ఈ డ్రింక్స్ తాగండి.. ఊపిరితిత్తులు శుభ్రపడతాయి..!
ఊపిరితిత్తులు శరీరంలో ముఖ్యమైన అవయవాలు. ఇవి శ్వాస వ్యవస్థకు మూలం. మనం పీల్చేగాలిలో ఆక్సిజన్ ను గ్రహించి, కార్బన్ డై ఆక్సైడ్ ను బయటకు పంపడంలో ఊపిరితిత్తులదే కీలక పాత్ర. సాధారణంగా ఊపిరితిత్తులు ధూమపానం వల్ల చెడిపోతుంటాయి. ధూమపానం చేయనివారు కూడా ఊపిరితిత్తులు పాడైపోయి సమస్యల వలయంలో చిక్కుకుంటున్నారు. దీనికి కారణం పరోక్ష ధూమపానం, అలాగే వాతావరణ కాలుష్యం కూడా. ఊపిరితిత్తులు పాడైపోతే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. కళ్లలో చికాకు, గొంతునొప్పి వంటి సమస్యలు కూడా ఉంటాయి. అయితే ఊపిరితిత్తులు శుభ్రపడాలంటే కొన్ని పానీయాలు బాగా హెల్ప్ చేస్తాయి. తులసి నీరు.. తులసిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో సహాయపడతాయి. రోజూ తులసి ఆకులను నీటిలో వేసుకుని తాగుతున్నా, తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి తీసుకుంటున్నా మంచి ఫలితాలు ఉంటాయి. అల్లం టీ.. అల్లంలో కూడా యాంటీ ఇన్ప్లమేటరీ గుణాలు ఉంటాయి. ఛాతీలో, గొంతులో పేరుకున్న కఫాన్ని బయటకు పంపడంలో అల్లం బాగా పనిచేస్తుంది. ఊపిరితిత్తులకు మేలు చేస్తుంది. అల్లాన్ని నీటిలో మరిగించి ఆ నీటిని తాగుతుంటే ఊపిరితిత్తులు శుభ్రపడతాయి. పుదీనా టీ.. పుదీనాలో మెంథాల్ ఉంటుంది. ఇది శ్వాస గొట్టాలను తెరవడంలో, శ్వాస బాగా ఆడటంలో సహాయపడుతుంది. ఊపిరితిత్తులను క్లియర్ చేస్తుంది. పుదీనా ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగుతుంటే మంచి ఫలితం ఉంటుంది. లెమన్ వాటర్.. నిమ్మకాయ నీరులో విటమిన్-సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఊపిరితిత్తులను శుభ్రంగా ఉంచుతుంది. నీళ్లలో నిమ్మరసం కలుపుకుని రోజూ తాగుతుంటే మంచి ఫలితాలు ఉంటాయి. వాము నీరు.. వాము కూడా ఛాతీలోనూ, గొంతులోనూ పేరుకున్న కఫాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. ఊపిరితిత్తులను శుభ్రం చేయడంలో కూడా సహాయపడుతుంది. వాము గింజలను నీటిలో వేసి మరిగించి అందులో కొద్దిగా బెల్లం కలిపి తాగితే మంచిది. *రూపశ్రీ.
read moreబెస్ట్ ప్రోటీన్ ఫుడ్స్ ఇవే!
శరీరానికి అవసరమైన మూడు స్థూల పోషకాలలో ప్రోటీన్ ఒకటి, కణజాలాల పెరుగుదల మరియు నిర్వహణ కోసం మనకు అవసరమైన విధంగా సరిగ్గా పనిచేయడానికి మన శరీరానికి పెద్ద పరిమాణంలో ప్రోటీన్ అవసరమవుతుంది. ప్రొటీన్లు వ్యాధులతో పోరాడటానికి అవసరమైన రోగనిరోధక శక్తిని అందిస్తాయి, ఇవి లేకపోతే మన శరీరం నిరంతరం అరిగిపోతుంది. ప్రోటీన్ల యొక్క ప్రయోజనాల జాబితా అంతులేనిది, ఈ మాక్రోన్యూట్రియెంట్‌ను మన ఆహారంలో చేర్చుకోవాలి. అయితే ఈ ప్రోటీన్ పర్ఫెక్ట్ గా తీసుకోవడానికి పర్ఫెక్ట్ సమయం ఏదంటే అల్పాహార సమయమే.. తద్వారా మన శరీరం రోజంతా శక్తివంతంగా ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్ లో బెస్ట్ ప్రోటీన్ అందిందే కొన్ని ఆహార పదార్థాలు ఇవే.. నట్స్ - నట్స్ రుచికరమైన, అధిక ప్రోటీన్ కలిగిన అల్పాహారం అని చెప్పవచ్చు. మొక్కల ఆధారిత ప్రోటీన్ యొక్క మంచి మోతాదును అందిస్తాయి. అంతే కాదు ఇవి బెస్ట్ రికమెండషన్ కూడా. తినడానికి కూడా సులభమైనవి. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే గింజల్లో బాదం, వాల్నట్, పిస్తా, జీడిపప్పు, పైన్ నట్స్, వేరుశెనగ ఉన్నాయి. నట్స్ తీసుకోవడం వల్ల మీకు అవసరమైన ప్రొటీన్‌ను పొందడంలో మీకు సహాయపడుతుంది, ఇది ఆరోగ్యకరమైన చర్మం, కండరాలు మరియు ఎముకలకు తోడ్పడుతుంది. ప్రోటీన్ ఎక్కువసేపు నిండుగా అనుభూతి చెందేలా చేస్తుంది. పచ్చి బఠానీలు - ప్రోటీన్ మరియు ఫైబర్ శరీరానికి అవసరమైన రెండు పోషకాలు, ఇవి బఠానీలలో పుష్కలంగా ఉంటాయి. బఠానీలు ఆకలిని నియంత్రించగలుగుతాయి, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఒక కప్పు బఠానీ తీసుకుంటే అందులో విటమిన్ సిలో సగానికి పైగా ఉంటుందని నిపుణులు తెలిపారు. రోజువారీ అల్పాహారంలో బఠానీలను చేర్చడం వల్ల శరీరానికి తగిన ప్రోటీన్లను అందించవచ్చు. క్వినోవా - క్వినోవా ఉత్తమ అల్పాహారంగా చెప్పవచ్చు. ఎందుకంటే క్వినోవాను కంప్లీట్ ప్రోటీన్గా సూచిస్తారు. శరీరం స్వయంగా ఉత్పత్తి చేయలేని తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలలో ప్రతి ఒక్కటి క్వినోవా కలిగి ఉండటం దీనికి కారణం. ఇది చాలా ప్రోటీన్ మరియు ఫైబర్ కలిగి ఉంటుంది, అలాగే ఇది సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్ కాబట్టి ఇది మరింత నెమ్మదిగా జీర్ణమవుతుంది. సోయా మిల్క్ - సోయా మిల్క్‌లో ప్రొటీన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సోయా పాలు ఆరోగ్యకరమైన, మొక్కల ఆధారిత ప్రోటీన్. ఇది బలమైన కండరాలు అవయవాలను నిర్వహించగలదు. మీ శరీరం స్వంతంగా ఉత్పత్తి చేయలేని "మంచి" కొవ్వులు అయిన ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు సోయా పాలలో పుష్కలంగా ఉన్నాయి. ఓట్స్ - ఓట్స్ తక్కువ-ధర, పోషకాలు ఎక్కువగా ఉండే ప్రోటీన్ల మూలం. ఓట్స్ లో 11-15% అధిక ప్రోటీన్ కలిగి ఉంటాయి. పీనట్ బటర్, చియా గింజలు, అవిసె గింజలు, ఒక స్కూప్ ప్రోటీన్ పౌడర్ వంటి మొక్కల ఆధారిత ప్రోటీన్ లను ఓట్స్ కు జోడించవచ్చు. సమర్థవంతమైన ప్రోటీన్ ఫుడ్ కు వోట్స్ సరైన మార్గం. చియా విత్తనాలు - చియా గింజలు ఫైబర్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు కలిగిన అధిక-నాణ్యత గల ప్రోటీన్. అలాగే అవసరమైన ఖనిజాలు యాంటీఆక్సిడెంట్లలో సమృద్ధిగా ఉంటాయి. ఈ విత్తనాలను సలాడ్లతో తీసుకోవచ్చు. లేదంటే పెరుగుతోనూ తీసుకోవచ్చు. చాలా రకాల పుడ్డింగ్ లలో వీటిని వాడతారు. ఇలా సాధారణ వ్యక్తులు కూడా తమ అల్పాహారంలో జోడించుకోగల ప్రోటీన్ ను తీసుకుని ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు. ◆నిశ్శబ్ద.
read moreరాత్రి సమయంలో త్వరగా నిద్ర పట్టడం లేదా? ఈ పనులు చేయండి..!
