అలసట.. నీరసానికి గల కారణాలు ఒక అధ్యయనం...
అలిసిన కండరాలు... అదేపనిగా కండరాలను ఉపయోగించడం వల్ల శక్తి ఉడిగిపోయిందని అనిపిస్తుంది. అలసట ముఖ్యంగా క్రికెట్, ఫూట్ బాల్,లేదా వాలి బాల్ ,లాంటి ఆటలు ఆడిన తరువాత పెరటి తోటలో కలుపు తొలగించి,చెట్ల కు పాదులు చేయడం చేసేటప్పుడు పట్టే సమయం. ఇల్లుమారే సమయం లో పెద్ద పెద్ద డబ్బాలు వస్తువులు స్వయంగా మోసినప్పుడు. స్వయంగా అలసి పోతారు.అలసట కారణంగా కండరాలు ఇంతకు ముందులాగా కండరాలు సంకోచించక పోవడాన్ని గమనించ వచ్చు. మనం శ్రమిస్తున్నప్పుడు కండరాలలో లాస్టిక్ యాసిడ్ పేరుకు పోవడం తో అవి అలసటకు గురి అవుతాయి.శరీరానికి అవసరమైన శక్తి అందుబాటులో లేనప్పుడు ఆక్సిజన్ లభించనప్పుడు లాస్టిక్ యాసిడ్ పరిణామం పెరుగుతుంది. మనశరీరం అధికంగా శ్రమిస్తున్నప్పుడుకండరాలలో ఆమ్ల తత్వం పెరిగి పి హెచ్ 6.4 నుంచి 6.6 వరకు పెరుగుతుంది.సహజంగా మనం నిద్ర పోతున్నప్పుడు క్షారత్వం 7.15 గా ఉంటుంది.పోటేన్షియల్ హైడ్రోజన్ ౦--14 మధ్య సూచిక గా రెండిటికీ మధ్య 7 కంటే ఎక్కువ తతస్తంగానూ ఉంటుందని. ఆరోగ్యంగా ఉండే వ్యక్తిలో క్షారత్వం కొంచం అమ్లత్వం ఉంటుందని. దీనికన్నా ఎక్కువ తక్కువలు ఉంటె అనారోగ్యంగా ఉన్నట్లు సూచికగా గుర్తించాలి.అలిసిన కండరాలకు అందించగల ప్రాధమిక చికిత్చ నీళ్ళు తాగడమే అని నీళ్ళు తాగడానికి దాహం వేసే దాకా నీళ్ళు తాగడానికి ఎదురు చూడనవసరం లేదు.శరీరం కష్టపెట్టక శ్రమించాక నీళ్ళు తాగడం కండరాల అలసటను తీర్చడానికి నీళ్ళు తోడ్పడతాయి. నీళ్ళు తాగని పక్షం లో కండరాలు తిమ్మిరేక్కుతాయి. నీరసించే నాడీ వ్యవస్థ... మన శరీరంలో నీరస పడడాన్ని సెంట్రల్ ఫాటిగ్యు అని అంటున్నారు వైద్యులు.కేంద్ర నాడీ వ్యవస్థ మెదడులో సేరోటినిన్ ట్రిప్టో ఫన్ అనే ఎమినో యాసిడ్ పరిమాణం పెరగడం వల్లే అలిసిపోయిన భావన కలుగుతుందని పరిశోదనలో వెల్లడి అయ్యింది.అలసట కారణం గా కాస్త విశ్రాంతి కావాలని, నిద్రపోవాలన్న బలమైన కోరిక కలిగిస్తుంది. దీర్ఘాకాలం పాటు ఫాటిగ్యు సిండ్రోమ్ సి ఎఫ్ ఏ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇది సంకేతమని వైద్య నిపుణులు సూచిన్స్తున్నారు. ట్రిప్టో ఫన్ ఎక్కువగా తాయారు కావాడానికి కారణం సిరో టోనిన్ అధికఉత్పత్తికి దారి తీస్తుంది.సేరోటోనిక్ నాడీ కణాల్ మధ్య సందేశాలను మోసుకు పోయే రసాయనం గా పేర్కొన్నారు నిపుణులు. సెరోటోనిన్ కారణంగానే ఆకలి, జీర్ణం, నిద్ర, లైంగికవాంచ ,మానసిక స్థితి శరీరంలో రోజు వారీ పనులు క్రమబద్దీకర చేస్తుంది. సెరో టోనిన్ ఆరోగ్య కరమైన శారీరక స్థితి, విశ్రాంతి, నిద్రకు తోడ్పడుతుంది. నాడీ వ్యవస్థ అలసిపోవడానికి కారణం శరీరంలో గ్లైకోజన్ పరిమాణం పెరగ డాన్ని నిపుణులు గుర్తించారు.పలు అధ్యనాలు ఇప్పటికే కేంద్ర నాడీ మండలపు అలసటను ప్రేపిస్తుందని ఆఅధ్యయనం లో వెల్లడించారు.గ్లైకోజన్ లోటును పూడ్చి ప్రమాదాల బారిన పడకుండా తోడ్పడుతుందని నిపుణులు విశ్లేషించారు. అలసటకు కారణాలు ఇవే... మన శరీరం లోని కండరాలు నాడీ మండల అంటే మెదడు అలసట సమస్యను ఎదుర్కోవచ్చు. మీరు మీ శరీరం అదే పనిగా అలిసి పోతూ ఉండడం తీవ్రమైన అనారోగ్య సమస్య కు సంకేతమని అది హెచ్చరిక గా గుర్తించాలి.మీరు తీవ్ర మైన అలసటకు గురి అవుతున్నారన్న విషయం గుర్తిస్తే ఒకసారి డాక్టర్ ను సంప్రదించడం ఉత్తమం.వైద్య పరమైన అత్యవసర పరిస్థితికి దారి తీయకుండా మున్డుజాగ్రత్త తో వ్యవహరించడం అవసరం. రక్తహీనత /ఎనిమియా.... రక్త హీనత మొదటి లక్షణం అలసట. రక్త హీనత అంటే కొన్ని ఎర్ర రక్తకణాలు లేకపోవడం. ఎర్ర రక్త కణాలలో సరిపడా హిమోగ్లోబిన్ ఆక్సిజన్ ను రవాణా చేసే ప్రోటీన్ ఉండకపోవడం గమనించవచ్చు. రక్త హీనత వల్ల శరీరంలో అవయవాలు వాటిలోని కణాలకు ఆక్సిజన్ అందదు.గ్లోకోజ్ ఉన్న ఆక్సిజన్ కొరత వల్లశారీర కణాలు దానిని వాడుకోలేవు. కొద్ది పాటి శ్రమకే అలసట ఏర్పడుతుంది.తత్ఫలితంగా ఊపిరి అందదు, చాతీ లో నొప్పి వస్తూ ఉంటుంది.అది తీవ్రమైన గుండె నొప్పికి దారి తీయవచ్చు. హార్మోన్ సమస్యలు... మనం త్వరగా అలిసిపోవడానికి కారణం హార్మోన్ లో లోటు పాట్లు కీలపాత్ర పోషిస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.కొన్ని హార్మోన్లు విపరీతంగా పెరిగినా,తగ్గిన హైపో థైరాయిడిజం, మదుమేహం అడిసన్స్ డిసీజ్ వ్యాధులు వస్తాయని భారత్ లో పదిహేను కోట్ల మందిలో హైపో ధైరాయిడిజం ఉన్నట్లు అంచనా ఇందులో చాలా మందికి ధైరాయిడ్ సమస్య ఉన్నట్లు కూడా తెలియదు. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలలోవిశాఖ,చెన్నై, బెంగ ళూరు లో నివసిస్తున్న వారికంటే సముద్రానికి దూరంగా కొండ ప్రాంతాలలో హైదరాబాద్ వరంగల్ బెంగుళూరు లో నివసిస్తున్న వారిలో ఈ వ్యాధి ఎక్కువగా ఉన్నట్లు ఒక అధ్యయనం వెల్లడించింది.ముఖ్యంగా పురుషులకంటే స్త్రీలు ఈ వ్యాధిబారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు తమ అధయనం లో వెల్లడించారు. జీవ ప్రక్రియను నియంత్రించేది ధైరాయిడ్ హార్మోన్లు మాత్రమే అది మనశారీరపు ఉష్ణోగ్రతను గుండె కొట్టుకోవడాన్ని ఆహారం ద్వారా శరీరానికి అందిన కాలరీలను ఎలా ఖర్చు చేయాలో నిర్ధారిస్తుంది. పోషకాహారం లేకుంటే మనశరీరం తగిన శక్తి పొందలేదు అందుకు బలహీనపడి నిస్సతువ నీరసానికి దారితీస్తుంది. మల్టి పుల్ స్క్లేరోసిస్... మల్టిపుల్ స్క్లేరోసిస్ తీవ్రమైన సమస్య ఈకారణంగానే వెన్నెముకలోని నాడీ కణాలు క్రమంగా తమ సహజ సామార్ధ్యాన్ని కోల్పోతూ ఉంటాయి.దీనిప్రభావాం వివిధ అవయవాల్ తాలూకు స్పందన చలన శక్తి దెబ్బతిని శరీరం మోద్దుబారడం. ఈ కారణంగానే కన్దారాల్ నొప్పులతో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు.ఈ సమస్య తీవ్రమైతే మానసికంగా కృంగి పోతారు.