పుట్టిన నెలని బట్టి అనారోగ్యాలు
ఒకో సమయంలో పుట్టిన పిల్లల జీవితాలు ఎలా ఉంటాయి అని ఊహించేదుకు, ప్రపంచమంతా రకరకాల జాతకాలు ప్రచారంలో ఉన్నాయి. కానీ ఇప్పుడు వైద్యులు కూడా పిల్లలు పుట్టే నెలని బట్టి, వాళ్ల ఆరోగ్యం ఉంటుందని చెప్పడమే కాస్త విచిత్రంగా ఉంది. అది కూడా అలాంటి ఇలాంటి నాటు వైద్యులు కాదు... కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణులు తేల్చిన మాట ఇది. 55 రోగాలు! పుట్టిన నెలకీ, దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలను ఎదుర్కోవడానికీ మధ్య ఏదన్నా సంబంధం ఉందేమో అన్న అనుమానంతో ‘కొలంబియా యూనివర్శిటీ మెడికల్ సెంటర్’లో నమోదైన 17 లక్షల మంది రోగుల వివరాలను పరిశీలించారు. తాము ఎన్నుకొన్న 1,688 రోగాల జాబితాలో 55 రోగాలకీ, పుట్టిన నెలలకీ మధ్య సంబంధం ఉండటాన్ని గమనించారు. ఇలా సంబంధం ఉన్న రోగాలలో ఆస్త్మా, ADHD, సంతానలేమి, గుండెజబ్బులు... వంటి తీవ్రమైన జబ్బులు ఉండటం గమనార్హం. ఏఏ నెలలలో! మార్చి, ఏప్రిల్ నెలల్లో పుట్టినవారిలో గుండెజబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఇక సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో జన్మించినవారిలో శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం బయటపడింది. నవంబరులో పుట్టినవారిలో మానసిక సమస్యలు బయటపడే ప్రమాదం కనిపించింది. మొత్తంగా చూస్తే మే, జులై నెలల్లో పుట్టినవారికంటే అక్టోబరు, నవంబరు మాసాల్లో పుట్టినవారిలో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందంటూ గణాంకాలు సూచించాయి. కారణం! పుట్టిన నెలని బట్టి ఆరోగ్యం అన్న మాట విచిత్రంగా ఉన్నా... దానికి హేతుబద్ధమైన కారణాలు కూడా కనిపిస్తున్నాయి. కాలాన్ని బట్టి తల్లి తీసుకునే ఆహారంలోని మార్పులు, పిల్లలు పుట్టిన వెంటనే వాతావరణంలో ఉండే వివిధ క్రిముల ప్రభావం వంటి కారణాలు చూపిస్తున్నారు పరిశోధకులు. అయితే అన్నిటికంటే ముఖ్యంగా ‘డి- విటమిన్’ వల్లే ఇలాంటి మార్పులు కలుగుతున్నాయని చెప్పుకొస్తున్నారు. డి విటమిన్ మనలోని ఎముకలు, పళ్లు గట్టి పడేందుకు తోడ్పడుతుందన్న విషయం తెలిసిందే! కానీ మెదడు ఎదుగుదల దగ్గర్నుంచీ, రోగనిరోధక శక్తి వరకూ శరీరంలోని ఎన్నో అంశాలు డి విటమిన్ మీదే ఆధారపడి ఉంటాయని ఇప్పుడిప్పుడే పరిశోధనలు తేలుస్తున్నాయి. శిశువు గర్భంలో ఉన్నప్పుడు ఇటు తల్లికీ, పుట్టిన తరువాత అటు బిడ్డకూ తగినంత డి విటమిన్ అందకపోతే... అది వారి ఎదుగుదల మీద ప్రభావం చూపిస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు. తత్ఫలితంగానే వారిని రకరకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయని పేర్కొంటున్నారు. డి విటమిన్ సూర్యరశ్మి నుంచే లభిస్తుంది కాబట్టి, ఆ సూర్య కిరణాల తీవ్రత ఎక్కువగా లేని నెలలలో పుట్టిన పిల్లలని డి విటమిన్ లోపం ప్రభావితం చేస్తుందని పేర్కొంటున్నారు. ఏతావాతా డి విటమిన్ లోపమే అసలు దోషమని తేల్చారు పరిశోధకులు. అయితే ఒక నెలలో పుట్టినంత మాత్రాన తప్పకుండా ఆయా రోగాల బారినపడి తీరతారన్న భయమేమీ వద్దనీ.... పోషకాహారం, వ్యాయామం, ఒత్తిడి వంటి ఎన్నో విషయాలను కనుక మన నియంత్రణలో ఉంచుకుంటే ఏ రోగమూ మన దరి చేరదని అభయమిస్తున్నారు. పైగా సూర్యకిరణాల తీవ్రత ఎక్కువగా ఉండే ఉష్ణదేశాలలో, నెలని బట్టి ఆరోగ్యం అనే తమ పరిశోధన చెల్లకపోవచ్చునని చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా గర్భిణీ స్త్రీలు కూడా కాస్త నీరెండ తగిలేలా జాగ్రత్తలు తీసుకోవడం మంచిదేమో! - నిర్జర.
read moreప్రాణాలు తీస్తున్న ట్రాఫిక్
ట్రాఫిక్‌లో గంటల తరబడి ఎదరుచూడటం అంటే ఎవరికి మాత్రం అసౌకర్యంగా ఉండదు. ఇలా ట్రాఫిక్‌లో సమయాన్ని గడపడం వల్ల సమయం ఎలాగూ వృథా అవుతుంది. దానికి తోడు అది మన ఆయుష్షుని కూడా హరించివేస్తుందన్న హెచ్చరిక ఇప్పుడు వినిపిస్తోంది. ఇంగ్లండుకి చెందిన ఒక భారతీయ పరిశోధకుడు అందిస్తున్న నివేదిక, ట్రాఫిక్‌లో చిక్కుబడిపోవడం ఎంతటి ప్రాణాంతకమో సూచిస్తోంది. లక్షల ప్రాణాలు గాలిలోని కాలుష్యం వల్ల ఏటా లక్షలమంది ప్రాణాలను కోల్పోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏనాడో హెచ్చరించింది. గాలిలోని కాలుష్యాన్ని పీల్చుకోవడం వల్ల ఆస్తమా, గుండెజబ్బు, పక్షవాతం, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన జబ్బులెన్నో వ్యాపిస్తాయని తేల్చింది. ఇక ఇంగ్లండులో అయితే రోడ్డు ప్రమాదాల కారణంగా చనిపోయేవారికన్నా, రోడ్ల మీద ఉన్న గాలిలోని కాలుష్యాన్ని పీల్చి చనిపోయేవారి సంఖ్య పదిరెట్లు ఎక్కువ అన్న గణాంకాలు వినిపిస్తున్నాయి. ఈ మాటల్లో నిజమెంతో తేల్చుకునేందుకు ప్రశాంత్ కుమార్ అనే నిపుణుడు ఒక పరిశోధనను నిర్వహించారు. 40 శాతం ఎక్కువ సాధారణంగా ఇరుకైన రోడ్లు, ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్న చోట వాహనాల నుంచి వెలువడే వ్యర్థాల పేరుకుంటూ ఉంటాయి. అక్కడి ట్రాఫిక్ నిరంతరాయంగా సాగుతూ ఉండటంతో, విష పదార్థాలు అక్కడి గాలిలోనే స్థిరంగా ఉంటాయి. పరిశోధకులు సేకరించిన వివరాల ప్రకారం, మామూలు రోడ్ల మీదకంటే... కూడలి వద్ద ఉన్న ట్రాఫిక్‌లో 29 రెట్లు అధికంగా ప్రాణాంతక వాయువులు కనిపిస్తున్నాయి. ఇలాంటి చోట్ల వాహనం కనుక నిలిచిపోతే, అక్కడి కాలుష్యం బారిన పడే అవకాశాలు 40 శాతం ఎక్కువగా ఉన్నాయి. ఇదీ ఉపాయం! వీలైనంతవరకూ ట్రాఫిక్ లేని దిశగా ప్రయాణం చేయమని చెప్పడం సులువే. కానీ ఇది ఏమంత ఆచరణసాధ్యం కాదు కదా! పైగా కారుల్లో ప్రయాణం చేసే వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. కారు అద్దాలను మూసేసుకొని లోపల ఫ్యాన్ వేసుకుని కూర్చోవడం మినహా, వారికి మరో ఉపాయం తోచదు. అయితే దీనివల్ల పరిస్థితి ఇంకా ప్రమాదకరంగా మారుతుందంటున్నారు. బయటనుంచి గాలిని తీసుకునే ఫ్యాన్లు లోపల ఉండే ప్రయాణికులకు మరింత విషపదార్థాలను అందిస్తాయని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ట్రాఫిక్‌లో కనుక ఇరుక్కుపోయి ఉంటే కిటికీ తలుపులను మూసివేసుకుని, ఫ్యాన్లను ఆపివేయమని సూచిస్తున్నారు. ముందు ఉన్న వాహనానికి కాస్త దూరంగా ఉండమంటూ సూచిస్తున్నారు. దీని వల్ల వాహనం చుట్టూ ఉన్న వాయువులను పీల్చే ప్రమాదం 76% తగ్గిపోతుందని చెబుతున్నారు. కానీ వేడి, ఉక్కపోత ఎక్కువగా ఉండే మన దేశంలో ఈ సలహాని పాటించడం సాధ్యమేనా అన్నదే ప్రశ్న! - నిర్జర.
