ప్రస్తుతకాలంలో చాలామందిలో న్యూరోపతి సమస్య కనిపిస్తోంది. శరీరంలోని నరాలు బలహీనంగా మారడం, శరీరంలో పట్టు తగ్గడం, కాళ్లూ చేతులు మొదలైన ప్రాంతాలలో చీమలు పాకినట్టు అనుభూతి కలగడం, చేతులు వనకడం ఇలా చాలా లక్షణాలు న్యూరోపతి సమస్యలో కనిపిస్తాయి. ఈ న్యూరోపతి సమస్యను మొదట్లోనే గుర్తించి దాన్ని పరిష్కరించడం ఎంతో అవసరం. లేకపోతే ఇది మొత్తం శరీరం మీద చాలా దారుణమైన ప్రభావం చూపిస్తుంది. అయితే అసలు ఈ న్యూరోపతి సమస్య ఎందుకు వస్తుంది? ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
న్యూరోపతి ఎందుకు వస్తుంది?
శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా ఉత్పత్తి అయితే అది న్యూరోపతి సమస్యకు దారితీస్తుంది. జంక్ ఫుడ్, నూడిల్స్, బర్గర్లు, పిజ్జా, బేకింగ్ ఆహారాలు, చక్కెర అధకంగా ఉన్న ఆహారాలు తింటుంటే న్యూరోపతి సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ప్రతి ఒక్కరూ ఆహారం తిన్న ప్రతిసారి లేదా అనారోగ్యం చేసినప్పుడు, శరీరంలో నొప్పులు, వాపులు వంటివి సంభవించినప్పుడు శరీరంలో ఫ్రీరాడికల్స్ తయారవుతాయి. ఇవి శరీరానికి హాని కలిగిస్తాయి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఆహారం తిన్న తరువాత శరీరంలో రెండు రకాల అణువులు ఏర్పడతాయి. వాటిలో ఒకటి ఫ్రీరాడికల్స్ కాగా.. రెండవది యాంటీ ఆక్సిడెంట్లు. కానీ ఆహారం తిన్న తరువాత ఫ్రీరాడికల్స్ ఎక్కువగా ఏర్పడినా, అవి యాంటీఆక్సిడెంట్లను కూడా డామినేట్ చేసినా ఫ్రీరాడికల్స్ ప్రభావం శరీరం మీద ఎక్కువ ఉంటుంది. సాధారంగా వచ్చే దగ్గు, జలుబు, ఫ్లూ వంటి సమస్యలు ఈ ఫ్రీ రాడికల్స్ వల్లే వస్తాయి. ఆహారం విషయంలో మార్పులు చేసుకోకపోతే ఇది క్రమంగా న్యూరోపతి సమస్యకు దారితీస్తుంది.
న్యూరోపతి సమస్య రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే..
న్యూరోపతీ సమస్య రాకుండా ఉండాలంటే ప్రతి రోజూ కనీసం 1 గంట శారరీక శ్రమ అవసరం. ఇందులో చురుకైన నడక, యోగా, వ్యాయామం, ఇతర పనులు కూడా ఉండవచ్చు. వీటి వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది.
యాంటీఆక్సిడెంట్ల కంటే శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఎక్కువ ఉండటం వల్ల నరాల సమస్య వస్తుంది కాబట్టి దీన్ని అరికట్టడానికి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, ఆకుపచ్చ ఆకుకూరలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న ఇతర ఆహారాలు తీసుకోవాలి. సాధారణంగా న్యూరోపతి సమస్య ఉందని అనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వీలైంత తొందరగా న్యూరోపతీ వైద్యుడిని కలవడం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.
*నిశ్శబ్ద.