ఎమె ఎస్ ఇటీవలి కాలం లో యువకులపై తీవ్రప్రభావం చూపిస్తోందని అధ్యనాలు వెల్లడిస్తున్నాయి.ఈ వ్యాధి బారిన పడిన వారిలో 8౦% మంది 18 -౩5 సంవత్స రాల వయసులో వారే అని అఖిల భారాత వైద్య విజ్ఞానసంస్థ బాల బాలికలు వృద్ధులలో వ్యాధి బారిన పడినవారు ఉన్నారని అధ్యయనం వెల్లడించింది. ఎం ఎస్ బారిన పడిన వారిలో యువతీ యువకుల కంటే మధ్య వయస్సులో ఉన్న మహిళలు ముఖ్యంగా రుతుక్రమం ఆగిన మహిళలు ఎక్కువగా దీనిబారిన పడుతున్నారని నిపుణులు నివేదికలో పేర్కొన్నారు.ముఖ్యంగా ఎం ఎస్ కు గురయ్యే వారు పొగతాగే అలవాటు ఉన్న పురుషులు తేలికగా గురి అవుతున్నారని అధయనం లో పేర్కొన్నారు.కొన్నికుటుంబాలలో వంశపారం పర్యంగా దారి తీస్తున్న విషయాన్ని నిపుణులు గుర్తించారు.ఇప్పటికీ ఖచ్చితమైన కారాణాలు ఇవి అని నిర్దారించనప్పటికీ వారి వారి అలవాట్లు ఎం.ఎస్ వ్యాధికి దారి తీసే అవకాశాలు లేకపోలేదని నిపుణులు వెల్లడించారు. కాగా ముఖ్యంగా రోగ నిరోధక వ్యవస్థలో లోపాలు వాతావరణ అలవాట్లు వివిధ రకాల అంటువ్యాధులువిటమిన్ డి లోపం ఎం.ఎస్ కు దోహదం చేస్తున్న విషయాన్ని గుర్తించారు. మల్టి పుల్ స్కేరోసిస్వ్యాదివల్ల వచ్చే నీరసం అలసట అసాధారణ స్థాయిలో ఉంటుంది.దీనికి తోడు ఇతర లక్షణాలు తోడైతే మీరు మరింత తీవ్ర సమస్యలు ఎదుర్కోక తప్పదు. క్యాన్సర్... క్యాన్సర్ వ్యాధి ప్రారంభంలో నే బద్దకం అలసట వంటి లక్షణాలు ఉంటె మామూలుగా రక్తంలో కైటో కిన్స్ పరిమాణం పెరగడం వల్లే ఇలాంటి స్థితి ఉంటుందని ఆకలి మందగించడం అలసట మందగించి నంత మాత్రాన క్యాన్సర్ అన్న అభిప్రాయానికి రాకండి. క్యాన్సర్ కారణాలు మరిన్ని లక్షణాలు ఉంటె క్యాన్సర్ గా అవమానం వస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. గుండె వ్యాధులు.. గుండె వ్యాధుల పై జరిగిన అనేక అధ్యయనాలలో వాటికి శారీరక అలసట మధ్య బలమైన సంబంధం ఉందని నిపుణులు వెల్లడించారు.కాగా గుంబ్దే పోటు కు మూడు నెలల ముందే మూడింట రెండు వంతుల మంది కి ముందే తీవ్రమైన అలసట ప్రత్యేకంగా వృద్ధులు మహిళల లో గుండె వ్యాధులు బయట పడ్డాయని. పైగా గుండెపోటుకు గురి కావడం గురికవదాన్ని వైద్యులు నిపుణులు గుర్తించారు. మరో అంశం లో దీర్ఘకాలిక సి ఎం .ఎస్ ఫ్యాటిగ్యు సిండ్రోమ్ ను గురించి తెలుసుకుందాం.
read moreతలనొప్పికి ఇన్ని కారణాలు ఉన్నాయా!
చాలామంది సహజంగా చిరాకు, అసహనంతో ఉన్నప్పుడు ఏమైంది అని అడిగితే తలనొప్పి అనే మాటను ఎక్కువశాతం చెబుతుంటారు. అయితే వస్తున్న తలనొప్పి ఏమైనదీ తేలక తికమక పడటం కూడా అంతే సహజం. తలనొప్పికి ప్రధానంగా నాలుగు కారణాలు ఉన్నాయి. 1. మానసిక కారణాలు 2. మెదడులోపల కంతులు ఏర్పడటం 3. యరీమియా, డయబిటిస్ వంటి కారణాలు 4. మైగ్రేన్, టెన్షన్ తలనొప్పులు, ఇతర శారీరక బాధలవల్ల కలిగే తలనొప్పులు. మానసికంగా తలనొప్పి ఉందని బాధపడే వ్యక్తి రోజులు, వారాల తరబడి తలనొప్పితో బాధపడతాడు. పెద్దగుడ్డ తీసుకుని తలచుటూ గట్టిగా బిగించి కట్టుకుంటాడు. ఇలా కట్టుకోవడానికి నొప్పికంటే ప్రెషర్ (ఒత్తిడి)కారణం. డిప్రషన్, ఆందోళన, ఆవేశం వల్ల వచ్చే తలనొప్పులు మామూలుగా వాడే తలనొప్పి టాబ్లెట్స్ తో తగ్గవు. ప్రతీ తలనొప్పి ప్రమాదకరమైంది కాదు మెదడులో ప్రెషర్, కంతివల్ల కొందరిలో తలనొప్పి రావడం వుంటే మరికొందరిలో జ్వరంవల్ల, అతిగా మద్యం సేవించడం వల్ల తలనొప్పి కలుగుతుంది. ముఖ్యంగా మద్యం మైకం వదిలే సమయంలో (హాంగ్ ఓవర్ ) తలనొప్పి అనిపిస్తుంది. తలకి దెబ్బ తగలడం, వడదెబ్బ తగలడం, మెదడుకి రక్తం సరఫరా తగ్గడం వంటి పరిస్థితుల్లో కూడా తలనొప్పి తీవ్రంగా ఉంటుంది. మైగ్రేన్ తలనొప్పిని తెలుసుకోవడమెలా? మైగ్రేన్ తలనొప్పి సాధారణంగా వంశ పారం పర్యంగా వస్తుంది. తలకి ఒకవైపే నొప్పి అనిపిస్తుంది. ఎండ చూసినకొద్దీ నొప్పి ఎక్కువ అవుతుంది. తలనొప్పి వచ్చే ముందు కంటిముందు రింగులు రింగులు లాగానో, మరోలాగానో కనబడతాయి. తలనొప్పి రావడానికి 10-15 నిమిషాలు ఇటువంటి చికాకు పరిస్థితి ఉండవచ్చు. ఆ తరువాత ఒక చెంపన నొప్పి మొదలవుతుంది. నిదానంగా రెండవ వైపుకి కూడా నొప్పి అనిపించవచ్చు. ఈ నొప్పి చాలా తీవ్రంగా వుంటుంది నొప్పి ఎక్కువైన తరువాత వాంతి అవవచ్చు. కొందరు ఈ నొప్పికి తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోతారు. మైగ్రేన్ తలనొప్పి 4 నుంచి 43 గంటల పాటు వుంటుంది. కళ్ళజోడుతో తలనొప్పి పోవచ్చు! కొందరికి కళ్ళకి సంబంధించిన దోషం ఉండి తలనొప్పి వస్తుంది. వీరికి కళ్ళు పరీక్ష చేసి కళ్ళజోడు పెడితే తలనొప్పి తగ్గిపోతుంది. గ్లాకోనూ అనే కళ్ళవ్యాధి వల్ల కూడా తలనొప్పి వస్తుంది. మెడ దగ్గర కండరాలు, లిగమెంట్లు బిగదీసుకోవడం వల్ల కూడా తలనొప్పి వస్తుంది. సైనసైటిస్ వల్ల కూడా. తలనొప్పి వస్తుంది. తలనొప్పిలో తేడాలు తలనొప్పి రావడానికి ఎన్నో కారణాలు, మానసిక ఆందోళన, ఒత్తిడి, మానసిక వ్యాధుల వల్ల తలనొప్పి రావడం ఉంటే, మెదడు వ్యాధులు, మెదడులో కంతులవల్ల తలనొప్పి వస్తుంది. రక్తనాళాల వ్యాకోచ సంకోచాలవల్ల తలనొప్పి వస్తే, విషజ్వరాలు, యబియా, డయబిటిస్ వంటి పరిస్థితుల్లో తలనొప్పి వస్తుంది. ఏ తలనొప్పో తేల్చుకోవడమెలా? తలనొప్పి ఎలా ప్రారంభమవుతున్నదీ, ఎంతసేపు ఉంటున్నదీ, నొప్పి ఏ రకంగా వున్నదీ, ఏ చోట ఎక్కువ అనిపిస్తున్నదీ, వదలకుండా వుంటున్నదా, వచ్చీ పోతూ ఉందా తలనొప్పి ఎప్పుడు ఎలా ఎక్కువ అవుతున్నదీ, వంశంలో ఇంకెవ్వరికైనా ఈ సమస్య ఉందా అనే అంశాలని దృష్టిలో ఉంచుకుని పరిశీలించడం అవసరం. తలనొప్పి సంగతి అంతుపట్టనప్పుడు తక్కిన సాధారణ పరీక్షలతోపాటు సి. టి స్కానింగ్, యం. ఆర్. ఐ. పరీక్షలు, రక్త పరీక్షలు జరపాలి. తలనొప్పే కదా అని తేలిగ్గా తీసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. ◆నిశ్శబ్ద.
read moreఈ లక్షణాలు కనిపిస్తే విటమిన్-డి లోపమున్నట్టే..