read moreచైనా ఏడుపు- జర్మనీ ఏడుపు
పిల్లల ఏడుపుని ఎప్పుడైనా శ్రద్ధగా గమనించారా! ‘ఆ... అందులో గమనించేటందుకు ఏముటుంది? అన్ని ఏడుపులూ ఒకే రకంగా ఏడుస్తాయి కదా!’ అంటారా. పిల్లల మాతృభాషను బట్టి వారి ఏడుపు కూడా మారుతూ ఉంటుందని జర్మనీకి చెందిన ఒక పరిశోధకురాలు తేల్చిచెప్పేశారు. ఇంతకీ ఆ పరిశోధన ఏమిటో, అందులో తేలిన విషయం ఏమిటో, దాని వల్ల మనకి ఉపయోగం ఏమిటో మీరే చూడండి... టోనల్ లాంగ్వేజ్ అన్ని భాషలూ ఉచ్ఛారణ మీదే ఆధారపడి ఉంటాయన్న విషయం మనకు తెలిసందే! అయితే కొన్ని భాషలలో, ఆ ఉచ్ఛారణలోని చిన్న చిన్న మార్పులను బట్టి అర్థాలు మారిపోతూ ఉంటాయి. ఉదాహరణకు చైనీయులు పలికే మాండరిన్ భాషలో ఒకే పదాన్ని నాలుగు రకాలుగా పలికితే, నాలుగు అర్థాలు వస్తాయి. ఇక ఆఫ్రికాలో వినిపించే లామ్‌సో అనే భాషలో అయితే ఒక పదాన్ని ఎనిమిదిరకాలుగా పలికి ఎనిమిది అర్థాలను తీయవచ్చు. ఇలా స్వరంలో మార్పుని బట్టి వేర్వేరు అర్థాలను కలిగించే భాషను ‘టోనల్ లాంగ్వేజ్’ అంటారు. మన దేశంలో పంజాబీ భాష మాత్రమే ఈ విభాగం కిందకు వస్తుంది. భాషని బట్టి ఏడుపు! ఇంతకీ ఈ భాషకూ, పిల్లల ఏడుపుకూ మధ్య సంబంధ ఏమన్నా ఉంటుందా? అని జర్మనీలోని ఉర్జ్‌బర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన కేథ్‌లీన్ అనే ప్రొఫెసరుగారికి అనుమానం కలిగింది. అనుకున్నదే తడవుగా చైనాకు చెందిన ఓ 55 మంది పిల్లలనీ, లామ్‌సోని మాట్లాడే ప్రాంతంలో ఓ 21 మంది పిల్లలనీ ఆమె పరిశీలించారు. ఆశ్చర్యంగా మాండరిన్ వంటి టోనల్ లాంగ్వేజ్ మాతృభాషగా కలిగిన పిల్లల ఏడుపు కూడా అలాగే రాగయుక్తంగా ఉంటుందని ఈ పరిశోధనలో తేలింది. అలాకాకుండా సాఫీగా సాగిపోయే జర్మనీ వంటి మాతృభాషలు కలిగిన పిల్లలు సౌమ్యంగా ఏడుస్తున్నారట ఎందుకలా! పిల్లలు తమ తల్లి కడుపులో ఉన్న ఆరో నెల నుంచే, ఆమె మాట్లాడుతున్న భాషను గుర్తిస్తారని చెబుతున్నారు కేథ్‌లీన్. ఆమె మాట్లాడే భాషకు అనుగుణంగానే తాము కూడా శబ్దాలు చేసేందుకు ప్రయత్నిస్తారనీ... అందువల్ల, తల్లి మాతృభాష పిల్లల ఏడుపులో ప్రతిధ్వనిస్తుందనీ అంటున్నారు. అత్యాధునిక వసతులు ఉన్న చైనాలో అయినా, ఆధునికతకు అల్లంత దూరాన ఉండే ఆఫ్రికాలో అయినా... ఈ నియమం వర్తిస్తుందని రుజువు చేస్తున్నారు. ఉపయోగం ఇంకా ఈ ప్రపంచంలోకి రాకుండానే పిల్లల మెద,డు తమ మాతృభాషను నేర్చుకునేలా రూపుదిద్దుకుంటోందని ఈ పరిశోధనతో తేలిపోతోంది. దీనిని బట్టి పిల్లలకు మొదట మాతృభాష నేర్పించిన తరువాతే ఇతర భాషల జోలికి పోవాలని స్పష్టమవుతోంది. పైగా ఇలా పిల్ల ఏడుపుని, భాషకు అనుగుణంగా పరిశీలించండం వల్ల... వారి మానసిక ఎదుగుదల సవ్యంగా ఉందా లేదా అన్నది గమనించవచ్చన్నది పరిశోధకులు అభిప్రాయం. మరీ ముఖ్యంగా మున్ముందు సదరు పిల్లల్లో భాషని నేర్చుకోవడంలో ఏవన్నా సమస్యలు ఏర్పడతాయేమో అన్నది ముందుగానే పసిగట్టవచ్చునన్నది కేథ్‌లీన్ ఆలోచన. మంచిదే! (తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా) - నిర్జర.
read moreAnti-inflammatory drugs treat Alzheimer’s
A commonly used Non- Steroidal Anti Inflammatory Drug may successfully treat the Alzheimer’s disease. The drug “Mefenamic acid” is basically used for period pain. It reverses the memory loss as well as the inflammation of brain. Researchers from the Manchester University of UK performed a study on transgenic mice that are suffering from Alzheimer’s. Ten mice were treated with Mefenamic acid and ten were treated with Placebo. The drug was given to the mice that developed memory problems at the time of treatment by implanting a Mini-Pump under the skin for a month. It reversed the memory loss of the treated mice to the normal levels. The drug had been shown to target the inflammatory path way for the first time. More studies are to be performed in order to identify the impact of the drug on human beings as well as the implications of it when the drug is used for a long term according to the researchers. Brough, who is leading the researchers of the university said, “There is experimental evidence now to strongly suggest that inflammation in the brain makes Alzheimer’s disease worse. Our research shows for the first time that mefenamic acid, a simple Non – Steroidal Anti Inflammatory Drug can target an inflammatory pathway called the NLRP3 inflammasome, which damages brain cells. Until now, no drug has been available to target this pathway, so we are very excited by this result”.
read moreClove - The Miracle Spice
From centuries together, clove has been a part of Indian culinary as well as traditional medicine. Times have changed and science has moved on, but clove still retains its prominence in our food as well as our health. Scientifically known as Syzygium aromaticum, clove has been a part of Asian exports and cuisine. Here are some of the health benefits of clove that can’t be ignored... Toothache No other herb seems to be as effective as clove when it comes to toothache. Clove relives the pain, works as anti-inflammatory by reducing the swelling around the teeth and prevents the infection from spreading to other teeth. Dab some clove oil on and around the affected teeth and watch the results. The effectiveness of clove on teeth is the reason why we could find it as an active ingredient in most of the toothpastes! Cough When it comes to respiratory problems, clove could be miraculous. Besides being anti-inflammatory and anti-bacterial... clove acts as expectorant for coughs caused by phlegm. Further it can provide a soothing relief in many respiratory ailments such as sore throat, cold, bronchitis, asthma, sinusitis etc. Chew a clove regularly or drink some tea brewed along with clove to get relived from such problems. Digestion Cloves are used as `Carminatives’ in traditional medicine, which means that they are either intended to prevent formation of gas or facilitate its expulsion. Cloves are also known to improve the digestion. Further, cloves are considered as a sort of ` Anthelmintics’, which means that they are believed to get rid of worms and other parasites that are present in our digestive system. Diabetes Diabetes is a problem where the sugar levels in the body gets out of control, due to problems in insulin production and absorption. Recent studies were proving that clove can initiate the insulin production and thus control the sugar levels. According to a research done by Dr. Alam Khan, cloves have the capability of lowering the serum glucose from 225 mg to 150 mg, when clove is consumed for 30 days. Joint Pains There is no doubt that clove works as a reliever of pain and reducer of swelling. Further, it contains a chemical called `Eugenol’, which is proved to be an effective antiseptic and antioxidant. Eugenol is even known to have anaesthetic properties. It is even believed that Eugenol could help in maintaining bone density. So rub a bit of clove oil on the joints and add a piece of clove in your food, and you won’t complain about painful joints. Clove is also suggested in treating a lot of problems such as nausea, bad breath, vomiting, acne, earache and stress. Use it and you would know why! - Nirjara.
read moreఉద్యోగం నచ్చట్లేదా? ఆరోగ్యం గోవిందా!
