వైద్య నిపుణురాలు చెప్పిన 7 అద్భుతమైన ఆరోగ్యకరమైన ఆహారాలు
ఈ రోజుల్లో క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులు చాలా మందిని ప్రభావితం చేస్తున్నాయి. అయితే మన రోజువారీ ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ వీడియోలో ప్రముఖ వైద్య నిపుణురాలు డా. శ్రీలత రోజూ ఆహారంలో తప్పనిసరిగా ఉండాల్సిన 7 ముఖ్యమైన ఆరోగ్యకరమైన ఆహారాల గురించి సులభంగా వివరించారు. ఈ ఆహారాలు శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో మరియు క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఎలా ఉపయోగపడతాయో వివరించారు. అలాగే ఏ ఆహారాన్ని ఎంత మోతాదులో తీసుకోవాలి, వాటిని రోజువారీ ఆహారంలో ఎలా చేర్చుకోవాలి, ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం పాటించాల్సిన ముఖ్యమైన సూచనలు ఏమిటో కూడా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే, మీ కుటుంబ సభ్యులకు కూడా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అలవాటు చేయాలనుకుంటే ఈ వీడియో తప్పకుండా చూడండి. గమనిక: ఈ వీడియోలో ఇచ్చిన సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మీ ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా ఆహారంలో మార్పులు చేసుకునే ముందు తప్పనిసరిగా మీ వైద్యుడిని లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించండి.
read moreవర్షాకాలంలో మొక్కజొన్న తినడం ఆరోగ్యానికి మంచిదా కాదా? అసలు విషయమిది..!
వర్షాకాలంలో చాలా మంది పకోరాలు, సమోసాల వంటి వేయించిన ఆహారాల కంటే మొక్కజొన్నను ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. మొక్కజొన్నలో అనేక ముఖ్యమైన పోషకాలు ఉండటం వల్ల ఆరోగ్య పరంగా చూసినా మొక్కజొన్న చాలా మంచిది. అయితే ప్రతి వ్యక్తి ఆరోగ్య పరిస్థితి భిన్నంగా ఉంటుంది, కాబట్టి మొక్కజొన్నను సరైన పద్ధతిలో , సరైన పరిమాణంలో తీసుకోవడం చాలా ముఖ్యం. వర్షాకాలంలో మొక్కజొన్న తినడం కొందరికి ఆరోగ్యపరంగా మేలు చేస్తే.. మరికొందరికి హాని కూడా కలిగించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలంలో మొక్కజొన్న తినడం వల్ల కలిగే ప్రయోజనాలు, మొక్కజొన్న తినడంలో పాటించాల్సిన జాగ్రత్తలు , మొక్కజొన్న తినడానికి సేఫ్ మార్గం.. ఇలా అన్ని విషయాలు తెలుసుకుంటే.. వర్షాకాలంలో మొక్కజొన్న.. ఆహార నిపుణుల అభిప్రాయం ప్రకారం మొక్కజొన్నలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది , ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. మొక్కజొన్నలోని రెసిస్టెంట్ స్టార్చ్ పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పొటాషియం, మెగ్నీషియం , బి విటమిన్లు కూడా శక్తిని అందించడానికి , శరీరంలో జరిగే క్రియలను నిర్వహించడానికి తగిన శక్తి అందిస్తుంది. అందుకే వాతావరణ పరంగానే కాకుండా ఆరోగ్య పరంగా కూడా మొక్కజొన్న ఆరోగ్యానికి చాలామంచిది. అసిడిటి, గ్యాస్, ఉబ్బరం సమస్యలుంటే.. గ్యాస్, ఎసిడిటీ లేదా కడుపు ఉబ్బరంతో బాధపడేవారికి, ఉడికించిన మొక్కజొన్న మంచిది. ఉడికించిన మొక్కజొన్న మృదువుగా ఉండి, సులభంగా జీర్ణమవుతుంది. అయితే, దీనిని ఎక్కువ సేపు ఉడికించడం వల్ల దానిలోని కొన్ని పోషకాలు , రెసిస్టెంట్ స్టార్చ్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఐబియస్ ఉన్న వ్యక్తులకు.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS) ఉంటే, మొదట్లో దీనిని అర కంకికి, అంటే సుమారు 35–40 గ్రాములకు పరిమితం చేసుకుని తినడం మంచిది. ఎక్కువ మొత్తంలో స్వీట్ కార్న్ లేదా నార్మల్ కార్న్ తినడం వల్ల కొంతమందిలో గ్యాస్ , ఉబ్బరం పెరగవచ్చు. మధుమేహం లేదా ఇన్సులిన్ నిరోధకత.. మధుమేహం లేదా ఇన్సులిన్ నిరోధకత ఉన్నవారికి ఉడకబెట్టిన లేదా ఆవిరి మీద ఉడికించిన మొక్కజొన్న మంచిదిగా. దీని గ్లైసెమిక్ ఇండెక్స్, వేయించిన మొక్కజొన్న కంటే తక్కువగా ఉంటుంది. ఒకసారికి అర కప్పు ఉడికించిన మొక్కజొన్న లేదా ఒక చిన్న మొక్కజొన్న కంకి సరిపోతుంది. మొక్కజొన్నలో ల్యూటిన్ , జీక్సాంథిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయని భావిస్తారు. మొక్కజొన్నను కొద్దిగా ఆవిరి మీద ఉడికించడం వల్ల ఈ పోషకాలు శరీరానికి మరింత సులభంగా అందుతాయి. మొక్కజొన్న తినేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు.. మొక్కజొన్నపై అధికంగా వెన్న, చీజ్ లేదా ఉప్పు వేసుకుని తినకూడదు. అసిడిటీ సమస్యలు ఉంటే, మసాలాలు , నిమ్మరసం వాడకాన్ని తగ్గించాలి. మాడిపోయిన లేదా బాగా వేయించిన మొక్కజొన్నను తినడం మానుకోవాలి. ఎల్లప్పుడూ తాజాగా, బాగా ఉడికించిన మొక్కజొన్నను తినడం మంచిది. మొక్కజొన్నను బాలెన్స్డ్ గా తీసుకోవడం మంచిది. అవసరమైన దానికంటే ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. *రూపశ్రీ.
read moreరక్తంలో క్లాట్స్ ప్రమాదాన్ని తగ్గించేందుకు వంటింటి చిట్కాలు..ఆయుర్వేద నిపుణుడి సూచనలు!