విటమిన్-డి సూర్యరశ్మి నుండి లభించే ముఖ్యమైన విటమిన్. ఇది శరీరంలో కాల్షియం, ఫాస్పేట్ సరైన స్టాయిలో ఉండేలా చేస్తుంది. విటమిన్-సి మాత్రమే కాకుండా విటమిన్-డి కూడా రోగనిరోధక శక్తి బలంగా ఉండేలా చేస్తుంది. కానీ ఈ చలికాలంలో సూర్యుని వెలుగు సరిగా లేకపోవడం వల్ల చాలామందిలో విటమిన్-డి లోపం ఏర్పడుతుంది. సాధారణంగా విటమిన్స్ లోపాన్ని చాలామంది గుర్తించలేరు. కానీ వివిధ రకాల అసౌకర్యాలు మాత్రం ఎదుర్కొంటూ ఉంటారు. విటమిన్-డి లోపాన్ని గుర్తించడానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. వాటిని గమనించుకుని విటమిన్ లోపాన్ని భర్తీ చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండచ్చు. విటమిన్-డి లోపం లక్షణాలు.. మూడ్ స్వింగ్స్.. డిప్రెషన్.. విటమిన్-డి లోపం ఉంటే గనుక మూడ్ స్వింగ్స్, డిప్రెషన్ వంటి సమస్యలు మెండుగా ఉంటాయి. ఎప్పుడూ ఇంట్లో ఉండేవారికి, ఉదయం నుండి రాత్రి వరకు గదులలోనే నుండి పనిచేసుకునేవారికి ఈ సమస్యలు అధికంగా ఉంటుంటాయి. ఈ విటమిన్-డి లోపం శరీరంలో హార్మోన్లను కూడా ప్రభావితం చేస్తుంది. ఫలితంగా మానసిక సమస్యలకు కారణమవుతుంది. విటమిన్-డి లోపం వల్ల సెరోటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి కాదు. ఈ హార్మోన్ తగినంత ఉత్పత్తి కాకపోతే అది మానసిక కల్లోలానికి, నిరాశ, నీరసం వంటి సమస్యలకు కారణం అవుతుంది. జుట్టు రాలడం.. చాలామంది ఆరోగ్యకరమైన ఆహారం తింటున్నా జుట్టు ఎందుకు రాలుతోందని తికమకపడుతుంటారు. అయితే విటమిన్-డి లోపం కూడా జుట్టు రాలడానికి కారణం అవుతుంది. విటమిన్-డి లోపం వల్ల చాలామందిలో అలోపేసియా అరేటా వ్యాధి ప్రమాదం పెరుగుతుంది. ఇగి తల, శరీరం మీద వెంట్రుకలను ప్రభావితం చేసే వ్యాధి. తలమీద వెంట్రుకలు వేగంగా రాలిపోయి బట్టతల రావడానికి ఈ వ్యాధే కారణం. విటమిన్-డి లోపిస్తే జుట్టు బలహీనంగా, సున్నితంగా మారిపోయి బాగా రాలిపోతుంది. ఎముకల నొప్పి.. ఎముకలకు కాల్షియమే ప్రధాన వనరు అనే విషయం తెలిసిందే. అయితే విటమిన్-డి లోపం కూడా ఎముకల నొప్పికి ప్రధాన కారణమవుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే కాల్షియం నిల్వచేయడంలో, ఎముకలను బలంగా ఉంచడంలో విటమిన్-డి ఖచ్చితంగా అవసరం. విటమిన్-డి లోపిస్తే ఎముకలకు కాల్షియం అందకుండా పోతుంది. ఫలితంగా ఎముకలు, కండరాల నొప్పి, ఎముకల బలహీనత వంటి సమస్యలు వస్తాయి. చలికాలంలో ఎముకల సమస్యలు వేధిస్తుంటే దాన్ని విటమిన్-డి లోపంగా గుర్తించాలి. చర్మం పొడిబారడం.. విటమిన్-డి లోపం ఉంటే చర్మం పొడిబారుతుంది. చాలామందికి పొడిచర్మంతో పాటు దద్దుర్లు, మంటలు కనిపిస్తాయి. మరికొందరికి చర్మం ఎర్రగా మారి కొన్నిసార్లు రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుంది. కొసమెరుపు ఏంటంటే విటమిన్-డి భర్తీ అయ్యే వరకు ఈ సమస్యలు పదే పదే వేధిస్తూనే ఉంటాయి. తామర, సొరియాసిస్.. విటమిన్-డి లోపం చర్మ ఆరోగ్య విషయంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. పైన చెప్పుకున్నట్టు చర్మం పొడిబారడం, దద్దుర్లు, మంటలు వంటి సమస్యలతో పాటు తామర, సొరియాసిస్ వంటి చర్మ సంబంధ రుగ్మతలకు కూడా కారణం అవుతుంది. తామర ఉంటే శరీరంలో ఏదైనా భాగంలో కాసింత పెద్దగా వృత్తాకారంలో ఎరుపురంగులో దద్దుర్లు రావడంతో మొదలై అది కస్తా తీవ్రరూపం దాల్చి కురుపులా మారుతుంది. పై లక్షణాలు ఎవరిలో అయినా కనిపిస్తే.. అవి ధీర్ఘకాలం కొనసాగితే అవన్నీ విటమిన్-డి లోపం లక్షణాలని గుర్తించి లోపాన్ని భర్తీ చేసుకోవాలి. *నిశ్శబ్ద
read moreరక్తంలో హిమోగ్లోబిన్‌ని సులభంగా పెంచే సూపర్ ట్రిక్స్ ఇవే...!!
మనిషి శరీరంలో మూడొంతుల భాగం నీటితో నిండి ఉంటుందని చెబుతారు. మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, అంతర్గత అవయవాలు క్రియాత్మక కార్యకలాపాలను నిర్వహించడానికి సహాయపడతాయి. కానీ వీటిలో ఏ ఒక్కటి లోపిస్తే దానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు కనిపిస్తాయి. ఇప్పుడు హిమోగ్లోబిన్‌కు రావడం చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే మన శరీరంలో దాని కార్యకలాపాలు చాలా విస్తృతంగా ఉంటాయి. ఎర్రరక్తకణాలతో పాటు మన శరీరానికి కావల్సిన ఆక్సిజన్‌ను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి చేరవేస్తుంది. అది లోపించినప్పుడు, ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఐరన్ తీసుకోండి: మీకు హిమోగ్లోబిన్ లోపం ఉంటే, ఐరన్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం అలవాటు చేసుకోండి. బచ్చలికూర, ఎండుద్రాక్ష, ఎర్ర మాంసం, చికెన్, చేపలు, బీన్స్, కాయధాన్యాలు టోఫు ఉదాహరణలు. ఇవి మీకు ఐరన్ కంటెంట్‌ని అందిస్తాయి. విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు: విటమిన్ సి సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల మీరు తినే ఇతర ఆహారాలలో కనిపించే ఐరన్ మీ శరీరం గ్రహించడంలో సహాయపడుతుంది. విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలలో బ్రోకలీ, స్ట్రాబెర్రీలు, బెల్ పెప్పర్స్, సిట్రస్ పండ్లు ఉన్నాయి. ఫోలెట్: మీ శరీరంలో హిమోగ్లోబిన్ పెరగాలి అంటే ఎర్ర రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుంది. దీని కోసం, విటమిన్ B9 రూపంలో ఫోలేట్ చాలా అవసరం. మీకు ఎక్కువ ఫోలేట్ తీసుకోవడం అవసరమైతే, ఆకుపచ్చ ఆకు కూరలు, బీన్స్, పప్పులు తినడానికి ప్రయత్నించండి. విటమిన్ B12: ఎర్ర రక్త కణాలను పెంచడానికి విటమిన్ B12 చాలా ముఖ్యం. ఇందులో సీఫుడ్, పాల ఉత్పత్తులు, లీన్ ప్రోటీన్-రిచ్ మాంసాలు ఉన్నాయి. మీరు కూరగాయలను ఇష్టపడితే, మీరు విటమిన్ B12 సప్లిమెంట్లను కూడా తీసుకోవచ్చు. కాఫీ, టీలు తగ్గించండి: కొన్ని ఆహారాలు లేదా పానీయాలు మీ శరీరం ఆరోగ్యకరమైన మొత్తంలో ఇనుమును గ్రహించకుండా నిరోధిస్తాయి. అందులో కాఫీ టీ ఒకటి. అలాగే కాల్షియం సప్లిమెంట్లు, కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని మితంగా తీసుకోవాలి. ఇది మీరు తినే ఆహారంలోని ఐరన్ కంటెంట్‌ను మీ శరీరం పూర్తిగా గ్రహించడంలో సహాయపడుతుంది.
read moreభాస్మతి అన్నం తినడం అందరికీ మంచిదేనా?
