మోకాళ్ల నొప్పికి మందుల కంటే ముందు ఈ యోగా వ్యాయామాలు తప్పక ప్రయత్నించండి!
మోకాళ్ల నొప్పి ప్రస్తుతం అన్ని వయస్సుల వారిలో కనిపిస్తున్న సాధారణ సమస్యగా మారింది. మెట్లు ఎక్కడం, నడవడం, ఎక్కువసేపు నిలబడటం వంటి రోజువారీ పనులు కూడా కష్టంగా అనిపిస్తాయి. ఈ వీడియోలో యోగా ఆచార్య ధాకారం గారు మోకాళ్ల నొప్పిని తగ్గించడంలో సహాయపడే సులభమైన యోగా ఆసనాలు మరియు వ్యాయామాలను వివరంగా చూపించారు. ఈ యోగా పద్ధతులను సరైన విధంగా, క్రమం తప్పకుండా చేస్తే మోకాళ్ల కండరాలు బలపడటంతో పాటు కీళ్ల కదలిక మెరుగుపడుతుంది. మోకాళ్లలో గట్టిదనం తగ్గి, నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు ఇవి ఉపయోగపడవచ్చు. వయస్సుతో వచ్చే మోకాళ్ల సమస్యలు, ఆస్టియోఆర్థ్రైటిస్ ప్రారంభ దశలో ఉన్నవారు లేదా ఎక్కువసేపు కూర్చునే ఉద్యోగాలు చేసే వారు కూడా ఈ వ్యాయామాల గురించి తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో తెలుసుకునే అంశాలు: మోకాళ్ల నొప్పికి కారణాలు మోకాళ్ల కండరాలను బలపరిచే యోగా వ్యాయామాలు నొప్పిని తగ్గించే సులభమైన స్ట్రెచింగ్ పద్ధతులు నడవడం, మెట్లు ఎక్కడం సులభం కావడానికి ఉపయోగపడే సూచనలు మోకాళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకునే యోగా చిట్కాలు గమనిక: మోకాళ్ల నొప్పితో బాధపడుతున్న వారు ఏదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్య లేదా శస్త్రచికిత్స అనంతర పరిస్థితి ఉంటే, ఈ వ్యాయామాలను ప్రారంభించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం TeluguOne Health ను ఫాలో అవుతూ ఉండండి
read moreఇంట్లో గాలి స్వచ్చంగా ఉండాలంటే..ఇదిగో ఈ మొక్కలు ఇంట్లో ఉండేలా చూసుకోండి..!
నేటికాలంలో అందరినీ ఇబ్బంది పెట్టే అతిపెద్ద సమస్య కాలుష్యం. గాలి కాలుష్యం, ఆహార కాలుష్యం, నీటి కాలుష్యం.. ఇలా ప్రతిదీ కాలుష్యం కోరల్లో చిక్కుకుని ఉన్నాయి. బయటకు వెళ్లినప్పుడు వాహనాల పొగతో పాటు ఎన్నో కారణాల వల్ల గాలి కాలుష్యం అవుతుంది. అయితే చాలామంది ఇళ్లలో కూడా గాలి స్వచ్చంగా లేకపోవడం వల్ల శ్వాస సంబంధం సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఇంట్లో గాలి కాస్త డిఫరెంట్ స్మెల్ వస్తూ ఉంటుంది. కొన్ని రకాల మొక్కలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల గాలిని శుద్ది చేసి గాలిని స్వచ్చంగా మారుస్తాయి. అంతేకాదు. ఆక్సిజన్ స్థాయిలను కూడా మెరుగుపరుస్తాయి. ఇంట్లో ఆక్సిజన్ స్థాయిలను మెరుగు పరిచి, గాలిని శుద్ది చేసే ఆ మొక్కలు ఏవో తెలుసుకుంటే.. ఇండోర్ మొక్కలు ఎందుకు ప్రయోజనకరంగా పరిగణించబడతాయి..? ఇంట్లో పెంచే మొక్కలను ఇండోర్ మొక్కలు అని అంటారు. ఈ మొక్కలు గాలిని సహజంగా శుద్ది చేసే పరికరాలుగా పనిచేస్తాయి. అవి కార్బన్ డయాక్సైడ్‌ను తగ్గించి, ఆక్సిజన్‌ను విడుదల చేయడం ద్వారా గాలిలోని హానికరమైన కాలుష్య కారకాలను తొలగిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా, అవి ఇంటి అలంకరణకు కూడా ఎంతో మంచివి. చాలా మంది ఇళ్లలో అలంకరణ కోసం మొక్కలను పెంచుతారని అనుకుంటారు. కానీ.. ఇవి అలంకరణ కోసం మాత్రమే కాకుండా ఇంట్లో గాలిని శుద్ది చేయడానికి కూడాపెంచుతారు. ఇంట్లో గాలిని శుద్ది చేసి ఆక్సిజన్ పెంచే మొక్కలు.. పీస్ లిల్లీ.. ఇంటి లోపల చక్కగా పెరిగే ఒక మొక్క పీస్ లిల్లీ.. ఈ మొక్కల పువ్వులు చాలా విభిన్నంగా ఉంటాయి. గాలి చాలా బాగా శుద్ది చేయడంలో ఈ మొక్కలు చాలా గొప్పగా సహాయపడతాయి. కలబంద.. కలబంద ప్రతి ఇంట్లో సర్వసాధారణంగా ఉండే మొక్క, అయితే ఇళ్లలో వాడే డిటర్జెంట్లు, పెయింట్లు, గమ్ లలో ఉండే కొన్ని సాధారణ రసాయనాలు గాలిలో కలిసిపోయి ఉంటాయి. అలాంటి గాలిని శుద్ధి చేసి, ఇంటిని తాజాగా ఉంచే సామర్థ్యం కలబందకు ఉంది. స్నేక్ ప్లాంట్.. నీరు, వెలుతురు, సూర్యరశ్మి సరిగా లేకపోయినా, చాలా తక్కువగా ఉన్నా సరే..అలాంటి వాతావరణంలో కూడా స్నేక్ ప్లాంట్ పెరుగుతుంది. దీనికున్న ప్రత్యేక లక్షణం .. ఇది రాత్రిపూట కూడా కార్బన్ డయాక్సైడ్‌ను ఆక్సిజన్‌గా మారుస్తుంది, అందువల్ల ఇది పడకగదిలో పెంచడానికి కూడా చాలా అనువైన మొక్క. మనీ ప్లాంట్.. వాస్తు పరంగా , శాస్త్రీయంగా కూడా చాలా ప్రాచుర్యం పొందిన మొక్క మనీ ప్లాంట్, భారతీయులలో చాలా ఇళ్లలో మనీ ప్లాంట్ ఉంటుంది. ఇది ఇంట్లో ఉంటే డబ్బుకు లోటు ఉండదని, ఆర్థిక ఎదుగుదల ఉంటుందని అనుకుంటారు. ఇంటిలోని మూసి ఉన్న గదులలోని కలుషిత గాలిని శుభ్రపరచడానికి , ఆక్సిజన్ ప్రవాహాన్ని పెంచడానికి సహాయపడుతుంది. స్పైడర్ ప్లాంట్.. పొడవాటి, చారల ఆకులతో ఉండే ఈ మొక్క వేగంగా పెరుగుతుంది . దీనికి పెద్దగా సంరక్షణ కూడా అవసరం లేదు. గాలి నుండి కార్బన్ మోనాక్సైడ్ వంటి విష వాయువులను తొలగించడంలో ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. పైన చెప్పుకున్న మొక్కలను ఇంట్లో పెంచుకుంటే ఇంటి వాతావరణం, ఇంటి గాలి చాలా శుద్ధంగా మారుతుంది. *రూపశ్రీ.
read moreఉద్గీత ప్రాణాయామం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు..రోజుకు 5 నిమిషాలు చాలు.!