మీరు చేస్తున్న ఉద్యోగం సంతోషంగానే ఉందా? అని ఎవరినన్నా అడిగామనుకోండి- ‘ఆ! ఏదో అలా నడిచిపోతోంది,’ అన్న సమాధానమే ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఇంకొందరైతే ఆ ప్రశ్న వినిపించడమే ఆలస్యం... తమ ఉద్యోగంలో ఉన్న కష్టాలన్నింటినీ ఏకరువు పెట్టేందుకు సిద్ధపడిపోతుంటారు. చేసే ఉద్యోగంలో మనం ఎంత తృప్తిగా ఉన్నామన్నది మన మానసిక స్థితి మీద ప్రభావం చూపుతుందన్న విషయం తెలిసిందే! కానీ ఇప్పుడు అది మన ఆరోగ్యాల మీద కూడా ప్రభావం చూపుతుందన్న విషయం ఓ పరిశోధనలో రుజువైంది. వేలమంది మీద! అమెరికాలోని ఓహియో విశ్వవిద్యాలయానికి చెందిన జొనాధన్ దిల్రాం, హ్యూ జెంగ్ అనే పరిశోధకులు ఒక అధ్యయనాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా 1979లో 6,432 మంది అమెరికన్లకు సంబంధించిన వివరాలను సేకరించారు. వీరంతా కూడా అప్పుడు యుక్తవయస్కులే! వారందరినీ కూడా తమ ఉద్యోగానికి 1-4 పాయింట్ల లోపు ఎన్ని పాయింట్లని కేటాయించగలరో చెప్పమన్నారు. ఉద్యోగం ఏమాత్రం నచ్చకపోతే 1 పాయింటు, బాగా నచ్చితే 4 పాయింట్లు కేటాయించారు అభ్యర్థులు. పరిశోధన మొదలు అభ్యర్థులందరి నుంచీ తరచూ సేకరిస్తూ వచ్చిన సమాచారం ఆధారంగా, పరిశోధకులు వారిని నాలుగు భాగాలుగా విభజించారు. ప్రతిసారీ తాము చేస్తున్న ఉద్యోగం నచ్చట్లేదు అని చెప్పినవారు 45 శాతం ఉంటే, తమ ఉద్యోగం చాలా బాగుంది అని తరచూ చెప్పేవారి సంఖ్య 15 శాతంగా తేలింది. ఇక మొదట్లో ఉద్యోగం నచ్చినా రాన్రానూ విరక్తి చెందినవారు 23 శాతంగా ఉంటే, మొదట్లో తమ ఉద్యోగం ఏమాత్రం బాగోలేదని చెప్పి తరువాత తృప్తిపడిపోయినవారు 17 శాతం మంది. పరిశోధకులు ఇలా వేర్వేరు విభాగాలలో ఉన్నవారి ఆరోగ్యాలను కూడా నిశితంగా పరిశీలించారు. 40 ఏళ్లు దాటిన తరువాత వారిలో ఏర్పడే అనారోగ్య సమస్యలకీ, ఉద్యోగంలో వారు పొందుతున్న తృప్తికీ మధ్య ఏదన్నా సంబంధం ఉందేమో అని గమనించారు. సంబంధం ఉంది! మొదటి నుంచీ కూడా తాము చేస్తున్న ఉద్యోగం నచ్చట్లేదు అని చెప్పినవారు, 40 ఏళ్లు దాటిన తరువాత ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నట్లు తేలింది. నిద్ర సరిగా పట్టకపోవడం, క్రుంగుబాటుకి లోనవ్వడం, తరచూ ఆందోళనకు గురవ్వడం.... లాంటి మానసిక సమస్యలు ఎన్నింటినో ఎదుర్కొన్నట్లు బయటపడింది. మొదట్లో ఉద్యోగం బాగోలేదని చెప్పి తరువాత కాలంలో కొంచెం తృప్తిపడిన వారి పరిస్థితి మాత్రం మెరుగ్గా ఉంది. ఇక ఉద్యోగంలో ఏ రోజూ తృప్తి లభించలేదు అని భావించినవారిలో పైన పేర్కొన్న సమస్యలతో పాటుగా వెన్నునొప్పి వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు సైతం కనిపించాయి. మరి నివారణ! సాధారణంగా ఒక మనిషి తన రోజులో మూడో వంతు (8 గంటలు) ఉద్యోగం చేయడంలోనే గడిపేస్తాడు. అంతంతసేపు జీవితాన్ని గడిపే సమయంలో విపరీతమైన ఒత్తిడి, అసంతృప్తి తప్పకుండా అతని ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అవన్నీ కూడా 40 ఏళ్లు దాటిన తరువాత బయటపడటం మొదలుపెడటాయి. స్థిరంగా ఉండే ఉద్యోగం అయితే అంతగా అసంతృప్తి, ఆందోళన ఉండకపోవచ్చునని చెబుతున్నారు నిపుణులు. ఇందుకోసం జీతం కాస్త తక్కువైనా, ప్రశాంతంగా సాగిపోయే ఉద్యోగాన్నే ఎన్నుకోవాలని సూచిస్తున్నారు. - నిర్జర.
read moreLow fat diets result in disastrous health problems
Many think that the full fat food blocks the arteries and would result in gaining the weight. According to the latest nutrition research from the National Obesity Forum, UK, it could be said that low fat diets result in disastrous health problems. Dr. Trudi Deakin, a leading dietitian said that, the flawed from the 1950s convinced people that fat is bad for us, but it was never proven that saturated fat caused heart disease and the problem with low fat food is that when the manufacturers of the food strip out fat, they replace it with sugar as well as starch. Replacement of fat with sugar as well as starch results in increasing the insulin which damages the appetite and makes it difficult to digest the nutrients. He also added that the natural fat that is found in dairy products is extremely nourishing and eating it can actually prevents weight gain and cuts the risk of heart diseases because dietary fat helps in improvising the functions of the brain. Many choose low fat readymade packaged food over normal fat food because they think that it is a healthy choice and it wouldn’t increase the weight. Whereas Dr Supreet Grover who is a clinical nutritionist and a weight loss consultant explains that, all are ready to eat food that is labeled as low fat and they don’t know that the food is high on sugar as well as preservatives. The calories in low fat digestives and in digestives are almost same and if one really goes through it, he/she would find number of such comparisons in various products. As the products may be high on sugar, salt are preservatives it is not going to make them all healthy. Also a food product that is low in fat as well as in sugar may not be palatable according to him. As all sorts of fats are harmful for the human body, we have been asked to cut it down since ages. The fact is that all the fats are not bad and they in fact provide energy, helps in soaking the vitamins A, D, E and K into our body. Since our body cannot produce certain essential fatty acids, the acids would be taken from the natural fat that has been consumed in the form of food. Fitness nutritionist as well as the proprietor of Q Slim Fitness studio, Pallavi Srivasta says that the news research indicates that saturated fats coming from the diet might not increase the cholesterol in the body directly but the process foods might result in health problems. Proportionate consumption of high food fats helps in reducing the weight for obese people. Consultant Nutritionist, Pooja Makhija states that many people equate food fat for body fat. For the body to function optimally, fat is necessary. Elimination of normal fat food from the diet results in severe health issues. Invisible fat and visible fat are two kinds of fats. Invisible fat that is present in the food naturally should be embraced and the visible fat that is added to the food to make it taste better should be avoided. According to Pooja, Invisible fat contains many other nutrients like vitamins, minerals and anti-oxidants which are highly beneficial for the health. While picking the food, the natural form of it is better than the processed one. Therefore it could be concluded that, the lesser the food is processed the lesser it is harmful for the human bodies.
read moreపిల్లల్లో ఊబకాయం ఉంటే!
