుకల కుదుళ్ల బేస్ వద్ద వర్ణద్రవ్యం ఉత్పత్తి చేసే కణాలు) వాటి వర్ణద్రవ్యాన్ని కోల్పోతాయి. అలోపేసియా అరేటా సమస్య జుట్టు రాలడానికి సంబంధించినది, అయితే దీనివల్ల జుట్టు బూడిద రంగులోకి మారుతుంది. జుట్టు తెల్లబడకుండా ఆపడం ఎలా? వంశపారంపర్య ప్రమాదాన్ని తగ్గించలేనప్పటికీ, జుట్టు రంగు మారడాన్ని నివారించడానికి కొన్ని ప్రయత్నాలు చేయవచ్చు. యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ ఎక్కువగా తినాలి. కూరగాయలు పండ్లలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి జుట్టు నెరసిపోకుండా నిరోధించడంలో సహాయపడతాయి. ధూమపానం అలవాటుంటే మానేయాలి... ఆహారం నుండి తగినంత విటమిన్లు పొందాలి. మీ జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి విటమిన్ B-12 అవసరం. తగినంత ఖనిజాలను పొందాలి.  జుట్టు పెరుగుదలలో ,  కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో ఖనిజాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.                                    ◆నిశ్శబ్ద.

read more
ప్లాస్టిక్ వాడితే జ్ఞాపక శక్తి కోల్పోతారా?

ప్లాస్టిక్ వాడకం వల్ల పిల్లలలో జ్ఞాపకశక్తి కోల్పోతారా బలహీన పడతారని యోగా గురువు బాబా రామ్ దేవ్ స్పష్టం చేసారు. * ప్లాస్టిక్ వాడకం వల్ల క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉందని నిపుణులు అభిప్రాయ పడ్డారు.  * ఇంట్లో మనం వాడే ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేదించాలని కోరుతున్నారు. కాగా ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే వివిదతకాల అనారోగ్య సమస్యలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొన్నారు. ప్లాస్టిక్ పుట్టుక... 115 సంవత్సరాల క్రితం ప్లాస్టిక్ కనుగొన్నారని చారిత్రిక ఆధారాలు ఉన్నాయని పరిశోధకులు అంటున్నారు. ఈ అంశాల పై మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అప్పట్లో దీనిని అపరిచిత వస్తువుగా నే గుర్తించారు.అలాగే సింథటిక్,పాలిమర్ నాణ్యత కారణంగా ఎన్నో ఏళ్ళు నడిపించారు.చీటి ధర చాలా తక్కువగాను అందంగా ఉండడం తో దీనికి తోడు గట్టిగా ఉండడం తో ప్లాస్టిక్ ఇంట్లోకి, ఆఫీస్లోకి, అక్కడనుంచి బజారు లోకి చేరింది.నేడు కరెన్సీ నుండి  దీని వినియోగం ప్రతిరోజూ పెరుగుతూనే ఉంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇచ్చిన నివేదిక ప్రకారం గత 5౦ ఏళ్లలో ప్లాస్టిక్ వాడకం 2౦% పెరిగింది.పిల్లల జ్ఞాపక శక్తి కోల్పోయెంతగా బలహీన పడేవిధంగా ప్రభావితం చేసే రసయానాలు బిస్టినోల్ ఏ శరీరం లో ని హార్మోన్ తయారు చేసే చేసే విధానం వాటి లెవెల్స్ ను ప్రభావితం చేసే  అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వీటిలో ఉండే విష పదార్ధాలు రసాయనాలు మహిళల ఆరోగ్యం పై నేరుగా ప్రభావం చూపిస్తుంది. ఒక పరిశోదన ప్రకారం గాలిలో  తేలి యాడె మైక్రో ప్లాస్టిక్ పార్టికల్స్ ముక్కు ముఖం ద్వారా శరీరం లోకి చేరతాయని ఈ కారణంగా హార్ట్ ఎట్టాక్ కిడ్నీ ఫెయిల్యూర్ తో పాటు ఊపిరి తిత్తుల లో తీవ్ర ఇబ్బందులు పెరుగుతాయని విశ్లేషించారు.ఒక పరిశోదన వివరాల ప్రకారం గాలిలో తేలే ప్లాస్టిక్ పార్టికల్స్ వల్ల గర్భస్థ మహిళల  ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇన్నిరకాల సమస్యలు ఉన్నప్పటికీ ప్రాణాంతక వస్తువుల వినియోగం ఆగడం లేదు.ప్రస్తుతం అందుతున్న గణాంకాల ప్రకారం అమెరికా తరువాత భారత దేశంలోనే ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఉందని దీనిఆదారంగా మన అంచనా ప్రకారం ౩4 లక్షల టన్నుల ప్లాస్టిక్ చెత్త కేవలం మనదేశం లోనే వస్తోందని నివేదిక వెల్లడించింది. కొంత ఉపసమనం కలిగించే అంశం ఏమిటి అంటే ప్రాణాంతక ప్లాస్టిక్ పోల్యుషణ్ కాలుష్యం ప్లాస్టిక్ లో 19 రకాల వస్తువులపై నిషేధం విదించారు.సింథటిక్ పాలిమర్ వల్ల రోగాలు క్యాన్సర్ నుండి రక్షించుకునే ఉపాయం  ప్లాస్టిక్ ప్రాణాంతకం... * వేడిగా ఉండడం వల్ల బెస్ఫినోల్ ఏ లీక్ అవుతుంది. * తినే తాగే వస్తువులలో నికిల్ ఉంటుంది. * ప్లాస్టిక్ పార్టికల్స్ శరీరం లో చేరాయో క్యాన్సర్ వస్తుంది. ప్లాస్టిక్ పోల్యుషణ్ వల్ల ప్రమాదం... * పిల్ల జ్ఞాపక శక్తి బలహీన పడుతుంది. * హార్మోనల్ ఇం బ్యాలెన్స్ లెవెల్ స్థిరంగా ఉండదు. * గర్భస్థ మహిళల ఆరోగ్యం పై ప్రభావం ఉంటుంది. ప్లాస్టిక్ నుండి రక్షిమ్పబడాలంటే  వంటశాలలో ఈ మార్పులు చేయండి.. * స్టీల్ పాత్రల వాడండి. * అల్యూమినియం పాత్రలు వాడండి. * ప్లాస్టిక్ కన్ టైనర్లు నిషేదించండి * అల్యూమినియం ఫాయిల్స్ వినియోగించండి. ప్లాస్టిక్ వినియోగం వల్ల సమస్యల నుండి రక్షించుకోండి... * యోగా ప్రాణాయామం ప్రతిరోజూ చేయండి. * రోజులో ఒక్కసారైనా గెలోయ్ ను త్రాగండి * పసుపు పాలు తాగండి. * విటమిన్ సి కోసం పుల్లటి పండ్లు తినండి. * బయటికి వాచ్చినప్పుడు మాస్క్ ధరించండి. ప్రణాలతో చెలగాట మాదే ప్లాస్టిక్ ను సర్వత్ర నిషేధం తప్పనిసరి అని శాస్త్రజ్ఞులు,సామాజిక సంఘాలు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని. ఈమేరకు ప్రజా ఆరోగ్యం పరిరక్షణ కు ఉద్యమ స్పూర్తితో ప్రజలు ప్రభుత్వం స్వచ్చంద సంస్థలు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

read more
తలనొప్పికి, కంటికి ఉన్న లింకు ఇదే!