ఉద్గీత ప్రాణాయామం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు..రోజుకు 5 నిమిషాలు చాలు.! రోజుకు కేవలం 5 నిమిషాలు ఉద్గీత ప్రాణాయామం (ఓం ధ్యానం) చేస్తే శరీరం, మనసు ఎలా మారుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ వీడియోలో ప్రముఖ సీనియర్ యోగా థెరపిస్ట్ & ఆయుర్వేద డైటీషియన్ శ్రీమతి స్రవంతి రఘు గారు ఉద్గీత ప్రాణాయామాన్ని సరైన పద్ధతిలో ఎలా చేయాలో సులభంగా వివరిస్తారు. అలాగే దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, శాస్త్రీయంగా నిరూపితమైన అంశాలు, ఒత్తిడి తగ్గడం, మానసిక ప్రశాంతత పెరగడం, ఏకాగ్రత మెరుగుపడడం, మంచి నిద్రకు సహాయపడడం వంటి విషయాలను వివరంగా తెలియజేస్తారు. అంతేకాకుండా, ఉద్గీత ప్రాణాయామాన్ని ఎవరు చయాలి? ఎవరు చేయకూడదు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రారంభ స్థాయి వారు ఎలా ప్రారంభించాలి? వంటి ముఖ్యమైన సందేహాలకు కూడా సమాధానాలు ఈ వీడియోలో పొందుపరిచారు. యోగా, ధ్యానం, సహజ ఆరోగ్యం మరియు మానసిక ప్రశాంతతపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన ఉపయోగకరమైన వీడియో ఇది. ఈ వీడియోను పూర్తిగా వీక్షించి, ఉద్గీత ప్రాణాయామాన్ని సరైన విధంగా అభ్యసించి ఆరోగ్యకరమైన జీవనశైలికి నాంది పలకండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
read moreమీ వంటింట్లో నల్ల మచ్చలు ఉన్న ఉల్లిపాయలు ఉన్నాయా? ఇవి ఎంతవరకు సేఫ్ మీకు తెలుసా?
మీ వంటింట్లో నల్ల మచ్చలు ఉన్న ఉల్లిపాయలు ఉన్నాయా? ఇవి ఎంతవరకు సేఫ్ మీకు తెలుసా? ఉల్లిపాయ ఆహారంలో ఎక్కువగా వినియోగించే కూరగాయ. ఏ కూరలు చేసినా అందులో ఉల్లిపాయ వేస్తే వచ్చే రుచి, సువాసన వేరు. చాలామంది పచ్చి ఉల్లిపాయలు తినడానికి ఇష్టపడతారు. అయితే గత కొంత కాలంగా ఉల్లిపాయల మీద నల్లటి మచ్చలు, దుమ్ము లాంటి బూజు కనిపించడం చాలా మంది గమనించే ఉంటారు. మార్కెట్ నుండి ఉల్లిపాయలు తెచ్చాక వాటిని నీటిలో కడిగి వండేస్తుంటారు. అయితే ఇలాంటి ఉల్లిపాయలు తినడం ఆరోగ్యానికి మంచిదేనా? దీని గురించి ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు? వివరంగా తెలుసుకుంటే.. ఉల్లిపాయపై నలుపు రంగు.. ఉల్లిపాయ తొక్కలపై ఉండే నల్లటి మచ్చలు మట్టిలో కనిపించే ఒక సాధారణ శిలీంధ్రం వల్ల ఏర్పడతాయి. ఉల్లిపాయలపై కనిపించే ఈ శిలీంధ్రం సాధారణంగా అంటువ్యాధి కాదు, అయినప్పటికీ, ఉపయోగించే ముందు వాటిని బాగా కడగడం ముఖ్యం. చాలా మంది బాగా ఆరోగ్యంగా ఉండేవారికి ఉల్లిపాయ మీద ఉండే ఈ బూజు వల్ల ప్రమాదం ఉండదు. అయితే, బూజు ఉల్లిపాయ లోపలి పొరలకు వ్యాపించినా, ఉల్లిపాయ మెత్తబడినా, లేదా కుళ్ళు స్పష్టంగా కనిపించినా, దానిని తినడం మంచిది కాదు. ఈ బూజు కేవలం ఉల్లిపాయ పైననే కాకుండా కొన్నిసార్లు దాని సన్నని వేర్లు కంటికి కనిపించని విధంగా లోపలికి కూడా వ్యాపిస్తాయి. ఆరోగ్యానికి మంచిదేనా? బాగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులకు ఈ బూజు పెద్దగా ఆరోగ్యానికి హాని చేయదు. దీని వల్ల ప్రమాదం ఏమీ ఉండదు. అయితే కొంతమందిలో బూజు స్పోర్‌లు తుమ్ములు, ఆయాసం లేదా కంటి మంట వంటి అలెర్జీ రియాక్షన్ లకు కారణం కావచ్చు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. బయటి ఎండిన పొరపై కొద్దిగా నల్లటి పొడి మాత్రమే ఉండి, లోపల ఉల్లిపాయ పూర్తిగా గట్టిగా, శుభ్రంగా ఉంటే, బయటి పొరను తీసివేసి, బాగా కడిగిన తర్వాత దానిని ఉపయోగించవచ్చు. ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు? ఉల్లిపాయలపై నల్ల మచ్చలను కలిగించే శిలీంధ్రం సాధారణంగా హానికరమైనది కాదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే, కొన్ని సందర్భాల్లో, ఇది ఓక్రాటాక్సిన్ ఎ అనే మైకోటాక్సిన్‌ను ఉత్పత్తి చేయగలదట. దీనిని ఎక్కువ కాలం పాటు, అధిక పరిమాణంలో తీసుకుంటే, అది మూత్రపిండాలు , కాలేయానికి నష్టం కలిగించగలదట. ఈ విషపదార్థం వేడికి కూడా నశించదుని కాబట్టి వండటం వల్ల ఇది తప్పనిసరిగా తొలగిపోదని అంటున్నారు. అందుకే దీనిని ఆహారంలో ఉపయోగించే ముందు సరిగ్గా చూసుకోవడం చాలా ముఖ్యం. *రూపశ్రీ.
read moreగట్ మైక్రోబయోమ్ అంటే ఏమిటి? కడుపు ఆరోగ్యం మీ జీవితాన్ని ఎలా మార్చేస్తుందో తెలుసా?