ఇంట్లో పిల్లలు మితిమీరిన బరువుతో ఉంటే కంగారు పడటం సహజం. వారు ఊబకాయులుగా మారిపోతారన్న భయమూ సహజమే! ఎందుకంటే ఊబకాయం కేవలం ఒక లక్షణం మాత్రమే కాదనీ, సవాలక్ష రోగాలకు సింహద్వారం అని ఈపాటికే తేలిపోయింది. కానీ ఇలాంటప్పుడు తల్లిదండ్రుల చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలంటున్నారు నిపుణులు. ఇందుకోసం American Academy of Pediatrics అనే సంస్థ ఓ ఆరు సూచనలను అందిస్తోంది. అవేమిటంటే... డైటింగ్‌ను ప్రోత్సహించవద్దు! పిల్లల్లో మరీ ముఖ్యంగా టీనేజీ పిల్లల్లో ఊబకాయం ఉందన్న స్పృహ కలగగానే, దాన్ని ఎలాగైనా తగ్గించుకునేందుకు డైటింగ్‌లోకి దూకేస్తారు. నిజానికి డైటింగ్ అనేది ఊబకాయానికి ఓ పరిష్కారం కాకపోగా, అది మరిన్ని ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందంటున్నారు వైద్యులు. పైగా డైటింగ్ వల్ల ఊబకాయం తగ్గకపోగా, పెరిగే అవకాశమే ఎక్కువగా ఉందని హెచ్చరిస్తున్నారు. బరువు గురించి మాట్లాడవద్దు అధికబరువు, ఊబకాయం వంటి విషయాల గురించి పిల్లల వద్ద మాట్లాడకపోవడమే మంచిదంటున్నారు. ఇలాంటి మాటల వల్ల పిల్లల్లో తాము ఎలాగైనా లావు తగ్గాలనే తపన కలుగుతుంది. ఆ తపనలో డైటింగ్, ఉపవాసాలు వంటి పద్ధతులను ఎడాపెడా అనుసరించేయడం మొదలుపెట్టేస్తారు. అవహేళన కూడదు కళ్ల ముందు ఎవరన్నా పిల్లలు కాస్త బొద్దుగా కనిపిస్తే, వారిని ఏడిపించేవారికి కొదవ ఉండదు. ఇలాంటి అవహేళనలు సదరు పిల్లల్లో ఆత్మన్యూనతకి దారితీస్తాయి. వాళ్లు తమ శరీరాన్ని తాము ద్వేషించే స్థితికి చేరుకుంటారు. ముఖ్యంగా కౌమార వయసులో ఉన్న పిల్లల మనసు మీద, ఇలాంటి ప్రతికూల వ్యాఖ్యలు చాలా ప్రభావం చూపుతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ, సరదాగానైనా సరే... ఊబకాయం గురించిన హేళన కూడదు. కలిసి తినండి వీలైనంతవరకూ, కుటుంబం అంతా కలసి కూర్చుని భోజనం చేయడం మంచిదట! దీనివల్ల వారి మధ్య అనుబంధాలు దృఢం కావడం మాట అటుంచి ఆకలికి తగినంత ఆహారాన్ని తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా టీవీ చూస్తూనో, వేళాపాళా లేకుండానో తినే అలవాటు ఉంటేనో... ఆహారం ఎక్కువ తక్కువలుగా తీసుకునే ప్రమాదం ఉంది. పైగా ఒకేచోట కలిసి భోజనం చేయడం వల్ల, ఒకరిని చూసి మరొకరు పోషకాహారాన్ని తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యాయామాన్ని ప్రోత్సహించండి ‘వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా, బలంగా ఉంటావు!’ అన్న సాకుతో పిల్లల్లో వ్యాయామాన్ని ప్రోత్సహించండి. అంతేకానీ ‘వ్యాయామం చేస్తే బరువు తగ్గుతావు, సన్నబడతావు!’ అని చెప్పవద్దు. ఆరోగ్యం పేరుతో పిల్లల్ని వ్యాయామానికి ప్రోత్సహిస్తే, బరువు దానంతట అదే తగ్గుతుంది. ఆరోగ్యకరమైన వాతావరణం! ఇంట్లో ఆరోగ్యకరమైన అలవాట్లకు అవకాశం ఇవ్వండి. పళ్లు, ఆకుకూరలు, తృణధాన్యాలు.... వంటి పోషకాలు పిల్లల ఆహారంలో ఉండేలా జాగ్రత్త తీసుకోండి. కూల్‌డ్రింకులు, బేకరీ పదార్థాలు, చాక్లెట్లు... వంటి చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలకు ఇంట్లో చోటు పెట్టవద్దు. దీంతో పిల్లలు బయట ఏం చేసినా కానీ, కనీసం ఇంట్లో అన్నా ఆరోగ్యకరమైన అలవాట్ల మధ్య ఉండే అవకాశం ఉంటుంది. పై సూచనలన్నింటినీ కలిపి ఒక్క మాటలో చెప్పాలంటే- పిల్లల ఆహారపు అలవాట్లనీ, జీవనశైలినీ కాస్త మార్చగలిగితే... వారి ఊబకాయపు సమస్య కూడా ఒక కొలిక్కి వచ్చేస్తుందని తేల్తోంది. అందుకే పిల్లల బరువు గురించి కాదు, వారి ఆరోగ్యం గురించి మరింత శ్రద్ధ తీసుకోమంటున్నారు నిపుణులు. - నిర్జర.
read moreOmega 3 fatty acids reduce the brain damage in mice
Ten day old mice that incurred brain injury, which would be caused by a decrease in the flow of blood and oxygen to the brain, were treated by the researchers by injecting Omega 3 fatty acids which are found in food as well as in supplements. The neurological function of the mice had been evaluated by the researchers 9 weeks after the injury of the brain. The oils extracted from the cold-water fish contain DHA as well as EPA which are a part of bioactive omega 3 fatty acids. According to the CUMC researchers and other scientists, fish oil fatty acids protect from oxygen deprivation, reducing inflammation as well as cell death and also save organs as well as cells in many different ways. The mice that were treated with DHA reduced the brain injury significantly and after few weeks DHA improvised the multiple functions of the brain when compared with the mice that were treated with EPA and that were not treated. When the blood flow is restored to the brain after the stroke, free radicals may injure the energy producing structures in the cells and the DHA- treated mice increased the concentration of DHA in the mitochondria of the brain as well as in the energy producing structures. PhD, MD, associate professor at CUMC, senior co-author, Vadim S.Ten said that their findings suggest that injecting the omega 3 fatty acid DHA, after a stroke like event, has the ability to protect brain mitochondria against the damaging effects of free radicals. Interruption of the blood flow and oxygen deprivation in newborns after the birth is the major cause for the brain damage. More than 25% of the affected mice may suffer from neurological impairments that last for a life time and these types of brain injuries are similar to that of the adult strokes. Senior co-author, MD, CM, director of the Institute of Nutrition at CMCU, Richard J. Deckelbaum said that, clinical trials were need to determine if administering lipid emulsions containing DHA shortly after a stroke like brain injury offers the same neuroprotective effects in babies and adults, as seen in mice and if successful, such trials could lead to the development of a novel therapy for stroke in newborns, children, and adults, addressing a major medical need.
