రాతి ఉప్పును ఎవరు తినకూడదు? ఇది ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తుందా?
రాతి ఉప్పును ఎవరు తినకూడదు? ఇది ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తుందా? ఆహారంలో ఉప్పు వేయడం తప్పనిసరి. ఉప్పు లేని వంట తినడం సాధ్యమే కాదు.. అయితే ఉప్పులో కూడా చాలా రకాలు ఉన్నాయి. వీటిలో రాతి ఉప్పును ఆరోగ్యకరమైన ఎంపికగా పరిగణిస్తారు. ముఖ్యంగా సాధారణ ఉప్పును తినకూడని సమయంలో రాతి ఉప్పును ఎక్కువగా వాడతారు. కొందరు ఉపవాస సమయంలో ఉప్పు తినకూడదు అనే నియమం ఉన్నప్పుడు సాధారణ ఉప్పుకు బదులుగా రాతి ఉప్పు ఆహారంలో వినియోగిస్తారు. కొందరు రాతి ఉప్పును రెగ్యులర్ గా వినియోగిస్తారు. రాతి ఉప్పుతో తయారు చేసిన ఆహారం జీర్ణక్రియకు మంచిదని చెబుతారు. కానీ రాతి ఉప్పు అందరికీ ప్రయోజనకరంగా ఉండదని చాలామందికి తెలియదు. మరీ ముఖ్యంగా కొందరు ఈ రాతి ఉప్పును అస్సలు తినకపోవడం మంచిది. ఇంతకీ రాతి ఉప్పు ఎవరు తినకూడదు? తెలుసుకుంటే.. బిపి పేషెంట్లు.. రాతి ఉప్పులో సోడియం ఉంటుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. అధిక రక్తపోటు ఉన్న రోగులు దీనిని తక్కువగా తీసుకోవాలి లేదా అస్సలు తీసుకోకపోవడం మంచిది. గుండె జబ్బులు ఉన్నవారు.. సోడియం అధికంగా తీసుకోవడం ప్రమాదకరం. రాతి ఉప్పు రక్తపోటు, శరీరంలో ద్రవాల నిలుపుదల పెంచడం ద్వారా గుండెపై ఒత్తిడిని కలిగిస్తుంది. అందుకే గుండె సమస్యలు ఉన్నవారు.. లేదా కుటుంబంలో గుండె సంబంధం సమస్యల చరిత్ర ఉన్నవారు రాతి ఉప్పు దగ్గర జాగ్రత్తగా ఉండాలి. కిడ్నీ రోగులు.. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే శరీరం నుండి అదనపు సోడియం తొలగించబడదు. ఇలా మూత్ర పిండాల సమస్య ఉన్నవారు రాతి ఉప్పు తింటే మూత్రపిండాల పరిస్థితిని మరింత దిగజారుతుంది. షుగర్ పేషెంట్లు.. రాతి ఉప్పు ఎక్కువగా వినియోగించడం మధుమేహ రోగులకు హానికరం. ఇది రక్తపోటు, చక్కెర స్థాయిని ప్రభావితం చేస్తుంది. థైరాయిడ్ రోగులు.. థైరాయిడ్ రోగులకు అయోడిన్ అవసరం. అయితే రాతి ఉప్పులో అయోడిన్ ఉండదు. దీని కారణంగా, థైరాయిడ్ అసమతుల్యత పెరుగుతుంది. గర్భిణీ స్త్రీలు.. గర్భధారణ సమయంలో మహిళలు సోడియం, అయోడిన్ సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. రాతి ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల తల్లి, బిడ్డ ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. వృద్ధులు.. వృద్ధులకు తరచుగా అధిక రక్తపోటు, మధుమేహం లేదా గుండె సంబంధిత సమస్యలు ఉంటాయి. రాతి ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల వారి మొత్తం ఆరోగ్యం చెడిపోతుంది. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreఅరటిపండును పాలతో కలిపి తింటే ఈ నష్టాలు తప్పవట..!
అరటిపండు.. అందరికి సులువుగా దొరికే పండు. సీజన్ తో సంబంధం లేకుండా అరటిపండ్లు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. రోజుకు ఒక అరటిపండు తినడం ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు వైద్యులు. అరటిపండ్లు చిన్న పిల్లల నుండి వృద్దుల వరకు అందరూ సులువుగా తినడానికి అనువుగా ఉంటాయి. చాలామంది అరటిపండును ఉదయాన్నే అల్పాహారంగానో లేదా ఉదయం తీసుకునే ప్రోటీన్ డ్రింక్స్ లోనూ వాడుతుంటారు. ముఖ్యంగా అరటిపండును పాలతో కలిపి తీసుకోవడం చాలా మంది అలవాటు. మిల్క్ షేక్ అయితే ఎడాపెడా తాగేస్తారు. అరటిపండును పాలతో కలిపి తీసుకోవడం అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే.. జీర్ణసమస్యలు.. అరటిపండును పాలతో కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఆయుర్వేదం ప్రకారం పాలు, అరటిపండు రెండూ బరువుగా ఉండే పదార్థాలు. రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల జీర్ణాశయంపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. ఉబ్బరం, గ్యాస్ లేదా మలబద్దకానికి కారణం అవుతుంది. కఫం.. అరటిపండు, పాలు రెండింటిని కలిపి తీసుకుంటే కఫం ఏర్పడుతుందట. ఈ రెండింటి కాంబినేషన్ అంత మంచిది కాదని అంటున్నారు. కఫ శరీరం ఉన్నవారు ఈ కాంబినేషన్ ను అస్సలు ట్రై చేయకపోవడమే మంచిది. కఫం పెరిగితే జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తాయి. అలెర్జీలు, సైనస్.. అరటిపండు, పాలు కాంబినేషన్ కొంతమందికి అలెర్జీలు రావడానికి కారణం అవుతుందని అంటున్నారు. శరీరంపై దద్దుర్లు, దురద వంటి సమస్యలు వస్తాయి. ఇది మాత్రమే కాకుండా సైనస్ రద్దీని ఈ కాంబినేషన్ పెంచుతుందట. ఇప్పటికే సైనస్ సమస్యలు ఉన్నవారికి ఈ కాంబినేషన్ అస్సలు మంచిది కాదు. నీరసం.. పాలు, అరటిపండు రెండూ శక్తివంతమైనవే.. ఇవి రెండూ శరీరానికి మంచి శక్తిని ఇస్తాయి. కానీ ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరం భారంగా మారుతుందని, ఇది నీరసం ఫీలింగ్ పెంచుతుందని అంటున్నారు. ఒళ్లంతా భారంగా అనిపించడం వల్ల బాగా నీరసంగా అనిపిస్తుందని కొందరు అనుభవాల ద్వారా పంచుకున్నట్టు వైద్యులు పేర్కొన్నారు. రక్తంలో చక్కెర.. అరటిపండులో చక్కెర శాతం అధికంగా ఉంటుంది. ఇక పాలలో కూడా గ్లూకోజ్ ఉంటుంది. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర శాతం పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. నేటికాలంలో డయాబెటిస్ సమస్యలు పెరుగుతున్న దృష్ట్యా.. ఈ కాంబినేషన్ కు దూరంగా ఉండటం మంచిది. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreవిటమిన్-డి మోతాదు మించితే పాయిజన్‌గా మారుతుందా?