గట్ మైక్రోబయోమ్ అంటే ఏమిటి? కడుపు ఆరోగ్యం మీ జీవితాన్ని ఎలా మార్చేస్తుందో తెలుసా? మన శరీర ఆరోగ్యానికి గట్ (Gut) ఎంత ముఖ్యమో చాలా మందికి పూర్తిగా తెలియదు. మన పేగుల్లో కోట్లాది సూక్ష్మజీవులు (Microbiome) నివసిస్తుంటాయి. వీటిలో మంచి బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా మధ్య సరైన సమతుల్యత ఉండటం ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఈ సమతుల్యత దెబ్బతింటే దానిని డిస్బయాసిస్ (Dysbiosis) అంటారు. దీని వల్ల జీర్ణ సమస్యలతో పాటు అనేక ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ Dr. Rakesh Kalapala గారు గట్ మైక్రోబయోమ్ అంటే ఏమిటి? అది మన శరీరంలో ఎలా పనిచేస్తుంది? మంచి బ్యాక్టీరియా పాత్ర ఏమిటి? చెడు బ్యాక్టీరియా పెరిగితే ఎలాంటి సమస్యలు వస్తాయి? వంటి విషయాలను సులభమైన భాషలో వివరించారు. అలాగే గట్ హెల్త్‌కు మెదడు (Gut-Brain Connection)తో ఉన్న సంబంధం, లివర్, ప్యాంక్రియాస్ వంటి ముఖ్యమైన అవయవాల పనితీరుపై గట్ ఆరోగ్యం ఎలా ప్రభావం చూపుతుందో వివరించారు. తరచూ గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం, విరేచనాలు, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఎందుకు వస్తాయి? వాటిని ఎలా గుర్తించాలి? ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు? అనే అంశాలపై కూడా అవగాహన కల్పించారు. గట్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన ఆహారం, ఫైబర్ అధికంగా ఉండే పదార్థాలు, పులియబెట్టిన ఆహారాలు (Fermented Foods), ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్, తగినంత నీరు తాగడం, వ్యాయామం, సరైన నిద్ర, ఒత్తిడిని తగ్గించడం వంటి జీవనశైలి మార్పుల ప్రాముఖ్యతను వివరించారు. అంతేకాకుండా యాంటీబయోటిక్స్‌ను అవసరం లేకుండా తరచూ వాడటం వల్ల గట్ మైక్రోబయోమ్ ఎలా దెబ్బతింటుందో, ఏ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను సంప్రదించాలో కూడా స్పష్టంగా తెలియజేశారు. గట్ ఆరోగ్యంపై శాస్త్రీయమైన, ఉపయోగకరమైన సమాచారం తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది. ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యాంశాలు: గట్ మైక్రోబయోమ్ అంటే ఏమిటి? మంచి బ్యాక్టీరియా – చెడు బ్యాక్టీరియా మధ్య సమతుల్యత డిస్బయాసిస్ అంటే ఏమిటి? దాని ప్రభావాలు గట్-బ్రెయిన్ కనెక్షన్ ఎలా పనిచేస్తుంది? గట్ ఆరోగ్యం లివర్, ప్యాంక్రియాస్‌పై చూపే ప్రభావం గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు కారణాలు గట్ హెల్త్‌ను మెరుగుపరిచే ఆహారం మరియు జీవనశైలి ఎప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి?
read moreవర్షాకాలంలో ఈ పప్పుధాన్యాలను తినకూడదు..!
వర్షాకాలంలో ఈ పప్పుధాన్యాలను తినకూడదు..! వర్షాకాలం వేడి నుండి ఉపశమనం కలిగిస్తుంది, కానీ ఆహారం , పానీయాల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలంలో పెరిగిన తేమ కారణంగా, బ్యాక్టీరియా , ఫంగస్ వేగంగా వృద్ధి చెందుతాయి, ఇది జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా పప్పుధాన్యాలు ఆహారంలో ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. పప్పుధాన్యాలలో ప్రోటీన్, ఫైబర్ , అనేక పోషకాలు సమృద్దిగా ఉంటాయి. అయితే అన్ని రకాల పప్పుధాన్యాలు అన్ని కాలాల్లోనూ సులభంగా జీర్ణం కావు. వర్షాకాలంలో కొన్ని పప్పుధాన్యాలు గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్ణం , జీర్ణ సమస్యలను పెంచుతాయి. జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు వర్షాకాలంలో పప్పుధాన్యాలు తినేటప్పుడు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలంలో ఏ పప్పుధాన్యాలను తినకూడదో , మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుంటే.. నల్ల మినుములు.. మినుములను ఉద్దిపప్పు అని కూడా అంటారు. ఇవి చాలా పోషకమైనవి, ప్రోటీన్‌తో సమృద్ధిగా ఉన్నవి. అయినప్పటికీ మినుములు శరీరానికి భారంగా అనిపిస్తాయి. చాలా నెమ్మదిగా జీర్ణం అవుతాయి. వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం వల్ల, చాలా మంది జీర్ణవ్యవస్థ సాధారణం కంటే బలహీనపడుతుంది. అందువల్ల, మినుములను అధికంగా తీసుకోవడం వల్ల గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం , భారంగా అనిపించడం వంటి కడుపు సమస్యలు వస్తాయి. ఒకవేళ వీటిని తినాలనుకుంటే, బాగా నానబెట్టి, తినే ముందు ఉడికించుకోవాలి. ఇంగువ, జీలకర్ర , అల్లం వంటి పదార్థాలను ఉపయోగించడం జీర్ణక్రియకు సహాయపడుతుంది. శనగలు.. శనగలు ప్రోటీన్ , ఫైబర్‌కు మంచి మూలం, కానీ వాటిని అధిక పరిమాణంలో తినడం వల్ల కొంతమందికి సమస్యలు రావచ్చు. వర్షాకాలంలో జీర్ణక్రియ నెమ్మదిగా ఉండటం వల్ల, జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. శనగలను అధికంగా తీసుకోవడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం , కడుపులో బరువుగా అనిపించడం వంటివి కలగవచ్చు. ముందు నుంచే గ్యాస్ లేదా పేగు సంబంధిత సమస్యలు ఉన్నవారు వీటిని తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. శనగలను తినడానికి కొన్ని గంటల ముందు నానబెట్టి, ఆ తర్వాత బాగా ఉడికించుకోవడం మంచిది. అంతేకాదు.. శనగలను తేలికపాటి మసాలాలతో వండటం వల్ల జీర్ణ సంబంధిత ఇబ్బందులను తగ్గించుకోవచ్చు. రాజ్మా బీన్స్.. రాజ్మా బీన్స్ చాలా మందికి ఇష్టమైన వంటకం . ఇవి ప్రోటీన్, ఐరన్, ఫైబర్‌తో సమృద్ధిగా ఉంటాయి. అయితే, ఇవి జీర్ణం కావడానికి సమయం పడుతుంది. వర్షాకాలంలో జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉండే అవకాశం ఉన్నప్పుడు, రాజ్మా బీన్స్ తినడం వల్ల కొంతమందిలో గ్యాస్, కడుపు నొప్పి, అజీర్ణం , ఉబ్బరం వంటి సమస్యలు రావచ్చు. రాజ్మా బీన్స్‌ను ఎప్పుడూ తొందరగా వండెయ్యాలని, తక్కువ సమయం నానబెట్టడం, సరిగ్గా ఉడికించకుండా వండటం వంటివి చేయకూడదు. వాటిని కనీసం 8 గంటల పాటు నీటిలో నానబెట్టి, ఆ తర్వాత బాగా ఉడికించాలి. సరిగ్గా ఉడకని రాజ్మా బీన్స్ సరిగ్గా అరకపోవడం, కడుపు నొప్పి వంటి సమస్యలకు కారణమవుతాయి. వర్షాకాలంలో పప్పుధాన్యాలు తినేటప్పుడు జాగ్రత్తలు.. పప్పులను తినే ముందు శుభ్రంగా కడగాలి, పప్పు ధాన్యాలను తగినంత సమయం పాటు నానబెట్టి ఉడికించాలి. మసాలాలు, నూనె ఎక్కువగా వాడకూడదు. ఇది జీర్ణ ప్రక్రియను ఇబ్బంది పెడుతుంది. తాజాగా వండిన పప్పు ధాన్యాలను మాత్రమే తినాలి, ఎక్కువ కాలం నిల్వ ఉంచిన వాటిని తినకూడదు. పప్పు ధాన్యాలను వండేటప్పుడు అల్లం, జీలకర్ర, ఇంగువ వంటి మసాలాలను కలుపుకోవచ్చు, ఇవి జీర్ణక్రియకు సహాయపడతాయి. *రూపశ్రీ.