read moreమీరేం తింటున్నారో జాగ్రత్తగా చూసి తినండి
"టాంగ్ జ్యూస్ పిల్లలే చేసుకుని త్రాగొచ్చు ఇప్పుడు. ఇందులో ఫ్రెష్ పళ్ళ విటమిన్ సి, డి లు వుంటాయి, పిల్లలకు శక్తిని ఇస్తుంది." "రస్నా," "మాజా," జ్యూస్ లు, కూల్ డ్రింక్స్ వీటి యాడ్స్ కోసం ఎంతైనా ఖర్చు పెడతారు ముఖ్యంగా ఎండాకాలం. ఆ యాడ్స్ చూస్తుంటే అవి త్రాగకపోతే అసలు మన దాహం తీరదేమో అన్నంత అనుమానం వస్తుంది.పిడియాట్రిషియన్స్ పిల్లలకు ఫ్రెష్ పళ్ళని ఇవ్వమంటున్నారు కానీ జ్యూస్ లు ఇవ్వొచ్చా అన్నదానికి, ’జ్యూస్ ల్లో ముఖ్యంగా వుండేది కేవలం చక్కెర, పళ్ళ రుచి అంతే అవి ప్రతి రోజు స్కూల్ కి తీసుకెళ్ళి తాగడం, ఇంటికొచ్చి ల్ డ్రింక్స్ తాగడం వల్ల వారికి ఆ తీయదనం వల్ల బరువు పెరగడం, వూబకాయం వచ్చే అవకాశం వుంది, అందుకని పిల్లలకు తాజా పళ్ళు, తాజా కూరలు తినడం, ఇంట్లో తయారు చేసుకున్న ఆహారాన్ని తినడం, ప్రతిరోజు ఏదో ఒక వ్యాయామం చేయడం అలవాటు చేస్తే వారి ఆరోగ్యానికి మంచిది,’ అని చెబుతున్నారు.ఒకప్పుడు బ్రేక్ ఫాస్ట్ అంటే ఇడ్లీ, సాంబారు, చట్నీ, ఉప్మా, రవ్వ ఇడ్లీ, రకరకాల దోసెలు తాజాగా అంటే ఇంట్లోనే పప్పు రుబ్బుకుని, పచ్చడి చేసుకుని, సాంబారు చేసుకుని, పొద్దునే లేచి తయారు చేసి కుటుంబం అంతా కలిసి తిని, ఇంటినుండే మధ్యాహ్నం బోంచేయడానికి కూడా తీసుకెళ్ళేవారు. ఇప్పటికీ మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వారు ఇంకా ఇలాగే చేస్తున్నారు. కానీ ఇండియాలో ’సిరియల్స్,’ కార్న్ ప్లెక్స్, మర మరాలు లాంటి వాటితో, ల్యాబరేటరీలలో, ఫ్యాక్టరీలలో తయారయ్యే ఈ సిరియల్స్ ని, వీటిని తయారు చేసి ప్యాకేజి చేసి, అట్ట ఫ్యాకెట్లలో, క్యాన్స్ లో, ప్లాస్టిక్ కవర్లలో అమ్మేవాటిని ప్రాసెస్డ్ ఫుడ్ అనే అంటారు. ఇవి తయారు అయ్యేటపుడు వాటిలో సహజంగా వుండే పోషకపదార్ధాలు, విటమిన్స్, పీచుపదార్ధం చాలావరకు పోతాయి. అదీ కాక అవి దుకాణలల్లో చాలారోజులు షెల్ఫ్ లల్లో నిల్వ వుండడానికి వాటిల్లో ప్రిజర్వేటివ్స్ , రంగులు, అడిటివ్స్(ఆహార సంకలితం) ఈ సిరియల్స్ లో రుచి కోసం ఒకోసారి సహజమైనవి, లేదా రసాయనాలు ఉప్పు, మొనొసోడియం గ్లుటానెట్ లాంటివి వాడతారు. విదేశాల్లో పొద్దునే బ్రేక్ ఫాస్ట్ వండుకునే సమయం వుండదు ఎందుకంటే భార్యా, భర్తలిద్దరూ ఉద్యోగాలు, చేసినా చేయకున్నాసులభంగా అయ్యే తిండికి ప్రాముఖ్యతనిస్తారు. పిల్లలు స్కూళ్ళకి వెళ్ళాలి కాబట్టి సులభంగా తిని, గ్లాసు పాలు లేదా గ్లాసు జ్యూసో తాగేసి వెళ్ళిపోతారు. ప్రపంచీకరణతో ఈ సిరియల్స్ తయారు చేసే కంపెనీలు అభివృద్ది చెందుతున్న దేశాలకు కూడా విపరీతంగా ప్రాకిపోయాయి. ఇంతకు ముందు ఈ సిరియల్స్ పట్టణాలలో వుండే కుటుంబాలలో కనిపిస్తూ వుండేవి కానీ ఇప్పుడు టీ.వి.లో వచ్చే యాడ్స్ చూసి కానీ, ఏమీ వండకుండానే పిల్లలు తమంతట తామే చాలా సులభంగా ఒక బౌల్ లో సిరియల్ వేసుకుని, కొన్ని పాలు పోసుకుని తినేసి వెళ్ళిపోవచ్చు, అదీ కాక వాటిని పిల్లలకు నచ్చే విధంగా ఎక్కువ చక్కెర, చాక్లెట్ రుచులతో తయారు చేయడం వల్ల పిల్లలు వీటికి త్వరగా అలవాటు పడిపోతారు. ఇక పెద్దవాళ్ళ విషయానికి వస్తే విదేశాల్లో ఒంటరిగా వుండే వారు, లేకపోతే ఎక్కువ మటుకు బయట తిండే తినడం అలవాటయినవారు బ్రేక్ ఫాస్ట్, కాఫీ, లేదా జ్యూస్ తో మొదలు పెడితే ఫాస్ట్ ఫుడ్సే డంకిన్ డోనట్స్ లో(Dunkin Donuts) బాగా నూనెలో గోలించి చక్కెర పాకంలో వేసిన ఈ డోనట్స్ రకరకాల రుచుల్లో దొరుకుతాయి, ఇవి తిని పెద్ద మగ్ కాఫీతో కడుపు నింపుకునే వారు, లేదా మెక్ డొనాల్డ్స్ లో దొరికే చికెన్ బర్గర్స్, ప్రోటీన్ కోసం బేకన్, పంది మాంసంతో తయారు చేస్తారు, వీటిని బ్రేక్ ఫాస్ట్ లో బ్రెడ్ పైన ఒక అమ్లెట్ పూర్తిగా కాలకుండానే తీస్తారు, మరో బ్రెడ్ ముక్కపై ఈ బేకన్ ముక్కలు కాల్చుకుని తింటారు,(ఇవి బాగా వండినవి తినాలి.) కానీ అమెరికన్స్ చాలా మంది బయట తింటే సరిగ్గా ఉడికీ ఉడకనీ మాంసాన్నే (ఏ రకమైన మాంసమైనా) ఇష్టపడి తింటారు, దీనివల్ల కడుపుకి సంబంధించిన జబ్బులు చాలా వస్తాయి. ఒకోసారి క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశం వుంటుంది. ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల మధ్య గట్టి పోటి వుంటుంది నెంబర్ వన్ బ్రేక్ ఫాస్ట్ - ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనిపించుకోవడానికి. కస్టమర్లని ఆకట్టుకోవడానికోసం మెక్ డొనాల్డ్స్ వారు రెండువారాలు ఎటువంటి బ్రేక్ ఫాస్ట్ తోనయినా రోజు ఫ్రీగా మంచి రుచికరమైన కాఫీ రెండువారాలు ఇచ్చారు ఈ మధ్యనే బ్రేక్ ఫాస్ట్ పోటీలో ఇతర ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కన్నా నెంబర్ వన్ అనిపించుకోవడానికి. టాకో బెల్ అనే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ క్రొత్త బ్రేక్ ఫాస్ట్ వాఫుల్ టాకోస్ (Waffle Tacos) ప్రవేశ పెడ్తుందని మెక్ డొనాల్డ్స్ వాళ్ళు ఈ పని చేసారు. ఇద్దరూ కొత్త అడ్వర్టయిజ్ మెంట్స్ తో కస్టమర్లని ఆకట్టుకోవడానికి హోరా హోరిగా పోటి పడ్డారు. ఈ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రెష్ తిండి కాదు ల్యాబోరేటరీలలో తయారయి వాటిలో నిలవ వుండడానికి వాడే రసాయనాల వల్ల్ల గ్యాస్ట్రో ఇంటస్టినల్ ప్రాబ్లెమ్స్, పిల్లలు పుట్టే అవకాశం తగ్గిపోతుంది, మన లోపలి శరీర భాగాలు కూడా బాగా దెబ్బ తింటాయి.