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆహారం ద్వారా విటమిన్లు, ఖనిజాలు క్రమం తప్పకుండా అవసరం. ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్లలో విటమిన్ డి ఒకటి. ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ శరీరానికి విటమిన్-డి అందేలా చూసుకోవాలి. ఇది వాస్తవానికి సూర్యరశ్మి ద్వారా శరీరం తయారు చేసుకునే విటమిన్. విటమిన్ డి మన ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఇది ఎముకలకు చాలా అవసరం. విటమిన్ డి ఎముకలను బలంగా ఉంచుతుంది, పగుళ్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కండరాలు సరిగ్గా పనిచేస్తాయి, బలహీనత ఉండదు. శరీర రోగనిరోధక శక్తిని పెంచడానికి, అంటు వ్యాధుల నుండి రక్షించడానికి, మెదడు పనితీరును మెరుగుపరచడానికి, ప్రతిరోజూ తగినంత పరిమాణంలో విటమిన్-డి అవసరం. కానీ విటమిన్ డి ఎంత ముఖ్యమో, దాని మోతాదు మించితే అంతే హానికరం అని చాలామందికి తెలియదు. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. విటమిన్-డి మోతాదు మించితే కలిగే ప్రమాదం.. ఆరోగ్యకరమైన వయోజన వ్యక్తికి ప్రతిరోజూ దాదాపు 400–800 IU (10–20 మైక్రోగ్రాములు) విటమిన్ డి సరిపోతుంది. క్రమం తప్పకుండా ఈ పరిమాణం కంటే ఎక్కువ విటమిన్ డి తీసుకుంటే శరీరం అనేక రకాల నష్టాలకు గురయ్యే ప్రమాదం ఉంది. దీనిని విటమిన్ డి టాక్సిసిటీ అంటారు. సాధారణంగా ఒక వ్యక్తి ఎక్కువ కాలం అవసరమైన దానికంటే ఎక్కువ సప్లిమెంట్లను తీసుకున్నప్పుడు విటమిన్ డి టాక్సిసిటీ ప్రమాదం వస్తుంది. ఆహారం ద్వారా ఈ ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో కాల్షియం మొత్తాన్ని పెంచుతుంది. ఫలితంగా మళ్లీ మళ్లీ దాహం వేస్తుంది, వాంతులు అవుతాయి. అంతేకాకుండా, బలహీనత, తలతిరుగుడు, మూత్రపిండాల వైఫల్యం ప్రమాదం పెరుగుతుంది. హైపర్‌కాల్సెమియా వల్ల మూత్రపిండాల నష్టం.. శరీరంలో విటమిన్ డి పరిమాణం చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, అది రక్తంలో కాల్షియం స్థాయిని పెంచుతుంది. దీనిని హైపర్‌కాల్సెమియా అంటారు. అధిక కాల్షియం కారణంగా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. మూత్రపిండాల పనితీరు తగ్గుతుంది. విటమిన్-డి మోతాదు మించితే జరిగేది ఇదే.. జీర్ణక్రియకు ఆటంకం.. శరీరంలో విటమిన్ డి స్థాయిలు పెరగడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. విటమిన్ డి స్థాయిలు పెరగడం వల్ల శరీరంలో కాల్షియం స్థాయిలు పెరుగుతాయి. ఇది జీర్ణ సమస్యలు, విరేచనాలు, అపానవాయువుకు కారణమవుతుంది. విటమిన్ డి సప్లిమెంట్ల అధిక మోతాదు వికారం, వాంతికి కారణమవుతుంది. మెదడుపై ప్రభావం.. కాల్షియం స్థాయిలు పెరగడం వల్ల మెదడు కూడా ప్రభావితమవుతుంది. దీని కారణంగా తరచుగా తల బరువుగా అనిపించడం, తల తిరగడం, ఏకాగ్రత పెట్టలేకపోవడం వంటి సమస్యలు ఉండవచ్చు. అలాంటి వ్యక్తులు మళ్లీ మళ్లీ ఏదైనా విషయాన్ని మర్చిపోవడం జరుగుతుంది. చిరాకు, విశ్రాంతి లేకపోవడం పెరుగుతుంది. తీవ్రమైన పరిస్థితులలో గందరగోళానికి గురవడం లేదా కోమాలోకి వెళ్ళడం కూడా జరగవచ్చు. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreజాగ్రత్త ఈ సమస్యలు ఉన్నవారు వంకాయ తింటే డేంజర్..!
వంకాయ చాలామందికి ఇష్టమైన కూరగాయ. వంకాయను ఎలా వండినా టేస్ట్ అద్దిరిపోతుంది. తాజా కూరలలో రాజా ఎవరండీ అని వంకాయ మీద పాట రాశారు.. అలాగే వంకాయ వంటి కూర.. పంకజ ముఖి సీత వంటి భామామణి అంటూ పద్యం కూడా రాశారు. ఇలా వంకాయ క్రేజ్ చాలా పెద్దదే.. అయితే వంకాయను అందరూ తినడం అంత మంచిది కాదు.. కొన్ని సమస్యలు ఉన్నవారు వంకాయకు ఎంత దూరం ఉంటే అంత మంచిది. సరదా పడి తిన్నారంటే ఆ తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇంతకీ వంకాయకు దూరంగా ఎవరు ఉండాలి? ఎందుకని? పూర్తీగా తెలుసుకుంటే.. వంకాయలో అధికమొత్తంలో ఆక్సలేట్ ఉంటుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది. వంశపారంపర్యంగా కిడ్నీలో రాళ్లు, కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడేవారు వంకాయ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వంకాయ తింటే కొందికి అలెర్జీ వస్తుంది. ఇది దురద, వాపు, శ్వాస సంబంధ సమస్యలను కూడా కలిగిస్తుంది. అందుకే వంకాయ తినేముందు ఆరోగ్య సమస్య విషయంలో ఆలోచించుకోవాలి. చాలామందికి తెలియదు కానీ.. వంకాయ తింటే గ్యాస్, ఉబ్బరం సమస్యలు పెరుగుతాయి. ఇప్పటికే గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు వంకాయ తినేముందు ఆలోచించాలి. మరీ ముఖ్యంగా తినాలనుకున్నా సరే.. పరిమిత పరిమాణంలో మాత్రమే తినాలి. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా వంకాయను వైద్యుల సలహా మీద మాత్రమే తినడం మంచిది. వంకాయలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి రక్తపోటు సమస్య ఉన్నవారు.. రక్తపోటు సమస్య కోసం మందులు వాడేవారు వంకాయలు ఎక్కువగా తినకూడదు. వంకాయలలో సోలననిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది కీళ్లలో నొప్పి, వాపు పెంచడంలో సహాయపడుతుంది. సాధారణంగా పెద్దలు అంటూ ఉంటారు.. వంకాయలు ఎక్కువ తినకు వాతం పెరుగుుతంది అని. ఇది ఆ కోవకు చెందినదే.. ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారు వంకాయను ఎంత తక్కువ తింటే అంత మంచిది. వంకాయలను ఎక్కువగా తినడం వల్ల శరీరంలో సోడియం, పొటాషియం స్థాయిల సమతుల్యత దెబ్బ తింటుంది. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreమగాళ్లు ఈ ఆహారం తీసుకుంటే స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది..!
నేటి మారుతున్న జీవనశైలిలో, పురుషులలో వంధ్యత్వ సమస్య వేగంగా పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం స్పెర్మ్ కౌంట్ తగ్గడం. ఈ సమస్య దంపతుల తల్లిదండ్రులు కావాలనే కలను నెరవేరకుండా చేయడమే కాకుండా, పురుషుల ఆత్మవిశ్వాసాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. తరచుగా ఇది నయం చేయలేని సమస్య అని చాలామంది అనుకుంటారు. కానీ సరైన ఆహారం, జీవనశైలిని మార్చడం ద్వారా ఈ సమస్యను చాలా వరకు అధిగమించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆహారంలో కొన్ని చేర్చుకోవడం ద్వారా స్పెర్మ్ కౌంట్ ను, దాని నాణ్యతను మెరుగుపరచవచ్చు అని అంటున్నారు. ఇంతకీ మగాళ్లలో స్పెర్మ్ కౌంట్ పెరగడానికి, స్పెర్మ్ నాణ్యత పెరగడానికి సహాయపడే ఆహారాలు ఏంటో తెలుసుకుంటే.. శతావరి, అశ్వగంధ.. ఆయుర్వేదంలో శతావరి, అశ్వగంధకు చాలా ప్రాధాన్యత ఉంది. శతావరి, అశ్వగంధ రెండూ ఆయుర్వేద మూలికలు. ఇవి పురుషులకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. అశ్వగంధ ఒత్తిడిని తగ్గించడానికి, టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది. ఇది స్పెర్మ్ కౌంట్, స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరుస్తుంది. శతావరి పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. ఈ రెండింటి పొడిని ప్రతిరోజూ పాలు లేదా నీటితో తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. నిమ్మకాయ నీరు.. నిమ్మకాయ నీటిని ఒక సాధారణ పానీయంగా భావిస్తే పప్పులో కాలేసినట్టే.. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది స్పెర్మ్ నాణ్యతకు చాలా ముఖ్యమైనది. విటమిన్ సి అనేది స్పెర్మ్‌ను హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ప్రతి ఉదయం నిమ్మరసం కలిపిన ఒక గ్లాసు గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల శరీరంలో టాక్సిన్లను తొలగించడమే కాకుండా, స్పెర్మ్ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. వాల్నట్స్, బాదం.. వాల్‌నట్స్, బాదం పప్పులలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ E, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు స్పెర్మ్ నిర్మాణం, కార్యాచరణను మెరుగుపరుస్తాయి. అయితే యాంటీఆక్సిడెంట్లు వాటిని దెబ్బతినకుండా కాపాడతాయి. రోజూ గుప్పెడు వాల్‌నట్స్, బాదం పప్పులు తీసుకోవడం వల్ల స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. అరటిపండు.. అరటిపండ్లలో బ్రోమెలైన్, విటమిన్ బి అనే అరుదైన ఎంజైమ్ ఉంటుంది. ఇది పురుషుల సంతానోత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది స్పెర్మ్ నాణ్యతను, స్పెర్మ్ కౌంట్ను రెండింటినీ మెరుగుపరుస్తుంది. దీనితో పాటు అరటిపండు శక్తికి అద్భుతమైన మూలం. ఇది అలసటను కూడా తొలగిస్తుంది. తక్షణ శక్తిని ఇస్తుంది. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreకంటి శుక్లం గురించి ఈ అపోహలు తొలగించుకోండి..!