నిద్ర గొప్ప మెడిసిన్ అంటారు. కంటి నిండా నిద్రపోయేవారి ఆరోగ్యం చాలా మటుకు చాలా బాగుంటుంది. హాయిగా నిద్ర పోయే వారు మానసిక ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలను చాలా బాగా డీల్ చేయగలుగుతారు. అంతేనా రాత్రి సమయంలో బాగా నిద్రపోయేవారు తమ రోజును పర్పెక్ట్ గా హ్యాండిల్ చేయగలుగుతారు. రాత్రి సమయంలో నిద్రపోయే వారి శరీరంలో నిద్ర చక్రం ఒక క్రమ పద్దతిలో పనిచేస్తుంది. అయితే ఈ కాలంలో చాలామంది నిద్ర సరిగా పట్టక ఇబ్బందులు పడుతుంటారు. రాత్రి తొందరగా పక్క మీదకు చేరినా తొందరగా నిద్ర పట్టక గంటలు గంటలు దొర్లుతూ కాలం గుడుపుతారు. అయితే కొన్ని పనులు చేయడం వల్ల రాత్రి సమయంలో హాయిగా నిద్ర పోవచ్చట. ఇంతకీ అవేంటో తెలుసుకుంటే.. శ్వాస.. లోతైన శ్వాస వ్యాయామాలు శరీరాన్ని, మెదడును, మనస్సును అలసట , ఒత్తిడి నుండి బయటకు తెస్తాయి. ఈ కారణం వల్ల నిద్రపోయే ముందు లోతైన శ్వాస వ్యాయామాలు, ధ్యానం వంటివి పాటించడం పడుకున్న తరువాత తొందరగా నిద్ర వస్తుంది. నిద్రలేమి, తొందరగా నిద్ర పట్టకపోవడం వంటి సమస్యతో ఇబ్బంది పడేవారు లోతైన శ్వాస వ్యాయామాలు ప్రాక్టీస్ చేయడం చాలా ముఖ్యం. శ్రద్ద.. శ్రద్ద వల్ల నిద్ర పట్టడం ఏంటి అని చాలా మంది అనుకుంటారు. కానీ నిద్ర పట్టడం కోసం చేసే లోతైన శ్వాస వ్యాయామాల విషయంలో శ్రద్ద చాలా అవసరం. శ్వాస వ్యాయామాలు మనస్సుకు, శరీరానికి విశ్రాంతి తీసుకోవడానికి సహజ మార్గంలా సహాయపడతాయి. ఈ శ్వాస వ్యాయామాలు శరీరానికి ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది. ఇది శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది. డిజిటల్ డిటాక్స్.. డిటాక్స్ అంటే కలుషితం అవ్వడం. డిజిటల్ యుగంలో శరీరం చాలా రకాల సమస్యలతో కలుషితం అవుతోంది. ముఖ్యంగా ఎప్పుడూ ఫోన్ ఉండాల్సిందే.. ఇలా రాత్రి పడుకునేవరకు ఫోన్ చూస్తూ ఉండటం వల్ల అది నిద్ర మీద ప్రభావం చూపిస్తుంది. ఫోన్ లేదా టీవి, ల్యాప్‌టాప్ నుండి వెలువడే నీలి కాంతి కళ్లకు ఎఫెక్ట్ ఇస్తుంది. ఈ కాంతి తగిలిన తరువాత తొందరగా కళ్లు విశ్రాంతిలోకి వెళ్లలేవు. అందుకే వీటికి దూరం ఉండాలి. నిద్ర పోవడానికి కనీసం గంట ముందే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, టీవీ వంటి పరికరాలను బంద్ చేయాలి. మెలటోనిన్ లోపం.. మెలటోనిన్ అనేది హార్మోన్. మెలటోనిన్ నిద్రకు సహాయపడుతుంది. ఇది మెదడు పనితీరు ద్వారా ఉత్పత్తి అవుతుంది. రాత్రి సమయంలో ఫోన్,టీవి, ల్యాప్‌టాప్ వంటి స్క్రీన్లు పడుకునే వరకు చూడటం వల్ల స్క్రీన్ నుండి వెలువడే బ్లూ లైట్ మెదడును యాక్టీవ్ గా ఉంచుతుంది. మెదడు ఎక్కువసేపు యాక్టీవ్ గా ఉండటం వల్ల మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోయి నిద్రకు ఆటంకం కలుగుతుంది. *రూపశ్రీ.
read moreశరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు కనిపించే లక్షణాలు ఇవే..!
కొలెస్ట్రాల్ శరీరానికి చాలా అవసరమైన పదార్థం. కొలెస్ట్రాల్ లో బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ అని రెండు రకాలు ఉంటాయి. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన కొవ్వులు అవసరం. అలా కాకుండా చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ అయితే ఫ్యాటీ లివర్, గుండె సంబంధ సమస్యలు, ఊబకాయం వంటి సమస్యలు వస్తాయి. శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడానికి అనేక కారణాలు ఉంటాయి. అయితే శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలను బట్టి కొలెస్ట్రాల్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవచ్చు.. కొలెస్ట్రాల్ అంటే.. కొలెస్ట్రాల్ అనేది శరీరం అనేక ముఖ్యమైన విధులు నిర్వర్తించడానికి సహాయపడే ఒక లిపిడ్. ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ శరీరానికి ఎంత అవసరమో.. చెడు కొలెస్ట్రాల్ శరీరానికి చేసే చేటు అంతకంటే దారుణంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ ఎక్కువైతే కనిపించే లక్షణాలు.. కొలెస్ట్రాల్ ఎక్కువ అయితే ఛాతీ నొప్పి వస్తుంది. లేకపోతే ఛాతీ భాగంలో ఒత్తిడి కూడా ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఎవరికైనా కనిపిస్తే వైద్యులను కలవడం, కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకోవడం మంచిది. ఎప్పుడూ అలసటగా అనిపించడం, శరీరంలో శక్తి లేనట్టు ఉండటం కూడా కొలెస్ట్రాల్ లెవల్స్ పెరిగాయనడానికి సంకేతం. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే పాదాలు, చీల మండలలో వాపు ఉంటుంది. కొలెస్ట్రాల్ రక్త ప్రవాహంలో అడ్డంకులు ఏర్పరచడం వల్ల ఇలా పాదాలలో వాపులు వస్తాయి. కంటి చూపు మందగించడం కూడా కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువ ఉండటాన్ని సూచిస్తుంది. కంటి చూపు మసకగా ఉండటం, దృష్టి విషయంలో తేడాలు ఉండటం మొదలైనవి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం వల్ల జరుగుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే చర్మం పై మచ్చలు వస్తాయి. చర్మం పై మచ్చలు ఏర్పడుతుంటే వైద్యులను సంప్రదించాలి. *రూపశ్రీ.
read moreఈ ఐదు రకాల సమస్యలున్న వారు జీడిపప్పు తినకూడదట..!
జీడిపప్పు చాలామంది ఎక్కువగా తినే డ్రై నట్. జీడిపప్పును స్వీట్స్ లోనూ, వంటల్లోనూ, తీపి, కారం అనే తేడా లేకుండా అన్ని రకాల వంటల్లోనూ ఉపయోగిస్తుంటారు. వీటిని బేక్ చేసి లేదా వేయించి స్నాక్స్ గా తినేవారు కూడా ఉంటారు. అయితే జీడిపప్పును అందరూ తినడం ఆరోగ్యమేనా అంటే లేదు అంటున్నారు ఆహార నిపుణులు. కొన్ని రకాల వ్యక్తులు జీడిపప్పు తినకూడదట. ఇంతకీ వీటిని ఎవరు తినకూడదో తెలుసుకుంటే.. జీడిపప్పులో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్నా సరే.. ఇప్పటికే శరీరంలో అధిక కొలెస్ట్రాల్ సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు జీడిపప్పును తినకూడదు. ఇది కొలెస్ట్రాల్ సమస్యను మరింత పెంచుతుంది. ఈ కాలంలో మైగ్రేన్ సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మైగ్రేన్ సమస్యతో ఇబ్బంది పడేవారు జీడిపప్పును అస్సలు తినకూడదు. జీడిపప్పు తింటే మైగ్రేన్ సమస్య మరింత పెరుగుతుంది. గాల్ బ్లాడర్ అంటే పిత్తాశయం.. కొందరికి గాల్ బ్లాడర్ లో రాళ్లు ఏర్పడుతుంటాయి. ఇలాంటి వారు జీడిపప్పు తినకుండా ఉండటం మంచిది. లేదంటే గాల్ బ్లాడర్ లో రాళ్ల సమస్య మరింత పెరుగుతుంది. జీడిపప్పులో సోడియం అధికంగా ఉంటుంది. ఈ కారణంగా అధిక రక్తపోటు లేదా హై బీపీ ఉన్నవారు జీడిపప్పును తినకూడదు. ఇవి తింటే హై బీపీ సమస్య మరింత పెరుగుతుంది. కిడ్నీ సమస్యతో ఇబ్బంది పడేవారు కూడా జీడిపప్పును తినకుండా ఉండటమే మంచిది. జీడిపప్పులో ఉండే సమ్మేళనాలు కిడ్నీ సమస్యలను మరింత పెంచుతాయి. పొట్ట సంబంధిత సమస్యలు ఏమైనా ఉంటే అలాంటి వారు జీడిపప్పు తినకపోవడం మంచిది. పొట్ట సంబంధ సమస్యలున్న వారికి జీడిపప్పు సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. *రూపశ్రీ.
read moreచిన్నవయసులోనే జుట్టు బాగా రాలిపోతోందా? పోషకాలు లోపించినట్టే..!