ఈ మధ్యన చేసిన అమెరికాలో 20,000 వేల అమెరికన్లు అంటే తెల్లవారిని, నల్లవారి కలిపి వారు ఎలాంటి తిండి తింటున్నారు వారికి ఎందువల్ల స్ట్రోక్, పక్షవాతం ఎక్కువగా వస్తుంది అనే విషయం పై రిసెర్చ్ చేసారు. అమెరికాలో దక్షిణ ప్రాంతపు రాష్ట్రాలల్లో ఆఫ్రికన్ అమెరికన్స్, నల్లవారు బాగా నూనెలో గోలించిన తిండి, ఫ్రైడ్ చికెన్, ఫ్రెంచ్ ఫ్రైస్, ప్రాసెస్ చేసిన బేకన్, హామ్(ham- ఇంకో రకమైన పంది మాంసం), తియ్యటి టీ, కాఫీలు, సోడాలు త్రాగే వారికి ఈ పక్షవాతం వచ్చే అవకాశం వుంది, ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా వుంది. నూనెలో బాగా వేయించిన తిండి తిన్నవారికి కొలస్ట్రాల్ ఎక్కువవ్వడం, బ్లడ్ ప్రెషర్ విపరీతంగా పెరగడం, డయాబెటిస్ జబ్బున్నవారికి మరింత క్లిష్టమవ్వడం, స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువవ్వడం జరుగుతుంది. వీరికి వ్యతిరేకంగా తాజా పళ్ళు, కూరలు, పప్పు దినుసులు, ధాన్యం, చేపలు తినేవారికి 29% స్ట్రోక్ వచ్చే అవకాశం తక్కువుంది. అమెరికాలోని దక్షిణ రాష్ట్రాల్లో వుండే వారికి నూనెలో గోలించిన తిండి తినడం వల్లే స్ట్రోక్ వస్తుందని పరిశోధనలో వెల్లడయ్యింది. ఈ పరిశోధనని మనం సీరియస్ గా తీసుకుని ఆలోచిస్తే ప్రపంచం ఏ నలుమూలలో వున్న వారయినా ఇలాంటి తిండి తింటే స్ట్రోక్ రావడమే కాదు ఇంకా ఇతర జబ్బులు కూడా వచ్చే అవకాశాలున్నాయని గమనించాలి. ఇండియాలో కూడా ప్రపంచీకరణ తర్వాత మన ఫాస్ట్ ఫుడ్ తో పాటు అంటే పకోడీలు, మిరపకాయ బజ్జీలు, గారెలు, సమోసాలు లాంటివి సాయంత్రం కాగానే బండీల చుట్టూ చేరి అన్నీ వయసుల వారు తింటూనే వుండేవారు. ఇప్పుడు వాటికి తోడు మెక్ డొనాల్డ్స్ లాంటివి, పిజ్జాలు విపరీతంగా ఎక్కువయిపోయాయి. ఈ అనారోగ్యపు తిండి తిని వూబకాయాలు పెంచుకోవడం, జబ్బులు పెంచుకోవడం మామూలైపోయింది. కూల్ డ్రింక్స్ లో కూడా సోడా నుండి ఆర్టిఫిషియల్ రుచి విడిపోకుండా బివిఓ (BVO - Brominated vegetable oil) కలుపుతున్నారు. ఈ బివిఓ, ప్లాస్టిక్ వస్తువులు మంటలు అంటుకుని కాలకుండా వుండడానికి వాడేవారు. అలాంటిది కూల్ డ్రింక్స్ లో, కొన్ని రకాల జ్యుసుల్లో కలుపుతున్నారని తెలిసి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారు అభ్యంతరం తెలపడంతో కొన్ని కూల్ డ్రింక్స్ వారు ఈ బివిఓ ని తీసేయడానికి ఒప్పుకున్నారు. ఈ బివిఓ కలసి వున్న కూల్ డ్రింక్స్ తాగితే చర్మ వ్యాధులు, మతి మరుపు, నరాల జబ్బులు వచ్చే అవకాశాలున్నాయి. విదేశాల్లో ముఖ్యంగా అమెరికాలో నీళ్ళకు బదులు ఈ కోక్ లు, లేదా జ్యూస్లు త్రాగడం అలవాటు. పిల్లలకు ఒకసారి ఇవి అలవాటయితే వారు నీళ్ళు అస్సలు ముట్టుకోనే ముట్టుకోరు. నీళ్ళు త్రాగమని యాడ్స్ వస్తుంటాయి. వీటితో పాటు బయటి తిండి తినడం కూడా అలవాటు పడితే కేవలం వూబకాయం రావడమే కాదు భయంకరమైన క్యాన్సర్ జబ్బులు చిన్న వయసులోనే వచ్చి ఎన్ని ట్రీట్ మెంట్లు ఇచ్చినా పని చేయకుండా అవుతాయి. మీకు ఇంకో విషయం తెలిస్తే షాక్ కి గురవ్వుతారు. అదేమిటంటే హెల్త్ ఇన్స్యూరెన్స్ వారు వారి పెట్టుబడులు ఎక్కువ ఎక్కడ పెడుతున్నారో తెలుసా? ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ల్లో. ఎందుకంటే ఈ తిండికి అలవాటు పడే జనాబకి జబ్బులు వస్తాయి అవి కూడా ఎలాంటివి అంటే క్రానిక్ జబ్బులు అంటే వాటికి ట్రీట్ మెంట్ జీవితాంతం అవసరం అవుతుంది. అప్పుడు వారికి హెల్త్ ఇన్స్యూరెన్స్ అవసరం అవుతుంది. ఇలాంటి విషయాలు చూస్తే ఈ పెద్ద పెద్ద వ్యాపారస్తులకు, ఇన్స్యూరెన్స్ కంపెనీలకు, హాస్పిటల్స్ కి వారికి వచ్చే లాభాలే ముఖ్యం, వారి స్వార్ధం వారిదే కానీ ప్రజల ఆరోగ్యం, వారి బాగోగులు లాంటివి అస్సలు అవసరం లేదు అనే విషయం ఆలోచిస్తేనే మనం ఏ దిశగా పయనిస్తున్నాము? ఇది అభివృద్ది అనాలా, స్వార్ధపరత్వం ఎక్కువై పోయి దిగజారుతున్న వ్యవస్థ అని అనుకోవాలో తెలియని అయోమయ అవస్థ. అందుకనీ ఆరోగ్యవేత్తలు, సైంటిస్టులు జబ్బులు చేయకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ప్రజల్లో ఆరోగ్య జాగ్రత్తల గురించి అవగాహన పెంచాలని కోరుకుంటారు, దీన్నే ప్రివెంటివ్ కేర్(Preventive care) అంటారు. ఈ మధ్యన కొనుక్కునే తిండిలో ఏం వుంటుంది, కొన్ని రకాల తిండిలో ఎరువులు కలుపుతున్నారని కూడా తెలుస్తుంది దాని వల్ల వచ్చే నష్టాలు ఏమిటి అనే విషయాల పై కొంచెం అవగాహన పెరుగుతుంది దాని వల్ల వాటి అమ్మకాలు తగ్గడంతో కొంతమంది ఆ తిండిలో కలిపే రసాయనాలు తీసేస్తున్నామని ప్రజలకి నమ్మకం కలిగించి మళ్ళీ వాళ్ళని ఆకట్టుకోవడానికి కొత్త యాడ్స్ చేస్తున్నారు ఇపుడు. రసాయనాలు పూర్తిగా తీసేస్తున్నారో, కొద్దిగా వుంచితే అది న్యుట్రిషన్ సమాచారంలో చూపించేంత శాతం లేకుండా చూసుకుంటున్నారా అన్నది చూడాలి అంటున్నారు సైంటిస్టులు. అందుకనే మనం తినే తిండిలో ఏం వుందో చూసుకుని మరీ తినడం మంచిది. ఒకప్పటిలా ఆరోగ్యకరమైన ఆహారం దొరకడం కష్టం అవుతుంది. మంచి నేలలో పండే పంటల్లో ఆ రోజుల్లో ఎరువులు కూడా అవసరం అయ్యేవి కావు, పురుగు పుట్రా పట్టకుండా వుండడానికి, పంటలు బాగా పండాలంటే ఎరువులు ఎక్కువగా వాడడం వల్ల మనం తినే పప్పులు, కూరల్లో కాలుష్యం, పీల్చే గాలిలో కాలుష్యం, ఇవి సరి పోవనట్టు తిండిని ప్రాసెస్ చేసినవి, నూనె, మసాలలు నిండి వున్నవి, బాగా కొవ్వు పదార్ధాలుండే పిజ్జాలు, బర్గర్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, బజ్జీలు, పకోడీలు లాంటి చిరుతిళ్ళు తిని చిన్న వయసులో ఎప్పుడూ కని విని ఎరుగని అనారోగ్యాలకి గురి అవుతున్నారు. చిన్నప్పటి నుండి ప్రాసెస్ చేసిన తిళ్ళు రోజు తింటుంటే వాటిలో వుండే రసాయనాలు మన శరీరం పై ప్రభావం చూపడం చిన్న వయసులోనే క్యాన్సర్, గుండె జబ్బులకి గురి కావడం జరుగుతుంది. అదీ కాక జీవన విధానం కూడా మారడంతో, నడక తగ్గడం, సైకిల్స్ పై వెళ్ళడం తగ్గిపోవడంతో, శరీరానికి కావాల్సిన వ్యాయమం దొరకక కూడా వూబ కాయం, డయాబెటిస్, బ్లడ్ ప్రెషర్, గుండెకి, గ్యాస్ట్రో ఇంటస్టినల్ కి సంబంధించిన వ్యాధుల భారిన పడుతున్నారు. ఆందుకని మన ఆరోగ్యం గురించి, ఆరోగ్యకరమైన ఆహారం గురించి తెలుసుకోవడం అలాగే ఎలాంటి తిండి తింటే మనకి జబ్బులు వచ్చే అవకాశాలున్నాయో వాటి గురించి అవగాహన పెంచుకుని జాగ్రత్తలు తీసుకుంటే చిన్న వయసులోనే జబ్బుల భారిన పడకుండా వుండే అవకాశం వుంది. టీ.వీలో వచ్చే యాడ్స్ చూసి అవి నమ్మేసి అన్నీ కొనేసి సులభంగా అవుతుందని ఈ ప్రాసెస్డ్ తిండికి అలవాటు పడకుండా చిన్నప్పట్నుండే పిల్లలకు కనిపించేవన్ని మంచివి కావని వాటిలో ఏముంటాయో ముందుగా తల్లి తండ్రులు తెలుసుకుని పిల్లలకి తెలియజేసి వారికి తాజా కూరలు, తాజా పళ్ళు, పప్పు దినుసులు, ధాన్యం, మాంసాహారం తినే వారు చేపలు తినడం అలవాటు చేసుకోవడంతో పాటు శరీరానికి కావాల్సిన వ్యాయామాన్ని చేయాలి అనే నియమం పెట్టుకుని చేస్తే ఆరోగ్యమే మహాభాగ్యం అనే మాటని నిజం చేసుకోవచ్చు. తల్లి తండ్రులు ఆరోగ్యకరమైన ఆహారం తినడం, వ్యాయామం చేస్తూ వుంటే పిల్లలకు కూడా అదే అలవాటవుతుంది. పిల్లలకు అర్ధం కాదు అని వదిలేస్తే వారు బయటి తిళ్ళకే అలవాటు పడిపోతుంటారు వారికి చెప్పే విధంగా చెబితే తప్పకుండా వింటారు.