కంటిశుక్లం అనేది కంటికి ఉండే సహజ లెన్స్ మీద ఏర్పడే తెల్లని పొర. ఇది కనుపాప వెనుక ఉంటుంది. ఇది సాధారణంగా వయస్సుతో పెరిగి వృద్దులలో వస్తుంది. కాంతిని సరిగ్గా చూడలేకపోవడం, రంగుల విషయంలో గందరగోళం, రాత్రి సమయంలో చూడటంలో ఇబ్బంది వంటివి కంటిశుక్లం వల్ల ఎదురయ్యే సమస్యలు. కంటిశుక్లం దృష్టి లోపానికి గల ప్రధాన కారణాలలో ఒకటి. ముఖ్యంగా వృద్దాప్యం వచ్చాక కంటిశుక్లం ఆపరేషన్లు చేయించుకుంటూ ఉంటారు. కానీ ఈ కంటిశుక్లం గురించి చాలామంది చాలా అపోహల్లో ఉన్నారు. ఈ అపోహల కారణంగా చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కంటిశుక్లం గురించి అందరూ నమ్మే అపోహల గురించి తెలుసుకుంటే.. శస్త్రచికిత్సకు ముందు కంటిశుక్లం ముదిరిపోయి ఉండాలా? నేటికాలంలో కంటిశుక్లం శస్త్రచికిత్సకు కంటిశుక్లం ముదిరిపోయే దశకు చేరుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని ఆలస్యం చేసేకొద్ది ఆపరేషన్ ప్రక్రియ క్లిష్టంగా మారుతుంది. రోజువారీ జీవితం ప్రభావితం అవుతుంది. పైగా కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది. అదే కంటిశుక్లం ఇంకా ముదరకముందే ఆపరేషన్ చేయించుకుంటే సమస్య అంతగా ఉండదని వైద్యుల మాట. శస్త్రచికిత్స తర్వాత కంటిశుక్లం తిరిగి పెరుగుతుందా? తెల్లని పొరగా మారిన లెన్స్ తొలగించి దాని స్థానంలో కృత్రిమ లెన్స్ (ఐఓఎల్) అమర్చిన తర్వాత, కంటిశుక్లం తిరిగి రాదు. అయినప్పటికీ, పృష్ఠ క్యాప్సూల్ ఒపాసిఫికేషన్ (పిసిఒ) అని పిలువబడే పరిస్థితి నెలలు లేదా సంవత్సరాల తరువాత రావచ్చు. దీనిని లేజర్ విధానంతో సులభంగా చికిత్స చేయవచ్చు. వృద్ధులకు మాత్రమే కంటిశుక్లం వస్తుందా? వృద్ధాప్యంతో కంటిశుక్లం సర్వసాధారణం అయినప్పటికీ, డయాబెటిస్, గాయం, దీర్ఘకాలిక స్టెరాయిడ్ వాడకం, ధూమపానం, జన్యు కారణాలు వంటి కారకాల వల్ల యువతలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పుట్టుకతో కంటిశుక్లంతో పిల్లలు పుట్టే అవకాశాలు కూడా ఉంటాయట. కంటి చుక్కలు లేదా ఆహారంతో కంటిశుక్లం నయం చేయవచ్చా? కంటి చుక్కలు, హెర్బల్ నివారణలు లేదా ఆహార మార్పులతో కంటిశుక్లం తిప్పికొట్టవచ్చు లేదా నయం చేయవచ్చనే వాదనకు క్లినికల్ ఆధారాలు లేవట. కంటిశుక్లం రోగులలో దృష్టిని పునరుద్ధరించడానికి శస్త్రచికిత్స మాత్రమే సరైనది అని వైద్యుల మాట. కంటిశుక్లం శస్త్రచికిత్స ప్రమాదకరం లేదా బాధాకరంగా ఉంటుందా? కంటిశుక్లం శస్త్రచికిత్స అనేది ప్రపంచవ్యాప్తంగా సాధారణంగా నిర్వహించే సురక్షితమైన విధానాలలో ఒకటి. ఇది సాధారణంగా త్వరగా అయిపోతుంది. అనస్థీషియా కింద జరుగుతుంది. అసౌకర్యం కూడా తక్కువ. కొద్ది రోజుల్లోనే దృష్టి మెరుగుపడుతుంది. రెండు కళ్ళకు ఒకేసారి శస్త్రచికిత్స చేయాలా? కంటిశుక్లం శస్త్రచికిత్సలు సాధారణంగా కొన్ని రోజులు లేదా వారాల విరామంతో ఒకేసారి ఒక కంటికి చేస్తారు. మొదటి శస్త్రచికిత్స ఫలితాల ఆధారంగా మరొక కంటికి చికిత్సను చేయడానికి వైద్యులకు క్లారిటీ వస్తుంది. కంటిశుక్లం ముదిరి దృష్టి పూర్తిగా కోల్పోయే వరకు ఆపరేషన్ చేయించుకోకూడదా? కంటిశుక్లం ముదిరే వరకు ఉంటే అది లైఫ్ స్టైల్ కు చాలా ఇబ్బందికరంగా మారుతుంది. మొదట్లోనే సర్జరీ చేయించుకుంటే చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. కోలుకోవడానికి నెలలు పడుతుందా? నేటి కాలంలో జరిగే కంటిశుక్లం చికిత్స నుండి కోలుకోవడానికి నెలల సమయం అవసరం లేదు. తరచుగా ఒకటి లేదా రెండు వారాలలో సాధారణ జీవనశైలికి వచ్చేస్తారు. ఇది వ్యక్తిని బట్టి మారే అవకాశం ఉంటుంది. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreమీ ఊపిరితిత్తుల కెపాసిటీ ఎంత? ఇంట్లోనే ఇలా టెస్ట్ చేసుకోండి..!
మానవ శరీరంలో ఊపిరితిత్తులు చాలా ముఖ్యమైనవి. మనం పీల్చే గాలిని శుభ్రపరచడంలో ఊపిరితిత్తులదే కీలకమైన పాత్ర. ఊపిరితిత్తులు సక్రమంగా పనిచేయకపోతే శ్వాస క్రియకు ఇబ్బంది కలుగుతుంది. అయితే.. నేటికాలపు రద్దీ జీవితంలో అనేక వ్యాధుల ప్రమాదం పెరుగుతోంది. కలుషిత వాతావరణం కూడా దీనికి ప్రధాన కారణంగా పరిగణించబడుతుంది. దీని కారణంగా ఊపిరితిత్తులు ఎక్కువగా సఫర్ అవుతుంటాయి. గతంలో శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా వృద్ధులలో కనిపించేవి. కానీ ఇప్పుడు చిన్నవారు, పిల్లలు కూడా దీనికి బలైపోతున్నారు. గత రెండు దశాబ్దాలలో భారతదేశంతో సహా అనేక దేశాలలో ఉబ్బసం, దీర్ఘకాలిక అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD), ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి వ్యాధుల కేసులు వేగంగా పెరుగుతున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం వాయు కాలుష్యానికి సంబంధించిన వ్యాధుల కారణంగా 7 మిలియన్ల మంది మరణిస్తున్నారు. ఊపిరితిత్తుల పనితీరును ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉంటే చాలా వరకు సమస్యలను పెద్దవి కాకుండా చూసుకోవచ్చు. BOLT అనే విధానం ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని ఇంట్లోనే చెక్ చేసుకునేందుకు సహాయపడుతుంది. దీన్నెలా చేసుకోవాలో తెలుసుకుంటే.. BOLT అంటే బ్లడ్ ఆక్సిజన్ లెవల్ టెస్ట్ స్కోర్. దీని సహాయంతో ఊపిరితిత్తులు ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో, వాటికి ఏదైనా ప్రమాదం ఉందా అని తెలుసుకోవచ్చు. BOLT (బాడీ ఆక్సిజన్ లెవల్ టెస్ట్) అనేది కార్బన్ డయాక్సైడ్ టాలరెన్స్‌ను కొలిచే ఒక సులభమైన, సెల్ఫ్ టెస్ట్. శ్వాసను ఎంతసేపు హాయిగా పట్టుకోగలరో ఇది తెలియజేస్తుంది. శ్వాసను పట్టుకోగల సమయం ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని తెలుపుతుంది. 10 కంటే తక్కువ BOLT స్కోరు ఆందోళన చెందాల్సిన పరిస్థితి అని వైద్యులు అంటున్నారు. బోల్ట్ పరీక్ష ఎలా చేయాలి? ఈ పరీక్ష చేయడానికి ముందుగా ఎటువంటి ఆటంకాలు లేని నిశ్శబ్దమైన, సౌకర్యవంతమైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి. తరువాత శ్వాస తీసుకోవడానికి అనువుగా ఉండే భంగిమలో కూర్చోవాలి. సాధారణంగా దీర్ఘంగా శ్వాస తీసుకొని హాయిగా గాలిని వదిలివేయాలి. తరువాత ఇప్పుడు గాలి ఊపిరితిత్తులలోకి ప్రవేశించకుండా మీ వేళ్ళతో మీ ముక్కును మూసివేసి టైమర్‌ను ప్రారంభించాలి. ఊపిరి పీల్చుకోవాలనే తపన ప్రారంభమైనప్పుడు, ఛాతీ బిగుసుకుపోవడం ప్రారంభించినప్పుడు, టైమర్‌ను ఆపివేయాలి. శ్వాసను పట్టుకున్న సెకన్ల సంఖ్య బోల్ట్ స్కోరు అవుతుంది. ఈ పరీక్షను తక్కువ వ్యవధిలో రెండు లేదా మూడు సార్లు రిపీట్ చేసి, మూడు స్కోర్‌ల సగటును తీసుకోవాలి. బోల్ట్ స్కోర్ ఎంత ఉండాలి? ఎంత ఉండకూడదు? ఊపిరితిత్తుల ఆరోగ్యం గురించి ఈ స్కోరు ఏమి చెబుతుందంటే.. బోల్ట్ స్కోరు 20 సెకన్లు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఊపిరితిత్తులు బాగా పనిచేస్తున్నాయని సూచిస్తుంది. 10-20 సెకన్ల స్కోరు అంటే ఊపిరితిత్తుల ఆరోగ్యం సాధారణంగానే ఉంది కానీ మెరుగుదల అవసరం. 10 సెకన్ల కన్నా తక్కువ స్కోరు ఉంటే శ్వాస సామర్థ్యం బలహీనంగా ఉందని సూచిస్తుంది. ఇలాంటి వారు వైద్యుడిని సంప్రదించి ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించాలి. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreఉదయం ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా? ఈ షాకింగ్ నిజం తెలుసా?