జుట్టు రాలడం అనేది ఒక సాధారణ సమస్య. యువత కూడా దీని బారిన పడుతున్నారు. 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు కూడా జుట్టు బలహీనత, జుట్టు రాలడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. కుటుంబంలో ఇప్పటికే ఈ సమస్య ఉన్నవారికి జన్యుపరంగా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా, జీవనశైలి, ఆహారానికి సంబంధించిన సమస్యలు కూడా జుట్టు రాలడానికి ప్రధాన కారణం అవుతాయి. ముఖ్యంగా కొన్ని పోషకాలు లోపిస్తే జుట్టు రాలడం అనే సమస్య ఎక్కువగా ఉంటుంది. పోషకాలు.. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం విటమిన్-డి, విటమిన్-బి7 లేదా బయోటిన్, విటమిన్-ఇ, విటమిన్-ఎ వంటి పోషకాలు జుట్టుకు సమతుల ఆహారంగా పనిచేస్తాయి. వీటి లోపం వల్ల చిన్న వయసులోనే జుట్టు బాగా రాలిపోయి బట్టతల కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జుట్టు వేగంగా రాలుతున్నా, జుట్టు బాగా రాలిపోతున్నా ఆహారంలో పోషకాలను తనిఖీ చేసుకోవాలి. దీని వల్ల జుట్టు రాలడానికి ఏం చేయాలి? ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి? ఏం తినాలి అనే విషయాల మీద అవగాహన పెరుగుతుంది. బయోటిన్ లోపిస్తే.. బయోటిన్ లేదా విటమిన్-బి7 లోపిస్తే జుట్టు, చర్మం, గోళ్లకు చాలా నష్టం కలుగుతుంది. జుట్టు, చర్మం, గోళ్ళ ఆరోగ్యానికి బయోటిన్ అవసరం. బయోటిన్ కెరాటిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది జుట్టు బలంగా, ఆరోగ్యంగా పెరగడానికి అవసరం. అలాగే బయోటిన్ లోపిస్తే వెంట్రుకలు పల్చబడటం, చిట్లడం కూడా జరుగుతుంది. తరచుగా మహిళలు గర్భం దాల్చడం, కొన్ని రకాల మందులు ఉపయోగించడం, కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా జుట్టు రాలడం అనే సమస్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. బయోటిన్ పుష్కలంగా ఉన్న ఆహారం, లేదా బయోటిన్ విటమిన్-ఎ లోపిస్తే.. జుట్టు గ్రంధులలో సెబమ్ ఉత్పత్తిని పెంచడంలో విటమిన్-ఎ సహాయపడుతుంది. ఇది జుట్టును, స్కాల్ప్ ను తేమగా ఉంచడానికి అవసరం అవుతుంది. విటమిన్-ఎ లోపం ఉన్నవారిలో జుట్టు పొడిబారడం వల్ల జుట్టు బలహీనపడి జుట్టు రాలడం జరుగుతుంది. అయినప్పటికీ విటమిన్-ఎ లోపం అధికంగా ఉండటం వల్ల కూడా జుట్టు రాలడం జరుగుతుంది. మరొక విషయం ఏమిటంటే విటమిన్-ఎ శరీరంలో అవసరమైన దానికంటే ఎక్కువ ఉన్నా జుట్టు రాలడం జరుగుతుంది. కాబట్టి విటమిన్-ఎ సరైన మోతాదులో తీసుకోవాలి.
read moreతామర పువ్వుల టీ ఎప్పుడైనా తాగారా? దీంతో ఎన్ని లాభాలంటే..!
టీ అనేది భారతీయులకు పెద్ద ఎమోషన్. ఉదయం చాయ్ తో మొదలయ్యే పనులు పూర్తయ్యే వరకు మద్య మద్యలో చాయ్ పడుతూనే ఉండాలి చాలామందికి. చాయ్ తాగితే ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది కొందరికి. మరికొందరు ఆఫీసులలోనూ, పనులలోనూ బ్రేక్ తీసుకోవడానికే చాయ్ ని సాకుగా చూపెడుతుంటారు. టీ అంటే టీ డికాక్షన్, పాలు, పంచదార మాత్రమే కాదు. కొన్ని చోట్ల బ్లాక్ టీ తాగుతారు. మరికొన్ని చోట్ల గ్రీన్ టీ తాగుతారు. కానీ లోటస్ ప్లవర్ టీ గురించి తెలిసినవారు తక్కువ. తామర పువ్వుల టీ చాలా చర్చగా మారింది. ఈ టీని తాగడం వల్ల కలిగే ప్రయోజాలు ఏంటో తెలుసుకుంటే.. తామర పువ్వుల టీ రుచిగా ఉండటం మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ప్రతిరోజూ తామర పువ్వుల టీ తాగుతుంటే చాలా అద్బుత ప్రయోజనాలు ఉంటాయి. మొదట దీన్నెలా చేయాలంటే.. తామర పువ్వుల టీ తయారుచేయడం చాలా సులభం. ఒక గిన్నెలో గ్లాసు నీరు పోయాలి. ఈ నీటిని మరిగించాలి. ఈ నీటిలో ఎండిన లేదా తాజా తామర పువ్వులు వేసి మూత పెట్టి కొన్ని నిమిషాలు ఉడికించాలి. ఆ తరువాత స్టౌవ్ ఆఫ్ చేసి దాన్ని పక్కన ఉంచాలి. తామర పువ్వులు ఉడికిన నీరు చల్లారిన తరువాత దాన్ని స్టైయినర్ తో ఫిల్టర్ చేయాలి. ఈ నీటిలో కొద్దిగా కెమికల్స్ లేని, స్వచ్చమైన రోజ్ వాటర్ జోడించవచ్చు. ఇందులో రుచి కోసం కాసింత తేనె కూడా కలుపుకోవచ్చు. అంతే తామర పువ్వుల టీ తాగడానికి సిద్దమైనట్టే. ప్రయోజనాలేంటంటే.. తామర పువ్వులలో అపోమోర్పిన్, న్యూసిఫెరిన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఒత్తిడి, నిరాశ, ఆందోళన వంటి సమస్యల నుండి ఉపశమనాన్ని ఇస్తాయి. తామర పువ్వుల టీ తీసుకుంటే కార్డియాక్ అరెస్ట్ వంటి గుండె సంబంధ సమస్యలు, వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. మహిళలు తమ పీరియడ్స్ సమయంలో తామర పువ్వుల టీని రోజుకు ఒకటి నుంి రెండు కప్పుల వరకు తీసుకుంటే నెలసరి అసౌకర్యాల నుండి ఉపశమనం ఉంటుంది. *రూపశ్రీ.
read moreఉదయాన్నే ఖాళీ కడుపుతో జామ ఆకులు తింటే ఏమవుతుందో తెలుసా..