కంటి ఆస్పత్రికి వచ్చే రోగులను పరిశీలిస్తే ఎక్కువ మంది తలనొప్పితో వస్తారని తెలుస్తుంది.  అసలు తలనొప్పికి కారణమేమిటి ? తలనొప్పి ఉన్నప్పుడు కంటి ఆసుపత్రికి రావడం ఏంటి?? తలనొప్పికి కంటికి గల సంబంధం ఏమిటి?? చాలామందికి ఈ విషయాల గురించి తెలియదు.  వీటికి సంబంధించి విషయాలు తెలుసుకుంటే.. మనిషి శరీరంలో ఒక్కొక్క స్పర్శను తెలియ జేయడానికి ఒక్కొక్క నాడి వుంటుంది. నొప్పి, వేడి, చల్లదనం, రుచి, వాసన, దృష్టి మొదలైన వాటిని తెలిపే నాడులు మెదడులో ప్రత్యేకంగా వుంటాయి. శరీరంలో ఏ భాగంలో నొప్పి ఎక్కడ పుట్టినప్పటికీ, ఇది నాడీ మండల వ్యవస్థకు సంబంధించిన నొప్పేకాని ఇది వ్యాధి కాదు. ఇది వ్యాధిని సూచించే ఒక లక్షణం. మెదడులో నొప్పిని తెలిపే ఒక ప్రత్యేక నాడి వుంటుంది. దాన్ని ఉత్తేజిత పరిస్తే బాధ కలుగుతుంది. అయితే దాన్ని లేకుండా చేస్తే అసలు నొప్పి అనే ప్రశ్నే రాదు. నొప్పితో మొదలైన వ్యాధులన్నీ తీవ్రమైనవి కావు. అదేవిధంగా నొప్పి లేని వ్యాధులన్నీ స్వల్పమైనవీ కావు. నొప్పి అనేది మనలను మేల్కొలుపుతుంది. శారీరకంగా మనం ఇబ్బంది పడేలా చేస్తుంది. వ్యాధి మనిషిలో అంతర్గతంగా ఉంటుంది. ఇది అంత తొందరగా బయటపడదు. కాని వ్యాధి కంటె నొప్పే ఎక్కువ బాధిస్తుంది. కాన్సరు రోగిని పరిశీలిస్తే, కాన్సరు గడ్డ కాని, పుండుకాని నొప్పి లేకుండానే బయలు దేరుతాయి. ఇది మొదలైనప్పుడు మనిషికి ఎలాంటి లక్షణాలు కనబడవు. ఇది కాస్త ముదిరిన తరువాతే శరీరాన్ని హింస పెట్టడం మొదలుపెడుతుంది.  కావున ఈవ్యాధిలో నొప్పి అనేది చాలా చివరి దశ. అదేవిధంగా కుష్టు రోగిని పరిశీలిస్తే. అతని శరీరంలోని పలుచోట్ల గాయాలు, పుండ్లు ఏర్పడటానికి కారణం నొప్పి లేకపోవడమే. స్త్రీలైతే పొయ్యి మీద నుండి పాత్రలు దించేటప్పుడు కాల్చుకుంటారు. సిగరెట్లు పీల్చే వ్యక్తితే వేళ్ళపై పుండ్లు ఏర్పడతాయి. కాలుకి రాయి తగిలి గాయం ఏర్పడుతుంది. ఇవన్నీ సహజంగా అందరికీ  ఏర్పడే ప్రమాదాలే.  ఈ సంధర్భాలలో నొప్పి వుండి వుంటే ముందుగా వైద్యుని సంప్రదించి తగిన చికిత్స పొందడానికి అవకాశం వుంది. నొప్పి అనేది ఒక అవసరమైన స్పర్శ. తలనొప్పిని తెలియ జేయడానికి ప్రత్యేక మైన నాడులు వున్నాయి. వాటిని ఉత్తేజింప జేయడం వలన తలనొప్పి ఏర్పడుతుంది. ఆ నాడుల పేర్లు - (ప్రైజెమినల్ నాడీ, సర్వైకల్ నాడులు). తలలో గాని, కంటి లో గాని మెదడులోగాని వ్యాధి ఏర్పడ్డప్పుడు ఈ నాడులు ఉత్తేజింప బడతాయి. తద్వారా మనకు తలనొప్పి ఏర్పడుతుంది.  దూరదృష్టి, హ్రస్వ దృష్టి, అక్షలోపము, నేత్ర ద్వయ శక్తి లోపము, నేత్రద్వయ సమన్వయ లోపము, ఛత్వారము, నీటి కాసులు, రక్తపు పొర వాపు, గాజుపొర పుండు (మెల్ల), కంటిగూడు వాపు, కంటి నాడి వాపు, మొదలైనవి. తలనొప్పి కలిగించే కంటి వ్యాధులు. కాబట్టి తలనొప్పి వచ్చినప్పుడు కంటి వైద్యుడిని సంప్రదిస్తారు. కంటి వైద్యులు కంటికి సంబంధించిన నాడుల కదలిక ఆధారంగా వ్యాధిని నిర్ణయించి తగిన పరిష్కారం సూచిస్తారు.                                         ◆నిశ్శబ్ద.

read more
ఈ పండు తింటున్నారా!

  రోజుకో పండు తింటే ఆరోగ్యానికి మంచిదని తెల్సిందే. అయితే సాదారణంగా మనం మనకి అందుబాటులో వున్నా పండ్లనే  ఎంచుకుంటాం, కాని కొన్ని పండ్లలో మన ఆరోగ్యానికి పనికొచ్చే ఎన్ని పోషకాలు వుంటాయి, వాటిని తప్పక తిని తీరాలి అంటున్నారు వైద్యులు. అలాంటి పండ్లలో 'కివి' ఒకటి....   'కివి' తో మనం పొందే ఐదు లాభాలు :- * మొట్టమొదటి లాభం కొలెస్ట్రాల్ ని నియంత్రణలో వుంచడం. దాని వల్ల గుండె జబ్బుల వంటి వాటి బారిన పడకుండా ఉంటాం. * అలాగే 'కివి' పండులో బత్తాయి,కమలా వంటి పండ్ల లో కన్నా ఎక్కువగా 'సి' విటమిన్ వుంటుంది. దీని వలన శ్వాసక్రియ ఇబ్బందులు వంటివి దగ్గరికి చేరవు. * ఇంకా ఈ పండులో పీచు పదార్దం కూడా ఎక్కువే, జీర్ణవ్యవస్థకు పీచు పదార్దం ఎంతో మేలు చేస్తుంది. * ఇక విటమిన్ 'ఎ', ' ఇ' లు కూడా కలిగి ఉండే ఈ పండుతో మరో ముఖ్యమైన లాభం ఆహారంలోని ఐరన్ ని శరీరం త్వరగా మెరుగ్గా గ్రహించే శక్తిని ఇచ్చే గుణం కలిగి వుండటం. * ఇక చెప్పుకో దగ్గ మరో లాభం 'కివి' పండులోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో తయారయ్యే ఫ్రీ రాడికల్స్  ప్రభావాన్ని అదుపు చేస్తాయి. అలాగే ఎముకల బలహీనత, కీళ్ళ బలహీనత, క్యాన్సర్, ఆస్మా వంటి వ్యాధుల నుంచి కాపాడతాయి. ఇన్ని లాభాలు వున్నాయని తెలిసాకా 'కివి' పండుని తినకుండా వుంటామా. రోజూ ఓ 'కివి' ఆరోగ్యానికి మంచిది అంటా హాయిగా తినేద్దాం.

read more
మన భావోద్వేగాలే మన అనారోగ్యానికి కారణం?