ఉదయాన్నే ఇల్లు శుభ్రం చేసుకోవడం ఎంత కామనో.. పళ్లు తోమగానే కాఫీ లేదా టీ చేసుకుని తాగడం అంతే కామన్. ఇంట్లో చాలా వరకు కాఫీ, టీ లవర్స్ ఉంటారు. వీరికి బ్రష్ చేయకపోయినా సరే.. కాఫీ లేదా టీ మాత్రం టైంకి ఖచ్చితంగా ఉండాల్సిందే. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో టీ ప్రియులు ఎక్కువైపోయారు. కాఫీ నుంచి టీకి జంప్ అవుతున్నవారు కూడా ఉంటారు. మొత్తానికి నగరాల నుండి గ్రామాల వరకు టీ హడావిడి ఎక్కువ. వివిధ ప్రాంతాల నుండి దిగుమతి అయ్యే టీ ఆకులతో టీ చేసుకుని ఆస్వాదించాలంటే చాలా ఇష్టం చూపిస్తుంటారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగడం చాలామంది అలవాటు. కానీ ఇది ఆరోగ్యానికి మంచిదేనా అనే ఆలోచన మాత్రం చాలామంది చేయరు. అసలు ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగడం ఆరోగ్యానికి ఎంతవరకు మంచిది? దీని గురించి తెలుసుకుంటే.. ఖాళీ కడుపుతో టీ.. ఉదయం ఖాళీ కడుపుతో ఏమి తిన్నా, తాగినా అది ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. అందుకే చాలామంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో నిమ్మరసం, ఉసిరి రసం వంటి వాటిని గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకుంటారు. అయితే చాలా మంది ఖాళీ కడుపుతో టీ తాగుతుంటారు. టీలో ఉండే కెఫిన్, టానిన్ వంటివి కడుపులో ఆమ్లాన్ని పెంచుతాయి. దీని కారణంగా రోజంతా కడుపులో బరువుగా లేదా గ్యాస్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కడుపు ఖాళీగా ఉన్నప్పుడు టీ తాగితే అది నేరుగా కడుపు లోపలి పొరను ప్రభావితం చేస్తుంది. ఇది చికాకు, గ్యాస్, అల్సర్ వంటి సమస్యలను కలిగిస్తుంది. కడుపు పూతలు.. ఖాళీ కడుపుతో టీ తాగినప్పుడు టీలో ఉండే టానిన్, కెఫిన్ కడుపులోని ఆమ్లాన్ని పెంచుతాయి. సాధారణంగా కడుపులో కొద్ది మొత్తంలో ఆమ్లం ఉంటుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. కానీ ఖాళీ కడుపుతో టీ తాగితే ఈ ఆమ్లం ఎక్కువ పరిమాణంలో ఏర్పడుతుంది. ఇది కడుపు లోపలి పొరలో చికాకు కలిగిస్తుంది. ఇది చాలా కాలం పాటు జరిగితే కడుపు గోడ బలహీనపడి అల్సర్ వంటి వ్యాధులకు కారణమవుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగే అలవాటు ఉన్నవారికి అసిడిటీ, గ్యాస్ట్రిటిస్ వంటి సమస్యలు ఎక్కువగా ఉండటం గమనించవచ్చు. కడుపులో ఏర్పడే ఆమ్ల ప్రభావం తగ్గడానికి టీ తాగే ముందు తేలికపాటి అల్పాహారం తీసుకోవడం మంచిది. జీర్ణ సమస్య.. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై కూడా చెడు ప్రభావం పడుతుంది. కడుపు ఖాళీగా ఉన్నప్పుడు టీలో ఉండే కెఫిన్ నేరుగా కడుపు గోడ ద్వారా శోషించబడుతుంది. దీని కారణంగా ఇది తక్షణ ప్రభావాన్ని చూపుతుంది. ఇది కడుపు తిమ్మిరి, మంట వంటి సమస్యలను కలిగిస్తుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేసే గ్రంథుల సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల జీర్ణ రసాల సమతుల్యత దెబ్బతింటుంది. ఫలితంగా ఆహారం జీర్ణం కావడానికి సమయం పడుతుంది. పోషకాలు సరిగ్గా గ్రహించబడవు. ఎముకల ఆరోగ్యం.. టీలో ఉండే కెఫిన్ ఎక్కువ తీసుకుంటే శరీరంలో కాల్షియం లోపం ఏర్పడుతుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల ఈ ప్రభావం మరింత పెరుగుతుంది. ఎందుకంటే టీ శరీరంలో నేరుగా శోషించబడుతుంది. ఎముకలలో కాల్షియం శోషణను ప్రభావితం చేస్తుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల శరీరంలో అవసరమైన పోషకాలు లోపిస్తాయి. ఇది ఎముకలను బలహీనపరుస్తుంది. ఈ సమస్య ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే మహిళలకు సాధారణంగానే ఎక్కువ కాల్షియం అవసరం. కాల్షియం లోపం వల్ల ఎముకల నొప్పి, కీళ్ల దృఢత్వం, ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఖాళీ కడుపుతో టీ తాగేవారు జాగ్రత్త. - రూపశ్రీ
read moreరక్తపోటుకు చెక్ పెట్టాలంటే ఏం తినాలి?
రక్తపోటు నేటికాలంలో చాలా సాధారణం అయిపోయింది. ఒకప్పుడు వయసుతో పాటు పెద్దవారికి మాత్రమే రక్తపోటు వచ్చేది. తరువాత మధ్యవయసు వారిలో రక్తపోటు రావడం మొదలైంది. కానీ ఇప్పట్లో మాత్రం యువతలో ఇంకా చెప్పాలంటే చిన్నపిల్లలలో కూడా రక్తపోటు బయటపడుతూ ఉంటుంది. సాధారణంగా ఉండాల్సిన దాని కంటే ఎక్కువ రక్తపోటు ఉండటం చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. ముఖ్యంగా అధిక రక్తపోటు కారణంగా గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రక్తపోటు నియంత్రణలో ఉండాలంటే పొటాషియం అధికంగా ఉన్న ఆహారాలు తినాలని వైద్యులు చెబుతుంటారు. అయితే పొటాషియం అధికంగా ఉన్న ఆహారాలు ఏంటి? ఏ ఆహారాలు తినాలి? తెలుసుకుంటే.. తినాల్సిన ఆహారాలు.. అరటిపండ్లు.. అరటిపండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. సులభంగా లభిస్తాయి, చవకైనవి కూడా. అన్ని రకాల వయసుల వారికి అనువైనవి. అరటిపండ్లను స్మూతీలు, ఫ్రూట్ సలాడ్లలో కలపడం లేదా వాటిని నేరుగా తినడం వల్ల రక్తపోటును నియంత్రణలో ఉంచవచ్చు. కొబ్బరి నీరు.. కొబ్బరి నీరులో సహజ ఎలక్ట్రోలైట్లు అధికంగా ఉంటాయి. ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది. అటు హైడ్రేట్ గా ఉంచుతూ.. రక్తపోటును అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. పాలకూర.. పాలకూరలో పొటాషియం, ఐరన్ తో పాటు ఇతర ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. పాలకూరను తీసుకుంటే రక్తపోటును చాలా వరకు నియంత్రణలో ఉంచుకోవచ్చు. దోసకాయ.. దోసకాయలో పొటాషియం అధికంగా ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. పైగా ఇది హైడ్రేటింగ్ గా ఉంచుతుంది. ఇది రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది. టమోటాలు.. టమోటాలు భారతీయ వంటకాల్లో విరివిగా ఉపయోగిస్తుంటాం. అయితే టమోటాలలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. టమోటాలను కూరల్లోనే కాకుండా జ్యూస్ కూడా చేసుకుని తాగవచ్చు. ఎక్కువ రక్తపోటు ఉన్నవారికి ఇలా జ్యూస్ చేసుకుని తాగడం మంచి ఉపశమనం ఇస్తుంది. పెరుగు.. పెరుగు అద్భుతమైన ప్రోబయోటిక్ మాత్రమే కాదు.. ఇందులో పొటాషియం కూడా సమృద్దిగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. శరీరానికి పోషణ కూడా ఇస్తుంది. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreమెగ్నీషియం శరీరానికి ఎందుకంత ముఖ్యం? మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలేంటి?