పేదవాడి యాపిల్ గా పిలుకునే జామపండులో చాలా పోషకాలు ఉంటాయి. కేవలం పేదవాడి యాపిల్ అని పిలుపులోనే కాదు, యాపిల్ తో సరితూగే పోషకాలు కూడా జామపండులో ఉంటాయి. బాగా ఆకలిగా అనిపించినప్పుడు ఒక్క జామ పండు తింటే చాలాసేపు ఆకలి అనే పదం మరచిపోతారు. అయితే ఎప్పుడూ జామ పండ్ల గురించేనా జామ ఆకుల గురించి తెలుసుకోవద్దా.. కాయలు లేకపోయినా సరే చెట్టుకు ఆకులైతే ఉంటాయి. ప్రతిరోజూ పరగడుపున జామ ఆకులను తింటే అద్బుతమైన ప్రయోజనాలుంటాయి. ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో జామ ఆకులను తింటే జీర్ణసంబంధ సమస్యలు అన్నీ చిటికె వేసినట్టు మాయం అవుతాయి. జీర్ణాశయాన్ని శుద్ది చేయడంల, జీర్ణక్రియ పనితీరు మెరుగుపరచడంలో జామ ఆకులు చాలా బాగా పనిచేస్తాయి. జామ ఆకులలో ఫైబర్ చాలా ఉంటుంది. వీటిని ఉదయాన్నే నమిలి తింటే అద్బుతం జరుగుతుంది. కాంప్లెక్స్ స్టార్స్‌ను చక్కెరగా మార్చడాన్ని జామఆకులు నిరోధిస్తాయి. ఈ కారణంగా ఇవి శరీరంలో అదనపు చక్కెరలు, అదనపు కొవ్వుల నిల్వను అరికడుతుంది. దీని ఫలితంగా అధికబరువు ఉన్నవారు బరువు తగ్గడానికి జామ ఆకులు తోడ్పడతాయి. ఉదయాన్నే జామ ఆకులు నమిలి తినడం లేదా జామ ఆకులతో టీ తయారుచేసుకుని తాగాలి. ఇలా క్రమం తప్పకుండా నెలరోజుల పాటు చేస్తే శరీరంలో పేరుకున్న చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. వర్షాకాలంలో నీటి కాలుష్యం వల్ల ఎదురయ్యే సమస్యలలో అతిసారం ఒకటి. అతిసారంతో ఇబ్బంది పడుతున్నప్పుడు జామ ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి. ఒక గ్లాసు నీటిలో ఒక గుప్పెడు జామ ఆకులు వేసి బాగా మరిగించాలి. ఈ ద్రావణాన్ని రోజులో రెండుసార్లు కొద్దికొద్దిగా తాగాలి. ఇలా చేస్తే లూజ్ మోషన్స్ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. మధుమేహం ఉన్నవారికి జామకాయలు చాలామంచివి అనే మాట వినే ఉంటాం. అయితే జామఆకులు కూడా చాలామంచివి. జామఆకులు శరీరంలోని సుక్రోజ, మాల్టోస్ శోషణను నిరోధిస్తాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. 10నుండి 12వారాలపాటు ప్రతిరోజూ ఖాళీ కడుపుతో జామ ఆకుల టీ తాగడం వల్ల ఇన్సులిన్ ఇత్పత్తి పెరగకుండా రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు కూడా జామ ఆకులను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే ఇమ్యునిటీ పెరుగుతుంది. జలుబు, దగ్గు, తలనొప్పి, జ్వరం లాంటి చిన్న చిన్న సమస్యలను చాలా సులువుగా అధిగమించేలా రోగనిరోధకశక్తి పెంచుతుంది. జామఆకులలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. జామ ఆకులను బాగా కడిగి, మిక్సీ పట్టి పేస్ట్ చెయ్యాలి. ఈ పేస్ట్ ను జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు బలంగా ఆరోగ్యంగా పెరుగుతుంది. ఉదయాన్నే ప్రతిరోజూ ఖాళీ కడుపుతో జామ ఆకులు నమలడం వల్ల కొద్దిరోజులలోనే చర్మం మెరుపు సంతరించుకుంటుంది. ముఖం మీద మచ్చలు, మొటిమలు క్రమంగా తగ్గిపోవడానికి కూడా జామ ఆకులను ఉపయోగించవచ్చు. జామ ఆకులను పేస్ట్ చేసి ముఖం మీద మొటిమలు, మచ్చలు ఉన్నచోట రాయాలి. దీనివల్ల మచ్చలు, మొటిమలు క్రమంగా తగ్గిపోతాయి. *నిశ్శబ్ద.
read moreఅడుసు ఆకు కషాయం సర్వరోగ నివారిణి
అడుస చెట్టు లో ఉన్న వెళ్ళు ఆకులో మంచి ఔషద గుణాలు ఉన్నాయని అంటున్నారు ఉనాని వైద్యనిపుణురాలు డాక్టర్ సత్య ప్యాన్ డమిక్ లో అవసరమైన మొక్క అడుస అని అన్నారు. ఉనానిలో ఎన్నో పోషక ఔఫద గుణాలు ఉన్నాయని దాదాపు 6౦౦౦ మొక్కలు ఉన్నాయని వివరించారు. చిన్న పిల్లలు ఉన్న ఇళ్ళలో అడుసా ఆరు ఫీట్ల ఎత్తులో పెంచుకోవచ్చు.అడుస మొక్కను కుండీలో 2,3 ఫీట్ల మొక్కగా పెంచుకోవచ్చు.అడుసా ఆకు కషా యం దగ్గు,జలుబు.ఆయాసంఉన్న వారికి అడుసా ఆకు కాషాయం బ్రంహాస్త్రం లా పని చేస్తుందని.అసలు దగ్గు వచ్చినప్పుడు వాడే దగ్గు టానిక్ లో ఉండే రసాయనాలు మనల్ని నిద్రపుచ్చుతాయి.అలా దగ్గు వచ్చినప్పుడల్లా తీసుకుంటే దగ్గు మందు నరాల పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని మెదడు మొద్దు బారి పోతుందని డాక్టర్ సత్య వివరించారు. దగ్గు తగ్గుతుంది కాని నరాలలో బలహీనాథ వస్తుంది అది గమనించండి. పిల్లలకు దగ్గు మందు వాడితే చేతులు కాళ్లు వణకడం మొదలు అవుతుంది. ఒక్కో సారి పూర్తిగా ఇంఫెర్టీలిటికి దారి తీస్తుందని డాక్టర్ సత్య హెచ్చరించారు దగ్గు మందు ను పూర్తిగా తగ్గించుకోవాలంటే ఆకు పచ్చగా ఉండే అడుసా ఆకును అంటే బ్రైట్ గ్రీన్ లో ఉండే అడుసా ఆకు బాగా పొడవుగా ఉంటాయి.తీసుకోవాలి పెద్దవాళ్ళు అయితే 1౦ ఆకులు,పిల్లలు అయితే 5 ఆకులు తీసుకుని ఆకులను బాగా కడిగి నీళ్ళలో వేసి బాగా మరిగించి వడకట్టి రోజుకు మూడు కప్పులు అంటే ఉదయం,మధ్యాహ్నం, రాత్రి అడుసా కషాయం తీసుకుంటే మంచి ఫలితాలు ఉన్నాయి. ఇక మహిళలు,అడ పిల్లలు ఎదుర్కునే నెలసరి సమస్య లకు నెలసరి ఎక్కువ లేదా,నెలసరి అసలు లేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కుంటున్న వారికి,ఆయాసం,ఉబ్బసం,దగ్గు తో బాధ పడే వారికి,బాగా దగ్గడం వల్ల ఒక్కోసారి వారి ఊపిరితిత్తులు పట్టేసి నట్లుగా ఉంటుంది,అలాగే కొందరిలో పంటి నొప్పి వస్తుంది, అలాంటి వారికి అడుస ఆకు కషాయం తో నోటి దుర్వాసన కూడా పోతుంది.లేదా కొంతమందిలో ముక్కు నుండి రక్తం కారడం చూస్తాం. ముక్కు చీదినప్పుడు అలా రక్తం వస్తే అడుస ఆకు కషాయం ఉపయోగ పడుతుంది. అడిసను వైద్యంలో వాడతారు.జ్వరం వచ్చినప్పుడు,కోరోనా డెంగ్యు,వైరస్ లు,గొంతు నొప్పి ఉన్నప్పుడు అడుసా మొక్కను పెంచితే మంచి ఫలితాలు ఉంటాయని అంటారు డాక్టర్ సత్య. అడుసా ను అందుకే సర్వరోగనివారిణి అంటారు.ఉనాని అంటేనే మొక్కలతో వైద్యం,అవగాహన కల్పించే ప్రయతనం చేస్తున్నామని కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్న సంప్ర దాయ వైద్యంలో ఉన్న సులువైన వైద్య విధానాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నామని ప్రముఖ యునాని వైద్య నిపుణురాలు డాక్టర్ ఎస్ గి వి సత్య స్పష్టం చేసారు.
read moreనాడీపతి లో ప్రత్యామ్నాయ చికిత్సలు...