మన శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా ఉండటం ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనది. జీవనశైలి మార్పులు, సరైన ఆహారం తీసుకోకపోవడం, వ్యాయామం లేకపోవడం వంటి కారణాల వల్ల రక్తంలో క్లాట్స్ ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. అలాగే అధిక బరువు కూడా అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఈ వీడియోలో ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు Dr. Chittibotla Madhusudana Sharma గారు వంటింట్లో సులభంగా లభించే కొన్ని సహజ పదార్థాలతో సంప్రదాయ ఆయుర్వేదంలో ఉపయోగించే చిట్కాలను వివరించారు. రక్త ప్రసరణను మెరుగుపరచడంలో, శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో, బరువు నియంత్రణకు తోడ్పడే ఆహారపు అలవాట్లు మరియు సహజ పద్ధతుల గురించి ఆయన విలువైన సూచనలు అందించారు. అలాగే ఏయే ఆహార పదార్థాలను తీసుకోవాలి, ఎలాంటి జీవనశైలి పాటించాలి, ఆరోగ్యాన్ని సహజంగా ఎలా మెరుగుపరుచుకోవాలి వంటి విషయాలను కూడా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఆయుర్వేదం చెప్పే ఈ సంప్రదాయ చిట్కాలను తెలుసుకుని, మీ రోజువారీ జీవితంలో ఆరోగ్యకరమైన అలవాట్లను అలవరచుకోండి. గమనిక: ఈ వీడియోలో తెలిపిన సమాచారం అవగాహన కోసం మాత్రమే. ఇప్పటికే రక్తం గడ్డకట్టే సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు లేదా ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు తప్పనిసరిగా అర్హత కలిగిన వైద్యుడి సలహా మేరకు మాత్రమే చికిత్స తీసుకోవాలి. వైద్యుల సూచన లేకుండా ఎలాంటి మందులను ఆపడం లేదా ప్రారంభించడం చేయవద్దు.
read moreఇంటర్మిటెంట్ ఫాస్టింగ్.. బరువు తగ్గడానికి పాటించే ఈ ఉపవాసం ఎంత డేంజరో తెలుసా?
నేటికాలంలో ఉపవాసం కేవలం దేవుడు, సంప్రదాయం, మతానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు.. ఫిట్‌నెస్ ప్రపంచంలో కూడా ఉపవాసం బాగా ప్రాచుర్యం పొందింది. 16:8 డైట్ వంటి పద్ధతుల నుండి రోజుకు ఒకసారి తినడం వరకు, తక్కువ తినడానికి, త్వరగా బరువు తగ్గడానికి , ఆరోగ్యంగా ఉండటానికి ఉపవాసం ఒక సులభమైన మార్గంగా అందరికీ కనిపిస్తుంది. ఇలాంటి వాటిలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కూడా ఉంది. దీన్నే మధ్యంతర ఉపవాసం అని కూడా పిలుస్తారు. అయితే ఇది ఆరోగ్యానికి మేలు చేయడం కంటే.. హాని చేయడమే ఎక్కువ ఉంటుందని అంటున్నారు. ఇది పరిశోధనలలో తేలిందని కూడా అంటున్నారు. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. పరిశోధనలు తేల్చిన నిజం.. ఇటీవల 20,000 మందికి పైగా ప్రజలపై జరిపిన ఒక విశ్లేషణలో, రోజుకు ఎనిమిది గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం వరకు ఆహారం తీసుకోకుండా ఉండే వారికి గుండె జబ్బులతో మరణించే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది. కొన్ని సందర్భాల్లో ఈ ప్రమాదం 91 శాతం వరకు ఎక్కువగా ఉంటుందట. దీని అర్థం ఉపవాసం అందరికీ హానికరం అని కాదు, కానీ తక్కువ తినడం, ఎక్కువ సమయం ఆహారం లేకుండా ఉండటం ఆరోగ్యానికి మంచిది కాదని అంటున్నారు. వైద్యులు ఏం చెప్తున్నారంటే.. ఎక్కువసేపు ఆహారం తీసుకోకుండా ఉండటం అనేది శరీరంలో అనేక ఆకస్మిక మార్పులకు కారణమవుతుందని వైద్యులు చెబుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా హెచ్చుతగ్గులకు గురవుతాయి, ఒత్తిడి హార్మోన్లు పెరుగుతాయి, , కొవ్వు స్థాయిలు కూడా ప్రభావితమవుతాయి. ఈ మార్పులన్నీ గుండెపై ఒత్తిడిని కలిగిస్తాయట. మరోవైపు ఎక్కువ సేపు ఆహారం తీసుకోకుండా ఉండడం వల్ల చక్కెర, ఖనిజాలు , హార్మోన్లలో హెచ్చుతగ్గులకు కారణమవుతుందని, ఇది హృదయ స్పందనలు గాడి తప్పే పరిస్థితి తీసుకొస్తుందని అంటున్నారు. నీటి కొరత.. ఆహారం ఎక్కువ సేపు తీసుకోకుండా ఉపవాసం ఉండటం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. శరీరం డీహైడ్రేషన్ అవుతుంది. ప్రజలు ఎక్కువ సేపు ఆహారం తీసుకోనప్పుడు, తక్కువ నీరు తాగుతారు. దీనివల్ల సాధారణ గుండె కొట్టుకోవడానికి అవసరమైన పొటాషియం , మెగ్నీషియం వంటి అవసరమైన ఖనిజాలు శరీరంలో తగ్గిపోతాయి. ఈ ఖనిజ లోపాలు డీహైడ్రేషన్ కారణంగా హృదయ స్పందన సజావుగా సాగడం కోసం గుండె చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎవరు జాగ్రత్తగా ఉండాలి? ఉపవాసం ఆరోగ్యానికి మంచిది కాకపోయినా.. ఇది అందరికీ ఒకే ఫలితాన్ని ఇవ్వదు. కొందరికి ఇది సమస్య కలిగిస్తుంది, మరికొందరికి మంచి ఫలితాలు కూడా ఇవ్వవచ్చు. ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు లేదా గుండె సమస్యలు, ముందు నుంచే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉపవాసం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా, కొన్ని రకాల మందులు తీసుకునే వారికి ఉపవాసం మంచిది కాదు,, ఆహారం తినకుండా మందులు వేసుకోలేం, ఆహారం తినకుండా మందులు వేసుకున్నా అది ఆరోగ్యానికి మంచిది కాదు. ఆరోగ్యంగా ఉన్నవారు కూడా ఎక్కువ సేపు ఆహారం తీసుకోకుండా ఉంటే.. తరచుగా అలసట, తలతిరగడం, ఛాతిలో ఇబ్బందిగా ఉండటం లేదా గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు శరీరం మీద ఒత్తిడి ఎక్కువగా ఉందని చెప్పే లక్షణాలు. కాబట్టి ఉపవాసం పేరుతో ఎక్కువ సేపు ఆహారం తీసుకోకుండా ఉండటం, శరీరాన్ని ఇబ్బందికి గురిచేసుకోవడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. అందుకే.. బరువు తగ్గాలన్నా, ఫిట్ గా ఉండాలన్నా మంచి పద్దతులలో ఆహారం తీసుకుంటూనే గోల్ రీచ్ అవ్వాలి. *రూపశ్రీ.