read moreఅజినమోటో ఆరోగ్యానికి మంచిదేనా
అజినమోటో ఆరోగ్యానికి మంచిదేనా? చౌ మెయిన్, మోమోస్, ఫ్రైడ్ రైస్, మంచూరియన్, పిజ్జా.. ఇవి మాత్రమే కాకుండా అనేక ఇతర చైనీస్ స్ట్రీట్ ఫుడ్స్ లో ఆహారాల రుచిని మెరుగుపరచడానికి అజినోమోటోను తరచుగా ఉపయోగిస్తారు. దీని అసలు పేరు మోనోసోడియం గ్లుటామేట్ (MSG), ఇది కూడా ఒక రుచిని పెంచే పదార్థమే. అయితే దీని గురించి చాలా కాలంగా చాలా రకాల చర్చలు నడుస్తున్నాయి. పరిశోధన ప్రకారం, చాలా మంది ఆరోగ్యవంతులకు అజినమోటో మితమైన మోతాదులో తీసుకోవడం మంచిదే, కానీ కొంతమందిలో, దీన్ని తీసుకోవడం వల్ల తలనొప్పి, దాహం, వేడి ఆవిర్లు, వికారం లేదా అసౌకర్యం వంటి లక్షణాలను కలుగుతాయి. అసలు అజినోమోటో అంటే ఏమిటి, దాని వినియోగం ఎప్పుడు హానికరంగా మారుతుంది? ఎవరు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి వైద్యులు చెప్పిన నిజాలేంటో తెలుసుకుంటే.. అజినమోటో.. అజినోమోటో రసాయన నామం మోనోసోడియం గ్లుటామేట్ (MSG). ఇది ఆహార రుచిని మెరుగుపరచడానికి ఉపయోగించే ఒక ఫ్లేవర్ ఎన్‌హాన్సర్. ఇది గ్లుటామేట్ యొక్క ఒక రూపం, ఇది టమోటాలు, చీజ్ , పుట్టగొడుగులు వంటి కొన్ని ఆహారాలలో సహజంగా కూడా లభిస్తుంది. అజినమోటో ఎక్కువ వాడితే కలిగే సమస్యలు.. తలనొప్పి , అసౌకర్యం.. అజినమోటో అధికంగా ఉండే ఆహారాలు తిన్న తర్వాత కొంతమందికి తలనొప్పి, ముఖం ఎర్రబడటం, చెమట పట్టడం లేదా అసౌకర్యం వంటి లక్షణాలు కనిపించవచ్చు. అయితే ఇది అందరిలోనూ జరగదు. సోడియం.. అజినోమోటోలో సోడియం ఉంటుంది. దీనిని అధిక ఉప్పు ఉన్న ఆహారాలతో తరచుగా తీసుకుంటే, మొత్తం సోడియం తీసుకోవడం పెరుగుతుంది, ఇది అధిక రక్తపోటు ఉన్నవారికి మంచిది కాదు. అతిగా ప్రాసెస్ చేసిన ఆహారం తినడం.. ప్రాసెస్ చేసిన , ఫాస్ట్ ఫుడ్స్‌లో తరచుగా అజినమోటో ను ఉపయోగిస్తారు. అలాంటి ఆహారాలలో ఉప్పు, నూనె , కేలరీలు కూడా అధికంగా ఉంటాయి, దీనివల్ల బరువు పెరగడం , ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదం పెరగవచ్చు. సెన్సిటివిటీ ఉన్నవారికి అసౌకర్యం.. కొంతమందికి అజినమోటో తీసుకుంటే సెన్సిటివిటీ రియాక్షన్ ఉంటుంది అలాంటి వ్యక్తులు అధిక మొత్తంలో తీసుకున్న తర్వాత వికారం, నీరసం, దాహం లేదా తేలికపాటి అసౌకర్యం కలుగుతుంది. ఇలా పదేపదే జరిగితే, వైద్యుడిని సంప్రదించడం మంచిది. అజినమోటో విషయంలో ఎవరు జాగ్రత్తగా ఉండాలి? అధిక రక్తపోటు ఉన్న రోగులు, మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న వారు, రక్తపోటు అధికంగా ఉండే వ్యక్తులు, చిన్న పిల్లలు మొదలైనవారు అజినమోటో విషయంలో జాగ్రత్తగా ఉండాలి. *రూపశ్రీ.
read moreవైద్య నిపుణురాలు చెప్పిన 7 అద్భుతమైన ఆరోగ్యకరమైన ఆహారాలు
ఈ రోజుల్లో క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులు చాలా మందిని ప్రభావితం చేస్తున్నాయి. అయితే మన రోజువారీ ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ వీడియోలో ప్రముఖ వైద్య నిపుణురాలు డా. శ్రీలత రోజూ ఆహారంలో తప్పనిసరిగా ఉండాల్సిన 7 ముఖ్యమైన ఆరోగ్యకరమైన ఆహారాల గురించి సులభంగా వివరించారు. ఈ ఆహారాలు శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో మరియు క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఎలా ఉపయోగపడతాయో వివరించారు. అలాగే ఏ ఆహారాన్ని ఎంత మోతాదులో తీసుకోవాలి, వాటిని రోజువారీ ఆహారంలో ఎలా చేర్చుకోవాలి, ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం పాటించాల్సిన ముఖ్యమైన సూచనలు ఏమిటో కూడా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే, మీ కుటుంబ సభ్యులకు కూడా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అలవాటు చేయాలనుకుంటే ఈ వీడియో తప్పకుండా చూడండి. గమనిక: ఈ వీడియోలో ఇచ్చిన సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మీ ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా ఆహారంలో మార్పులు చేసుకునే ముందు తప్పనిసరిగా మీ వైద్యుడిని లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించండి.
read moreవర్షాకాలంలో మొక్కజొన్న తినడం ఆరోగ్యానికి మంచిదా కాదా? అసలు విషయమిది..!