కప్పింగ్ తెరఫీ... కప్పింగ్ తెరఫీ యునానిలో అత్యంత పురాతన మైనదని అంటారు. ముఖ్యంగా శరీరంలో వచ్చే నొప్పులు. ముఖ్యంగా వీపు, వెన్ను నొప్పులు, కండరాలు,నరాల లో వచ్చేనోప్పులు లేదా వాపులు రక్తప్రసారం లేనందువల్ల,ఊపిరి తిత్తుల్లో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ సమస్య దీర్హకాలంగా ఉండే సమస్యలకు కప్పింగ్ తెరఫీ ఒకచికిత్చ సులభమైన ప్రాత్యామ్నాయ చికిత్చ గా పేర్కొన్నారు. కుప్పింగ్ తెరఫీ విధానం... శరీరంలో పీల్చేసామర్ధ్యం ఉన్న రకరకాల కప్పింగ్ పద్దతులను వాడుతూ ఉంటారు. నాడీ పతిలో చాలా రకాల ఎలిమెంట్స్ వాడుతూ ఉంటారు.మననమ్మకం ప్రకారం కప్పింగ్ తెరఫీ ద్వారా రక్తప్రవాహం పెంచడం ఇతర సమస్యల నివారణకు దోహదం చేస్తుంది. కప్పింగ్ తెరఫీ వల్ల లాభాలు... నెప్పి నివారణ ను ఉపసమనం కలిగించడం. శరీర భాగాలలో మనకి కనపడని కండరాలు ఇతర కణాలు, మనకదలికలకు సహకరించే మెత్తటి కణజాలం శరీరంలో ఒక్కోసారి కదలకుండా ఉండిపోతాయి. ఒక్కోసారి ఊపిరితిత్తులు లేదా చెస్ట్ లో తీవ్రమైన నొప్పి కదలిక లేకపోవడం వంటి సమస్యలు లింఫ్ ద్వారా విడుదల అయ్యే ఫ్లూయిడ్స్ ను శుద్ధిచేయడం రక్తప్రశ్రారం చేస్తాయి. వీటికి శరీరం ద్వారా వ్యర్ధ పదార్ధాల బయటికి తరలించడం.ఒక్కోసందర్భం లో మీనరాలను మత్తుగా తిమ్మిరి పట్టినట్టుగా ఉంటుంది.కప్పింగ్ పద్దతిద్వారా శరీరంలో కి శక్తి ని పంపించడం ద్వారా అవిసరిగా పనిచేసే విధంగా కప్పింగ్ పద్ధతి ఉపయోగ పడుతుందని ముఖ్యంగా వెన్నుపూసలో ఊపిరితిత్తులలో పేరుకు పోయిన ఫ్లూయిడ్స్ ను బయటికి తీసేందుకు కప్పింగ్ పద్ధతి దోహదం చేస్తుందని పేర్కొన్నారు. సీడ్ తెరఫీ... నాడీ పతి చికిత్చాలలో సీడ్ తెరఫీ ని నిత్యం వినియోగిస్తూ ఉంటారు. శరీరం పై సీడ్ తెరఫీ ని విస్తృతంగా వినియోగిస్తున్నారు.సీడ్ తెరఫీ ద్వారా నరాలలో రక్త ప్రసారం పెంచడం శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచడం సీడ్ తెరఫీ దోహదం చేస్తుంది.ముఖ్యంగా నాడీ పతిలో దీర్ఘకాలిక డయాబెటీస్ కు రోగులకు ద్రాక్ష విత్తనాన్ని వినియోగిస్తారు. ఇక సంజోక్ తెరఫీ లోను ప్రతి అవయవానికి ఒక్కో పండు,కూర గాయల విత్తనం వాడడం గమనించ వచ్చు.శరీరం లో ఉన్న రేఫ్లేక్స్ పాయింట్స్ లేదా సుజోక్ పాయింట్స్ పై విత్తనాలను పేస్తే చేసి విజయం సాధించినట్లు తెలిపారు.ఉదాహరణకు వాల్ నట్స్ అది మన మెదడు ఆకారాన్ని పోలిఉండడం వల్ల అది మన మెదడులో ఉన్న వివిదరకాల సమస్యలకు ఉపయోగ పడతాయి.మా పరిశోదన లో వివిదరకాల విత్తనాల ను వాడడం ద్వారా ఉపయోగం ఉండగలదని నిపుణులు పేర్కొన్నారు. రాజ్మా విత్తనాలు... కిడ్నీ,పొట్ట సమస్యలకు వాడవచ్చు. వెన్నునొప్పి-కీళ్ళ నొప్పులు కంటికి సంబందించిన సమస్యలకు.. బ్లాక్ పెప్పర్-నల్ల మిరియాల విత్తనాలు. డయాబెటీస్ కు-ద్రాక్ష,గోధుమ విత్తనాలు,పెసలు విత్తనాలు. వినికిడి సమస్యకు-పెసలు విత్తనాలు. అన్నిరకాల విత్తనాల వాడకం ద్వారా శక్తిని పెంచవచ్చు.తద్వారా శక్తివంతమైనవిగా భావించవచ్చు.
read moreబ్లడ్ గ్రూప్ బట్టి గుండెపోటు!
వినడానికి చిత్రంగా ఉంది కదా. కానీ లక్షలమందిని పరిశీలించిన తరువాతే ఈ మాట చెబుతున్నామంటున్నారు శాస్త్రవేత్తలు. నెదర్లాండ్స్‌కు చెందిన టెస్సా అనే పరిశోధకురాలు తేల్చిన ఈ వివరం ఇప్పుడు వైద్యలోకంలో సంచలనం సృష్టిస్తోంది. గుండెజబ్బులకీ బ్లడ్గ్రూపుకీ ఏ మేరకు సంబంధం ఉందో తెలుసుకునేందుకు ఏకంగా పదమూడు లక్షలమందిని పరిశీలించారు. ఇందులో myocardial infarction, coronary artery disease, ischaemic heart disease, heart failure వంటి గుండె సమస్యలు ఉన్నవారిని బ్లడ్ గ్రూప్ ఆధారంగా విభజించారు. వీరిలో O గ్రూప్ రక్తం ఉన్నవారితో పోలిస్తే ఇతర బ్లడ్ గ్రూప్ ఉన్నవారిలో గుండె సమస్యలు దాదాపు 9 శాతం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. O గ్రూప్ రక్తం వారికీ, ఇతరులకీ మధ్య ఇంత వ్యత్యాసం ఉందన్న విషయం మీద ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉంది. అయితే ఇప్పటికే రెండు కారణాలని ఊహిస్తున్నారు. - O గ్రూప్ కాని వ్యక్తులలో von Willebrand అనే ప్రొటీన్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందట. ఈ ప్రొటీను వల్ల రక్తం త్వరగా గడ్డకడుతుంది. ఏదన్నా గాయం అయినప్పుడు ఇలా రక్తం గడ్డకట్టడం మంచిదే అయినా... కొన్ని సందర్భాలలో అది గుండెపోటుకి దారితీసే ప్రమాదం ఉంది. - A గ్రూప్ రక్తంవారిలో ఉండే కొన్ని జన్యువుల వల్ల, వారిలో కొలెస్టరాల్ పేరుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందట. ఇలా కొలెస్టరాల్ పేరుకోవడం వల్ల గుండె ధమనులు పూడుకుపోతాయన్న విషయం తెలిసిందే కదా! - O గ్రూపు కాని వ్యక్తులలో galectin-3 అనే ప్రొటీన్ ఉత్పత్తి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది శరీర భాగాలలో వాపుని (inflammation) నియంత్రిస్తుంది. ఈ ప్రొటీన్ కారణంగా గుండెజబ్బులు ఉన్నవారిలో సమస్యల మరింత తీవ్రతరమైపోతుందట. మొత్తానికి O గ్రూప్ వారితో పోలిస్తే ఇతరులు కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు పరిశోధకులు. ఇక మీదట వైద్యులు కూడా తమ దగ్గరకి వచ్చే రోగులకి చికిత్స చేసేటప్పుడు వారి బ్లడ్ గ్రూప్‌ని దృష్టిలో ఉంచుకోవాలని చెబుతున్నారు. - నిర్జర.
read moreమనిషికి పొటాషియం పెరిగితే ఏమవుతుంది?