బాస్మతి బియ్యం అనగానే...పులావ్, బిర్యానీ వంటకాలు గుర్తుకువస్తాయి. ఈ బియ్యం పొడవుగా, సన్నగా, చక్కటి సువాసన కలిగి ఉంటాయి. బాస్మతీ బియ్యంతో వండిన వంటలు ఎంతో రుచిగా ఉంటాయి. మన దేశంలో 29రకాల బాస్మతీ బియ్యం ఉత్పత్తి జరుగుతుంది. ఈ బియ్యం ఎగుమతిలో భారతదేశం అగ్రగామిగా ఉంది. ఈ బాస్మతీ బియ్యాన్ని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో డైటరీ ఫైబర్ అధికంగా ఉండటంతోపాటు...తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అయితే బాస్మతి బియ్యం అందరు తినవచ్చా? తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. మధుమేహ వ్యాధిగ్రస్తులకు: తెల్ల బియ్యం, అధిక గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి. కానీ బాస్మతి బియ్యం తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. 50, 58 మధ్య గ్లైసెమిక్ సూచికతో, బాస్మతి బియ్యం తక్కువ నుండి మధ్యస్థ గ్లైసెమిక్ సూచిక ఆహారం. బాస్మతి బియ్యంలో కూడా గణనీయమైన స్థాయిలో ఫైబర్ ఉంటుంది. డైటరీ ఫైబర్ అధికంగా తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. బరువు తగ్గడంలో సహాయపడుతుంది: బరువు తగ్గించడంలో బాస్మతి బియ్యం ఎంతగానో సహాయపడుతుంది. బాస్మతి రైస్‌లోని ఫైబర్ శరీరంలో నెమ్మదిగా విచ్ఛిన్నమవుతుంది. ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది. బాస్మతి బియ్యం దాని హోల్‌గ్రెయిన్ కంటే తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. కాబట్టి, మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే బాస్మతి బియ్యం ఉత్తమ ఎంపిక. జీర్ణక్రియకు మంచిది: బాస్మతి బియ్యంలో ఉండే పీచు పదార్ధం ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇది శరీరం నుండి వ్యర్థాలను జీర్ణం చేయడంతోపాటు అన్ని ముఖ్యమైన పోషకాలను శరీర భాగాలను అందిస్తుంది. ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి: బాస్మతి బియ్యంలో విటమిన్ సి, విటమిన్ ఇ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించడంలో సహాయపడుతుంది. కణాలను రక్షించడంలో, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో యాంటీఆక్సిడెంట్లు కీలక పాత్ర పోషిస్తాయి. గుండె ఆరోగ్యం కోసం: బాస్మతి బియ్యంలో సహజంగా సంతృప్త కొవ్వులు, కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన హృదయనాళ పనితీరుకు దోహదం చేసే కార్డియో-ప్రొటెక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉంటుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉండాలనుకునే వారికి బాస్మతి బియ్యం మంచి ఎంపిక. చర్మం, జుట్టు ప్రయోజనాలు: బాస్మతి బియ్యంలో ఆరోగ్యకరమైన చర్మం, జుట్టును ప్రోత్సహించే పోషకాలు ఉన్నాయి. ఇందులోని బి విటమిన్లు, జింక్ మెరిసే జుట్టుకు దోహదం చేస్తాయి. అలెర్జీ రిస్క్ తక్కువ: బాస్మతి బియ్యం అలెర్జీ ప్రతిచర్యలకు కారణమయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇది డైట్ ఫాలో అవుతున్నవారికి మంచి ఎంపిక.
read moreపొగ మానాలనుకుని విఫలమవుతున్నారా?.. ఇది మీకోసమే..
నిజంగా ఒక వ్యక్తి పొగతాగడం మానేయడం సాధ్యమేనా?? ఒకవేళ సాధ్యమైతే అది ఎలా మానగలుగుతాడు? సహజంగా మొట్టమొదట చెయ్యవలసిన పని మానివెయ్యడమే. మొదటి రోజు గంటసేపు, మరునాడు రెండేసి గంటల సేపు, మూడో రోజున మూడేసి గంటల సేపు - ఇలా మానివెయ్యడమా? అసలు ఒకేసారి పూర్తిగా మానివెయ్యడమా? అనేది వ్యక్తిగత విషయం. దాన్ని ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చు. ఏమైనా సరే, ఈ విషయంలో ఒక నిశ్చయం చేసుకోవడానికీ, దాన్ని తు.చ తప్పక అమలు చేయడానికి దృఢమయిన మనోనిబ్బరం అవసరం. అందుకోసం కొన్ని చిట్కాలు: సాధ్యమైనంత వరకు పొగ తాగేవాళ్లకి దూరంగా ఉండాలి. ముఖ్యంగా మొదటి మూడు నాలుగు వారాలపాటు పొగతాగే వారితో, ఆ అలవాటు ఉన్న స్నేహితులతో కలవడకూడదు. వాళ్ళతో కలవకపోతే వాళ్ళు అపార్థం చేసుకుంటారని, ఏదో అనుకుంటారని ఆలోచన వద్దు. వాళ్ళు ఏమైనా అనుకున్నా.. మీరు పొగతాగడం మానేస్తే చాలామంది మీ దృఢ నిశ్చయానికి చాటున ఎంతో మెచ్చుకుంటారు. కాని, మరికొందరు ఏమి కాదు తాగు అంటూ బలవంతం చేస్తారు. కాబట్టి మీరు అనుకున్నది సాధించే వరకు స్నేహితులను కలవద్దు. పొగాకు వాడకం ఏ రూపంలోనైనా సరే దగ్గరకు రానివ్వకూడదు. పొగాకు అంటే అదొక మత్తు. కేవలం ధూమపానమే కాదు, ఇతర పొగాకు ఆధారిత పదార్థాలను కూడా తీసుకోకూడదు. వీలైతే స్నేహితులను కూడా మీతో జతకలిపి వారు కూడా మానేందుకు ప్రోత్సహించండి. ఎప్పటి నుండో అలవాటైన పొగ ఒక్కసారిగా మానితే.. మనసు అటే లాగుతుంది. అయితే పొగ తాగాలని అనిపించినప్పుడల్లా ఒకటి రెండు గ్లాసుల నీళ్లయినా లేదా పళ్లరసమైనా తాగాలి. కొంత కాలం ఇలా రోజూ చాలా సార్లు చెయ్యాల్సి వస్తుంది. కానీ తాగిన నీరు పొగ పీల్చాలనే తీవ్ర వాంఛను అరికట్టడానికి సాయపడుతుంది. పైగా, శరీరంలో కలిసిపోయిన నికొటిన్, ఇతర విష పదార్థాలను తొలగించడంలో ఇది తోడ్పడుతుంది. రోజూ రెండుసార్లు వేన్నీళ్ల స్నానం చేసి, ఆ వెంటనే చురుకు పుట్టించే లాగ చన్నీటి స్నానం చెయ్యాలి. ఇది శారీరకంగా ఎంతో మెరుగు చెయ్యడమే కాదు, రక్తప్రసరణ క్రమాన్ని చక్కబరిచి, అనుకున్న పని చేయడానికి సహకరిస్తుంది. మనోనిబ్బరాన్ని పెంచుతుంది. రోజూ వ్యాయామం చెయ్యాలి. శ్వాస సంబంధ వ్యాయామాలు ఎంతో గొప్పగా సహాయపడతాయి. ప్రశాంతంగా, స్వచ్ఛమైన గాలి ఉన్న ప్రాంతాలకు అలా వాకింగ్ వెళ్లడం శ్వాసకోశాలను శుభ్రపరచి, ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఆహారం విషయంలో జాగ్రత్త.. వీలైనంత ఎక్కువగా తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. పొగాకు వల్ల శరీరంలో చేరిన విషాలకు ఇవి చక్కని విరుగుడుగా పనిచేస్తాయి. నిజం చెప్పాలంటే కొన్ని వారాలపాటు ప్రత్యేకించి పండ్లు, కూరగాయలే తీసుకొని ఉన్నారంటే పొగ తాగాలనే కోరికే లేకుండా పోతుంది. రక్తంలో షుగర్లు నిలకడగా ఉండేందుకు సహాయపడుతుంది. తరచుగా కొంచెం కొంచెంగా తింటూ ఉండాలి. ఒత్తిడి సమయంలో నాడులను స్థిమిత పరచడానికి ఇది తోడుపడుతుంది. ఒత్తిడి ఉన్నప్పుడు తెలియకుండానే ఎక్కువ తినేస్తారు కాబట్టి జాగ్రత్త, ఇది ఊబకాయానికి దారి తీస్తుంది. ఇవన్నీ పాటిస్తే పొగతాగడం ఇంత సులువా అంటారు.. ◆నిశ్శబ్ద
read moreవరలక్ష్మీవ్రతం రోజు ఉపవాసం ఉండేవారికి బలాన్ని ఇచ్చే ఆహారాలు
పండుగ సమయంలో సంప్రదాయ ఆచారాలు ఎంత ముఖ్యమో, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఉపవాసం కూడా అంతే ముఖ్యం. సంవత్సరానికి ఒకసారి వచ్చే వరమహాలక్ష్మి పండుగ ఆడపిల్లలకు ఇష్టమైన పండుగ. ఈ పండుగను చాలా సాంప్రదాయంగా జరుపుకుంటారు. పూజ సమయంలో చేయవలసిన పనులన్నీ చక్కగా నిర్వహిస్తారు. విగ్రహం అలంకరణ దగ్గర్నుంచి దేవుడి పూజ వరకు కూడా ప్రత్యేకంగా చేస్తారు. ఈ సందర్భంగా మహిళలు ఉపవాసం ఉండి భక్తిశ్రద్ధలతో పండుగను జరుపుకుంటారు. అయితే ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉన్నందున, పండుగ వేడుకలో ఉపవాసం ఉన్నప్పుడు కొన్ని పండ్లు, ఇతర ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోవచ్చు. అరటిపండు: పీచు, పిండి పదార్ధాలతో సమృద్ధిగా ఉండే అరటిపండ్లు ఉపవాసం ఉండేవారికి సహజమైన ఆహారం. అరటిపండును తక్కువ మొత్తంలో తింటే కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది శరీరానికి శక్తిని ఇస్తుంది. దీంతో పాటు శరీరానికి చేరాల్సిన క్యాలరీలను అదుపులో ఉంచుకోవాలి అంటే ఉపవాస సమయంలో అరటిపండ్లు తినవచ్చు. పండ్లు: మన ఆకలిని నియంత్రించడంలో పండ్లు ముఖ్యపాత్ర పోషిస్తాయి. వీటిలో ఫైబర్ కంటెంట్ కూడా ఉండటం వల్ల చాలా కాలం పాటు కడుపు నిండుగా ఉన్న అనుభూతిని ఇస్తుంది. వీటిలో అధిక మొత్తంలో పోషకాలు, ఖనిజాలు, నీరు ఉంటాయి. ఉదాహరణకు యాపిల్ పండు, పుచ్చకాయ పండు, నారింజ పండు వీటిలో ఉండే నీటి శాతం ఆరోగ్యానికి చాలా మంచిది. డ్రైఫ్రూట్స్: ఉపవాస సమయంలో బాదం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, వేరుశెనగ వంటివి తీసుకోవచ్చు. ఎందుకంటే అవి శక్తిని అందిస్తాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కావాలనుకుంటే చిటికెడు ఉప్పు వేసుకుని తినవచ్చు. కొబ్బరినీరు: కొబ్బరి నీళ్లలో భారీ మొత్తంలో పోషకాలు ఉంటాయి. ఇందులో మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం కూడా ఉంటాయి. మన శరీరానికి మంచి నీటి కంటెంట్ ఇవ్వడం ద్వారా శరీరంలోని ఎలక్ట్రోలైట్ల పరిమాణం బాగా నిర్వహించబడుతుంది. బెల్లం: బెల్లం చాలా ఆరోగ్యకరమైనది. మీరు త్రాగే చాలా పానీయాలకు సహజమైన తీపిని జోడిస్తుంది. ఇది మీ మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఉపవాస సమయంలో బెల్లం తినడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బెల్లం వివిధ రూపాల్లో తీసుకోవచ్చు. కాబట్టి పాన్‌లో బెల్లం వేసి వేడి చేసి అందులో చిక్పీస్, వాల్నట్స్ లేదా బాదంపప్పు వేసి చిరుతిండిగా చేసుకోవాలి.