read moreSimple Diet Tips
The quality of food we eat decides our competence at work. here are few simple diet tips. take a look. Stock up the nutrition Keep some healthy and tasty snacks in your desk drawers at all times. Tiny packets of biscuits. Dried fruits, 'Khakhra' , 'murmura' or granola bars can be easily tucked into your drawers. Munch on them when light hunger pangs strike. Drink to your health Staying well-hydrated helps you think more clearly, be less cranky and indulge less in mindless munching. It is also one of the best skin treatments in the world. Pack lunch while you cook You can cook once and eat twice. Make an extra serving or two while cooking dinner.
read moreమంచి నిద్రకి ఆహరం
వయసు పెరుగుతుంటే నిద్ర సరిగా పట్టదు అంటుంటారు. అయితే ఈ మద్య కాలంలోటినేజ్ పిల్లలనుంచి మద్య వయస్కుల దాకా వయసుతో సంబంధం లేకుండా నిద్రలేమితో భాదపడుతున్నారు. అందుకు మారిన జీవన విధానం, ఒత్తిడి, వేళకి ఆహారం తీసుకోకపోవడం ఇలా ఎన్నో కారణాలు వున్నాయి. అయితే తరచూ నిద్రలేమితో భాదపడుతుంటే ఒక్కోసారి మీరు తీసుకునే ఆహరం గురించి ఆలోచించండి అంటున్నారు నిపుణులు. ఉదాహరణకి పిండి పదార్ధాలు,ఖనిజాలు, తక్కువ వుండే ఆహరం తీసుకోవటం, వంటివి నిద్రపట్టక పోవటానికి కారణం కావచ్చుట. మంచి నిద్ర పట్టాలంటే పిండి పదార్ధాలు ఎక్కువగా వుండే ఆహారం తీసుకోవలి ఎందుకంటే పిండి పదార్ధాలు ఎక్కువగా వుండే ఆహారం తీసుకుంటే అవి "ట్రిస్టోఫాన్ "అనే అమినో ఆమ్లాలను మెదడుకు పంపిస్తాయి. దాంతో నిద్ర ముంచుకువస్తున్నభావన కలుగుతుందట. సో పిండి పదార్ధాలు అధికంగా వుండే బియ్యం, గోధుమలు, బ్రెడ్, రాగి, కార్నెఫ్లెక్స్ వంటివి రోజూ నిద్రపోయే ముందు మన ఆహారంలో వుండేలా చూసుకోవాలట. అలాగే కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ మన శరీరంపై మత్తుగా ఉండేలా ప్రభావం చూపిస్తాయట. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో వీటి శాతం తగ్గితే నిద్రలేమి కలగచ్చు. సో పాలు , ఆకు కూరలు, బాదం, జీడి పప్పు, వంటివి ఆహారంలో చేర్చటం తప్పని సరి, మంచి నిద్ర కావలంటే తీసుకునే ఆహారం పై శ్రద్ద పెట్టక తప్పదు. పడుకునే ముందు మాంసకృతులు అధికంగా వుండే స్నాక్స్ తినకపోవటమే మంచిది. ఎందుకంటే ఈ మాంసకృతులు మనం తిన్న ఆహరం నుంచి "ట్రిస్టోఫాన్స్" మెదడును చేరకుండా అడ్డుకుంటాయట. దాంతో సరిగా నిద్రపట్టదు. కాబట్టి రాత్రిపూట ప్రోటీన్లు ఎక్కువ గా వుండే ఆహరం తీసుకుంటే అజీర్ణంతో నిద్రపట్టదు. కాబట్టి రాత్రిపూట ప్రోటీన్లు ఎక్కువగా ఆహరం తీసుకుంటే అజీర్ణంతో నిద్ర పట్టదు. అసలు తినకపోతే ఆకలికి నిద్రపట్టదు. కాబట్టి సమతులాహారం సరిపడా తీసుకోవడం ఉత్తమం అని సూచిస్తున్నారు నిపుణులు. ...రమ
read moreహిల్లరీ క్లింటన్ అనారోగ్యంగా ఉన్నారా?
ఈసారి జరుగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు బహుశా ఎప్పుడూ లేనంతగా ప్రచారం జరుగుతోంది. రిపబ్లికన్ల తరఫున డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాట్ల తరఫున హిల్లరీ క్లింటన్ హోరాహోరీగా పోరాడుతున్నారు. ట్రంప్ తన దూకుడు మాటలతో ఇప్పటికే ప్రపంచాన్ని ఆకర్షిస్తే... అమెరికా చరిత్రలోనే తొలి మహిళా అభ్యర్థిగా హిల్లరీ క్లింటన్ ఇప్పటికే చరిత్ర సృష్టించారు. ఈ హోరాహోరీ ఎన్నికలలో పై చేయిని సాధించేందుకు రకరకాల ఆరోపణలు చేస్తున్నారు అభ్యర్థులు. వాటిలో ఈ మధ్యకాలం వార్తల్లోకి వస్తున్న అంశం... హిల్లరీ క్లింటన్ ఆరోగ్యం! ఇదీ ఆరోపణ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న హిల్లరీ క్లింటన్ అప్పుడప్పుడూ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారన్నది ఆరోపణ. మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక్కసారిగా స్తబ్దుగా నిలబడిపోవడం, మాట ఒకోసారి తీవ్రంగా తడబడటం, బెదురు చూపులు చూడ్డం వంటి పనులు చేస్తున్నారట. ఒక సందర్భంగా అయితే ఫిట్స్ వచ్చిన మనిషిలాగా తలని ఊపడంతో చుట్టుపక్కలవారందరూ కంగారుపడ్డారు. హిల్లరీ ఇలా చిత్రంగా ప్రవర్తించిన వీడియోలు ఇంటర్నెట్‌లో చాలానే కనిపిస్తున్నాయి. ఆమె మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్లే ఇలా ప్రవర్తిస్తున్నారన్నది ఆరోపణ. హిల్లరీ ఉపన్యాసం ఇచ్చిన ప్రతిసారి వెళ్లి విశ్రాంతి తీసుకోక తప్పదంటూ ట్రంప్ వ్యాఖ్యనించారు కూడా! ఇదీ నేపథ్యం 2012లో ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేసే సమయంలో ఒకసారి హిల్లరీకి జ్వరం సోకింది. జ్వరం తీవ్రస్థాయికి చేరుకోవడంతో ఆమె ఒక్కసారిగా అపస్మారక స్థితికి వెళ్లిపోయారు. ఆ స్థితి నుంచి పూర్తిగా కోలుకోవడానికి హిల్లరీకి ఆరు నెలల సమయం పట్టిందంటూ సాక్షాత్తూ ఆమె భర్త బిల్ క్లింటన్ పేర్కొన్నారు. ఎవరన్నా ఇలా ఎక్కువసేపు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోతే వాళ్ల మెదడు దెబ్బతినే అవకాశం ఉంది కదా! అన్నది ఇప్పుడు ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న అనుమానం. ఇదీ జవాబు! హిల్లరీ క్లింటన్ ఏమీ చిన్నపిల్ల కాదు. 69 ఏళ్ల మనిషి. ఆ మాటకు వస్తే హిల్లరీ ప్రత్యర్థి ట్రంప్‌కు 70 ఏళ్లు! ఈ వయసులో చిన్నాచితకా ఆరోగ్య సమస్యలు రావడం సహజం. అంతమాత్రం చేత ఏవేవో ఊహించేసుకుని ఆమెను అభాసుపాలు చేయడం మంచిది కాదంటున్నారు హిల్లరీ అభిమానులు. హిల్లరీ పరిపూర్ణ ఆరోగ్యంతో ఉందని, గత అనారోగ్య సమస్యల నుంచి పూర్తిగా కోలుకుందనీ.. ఆమె వ్యక్తిగత వైద్యురాలైన లీసా బార్డాక్ హామీ ఇస్తున్నారు. అది నిజమేననీ, హిల్లరీ సంపూర్ణ ఆరోగ్యంతో అమెరికా అధ్యక్షపదవిని చేపట్టి చరిత్రను సృష్టించాలన్నది ఆమె అభిమానుల ఆకాంక్ష! - నిర్జర.