పొటాషియం మన శరీరానికి అత్యవసరమైన అల్కలైట్ అదే సోడియం పొటాషియం ఎలక్ట్రో లైట్స్ ఎక్కువైనా ఇబ్బందే తక్కువైనా ఇబ్బందే అని అంటున్నారు నిపుణులు.ఒక కేస్ స్టడీ లో శరీరం లో చోటుచేసుకున్న పరిణామాల వల్ల ఒక్కో సారి పొటాషియం ఎక్కువైతే పాక్షవాతం,లేదా గుండె పోటు కు కూడా దారి తీయవచ్చు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా ఒక కేసును కిమ్స్ ఆసుపత్రికి చెందిన ప్రముఖ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఎన్ పాపారావు మాట్లాడుతూ ఒక రోగి ఆసుపత్రికి వచ్చాడని కాళ్ళు కదపలేని స్థితిలో ఉన్నాడని అసలు కాలు కదపడం లేదంటే ఏదైనా న్యూరో సమస్య ఉండి ఉండవచ్చని భావించి ఎం అర్ ఐ స్పైన్ బ్రెయిన్ స్కాన్ పరీక్షలు చేయించా మని అక్కడ ఏ రకమైన సమస్య బయట పడలేదని అయితే ఇక మిగిలింది రక్త పరీక్ష చేయించగా రక్తం లో పొటాషియం శాతం ఎక్కువగా ఉందని గమనించి నట్లు డాక్టర్ పాపారావు వివరించారు. ముఖ్యంగా పొటాషియం పెరగడాన్ని వైద్యులు హైపెర్ కలేమియా గా నిర్ధారించా మని తెలిపారు.కాగా పొటాషియం లెవెల్స్ రక్త్గం లో పెరగడం వల్ల అది కార్డియో వాస్క్యులర్ అంటే గుండె రక్తనాళా లలో సమస్యలు వస్తాయని డాక్టర్ పాపారావుపేర్కొన్నారు.ఒక్కో సారి పొటాషియం ప్రతి వ్యక్తికి 4,7౦౦ ఎం జి తీసుకోవాల్సి ఉంటుందని పాపారావు వివరించారు.ప్రతి గంటకు పొటాషియం శాతం మానీటర్ చేస్తూ పొటాషియం పెరగడం వల్ల వచ్చే ఇతర సమస్యలు రాకుండా నిత్యం నిపుణులైన విద్యుల పర్య వేక్షణలో ఉండాలని సూచించారు.పొటాషియం పెరగడం వల్ల కిడ్నీ ఫెయిల్ యుర్ కు దారి తీసే అవకాశం ఉందని హెచ్చరించారుహై పర్ కేల్మియా వల్ల కిడ్నీ పనుచేయదని కిడ్నీ సరిగా పనిచేయకుంటే శరీరం నుండి పొటాషియం తొలగించలేదని అన్నారు కాగా హైపర్ కెల్మియా చాలా సహజమైన సమస్య అని అన్నారు వాస్తవానికి కిడ్నీ పొటాషియం ను నియంత్రిస్తుంది.అలాగే శరీరాన్ని పొటాషియం ను సమతౌ లయం గా ఉంచుతుంది. కిడ్నీ సరిగా పనిచేయానట్లితే అదనపు పొటాషియం ఫిల్టర్ చేయాలేదు.రక్తం లో చేరిన పొటాషియం తొలగించలేదు.కిడ్నీ లోని ఆల్టో స్టేరాన్ ఎప్పుడు పొటాషియం ను తొలగించాలో చెబుతుంది.ఒక వేళ ఆల్టో స్టేరాన్ ఉత్పత్తి తగ్గితే అడిసన్స్, వ్యాధి సోకే అవకాశం ఉందని.అది హైపర్ కేల్మియా కు దారి తీస్తుందని నిపుణులు స్పష్టం చేసారు. హైపెర్ కీల్మియా సమస్యలు... *రక్త కణాలు పనిచేయకుండా పోవడం.హేమోలసిస్.అని అంటారు. *కండరాలు కణాలు రబ్బో మయోసిస్ వంటి సమస్య వస్తుంది. *కాళ్ళలో మంటలు కణాలు ప్రమాదం బారిన పడతాయి. *డయాబెటీస్ నియంత్రణ సాధ్యం కాదని నిపుణులు పేర్కొన్నారు. రక్తనాళా లలో పొటాషియం శాతం పెరిగితే మూత్ర నాళం ద్వారా బయటికి పోతుందని అయితే పొటాషియం పెరగడం వల్ల అలసట నాజియా గుండె హృదయ స్పందనలో హెచ్చు తగ్గులు ఉంటాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.కాగా పొటాషియం వల్ల కండరాలలో నొప్పులు అలాగే పాక్షవాతానికి దారి తీస్తుందని డాక్టర్ పాపారావు వెల్లడించారు.కాగా కాళ్ళు వేళ్ళు స్పర్స కోల్పోవడం,పొట్టలో పట్టి నట్లు గా ఉండడం.విరేచనాలు,కళ్ళు తిరగడం వంటి సమస్యలు తలేత్తుతాయాని పొటాషియం సమస్యను సకాలం లో గుర్తించ కుంటే రోగులు కోమాలోకి చేరతారని ఈ విషయాన్ని పూర్తిగా గమనించాలని తగిన విధమైన చికిత్స సకాలం లో అందిస్తే రోగిని తీవ్రత నుండి కాపాడ వచ్చని డాక్టర్ పాపారావు స్పష్టం చేసారు. ఆహారం లో పొటాషియం తగ్గడం వల్ల మరిన్ని సమస్యలు వస్తాయని తెలిపారు.ఒక్కో సారి కిడ్నీద్వారా ఫిల్టర్ కావాల్సిన రక్తం పనిచేయకుంటే డయాలసిస్ చేయాల్సి ఉంటుందని. నిపుణులు పేర్కొన్నారుఅదనంగా వచ్చి చేరిన పొటాషియం తగ్గించాలంటే .పొటాషియం బైన్ డర్స్ వినియోగించాల్సి ఉంటుందని తెలిపారు.లేదా బీటా బ్లాకర్స్ వాడాల్సి ఉంటుంది. శరీరానికి కావాల్సిన పొటాషియంఅంటే సమతౌల్యం గా ఉండాలంటే. అవకాడో, టమాటా, ఆలు, కొత్తిమీర,పాలకూర కివి పళ్ళు,అరటి పళ్ళు,వంటివి మన శరీరంలో పొటాషియం ను సమతౌల్యం లో ఉంచుతాయి.
read moreపసుపు పాలు ఎవరు ఎలా తాగాలి? ఎలా తాగితే మంచి బెనిఫిట్స్ ఉంటాయంటే..
పసుపు పాలు రోజూ తాగడం వల్ల శరీరానికి బలం చేకూరుతుందని పెద్దలు చెప్పడం మీరు వినే ఉంటారు. పసుపును ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగిస్తారు. ఇది సహజ యాంటీబయాటిక్‌గా పరిగణించబడుతుంది. అయితే కాల్షియం, ప్రోటీన్ తో సహా అనేక విటమిన్లు పాలలో ఉంటాయి. పసిపిల్లల నుండి వృద్దుల వరకు పాలు తాగడం ఎంతో అవసరమని వైద్యులు ఎన్నో ఏళ్ళ నుండి చెబుతూనే ఉన్నారు. ఇలా ఔషద గుణం కలిసిన పసుపు, ఆరోగ్యం చేకూర్చే పాలు రెండింటిని కలిపి తాగడం వల్ల ఆరోగ్యానికి డబుల్ ప్రయోజనాలు పొందవచ్చని సాధారణంగా చెబుతూనే ఉంటారు. ముఖ్యంగా పసుపు పాలు తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుందనే నమ్మకం ఉంది. అది నిజం కూడా.. కానీ రోజూ రాత్రి పడుకునే ముందు పసుపు పాలు తాగితే ఇమ్యూనిటి మాత్రమే కాదు ఇంకా బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలిస్తే ఈ రోజు నుండే రాత్రి పూట పసుపుపాలు తాగడం మొదలెట్టేస్తారు. పసుపు పాలను గోల్డెన్ మిల్క్ అని పిలుస్తారంటే దాని రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఏ సమస్య ఉన్నవారు పసుపు పాలను ఎలా తయారుచేసుకోవాలో.. పసుపుపాలు కేవలం ఇమ్యూనిటికే కాకుండా ఇంకా ఏ ప్రయోజనాలు చేకూరుస్తుందో తెలుసుకుంటే.. రాత్రిపూట నిద్ర సంబంధ సమస్యలతో బాధపడేవారు పసుపు పాలు తాగాలని కొందరు సలహా ఇస్తారు. ప్రశాంతంగా నిద్రపోవాలనుకుంటే, రోజూ రాత్రిపూట ఒక గ్లాసు పసుపు పాలు తాగాలి. ఇది బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. పసుపు రోగనిరోధక శక్తిని పెంచుతుందనే విషయం అందరికీ తెలిసిందే. రాత్రి పూట పసుపు పాలు తాగడం ద్వారా దగ్గు, జలుబు , జ్వరం వంటి సమస్యలు నివారించవచ్చు. బోలెడు వ్యాధుల నుండి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. సీజన్ ఏదైనా తప్పనిసరిగా పసుపు పాలు తాగడం మంచిది. పసుపులో శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. కీళ్ల నొప్పులతో బాధపడే వారికి పసుపు పాలు దివ్యౌషధం. ఇది వాపు, నొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. అందుకే ప్రతిరోజు పసుపు పాలు తాగుతుంటే కీళ్ళు, ఎముకల సమస్యలు మెల్లిగా తగ్గుతాయి. పసుపును వందల ఏళ్ళ నుండి చర్మ సంరక్షణలో ఉపయోగిస్తున్నారు. ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. హానికరమైన బ్యాక్టీరియాను తొలగిస్తుంది. పసుపు పాలు తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా మారుతుంది. ఏ సమస్య ఉన్నవారు పసుపు పాలు ఎలా తాగాలంటే.. సాధారణంగా ఇమ్యునిటీ కోసం తాగాలని అనుకుంటే ముందుగా పాలు మరిగించాలి. రుచికి చిటికెడు పసుపు, పంచదార లేదా బెల్లం జోడించాలి. అసలు తీపి జోడించకపోయినా పర్లేదు. పడుకునే ముందు వేడిగా లేదా గోరువెచ్చగా తాగాలి. మధుమేహం, గుండె జబ్బులు, కీళ్ల నొప్పులు ఉన్నవారు పసుపు పాలలో చిటికెడు జాజికాయ కూడా కలిపి తాగవచ్చు. ఇది చక్కగా పనిచేస్తుంది. థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు పసుపు పాలు తయారుచేసేటప్పుడు కొన్ని జీడిపప్పులను కూడా కలుపుకోవచ్చు. లేదంటే జీడిపప్పు పొడిగా చేసి పాలు మరిగేటప్పుడు కొద్దగా జోడించవచ్చు. పసుపు పాలలో చిటికెడు నల్ల మిరియాల పొడి వేసి మరిగించి తాగితే గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. *నిశ్శబ్ద.
read moreమీరూ ఈ సమస్య అనుభవిస్తుంటే ఇది తప్పక చదవాలి!