మెగ్నీషియం ఒక ముఖ్యమైన ఖనిజం. ఇది శక్తి ఉత్పత్తి, కండరాలు, నరాల పనితీరు, రక్తంలో చక్కెర నియంత్రణ, ఎముక ఆరోగ్యంతో సహా శరీరంలో 300 కి పైగా జీవరసాయన ప్రతిచర్యలలో కీలక పాత్ర పోషిస్తుంది. మెగ్నీషియం లోపం అలసట, కండరాల తిమ్మిరి, చిరాకు, హృదయ స్పందన సక్రమంగా లేకపోవడం, మానసిక రుగ్మతలు వంటి లక్షణాలకు దారితీస్తుంది. శరీరం సహజంగా మెగ్నీషియంను ఉత్పత్తి చేయదు. దీన్ని ఆహారం నుండి పొందాలి. మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాల గురించి తెలుసుకుంటే.. మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు.. బచ్చలికూర.. బచ్చలికూర మెగ్నీషియం పవర్హౌస్. బచ్చలికూరలో ఐరన్, ఫోలేట్, యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇది గుండె, ఎముక, మెదడు ఆరోగ్యానికి చాలా సహాయపడుతుంది. బాదం.. కేవలం గుప్పెడు బాదం లో సుమారు 80 మి.గ్రా మెగ్నీషియం ఉంటుంది. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, విటమిన్ ఇ కూడా సమృద్ధిగా ఉంటాయి. బాదం మెదడు పనితీరు, శక్తి స్థాయిలకు మద్దతు ఇస్తుంది. గుమ్మడికాయ విత్తనాలు.. 28 గ్రాముల గుమ్మడి విత్తనాలలో 150 మి.గ్రా మెగ్నీషియం ఉంటుంది. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె, ప్రోస్టేట్ ఆరోగ్యానికి చాలా మంచివి. సలాడ్లు, పెరుగు లేదా స్వీట్స్ లలో వీటిని జోడించుకోవచ్చు. అవోకాడోస్.. ఒక మీడియం అవోకాడోలో పొటాషియం, ఫైబర్, గుండెకు మేలు చేసే ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులతో పాటు 58 మి.గ్రా మెగ్నీషియం కూడా ఉంటుంది. అవోకాడోస్ జీవక్రియకు చాలా హెల్ప్ చేస్తాయి, మంటను తగ్గిస్తాయి. ఇతర ఆహారాల నుండి పోషకాలను గ్రహించడంలో సహాయపడతాయి. డార్క్ చాక్లెట్.. మంచి-నాణ్యత గల డార్క్ చాక్లెట్ రుచికరమైనది మాత్రమే కాదు మెగ్నీషియం సమృద్దిగా కలిగి ఉంటుంది. ఇది ఔన్సుకు 64 మి.గ్రా మెగ్నీషియం అందిస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇది మానసిక స్థితిని మెరుగుపరచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి, హృదయ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. అరటిపండ్లు.. పొటాషియం కోసం అరటిపండ్లు చాలా మంచి ఎంపిక. ఒక మీడియం సైజు అరటిపండులో 32 మి.గ్రా మెగ్నీషియం ఉంటుంది. అవి కండరాల పనితీరుకు మద్దతును, శక్తిని ఇస్తాయి. వ్యాయామం తర్వాత అరటిపండు తినేది ఇందుకే. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మెగ్నీషియం లోపం రాకుండా ఉంటుంది. మెగ్నీషియం లోపం వల్ల ఎలాంటి సమస్యలు రాకుండా ముందే జాగ్రత్త పడినట్టు ఉంటుంది. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreస్లిప్ డిస్క్.. ఈ సమస్య మీకు ఉందో లేదో తెలుసుకోండి..!
ఈ రోజుల్లో చిన్నవారైనా, పెద్దవారైనా వెన్నునొప్పి, నడుము నొప్పి అనే ఫిర్యాదులు చేయడం చూస్తూనే ఉన్నాం. వెన్నునొప్పి ఏదో ఒక రూపంలో ఇబ్బంది పెడుతుంది. ఈ నొప్పిని తరచుగా నిర్లక్ష్యం చేస్తారు. ఇది క్రమంగా పెరుగుతుంది. ఈ నొప్పి శారీరక అసౌకర్యాన్ని కలిగించడమే కాకుండా, రోజువారీ వనులు చేసుకోవడంలో కూడా ప్రభావితం చేస్తుంది. కానీ ఇలాంటి వెన్ను నొప్పి వెనుక స్లిప్ డిస్క్ లాంటి తీవ్రమైన సమస్య కూడా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ విషయం ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. అసలు స్లిప్ డిస్క్ అంటే ఏమిటి? ఇది వచ్చే అవకాశం ఎవరికి ఎక్కువ ఉంది? దీన్నెలా గుర్తించాలి? పూర్తీగా తెలుసుకుంటే.. స్లిప్ డిస్క్.. స్లిప్డ్ డిస్క్‌ను వైద్య భాషలో 'హెర్నియేటెడ్ డిస్క్' అని కూడా అంటారు. వెన్నెముక ఎముకల మధ్య ఉన్న కుషన్ లాంటి డిస్క్ దాని స్థానం నుండి జారిపోయినప్పుడు ఇది జరుగుతుంది. ఈ డిస్క్ మృదువైన, జెల్లీ లాంటి నిర్మాణం, ఇది ఎముకలు ఒకదానికొకటి రాపిడి కాపాడుతుంది. ఎముకలు సజావుగా కదలడానికి కారణం అవుతుంది. ఈ డిస్క్ పగిలిపోయినప్పుడు లేదా దాని స్థానం నుండి జారిపోయినప్పుడు అది సమీపంలోని నరాలపై ఒత్తిడి తెస్తుంది, దీని కారణంగా నడుము నుండి పాదాల వరకు తీవ్రమైన నొప్పి, తిమ్మిరి, బలహీనత వంటి సమస్యలు వస్తాయి. కారణాలు.. డిస్క్ జారిపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. వీటిలో కొన్ని రోజువారీ అలవాట్లకు సంబంధించినవి, అతి పెద్ద కారణం కూర్చోవడం లేదా తప్పు మార్గంలో వంగడం. దీనితో పాటు బరువైన వస్తువులను, ముఖ్యంగా తప్పు మార్గంలో ఎత్తడం వల్ల, డిస్క్ పై అదనపు ఒత్తిడి పడుతుంది. వయస్సు పెరగడం కూడా ఒక ముఖ్యమైన కారణం. ఎందుకంటే వయస్సుతో డిస్క్ బలం తగ్గడం ప్రారంభమవుతుంది. ఊబకాయం, వ్యాయామం లేకపోవడం, కొన్నిసార్లు ఆకస్మిక గాయాలు కూడా డిస్క్ జారిపోవడానికి కారణం అవుతాయి. స్లిప్ డిస్క్ సంకేతాలు.. నడుము, వెన్నునొప్పి స్లిప్ డిస్క్ కు సంబంధించినదా కాదా అని తెలుసుకోవడానికి సరైన లక్షణాలను గుర్తించాలి. అత్యంత సాధారణ లక్షణం ఎప్పుడూ తీవ్రమైన నొప్పి కలిగి ఉండటం. ఇది నడుము నుండి ప్రారంభమై కాళ్ళ వరకు వెళుతుంది. దీనిని సయాటికా అని కూడా అంటారు. దీనితో పాటు, చాలా మందికి కండరాలలో తిమ్మిరి, జలదరింపు లేదా బలహీనత కూడా అనిపించవచ్చు. అలాగే, కూర్చోవడం, నిలబడటం లేదా నడవడంలో ఇబ్బంది ఉన్నా, లక్షణాలు ఎక్కువసేపు కొనసాగినా వైద్యుని వద్దకు వెళ్లడం మంచిది. స్లిప్ డిస్క్ ఎవరికి వచ్చే ప్రమాదం ఉంటుంది? శారీరక శ్రమలకు తక్కువ ప్రాముఖ్యత ఇచ్చే లేదా గంటల తరబడి ఒకే స్థితిలో కూర్చునే ఐటీ నిపుణులు, డ్రైవర్లు, కార్యాలయ ఉద్యోగులు వంటి వారిలో స్లిప్ డిస్క్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సమస్య భారీ బరువులు ఎత్తే కార్మికులు లేదా అథ్లెట్లలో కూడా కనిపిస్తుంది. ముందు జాగ్రత్తలు.. స్లిప్ డిస్క్ రాకుండా ఉండాలంటే దినచర్యలో కొన్ని మార్పులు చేసుకోవడం ముఖ్యం. మొదటగా సరైన పద్ధతిలో కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. కుర్చీపై కూర్చున్నప్పుడు వీపును నిటారుగా ఉంచాలి. ప్రతి 30-40 నిమిషాలకు కాస్త అటు ఇటు నడవాలి. బరువైన వస్తువులను ఎత్తేటప్పుడు నడుముపై కాకుండా మోకాళ్లపై ఒత్తిడి ఉంచాలి. క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా, స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల వెన్నెముక బలోపేతం అవుతుంది. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreఏం చేసినా దగ్గు తగ్గడం లేదా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి..!