read moreగర్భసంచి క్యాన్సర్‌కు ఇదే తొలి హెచ్చరిక! మెనోపాజ్ తర్వాత బ్లీడింగ్‌ను నిర్లక్ష్యం చేయకండి
మెనోపాజ్ (Menopause) వచ్చిన తర్వాత మళ్లీ బ్లీడింగ్ రావడం సాధారణ విషయం కాదు. చాలా మంది మహిళలు దీనిని చిన్న సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఇది కొన్ని సందర్భాల్లో గర్భసంచి క్యాన్సర్ (Endometrial Cancer / Uterine Cancer) కు తొలి హెచ్చరిక కావచ్చు. ఈ వీడియోలో ప్రముఖ గైనకాలజిక్ ఆంకాలజిస్ట్ డాక్టర్ స్నేహా సాగర్ గారు గర్భసంచి క్యాన్సర్ గురించి ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను చాలా సులభంగా వివరించారు. ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యమైన విషయాలు: ✅ మెనోపాజ్ తర్వాత బ్లీడింగ్ రావడానికి కారణాలు ఏమిటి? ✅ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే ఏమిటి? ✅ గర్భసంచి క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఏమిటి? ✅ ఎవరికి ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ? ✅ ఎప్పుడు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి? ✅ బయాప్సీ ఎందుకు అవసరం? ✅ క్యాన్సర్‌ను ప్రారంభ దశలో ఎలా గుర్తిస్తారు? ✅ శస్త్రచికిత్స (Surgery), కీమోథెరపీ (Chemotherapy), రేడియేషన్ థెరపీ (Radiation Therapy) వంటి చికిత్సల గురించి పూర్తి వివరాలు. ప్రారంభ దశలో గర్భసంచి క్యాన్సర్‌ను గుర్తిస్తే చికిత్స విజయవంతంగా జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే మెనోపాజ్ తర్వాత ఎలాంటి బ్లీడింగ్ వచ్చినా ఆలస్యం చేయకుండా గైనకాలజిస్ట్‌ను సంప్రదించడం ఎంతో ముఖ్యం.
read moreమాచా టీ.. బరువు తగ్గడంలో మ్యాజిక్ చేస్తందా?
టీ లో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో బ్లాక్ టీ మాత్రమే కాకుండా.. గ్రీన్ టీ తో పాటు కుంకుమ పువ్వు టీ, కార్శీరీ ఖవ్వా టీ, జాస్మిన్ టీ.. ఇలా చాలా రకాలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు బరువు తగ్గడంలో సహాయపడతాయని చెబుతారు. ఇవన్నీ మొన్నటి వరకు ట్రెండ్ అయినవే. అయితే ఇప్పుడు మరొక కొత్త టీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. పైగా బరువు తగ్గడం కోసం సెలబ్రిటీలు గ్రీన్ టీకి స్వస్తి చెప్పి ఈ కొత్త రకం టీ ను ఉపయోగిస్తున్నారని చెబుతారు. అసలు ఈ మాచా టీ ఏమిటి? దీన్నితాగడం వల్ల బరువు ఎలా తగ్గుతారు? దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. మచా టీ.. సాధారణ గ్రీన్ టీని కేవలం ఆకులను మరిగించిన నీటిలో వేడయం ద్వారా తయారుచేస్తారు, అయితే మాచా అనేది మొత్తం ఆకులను పొడిగా తయారు చేసి దాన్ని నీటిలో కలిపి తయారు చేసే టీ... ఈ కారణంగానే గ్రీన్ టీ కంటే మాచా ఎక్కువ ప్రయోజనకరమైనదిగా ఉంటందని చెబుతారు. సెలబ్రిటీలకు ఫేవరేట్ ఎందుకంటే.. మాచా గురించి అందరికీ తెలియడానికి కారణం.. ఈ టీను సెలబ్రిటీల నుండి సోషల్ మీడియాలో ఎంతో మంది దీన్ని తమ ఆరోగ్యం కోసం తాగుతున్నారు. ఎందుకంటే మాచాలో కేటెచిన్స్ అనే యాంటీఆక్సిడెంట్లు, ముఖ్యంగా EGCG ఉంటాయి, ఇవి శరీరంలోని కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. మాచా శరీరం కేలరీలను బర్న్ చేసే సామర్థ్యాన్ని కూడా పెంచుతుందని అనేక నివేదికలు చెబుతున్నాయి. అంతేకాకుండా, మాచాలో కెఫీన్ , ఎల్-థియానైన్ ఉంటాయి, ఇవి మనసును ప్రశాంతపరిచి శక్తిని అందిస్తాయి. అందుకే ఇప్పుడు చాలా మంది ఉదయం పూట టీ , కాఫీకి బదులుగా మాచా తాగడానికి ఇష్టపడుతున్నారు. మాచా బరువు తగ్గడానికి సహాయపడుతుందా? బరువు తగ్గడానికి మాచా నిజంగా సహాయపడుతుందా అని చాలామంది సందేహపడుతూ ఉంటారు. అయితే మాచా అనేది అకస్మాత్తుగా బరువును తగ్గించే మ్యాజిక్ డ్రింక్ ఏమీ కాదని ఆహార నిపుణులు చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మాచా తాగినా లేదా బరువు తగ్గించే మరే ఇతర పానీయం తాగినా, అవి బరువు తగ్గడంలో మాత్రమే సహాయపడగలవు. కేవలం వాటిని తాగడం ద్వారా బరువు తగ్గేంత బలమైన ప్రభావం వాటికుండదు. అంటే.. ఆహారంపై శ్రద్ధ పెట్టకుండా , వ్యాయామం చేయకుండా కేవలం ఈ పానీయాలపై మాత్రమే ఆధారపడటం వల్ల బరువుపై ఎటువంటి ప్రభావం ఉండదని అంటున్నారు. *రూపశ్రీ.
read moreవిటమిన్ బి-12 లోపముందా? ఇదిగో ఇలా పరిష్కరించుకోండి!
శరీరం ఆరోగ్యంగా ఉండటానికి అన్ని విటమిన్లు , ఖనిజాలు సరైన మోతాదులో అవసరం. శరీరానికి అత్యంత ముఖ్యమైన విటమిన్లలో విటమిన్ బి12 ఒకటి, ఇది ఎర్ర రక్త కణాల ఏర్పాటులో, సరైన నాడీ పనితీరులో , శక్తిని నిలుపుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే నేటికాలంలో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం, పోషకాహార లోపాల కారణంగా, చాలా మంది విటమిన్ బి12 లోపంతో బాధపడుతున్నారు. విటమిన్ బి12 ప్రధానంగా జంతు ఆధారిత ఆహారాలలో లభిస్తుంది కాబట్టి, శాకాహారులకు విటమిన్ బి12 లోపం కనిపిస్తూ ఉంటుంది. టెస్ట్ లలో విటమిన్ బి12 లోపం ఉన్నట్లు తేలితే, ఆహార , జీవనశైలి మార్పుల ద్వారా విటమిన్ బి12 లోపాన్ని అధిగమించవచ్చు. విటమిన్ బి12 లోపాన్ని అధిగమించడానికి కొన్ని సులభమైన మార్గాలను తెలుసుకుంటే.. విటమిన్ బి12 లోపిస్తే కనిపించే లక్షణాలు.. ఎప్పుడూ అలసటగా మరియు బలహీనంగా అనిపించడం. చేతులు మరియు పాదాలలో జలదరింపు లేదా తిమ్మిరిగా ఉండటం, తలతిరగటం, చర్మం పసుపు రంగులోకి మారడం, దేని మీదా ఏకాగ్రత లేకపోవడం, మానసిక స్థితిలో వేగంగా మార్పులు ఉండటం. విటమిన్ బి12 లోపం అధిగమించడానికి తీసుకోవలసిన ఆహారాలు.. విటమిన్ బి12 లోపాన్ని అదిగమించడానికి పాలు , పాల ఉత్పత్తులు తీసుకోవడం మంచి మార్గం. ముఖ్యంగా శాకాహారులు, పాల ఉత్పత్తులు బాగా తీసుకోవాలి. పాలు, పెరుగు, పనీర్ , జున్ను వంటి పాల ఉత్పత్తులలో విటమిన్ బి12తో పాటు, శరీరానికి అవసరమైన అనేక పోషకాలను ఉంటాయి. కాల్షియం మరియు ప్రోటీన్ కూడా ఉంటాయి. గుడ్లు, చేపలు, చికెన్ , మాంసం మొదలైన వాటిలో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది. మాంసాహారులు వీటిని తీసుకోవచ్చు. ఈ ఆహారాలలో ఉండే విటమిన్ బి12ను శరీరం సులభంగా వినియోగించుకుంటుంది. గుడ్డు సొనలో విటమిన్ బి12 ఉంటుంది. చేపలు , చికెన్‌లో ప్రోటీన్ , అనేక ఇతర ముఖ్యమైన పోషకాలు కూడా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా , బాలెన్స్డ్ గా తీసుకోవడం వల్ల శరీరంలో విటమిన్ బి12 స్థాయిలను సులువుగా పెంచుకోవచ్చు. శాకాహారులకు లేదా పాల ఉత్పత్తులకు దూరంగా ఉండేవారు విటమిన్-బి12 కోసం , బలవర్ధక ఆహారాలు బాగా సహాయపడతాయి. బలవర్ధక ఆహారాలు అంటే విటమిన్లు , ఖనిజాలతో కూడిన ఆహారాలు. చాలా రకాల బ్రేక్‌ఫాస్ట్ సెరియల్స్, సోయా పాలు లేదా బాదం పాలు వంటి మొక్కల ఆధారిత పాలు, న్యూట్రిషనల్ ఈస్ట్‌లో విటమిన్ బి12 ఉంటుంది. వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల విటమిన్ బి12 లోపాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. సప్లిమెంట్ల విషయంలో.. విటమిన్ బి12 లోపం తీవ్రంగా ఉంటే, కేవలం ఆహారం ద్వారా దానిని భర్తీ చేయడం కష్టం . అటువంటి సందర్భాలలో డాక్టర్ విటమిన్ బి12 సప్లిమెంట్లు, టాబ్లెట్లు లేదా ఇంజెక్షన్లను సిఫార్సు చేయవచ్చు. విటమిన్ బి12 లోపానికి చికిత్స అనేది వ్యక్తి వయస్సు, ఆరోగ్య స్థితి , లోపం యొక్క తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల, పరీక్షలు చేయించుకోకుండా , డాక్టర్‌ను సంప్రదించకుండా ఎక్కువ కాలం సప్లిమెంట్లను తీసుకోవడం మంచిది కాదు. *రూపశ్రీ.
read moreథైరాయిడ్ పేషెంట్లు చేసే పెద్ద తప్పులు ఇవే.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు!
థైరాయిడ్ సమస్యలు ప్రస్తుతం చాలా మందిలో కనిపిస్తున్న సాధారణ ఆరోగ్య సమస్యల్లో ఒకటి. అయితే, థైరాయిడ్ రావడానికి మన ఆహారపు అలవాట్లు కూడా ఒక కారణమా? థైరాయిడ్ ఉన్నవారు ఏ ఆహారం తీసుకోవాలి? ఏ ఆహారాలకు దూరంగా ఉండాలి? అనే సందేహాలు చాలా మందికి ఉంటాయి. ఈ వీడియోలో సీనియర్ న్యూట్రిషన్ కన్సల్టెంట్ డా. పి. జానకి శ్రీనాథ్ థైరాయిడ్ సమస్యలకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను సులభంగా వివరిస్తున్నారు. సరైన ఆహారం తీసుకోవడం ద్వారా థైరాయిడ్ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవచ్చో, రోజువారీ జీవితంలో పాటించాల్సిన ఆహారపు అలవాట్లు ఏమిటో వివరంగా చెబుతున్నారు. ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యమైన విషయాలు: థైరాయిడ్ అంటే ఏమిటి? థైరాయిడ్ రావడానికి ఆహారపు అలవాట్లు ఎంతవరకు కారణం? థైరాయిడ్ ఉన్నవారు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు తగ్గించాల్సిన లేదా మానాల్సిన ఆహారాలు అయోడిన్, సెలీనియం, జింక్ వంటి పోషకాల ప్రాముఖ్యత థైరాయిడ్ రోగులు పాటించాల్సిన ఆరోగ్యకరమైన డైట్ చిట్కాలు జీవనశైలిలో చేయాల్సిన మార్పులు థైరాయిడ్ సమస్యలను నియంత్రించుకోవాలనుకునే వారు, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అలవరుచుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుంది.
read more30 రోజులు అన్నానికి బదులు జొన్న రొట్టెలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
భారతీయుల భోజనంలో అన్నం చాలా ప్రధానమైనది. అన్నం తినడం వల్ల వచ్చే సాటిసిఫాక్షన్ వేరే ఏ విధంగా రాదని చాలామంది అంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో మూడు పూటలా అన్నం తినాలన్నా చక్కగా తినేస్తారు. కానీ ప్రస్తుతం డయాబెటిస్, అధిక బరువు వంటి సమస్యలతో అన్నం అంటే దూరం జరిగే వారు చాలామంది ఉన్నారు. ఇలాంటి వారు ఆహారంలో రొట్టెలు తీసుకోవడం మంచిదని అనుకుంటారు. చపాతీలు, సజ్జ, జొన్న రొట్టెలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ముఖ్యంగా జొన్నరొట్టెలు శరీరానికి చక్కని పోషణ ఇస్తాయి. అంతేకాదు.. 30 రోజులు అన్నానికి బదులుగా జొన్న రొట్టెలు తింటే ఆరోగ్య పరంగా అద్బుతమైన ఫలితాలు చూస్తారు. 30రోజులు జొన్న రొట్టెలు తింటే ఏం జరుగుతుందో తెలుసుకుంటే.. 30రోజులు అన్నానికి బదులు జొన్న రొట్టెలు తింటే కలిగే ఫలితాలు.. భారతీయులు ఉపయోగించే తృణదాన్యాలలో జొన్నలు చాలా శ్రేష్టమైనవి. జొన్నలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ కారణంగా అన్నానికి బదులు జొన్న రొట్టెలు తినడం వల్ల చాలాసేపటి వరకు ఆకలి అవ్వదు. ఈ కారణంగా పదే పదే ఏదో ఒకటి తినడం అనే అలవాటు కూడా తగ్గుతుంది. దీనివల్ల బరువు తగ్గడం కూడా సులువు అవుతుంది. రోజూ అన్నానికి బదులు జొన్నరొట్టెలు తినేవారు బరువు సులువుగా తగ్గుతారు. డయాబెటిస్ ఉన్న వారికి జొన్నలు గొప్ప వరం అని చెప్పవచ్చు. అన్నంతో పోలిస్తే జొన్నరొట్టెలలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల జొన్నరొట్టెలు తింటే షుగర్ లెవెల్స్ నిలకడగా ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారు అన్నం, చపాతీ బదులు రోజూ జొన్నరొట్టెలు తింటే బ్లడ్ షుగర్ చాలా కంట్రోల్ అవుతాయి. జొన్నలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల ఆహారం జీర్ణం కావడంలో ఎలా ఇబ్బందులు ఉండవు. మలబద్దకంతో ఇబ్బంది పడేవారు రోజూ జొన్నరొట్టెలు తీసుకుంటే మలబద్దకం సమస్య తొగ్గిపోతుంది. జీర్ణాశయం స్థితి మెరుగవుతుంది. జొన్నరొట్టెలలో ఉండే గ్లైసెమిక్ సూచీ చాలా తక్కువ. ఇది రక్తంలో గ్లూకోజ్ ను చాలా నెమ్మదిగా విడుదల చేస్తుంది. ఈ కారణంగా నెమ్మదిగా అరుగుతుంది. దీనివల్ల చాలాసేపటి వరకు ఆకలి వేయకుండా ఉండటమే కాదు.. చాలా సేపు ఎనర్జీగా కూడా ఉంచుతుంది. అన్నం అయితే తొందరగా అరిగిపోతుంది. అందుకే జొన్నరొట్టెలు తింటే ఎక్కువ సేపు ఎనర్జీగా ఉండవచ్చు. పూరీ, బేకరీ ఫుడ్స్, కేక్స్, ఆయిల్ ఫుడ్స్ వంటివి తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అయితే చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు ఏ ఆహారం తినాలన్నా చాలా భయపడుతూ ఉంటారు. కానీ రోజూ జొన్న రొట్టెలు తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. జొన్నరొట్టెలు శరీరానికి చలువ చేస్తాయి, బలాన్ని ఇస్తాయి, ఎక్కువ సేపు శరీరానికి శక్తిని ఇస్తాయి, రోజూ కనీసం ఒక్కపూట అయినా జొన్న రొట్టెలు తింటే శరీరాన్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అందుకే కనీసం రోజులో ఒక్క పూట అయినా జొన్న రొట్టెను ఆహారంలో తీసుకోవడం మంచి అలవాటని ఆహార నిపుణులు, వైద్యులు చెబుతున్నారు. *రూపశ్రీ.