వర్షాకాలంలో చాలా మంది పకోరాలు, సమోసాల వంటి వేయించిన ఆహారాల కంటే మొక్కజొన్నను ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. మొక్కజొన్నలో అనేక ముఖ్యమైన పోషకాలు ఉండటం వల్ల ఆరోగ్య పరంగా చూసినా మొక్కజొన్న చాలా మంచిది. అయితే ప్రతి వ్యక్తి ఆరోగ్య పరిస్థితి భిన్నంగా ఉంటుంది, కాబట్టి మొక్కజొన్నను సరైన పద్ధతిలో , సరైన పరిమాణంలో తీసుకోవడం చాలా ముఖ్యం. వర్షాకాలంలో మొక్కజొన్న తినడం కొందరికి ఆరోగ్యపరంగా మేలు చేస్తే.. మరికొందరికి హాని కూడా కలిగించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలంలో మొక్కజొన్న తినడం వల్ల కలిగే ప్రయోజనాలు, మొక్కజొన్న తినడంలో పాటించాల్సిన జాగ్రత్తలు , మొక్కజొన్న తినడానికి సేఫ్ మార్గం.. ఇలా అన్ని విషయాలు తెలుసుకుంటే.. వర్షాకాలంలో మొక్కజొన్న.. ఆహార నిపుణుల అభిప్రాయం ప్రకారం మొక్కజొన్నలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది , ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. మొక్కజొన్నలోని రెసిస్టెంట్ స్టార్చ్ పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పొటాషియం, మెగ్నీషియం , బి విటమిన్లు కూడా శక్తిని అందించడానికి , శరీరంలో జరిగే క్రియలను నిర్వహించడానికి తగిన శక్తి అందిస్తుంది. అందుకే వాతావరణ పరంగానే కాకుండా ఆరోగ్య పరంగా కూడా మొక్కజొన్న ఆరోగ్యానికి చాలామంచిది. అసిడిటి, గ్యాస్, ఉబ్బరం సమస్యలుంటే.. గ్యాస్, ఎసిడిటీ లేదా కడుపు ఉబ్బరంతో బాధపడేవారికి, ఉడికించిన మొక్కజొన్న మంచిది. ఉడికించిన మొక్కజొన్న మృదువుగా ఉండి, సులభంగా జీర్ణమవుతుంది. అయితే, దీనిని ఎక్కువ సేపు ఉడికించడం వల్ల దానిలోని కొన్ని పోషకాలు , రెసిస్టెంట్ స్టార్చ్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఐబియస్ ఉన్న వ్యక్తులకు.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS) ఉంటే, మొదట్లో దీనిని అర కంకికి, అంటే సుమారు 35–40 గ్రాములకు పరిమితం చేసుకుని తినడం మంచిది. ఎక్కువ మొత్తంలో స్వీట్ కార్న్ లేదా నార్మల్ కార్న్ తినడం వల్ల కొంతమందిలో గ్యాస్ , ఉబ్బరం పెరగవచ్చు. మధుమేహం లేదా ఇన్సులిన్ నిరోధకత.. మధుమేహం లేదా ఇన్సులిన్ నిరోధకత ఉన్నవారికి ఉడకబెట్టిన లేదా ఆవిరి మీద ఉడికించిన మొక్కజొన్న మంచిదిగా. దీని గ్లైసెమిక్ ఇండెక్స్, వేయించిన మొక్కజొన్న కంటే తక్కువగా ఉంటుంది. ఒకసారికి అర కప్పు ఉడికించిన మొక్కజొన్న లేదా ఒక చిన్న మొక్కజొన్న కంకి సరిపోతుంది. మొక్కజొన్నలో ల్యూటిన్ , జీక్సాంథిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయని భావిస్తారు. మొక్కజొన్నను కొద్దిగా ఆవిరి మీద ఉడికించడం వల్ల ఈ పోషకాలు శరీరానికి మరింత సులభంగా అందుతాయి. మొక్కజొన్న తినేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు.. మొక్కజొన్నపై అధికంగా వెన్న, చీజ్ లేదా ఉప్పు వేసుకుని తినకూడదు. అసిడిటీ సమస్యలు ఉంటే, మసాలాలు , నిమ్మరసం వాడకాన్ని తగ్గించాలి. మాడిపోయిన లేదా బాగా వేయించిన మొక్కజొన్నను తినడం మానుకోవాలి. ఎల్లప్పుడూ తాజాగా, బాగా ఉడికించిన మొక్కజొన్నను తినడం మంచిది. మొక్కజొన్నను బాలెన్స్డ్ గా తీసుకోవడం మంచిది. అవసరమైన దానికంటే ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. *రూపశ్రీ.
read moreరక్తంలో క్లాట్స్ ప్రమాదాన్ని తగ్గించేందుకు వంటింటి చిట్కాలు..ఆయుర్వేద నిపుణుడి సూచనలు!
మన శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా ఉండటం ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనది. జీవనశైలి మార్పులు, సరైన ఆహారం తీసుకోకపోవడం, వ్యాయామం లేకపోవడం వంటి కారణాల వల్ల రక్తంలో క్లాట్స్ ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. అలాగే అధిక బరువు కూడా అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఈ వీడియోలో ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు Dr. Chittibotla Madhusudana Sharma గారు వంటింట్లో సులభంగా లభించే కొన్ని సహజ పదార్థాలతో సంప్రదాయ ఆయుర్వేదంలో ఉపయోగించే చిట్కాలను వివరించారు. రక్త ప్రసరణను మెరుగుపరచడంలో, శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో, బరువు నియంత్రణకు తోడ్పడే ఆహారపు అలవాట్లు మరియు సహజ పద్ధతుల గురించి ఆయన విలువైన సూచనలు అందించారు. అలాగే ఏయే ఆహార పదార్థాలను తీసుకోవాలి, ఎలాంటి జీవనశైలి పాటించాలి, ఆరోగ్యాన్ని సహజంగా ఎలా మెరుగుపరుచుకోవాలి వంటి విషయాలను కూడా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఆయుర్వేదం చెప్పే ఈ సంప్రదాయ చిట్కాలను తెలుసుకుని, మీ రోజువారీ జీవితంలో ఆరోగ్యకరమైన అలవాట్లను అలవరచుకోండి. గమనిక: ఈ వీడియోలో తెలిపిన సమాచారం అవగాహన కోసం మాత్రమే. ఇప్పటికే రక్తం గడ్డకట్టే సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు లేదా ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు తప్పనిసరిగా అర్హత కలిగిన వైద్యుడి సలహా మేరకు మాత్రమే చికిత్స తీసుకోవాలి. వైద్యుల సూచన లేకుండా ఎలాంటి మందులను ఆపడం లేదా ప్రారంభించడం చేయవద్దు.
read moreఇంటర్మిటెంట్ ఫాస్టింగ్.. బరువు తగ్గడానికి పాటించే ఈ ఉపవాసం ఎంత డేంజరో తెలుసా?
