భోజన ప్రియులకి నెయ్యి లేదా అంటూ ఉంటారు. నెయ్యి లేనిదే ముద్ద దిగదు.నెయ్యి తో పోపు పెట్టిన ఆహారం,నెయ్యితో కాల్చిన చపాతి నెయ్యితో కాల్చిన పెసరట్టు తప్ప మరేది వద్దు అంటూ ఉంటారు.ఇక కొంతమంది అయితే ముఖ్యంగా స్వీట్స్ లో నెయ్యి కారుతూ ఉండాలి. ముఖ్యంగా బొబ్బట్లు, బూరెలు కూడా నెయ్యి తో చేసినవే బాగుంటాయి అంటారు భోజన ప్రియులు నెయ్యితో చేసిన పదార్ధాలు ఆస్వాదిస్తూ తిన్నప్పుడే వాటి మజా ఉంటుందని నిపుణులు అభిప్రాయ పడ్డారు. ముఖ్యంగా దక్షణాది రాష్ట్రాలలో కుటుంబంలో పెళ్ళి ళ్ళు శుభకార్యాలలో సంబంధాలు కోసం వెళ్ళినప్పుడు మా నానమ్మ నెయ్యి వెన్నతో పెట్టింది.మీరేం పెడతారు చెప్పండి అంటు అడగడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే మీరు ఇలాగే గనక నెయ్యి తింటే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తెలిస్తే ఇకమీరు నెయ్యి జోలికే వెళ్ళరు. నెయ్యి ఆరోగ్యానికి ఎలా దోహదం చేస్తుందో మీకు బాగా తెలుసు.వినిఉండచ్చు. ఇది కేవలం యాంటి ఏజింగ్ మాత్రమే కాదు మనసు మెదడు ఆరోగ్యంగా ఉండడానికి లాభం కలిగించే అంశం అయితే నెయ్యి ప్రతి ఒక్కరికి సరిపడదు. అని అంటున్నారు నిపుణులు. భారత దేశం లో నెయ్యి చాలా ప్రాచుర్యం లో ఉంది.నెయ్యి కొంతమంది ప్రతిరోజూ తమ భోజనం లో చేరుస్తారు.
నెయ్యి వాడడం కూడా చాలా కష్టం నేతిని బ్రెడ్ లో లేదా చపాతీలో పప్పు కూరలో నెయ్యిని ఎక్కువగా వినియోగిస్తారు. నెయ్యిని ఆయుర్వేదం లో ఎక్కువగా వాడడం గమనించవచ్చు.నెయ్యి ఆరోగ్య పరంగా మంచి ఉపయోగాలు ఉన్నాయి. గుండె సంబందిత ఆరోగ్యానికి లాభదాయకంగా ఉంటుంది.ఖాళీ పొట్టతో నెయ్యి తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. శరీరంలో ఉన్న పంచెంద్రియాలలో శుభ్ర పరిచి ఉపసమనం ఇస్తుంది. నెయ్యిలో యాంటి ఏజింగ్ మరియు గుండె ను ఆరోగ్యంగా ఉంచే గుణాలు ఉంటాయి. కంటి ఆరోగ్యానికి నెయ్యి చాలా మంచిది దీనితో పాటు నెయ్యి మెదడు,జ్ఞాపక శక్తిని పెంచి పంచేంద్రియాలు చురుకుగా పని చేసేందుకు దోహదం చేస్తుంది.