read moreబ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు శరీరం ఇచ్చే 5 హెచ్చరికలు.. ఇవి కనిపిస్తే వెంటనే జాగ్రత్త!
బ్రెయిన్ స్ట్రోక్ (Brain Stroke) అనేది అత్యవసర వైద్య పరిస్థితి. మెదడుకు రక్త సరఫరా అకస్మాత్తుగా ఆగిపోవడం లేదా రక్తనాళం పగిలిపోవడం వల్ల మెదడు కణాలు దెబ్బతింటాయి. సరైన సమయంలో చికిత్స అందకపోతే ప్రాణాపాయం మాత్రమే కాకుండా శాశ్వత వైకల్యం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో ప్రముఖ న్యూరాలజిస్ట్ డా. అనిరుధ్ దేశ్‌ముఖ్ బ్రెయిన్ స్ట్రోక్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను సులభంగా వివరించారు. ఈ వీడియోలో మీరు తెలుసుకునే అంశాలు: బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏమిటి? స్ట్రోక్ ఎన్ని రకాలుగా ఉంటుంది? స్ట్రోక్ వచ్చే ప్రధాన కారణాలు ఏమిటి? స్ట్రోక్ వచ్చే ముందు కనిపించే హెచ్చరిక లక్షణాలు (TIA) ఏమిటి? చేతులు, కాళ్లు బలహీనపడటం, ముఖం వంకర కావడం, మాట తడబడటం వంటి లక్షణాలను ఎలా గుర్తించాలి? "గోల్డెన్ పీరియడ్" అంటే ఏమిటి? ఆ సమయంలో చికిత్స ఎందుకు చాలా కీలకం? ఆధునిక వైద్యంలో అందుబాటులో ఉన్న చికిత్సలు ఏమిటి? స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఎప్పుడు వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి? స్ట్రోక్ విషయంలో ప్రతి నిమిషం ఎంతో విలువైనది. లక్షణాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా అత్యవసర వైద్య సహాయం తీసుకోవడం వల్ల ప్రాణాలను కాపాడడమే కాకుండా మెదడు దెబ్బతినే ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు. బ్రెయిన్ స్ట్రోక్ గురించి పూర్తి అవగాహన పొందాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం TeluguOne Health ను ఫాలో అవుతూ ఉండండి.
read moreవర్షాకాలంలో పెరుగు తినడం మంచిదేనా? ఆరోగ్య నిపుణులు ఏం చెప్తున్నారంటే!
పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటుంది. అలాగే కాల్షియం, ప్రోటీన్ కూడా ఉంటుంది. భారతీయులు భోజనం చివర పెరుగుతో తింటే తప్ప వారికి తృప్తి ఉండదు. వేసవి కాలంలో పెరుగును ఇష్టంగా తింటారు. అయితే వర్షాకాలంలో పెరుగు తినడం గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారు. పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిది కాదని, జీర్ణవ్యవస్థ పై ప్రభావం పడుతుందని అంటుంటారు. దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. పెరుగు కడుపుకు మేలు చేసే ప్రోబయోటిక్ ఆహారంగా పరిగణించబడుతుంది, కానీ వర్షాకాలంలో పెరుగు తినడం పై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు మరింత తీవ్రమవుతాయని కొందరు చెబుతారు, అయితే ఆరోగ్య నిపుణులు మాత్రం వేరే విధంగా చెబుతున్నారు. వర్షాకాలంలో పెరుగు తినవచ్చా? ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, వర్షాకాలంలో పెరుగును తినవచ్చు, కానీ దాని పరిమాణం , పెరుగు తినే సమయం విషయంలో జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి, ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అయితే, వర్షాకాలంలో జీర్ణక్రియ సరిగ్గా జరగకపోవడం వల్ల కొంతమందికి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. పెరుగు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది, పేగులలో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది, శరీరాన్ని చల్లబరచడమే కాకుండా ఉత్తేజపరుస్తుంది. రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. వర్షంలో పెరుగు తినడం వల్ల కలిగే నష్టాలు.. వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల జలుబు , ఫ్లూ పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే పెద్దలు జలుబు, జ్వరం ఉన్నప్పుడు పెరుగు తినకూడదని చెబుతారు. పెరుగు తినడం వల్ల కఫం , శ్లేష్మంతో సమస్యలు రావచ్చు. కొంతమందికి కడుపు ఉబ్బరం కలగవచ్చు. రాత్రిపూట తినడం జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుంది. పెరుగు ఎలా తింటే శ్రేష్టం.. పగటిపూట మాత్రమే పెరుగు తినడం మంచిది. రాత్రిపూట పెరుగు తినడం మానుకోవాలి. కొద్దిగా వేయించిన జీలకర్ర లేదా నల్ల మిరియాల పొడి వేసుకుని పెరుగు తీసుకుంటే మంచిది. తాజాగా, ఇంట్లో తయారుచేసిన పెరుగును మాత్రమే తినడం ఆరోగ్యానికి ఎంతో ఉత్తమం. పెరుగు ఎవరు తినకూడదు? జలుబుతో బాధపడుతున్న వాళ్లు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళు, ఆస్తమా లేదా అలర్జీ రోగులు, రాత్రి ఆలస్యంగా భోజనం చేసే వారు.. పెరుగు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. *రూపశ్రీ.
read moreశరీరంలో వేడి పెరిగితే వచ్చే ప్రమాద సంకేతాలు ఇవే! పిత్త దోషాన్ని ఎలా నియంత్రించాలి?