మనిషి అన్నవాడు ఉద్వేగానికి గురి అవ్వకుండా ఉండడు. ఏదైనా ఘటన జరిగిన వెంటనే స్పందించని మనిషి అంటూ ఉండడు. అయాసందార్భాను సారంగా స్పందించడం మానవనైజం. అది సహజ లక్షణం. భావోద్వేగం అంటే ఎమోషన్స్ మనము కొన్ని కొన్ని టికీ చాలా తీవ్రంగా స్పందిస్తే కొన్నిసార్లు మామూలుగా స్పందిస్తాము. మనలో వచ్చే భావోద్వేగాలే మనశరీరానికి హానిచేస్తాయని అదే అనారోగ్యానికి కారణమని మనపూర్వీకులు వెల్లడించారని  ప్రముఖ నాడీ పతి వైద్యులు డాక్టర్ కృష్ణం రాజు విశ్లేషించారు. ఈమేరకు డాక్టర్ కృష్ణం రాజు చేసిన పరిశోదనలో ఒక్కో భావోద్వేగం ఒక్కో అవయవం పై ప్రభావం చూపుతుందని నిపుణులు పేర్కొన్నారు.ఉద్వేగాల లో మనకు తెలిసిన కొన్ని టి గురించి చూద్దాం. ఒత్తిడి, భయం, క్రోదం,ఆవేదన ,ఆందోళన వంటి ఉద్వేగాలు మీ శరీరంలోని అవయవాల కు హానికలిగిస్తాయి. ఏ ఏ ఎమోషన్స్ మీ మీ అవయవాల పై ప్రభావం చూపుతాయో తెలుసుకుందాం. భయం, లేదా మీకు షార్ట్ టెంర్  ఉంటె మీ కిడ్నీ పై ప్రభావం చూపిస్తుంది. మీకు ఉద్వేగాలాలో గమనించిన ముఖ్య అంశం --కోపం ఉంటె లివర్ పై ప్రభావం చూపుతుంది. మీరు ఎప్పుడు విచారం ఆందోళనలో ఉంటె--లేదా తీవ్ర ఒత్తిడి కి గురి అయితే ---పొట్టలో గ్యాస్ ట్రిక్ సమస్యలు అరుగుదల లేకపోవడం గమనించవచ్చు. మీరు నిత్యం ఒత్తిడిలో ఉంటె --గుండె సంబంధిత సమస్యల కు దారి తీస్తుంది. మీరు ఏమిచెయ్యాలో తెలియక టెన్ క్షణ్ లో ఉంటె --మీ మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మీరు ఎల్లప్పుడూ గ్రీఫ్ గా ఉంటె---అది మీ ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. జాయ్ ఆనందం గా ఉంటె బలాన్ని ఇస్తుంది. మీరు ఎల్లప్పుడూ విచార వదనంతో ఉదాసీనంగా ఉంటె అది మీ ప్లీహము పై ప్రభావము చూపుతుంది. సహజంగా వచ్చే ఉద్వేగాల ను నియంత్రించడం ద్వారా కొంతమేర అవయవాల పై పడే తీవ్రతను గుర్తించవచ్చు. తద్వారా అవిపూర్తిగా నాశనం కాకుండా మర్మ కళ ద్వారా నివారణ చేయవచ్చని ముఖ్యంగా నాడీ పతిలోని 1౦7 రకాల మర్మకళ తో అక్యు పంక్చర్ ను వినియోగించి చికిత్చ చేయవచ్చని నాడిపతి వైద్యులు  డాక్టర్ కృష్ణమ రాజు స్పష్టం చేసారు. మీ అనారోగ్గ్యానికి మీభావోద్వేగాలే అని తెలుసుకోవాలి.

read more
అధికవేడి చేస్తోందా?? భయం వద్దు.. ఇలా తగ్గించేయండి.

ఒళ్ళు ముట్టుకుంటే సాధారణంగానే ఉంటుంది కానీ.. ఆ వ్యక్తికి మాత్రం లోపల నిప్పులు కురిసినట్టే ఉంటుంది. గొంతంతా తడి ఆరిపోతూ ఉంటుంది.. ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరదు. నోరు పిడచకట్టుకుపోతుంది. పెదవులు ఎండిపోయి నిర్జీవంగా తయారవుతాయి. ఊపిరి వదులుతుంటే వేడిగా సెగలు కొడుతుంది. చర్మం అంతా కళ కోల్పోతుంది. మొత్తానికి మనిషి వాడిపోయిన పువ్వులా తయారవుతాడు. ఇదంతా అధిక వేడి వల్ల కలిగే ఇబ్బంది. ఎదుటివారు మాత్రం నీకేమి కాలేదు ఊరుకో… అని అంటుంటారు. తమను అర్థం చేసుకోకపోగా అపార్థం చేసుకుంటున్నారు ఏంటి వీళ్ళు అనే ఒకానొక బాధ మనుషుల్ని పట్టి పీడిస్తుంది. ఇలా శరీర సమస్య కాస్తా మానసిక సమస్యగానూ తయారవుతుంది. వైద్యులను కలసి మందులు వాడితే… వారు ఇచ్చే ఇంగ్లీష్ మందులు కూడా శరీరానికి వేడిని పెంచేవే… మరి ఈ సమస్యకు పరిష్కారం ఎలా?? అని బాధపడేవారు కంగారు పడాల్సిన అవసరం లేదు. దానికీ కొన్ని చిట్కాలు ఉన్నాయి..  వేడి తగ్గడానికి సహజమైన చిట్కాలు.. అందరికీ సులువుగా దొరికేది వేప. దీని రుచి గురించి పక్కన పెట్టి కాస్త ఓపికగా వాడితే మంచి ఫలితం ఉంటుంది.  వేపాకుల రసం 20-50 మి.లీ.  తీసుకోవాలి. అందులోకి 5 నుండి20 గ్రా॥ల పటిక బెల్లము కలపాలి. చేదు ఎక్కువ భరించలేము అన్నవారు పటికబెల్లం ఎక్కువగా అంటే 20 గ్రాముల వరకు. చేదు తీసుకోగలం అనేవారు 5గ్రాములు మోతాదు కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ఒక వారము రోజులు తాగడం వల్ల వేడి తగ్గుతుంది. మామిడి చెట్టు లోపలి బెరడు తీసుకోవాలి, తరువాత అత్తి (మేడి) చెట్టు వేరు బెరడును, ఇంకా మర్రి చిగుళ్ళను తీసుకోవాలి. వీటి నుండి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని 10 నుండి 40 మి.లీ. తీసి,  అందులో 1 నుండి 2 గ్రా॥ల జీలకర్ర, 5 నుండి 20 గ్రా॥ల పటిక బెల్లము కలపాలి. ఈ మిశ్రమాన్ని తాగటం వల్ల ఎలాంటి వేడి అయినా తగ్గిపోతుంది. సోంపు మనందరికీ తెలిసిందే. ఇప్పట్లో హోటళ్లలో తిన్న తరువాత స్వీట్ సొంపు ఇస్తారు మౌత్ ఫ్రెషనర్ గా. ఈ సొంపు, జీలకర్ర, పటిక బెల్లమును మూడింటిని రాత్రి పూట నీళ్లలో నానబెట్టాలి. ఉదయాన్నే దీన్ని వడపోసి పరగడపున త్రాగాలి. ఇలా చేస్తుంటే  శరీరంలోని వేడి మొత్తం తగ్గిపోతుంది. అందరికీ అతి సులువుగా ఏ కాలంలో అయినా లభించేది నిమ్మకాయ. ఈ  నిమ్మరసంలో పఠిక బెల్లం వేసి జ్యుస్ లాగా తయారుచేసుకోవాలి. దీన్ని తాగుతుంటే కూడా అధికవేడి దెబ్బకు తగ్గిపోతుంది.  అధికవేడి సమస్య అన్ని కాలాలలో ఉన్నా వేసవికాలంలో ఎక్కువగా వేధిస్తుంది. ఈ వేసవి కాలంలో అందరికీ దొరికే అద్భుతమైన ఫలం పండ్లకు రారాజు మామిడి. ఈ మామిడి పండు పచ్చిగా ఉన్నది తీసుకోవాలి. దాన్ని తోలు తీసి నీటిలో మరిగించాలి. తర్వాత దాని గుజ్జును చల్లని నీటిలో పిసికి రసము తీసి నచ్చినట్టుగా అందులో  ఉప్పు, జీలకర్ర, చెక్కెర మొదలయినవి కలిపి తాగాలి. దీనిని ప్రస్తుతం చాలామంది ఆమ్ పన్నా అని పిలుస్తుంటారు. పచ్చిమామిడితో చేసే ఈ జ్యుస్ అధికవేడి సమస్యకు చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. మరీ ముఖ్యంగా వడదెబ్బ సమస్య రాకుండా వేసవిలో ఈ జ్యుస్ ను తీసుకుంటూ ఉంటారు.   చెరకు రసం అద్భుతమైన ఔషధం. ఒకప్పుడు చెరకును నేరుగా తినేవారు. ప్రస్తుత కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇది అరుదైపోయింది. అయితే అక్కడక్కడా చెరకు రసం అమ్ముతూ ఉంటారు. ఈ చెరకు రసాన్ని రోజూ తీసుకుంటూ ఉంటే అధికవేడి సమస్య క్రమంగా తగ్గిపోతుంది. అలాగే కడుపులో మంట లాంటి సమస్యలు కూడా తగ్గుతాయి.  దానిమ్మపండ్లు అన్నిచోట్లా లభ్యమవుతాయి. ఈ దానిమ్మ పండు రసం తీసినా.. లేదా నేరుగా అలాగే విత్తనాలు తిన్నా మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో తలనొప్పి వచ్చినా, వడదెబ్బ తగిలినా, కళ్ళు ఎరుపెక్కినా, దానిమ్మ పండు రసం తాగితే ఫలితం ఉంటుంది.  ఇలా సహజమైన చిట్కాలు ఉపయోగించి శరీరాన్ని మండించే అధికవేడిని తరిమేయచ్చు..    ◆నిశ్శబ్ద.  