ఉదయం నిద్రలేవగానే తాపీగా మంచం దిగి పనులు చేసుకునేవారు చాలా తక్కువ మంది ఉన్నారు ఈకాలంలో. మంచం నుండి కాలు కింద పెట్టగానే నొప్పితో విలవిల్లాడిపోయేవారు చాలామంది ఉన్నారు. కొందరైతే ఉదయాన్నే నిద్ర లేవగానే మంచం మీద నుండి కిందకు దిగడానికి దాదాపు భయపడుతుంటారు. నేలపై కాలు పెట్టగానే మడమ విరిగిపోయినట్లు ఫీలవుతుంటారు కొందరు. మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే, దానిని తేలికగా తీసుకోవడం మంచిదికాదు. ఇది తీవ్రమైన సమస్యలకు సంకేతం. ఉదయం ఎదురయ్యే ఈ రకమైన నొప్పి అరికాలి ఫాసిటిస్ అనే వ్యాధి లక్షణంగా పరిగణించబడుతుంది. అరికాలి ఫాసిటిస్ అనేక ఇతర సమస్యలకు కారణంగా చెప్పబడుతుంది. వీటిని సకాలంలో గుర్తించి చికిత్స చేయడం మంచిది. ఇప్పట్లో అధికశాతం ప్రజలలో ఈ రకమైన సమస్య కనిపిస్తోందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ నొప్పి తరచుగా కొద్దిగా నడిచిన తర్వాత తగ్గిపోతుంది, అయితే ఈ సమస్యను సకాలంలో గుర్తించి చికిత్స చేయకపోతే, అది తీవ్రమైన సమస్యగా పరిణమిస్తుంది. దీని కారణంగా రోజంతా ఈ నొప్పిని శాశ్వతంగా ఎదుర్కోవలసి ఉంటుంది. ప్లాంటర్ ఫాసిటిస్.. అరికాలి ఫాసిటిస్ సమస్య పాదాలలో నొప్పికి ఎక్కువగా కారణం అవుతుంది. కాలి వేళ్లను, మడమతో కలిపే అరికాలి అంటిపట్టుకొన్న తంతుయుత కణజాలం బాధాకరంగా ఎర్రబడినప్పుడు ప్లాంటర్ ఫాసిటిస్ సంభవిస్తుంది. మీకు ఈ సమస్య ఉంటే, మీరు నిద్రనుండి మేల్కొన్నప్పుడు, ఎక్కువ సేపు విశ్రాంతి తరువాత అడుగు వేసినప్పుడు మీ మడమ చుట్టూ నొప్పిగా అనిపిస్తుంది. ప్లాంటార్ ఫాసిటిస్ లక్షణాలలో నిద్ర లేచిన వెంటనే మడమ ప్రాంతానికి రక్త సరఫరా తగ్గిపోతుంది,మేల్కొన్న వెంటనే పెరుగుతుంది. దీనికి సకాలంలో చికిత్స అవసరం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యలు.. రుమటాయిడ్ ఆర్థరైటిస్ సాధారణంగా పాదాల నొప్పితో పాటు ఇతర లక్షణాలను కలిగి ఉంటుంది. వీటిలో మణికట్టు, చేతుల్లో నొప్పి, వాపు ఉంటాయి. ఇది స్వయం ప్రతిరక్షక రుగ్మత, ఇది కీళ్ల నొప్పులు, దీని ద్వారా నడక ఇబ్బందిగా మారడం వంటి సమస్యలకు కారణమవుతుంది. ఇది పాదాలలో నొప్పి మాత్రమే కాదు, ఇది మోకాళ్లు మరియు శరీరంలోని ఇతర కీళ్ల భాగాలకు కూడా మెల్లగా విస్తరిస్తుంది. పాదాలలో నొప్పిని ఎలా తగ్గించాలంటే.. అరికాలి ఫాసిటిస్ లేదా మరేదైనా కారణాల వల్ల కలిగే నొప్పికి, ముందుగా కారణాన్ని కనుగొని చికిత్స చేయడం అవసరం. అయితే, కొన్ని జాగ్రత్తల సహాయంతో ఖచ్చితంగా నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. విశ్రాంతి : వాపు తగ్గే వరకు పాదాల మీద బరువు మోపకూడదు.అంటే పాదాలకు ఎక్కువ సమయం విశ్రాంతి ఇవ్వడానికి ప్రయత్నించండి. ఐసింగ్: కోల్డ్ కంప్రెస్ సహాయంతో వాపును తగ్గించవచ్చు, ఇది నొప్పిని తగ్గించడంలో కూడా ఉపయోగకరంగా ఉంటుంది. *నిశ్శబ్ద.
read moreషుగర్ వ్యాధిగ్రస్తులకు గుమ్మడి గింజల మేలు తెలుసా...
గుమ్మడి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ గుమ్మడి గింజల వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా? పరిమాణంలో చిన్నవే అయినప్పటికీ, ఈ చిన్న గింజల్లో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు చాలా పెద్దవి. సాధారణంగా మనమందరం గుమ్మడికాయను సాంబారుకు వాడేటపుడు గింజలను పక్కన పెట్టి చెత్తబుట్టలో వేస్తాం! కానీ గుమ్మడి గింజల్లో ఉండే విటమిన్లు, ప్రొటిన్లు, మినరల్స్ గురించి తెలుస్తే...గింజలను తప్పకుండా డైట్ లో చేర్చుకుంటారు. ముఖ్యంగా మధుమేహవ్యాధిగ్రస్తులు, అధిక బీపీతో బాధపడేవారికి గుమ్మడి గింజలు ఎంతో మేలు చేస్తాయి. గుమ్మడి గింజలను తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో చూద్దాం... అధిక బీపీ: ఈ రోజుల్లో, రక్తపోటు వ్యాధి సాధారణంగా 30 సంవత్సరాల వయస్సు ఉన్నవారిలో కనిపిస్తుంది. ఒక్కసారి ఈ వ్యాధి వచ్చిందంటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ప్రధానంగా శరీరంలోని ప్రధాన అవయవాలు ప్రభావితమవుతాయి. అన్నింటికీ మించి, గుండె కొట్టుకునే పని సామర్థ్యంలో కూడా హెచ్చుతగ్గులు ఉంటాయి. కాలేయం ప్రభావం చూపుతుంది. రక్తపోటు వల్ల మన శరీరంలోని కిడ్నీలు కూడా దెబ్బతింటాయి. అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారు డాక్టర్ సూచించిన మాత్రలు వేసుకోవడంతో పాటు గుమ్మడి గింజలను క్రమం తప్పకుండా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. రక్తపోటు అదుపులో ఉంటే గుండె ఆరోగ్యం కూడా బాగుంటుంది. మధుమేహం ఉన్నవారికి: రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి గుమ్మడికాయ గింజలు సహాయపడతాయి! డయాబెటిస్తో బాధపడుతున్న చాలా మందికి భోజనం లేదా అల్పాహారం తర్వాత అకస్మాత్తుగా చక్కెర స్థాయి పెరగడం సమస్యగా మారుతుంది. ఈ సమస్య ఉన్నవారు గుమ్మడి గింజలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం మంచిది. ఈ చిన్న గింజల్లో ఉండే ఆరోగ్యకరమైన మూలకాలు మనం తినే ఆహారంలో చక్కెర కంటెంట్, అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్లను ప్రాసెస్ చేస్తాయి. శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. గుండెకు మంచిది: ఈ చిన్న గింజల్లో వెజిటబుల్ ప్రొటీన్, మెగ్నీషియం, జింక్, ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ప్రధానంగా శరీర రక్తంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచే మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు కూడా అధిక స్థాయిలో ఉంటాయి. ఈ కారకాలన్నీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడతాయి. మరీ ముఖ్యంగా, గుమ్మడికాయ గింజల్లో నైట్రిక్ ఆక్సైడ్ పుష్కలంగా ఉన్నందున, ఇది హృదయ స్పందన పనితీరుతో ఎటువంటి సమస్యలు లేవని నిర్ధారిస్తుంది. గుమ్మడికాయ గింజలను ఎలా తినాలి? వేయించిన గుమ్మడి గింజలను తినడం నిజంగా ఆరోగ్యకరమైనది. అయితే దీనికి ఉప్పును కలపకూడదు. ఎందుకంటే ఉప్పు గుండె ఆరోగ్యానికి మంచిది కాదు. మీరు సాయంత్రం స్నాక్స్ సమయంలో కొన్ని వేయించిన గుమ్మడి గింజలను తినడం అలవాటు చేసుకుంటే, అది చాలా మంచిది
read moreవిటమిన్ బి 12 క్యాన్సర్ ముప్పు?