శరీరంలో అధిక వేడి, పాదాల్లో మంట, కళ్లలో మంట, నోటి పూత, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు చాలా మందిని ఇబ్బంది పెడుతుంటాయి. ఈ లక్షణాలు సాధారణంగా కనిపించినప్పటికీ, ఆయుర్వేదం ప్రకారం ఇవి పిత్త దోషం (Pitta Dosha) పెరగడం వల్ల వచ్చే సంకేతాలు కావచ్చని ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డా. చి. మధుసూదన్ శర్మ వివరిస్తున్నారు. ఈ వీడియోలో పిత్త దోషం ఎందుకు పెరుగుతుంది? దానికి కారణమయ్యే ఆహారపు అలవాట్లు, జీవనశైలి, వాతావరణ ప్రభావాలు ఏమిటి? అలాగే పిత్తాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన ఆహారం, పాటించాల్సిన జీవనశైలి, ఆయుర్వేదంలో సూచించే సహజ చిట్కాలు వంటి అనేక ఉపయోగకరమైన విషయాలను సులభంగా వివరించారు. శరీరంలో వేడి ఎక్కువగా అనిపించడం, పాదాల్లో లేదా కళ్లలో మంట, తరచూ నోటి పూత రావడం, గ్యాస్, అసిడిటీ సమస్యలు వేధిస్తుంటే ఈ వీడియోలో చెప్పిన సూచనలు మీకు ఉపయోగపడవచ్చు. ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యాంశాలు: పిత్త దోషం అంటే ఏమిటి? శరీరంలో వేడి పెరగడానికి ప్రధాన కారణాలు పాదాలు, కళ్లలో మంట ఎందుకు వస్తుంది? నోటి పూత, గ్యాస్, అసిడిటీకి ఆయుర్వేద వివరణ పిత్తాన్ని తగ్గించే ఆహారాలు నివారించాల్సిన ఆహార పదార్థాలు రోజువారీ జీవితంలో పాటించాల్సిన ఆరోగ్యకరమైన అలవాట్లు సహజంగా శరీరాన్ని చల్లగా ఉంచే ఆయుర్వేద సూచనలు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, పిత్త దోషాన్ని సమతుల్యం చేసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి. గమనిక: ఈ వీడియోలోని సమాచారం ఆయుర్వేద అవగాహన కోసం మాత్రమే. వ్యక్తిగత ఆరోగ్య సమస్యల కోసం తప్పనిసరిగా అర్హత కలిగిన వైద్యుడిని లేదా ఆయుర్వేద నిపుణుడిని సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
read moreపురుషులారా జాగ్రత్త! ఈ 5 క్యాన్సర్లను ముందే గుర్తిస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చు
పురుషుల ఆరోగ్యం విషయంలో చాలామంది నిర్లక్ష్యం చేసే సమస్యల్లో క్యాన్సర్ ఒకటి. ప్రారంభ దశలోనే గుర్తిస్తే చాలా రకాల క్యాన్సర్లను విజయవంతంగా చికిత్స చేయవచ్చు. అయితే లక్షణాలను నిర్లక్ష్యం చేయడం వల్ల వ్యాధి ముదిరే ప్రమాదం ఉంటుంది. ఈ వీడియోలో ప్రముఖ యూరాలజిస్టు, ఆండ్రాలజిస్టు డా. ఏవి రవి కుమార్ పురుషుల్లో ఎక్కువగా కనిపించే ఐదు ప్రధాన క్యాన్సర్ల గురించి సులభంగా వివరించారు. ముఖ్యంగా ప్రోస్టేట్ క్యాన్సర్, మూత్రాశయ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, వృషణాల క్యాన్సర్, పురుషాంగ క్యాన్సర్ వంటి వ్యాధుల లక్షణాలు, ప్రమాద కారకాలు, ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి అనే అంశాలను తెలియజేశారు. అలాగే చాలామందికి ఉండే సందేహమైన యూరాలజీ (Urology) మరియు ఆండ్రాలజీ (Andrology) మధ్య ఉన్న తేడాను కూడా స్పష్టంగా వివరించారు. మూత్ర సంబంధిత వ్యాధులు, పురుషుల లైంగిక ఆరోగ్యం, సంతానలేమి సమస్యలు, ప్రోస్టేట్ సమస్యలు వంటి సందర్భాల్లో ఏ నిపుణుడిని సంప్రదించాలో ఈ ఇంటర్వ్యూలో తెలుసుకోవచ్చు. పురుషులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు? క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు ఎందుకు అవసరం? వంటి ఎన్నో ఉపయోగకరమైన విషయాలను ఈ వీడియోలో డా. ఏవి రవి కుమార్ వివరించారు. ప్రతి పురుషుడు తప్పకుండా తెలుసుకోవాల్సిన ఆరోగ్య సమాచారం కోసం ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
read moreమీకు టీ అంటే చాలా ఇష్టమా? ఒక్క నెల మానేసి చూడండి అద్బుతం చూస్తారు!
భారతదేశంలో టీ కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అది ఒక అలవాటుగా , రోజును మొదలుపెట్టడానికి మంచి ఎనర్జీ డ్రింక్ గా కూడా భావిస్తారు. ఉదయం లేవగానే టీ తాగడం, పనిలో బ్రేక్ సమయంలో టీ తాగడం, సాయంత్రం స్నేహితులతో కలిసి టీని ఎంజాయ్ చేయడం.. ఇలా దాదాపు ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్ లో టీ ఒక భాగం. కొందరు టీ తాగనిది ఏ పని చేయలేరు.. టీ తాగడం అనేది ఒక పెద్ద బలహీనతగా మారినవాళ్లు ఉంటారు. కానీ ఒక నెల పాటు టీ తాగడం మానేస్తే శరీరంలో జరిగే మార్పుల గురించి చాలా మందికి తెలియదు. కనీసం ఒక నెలరోజుల పాటు టీ తాగడం మానేస్తే అద్భుతాలు జరుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. నిద్ర నాణ్యత.. టీలోని కెఫీన్ ఒక ఉత్ప్రేరకంగా పనిచేసి, మెదడును చురుకుగా ఉంచుతూ, నిద్ర పట్టే ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది. టీ తాగడం మానేసినప్పుడు, శరీరంలో కెఫీన్ ప్రభావం క్రమంగా తగ్గుతుంది. ఇది త్వరగా నిద్రపోవడానికి సహాయపడటమే కాకుండా, నిద్ర గాఢతను కూడా మెరుగుపరుస్తుంది. టీ మానేసిన తర్వాత రాత్రిపూట తరచుగా వచ్చే నిద్రలేమి సమస్య కూడా తగ్గుతుందని చాలా మంది చెబుతారు. ఎసిడిటి, గ్యాస్.. ఎక్కువగా టీ తాగడం వల్ల కడుపులో ఆమ్లం ఉత్పత్తి పెరిగి, అసిడిటీ, గుండెల్లో మంట, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఖాళీ కడుపుతో టీ తాగడం జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. టీ మానేయడం వల్ల, కడుపులోని ఆమ్లం బ్యాలెన్స్ మెరుగుపడి, జీర్ణక్రియ క్రమంగా సాధారణ స్థితికి వస్తుంది. దీనివల్ల కడుపు తేలికగా, సౌకర్యవంతంగా అనిపిస్తుంది. దంత ఆరోగ్యం.. టీలోని టానిన్లు దంతాలు మరకలు పడటానికి . పసుపు రంగులోకి మారడానికి కారణమవుతాయి. ఎక్కువ కాలం పాటు అధికంగా టీ తాగడం వల్ల దంతాల మెరుపు తగ్గుతుంది. టీ మానేయడం వల్ల దంతాలపై కొత్తగా మరకలు ఏర్పడటం తగ్గి, నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. క్రమం తప్పకుండా బ్రష్ చేయడం వల్ల దంతాలు శుభ్రంగా, ఆరోగ్యంగా కనిపిస్తాయి. ఒత్తిడి, ఆందోళన.. అధిక మోతాదులో కెఫిన్ తీసుకోవడం వల్ల శరీరంలో ఒత్తిడి హార్మోన్లు పెరిగి, ఆందోళన, చంచలత్వం , భయం వంటి సమస్యలు ఏర్పడతాయి. టీ మానేసిన తర్వాత మనసు మరింత ప్రశాంతంగా ఉంటుంది, అలాగే మూడ్ స్వింగ్స్ కూడా తగ్గుతాయి. ఇది మానసిక స్థిరత్వాన్ని, ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. చర్మం.. టీకి బదులుగా నీరు , ఆరోగ్యకరమైన పానీయాలు తీసుకోవడం వల్ల, టీ మానేయడం వల్ల శరీరం మరింత హైడ్రేటెడ్‌గా ఉండటానికి సహాయపడుతుంది. తేమ పెరగడం వల్ల చర్మం మరింత కాంతివంతంగా, తాజాగా కనిపిస్తుంది. శరీరంలోని విషపదార్థాలను తగ్గించడం వల్ల పొడిబారడం, కాంతిహీనత వంటి చర్మ సమస్యలను కూడా నయం అయ్యి, చర్మం మెరుపు పెరుగుతుంది. గుండె ఆరోగ్యం.. అధికంగా కెఫిన్ తీసుకోవడం కొంతమందిలో రక్తపోటు , హృదయ స్పందన రేటుపై ప్రభావం చూపుతుంది. టీ తాగడాన్ని తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం వల్ల గుండెపై ఒత్తిడి తగ్గి, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది దీర్ఘకాలంలో గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆహార నిపుణులు, వైద్యులు చెబుతారు. *రూపశ్రీ.