read more
మీకూ ఈ లక్షణాలుంటే పొగాకు వ్యసనంగా మారినట్టే!

ప్రపంచవ్యాప్తంగా పొగాకు వినియోగం వల్ల పెరుగుతున్న తీవ్రమైన వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం మరియు పొగాకు ద్వారా సంక్రమించే వ్యాధుల భారాన్ని తగ్గించే లక్ష్యంతో పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఏడాది.. 'మనకు ఆహారం పొగాకు కాదు. పొగాకు ఉత్పత్తి చేసే రైతులను ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సహించడమే దీని లక్ష్యం' అనే థీమ్ ను ప్రజలముందుకు తెచ్చింది.  పొగాకు ఉత్పత్తులను గుట్కా, ఖైనీ, సిగరెట్ల రూపంలో తీసుకుంటే వెంటనే మానేయాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇవన్నీ మన శరీరాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయనే విషయం చిన్న పిల్లలకు కూడా తెలుసు.  పొగాకు నమలడం వల్ల నోరు, గొంతు సమస్యలు  వచ్చే ప్రమాదం పెరుగుతుంది, అయితే ధూమపానం ఊపిరితిత్తుల క్యాన్సర్, రక్త నాళాల విస్తరణ ప్రమాదాన్ని పెంచుతుంది . పొగాకు అనేది ఒక వ్యసనం, దీని నుండి బయటపడటానికి ప్రయత్నాలు అవసరం, లేకుంటే అది ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది  పొగాకు వ్యసనంగా మారిందని తెలుసుకోవడం ఎలా?? పొగాకు-సిగరెట్ లేకుండా ఒక రోజు కూడా ఉండలేకపోతే.. దాని వ్యసనానికి బలి అయ్యారనే సంకేతం. అయితే ఈ వ్యసనం ఎందుకు ఏర్పడిందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. పొగాకులో నికోటిన్ ఉంటుంది, ఈ రసాయనం వ్యసనానికి ప్రధాన కారణం. నమలడం లేదా ధూమపానం చేయడం ద్వారా పొగాకు రక్తప్రవాహంలోకి శోషించబడినప్పుడు, అది అడ్రినలిన్ అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది. నికోటిన్, మరోవైపు, డోపమైన్ హార్మోన్ పెరుగుదలను కూడా ప్రేరేపిస్తుంది. ఇది మెదడును సంతోషపెట్టే హార్మోన్.  దీని కారణంగా చాలా రిలాక్స్ అయినట్టు అనిపిస్తుంది. పదే పదే ఈ సంతోషం కోసమే పోగాకుకు అలవాటు పడతారు. పొగాకు వ్యసనం లక్షణాలు..  పొగాకు వ్యసనం లక్షణాలు  పైకి స్పష్టంగా కనబడతాయి.  పొగాకు మానేయడానికి ప్రయత్నించినప్పటికీ ధూమపానం లేదా పొగాకు నమలడం ఆపలేకపోవడం. ఒకరోజైనా  వదిలేయాలని ప్రయత్నించినప్పుడు, చేతి వణుకు, చెమటలు పట్టడం, అశాంతి, గుండె వేగం పెరగడం వంటి అనేక రకాల సమస్యలు మొదలవుతాయి. భోజనం తర్వాత ధూమపానం చేయాలని, పొగాకు నమలాలని అనిపించడం.  పొగాకు వ్యసనం, దాని  లక్షణాలు, పొగాకు వల్ల ఎదురయ్యే సమస్యలు, ఇవన్నీ తెలుసుకుని స్ఫూర్తి వంతంగా పోగాకుకు దూరమైతే ఆరోగ్యం బాగుంటుంది.                                        ◆నిశ్శబ్ద.

read more
ఈ మూడు సమస్యలు ఉన్నవారిలో ఒత్తిడి చాలా ప్రమాదం కలిగిస్తుంది!