నేటికాలంలో ఉపవాసం కేవలం దేవుడు, సంప్రదాయం, మతానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు.. ఫిట్‌నెస్ ప్రపంచంలో కూడా ఉపవాసం బాగా ప్రాచుర్యం పొందింది. 16:8 డైట్ వంటి పద్ధతుల నుండి రోజుకు ఒకసారి తినడం వరకు, తక్కువ తినడానికి, త్వరగా బరువు తగ్గడానికి , ఆరోగ్యంగా ఉండటానికి ఉపవాసం ఒక సులభమైన మార్గంగా అందరికీ కనిపిస్తుంది. ఇలాంటి వాటిలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కూడా ఉంది. దీన్నే మధ్యంతర ఉపవాసం అని కూడా పిలుస్తారు. అయితే ఇది ఆరోగ్యానికి మేలు చేయడం కంటే.. హాని చేయడమే ఎక్కువ ఉంటుందని అంటున్నారు. ఇది పరిశోధనలలో తేలిందని కూడా అంటున్నారు. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. పరిశోధనలు తేల్చిన నిజం.. ఇటీవల 20,000 మందికి పైగా ప్రజలపై జరిపిన ఒక విశ్లేషణలో, రోజుకు ఎనిమిది గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం వరకు ఆహారం తీసుకోకుండా ఉండే వారికి గుండె జబ్బులతో మరణించే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది. కొన్ని సందర్భాల్లో ఈ ప్రమాదం 91 శాతం వరకు ఎక్కువగా ఉంటుందట. దీని అర్థం ఉపవాసం అందరికీ హానికరం అని కాదు, కానీ తక్కువ తినడం, ఎక్కువ సమయం ఆహారం లేకుండా ఉండటం ఆరోగ్యానికి మంచిది కాదని అంటున్నారు. వైద్యులు ఏం చెప్తున్నారంటే.. ఎక్కువసేపు ఆహారం తీసుకోకుండా ఉండటం అనేది శరీరంలో అనేక ఆకస్మిక మార్పులకు కారణమవుతుందని వైద్యులు చెబుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా హెచ్చుతగ్గులకు గురవుతాయి, ఒత్తిడి హార్మోన్లు పెరుగుతాయి, , కొవ్వు స్థాయిలు కూడా ప్రభావితమవుతాయి. ఈ మార్పులన్నీ గుండెపై ఒత్తిడిని కలిగిస్తాయట. మరోవైపు ఎక్కువ సేపు ఆహారం తీసుకోకుండా ఉండడం వల్ల చక్కెర, ఖనిజాలు , హార్మోన్లలో హెచ్చుతగ్గులకు కారణమవుతుందని, ఇది హృదయ స్పందనలు గాడి తప్పే పరిస్థితి తీసుకొస్తుందని అంటున్నారు. నీటి కొరత.. ఆహారం ఎక్కువ సేపు తీసుకోకుండా ఉపవాసం ఉండటం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. శరీరం డీహైడ్రేషన్ అవుతుంది. ప్రజలు ఎక్కువ సేపు ఆహారం తీసుకోనప్పుడు, తక్కువ నీరు తాగుతారు. దీనివల్ల సాధారణ గుండె కొట్టుకోవడానికి అవసరమైన పొటాషియం , మెగ్నీషియం వంటి అవసరమైన ఖనిజాలు శరీరంలో తగ్గిపోతాయి. ఈ ఖనిజ లోపాలు డీహైడ్రేషన్ కారణంగా హృదయ స్పందన సజావుగా సాగడం కోసం గుండె చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎవరు జాగ్రత్తగా ఉండాలి? ఉపవాసం ఆరోగ్యానికి మంచిది కాకపోయినా.. ఇది అందరికీ ఒకే ఫలితాన్ని ఇవ్వదు. కొందరికి ఇది సమస్య కలిగిస్తుంది, మరికొందరికి మంచి ఫలితాలు కూడా ఇవ్వవచ్చు. ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు లేదా గుండె సమస్యలు, ముందు నుంచే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉపవాసం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా, కొన్ని రకాల మందులు తీసుకునే వారికి ఉపవాసం మంచిది కాదు,, ఆహారం తినకుండా మందులు వేసుకోలేం, ఆహారం తినకుండా మందులు వేసుకున్నా అది ఆరోగ్యానికి మంచిది కాదు. ఆరోగ్యంగా ఉన్నవారు కూడా ఎక్కువ సేపు ఆహారం తీసుకోకుండా ఉంటే.. తరచుగా అలసట, తలతిరగడం, ఛాతిలో ఇబ్బందిగా ఉండటం లేదా గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు శరీరం మీద ఒత్తిడి ఎక్కువగా ఉందని చెప్పే లక్షణాలు. కాబట్టి ఉపవాసం పేరుతో ఎక్కువ సేపు ఆహారం తీసుకోకుండా ఉండటం, శరీరాన్ని ఇబ్బందికి గురిచేసుకోవడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. అందుకే.. బరువు తగ్గాలన్నా, ఫిట్ గా ఉండాలన్నా మంచి పద్దతులలో ఆహారం తీసుకుంటూనే గోల్ రీచ్ అవ్వాలి. *రూపశ్రీ.
read moreగర్భసంచి క్యాన్సర్‌కు ఇదే తొలి హెచ్చరిక! మెనోపాజ్ తర్వాత బ్లీడింగ్‌ను నిర్లక్ష్యం చేయకండి
మెనోపాజ్ (Menopause) వచ్చిన తర్వాత మళ్లీ బ్లీడింగ్ రావడం సాధారణ విషయం కాదు. చాలా మంది మహిళలు దీనిని చిన్న సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఇది కొన్ని సందర్భాల్లో గర్భసంచి క్యాన్సర్ (Endometrial Cancer / Uterine Cancer) కు తొలి హెచ్చరిక కావచ్చు. ఈ వీడియోలో ప్రముఖ గైనకాలజిక్ ఆంకాలజిస్ట్ డాక్టర్ స్నేహా సాగర్ గారు గర్భసంచి క్యాన్సర్ గురించి ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను చాలా సులభంగా వివరించారు. ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యమైన విషయాలు: ✅ మెనోపాజ్ తర్వాత బ్లీడింగ్ రావడానికి కారణాలు ఏమిటి? ✅ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే ఏమిటి? ✅ గర్భసంచి క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఏమిటి? ✅ ఎవరికి ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ? ✅ ఎప్పుడు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి? ✅ బయాప్సీ ఎందుకు అవసరం? ✅ క్యాన్సర్‌ను ప్రారంభ దశలో ఎలా గుర్తిస్తారు? ✅ శస్త్రచికిత్స (Surgery), కీమోథెరపీ (Chemotherapy), రేడియేషన్ థెరపీ (Radiation Therapy) వంటి చికిత్సల గురించి పూర్తి వివరాలు. ప్రారంభ దశలో గర్భసంచి క్యాన్సర్‌ను గుర్తిస్తే చికిత్స విజయవంతంగా జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే మెనోపాజ్ తర్వాత ఎలాంటి బ్లీడింగ్ వచ్చినా ఆలస్యం చేయకుండా గైనకాలజిస్ట్‌ను సంప్రదించడం ఎంతో ముఖ్యం.
read moreమాచా టీ.. బరువు తగ్గడంలో మ్యాజిక్ చేస్తందా?
టీ లో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో బ్లాక్ టీ మాత్రమే కాకుండా.. గ్రీన్ టీ తో పాటు కుంకుమ పువ్వు టీ, కార్శీరీ ఖవ్వా టీ, జాస్మిన్ టీ.. ఇలా చాలా రకాలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు బరువు తగ్గడంలో సహాయపడతాయని చెబుతారు. ఇవన్నీ మొన్నటి వరకు ట్రెండ్ అయినవే. అయితే ఇప్పుడు మరొక కొత్త టీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. పైగా బరువు తగ్గడం కోసం సెలబ్రిటీలు గ్రీన్ టీకి స్వస్తి చెప్పి ఈ కొత్త రకం టీ ను ఉపయోగిస్తున్నారని చెబుతారు. అసలు ఈ మాచా టీ ఏమిటి? దీన్నితాగడం వల్ల బరువు ఎలా తగ్గుతారు? దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. మచా టీ.. సాధారణ గ్రీన్ టీని కేవలం ఆకులను మరిగించిన నీటిలో వేడయం ద్వారా తయారుచేస్తారు, అయితే మాచా అనేది మొత్తం ఆకులను పొడిగా తయారు చేసి దాన్ని నీటిలో కలిపి తయారు చేసే టీ... ఈ కారణంగానే గ్రీన్ టీ కంటే మాచా ఎక్కువ ప్రయోజనకరమైనదిగా ఉంటందని చెబుతారు. సెలబ్రిటీలకు ఫేవరేట్ ఎందుకంటే.. మాచా గురించి అందరికీ తెలియడానికి కారణం.. ఈ టీను సెలబ్రిటీల నుండి సోషల్ మీడియాలో ఎంతో మంది దీన్ని తమ ఆరోగ్యం కోసం తాగుతున్నారు. ఎందుకంటే మాచాలో కేటెచిన్స్ అనే యాంటీఆక్సిడెంట్లు, ముఖ్యంగా EGCG ఉంటాయి, ఇవి శరీరంలోని కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. మాచా శరీరం కేలరీలను బర్న్ చేసే సామర్థ్యాన్ని కూడా పెంచుతుందని అనేక నివేదికలు చెబుతున్నాయి. అంతేకాకుండా, మాచాలో కెఫీన్ , ఎల్-థియానైన్ ఉంటాయి, ఇవి మనసును ప్రశాంతపరిచి శక్తిని అందిస్తాయి. అందుకే ఇప్పుడు చాలా మంది ఉదయం పూట టీ , కాఫీకి బదులుగా మాచా తాగడానికి ఇష్టపడుతున్నారు. మాచా బరువు తగ్గడానికి సహాయపడుతుందా? బరువు తగ్గడానికి మాచా నిజంగా సహాయపడుతుందా అని చాలామంది సందేహపడుతూ ఉంటారు. అయితే మాచా అనేది అకస్మాత్తుగా బరువును తగ్గించే మ్యాజిక్ డ్రింక్ ఏమీ కాదని ఆహార నిపుణులు చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మాచా తాగినా లేదా బరువు తగ్గించే మరే ఇతర పానీయం తాగినా, అవి బరువు తగ్గడంలో మాత్రమే సహాయపడగలవు. కేవలం వాటిని తాగడం ద్వారా బరువు తగ్గేంత బలమైన ప్రభావం వాటికుండదు. అంటే.. ఆహారంపై శ్రద్ధ పెట్టకుండా , వ్యాయామం చేయకుండా కేవలం ఈ పానీయాలపై మాత్రమే ఆధారపడటం వల్ల బరువుపై ఎటువంటి ప్రభావం ఉండదని అంటున్నారు. *రూపశ్రీ.