read moreకుక్కర్‌లో ప్రతి ఫుడ్‌ని ఉడికించేస్తున్నారా? అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి
కుక్కర్‌లో ప్రతి ఫుడ్‌ని ఉడికించేస్తున్నారా? అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి మనం తినే ఆహారాన్ని ఎంత ఎక్కువగా ఉడికిస్తే అంత మంచిదని చాలామంది భావిస్తుంటారు. కానీ అధికంగా ఉడికించడం వల్ల కొన్ని పోషకాలు తగ్గిపోయే అవకాశం ఉంటుందని ప్రముఖ సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్, హోలిస్టిక్ లైఫ్‌స్టైల్ నిపుణురాలు శ్రీదేవి జాస్తి ఈ ఇంటర్వ్యూలో వివరించారు. ప్రతిరోజూ తినే ఆహారంలో కొంత భాగమైనా రా ఫుడ్‌కు కేటాయించాలని ఆమె సూచిస్తున్నారు. ముఖ్యంగా మొలకలు (Sprouts), తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు వంటి సహజ ఆహారాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు మరింత సహజ రూపంలో అందుతాయని ఆమె చెబుతున్నారు. అలాగే ప్రతి ఆహార పదార్థాన్ని ప్రెషర్ కుక్కర్‌లో ఎక్కువసేపు ఉడికించడం అలవాటుగా మార్చుకోవద్దని, ఏ ఆహారాన్ని ఎలా తీసుకుంటే శరీరానికి ఎక్కువ ప్రయోజనం ఉంటుందో తెలుసుకుని ఆ విధంగా వంట చేయాలని సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, సహజ ఆహారం, సరైన వంట విధానాలు, రోజువారీ డైట్‌లో రా ఫుడ్ ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ వీడియో ఉపయోగపడుతుంది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
read moreజాగ్రత్త మగాళ్లలో ఈ అలవాట్లు ఉంటే పిల్లలు పుట్టడం కష్టమవుతుంది!
పెళ్లయ్యాక ప్రతి భార్యాభర్త పిల్లలను కనడంపై శ్రద్ద పెడతారు. పిల్లలను కనడం, అమ్మ నాన్న అనిపించుకోవడం జీవితంలో ఒక మధురమైన అనుభూతిగా భావిస్తారు. అయితే నేటికాలంలో ఆడవారు మాత్రమే కాకుండా మగవారు కూడా పిల్లలను కనడంలో ఇబ్బందులు ఎదుర్కుంటూ ఉంటారు. ఆడవారిలో గర్బం నిలవకపోవడం లాగానే.. మగవారిలో వీర్యకణాల సమస్య వంటివి పిల్లలు పుట్టడంలో ఆటంకాలు కలిగిస్తాయి. కొందరికి వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉండటం, మరికొందరికి వీర్యం సరిగా ఉత్పత్తి కాకపోవడం లాంటి చాలా సమస్యలు కూడా ఉంటాయి. అయితే మగవారిలో కొన్ని అలవాట్లు వారిలో సంతాన అవకాశాలు తగ్గించేస్తాయని వైద్యులు చెబుతున్నారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. వేడి అసలు కారణం.. జీవశాస్త్రపరమైన కారణం వల్ల వృషణాలు శరీరం వెలుపల ఉంటాయని వైద్యులు చెబుతారు. వీర్య కణాల ఉత్పత్తి ఉత్తమంగా జరగాలంటే , వృషణాల ఉష్ణోగ్రత శరీర అంతర్గత ఉష్ణోగ్రత కంటే సుమారు 2 నుండి 4°C తక్కువగా ఉండాలట. ఆ ఉష్ణోగ్రత వ్యత్యాసం కొద్దిగా తగ్గినా కూడా, అది సంతానోత్పత్తిపై ప్రభావం చూపిస్తుందట. వృషణాల ఉష్ణోగ్రత పెరగడం వల్ల, వీర్య కణాలను ఉత్పత్తి చేసే కణాలు చనిపోవడం జరుగుతుందట. ఆక్సీకరణ ఒత్తిడి పెరిగి, వీర్యకణాల DNA దెబ్బతింటుందట. భారతీయ పురుషులలో వీర్యకణాల సంఖ్య తగ్గడానికి వేడికి గురికావడం, బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం వంటి రోజువారీ అలవాట్లు ముఖ్య కారణాలని చెబుతున్నారు. ఒడిలో ల్యాప్టాప్.. చాలా మంది మగవాళ్లు ల్యాప్‌టాప్‌ను నేరుగా తమ తొడలపై ఉంచుకుని గంటల తరబడి పనిచేస్తుంటారు. దీనివల్ల ఉత్పన్నమయ్యే వేడి, కాలక్రమేణా వృషణాల ఉష్ణోగ్రతను గణనీయంగా పెంచడానికి దారితీస్తుంది. కానీ వేడి ఒక్కటే సమస్య కాదు, ల్యాప్‌టాప్‌ను ఎక్కువసేపు ఒడిలో పెట్టుకోవడం , ఫోన్‌ను ప్యాంటు జేబులో ఉంచుకోవడం వల్ల విద్యుదయస్కాంత వికిరణానికి గురై పిల్లలు పుట్టడంలో సమస్యలు పెరగవచ్చట. లోదుస్తులు, జీన్స్.. బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించే పురుషులతో పోలిస్తే, వదులుగా ఉండే బాక్సర్ షార్ట్స్ ధరించే పురుషులలో మొత్తం వీర్య కణాల సంఖ్య 17% ఎక్కువగా , చురుకుగా ప్రయాణించే వీర్య కణాలు 33% ఎక్కువగా ఉంటాయని పరిశోధనలు తేల్చాయి. స్కిన్నీ లేదా బిగుతుగా ఉండే జీన్స్ పరిస్థితిని మరింత దిగజార్చుతాయని ఆయన ఇంకా తెలిపారు. అవి రోజంతా వృషణ ప్రాంతాన్ని శరీరానికి దగ్గరగా నొక్కి ఉంచుతాయి, దీనివల్ల వేడి లోపలే నిలిచిపోయి, శరీరం ఉష్ణోగ్రత నియంత్రణకు అవకాశం లేకుండా పోతుంది. ఎప్పుడూ అవే ధరించడం వల్ల, కాలక్రమేణా ఈ ప్రభావం పెరిగి సంతానలేమి సమస్యలకు దారితీస్తుంది. సహాయపడే మార్పులు.. వదులుగా ఉండే బాక్సర్ షార్ట్‌లకు మారడం, ఫోన్‌ను ప్యాంటు జేబులో పెట్టుకోవడాన్ని అవాయిడ్ చేయడం మంచిది. ల్యాప్‌టాప్‌ను ఒడిలో కాకుండా బల్లపై ఉంచుకోవడం మంచిది. వేడి ప్రాంతాలలో ఎక్కువ సేపు గడపకుండా ఉండటం కూడా మేలు చేస్తుంది. *రూపశ్రీ.