దగ్గు చాలా సాధారణంగా వచ్చే సమస్య. దగ్గు వస్తే సుమారు మూడు రోజుల్లో తగ్గిపోతుంది. కానీ దగ్గు తగ్గకుండా ఎక్కువ కాలం ఉంటే మాత్రం అది చాలా ఇబ్బంది పెడుతుంది. దీర్ఘకాలిక దగ్గు అనేది జలుబు, ఫ్లూ, కోవిడ్ -19 లేదా శ్వాసకోశ ఇన్పెక్షన్ వంటి సమస్యలు వచ్చినప్పుడు లేదా ఆ సమస్యలు తగ్గిన తరువాత కూడా కొన్నిరోజులు ఉంటుంది. ఈ రకమైన దగ్గు పొడిగా లేదా శ్లేష్మాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. సాధారణంగా శ్వాసనాళం మంట, యాసిడ్ రిఫ్లక్స్ లేదా గొంతులో సున్నితంగా మారడం వల్ల వస్తుంది. ఇది అంత ప్రమాదకరమైన సమస్య కాకపోయినా ఉన్నన్నాళ్లు చాలా ఇబ్బంది పెడుతుంది. ఈ సమస్యను సులువుగా చెక్ పెట్టడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. దీర్ఘకాలిక దగ్గుకు ప్రభావవంతమైన చిట్కాలు.. హైడ్రేట్ గా ఉండాలి.. పుష్కలంగా ద్రవాలు త్రాగటం వల్ల శ్లేష్మం పల్చబడుతుంది. ఇది గొంతు పొడిబారడాన్ని తగ్గించడానికి, వాయుమార్గాలలో చికాకును తగ్గించడానికి సహాయపడుతుంది. హెర్బల్ టీలు, సూపులు లేదా నిమ్మకాయ, తేనెతో వెచ్చని నీరు వంటి వెచ్చని ద్రవాలు గొంతుకు చాలా మంచి ఉపశమనం కలిగిస్తాయి. హైడ్రేటెడ్ గా ఉంటే రోగనిరోధక పనితీరు బలంగా ఉంటుంది. శరీరానికి వచ్చే జబ్బులు వేగంగా నయం కావడానికి అనువుగా ఉంటుంది. నిద్రవేళకు ముందు తేనె.. తేనె యాంటీమైక్రోబయల్, ఓదార్పు లక్షణాలతో దగ్గును సహజంగానే అణిచివేస్తుంది. నిద్రవేళకు ముందు ఒక చెంచా తేనే తీసుకోవాలి. ఇది గొంతు లోపల పూత లాగా ఏర్పడి రాత్రిపూట దగ్గును తగ్గిస్తుంది. నిద్రను మెరుగుపరుస్తుంది. అదనపు ప్రయోజనం కోసం గోరువెచ్చని నీరు, పసుపు లేదా అల్లం రసంతో కలిపి తీసుకోవచ్చు. కానీ ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు తేనె ఇవ్వకూడదు. నిద్ర చిట్కా.. తలను ఎత్తుగా ఉంచి నిద్రపోవడం వల్ల గొంతులో శ్లేష్మం ఏర్పడకుండా ఉంటుంది. అలాగే దగ్గును ప్రేరేపించకుండా నిరోధించడానికి సహాయపడుతుంది. ఆవిరి.. ఆవిరి పీల్చడం పొడి, చికాకు కలిగించే వాయుమార్గాలను తేమ చేయడానికి, శ్లేష్మాన్ని బయటకు రప్పించడానికి సహాయపడుతుంది. అలాగే గదిలో హ్యూమిడిఫైయర్ను ఉపయోగించడం గాలికి తేమను కూడా జోడిస్తుంది. ఇది పొడి దగ్గును తగ్గిస్తుంది, ముఖ్యంగా ఎయిర్ కండిషన్డ్ లేదా శీతాకాల వాతావరణంలో మంచిది. ఉప్పు నీటి పుక్కిలింత.. రోజూ కొన్నిసార్లు గోరువెచ్చని ఉప్పు నీటితో పుక్కిలించాలి. ఇలా చేయడం వల్ల గొంతు మంట తగ్గుతుంది. శ్లేష్మం సడలుతుంది, చికాకులను బయటకు పంపుతుంది. ట్రిగ్గర్లు.. దుమ్ము, పొగ, సుగంధ ద్రవ్యాలు, కాలుష్యం వంటి సాధారణ విషయాలు దీర్ఘకాలిక దగ్గును మరింత తీవ్రతరం చేస్తాయి. ఈ ట్రిగ్గర్లను నివారించడానికి ప్రయత్నించాలి. ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్ ఉపయోగించాలి. కలుషితమైన వాతావరణంలో బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్ ఉపయోగించాలి. అల్లం లేదా పసుపు టీ .. అల్లం, పసుపు రెండూ శక్తివంతమైన శోథ నిరోధక, యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటాయి. వీటితో తయారుచేసిన టీలను సిప్ చేయడం వల్ల గొంతుకు ఉపశమనం లభిస్తుంది. మంటను తగ్గించడానికి, దగ్గుకు కారణమయ్యే ఏదైనా ఇన్పెక్షన్ తో పోరాడటానికి సహాయపడుతుంది. శ్వాస వ్యాయామాలు.. సున్నితమైన శ్వాస వ్యాయామాలు.. ముఖ్యంగా నెమ్మదిగా, లోతైన శ్వాసలపై దృష్టి సారించే వ్యాయామాలు శ్వాసకోశ వ్యవస్థను రిపేర్ చేయడానికి, దగ్గును తగ్గించడానికి సహాయపడతాయి. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreమీకు గుడ్లు తినడం అలవాటు లేదా? గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఈ ఆహారాలు తినండి..!
గుడ్లను సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. పిల్లల నుండి వృద్దుల వరకు ప్రతి ఒక్కరు గుడ్లు తినడానికి అనువుగా ఉంటాయి. ముఖ్యంగా పోషకాహార లోపం రాకూడదంటే పిల్లలకు చిన్నతనం నుండే రోజుకు ఒక గుడ్డు తప్పనిసరిగా ఇవ్వడం మంచిదని వైద్యులు చెబుతుంటారు. పైగా గుడ్లతో బోలెడు రుచికరమైన వంటలు తయారు చేస్తుంటారు. కానీ అందరూ గుడ్లను తినలేరు. భారతదేశంలో శాకాహార ఆహారాన్ని అనుసరించేవారు కూడా ఉన్నారు. కనీసం గుడ్డును కూడా తినని వారు ఉన్నారు. ఇలాంటి వారు ప్రోటీన్ ఫుడ్ కోసం చాలా ఇబ్బందులు పడుతుంటారు. అయితే గుడ్లకంటే ఎక్కువ ప్రోటీన్ కలిగిన ఆహారాలు ఉన్నాయి. ఒక గుడ్డులో సుమారు 6 గ్రాముల ప్రోటీన్ కలిగి ఉంటుంది. అయితే ఇంతకంటే ఎక్కువ ప్రోటీన్ కలిగి ఉన్న శాకాహార ఆహారాలు ఉన్నాయి. గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ కలిగిన 4 సూపర్ ఫుడ్స్ ఎంటో తెలుసుకుంటే.. శనగలు.. భారతీయుల ఆహారంలో అద్బుతం అని చెప్పదగినవి శనగలు. వీటిలో ప్రోటీన్ కంటెంట్ అమోఘం. అర కప్పు శనగలలో దాదాపు 8 గ్రాముల ప్రోటీన్ ఉంటుందట. భారతీయులు అయితే శనగలను చాలా బాగా వండేస్తారు. చోలే కూర, ఉడికించిన శనగలను స్నాక్స్ గానూ, వేయించిన శనగలను టైం పాస్ గా తినడం కోసం.. ప్రోటీన్ పౌడర్ గానూ.. ఇలా చాలా రకాలుగా శనగలను తినవచ్చు. పనీర్.. పాలలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది.అటువంటి పాల నుండి తయారయ్యే పనీర్ లో కూడా ప్రోటీన్ మెరుగ్గా ఉంటుంది. అరకప్పు కాటేజ్ జున్నులో దాదాపు 12 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. భారతీయులు పనీర్ ను కూరల్లోనూ, శాండ్విచ్ ల తయారీ లోనూ, స్నాక్స్ గానూ, రకరకాల తినుబండారాలుగా, స్వీట్స్ తయారీలో కూడా ఉపయోగిస్తారు. తక్కువ కొవ్వు ఉన్న పనీర్ ను ఎంచుకుంటే మరింత ఆరోగ్యం. బాదం.. ప్రోటీన్ కంటెంట్ను పెంచడానికి బాదం గ్రేట్గా సహాయపడుతుంది. బాదం బటర్ కూడా తయారు చేసుకుని వాడవచ్చు. 2 టేబుల్ స్పూన్ల బాదం బటర్ లో 7 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. గుండెకు మేలు చేసే ఆరోగ్యకరమైన కొవ్వులు బాదంలో ఉంటాయి. బాదంను చాలామంది రాత్రి నానబెట్టి ఉదయాన్నే తింటుంటారు. అలా కాకుండా.. బాదం ను స్నాక్స్ గానూ, బాదం బటర్ తయారు చేసుకుని, స్వీట్స్ లోనూ, ప్రోటీన్ పౌడర్ లోనూ వినియేగించవచ్చు. గుమ్మడి గింజలు.. గుమ్మడికాయ విత్తనాలు చాలా స్పెషల్.. వీటిని ఏదైనా సలాడ్, డెజర్ట్ లేదా స్మూతీలలో ఈజీగా జోడించవచ్చు. పొట్టు తీసిన ఔన్స్ గుమ్మడి గింజలలో 8.5 గ్రాముల ప్రోటీన్ కలిగి ఉంటాయి. అవి జింక్, ఇనుము, రాగి, మెగ్నీషియం, పొటాషియం, సెలీనియం కూడా అందిస్తాయి, ఇవి వోట్మీల్, పాయసం, స్వీట్స్ స్నాక్స్ లలో జోడించుకోవచ్చు. లేదంటే నానబెట్టిన బాదంతో పాటు రోజూ గుమ్మడి గింజలను కూడా తినవచ్చు. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreవంటల్లో వాడే ఇంగువ గురించి ఈ నిజాలు తెలుసా?