ఏవైనా ఊహించని సంఘటనలు జరిగినప్పుడు ఆందోళన పడటం సహజం. ఆ ఆందోళన కాలక్రమేణా నయమవుతుంది. కానీ , కారణాలు పెద్దగా లేకున్నా తరచుగా ఆందోళన చెందేవారు చాలామంది ఉంటున్నారు. ఇలా ఆందోళన చెందేవారు ఈ ఆందోళన కారణంగా ఒత్తిడికి గురవుతారు. ఇలాంటివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది డిప్రెషన్ వంటి తీవ్రమైన సమస్యల ప్రమాదాన్ని పెంచడమే కాకుండా,  శారీరక ఆరోగ్యంపై అనేక దుష్ప్రభావాలను కూడా కలిగిస్తుంది. అందుకే ఆరోగ్య నిపుణులు ఒత్తిడి నియంత్రణ చర్యలను తీసుకోవడం చాలా ముఖ్యమని చెబుతున్నారు.   ఆందోళన చాలా కాలంగా ఉంటూ అది అదుపులోకి రాకపోతే ఈ సమస్యకు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. అలా తీసుకోకపోతే  ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు పెరుగుతాయి. ఆందోళన-ఒత్తిడి సమస్యలు నాడీ వ్యవస్థ, మధుమేహం నుండి రక్తపోటు, గుండెపోటు ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. ఎక్కవగా ఆలోచించడం, ఆందోళన చెందడం ఈ కింది సమస్యలున్నవారితో ప్రమాదం పెంచుతాయి.  మధుమేహ వ్యాధిగ్రస్తులలో సమస్యలు పెరిగే అవకాశం ఉంది..  దేనిగురించైనా ఆందోళన చెందుతున్నప్పుడు, ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ విడుదల అవుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. ఒత్తిడి మధుమేహానికి కారణం కాదని పరిశోధకులు కనుగొన్నారు, కానీ అది మీ రక్తంలో చక్కెర స్థాయిలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులు కళ్ళ నుండి గుండె జబ్బులు, నరాల వరకు ప్రతిదానిని ప్రభావితం చేయడం ప్రారంభిస్తాయి. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఒత్తిడి నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెబుతున్నారు. నరాల మీద దుష్ప్రభావాలు..  నరాలు మెసేజింగ్ నెట్‌వర్క్‌ల లాగా పనిచేస్తాయి. ఎక్కువగా ఆందోళన చెందడం వల్ల  హృదయ స్పందన రేటు, శ్వాసను ప్రభావితం చేసే ఒత్తిడి హార్మోన్లను ప్రేరేపించవచ్చు. చాలా కాలం పాటు అనియంత్రిత ఒత్తిడి స్థాయిలు రక్తంలో చక్కెర, నరాల సమస్యలకు దారితీస్తాయి.  ఒత్తిడి-డిప్రెషన్‌తో బాధపడేవారిలో స్ట్రోక్ ప్రమాదం కూడా ఎక్కువగా ఉండడానికి ఇదే కారణం. గుండె ఆరోగ్యంపై ప్రభావం.. ఒత్తిడి సమస్య చాలా కాలం పాటు కొనసాగితే, అది  రక్తపోటు ఎక్కువగా ఉండేలా చేస్తుంది. అధిక రక్తపోటు, గుండెపోటు లేదా స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఎప్పుడూ ఒత్తిడికి లోనవుతూ, ఆలోచిస్తూ ఉంటే , శరీరంలో విడుదలయ్యే కార్టిసాల్ హార్మోన్  గుండె వేగంగా కొట్టుకునేలా చేస్తుంది. ఇలా పదే పదే జరిగితే,  రక్తనాళాలు ఎర్రబడి, తీవ్రమైన గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం ఉంది. ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడం చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది మానసిక ఆరోగ్య సమస్యలే కాదు.  మొత్తం శరీర ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది.                                         ◆నిశ్శబ్ద.

read more
మైగ్రేన్ కు డిప్రెషన్ కు మధ్య లింక్ ఏంటో తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా, మానసిక ఆరోగ్య సమస్యలు వేగంగా పెరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కోవిడ్-19 తర్వాత ఇది విజృంభించింది. ఇప్పుడు యువత కూడా దీని బారిన పడే పరిస్థితి నెలకొంది. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మానసిక-శారీరక ఆరోగ్యం ఒకదానికొకటి అనుబంధంగా ఉంటాయి. ఒకదాని ప్రభావం మరొకదాని పై ఉంటుంది.  డిప్రెషన్‌ను కేవలం మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే సమస్యగా మాత్రమే పరిగణించరాదని డిప్రెషన్‌పై అధ్యయనం చేస్తున్న పరిశోధకులు తెలిపారు. అనేక రకాల శారీరక దుష్ప్రభావాల ప్రమాదం కూడా ఉంటుంది. డిప్రెషన్‌కు గురైనట్లయితే, మైగ్రేన్, గుండె జబ్బులు, రక్తపోటు,  రోగనిరోధక శక్తి బలహీన పడటం వంటి సమస్యలు కూడా ఉంటాయి. మైగ్రేన్ కు డిప్రెషన్ కు మధ్య సంబంధం.. మైగ్రేన్ సాధారణ తలనొప్పి సమస్య అని అనుకుంటే పొరపాటే.. మైగ్రేన్ సైకోసోమాటిక్ డిజార్డర్ అని పరిశోధకులు కనుగొన్నారు. మానసిక రుగ్మతలు శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే సమస్యలు. ఇవి కూడా శారీరక ఆరోగ్య సమస్యల మాదిరిగానే లక్షణాలను కలిగి ఉంటాయి. డిప్రెషన్‌తో బాధపడుతున్న వ్యక్తులకు మైగ్రేన్‌  వచ్చే అవకాశం మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని, మైగ్రేన్‌ ఉన్నవారు ఐదు రెట్లు ఎక్కువగా డిప్రెషన్‌కు గురవుతారని తేలింది.  మైగ్రేన్ వల్ల డిప్రెషన్ వచ్చే ప్రమాదం..  మైగ్రేన్, డిప్రెషన్, స్ట్రెస్ ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి. వాస్తవానికి, మైగ్రేన్‌ ఉన్న వ్యక్తులు ఇతరులకన్నా డిప్రెషన్‌కు గురయ్యే అవకాశం దాదాపు ఐదు రెట్లు ఎక్కువ. మైగ్రేన్ ప్రారంభమైన కొన్ని నెలలు లేదా సంవత్సరాల తర్వాత చాలా మందిలో డిప్రెషన్ మొదలవుతుంది. మైగ్రేన్,  డిప్రెషన్ రెండూ జన్యుపరమైనవి కూడా కావచ్చు. డిప్రెషన్ ఉన్న రోగులలో మైగ్రేన్ రిస్క్ మైగ్రేన్,  డిప్రెషన్ రెండూ తక్కువ స్థాయి 5-హైడ్రాక్సీట్రిప్టమైన్ (5-HT) లేదా సెరోటోనిన్ రిసెప్టర్లకు సంబంధించినవి. సెరోటోనిన్ ట్రాన్స్పోర్టర్లు కూడా జన్యు మార్పులకు కారణం అవుతాయి. మైగ్రేన్ అనేది జీవిత నాణ్యతను ప్రతికూలంగా మారుస్తుంది. ఇది ఇతర  మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.  అదేవిధంగా, మైగ్రేన్, డిప్రెషన్ ఉన్నవారిలో కాలక్రమేణా సైకోసోమాటిక్ డిజార్డర్‌గా మార్పు చెందుతాయి.  ఇవి ఒకదాని మీద మరొకటి ఆధారపడి ఉంటాయి కాబట్టి ఏ ఒక్కటి వచ్చినా మరొకటి మెల్లిగా డవలప్ అవుతుంది. కాబట్టి వీటికి దూరం ఉండటం అన్ని విధాలా మంచిది.                                    ◆నిశ్శబ్ద.