read moreజిమ్ లేదా యోగా.. గుండె ఆరోగ్యానికి ఏది బెస్ట్ అంటే!
నేటి కాలంలో ప్రపంచవ్యాప్తంగా గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అందువల్ల, వైద్యులు క్రమం తప్పకుండా వ్యాయామం చేయమని చెబుతుంటారు. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చాలామంది జిమ్ చేస్తుంటారు, మరికొందరు యోగా చేస్తుంటారు. గుండె ఆరోగ్యం కోసం కొత్తగా వ్యాయామం మొదలు పెట్టాలని అనుకునేవారు జిమ్ చేయాలా, యోగా చేయాలా అని గందరగోళానికి గురవుతూ ఉంటారు. కొంతమంది జిమ్‌లో వ్యాయామం చేయడానికి ఇష్టపడితే, మరికొందరు యోగానే ఉత్తమ పద్ధతిగా భావిస్తారు. ఫిట్‌నెస్ నిపుణుల అభిప్రాయం ప్రకారం జిమ్ లేదా యోగా.. ఈ రెండింటిలో గుండె ఆరోగ్యానికి ఏది బాగుంటుంది? తెలుసుకుంటే.. జిమ్ లేదా యోగా ఏది మంచిది? గుండెను కాపాడుకోవడానికి జిమ్ , యోగా రెండూ అవసరమైనవే. అయితే, అవి పనిచేసే పద్ధతులు భిన్నంగా ఉంటాయి. ఒకదానిని మించి మరొకటి ఎంచుకోవడం కంటే, రెండింటినీ ఫిట్‌నెస్ లైఫ్ స్టైల్ లో చేర్చుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. వ్యాయామం వల్ల గుండెకు కలిగే ప్రయోజనాలు.. వేగంగా నడవడం, జాగింగ్, సైక్లింగ్, రోయింగ్ , స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వంటి జిమ్ వ్యాయామాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. క్రమం తప్పకుండా చేసే వ్యాయామం గుండెను బలపరుస్తుంది , శరీరమంతటా రక్తాన్ని ప్రసరింపజేయడంలో సహాయపడుతుంది. జిమ్ వర్కౌట్లు గుండె పనితీరును మెరుగుపరుస్తాయి, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి , కొలెస్ట్రాల్‌ను సమతుల్యం చేస్తాయి. అవి బరువును అదుపులో ఉంచడంలో కూడా సహాయపడతాయి. తద్వారా గుండె జబ్బులు , పక్షవాతం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అవి స్టామినాను బాలెన్స్ ను కూడా పెంచుతాయి. క్రమం తప్పకుండా కార్డియో వ్యాయామాలు చేస్తే గుండెను బలపరుస్తాయని , శరీరమంతటా ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని పంప్ చేసే ప్రక్రియను సులభతరం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. యోగా ఎందుకు ముఖ్యం..? యోగా శరీర సౌలభ్యాన్ని మెరుగుపరచడం, సరైన శ్వాస, బాలెన్స్ ను కాపాడుకోవడం , మానసిక ప్రశాంతతపై దృష్టి పెడుతుంది. కార్డియో వ్యాయామాల మాదిరిగానే యోగా ఏరోబిక్ ఫిట్‌నెస్‌ను అందిస్తుంది. అయితే యోగా గుండె ఆరోగ్యానికి ఇంకా అనేక విధాలుగా కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. యోగా ఒత్తిడి , ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. యోగా ఒత్తిడి హార్మోన్లను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది శరీర సౌలభ్యాన్ని , శరీరాకృతిని మెరుగుపరుస్తుంది, శ్వాస సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది , మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది. గుండె జబ్బులకు ఒత్తిడి ఒక ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. యోగా మనస్సును , నాడీ వ్యవస్థను ప్రశాంతపరచడం ద్వారా ఈ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. కేవలం యోగాతో గుండె ఆరోగ్యం బాగుంటుందా? యోగా వల్ల అనేక శారీరక, మానసిక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, గుండె సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపరచడానికి అవసరమైన ఏరోబిక్ వ్యాయామాన్ని కేవలం యోగా మాత్రమే శరీరానికి అందించలేదు. ఈ విషయాన్ని ఆరోగ్య నిపుణులే చెబుతున్నారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం, ఆరోగ్యంగా ఉన్నవారు ప్రతి వారానికి కనీసం 150 నిమిషాల పాటు వేగంగా నడవడం, జాగింగ్ లేదా సైక్లింగ్ వంటి మధ్యస్థం నుండి తీవ్రత గల వ్యాయామం చేయాలి. మెరుగైన ఫిట్‌నెస్ , గుండె ఆరోగ్యం కోసం యోగాను ఇతర శారీరక కార్యకలాపాలతో కలిపి చేయడం మంచిది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి వ్యాయామం చేయాలి? జిమ్ , యోగాలో ఒకదాన్ని ఎంచుకోవాల్సిన అవసరం లేదని గుండె ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఫిట్‌నెస్ దినచర్యలో రెండింటినీ చేర్చుకోవడం మంచిదట. ఒక బాలెన్స్డ్ ఫిట్‌నెస్ ప్రణాళికలో వేగంగా నడవడం, జాగింగ్, సైక్లింగ్ లేదా ఈత వంటి ఏరోబిక్ వ్యాయామాలు, వారానికి కనీసం రెండు రోజులు స్ట్రెం్ ట్రైనింగ్, కోలుకోవడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా ఉంటాయి. ప్రతిరోజూ స్ట్రెచింగ్ , శ్వాస వ్యాయామాలను కూడా చేర్చుకోవాలి. ఈ దినచర్య గుండె ఆరోగ్యాన్ని, కండరాల ఆరోగ్యాన్ని , మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. *రూపశ్రీ.
read more


.webp)



















