ఖర్జూరానికి చాలా పెద్ద చరిత్రే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందిన  ఖర్జూరాలు రుచికే కాదు..  ఆరోగ్యానికి కూడా బోలెడు ప్రయోజనాలు కలిగిస్తాయి. అయితే ఖర్జూరాలను రాత్రి పడుకునే ముందు తేనెతో కలిపి తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని అంటున్నారు. తేనె, ఖర్జూరం కాంబినేషన్ కేవలం ఒకటని కాదు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుంది.  రాత్రి పడుకునే ముందు తేనె,  ఖర్జూరం లో ఉండే పోషకాలేంటో.. వాటిని కలిపి తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుంటే..


తేనె పోషకాలు..

ఒక టేబుల్ స్పూన్ తేనెలో - కేలరీలు: 64, కొవ్వు: 0 గ్రా, సోడియం: 0 mg, పిండిపదార్థాలు: 17 గ్రా, ఫైబర్: 0 గ్రా, చక్కెరలు: 17 గ్రా, ప్రోటీన్: 0.1 గ్రా, పొటాషియం: 10.9 mg, ఇనుము: 0.1 mg, కాల్షియం: 1.3 mg ఉంటాయి.


ఖర్జూరం పోషకాలు..

ఎండు ఖర్జూరంలో  కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, చక్కెరలు, ఖనిజాలు (కాల్షియం, జింక్, ఐరన్, ఫాస్పరస్ మొదలైనవి),  విటమిన్లు (B1, B2, C, మొదలైనవి) వంటి పోషకాలు ఉంటాయి. ఇది టానిన్లు, కెరోటినాయిడ్లు, పాలీఫెనాల్స్ మొదలైన వివిధ బయోయాక్టివ్ సమ్మేళనాలను కూడా కలిగి ఉంటుంది.


రాత్రి పడుకునే ముందు ఖర్జూరాన్ని తేనెతో కలిపి తింటే..

రాత్రి పడుకునే ముందు ఈ రెండు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబయల్ గుణాలు వ్యాధులతో పోరాడే శక్తిని శరీరానికి అందిస్తాయి.

తేనె, ఖర్జూరం రెండు తీసుకుంటే   శరీరంలో ఎలాంటి వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ రెండింటిని కలిపి తింటే ఆకలి కూడా పెరుగుతుంది. ఇది జీవక్రియను పెంచుతుంది.

తేనె, ఖర్జూరం కాంబినేషన్ జుట్టు పెరుగుదలను కూడా పెంచుతుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. అయితే ఈ రెండూ వేడిగా ఉంటాయి కాబట్టి వేసవి కాలంలో వీటి వినియోగాన్ని తగ్గించాలి.

                                                      *రూపశ్రీ.