విటమిన్ బి 12 అధికంగా వాడడం వల్ల ఊపిరి తిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని పరిశోదనలు వెల్లడిస్తున్నాయి. 1 )విటమిన్ బి సహజంగా జంతువుల ఉత్పత్తుల నుండే లభిస్తుంది. ఎవరైతే సప్లిమెంత్స్ వాడుతున్నారో వారికి ఆశ్చర్యాన్ని కలిగించి ఉండవచ్చు. ఇది మనం కళ్ళు తెరవాల్సిన విషయం శాస్త్రజ్ఞులు 7౦,౦౦౦ మంది పై చేసిన పరిశోదనలో విటమినలో విటమిన్ బి వల్ల ఊపిరి తిత్తుల క్యాన్సర్ కు ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. 2)విటమిన్ బి గురించి చేసిన పరిశోదన ఏం చెపుతోంది? విటమిన్ బి పై చేసిన పరిశోదన క్లినికల్ ఆంకాలజీ లో ప్రచురించారు.విటమిన్ బి6 విటమిన్12 సప్లిమెంట్ ను వాడడం.మల్టి విటమిన్ ౩౦% నుండి 4౦%ఊపిరి తిత్తుల క్యాన్సర్ పురుషులకు వస్తుందని.బి6 బి12 వాడకం ఫోలేట్ లంగ్ క్యాన్సర్ రిస్క్ స్త్రీలలో ఉంటుందని అంటున్నారు. ౩) 2౦2౦ లో లంగ్ క్యాన్సర్ 2 మిలియన్ల ప్రజల ప్రాణాలను హరించింది... ప్రపంచ ఆరోగ్య సంస్థ అందించిన వివరాల ప్రకారం 2౦2౦ లో 2 మిలియన్ల ప్రజలు ఊపిరి తిత్తుల క్యాన్సర్ తో మరణించారని. గణాంకాలు వెల్లడించింది.ఆ సంవత్సరం లో క్యాన్సర్ తో మరణించిన వారి సాంఖ్య అధికంగా ఉందని అదే సంవత్సరం లో 2.21 మిలియన్లు గా ఉందని అది బ్రస్ట్ క్యాన్సర్ తో మరణించారని.భారత్ లో లంగ్ క్యాన్సర్ సంఖ్య ఎక్కువే అని 59% అన్నిరకాల క్యాన్సర్స్ కాగా 8.1%క్యాన్సర్ మరణాలు జరిగాయని ఇది ఆందోళన కరమని డబ్ల్యు హెచ్ ఓ అభిప్రాయ పడింది. 4)విటమిన్B1 ఎంత కావాలి? శరీరానికి విటమిన్ బి1ఎంత మోతాదులో వాడాలి అన్నది మరో ప్రశ్న. విటమిన్ బి1- 1.5 ఎం జి. విటమిన్ బి2 -1.7 ఎం జి వాడాలని సూచించారు. 5)గుర్తుంచుకోవాల్సిన అంశాలు... పరిశోదనలో పాల్గొన్న చాలామంది యు ఎస్ సూచించిన దానికన్నా విటమిన్ బి1 అధికంగా వాడారని. విటమున్ బి12 వాడిన వారిలో డి ఎన్ ఏ యు ఎస్ లో మార్పులు జీన్స్ లో మార్పులు నిలకడగా లేవని కార్సినో జనసిస్ నిలకడగా లేకపోవడాన్ని గమనించినట్లు గమనించా మని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. ముఖ్యంగా పొగ తాగే వాళ్ళు,విటమిన్ బి ,విటమున్ బి12 వల్ల ఊపిరి తిత్తుల క్యాన్సర్ పెరుగుతుందని పరిశోదనలో వెల్లడించారు.
read moreకడుపు ఉబ్బరానికి అసలు కారణాలు ఇవే...
ఈకాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య ఏదైనా ఉందంటే అది జీర్ణానికి సంబంధించినదే ఎక్కువ. చాలామంది తమకు తిన్న ఆహారం జీర్ణం కావడం లేదని, కడుపు ఉబ్బరంగా ఉంటుందని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి సమస్య ఎందుకు వస్తుంది?? ఇలాంటి సమస్య ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి వంటి విషయాలు తెలుసుకుంటే ఈ సమస్యను అధిగమించడం పెద్ద సమస్య ఏమి కాదు. మొదటగా కడుపు ఉబ్బరం సమస్య ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. కడుపు ఉబ్బరం రావడానికి గల కారణాలు:- మలబద్దకం సాధారణంగా మలబద్దకం సమస్య ఉన్నవారిలో కడుపు ఉబ్బరం వచ్చే అవకాశాలు ఎక్కువ. మలవిసర్జన అనేది సరిగా జరగకపోతే అది కడుపులో పేగుల మధ్య గట్టిగా మారిపోయి జీర్ణవ్యవస్థను గందరగోళం చేస్తుంది. తిన్న ఆహారం తింటూనే ఉంటే ఒకవైపు మలవిసర్జన కూడా దానికి తగ్గట్టు జరిగిపోతుండాలి. లేకపోతే కడుపులో వాయువులు, వ్యర్థాలు పెరిగి అది ఉబ్బరానికి దారితీస్తుంది. వేగంగా తినేవారికి ఆహారాన్ని మెల్లగా బాగా నమిలి తినాలి. అలా చేస్తే ఆహారం చాలావరకు పిండి పదార్థంగా మారి జీర్ణశయంలోకి వెళుతుంది. అప్పుడు జీర్ణ రసాలు తగినంత ఉత్పత్తి అయ్యి ఎంతో సులువుగా జీర్ణక్రియ జరుగుతుంది. కానీ చాలామంది పరిగెత్తాలనే తొందర ఉన్నట్టు వేగంగా తింటారు. దీనివల్ల ఆకుకూరలు, కూరగాయలు, పప్పు దినుసులు సరైన విధంగా జీర్ణక్రియకు అనువుగా ఉండవు. ఫలితంగా కడుపు ఉబ్బరం చోటుచేసుకుంటుంది. దంత సమస్యలు ఉన్నవారిలో దంతాల సమస్యకు కడుపు ఉబ్బరానికి సంబంధం ఏమిటి అని చాలా మంది అనుకుంటారు. అయితే దంతాల సమస్య ఉన్నవారిలో రక్తం కారుతూ ఉంటుంది. ఇది బాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల కలిగే సమస్య. ఇలా దంతాల వద్ద రక్తం కారడం జరిగినప్పుడు సహజంగా తినే పదార్థాలతో, తాగే ద్రవాలతో కలసి జీర్ణశయం చేరుతాయి. దీనివల్ల కడుపు ఉబ్బరం సమస్య వస్తుంది. ఆహార వేళలు ఆహారం తీసుకోవడమే కాదు, ఆహార వేళలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. అస్తవ్యస్తమైన ఆహార వేళలు పాటించడం వల్ల జీర్ణశయం తీరు సరిగా ఉండదు. ఈ కారణం వల్ల కడుపు ఉబ్బరం వస్తుంది. నోటి శుభ్రత జీర్ణాశయనికి సంబంధించి ఏ సమస్యకు అయినా ఎక్కువ శాతం నోటి శుభ్రత ప్రధాన పాత్ర పోషిస్తుంది. నోరు సరిగా శుభ్రం చేసుకోకుండా తినడం, తాగడం చేస్తే నోటిలో ఏర్పడ్డ బాక్టీరియా జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తుంది. పై కారణాల వల్ల కడుపు ఉబ్బరం వచ్చే అవకాశం ఉంది. కడుపు ఉబ్బరం పరిష్కారానికి తీసుకోవలసిన జాగ్రత్తలు.. ఆహారం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా నమిలి తినాలి. దీనివల్ల ఆహారం జీర్ణం అవడంలో ఎలాంటి సమస్యా ఉండదు. కడుపు ఉబ్బరం సమస్య వేధిస్తున్నప్పుడు గ్లాసుడు మజ్జిగలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగాలి. రోజులో రెండు నుండి మూడు సార్లు ఇలా చేస్తుంటే సమస్య తగ్గిపోతుంది. దంతాల సమస్యలు ఉన్నవారిలో ఆహారం నమలడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. దీనివల్ల ఆహారాన్ని పూర్తిగా నమలకుండా మింగేస్తుంటారు. కాబట్టి ఆ సమస్యలకు వైద్యులను సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవాలి. నోటి శుభ్రత లేకుండా ఆహారం తీసుకోకూడదు. పండ్లు, భోజనం, బేకరీ పదార్థాలు అన్ని కలిపి ఒక్కసారి తీసుకోకూడదు. కొన్ని పదార్థాలు చాలా సులాభంగానూ, మరికొన్ని అలస్యంగానూ జీర్ణమయ్యే వాటిని కలిపి తీసుకుంటే జీర్ణవ్యవస్థ అస్తవ్యస్తం అవుతుంది. కడుపు ఉబ్బరానికి పైన చెప్పుకున్న జాగ్రత్తసలు పాటించినా సమస్య తగ్గకపోతే వైద్యులను సంప్రదించడం ఉత్తమం. ◆నిశ్శబ్ద.
read more