read moreవిటమిన్ బి-12 లోపముందా? ఇదిగో ఇలా పరిష్కరించుకోండి!
శరీరం ఆరోగ్యంగా ఉండటానికి అన్ని విటమిన్లు , ఖనిజాలు సరైన మోతాదులో అవసరం. శరీరానికి అత్యంత ముఖ్యమైన విటమిన్లలో విటమిన్ బి12 ఒకటి, ఇది ఎర్ర రక్త కణాల ఏర్పాటులో, సరైన నాడీ పనితీరులో , శక్తిని నిలుపుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే నేటికాలంలో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం, పోషకాహార లోపాల కారణంగా, చాలా మంది విటమిన్ బి12 లోపంతో బాధపడుతున్నారు. విటమిన్ బి12 ప్రధానంగా జంతు ఆధారిత ఆహారాలలో లభిస్తుంది కాబట్టి, శాకాహారులకు విటమిన్ బి12 లోపం కనిపిస్తూ ఉంటుంది. టెస్ట్ లలో విటమిన్ బి12 లోపం ఉన్నట్లు తేలితే, ఆహార , జీవనశైలి మార్పుల ద్వారా విటమిన్ బి12 లోపాన్ని అధిగమించవచ్చు. విటమిన్ బి12 లోపాన్ని అధిగమించడానికి కొన్ని సులభమైన మార్గాలను తెలుసుకుంటే.. విటమిన్ బి12 లోపిస్తే కనిపించే లక్షణాలు.. ఎప్పుడూ అలసటగా మరియు బలహీనంగా అనిపించడం. చేతులు మరియు పాదాలలో జలదరింపు లేదా తిమ్మిరిగా ఉండటం, తలతిరగటం, చర్మం పసుపు రంగులోకి మారడం, దేని మీదా ఏకాగ్రత లేకపోవడం, మానసిక స్థితిలో వేగంగా మార్పులు ఉండటం. విటమిన్ బి12 లోపం అధిగమించడానికి తీసుకోవలసిన ఆహారాలు.. విటమిన్ బి12 లోపాన్ని అదిగమించడానికి పాలు , పాల ఉత్పత్తులు తీసుకోవడం మంచి మార్గం. ముఖ్యంగా శాకాహారులు, పాల ఉత్పత్తులు బాగా తీసుకోవాలి. పాలు, పెరుగు, పనీర్ , జున్ను వంటి పాల ఉత్పత్తులలో విటమిన్ బి12తో పాటు, శరీరానికి అవసరమైన అనేక పోషకాలను ఉంటాయి. కాల్షియం మరియు ప్రోటీన్ కూడా ఉంటాయి. గుడ్లు, చేపలు, చికెన్ , మాంసం మొదలైన వాటిలో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది. మాంసాహారులు వీటిని తీసుకోవచ్చు. ఈ ఆహారాలలో ఉండే విటమిన్ బి12ను శరీరం సులభంగా వినియోగించుకుంటుంది. గుడ్డు సొనలో విటమిన్ బి12 ఉంటుంది. చేపలు , చికెన్‌లో ప్రోటీన్ , అనేక ఇతర ముఖ్యమైన పోషకాలు కూడా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా , బాలెన్స్డ్ గా తీసుకోవడం వల్ల శరీరంలో విటమిన్ బి12 స్థాయిలను సులువుగా పెంచుకోవచ్చు. శాకాహారులకు లేదా పాల ఉత్పత్తులకు దూరంగా ఉండేవారు విటమిన్-బి12 కోసం , బలవర్ధక ఆహారాలు బాగా సహాయపడతాయి. బలవర్ధక ఆహారాలు అంటే విటమిన్లు , ఖనిజాలతో కూడిన ఆహారాలు. చాలా రకాల బ్రేక్‌ఫాస్ట్ సెరియల్స్, సోయా పాలు లేదా బాదం పాలు వంటి మొక్కల ఆధారిత పాలు, న్యూట్రిషనల్ ఈస్ట్‌లో విటమిన్ బి12 ఉంటుంది. వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల విటమిన్ బి12 లోపాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. సప్లిమెంట్ల విషయంలో.. విటమిన్ బి12 లోపం తీవ్రంగా ఉంటే, కేవలం ఆహారం ద్వారా దానిని భర్తీ చేయడం కష్టం . అటువంటి సందర్భాలలో డాక్టర్ విటమిన్ బి12 సప్లిమెంట్లు, టాబ్లెట్లు లేదా ఇంజెక్షన్లను సిఫార్సు చేయవచ్చు. విటమిన్ బి12 లోపానికి చికిత్స అనేది వ్యక్తి వయస్సు, ఆరోగ్య స్థితి , లోపం యొక్క తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల, పరీక్షలు చేయించుకోకుండా , డాక్టర్‌ను సంప్రదించకుండా ఎక్కువ కాలం సప్లిమెంట్లను తీసుకోవడం మంచిది కాదు. *రూపశ్రీ.
read moreథైరాయిడ్ పేషెంట్లు చేసే పెద్ద తప్పులు ఇవే.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు!
థైరాయిడ్ సమస్యలు ప్రస్తుతం చాలా మందిలో కనిపిస్తున్న సాధారణ ఆరోగ్య సమస్యల్లో ఒకటి. అయితే, థైరాయిడ్ రావడానికి మన ఆహారపు అలవాట్లు కూడా ఒక కారణమా? థైరాయిడ్ ఉన్నవారు ఏ ఆహారం తీసుకోవాలి? ఏ ఆహారాలకు దూరంగా ఉండాలి? అనే సందేహాలు చాలా మందికి ఉంటాయి. ఈ వీడియోలో సీనియర్ న్యూట్రిషన్ కన్సల్టెంట్ డా. పి. జానకి శ్రీనాథ్ థైరాయిడ్ సమస్యలకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను సులభంగా వివరిస్తున్నారు. సరైన ఆహారం తీసుకోవడం ద్వారా థైరాయిడ్ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవచ్చో, రోజువారీ జీవితంలో పాటించాల్సిన ఆహారపు అలవాట్లు ఏమిటో వివరంగా చెబుతున్నారు. ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యమైన విషయాలు: థైరాయిడ్ అంటే ఏమిటి? థైరాయిడ్ రావడానికి ఆహారపు అలవాట్లు ఎంతవరకు కారణం? థైరాయిడ్ ఉన్నవారు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు తగ్గించాల్సిన లేదా మానాల్సిన ఆహారాలు అయోడిన్, సెలీనియం, జింక్ వంటి పోషకాల ప్రాముఖ్యత థైరాయిడ్ రోగులు పాటించాల్సిన ఆరోగ్యకరమైన డైట్ చిట్కాలు జీవనశైలిలో చేయాల్సిన మార్పులు థైరాయిడ్ సమస్యలను నియంత్రించుకోవాలనుకునే వారు, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అలవరుచుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుంది.