read more
కల్తీ...కల్తీ...కల్తీ...ఎటు చూసినా కల్తి

కల్తీ ...కల్తీ ...కల్తీ... ఎటు చూసినా కల్తి గాలి కల్తీ,నీరు కల్తీ,పాలు కల్తీ,తినే తిండి కల్త్ఘీ,నెయ్యి కల్తీ,పళ్ళ లో కల్తీ కూరాగాయలలో కల్తీ,అసలు కల్తీ కి కాదేది అనర్హం అన్న చందాన సర్వం కల్తీ చేసేస్తూ ప్రజాల ప్రణాలను  హరిన్చేస్తున్నారు కల్తీ బాబులు.అసలు ఇందులో ఏది అస్లీ ఏది నకిలీ అన్నదే పెద్ద ప్రశ్న?  అసలు ప్రకృతి ని ఎలాగో కల్తీ చేసేసారు మానవుడు. అయితే సృష్టిలో కల్తీ లేనిది ఒక్క తల్లి పాలలోనే అంటే అతిశయోక్తి కాదు.ఇది నిజం. అని నమ్మక తప్పదు. తల్లిప్రేమలో నాన్న ప్రేమలో కల్తీ ఉండదు.ప్రియుడి ప్రేమలో.ప్రియురాలి ప్రేమలో కల్తీ ఉండచ్చు. ప్రపంచ వ్యాప్తంగా జూన్ నెలలో ప్రపంచ ఆహార సంరక్షణ దినోత్సవం రూపం లో జరుపుకుంటారు.దీనిలక్ష్యం ప్రజలు సురక్షిత మైన ఆహారపు అలవాట్ల పట్ల కల్తీ ఆహారం పట్ల ప్రజలు అప్రమత్తం గా ఉండాలి ఈ సందర్భంగా ప్రజలు నకిలీ ఆహార పదార్ధాల బారిన పడకుండా కల్తీ ఆహారాపదార్ధాలను ఎలా గుర్తించాలో వివరించే ప్రయత్నం చేస్తున్నాము. మార్కెట్ లో మనకు లభ్య మయ్యే చాలా రకాల వస్తువులలో కల్తీ కలుస్తోందన్న విషయం తెలుస్తోంది.అందులో ను అది పండ్లు కవాచ్చు పప్పు దినుసులు కావచ్చు.గోధుమలు,మసాలాలు, పాలు,కూరాగాయలలో రక రకాల రసాయనాలు వాడుతూ వాటిని రూపొందిస్తున్నారు.కల్తీ చేసిన ఆహార పదార్ధాలు తినడం వల్ల  చాలా ప్రామాదం అని దానివల్ల తీవ్ర నష్టం కలుగుతుందని నిపుణులు స్పష్టం చేసారు.కల్తీ చేసిన  వాంతులు.లివర్ కిడ్నీ,ఉదర సంబంధిత రోగాలు,వస్తే తీవ్ర ప్రభావం ఉటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇలాంటి సమస్యనుండి రక్షణ పొందాలంటే అసలు నకిలీ వస్తువులను గుర్తించాలి.వాటిని గురించి తెలుసుకోవడం అత్యవసరం. కల్తీ పాలను ఎలాగుర్తించాలి? పాలలో కేవలం నీళ్ళు మాత్రమే కలవడం లేదు.పాలను చిక్కగా చేసేందుకు దీనిలో డిటర్జెంట్,లేదా సింథటిక్,పాలు గుర్తించాలంటే 1/2 కప్పులో తక్కువ నీళ్ళు కలపండి.ఇందులో నురుగు వచ్చిందంటే ఇందులో డిటర్జెంట్ కలిపి నట్లే.సింథటిక్ పాలు గుర్తించాలంటే పాలను  వెళ్ళ మధ్యలో రాయడం ద్వారా అది సబ్బు లాగా కనిపిస్తుంది.అలా పాల కల్తీని గుర్తించవచ్చు. మరీ క్రుత్రిమ పాల వ్యాపారం లో కొత్త కొత్త పద్దతులు అవలం బిస్తున్నారు. వ్యవసాయం లో వాడే ఉరియా ఎరువులు,ఫెవికాల్ కలిపి పాల కల్తీకి పాల్పడుతున్నారు.  నకిలీ పసుపు ను ఎలాగుర్తించాలి? ఒక గ్లాసు నీరు తీసుకోండి.అందులో కొంచం పసుపు పొడి కలపండి ఒక వేళనీటి రంగు పసుపు రంగులోకి మారుతుంది.పసుపు గ్లాసు కింది భాగానికి చేరుకుతుంది.కల్తీ ఉన్న పసుపు రంగు నీటిలోకి మారుతుంది.ఆనీళ్ళు పసుపు పచ్చరంగులో ఉంటుందని గుర్తించండి. కల్తీ పండ్లను గుర్తించడం ఎలా? పండ్లు,కూరగాయలలో అన్నిటికన్నా ఎక్కువ కల్తీ జరుగుతుంది.ముఖ్యంగా మనం తినే యాపిల్ పండు బాగా మెరుస్తూ ఉంటుంది.అలా మెరిసేందుకు మైనం లేదా ఇతర  వేజిలేన్ రసయనాలు రాయడం వల్ల ఇదినిజమో కాదో  తెలుసు కోడానికి మీ వద్ద ఉన్న చాకును మెల్లగా దించండి.గట్టిగా ఉంటె చాకు త్వరగా దిగదు అంతకు ముందే  అప్పటికే కొన్ని రకాల వేజిలేన్ మైనం రాయడం వల్ల మెత్తగా ఉండడం వల్ల చాకు త్వరగా దిగుతుంది. నకిలీ నల్ల మిరియాలు... మనం తీసుకునే ఆహారం లో ముఖ్యమైన దినుసులలో ముఖ్య మైనవి మిరియాలు లేదా నల్ల మిరియాలు అంటారు.దీనిని కల్తీ కోవలోకి చేర్చిన ఘనత మనవాళ్ళదే. నకిలీ నల్ల మిరియాల ను ఎలా గుర్తించాలి ముఖ్యంగా పోప్పాయి పండులోని గింజలు నల్ల మిరియాలలో కలపడం వల్ల అసలు మిరియాలు నకిలీ మిరియాలకు తేడా తేలియదు.అసలు నకిలీ మిరియాల లో ఉన్న తేడా గుర్తించాలంటే. ఒక గ్లాసులో నీళ్ళు తీసుకుని అందులో నల్ల మిరియాలు వేయండి.౩,లేదా 4 నిమిషాల తరువాత పోప్పాయి గింజలు తేలిపోతాయి. నకిలీ నెయ్యిని గుర్తించడం ఎలా? కల్తీ లేని నెయ్యి సహజంగా పూస పూస గా ఉంటుంది.మంచి సువాసన వస్తూ ఉంటుంది. దీనిని కల్తి చేసేందుకు బంగాళా దుంప పేస్ట్,లేదా అరారోట్ లేదా రీ ఫైండ్ నూనె డాల్డా ను కలిపి నెయ్యిగా అమ్ముతూ ఉంటారు.ఇటీవలి కాలం లో జంతువుల కలేబరాల నుండి సైతం తీసిన నేతిని కల్తి చేసి మార్కెట్లో అమ్ముతున్నట్లు తెలుస్తోంది.కాగా స్వచ్చమైన అవ్వునేయ్యి లేదా కల్తీ నెయ్యి ని గుర్తించాలంటే నెయ్యిలో అయుదిన్ సొల్యుషన్ కలపండి.దీనిరంగు నీలి రంగులోకి మారుతుంది అందులో గంజి పొడి కలిపి నట్లుగా తెలుస్తుంది. ఎర్రటి ఖారం నకిలీఖారం గుర్తించడం ఎలా? అసలైన ఎర్రటి ఖారం గుర్తించాలంటే ఒక గ్లాసు నీళ్ళలో మిర్చి పొడిని కలపండి.ఎర్రటి మిర్చి పౌడర్ నీటిలో తేలితే అది నకిలీది కాదని.ఒకవేళ నీలాలో మునిగి పోతే ఆ మిర్చి పొడి కల్తీది నకిలీదిగా భావించాలి. నకిలీ ఇంగువను గుర్తించడం ఎలా? నకిలీ ఇంగువకూడా నకిలీ నెయ్యి నూనె వేడిలో వేసినప్పుడు కొంత ఎర్రగా మారుతుంది.అది నకిలీ ఇంగువగా చెప్పవచ్చు.మరో పద్దతిలో ఇంగువను కాల్చి నప్పుడు అంటుకుంటుంది.నిప్పు త్వరగా అంటుకుంటుంది.అది నకికీది కాదనిఆర్ధం. నకిలీ ఇంగువ అంటుకోదు. ఈ విధంగా నకిలీ అసిలీ ఇంగువను ఆర్ధం చేసుకోవచ్చు. అసలైన  కోవా ను గుర్తించడం ఎలా? హిందీలో దీనిని మావా అని అంటారు అంటే మనం స్వీట్స్ లో వాడే కోవా,కలాకండ్, రసగుల్లా,గులాబ్ జాం,కోవా కజ్జి కాయి  వంటి  వి తయారు చేసేందుకు వాడతారు. కోవాలో అసిలి నకిలీ కివా ఎదో గుర్తించడం కష్టం. అసలు కోవా తెల్లగా ఉంటుందని.మరోరకం కోవా కొంచం పసుపు పచ్చటి రంగులో ఉంటుందని అది కల్తీ కోవాగా పేర్కొన్నారు.దీనితో పాటు చేతిలో నలపడం ద్వారా అసలైన కోవా చేతిని విదిచిపెడుతుంది.నకిలీ కోవా అయితే చేతిని అంటి పెట్టుకుని ఉంటుంది. నకిలీ తేనె... ఈ రోజుల్లో తేనె పేరుతో ప్రజలు తీవ్రంగా మోసపోతున్నారు. ముఖ్యంగా పుట్టతేనే అంటూ గిరిజన ఏ జేన్సీ  ప్రాంతాలలో తేనెలో బెల్లం కలిపి ఆమీస్తున్నట్లు తెలుస్తోంది. అసలు తేనె నకిలీధా అసలైన తేనెను గుర్తించడం అవసరం.ఒక గ్లాసు నీళ్ళలో ఒక చంచా తేనె కలపండి మీరు వేసిన తేనె నీటిలో అలాగే ఉండి పోతే అది స్వాచమైన తేనె అని అటు ఇటు కదులుతూ నీటిలో కరిగి పోయే తేనెను నకిలీ తేనెగా గుర్తించారు.ఆ రకంగా మీరు తీసుకునే ఆహారం పట్ల అప్రమత్తంగా ఉండకుంటే మీరు అనారోగ్యం పాలు కావడం ఖాయం. ప్రపంచా ఆహార బద్రత దినోత్సవం సందర్భంగా సర్వేజనా సుఖినోభవంతు. ఆరోగ్యా ప్రాప్తి రాస్తూ.   