ఇంగువ భారతీయ వంటగదిలో ఒక ముఖ్యమైన పదార్థం. ఇది ఆహార రుచిని పెంచడంతో పాటు ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. ఆయుర్వేదంలో దీనికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. చాలా సమస్యలకు వైద్యంగా ఇంగువను వాడతారు. మరీ ముఖ్యంగా సంప్రదాయ వంటకాలలో, దేవుడి కోసం చేసే వంటకాలలో ఇంగువ తప్పక వాడుతుంటారు. అయితే కేవలం దైవ సంబంధంగానూ, ఆహారానికి రుచి ఇవ్వడం అనే విషయం గానూ కాకుండా ఆరోగ్యపరంగా చూస్తే ఇంగువ అద్బుతమైన ఔషధం అని చెప్పవచ్చు. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. శరీరాన్ని వివిధ వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. అయితే ఇంగువ వల్ల కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే.. జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది.. ఇంగువ వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం జీర్ణవ్యవస్థను రిపేర్ చేయడం. గ్యాస్, అజీర్ణం, కడుపు నొప్పి, ఎసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఆహారంలో చిటికెడు ఇంగువ చేర్చడం లేదా వేడినీటిలో కరిగించి తాగడం వల్ల ఉదర సమస్యలు తొలగిపోతాయి. కడుపులో గ్యాస్, ఎసిడిటీ నుంచి ఉపశమనం.. ఇంగువ సహజంగా యాంటీ-ఫ్లాట్యులెంట్. ఇది కడుపులో వాయువు ఏర్పడకుండా నిరోధిస్తుంది. గోరువెచ్చని నీటితో తీసుకోవడం వల్ల అపానవాయువు, ఎసిడిటీ సమస్య తగ్గుతుంది. వాపు, నొప్పిని తగ్గిస్తుంది.. ఇంగువలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి కీళ్ల నొప్పులు, తలనొప్పి, శరీరంలో వాపును తగ్గించడంలో సహాయపడతాయి. ఇంగువ పేస్ట్ తయారు చేసి ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయడం వల్ల తక్షణ ఉపశమనం లభిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. ఇంగువలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుంచి కాపాడతాయి. జలుబు, ఇతర సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ పొందేందుకు ఉపయోగపడుతుంది. శ్వాసకోశ వ్యవస్థకు మేలు చేస్తుంది.. ఇది శ్లేష్మాన్ని పలుచన చేయడానికి, శ్లేష్మం రాకుండా చేయడానికి సహాయపడుతుంది. తద్వారా ఉబ్బసం, బ్రోన్కైటిస్, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.. ఇంగువ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. డయాబెటిస్ నియంత్రణలో సహాయపడుతుంది.. ఇంగువ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతుంది. ఇది డయాబెటిస్ రోగులకు చాలా మంచిది. పీరియడ్స్ సమస్యలకు ఉపశమనం.. ఇంగువ మహిళలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది పీరియడ్స్ లో వచ్చే నొప్పిని తగ్గిస్తుంది, అలాగే పీరియడ్స్ సక్రమంగా వచ్చేందుకు దోహదపడుతుంది. గోరువెచ్చని నీటిలో ఇంగువ, తేనె కలిపి తాగడం వల్ల తిమ్మిరి నుంచి ఉపశమనం లభిస్తుంది. చర్మం, జుట్టుకు ప్రయోజనకరంగా ఉంటుంది.. ఇంగువలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మ ఇన్ఫెక్షన్లు, మొటిమలు, మరకలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది నెత్తిని ఆరోగ్యంగా ఉంచడం ద్వారా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కీటకాల కాట్లు, గాయాలకు సహాయపడుతుంది.. ఇంగువను పేస్ట్ గా చేసి అప్లై చేయడం వల్ల కీటకాల కాటు వల్ల కలిగే చికాకు, దురద నుండి ఉపశమనం లభిస్తుంది. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreప్రతి సంవత్సరం దోమల ద్వారా వ్యాపించే అతి పెద్ద మూడు వ్యాధులు ఇవే..!
వర్షాకాలంలో దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. భారతదేశంలో ప్రతి సంవత్సరం జూలై నుండి సెప్టెంబర్-అక్టోబర్ వరకు, డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల కారణంగా ఆసుపత్రులలో రద్దీ విపరీతంగా ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిపుణుల అభిప్రాయం ప్రకారం, దోమ కాటు వల్ల కలిగే వ్యాధుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది మరణిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ వ్యాధులలో చాలా వాటికి నిర్దిష్ట చికిత్స అందుబాటులో లేదు. వైద్యులు లక్షణాల ఆధారంగా ట్రీట్మెంట్ ఇస్తూ ఆ సమస్యకు ఉపశమనం కలిగేలా చేస్తారు. డెంగ్యూ, చికున్‌గున్యా, జికా అనేవి మూడు ప్రమాదకరమైన వ్యాధులు. వీటికి ఇంకా శాశ్వత చికిత్స లేదా టీకా లేదు. అందుకే వైద్యులు ప్రజలందరూ నివారణ చర్యలు పాటించాలని సలహా ఇస్తూ ఉంటారు. ఈ వ్యాధులతో అతిపెద్ద సమస్య ఏమిటంటే.. ప్రారంభ లక్షణాలు సాధారణ జ్వరం లాగా ఉంటాయి. కానీ క్రమంగా అవి ప్రాణాంతక రూపాన్ని తీసుకువే అవకాశం ఉంటుంది. డెంగ్యూలో ప్లేట్‌లెట్లు వేగంగా తగ్గుతాయి. ఇది తీవ్రమైన పరిస్థితులలో ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. చికున్‌గున్యా నెలల తరబడి కీళ్ల నొప్పులకు కారణమవుతుంది. అయితే జికా వైరస్ గర్భిణీ స్త్రీలు, పిల్లలకు జీవితాంతం ముప్పు కలిగిస్తుంది. అంటే, ఇవి కేవలం వ్యాధులు మాత్రమే కాదు, తీవ్రమైన ఆందోళన కలిగించే సమస్యలు. ఈ మూడింటికి ఖచ్చితమైన చికిత్స లేనందున, వైద్యులు లక్షణాలను మాత్రమే నియంత్రిస్తారు. డెంగ్యూ ప్రమాదం.. డెంగ్యూ అనేది ఏడిస్ ఈజిప్టి అనే దోమ కాటు వల్ల వ్యాపించే వైరల్ వ్యాధి. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 కోట్ల మంది డెంగ్యూ బారిన పడుతున్నారు. భారతదేశంలో వర్షాకాలంలో, వర్షం తర్వాత ఇది ఎక్కువగా వ్యాపిస్తుంది. డెంగ్యూ వచ్చిన రోగులకు అధిక జ్వరం, తలనొప్పి, కళ్ళ వెనుక, కండరాలు, కీళ్లలో నొప్పితో పాటు చర్మంపై ఎర్రటి దద్దుర్లు కూడా రావచ్చు. తీవ్రమైన సందర్భాల్లో ఇది రక్తస్రావం జ్వరం లేదా డెంగ్యూ షాక్ సిండ్రోమ్‌కు కూడా కారణమవుతుంది. ఇందులో, ప్లేట్‌లెట్ల సంఖ్య వేగంగా తగ్గుతుంది. ఇది శరీరంలో అంతర్గత రక్తస్రావం కలిగిస్తుంది. డెంగ్యూకు నిర్దిష్ట చికిత్స లేదు. దీని చికిత్సలో జ్వరాన్ని తగ్గించడం, ప్లేట్‌లెట్లు తగ్గకుండా నిరోధించడం, శరీరంలో నీటి కొరతను తీర్చడంపై మాత్రమే దృష్టి పెడతారు. చికున్‌గున్యా ప్రభావం.. డెంగ్యూ లాగే చికున్‌గున్యా కూడా ప్రమాదకరమైనది. దీనికి ఖచ్చితమైన చికిత్స కూడా లేదు. చికున్‌గున్యా లక్షణాలు అకస్మాత్తుగా అధిక జ్వరం, తలనొప్పి, అలసట, చర్మంపై దద్దుర్లు, కీళ్ల నొప్పులు, వాపు. ఈ వ్యాధి తక్కువ ప్రాణాంతకం అయినప్పటికీ దీని వల్ల కలిగే అతిపెద్ద ప్రమాదం దీర్ఘకాలిక నొప్పి, బలహీనత. చాలా మంది రోగులు నెలల తరబడి నడవలేరు. చికున్‌గున్యాకు ప్రత్యక్ష చికిత్స లేదా టీకా కూడా లేదు. రోగులకు నొప్పిని తగ్గించడానికి పారాసెటమాల్ ఇస్తుంటారు. విశ్రాంతి, తగినంత నీరు త్రాగడం పోషకమైన ఆహారం తినాలి. జికా వైరస్.. జికా వైరస్ వ్యాప్తి గురించి చాలా వార్తు వస్తుంటాయి. ఇది ఏడిస్ దోమ ద్వారా వ్యాపిస్తుంది. సాధారణంగా, ఈ వ్యాధి తేలికపాటి జ్వరం, కళ్ళు ఎర్రబడటం (కండ్లకలక), తలనొప్పి, చర్మంపై ఎర్రటి దద్దుర్లు, కీళ్ల నొప్పులకు కారణమవుతుంది. అయితే ఇది గర్భిణీ స్త్రీలు, నవజాత శిశువులకు చాలా ప్రమాదకరం. గర్భిణీ స్త్రీకి జికా వైరస్ వస్తే.. బిడ్డకు మైక్రోసెఫాలీ వంటి తీవ్రమైన పరిస్థితి రావచ్చని, దీనిలో పిల్లల తల, మెదడు పూర్తిగా అభివృద్ధి చెందదని WHO నివేదికలు చూపిస్తున్నాయి. జికాకు నిర్దిష్ట చికిత్స లేదా టీకా లేదు. రోగి లక్షణాలను తగ్గించే మందులు తీసుకోవడం, విశ్రాంతి తీసుకోవడం, తగినంత ద్రవాలు తీసుకోవడం మాత్రమే మార్గం. ఈ మూడు వ్యాధుల నుండి నివారణ మాత్రమే ప్రభావవంతమైన మార్గం అని వైద్యులు అంటున్నారు. దీని కోసం దోమతెరలను ఉపయోగించడం,ఫుల్ హ్యాండ్స్ దుస్తులు ధరించడం, ఇంటి చుట్టూ నీరు పేరుకుపోకుండా ఉండటం చాలా ముఖ్యం. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreవర్షాకాలంలో ఈ ఆహారాలు తీసుకోండి.. ఇమ్యూనిటీ సూపర్ గా పెరుగుతుంది..!