read more30 రోజులు అన్నానికి బదులు జొన్న రొట్టెలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
భారతీయుల భోజనంలో అన్నం చాలా ప్రధానమైనది. అన్నం తినడం వల్ల వచ్చే సాటిసిఫాక్షన్ వేరే ఏ విధంగా రాదని చాలామంది అంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో మూడు పూటలా అన్నం తినాలన్నా చక్కగా తినేస్తారు. కానీ ప్రస్తుతం డయాబెటిస్, అధిక బరువు వంటి సమస్యలతో అన్నం అంటే దూరం జరిగే వారు చాలామంది ఉన్నారు. ఇలాంటి వారు ఆహారంలో రొట్టెలు తీసుకోవడం మంచిదని అనుకుంటారు. చపాతీలు, సజ్జ, జొన్న రొట్టెలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ముఖ్యంగా జొన్నరొట్టెలు శరీరానికి చక్కని పోషణ ఇస్తాయి. అంతేకాదు.. 30 రోజులు అన్నానికి బదులుగా జొన్న రొట్టెలు తింటే ఆరోగ్య పరంగా అద్బుతమైన ఫలితాలు చూస్తారు. 30రోజులు జొన్న రొట్టెలు తింటే ఏం జరుగుతుందో తెలుసుకుంటే.. 30రోజులు అన్నానికి బదులు జొన్న రొట్టెలు తింటే కలిగే ఫలితాలు.. భారతీయులు ఉపయోగించే తృణదాన్యాలలో జొన్నలు చాలా శ్రేష్టమైనవి. జొన్నలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ కారణంగా అన్నానికి బదులు జొన్న రొట్టెలు తినడం వల్ల చాలాసేపటి వరకు ఆకలి అవ్వదు. ఈ కారణంగా పదే పదే ఏదో ఒకటి తినడం అనే అలవాటు కూడా తగ్గుతుంది. దీనివల్ల బరువు తగ్గడం కూడా సులువు అవుతుంది. రోజూ అన్నానికి బదులు జొన్నరొట్టెలు తినేవారు బరువు సులువుగా తగ్గుతారు. డయాబెటిస్ ఉన్న వారికి జొన్నలు గొప్ప వరం అని చెప్పవచ్చు. అన్నంతో పోలిస్తే జొన్నరొట్టెలలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల జొన్నరొట్టెలు తింటే షుగర్ లెవెల్స్ నిలకడగా ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారు అన్నం, చపాతీ బదులు రోజూ జొన్నరొట్టెలు తింటే బ్లడ్ షుగర్ చాలా కంట్రోల్ అవుతాయి. జొన్నలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల ఆహారం జీర్ణం కావడంలో ఎలా ఇబ్బందులు ఉండవు. మలబద్దకంతో ఇబ్బంది పడేవారు రోజూ జొన్నరొట్టెలు తీసుకుంటే మలబద్దకం సమస్య తొగ్గిపోతుంది. జీర్ణాశయం స్థితి మెరుగవుతుంది. జొన్నరొట్టెలలో ఉండే గ్లైసెమిక్ సూచీ చాలా తక్కువ. ఇది రక్తంలో గ్లూకోజ్ ను చాలా నెమ్మదిగా విడుదల చేస్తుంది. ఈ కారణంగా నెమ్మదిగా అరుగుతుంది. దీనివల్ల చాలాసేపటి వరకు ఆకలి వేయకుండా ఉండటమే కాదు.. చాలా సేపు ఎనర్జీగా కూడా ఉంచుతుంది. అన్నం అయితే తొందరగా అరిగిపోతుంది. అందుకే జొన్నరొట్టెలు తింటే ఎక్కువ సేపు ఎనర్జీగా ఉండవచ్చు. పూరీ, బేకరీ ఫుడ్స్, కేక్స్, ఆయిల్ ఫుడ్స్ వంటివి తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అయితే చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు ఏ ఆహారం తినాలన్నా చాలా భయపడుతూ ఉంటారు. కానీ రోజూ జొన్న రొట్టెలు తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. జొన్నరొట్టెలు శరీరానికి చలువ చేస్తాయి, బలాన్ని ఇస్తాయి, ఎక్కువ సేపు శరీరానికి శక్తిని ఇస్తాయి, రోజూ కనీసం ఒక్కపూట అయినా జొన్న రొట్టెలు తింటే శరీరాన్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అందుకే కనీసం రోజులో ఒక్క పూట అయినా జొన్న రొట్టెను ఆహారంలో తీసుకోవడం మంచి అలవాటని ఆహార నిపుణులు, వైద్యులు చెబుతున్నారు. *రూపశ్రీ.
read moreబ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు శరీరం ఇచ్చే 5 హెచ్చరికలు.. ఇవి కనిపిస్తే వెంటనే జాగ్రత్త!
బ్రెయిన్ స్ట్రోక్ (Brain Stroke) అనేది అత్యవసర వైద్య పరిస్థితి. మెదడుకు రక్త సరఫరా అకస్మాత్తుగా ఆగిపోవడం లేదా రక్తనాళం పగిలిపోవడం వల్ల మెదడు కణాలు దెబ్బతింటాయి. సరైన సమయంలో చికిత్స అందకపోతే ప్రాణాపాయం మాత్రమే కాకుండా శాశ్వత వైకల్యం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో ప్రముఖ న్యూరాలజిస్ట్ డా. అనిరుధ్ దేశ్‌ముఖ్ బ్రెయిన్ స్ట్రోక్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను సులభంగా వివరించారు. ఈ వీడియోలో మీరు తెలుసుకునే అంశాలు: బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏమిటి? స్ట్రోక్ ఎన్ని రకాలుగా ఉంటుంది? స్ట్రోక్ వచ్చే ప్రధాన కారణాలు ఏమిటి? స్ట్రోక్ వచ్చే ముందు కనిపించే హెచ్చరిక లక్షణాలు (TIA) ఏమిటి? చేతులు, కాళ్లు బలహీనపడటం, ముఖం వంకర కావడం, మాట తడబడటం వంటి లక్షణాలను ఎలా గుర్తించాలి? "గోల్డెన్ పీరియడ్" అంటే ఏమిటి? ఆ సమయంలో చికిత్స ఎందుకు చాలా కీలకం? ఆధునిక వైద్యంలో అందుబాటులో ఉన్న చికిత్సలు ఏమిటి? స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఎప్పుడు వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి? స్ట్రోక్ విషయంలో ప్రతి నిమిషం ఎంతో విలువైనది. లక్షణాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా అత్యవసర వైద్య సహాయం తీసుకోవడం వల్ల ప్రాణాలను కాపాడడమే కాకుండా మెదడు దెబ్బతినే ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు. బ్రెయిన్ స్ట్రోక్ గురించి పూర్తి అవగాహన పొందాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం TeluguOne Health ను ఫాలో అవుతూ ఉండండి.
read more


.webp)
.webp)




.webp)




.webp)