read more
బరువు మీద థైరాయిడ్ ప్రభావం ఎంత?

ప్రస్తుత కాలంలో సాధారణ సమస్యలలో బరువు పెరగడం ఒకటి. దీనికి జీవనశైలి లేదా ఆహారపు అలవాట్లు లేదా అనేక అంతర్లీన ఆరోగ్య సమస్యలు వంటి అనేక కారణాలు ఉండవచ్చు. చాలా సార్లు పెరిగిన బరువు థైరాయిడ్ సమస్యగా పరిగణించబడుతుంది. కానీ థైరాయిడ్ వల్ల నిజంగా ప్రతిసారీ బరువు పెరుగుతారా అంటే కచ్చితమైన సమాధానం ఎక్కడా లేదు. బరువు పెరగడం అనేది ఖచ్చితంగా థైరాయిడ్ సమస్యలో ఒక సాధారణ లక్షణం, అంతే కానీ బరువు పెరిగారంటే థైరాయిడ్ ఉన్నట్టు, థైరాయిడ్ వచ్చిందంటే బరువు కచ్చితంగా పెరగాలి అన్నట్టు నిబంధన ఏమీ లేదు.  ప్రపంచ వ్యాప్తంగా థైరాయిడ్ సమస్య చాలా వేగంగా పెరుగుతోంది. దీని గురించి అవగాహన, నివారణ పద్ధతుల గురించి చెప్పాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం మే 25న ప్రపంచ థైరాయిడ్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సమస్య ఏ వయసు వారికైనా రావచ్చు, కాబట్టి ప్రతి ఒక్కరూ దీనిపై అవగాహన కలిగి ఉండటం, నివారణ చర్యలను పాటించడం అవసరం.  థైరాయిడ్, బరువు పెరిగే సమస్యలు.. థైరాయిడ్ హార్మోన్ జీవక్రియను నియంత్రిస్తుంది. జీవక్రియలో సమస్యలు బరువుపై ప్రభావం చూపుతాయి. బలహీనమైన థైరాయిడ్ (హైపోథైరాయిడిజం) ఉన్నవారిలో బరువు పెరగడం సాధారణం. థైరాయిడ్ గ్రంధి ద్వారా విడుదలయ్యే హార్మోన్లు జీవక్రియను నియంత్రించడంల సహాయపడతాయి, తద్వారా శరీరం శక్తి కోసం ఆహారాన్ని బాగా ఉపయోగించుకుంటుంది. థైరాయిడ్ తక్కువ హార్మోన్ ఉత్పత్తి చేసినప్పుడు, జీవక్రియ మందగిస్తుంది. అటువంటి పరిస్థితిలో, కేలరీలు బర్న్ చేయకపోతే బరువు పెరుగుతారు. బరువు కూడా తగ్గిస్తుంది.. థైరాయిడ్ రుగ్మత బరువు పెరగడానికి మాత్రమే కాదు, బరువు తగ్గడానికి కూడా కారణమవుతుంది. హైపర్ థైరాయిడిజం, థైరాయిడ్ గ్రంధి చాలా హార్మోన్లను విడుదల చేయడం ప్రారంభించే ఒక రకమైన థైరాయిడ్ రుగ్మత. వేగంగా బరువు తగ్గడం, చేతులు వణుకు, వేగవంతమైన లేదా సక్రమంగా లేని హృదయ స్పందన ఇందులో క్షణాలు . బరువు పెరగడం మరియు తగ్గడం రెండూ థైరాయిడ్ రుగ్మతలకు సంబంధించినవి అని అర్థం. బరువు పెరగడానికి థైరాయిడ్ రుగ్మత మాత్రమే కారణం కాదు.. అయితే థైరాయిడ్ రుగ్మత బరువు పెరగడానికి లేదా తగ్గడానికి మాత్రమే కారణం అని భావించడం కూడా తప్పు. బరువు పెరగడానికి అనేక ఇతర కారణాలు ఉన్నాయి, సరైన కారణాలను తెలుసుకోవడం. వాటికి చికిత్స చేయడం అవసరం. కేలరీలను బట్టి ఆహారం తీసుకోకపోతే సహజంగానే బరువు పెరుగుతారు. కానీ థైరాయిడ్ ఉన్నవారు శారీరక శ్రమ ద్వారా కేలరీలను బర్న్ చేయలేరు. బరువు పెరగడానికి లేదా తగ్గడానికి జన్యుశాస్త్రం కూడా ఒక కారణం కావచ్చు. ఇది మాత్రమే కాకుండా.. అనారోగ్యం, మందులు తీసుకోవడం వంటి ఆరోగ్య పరిస్థితుల వల్ల కూడా బరువు పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. ఒత్తిడి, నిద్ర లేకపోవడం కూడా బరువు పెరగడానికి కారణం అవుతుంది.                                      ◆నిశ్శబ్ద.

read more
ఫైబర్ వల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయా?

ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారం గురించి ప్రతి వైద్యుడు, ప్రతి పోషకాహార నిపుణుడు, ఆఖకి ఆరోగ్య స్పృహ ఉన్న ప్రతి వ్యక్తి చెబుతాడు. ఫైబర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి కూడా చాలా విషయాలు వినే ఉంటారు.  ఫైబర్  జీర్ణ ఆరోగ్యాన్ని కాపాడుతుందని, మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుందని అందరికీ తెలిసిందే..   అయితే  ఫైబర్ ఇలా కడుపుకు మాత్రమే కాకుండా శరీరానికి అనేక ఇతర ప్రయోజనలు కూడా చేకూరుస్తుందని  మీకు తెలుసా??   బరువు తగ్గడం నుండి డయాబెటిస్ సమస్యలను తగ్గించడం, మెదడును ఆరోగ్యంగా ఉంచడం వరకు దీని ప్రయోజనాలు చాలా ఉన్నాయి.  అందుకే ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.  ఫైబర్ శరీరంలో చక్కెర వాడకాన్ని నియంత్రించడంలో సహాయపడుతుందని పరిశోధకులు కనుగొన్నారు, ఇది ఆకలిని, రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచడానికి అవసరం. పిల్లలు మరియు పెద్దలకు మెరుగైన ఆరోగ్యం కోసం రోజుకు కనీసం 25 నుండి 35 గ్రాముల ఫైబర్ అవసరం, కానీ చాలా మందికి రోజుకు 15 గ్రాములు మాత్రమే ఆహారం ద్వారా ఫైబర్ అందుతూ ఉంటుంది. ఫైబర్ బాగా ఉన్న ఆహారం తీసుకుంటే బరువు తగ్గడం, కొలెస్ట్రాల్ నియంత్రణ మాత్రమే కాకుండా ఎలాంటి ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చునంటే.. చిత్తవైకల్యం వంటి వ్యాధుల ప్రమాదం తక్కువగా ఉంటుంది.. హార్వర్డ్ హెల్త్ నిర్వహించిన ఒక అధ్యయనంలో, తగినంత ఫైబర్ తీసుకుంటే, అది చిత్తవైకల్యం ప్రమాదాన్ని తగ్గించగలదని పరిశోధకులు కనుగొన్నారు.  రోజువారీ శరీరానికి కావలసినంత  ఫైబర్ తీసుకునే వారిలో చిత్తవైకల్యం తక్కువగా ఉంటుందని తేలింది.ఆహారంలో  తక్కువ తీసుకునేవారిలో డిమెన్షియా రేటు ఎక్కువగా ఉంది. ముఖ్యంగా రోజుకు సగటున 20 గ్రాముల కంటే తక్కువ ఫైబర్  తీసుకునేవారిలో ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. యాపిల్స్, అరటిపండ్లు.. బెస్టు.. అవకాడో లో ఫైబర్ పుష్కలంగా ఉన్నా అవి సగటు మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండవు. అలాంటి వారు అనేక ఇతర పండ్ల నుండి ఫైబర్ పొందవచ్చు, అరటిపండ్లు, యాపిల్స్ ఇందులో ముఖ్యమైనవి. యాపిల్స్‌లో కరిగే, కరగని ఫైబర్ రెండూ ఉంటాయి.. అదేవిధంగా, అరటిపండులో 2.6 గ్రాముల ఫైబర్ ఉంటుంది. అరటిపండ్లు విటమిన్ సి, విటమిన్ బి6, పొటాషియంతో సహా అనేక ఇతర పోషకాలను కూడా అందిస్తాయి. అరటిపండు తినడం ఫైబర్, ప్రోటీన్ రెండింటికీ ప్రయోజనకరంగా ఉంటుంది. నల్ల శనగలు.. ఫైబర్, ప్రోటీన్‌లకు అద్భుతమైన మూలం నల్ల శనగలు. ఇందులో ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది కాబట్టి ఇది శాకాహారులకు ప్రోటీన్  లోపంతో బాధపడేవారికి బెస్ట్ ఎంపిక. ఆహారంలో నల్లశనగలను చేర్చుకోవడం ద్వారా, జీర్ణక్రియను సరిగ్గా ఉంచడంతో పాటు కండరాలకు ప్రోటీన్‌ను సులభంగా అందేలా చూసుకోవచ్చు.                                    ◆నిశ్శబ్ద.

read more
అల్లం టీని రోజూ తాగితే ఎన్ని లాభాలో తెలుసా?

మనం వంటలలో ఉపయోగించే ఎన్నో పదార్థాలలో అల్లం కూడా ఒకటి. అల్లం బరువు తగ్గించడం నుండి జీవక్రియను ప్రోత్సహించడం వరకు ఎన్నో విధాలుగా సహాయపడుతుంది. తాజా లేదా ఎండిన అల్లంను ఎన్నో రకాలుగా ఉపయోగించవచ్చు. కానీ అల్లం ను టీ చేసుకుని తాగితే అద్భుత ఫలితాలు ఉంటాయంటున్నారు వైద్యులు. అల్లం టీ తీసుకోవడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఏమిటంటే.. బరువు తగ్గిస్తుంది.. అల్లం శరీర బరువు తగ్గడంలో,  నడుము చుట్టూ ఉన్న కొవ్వు, పిరుదులు మొదలైన ప్రాంతాలలో పేరుకున్న కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు, లిపిడ్ ప్రొఫైల్‌లు అల్లం టీ తీసుకున్నప్పుడు చాలా కంట్రోల్ అవుతాయి.   వాపును తగ్గిస్తుంది.. ఆర్థరైటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులకు వాపు కారణం. అల్లంలో జింజెరోల్‌లు, షోగోల్‌లు ఉన్నాయి, ఇవి శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రభావాలను కలిగి ఉంటాయి. వాపును కలిగించే అణువులైన సైటోకిన్‌ల ఉత్పత్తిని నిరోధించడం ద్వారా వాపును తగ్గిస్తుంది. 3వికారం వాంతులు తగ్గిస్తుంది.. అల్లం మోషన్ సిక్‌నెస్, మార్నింగ్ సిక్‌నెస్, కీమోథెరపీ, సర్జరీతో సంబంధం ఉన్న వికారం, వాంతుల నుండి ఉపశమనానికి ఒక గొప్ప నివారణ. అల్లంలో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జీర్ణ సమస్యలను తగ్గించడానికి, మొత్తం జీర్ణశయాంతర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.. అల్లం ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడం, గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరచడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. అల్లం టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మధుమేహం ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది! అల్లం అభిజ్ఞా పనితీరు, జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే సమ్మేళనాలను కలిగి ఉంటుంది. అల్లంలోని యాంటీఆక్సిడెంట్లు న్యూరోప్రొటెక్టివ్, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి, ఇది వయస్సు సంబంధిత అభిజ్ఞా క్షీణతతో ముడిపడి ఉంటుంది. బహిష్టు నొప్పిని తగ్గిస్తుంది.. అల్లం టీ నొప్పిని తగ్గించడం, రక్త ప్రసరణను ప్రోత్సహించడం ద్వారా బాధాకరమైన ఋతు తిమ్మిరి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. అల్లం కండరాల సడలింపు లక్షణాలు గర్భాశయ కండరాలలో ఒత్తిడిని తగ్గించడంలో సహాయడుతుంది, తద్వారా నెలసరి నొప్పిని తగ్గిస్తుంది. హృదయ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.. అల్లం టీ రక్తపోటును తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది, ఇవి రెండూ గుండె జబ్బులకు దోహదపడే రెండు ప్రమాద కారకాలు. అల్లంలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు అథెరోస్క్లెరోసిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి, ఈ పరిస్థితి ధమనుల పనితీరు తగ్గించి గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడతాయి.  తద్వారా శరీరాన్ని బ్యాక్టీరియా, వైరల్ ఇన్‌ఫెక్షన్ల నుండి కాపాడుతుంది. అల్లంలోని సమ్మేళనాలు తెల్ల రక్త కణాల సంఖ్యను ప్రేరేపిస్తాయి. రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి, అందువల్ల అనారోగ్యం వ్యాధుల సంభావ్యతను తగ్గిస్తుంది. మొత్తంమీద, అల్లం టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోగనిరోధక శక్తిని పెంచడం నుండి మెదడు పనితీరును మెరుగుపరచడం వరకు, అల్లం టీ దినచర్యలో భాగం చేసుకుంటే అద్బుతమే..                                   ◆నిశ్శబ్ద.

read more