read moreఈ ఆహారాలు తింటే కొలెస్ట్రాల్ ఐస్ లా కరిగిపోతుంది..!
శరీరాన్ని కబళించే కొన్ని సైలెంట్ కిల్లర్ వ్యాధులు ఉంటాయి. అలాంటి వాటిలో మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ చాలా ప్రధానమైనవి. ముఖ్యంగా అధిక కొలెస్ట్రాల్ కారణంగా అధిక బరువు, మధుమేహం, కాలేయం దెబ్బతినడం, గుండె జబ్బులు వంటి సమస్యలు ఒక దాని వెంట ఒకటి వస్తాయి. శరీరంలో ఉన్న అధిక కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి కొన్ని ఆహారాలు అద్భుతంగా పనిచేస్తాయి. అవేంటంటే.. ఉసిరి.. పచ్చి ఉసిరికాయ తినడం, లేదా ఉసిరి రసం తాగడం, ఉసిరికాయ పొడిని నీటిలో కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఇది శరీర కణజాలాలను రిపేర్ చేస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో గొప్పగా సహాయపడుతుంది. అవిసె గింజలు.. అవిసె గింజలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అవిసె గింజలు మంటను తగ్గిస్తాయి. వీటిని వేయించి తినవచ్చు, పొడి తయారు చేసి పొడి రూపంలో తీసుకోవచ్చు. స్నాక్స్, స్మూతీలలో జోడించవచ్చు. సలాడ్స్ లో కూడా చేర్చుకోవచ్చు. పసుపు.. పసుపును ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవచ్చు. పసుపు రక్తనాళాలలో పేరుకుపోయిన ఫలకాన్ని తగ్గిస్తుంది. వంటలలో దీన్ని భాగం చేసుకోవచ్చు. పసుపు పాలు కూడా తీసుకోవచ్చు. నీటిలో కలిపి తాగవచ్చు. వైద్యుల సలహా మేరకు పసుపు టాబ్లెట్లు కూడా వాడచ్చు. దనియాలు.. దనియాలను అనేక మాసాలా పొడుల తయారీలో వినియోగిస్తారు. ఇవి చాలా రకాల అనారోగ్యాలను తగ్గించడంలో సహాయపడతాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో కూడా మెరుగ్గా ఉంటాయి. దనియాలు ఆహారంలో తీసుకోవడం లేదా దనియాల టీ తయారుచేసుకుని తాగడం చేస్తుంటే కొలెస్ట్రాల్ తగ్గడమే కాదు.. శరీరం శుద్ది అవుతుంది. వెల్లుల్లి.. వెల్లుల్లి ఆహారానికి రుచిని, సువాసనను ఇవ్వడమే కాదు.. బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తుంది. పచ్చి వెల్లుల్లి తింటే కొలెస్ట్రాల్ తగ్గడంలో సహాయపడుతుంది. రక్తపోటును కూడా తగ్గిస్తుంది. వెల్లుల్లిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగ్గా ఉంచుతుంది. *రూపశ్రీ.
read moreమధుమేహం ఉన్నవారిలో హృదయసమస్యలా?? ఇవిగో అద్భుత చిట్కాలు..
ఆరోగ్యం అందరికీ అవసరమే అయితే ఆ ఆరోగ్యం అనేది కొందరి విషయం లో చాలా సమస్యాత్మకంగా మారుతోంది. ప్రస్తుతకాలంలో ఏదైనా ఒక సమస్య ఎదురైతే... దానికి అనుబంధంగా పెరుగుతూ పోతుంటాయి సమస్యలు. వాటి నుండి బయట పడటం అంత సులువైన విషయం ఏమీ కాదు. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలలో, పెద్దవయసు వారిలో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. ఈ కారణం వల్ల ఆరోగ్య సమస్యల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం అన్ని వయసుల వారికి చాలా తొందరదగా మధుమేహ సమస్య వస్తోంది. ఈ మధుమేహ సమస్య తగ్గడం కోసం ఎన్నో రకాల మందులు అందరికీ అందుబాటులోకి వచ్చినా ఈ మందులు మెల్లిగా గుండె కండరాలను బలహీనం చేసి గుండె పోటు సమస్యకు దారి తీస్తున్నాయనే విషయం చాలా విచారించాల్సిన విషయం. మధుమేహ సమస్య ఉన్న వారిలో గుండె పోటు సమస్యను తగ్గించేందుకు రోజువారి ఉపయోగించుకోగలిగే ఆయుర్వేద ఔషదాలు ఉన్నాయి. వాటిలో అద్భుతమైన అయిదు మూలికల గురించి తెలుసుకుదాం.. పునర్ణవ:- దీన్నే తెల్లగలిజేరు అని అంటారు. తెల్లగలిజేరు ఆకును గ్రామీణ ప్రాంతాలలో ఆకుకూర స్థానంలో వాడుతుంటారు. ఇది ఎంతో మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన మొక్క. దీన్ని ఆహారంలో బాగంగా తీసుకోవడం వల్ల రక్తంలో చెక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను క్రమబద్దీకరిస్తుంది. మూత్రం సరిగా రాకుండా ఉన్నప్పుడు ఈ తెల్లగలిజేరు ఆకును వండుకుని తింటే మూత్రవిసర్జన సాఫీగా జరుగుతుంది. మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది. మధుమేహం వల్ల వచ్చే రెటీనోపతి, నెప్రోపతి మొదలయిన సమస్యలను నివారించడంలో చక్కగా పనిచేస్తుంది. జీవక్రియను కూడా మెరుగుపరుస్తుంది. పునర్ణవను ఎలా తీసుకోవచ్చు.. పునర్ణవను గ్రామీణ ప్రాంతాల అలవాటుననుసరించి పప్పుగానూ, పొడికూర కానీ చేసుకుని తినవచ్చు. లేదంటే పునర్ణవను ఎండబెట్టి పొడి చేసి రోజూ 2నుండి 2.5 గ్రాము పొడిని వేడినీటితో తీసుకోవాలి. శొంఠి:- శొంఠి పొడి అనేది అందరికీ తెలిసిందే.. అల్లంను సున్నంలో ఉడికించి తరువాత ఎండబెట్టి పొడి చేస్తారు. దీన్ని మందుగా ఎప్పటినుండో వాడుతున్నారు. శొంఠి పొడి పాలు, శొంఠి, మిరియాల లేహ్యం వంటివి మాత్రమే కాకుండా శొంఠి పొడిని తేనె తోనూ ఇతర మూలికలతోనూ కాంబినేషన్ గా తీసుకుంటారు. ఇకపోతే శొంఠి గొప్ప ఇమ్యునిటీ బూస్టర్ గానే కాకుండా జీర్ణక్రియకు మంచి ఔషదంగా కూడా ఉపయోగపడుతుంది. దీనివల్ల శొంఠి అనేది మన భారతీయుల రోజువారి జీవితంలో భాగమయ్యింది. శొంఠి ఎలా తీసుకోవచ్చు.. శొంఠి పొడి రూపంలో ప్రతిరోజూ ఆహారం తీసుకోవడానికి ముందు అరస్పూన్ మోతాదులో తీసుకోవటచ్చు. దీన్ని గోరువెచ్చని నీటితో తీసుకుంటే మంచి ఫలితాన్ని ఇస్తుంది. మిరియాలు:- ఎంతో సులభంగా లభించే మిరియాలు వంటలకు ఇచ్చే రుచి, ఘాటు అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా ఈ చలి, వర్షపు వాతావరణానికి మిరియాలు కాసింత ఎక్కువ వాడుకున్నా ఎంతో బాగుంటుంది. కేవలం అలా వంటల్లోకే కాకుండా సలాడ్ లు, సూప్ లు, చాట్స్ ఇలా అన్నిటిలోకి మిరియాల పొడిని జల్లుకోవడం వల్ల రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం సొంతమవుతుంది. అయితే మధుమేహం ఉన్నవారికి మిరియాలు ఒక వరం అని చెప్పుకోవచ్చు. మిరియాలు ఎలా తీసుకోవాలి అంటే…. ప్రతి రోజూ ఉదయాన్నే ఒక నల్ల మిరియం తీసుకోవాలి. దీన్ని నమిలి తినవచ్చు కారంగా అనిపించినా మంచి ప్రయోజనం చేకూరుస్తుంది. యాలకులు:- తీపి పదార్థాలు, బిర్యానీ వంటి వంటకాలలోకి ఎక్కువగా ఉపయోగించే యాలకులు మంచి సువాసనతో ఎంతో ఆహ్లాదంగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తీపి