వర్షాకాలం వేడి నుండి చాలా ఉపశమనాన్ని తెస్తుంది. కానీ దాన్ని ఆస్వాదించే లూపే ఇన్ఫెక్షన్లు, అనారోగ్యాల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. వాతావరణంలో పెరిగిన తేమ ఇన్ఫెక్షన్ కలిగించే జీవులు వృద్ధి చెందడానికి అనుకూలమైన వాతావరణాన్ని ఇస్తుంది. అందువల్ల రోగనిరోధక శక్తిని ని బలంగా మార్చుకోవడం చాలా ముఖ్యం. ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచడం వల్ల శరీరం జలుబు, ఫ్లూ, ఇతర ఇన్ఫెక్షన్ల వంటి సాధారణ వ్యాధుల నుండి బయటపడటానికి సహాయపడుతుంది. వర్షాకాలంలో ఇమ్యూనిటీ బంలగా ఉండాలంటే తీసుకోవలసిన ఆహారాల గురించి తెలుసుకుంటే.. వర్షాకాల తీసుకోవాల్సిన రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు పసుపు.. దాని శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. పసుపు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. వర్షాకాలంలో పసుపు పాలు తాగుతూ ఉంటే ఇమ్యూనిటీ చాలా మెరుగ్గా ఉంటుంది. సిట్రస్ పండ్లు.. నారింజ, నిమ్మకాయలు, జామ వంటి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు ఇవి చాలా అవసరం. ఉసిరి.. ఇండియన్ గూస్బెర్రీ అని ఉసిరి కాయను పిలుస్తారు. విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి, జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఉసిరికాయను పచ్చిగా, రసంగా లేదా పొడి రూపంలో తీసుకోవచ్చు. మునగ ఆకులు.. ఆహారం ద్వారా వచ్చే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడటానికి మునగ సహాయపడుతుంది. మునగ ఆకులు కాలేయ ఆరోగ్యాన్ని పెంచడానికి, కడుపు నొప్పిని తగ్గించడానికి, హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, రక్తపోటును తగ్గించడానికి సహాయపడతాయి. ప్రోబయోటిక్ ఆహారాలు.. పెరుగు, మజ్జిగ వంటి పులియబెట్టిన ఆహారాలు ప్రేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. ఇది బలమైన రోగనిరోధక వ్యవస్థకు దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. తులసి.. తులసి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే శక్తివంతమైన ఆయుర్వేద మూలిక. తులసి ఆకులను నీటిలో మరిగించి తీసుకోవచ్చు. లేదా తులసి రసాన్ని తేనెతో కలిపి తీసుకోవచ్చు. వెల్లుల్లి.. రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలకు వెల్లుల్లి చాలా ప్రసిద్ధి. వెల్లుల్లిని వంటలలో జోడించడం కంటే కూడా పచ్చిగా తినడం చాలా ఎక్కువ ఫలితాలు ఇస్తుంది. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreమైగ్రేన్ వేధిస్తోందా? ఈ అలవాట్లతో మాయమవుతుంది..!
నేటి వేగవంతమైన జీవితంలో చాలా బాధ్యతలు ఉంటాయి. ఇల్లు, ఆఫీస్, పిల్లలు, రిలేషన్స్ మధ్య సమతుల్యతను కాపాడుకోవడం ఇవన్నీ చాలా ముఖ్యమైనవి, తప్పించుకోలేనివి. ఇవన్నీ ఎప్పుడైనా కాస్త ఒత్తిడిగా అనిపిస్తే చాలామంది విపరీతమైన తలనొప్పితో బాధపడుతుంటారు. అన్ని తలనొప్పులు మైగ్రేన్ కాకపోయినా మైగ్రేన్ అనేది ఒక విధమైన తలనొప్పి. ఈ మైగ్రేన్ వల్ల ప్రతి రోజు చాలా ఛాలెంజింగ్ గా అనిపిస్తుంది. ఎందుకంటే మైగ్రేన్ తలనొప్పికి మాత్రమే కాకుండా వికారం, అలసట, కాంతి లేదా శబ్దాన్ని భరించలేకపోవడం వంటివి కూడా జరుగుతాయి. దీనిని మందులు మరియు సరైన జీవనశైలితో నియంత్రించవచ్చు. మంచి ఆరంభం.. మంచి ఆరంభం మొత్తం రోజు శక్తిని నిర్ణయిస్తుంది. కాబట్టి ప్రతిరోజూ నిర్దిష్ట సమయంలో మేల్కొలపడం అలవాటు చేసుకోవాలి. అది రోజు మొత్తం శక్తిని నిర్ణయిస్తుంది. మేల్కొన్న వెంటనే ఫోన్ లేదా స్క్రీన్ వైపు చూడకూడదు. కొన్ని నిమిషాలు గడిచిన తరువాత యోగా లేదా ధ్యానం కోసం కనీసం 10-15 నిమిషాలు సమయం కేటాయించాలి. అనులోమ-విలోమ, భ్రమరి వంటి ప్రాణాయామాలు ఒత్తిడిని తగ్గించడం ద్వారా మైగ్రేన్ తీవ్రతను నియంత్రించడంలో సహాయపడతాయి. అల్పాహారం చాలా ముఖ్యం.. ఖాళీ కడుపుతో ఎక్కువ సేపు ఉంటే మైగ్రేన్ త్వరగా వస్తుంది. కాబట్టి అల్పాహారం మిస్ అవ్వకూడదు. ఓట్స్, జావ, పండ్లు లేదా మొలకలు లేదా ఇతర టిఫిన్స్ వంటి పోషకమైన అల్పాహారం మాత్రమే తినాలి. టీ-కాఫీ, ఎనర్జీ డ్రింక్స్ మానుకోవాలి. ఎందుకంటే అధిక కెఫిన్ కూడా ఈ తలనొప్పిని పెంచుతుంది. స్క్రీన్ కు దూరం.. నిరంతరం స్క్రీన్ వైపు చూడటం మైగ్రేన్‌ను ప్రేరేపిస్తుంది. కానీ ఆఫీసులో నిరంతరం స్క్రీన్ వైపు చూడటం తప్పనిసరి. అటువంటి పరిస్థితిలో ప్రతి 30 నిమిషాలకు 1-2 నిమిషాలు మీ కళ్ళను స్క్రీన్ నుండి మరల్చాలి. వీపు నిటారుగా ఉండాలి, స్క్రీన్ కంటి స్థాయిలో ఉండాలి. పాదాలు నేలపై ఉండాలి. నీరు.. మైగ్రేన్‌లో రోజంతా తగినంత నీరు త్రాగడం ముఖ్యం. ఎందుకంటే డీహైడ్రేషన్ మైగ్రేన్‌ను పెంచుతుంది. ఒత్తిడి మధ్య ప్రశాంతంగా ఉండటానికి, లోతైన శ్వాస తీసుకోవాలి. వాకింగ్ లేదా ఇష్టమైన సంగీతాన్ని వినడం వంటివి మానసిక స్థితిని మెరుగుపరచడంలో అలాగే మైగ్రేన్ తీవ్రతను తగ్గించడంలో సహాయపడతాయి. ట్రిగ్గర్‌లు. మైగ్రేన్ ట్రిగ్గర్‌లు ప్రతి వ్యక్తికి భిన్నంగా ఉంటాయి. ఎక్కువ వెలుగు, పెద్ద శభ్దాలు, ఆకలి, కాలానుగుణ మార్పులు, ఎక్కువ స్క్రీన్ చూడటం వంటివి. మైగ్రేన్ వచ్చినరోజు ఆహారం, నిద్ర సమయం, ఒత్తిడి, వాతావరణం, స్క్రీన్ సమయం గమనించాలి. ఇది మైగ్రేన్ ట్రిగ్గర్‌ను తెలుసుకోవడానికి సహాయపడుతుంది. సాయంత్రం.. రోజంతా హడావిడిగా గడిచిన తర్వాత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి తేలికపాటి నడక, తోటపని, పెయింటింగ్ లేదా విశ్రాంతినిచ్చే ఏదైనా ఇతర పని చేయాలి. నిద్ర.. తగినంత నిద్ర మైగ్రేన్ రోగులకు ఔషధం కంటే తక్కువ కాదు. కాబట్టి 7–8 గంటలు నిద్రపోవాలి. నిద్రపోయే ముందు స్క్రీన్ కు దూరంగా ఉండాలి. గది వెలుతురు మసకగా, వాతావరణం సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోండి. ఇవన్నీ ఫాలో అయితే మైగ్రేన్ మాయమవుతుంది. *రూపశ్రీ.
read more



.webp)




.webp)
.webp)
.webp)