పదార్థాలకు జతచేయడం మనకు అనుభవంలోనిదే. మధుమేహం ఉన్నవారిలో వారి సమస్యను బట్టి సహజంగానే తీపి పదార్థాల వైపు మనసు మల్లుతుంది. అలాంటి వారికి ఈ యాలకులు మంచి ఉపశమనాన్ని ఇస్తాయి. తీపి తినాలని అనిపించినప్పుడు యాలకులు తింటే తీపి తినాలనే కోరికలు సాధారణంగానే తగ్గుతాయి. యాలకులు తీసుకుంటే శరీరంలోని నరాలను ఉద్దీపన చెందించవచ్చు. మధుమేహం ఉన్నవారు యాలకులు తీసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది. యాలకులు ఎలా తీసుకోవచ్చంటే… దీన్ని సాధారణంగా టీలో జతచేసి తీసుకోవచ్చు. లేదంటే ప్రతి రోజు కనీసం ఒక యాలకుల పొడిని భోజనానికి గంట ముందు గోరువెచ్చని నీటితో తీసుకోవాలి. అర్జున పత్రం:- అర్జున పత్రం అనగానే చాలామంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు. అయితే ఈ అర్జున పత్రాన్ని తెల్లమద్ది అని కూడా అంటారు. ఈ చెట్టు ఆకులు, బెరడు మొదలైనవి ఆయుర్వేదంలో ఎంతో బాగా ఉపయోగిస్తారు. గుండె పనితీరు మెరుగుపరచడానికి, గుండె ఆరోగ్యానికి, రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి సమస్యలకు అర్జున పత్రం మంచి ఔషధంగా పనిచేస్తుంది. అర్జున పత్రాన్ని ఎలా తీసుకోవాలంటే… దీన్ని ప్రతిరోజు రాత్రి సమయం నిద్రించే ముందు నీళ్లలో వేసి ఉడికించి టీ లాగా చేసుకుని తాగాలి. దీనివల్ల గుండె పనితీరు మెరుగుపడటమే కాకుండా మధుమేహం కూడా నియంత్రించవచ్చు. ◆నిశ్శబ్ద.
read moreఉదయాన్నే ఇవి తింటే ఎంతో మేలు తెలుసా?
ఉదయాన్నే తీసుకునే ఆహారం ఆరోజు ఉత్సాహంగా ప్రారంభం కావడంలో కీలకంగా పనిచేస్తుందని ఆహార నిపుణులు, వైద్యులు చెబుతుంటారు. చాలామంది ఉదయాన్నే కాఫీ, టీ, గ్రీన్ టీ వంటివి తాగుతుంటారు. అయితే ఐరన్ లోపం ఉన్నవారు వీటిని తీసుకుంటే శరీరం ఐరన్ గ్రహించడంలో సమస్య ఏర్పడుతుంది. ఈ కారణంగా ఐరన్ ఆధారిత ఆహారాలు తిన్నా అవి శరీరం గ్రహించలేదు. అందుకే ఐరన్ లోపం ఉన్నవారు ఉదయాన్నే కొన్ని ఆహారాలు తినడం మంచిదని ఆహార నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే.. డైటీషియన్ ప్రకారం శరీరంలో ఐరన్ లోపం ఉంటే రోజూ ఉదయమే రెండు నానబెట్టిన ఖర్జూరాలను తినాలి. ఖర్జూరంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. శరీరానికి పుష్కలంగా ఐరన్ అందిస్తుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్య నుండి బయటపడటానికి అర టీస్పూన్ సెలెరీని వేయించి నమలండి. సెలెరీలో క్రియాశీల ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి కడుపులోని ఆమ్లాలను మెరుగుపరచడంలో అలాగే అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్ సమస్యలను తొలగించడంలో సహాయపడతాయి. ఎప్పుడూ జుట్టు రాలడం వల్ల ఇబ్బంది పడుతుంటే ఉదయాన్నే 2 స్పూన్ల బయోటిన్ మిక్స్ తీసుకోవచ్చు. బయోటిన్ మిక్స్‌లో జింక్, మెగ్నీషియం, బయోటిన్ వంటి సూక్ష్మ పోషకాలు ఉంటాయి. మొటిమలు, మచ్చలు, పిగ్మెంటేషన్‌తో బాధపడుతుంటే నానబెట్టిన సబ్జా గింజలను అర టీస్పూన్ తీసుకోవచ్చు. సబ్జా గింజలను ఒక గ్లాసు నీటిలో 10-15 నిమిషాలు నానబెట్టి, ఈ నీటిని త్రాగాలి. ఈ నీటిని రోజూ తాగడం వల్ల ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు పోతాయి. హైపో థైరాయిడిజం సమస్య ఉంటే ఉదయాన్నే బ్రెజిల్ నట్స్ తినవచ్చు. బరువు తగ్గాలని ప్రయత్నించే వ్యక్తులు ఉదయాన్నే పాలతో టీ తాగకూడదు. బరువు తగ్గడానికి కింది విధంగా టీ తయారు చేసుకుని తాగాలి. ఒక చెంచా బ్లాక్ టీ, సగం దాల్చిన చెక్క, సగం నిమ్మకాయ రసం, ఒక చెంచా ఆర్గానిక్ తేనె, 4-5 పుదీనా ఆకులు తీసుకోవాలి. ముందుగా ఒక కప్పు నీళ్లు మరిగించి అందులో బ్లాక్ టీ, దాల్చిన చెక్క ముక్క వేయాలి. 5-6 నిమిషాలు ఉడికిన తర్వాత వడగట్టి కప్పులోకి తీసుకుని నిమ్మరసం, తేనె, పుదీనా ఆకులు వేసి గోరువెచ్చగా సిప్ చేస్తూ తాగాలి. ఈ టీలో జీరో కేలరీలు ఉంటాయి. దీని కారణంగా బరువు తగ్గడంలో ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. అంతేకాదు.. అపానవాయువు, గ్యాస్ సమస్య నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. *రూపశ్రీ.
read moreఈ ఆహారాలు తింటే చాలు.. కాల్షియం లోపం భర్తీ అవుతుంది..!
కాల్షియం శరీరానికి చాలా అవసరం. శరీరంలో ఎముకలు, దంతాల ఆరోగ్యానికి, పెద్దలలో గుండె ఆరోగ్యం, కండరాల పనితీరు, నాడీ వ్యవస్థ పనితీరు మొదలైనవాటిలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. కాల్షియం లోపం వల్ల ముఖ్యంగా ఎముకలు బలహీనంగా మారతాయి. ప్రతిరోజూ వయసు బట్టి పెద్దలకు 1300గ్రాముల కాల్షియం అవసరం అవుతుందని వైద్యులు ఆహార నిపుణులు చెబుతున్నారు. కాల్షియం లోపం ఎందుకు ఏర్పడుతుందో.. కాల్షియం మెండుగా ఉన్న ఆహారాలేంటో తెలుసుకుంటే.. కాల్షియం లోపం.. బులిమియా, అనోరెక్సియా, వంటి ఇతర రుగ్మతలు, మెర్క్యురీ ఎక్స్పోజర్, మెగ్నీషియం అతిగా తీసుకోవడం, దీర్ఘకాల భేదిమందుల ఉపయోగం. కీమోథెరపీ లేదా కార్టికోస్టెరాయిడ్స్ వంటి కొన్ని మందులను దీర్ఘకాలంగా ఉపయోగించడం. చెలేషన్ థెరపీ. పారాథైరాయిడ్ హార్మోన్ లోపం. చాలా ప్రోటీన్ లేదా సోడియం తీసుకవడం. కెఫిన్, సోడా లేదా ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం ఉదరకుహర వ్యాధి, తాపజనక ప్రేగు వ్యాధి వంటి ఇతర జీర్ణ వ్యాధులు. కొన్ని శస్త్ర చికిత్సలు, మూత్రపిండ వైఫల్యం. విటమిన్ డి లోపం, ఫాస్ఫేట్ లోపం. కాల్షియం ఆహారాలు. విత్తనాలలో సూక్ష్మపోషకాలు అధికంగా ఉంటాయి. గసగసాలు, నువ్వులు, సెలెరీ మరియు చియా గింజలతో సహా చాలా కాల్షియం అధికంగా ఉంటాయి. పెరుగు, పాలు, ఫోర్టిఫైడ్ డైరీ ప్రత్యామ్నాయాలు. సోయా మిల్క్, సార్డినెస్, సాల్మన్ చేపలు. చీజ్, టోఫు, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, బ్రోకలీ, టర్నిప్లు, వాటర్‌క్రెస్, కాలే వంటి బలవర్థకమైన అల్పాహారం తృణధాన్యాలు. బలవర్థకమైన పండ్ల రసాలు, కాయలు, గింజలు, ముఖ్యంగా బాదం, నువ్వులు, చియా, బీన్స్, గ్రెయిన్స్, మొక్కజొన్న మొదలైనవాటిలో కాల్షియం బాగుంటుంది. *రూపశ్రీ.
read moreనిద్రపోతున్నప్పుడు చేతులలో జలధరింపు వస్తే దాని అర్థం ఏంటి?
నిద్ర అనేది శరీరానికి విశ్రాంతి దశ. నిద్రలో ఉన్నప్పుడు శరీరంలో కొన్ని మార్పులు జరుగుతాయి. అయితే కొందరు నిద్రపోతున్నప్పుడు శరీరంలో కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కుంటారు. కాళ్లు పట్టేయడం, శ్వాస ఆడటంలో ఇబ్బంది, ఒళ్లు లాగడం.. ఇలా చాలా సమస్యలు ఉంటాయి. అయితే కొందరికి నిద్రపోతున్నప్పుడు అకస్మాత్తుగా చేతుల్లో జలధరింపు వస్తుంటుంది. ఇలా జరిగితే కొన్ని వ్యాధులు ఉన్నట్టు సంకేతం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. మెదడులో రక్త ప్రసరణలో ఆటంకం ఏర్పడినప్పుడు రక్తం గడ్డకడుతుంది. దీని కారణంగా స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. ఈ సమస్య ఎదుర్కుంటున్న వ్యక్తులలో నిద్రపోతున్న సమయంలో చేతులలో జలధరింపు వస్తుంది. అంటే చేతులలో జలధరింపు ఉన్న వ్యక్తులలో స్ట్రోక్ ప్రమాదం ఉంటుంది. రాత్రి నిద్రపోతున్నప్పుడు చేతులు జలధరింపుకు గురవుతూ ఉంటే అది గుండెపోటుకు సంకేతం అని అంటున్నారు. ఇది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడటం, మైకంగా ఉండటం వంటి సమస్యల వల్ల వస్తుంది. శరీరంలో విటమిన్-బి12 లోపం ఏర్పడినప్పుడు కూడా ఇలా నిద్రలో చేతులు జధరింపుకు గురవుతాయి. కండరాల బలహీనత వల్ల ఇలా జరుగుతుంది. రెగ్యులర్ గా రాత్రి సమయంలో మందులు వేసుకునే వారిలో కూడా ఇలా జరిగే అవకాశం ఉంటుంది. మందుల ప్రభావం వల్ల ఇలా జరుగుతుంది. అయితే ఇలా జరిగినప్పుడు వైద్యుడిని సంప్రదించడం మంచిది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినా, మధుమేహం పెరిగినా రాత్రి పూట నిద్రలో చేతులు జలధరింపుకు లోనవుతాయట. శరీరం తగినంత పరిమాణంలో ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయనప్పుడు ఇది జరుగుతుంది. *రూపశ్రీ.
read moreగుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటే ఈ లక్షణాలు కనిపిస్తాయి..!
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మరణాలకు కారణం అవుతున్న జబ్బులలో గుండె జబ్బులు మొదటి స్థానంలో ఉంటున్నాయి. ఇప్పట్లో చిన్న, పెద్ద వయసు తేడా లేకుండా అందరికీ గుండె జబ్బులు వస్తున్నాయి. గుండె జబ్బుల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నవారు చాలామంది ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రతి ఏటా 2కోట్ల మంది గుండెపోటుతో మరణిస్తున్నారు. అయితే గుండెపోటు వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలేంటో తెలుసుకోవడం ద్వారా సమస్యను ముందే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఛాతీ బిగుతుగా ఉండటం.. శారీరక శ్రమ చేస్తున్నప్పుడు లేదా ఇతర కష్టమైన పనులు చేస్తున్నప్పుడు ఛాతీ బిగుతుగా మారితే అది గుండె పోటు రావడానికి సంకేతం అని అర్థం. ఇలా అనిపించినప్పుడు బీపీ చెక్ చేసుకుని దాన్ని నియంత్రించడానికి ప్రయత్నించాలి. అలాగే బరువు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక బరువు, అదిక రక్తపోటు ఉన్నవారిలో గుండెపోటు సమస్యలు ఎక్కువ ఉంటాయి. హృదయ స్పందన.. గుండె సరిగ్గా పనిచేయడం లేదని చెప్పడానికి హృదయ స్పందన సరిగా లేకపోవడం కూడా ఒక కారణం అవుతుంది. హృదయ స్పందన సరిగా లేకపోవడం తో పాటూ ఛాతీ బిగుతుగా అనిపించడం, ఛాతీ భాగంలో నొప్పి వంటివి ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. లేకపోతే స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. అలసట.. ఎప్పుడూ అలసటగా అనిపించడం కూడా గుండె జబ్బులను సూచిస్తుంది. శరీరానికి అవసరమైనంత సేపు విశ్రాంతి తీసుకున్నా, మంచి ఆహారం తింటున్నా, ఎక్కువ శారీరక శ్రమ చేయకపోయినా శరీరం అలసటగా ఉన్నట్టు అనిపిస్తుంటే శరీరంలో ఆక్సిజన్ లోపించిందని అర్థం. వాపు.. పాదాలు, చీలమండలలో వాపు వస్తుంటే అది గుండెకు రక్తం సరిగా పంప్ కాకపోవడం వల్ల జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి లక్షణాలు హార్ట్ ఫెయిల్ కావడానికి కారణం అవుతుందట. చెమటలు.. ఏదైనా పని చేస్తున్నప్పుడు విపరీతమైన చెమటలు పడుతూ ఉంటే అది గుండెపోటును సూచిస్తుంది. ధమనులలో అడ్డంకి ఏర్పడటం వల్ల కూడా ఇలా చెమటలు పట్టడం జరుగుతుంది. *రూపశ్రీ.
read moreమార్నింగ్ అలారం గురించి షాకింగ్ నిజాలు..!
అలారం చాలామంది దినచర్యలో భాగం. ఉదయాన్నే చదువుకునే వారి నుండి ఉద్యోగాలు చేసుకునే వారి వరకు ఉదయం పనులు పర్పెక్ట్ గా ఫినిష్ కావాలి అంటే అలారం పెట్టుకుంటూ ఉంటారు. చాలామంది ఉదయాన్నే నిద్ర లేవడం అనే అలవాటును అలారం ద్వారానే ఫాలో అవుతారు. స్మార్ట్ ఫోన్లు అందరికీ అందుబాటులో వచ్చాక కేవలం ఒకటి మాత్రమే కాకుండా ఏకంగా మూడు నుండి నాలుగు సార్లు అలారాన్ని నిమిషాల వ్యవధిలో సెట్ చేసేవారు కూడా ఉన్నారు. అయితే ఇలా మార్నింగ్ అలారం సెట్ చేసుకోవడం చాలా ప్రమాదం అని ఇది ఏకంగా గుండెకు గండి పెడుతుందని అంటున్నారు వైద్యులు. వైద్యులు చెబుతున్న విషయాల ఆధారంగా నిద్రలలో శరీరంలో అనేక రకాల మార్పులు చోటు చేసుకుంటాయి. శరీరం ఒక నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు అలారం వల్ల కలిగే శబ్దం గుండెను చాలా డిస్బర్బ్ చేస్తుందట. నిద్రపోతున్నప్పుడు శరీరంలో రక్తం చిక్కగా ఉంటుంది. అలారం గట్టిగా శబ్దం చేసినప్పుడు రక్తపోటు పెరుగుతుంది. దీని కారణంగా గుండె కొట్టుకునే వేగం కూడా పెరుగుతుంది. ఇది గుండెపోటు రావడానికి దారితీస్తుందట. మరొక ముఖ్య విషయం ఏంటంటే ఉదయాన్నే ఇలా అలారం పెట్టుకుని నిద్రలేస్తే మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుందట. రోజంతా ఒత్తిడిలోనే సమయం గడుస్తుందట. అలారం ద్వారా నిద్ర లేవడం అనేది ఒక బలవంతపు అలవాటులాగా మారుతుంది. ఇది మానసికంగా డిస్టర్బ్ చేస్తుంది. గాఢనిద్ర నుండి అకస్మాత్తుగా మేల్కొనడం వల్ల జ్ఞాపకశక్తి మీద, ఆలోచనా సామర్థ్యం మీద కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇది రోజూ రిపీట్ అవుతుంటే ఒత్తిడి కూడా పెరుగుతుందట. అలారం మీద ఆధారపడి నిద్రలేచే అలవాటు ఎక్కువగా ఉంటే అది నిద్రా చక్రం అయిన సిర్కాడియన్ రిథమ్ మీద ప్రభావం చూపిస్తుంది. ఈ సిస్టమ్ చెదిరిపోవడం వల్ల అనేక మానసిక సమస్యలు వస్తాయి. పై సమస్యలను దృష్టిలో ఉంచుకుని నిద్ర లేవడానికి అలారం ఉపయోగించడాన్ని మానేయమని వైద్యులు చెబుతున్నారు. దీనికి బదులుగా సూర్యకాంతి వచ్చే ప్రదేశంలో నిద్రపోవడం, రాత్రిళ్లు తొందరగా నిద్రపోవడం చేయాలి. దీని వల్ల ఉదయాన్నే మెలకువ వస్తుంది. ఒకవేళ అలా మెలకువ రాకపోతే ఎవరిని అయినా ఉదయాన్నే ఓ నిర్ణీత సమయానికి మేల్కొలిపేలా చేయాలి. మొదట కొన్ని రోజులు ఎవరో ఒకరు నిద్ర లేపుతుంటే కొన్ని రోజులలోనే అదే సమయానికి మెలకువ వస్తుంది. *రూపశ్రీ.
read moreవైరల్ ఫీవర్ కోసం సింపుల్ హోం రెమెడీస్!
వర్షాకాలం వచ్చిందంటే చాలు బ్యాక్టీరియా వైరస్లు విజృంభిస్తూ ఉంటాయి. వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఇన్ఫెక్షన్ ద్వారా జలుబు, జ్వరం రావడం సాధారణం. అయితే జలుబు జ్వరం వచ్చినప్పుడల్లా ఇంగ్లీష్ మాత్రలపైన, మందులపైన ఆధారపడటం ద్వారా మన ఇమ్యూనిటీ దెబ్బతింటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయుర్వేదం ఒక చక్కటి పరిష్కారం అని నిపుణులు సూచిస్తున్నారు. వైరల్ ఫీవర్ వంటి జబ్బులకు వంట ఇంటి చిట్కాలను తెలుసుకుందాం. శరీరంలో రోగనిరోధక శక్తి కొద్దిగా తగ్గినా ఆరోగ్యం దెబ్బతిని జ్వరం, జలుబు, దగ్గు అన్నీ ఒక్కొక్కటిగా వేధించడం మొదలవుతాయి. వీటిని దూరం చేసుకోవడానికి కొన్ని సింపుల్ హోం రెమెడీస్ చూద్దాం... తేనె-అల్లం రసం: ఒక టేబుల్ స్పూన్ అల్లం రసంలో ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి తీసుకుంటే జ్వరం, జలుబు, దగ్గు సమస్య క్రమంగా తగ్గుతుంది. పసుపు నీరు: జ్వరం, దగ్గు, కఫం, జలుబు వంటి సమస్యలు ఉంటే ఉదయాన్నే పరగడుపున వేడినీళ్లలో కొద్దిగా పసుపు కలిపి తాగితే సమస్య పరిష్కారం అవుతుంది. తులసి టీ: తులసి ఆకుల్లో ఉండే యాంటీ వైరల్ గుణాలు దగ్గు, కఫం, జలుబు, జ్వరంతో పోరాడుతాయి. కాబట్టి జ్వరం వచ్చినప్పుడు తులసి టీ తాగడం అలవాటు చేసుకోండి. తులసి రసం: రెండు టీస్పూన్ల గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ తులసి ఆకులను కలపడం అలవాటు చేసుకుంటే శరీర ఉష్ణోగ్రత క్రమంగా తగ్గి జ్వరం కూడా అదుపులోకి వస్తుంది. ధనియాల టీ: ధనియాల గింజల్లో యాంటీ బయోటిక్ గుణాలు ఉన్నాయి, ఇవి వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే జ్వరాన్ని తగ్గిస్తాయి. కాబట్టి కొత్తిమీర గింజల టీ తయారు చేసి తాగడం మంచిది. మెంతులు నానబెట్టిన నీరు: ఒక టేబుల్ స్పూన్ మెంతి గింజలను అరకప్పు నీటిలో నానబెట్టండి. దీన్ని వడకట్టి ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగితే జ్వరం సమస్య నెమ్మదిగా అదుపులోకి వస్తుంది.
read moreనాలుక రంగును బట్టి జబ్బులను గెస్ చేయవచ్చు తెలుసా?
ఎప్పుడైనా ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్లినప్పుడు డాక్టర్ చేసే కొన్ని ప్రాథమిక పనులు ఉంటాయి. వాటిలో మొదటిది నాలుక చూడటం. నాలుక చూడటం, కళ్లు.. ముఖ్యంగా కనుగుడ్డు కింది భాగం, తరువాత మణికట్టు పట్టుకుని నాడి చూడటం వంటివి చేస్తారు. అయితే డాక్టర్లు ఇలా నాలుక చూడటం వెనుక బలమైన కారణాలు ఉంటాయి. నాలుక రంగును బట్టి శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని చెప్పవచ్చు. అసలు నాలుక ఏ రంగులో ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టు? ఎలాంటి రంగులు ఎలాంటి అనారోగ్య సమస్యలను సూచిస్తాయి? తెలుసుకుంటే.. నాలుక రంగు.. సాధారణంగా ఆరోగ్యకరమైన వ్యక్తి నాలుక గులాబీ కలర్ లో ఉంటుంది. ఇలా గులాబీ రంగులో కాకుండా వేరే ఇతర రంగులలో నాలుక ఉంటే వాటి వెనుక కొన్ని అనారోగ్య సమస్యలు ఉంటాయి. నలుపు రంగు.. కొన్నిసార్లు నాలుక రంగు నల్లగా మారవచ్చు. నాలుక నలుపు రంగుగా మారడం క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన ప్రాణాంతక వ్యాధికి సంకేతమట. నలుపు రంగు నాలుక ఫంగస్, అల్సర్ వంటి తీవ్రమైన వ్యాధికి లక్షణం కావచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. తెలుపు రంగు.. కొందరికి నాలుక తెల్లగా పాలిపోయి ఉంటుంది. నాలుక రంగు తెల్లగా మారినట్లయితే శరీరంలో డీహైడ్రేషన్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఇది కాకుండా, తెల్లటి నాలుక ల్యుకోప్లాకియా వంటి తీవ్రమైన వ్యాధిని కూడా సూచిస్తుందట. పసుపు రంగు.. నాలుక పసుపు రంగులోకి మారుతుందా? అనే సందేహం చాలామందికి ఉంటుంది. కానీ ఇది నిజమే. కొందరికి కొన్ని పరిస్థితులలో నాలుక పసుపు రంగులోకి మారుతుంది. నాలుక పసుపు రంగులో ఉన్నట్టైతే జీర్ణక్రియను మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలి. నోటిలో మిగిలిపోయిన బ్యాక్టీరియా కారణంగా నాలుక రంగు పసుపు రంగులోకి మారుతుంది. ఈ రంగు నాలుక కాలేయ ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని సమస్యలను కూడా సూచిస్తుందట. ఎరుపు రంగు.. నాలుక ఎర్రగా పొక్కినట్టు ఉంటుంది కొందరికి. ఇలా ఎరుపు రంగులో నాలుక ఉండటం విటమిన్ B, ఐరన్ లోపాన్ని సూచిస్తుంది. ఫ్లూ, జ్వరం, ఇన్ఫెక్షన్ లు ఉన్నప్పుడు కూడా నాలుక ఎరుపు రంగులో ఉంటుంది. నాలుక రంగు మారడాన్ని మీరు గమనించినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. *రూపశ్రీ.
read moreఎప్పుడూ బలహీనంగా అనిపిస్తుందా? ఈ 3 విటమిన్ల లోపమే కారణమట..!
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం, నిద్ర, అలవాట్లు బాగుండాలి. అయితే ఇవన్నీ చక్కగా పాటిస్తున్నా సరే బలహీనత ఫీలవుతూ ఉంటారు. ఏ చిన్న పని చేసినా అలసట అనుభూతి చెందడం, ఒళ్లంతా నొప్పులుగా అనిపించడం, ఏ పని చేయాలన్నా ఆసక్తి లేకపోవడం, బాగా నీరసంగా ఉందని కంప్లైంట్ చేయడం చేస్తుంటారు. అయితే ఇది కేవలం మూడు రకాల విటమిన్లు లోపించడం వల్ల ఎదురయ్యే సమస్య అని ఆహార నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుంటే.. విటమిన్-డి.. విటమిన్-డి అనేది సూర్యరశ్మి శరీరానికి అందడం ద్వారా శరీరంలో తయారవుతుంది. విటమిన్-డి లోపిస్తే రోజంతా బలహీనంగా, అలసటగా అనిపిస్తుంది. వర్షాకాలంలో విటమిన్-డి లోపం వచ్చే అవకాశాలు ఎక్కువ. అదే విధంగా ఎక్కువగా ఇంట్లోనే ఉండేవారు, ఇల్లు దాటి బయటకు రానివారు, సూర్యరశ్మికి, బయటి వాతావరణానికి దూరంగా ఉండేవారు విటమిన్-డి లోపానికి ఎక్కువగా గురి అవుతారు. ఈ విటమిన్-డి లోపాన్ని అధిగమించడానికి పుట్టగొడుగులు, పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు, పాలు, గుడ్లు, చేపలు తీసుకోవాలి. విటమిన్-బి12.. విటమిన్-బి12 శరీరంలో నాడీ వ్యవస్థకు చాలా ముఖ్యమైనది. ఇది లోపిస్తే నరాల సమస్యలు వస్తాయి. ఇది లోపిస్తే శరీరం ఎప్పుడూ అలసట అనుభూతి చెందుతూ ఉంటుంది. విటమిన్-బి12 లోపాన్ని అధిగమించడానికి గుడ్లు, చేపలు, మాంసం, పాలు, గింజలు మొదలైనవి తీసుకోవాలి. విటమిన్-సి.. విటమిన్-సి లోపిస్తే ఎప్పుడూ నిద్ర మత్తుగా అనిపిస్తుంది. అంతేకాదు ఎక్కువగా నిద్రపోతారు. కండరాలలో నొప్పి, అలసట ఎక్కువగా ఉంటుంది. విటమిన్-సి ఆధారిత పండ్లు, కూరగాయలు బాగా తీసుకోవాలి. ముఖ్యంగా జామ, నారింజ, బ్రోకలీ బాగా తినాలి. *రూపశ్రీ.
read more