read moreరాత్రి వేళల్లో రోగాల ప్రమాదం
తెల్లవారుజామునే నిద్రలేవాలి, రాత్రివేళల్లో ఎక్కువసేపు మేల్కొని ఉండకుండా పడుకోవాలి, వేళ తప్పకుండా తినాలి. ఇలా మన రోజువారీ దినచర్యల గురించి పెద్దలు బోలెడు మంచిమాటలు చెప్పేవారు. మనమేమో వాటిని చాదస్తం అంటూ కొట్టి పారేసేవారం. కానీ పెద్దల మాటలు ఎంత అమూల్యమైనవో నిరూపించే పరిశోధన ఒకటి వెలికిచూసింది. జీవగడియారం కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు శాస్త్రవేత్తలు ఈమధ్యనే ఒక పరిశోధన చేశారు. మన శరీరం మీద రోగకారకాలు ఏ సమయంలో ఎక్కువగా దాడి చేస్తాయా అని పరిశీలించారు. ఇందుకోసం వాళ్లు కొన్ని ఎలుకల మీద హెర్పస్ అనే వైరస్ ఏ సమయంలో ఎక్కువగా దాడిచేయగలదో గమనించారు. ఆశ్చర్యంగా ఎలుకలు నిద్రపోయే సమయంలో, వాటి మీద వైరస్ ప్రభావం పదిరెట్లు అధికంగా ఉన్నట్లు తేలింది. కారణం! మన శరీరంలో ప్రతి కణానికీ ఒక జీవగడియారం ఉంటుంది. ఏ సమయంలో మనం మెలకువగా ఉంటాము? ఏ సమయంలో మనం నిద్రస్తూ ఉంటాము? అన్న పరిస్థితులకు ఆధారంగా ఆ జీవగడియారం పనిచేస్తూ ఉంటుంది. కణాలలోని జీవగడియారాన్ని నియంత్రించే జన్యువుకి Bmal1 అని పేరు పెట్టారు శాస్త్రవేత్తలు. మనం అప్రమత్తంగా ఉన్నప్పుడు, మనతో పాటుగా కణాలు మరింత అప్రమత్తంగా ఉండి రోగాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాయి. గడియారం తారుమారైతే ఒక పద్ధతి లేకుండా ఇష్టం వచ్చినప్పుడు పడుకోవడం, ఇష్టం వచ్చినప్పుడు పనిచేయడం వల్ల ఈ జీవగడియారం దెబ్బతింటుంది. దాంతో శరీరానికి ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలో తెలియకుండా పోవడంతో రోగాలు త్వరగా మనల్ని చుట్టుముడతాయి. పైగా విశ్రాంతి తీసుకోవలసిన సమయంలో తిరుగుతూ ఉండటంతో... వాతావరణంలోని రోగకణాలు త్వరగా మన మీద దాడి చేసే అవకాశం ఉంటుంది. అంటే రాత్రివేళల్లో పనిచేసేవారి మీదా, షిఫ్టుల ప్రకారం ఒక సమయం అంటూ లేకుండా పనిచేస్తూ అస్తవ్యస్తమైన దినచర్య ఉన్నవారి మీదా... రోగాలు త్వరగా దాడిచేసే అవకాశం ఉందన్నమాట. ఉపయోగం - వాతావరణం బాగుండనప్పుడు రాత్రివేళ బయట తిరిగేవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. చేతుల కడుక్కోవడం వంటి జాగ్రత్తలను పాటించడం, నలుగురూ మెసిలే చోటకి దూరంగా ఉండటం చేయాలి. - మన శరీరం మరింత జాగరూకతగా ఉండే పగటిపూట టీకాలను వేస్తే, అవి మరింత ప్రభావవంతంగా పనిచేస్తాయని ఈ పరిశోధన సూచిస్తోంది. - ఇన్నాళ్లూ జలుబు, జ్వరం వంటి రోగాలు చలికాలంలో ఎందుకు ఉధృతంగా వ్యాపిస్తాయో తెలియలేదు. చలికాలంలోని వాతావరణం వల్ల Bmal1 జన్యువు పనితీరు సవ్యంగా లేకపోవడం వల్లే... ఆ కాలంలో మనం త్వరగా రోగాలబారిన పడతామని ఈ పరిశోధనతో తేలిపోయింది. - నిర్జర.
read moreHave you heard of - Blood Type Diet?
These are the days of awareness over health. Every now and then we find some kind of diet or therapy surfacing assuring miraculous cures. `Blood Type Diet’ is one such assumption that’s offering good health. Blood Type diet is an idea developed by a naturopath named Peter J. D'Adamo. He claims that our body reacts differently with different foods based on our blood group. The food we eat affects our carbohydrates basing on our blood group! If we follow the diet that suits our blood group... we can be slim and healthy. He suggests the following foods for each type of blood group and offers the explanation behind his suggestion. O group blood Peter claims that O group blood is our ancestral blood group. So, they should eat more of high protein food that suits the diet of a hunter! He suggests them to rely much on meat, poultry, fish and vegetables that are rich in protein. A group blood According to Peter this kind of group has evolved during the agrarian era. So people with `A’ group should be eating more of vegetables and fruits. And of course, they should be organic as they are much prone to heart disease, cancer, and diabetes. B group blood Peter assumes that B group blood has originated from the nomadic tribes and thus they are more effective in digesting meat and dairy products! Type B’s are said to have good immune and digestive systems than the people with other blood groups. AB group blood As per Peter, type AB is the recent form of evolution in the blood group. But they have to rely on the diet similar to type B rather than type A. This means that they should eat more of dairy products and eggs. The daily routine It’s not just the case of diet! Peter suggests that people with different blood groups have different traits. They differ in their immunity and digestion. Basing on such variations, Peter even recommends various workouts for different groups. The Truth! - There isn’t much scientific evidence to prove that blood groups affect our digestive process. - Some evidence was found that food suggested to `A’ group can be healthy. But that can be healthy for any person of any blood group, as it consists of fruits and vegetables! - If people follow the diet pattern of Peter and rely mostly on the prescribed diet... such diet might affect their medical conditions and nutritional intake. So, sceptics have rubbished this `Blood Type Diet’ as nothing but mere Fad Diet! A Fad Diet is nothing but a diet that promises huge health advantages without any scientific evidence. But many Europeans are still relying on Peter and were following his diet! - Nirjara.
read moreAwesome benefits of Vaseline
Awesome benefits of Vaseline In 1859, a young chemist named Robert Chesebrough found the wax at oil rigs to be quite interesting. He made further research on the wax and obtained a patent for the wax under the name Vaseline. Since then, Vaseline has become a generic name for Petroleum Jelly. Vaseline has been an instant hit as a moisturiser as it quickly melts on the body... and it is devoid of any taste or smell. But if you are bit innovative, you can find many other uses of Vaseline too. Let’s watch some of them... Cracked Heels: Due to continuous walking and harsh soles, the skin on our heels may develop cracks. Cracked heels are not only uncomfortable, but may also be painful. People might even feel inferior to display their cracked heels. Vaseline retains and regains the moisture needed to heal the heels. Shiny nails: If you love to have shiny nails but hate to polish them frequently... Vaseline could be the answer. And that’s not the end of the idea. Applying Vaseline on the nails would moisten the lower part of your nails called- Cuticles! Vaseline would also provide needed moisture to the skin around the nails. Body Scrub: We often hear about removing the flakes of dead skin over our lips and body to make them shine and look healthy. Beauticians suggest mixing Vaseline with sugar to scrub our lips. And to scrub the body parts... Vaseline should be mixed with salt. Eyebrows: How often we look at the mirror and hope that our eyebrows should have been straight. A dab of Vaseline can do it for you. Applying some Vaseline would not only keep them at place, but would also make them appear shiny. Rings and Earrings: Inserting earrings can often be painful... if we don’t wear them often. Rubbing our lobes and the earrings with Vaseline can make the procedure painless. The same tip can be applied to wear the finger rings which are a bit stiff. Smooth Elbows: The skin at the elbows often gets roughed while working. As the years pass by, we could find the skin at the elbows getting coarse and black. Applying Vaseline often to the elbows and knees would soften the skin and let it be radiant forever. And these were not just all! Vaseline can used for instant sunscreen lotion, skin highlighter, preventing the hair splits, avoiding the rashes, curing minor bruises... and what not! Use it and you would love it! -Nirjara.
read moreసేవ చేస్తే సంతోషం లభిస్తుంది!
మానవ సేవే మాధవ సేవ అని నమ్ముతారు భారతీయులు. సేవ చేస్తే పుణ్యం, పురుషార్థం రెండూ లభిస్తాయని ఆశిస్తారు. ఇందులో వాస్తవం లేకపోలేదని నిరూపిస్తోంది ఒక పరిశోధన. స్వచ్ఛంద సేవలో పాల్గొన్నవారు పదికాలాల పాటు చల్లగా ఉంటారని పేర్కొంటోంది. 17 ఏళ్ల పరిశోధన ఇంగ్లండుకు చెందిన రెండు సంస్థల నేతృత్వంలో 1991 నుంచి 2008 వరకు ఈ పరిశోధన జరిగింది. ఇందులో భాగంగా 66,000 మందికి కొన్ని ప్రశ్నాపత్రాలను అందించారు పరిశోధకులు. వీటి ద్వారా వారిలో ఎందరు స్వచ్ఛంద సేవలో పాల్గొంటున్నారన్న విషయాన్ని గమనించారు. అదే సమయంలో వారిలోని మానసిక ఆరోగ్యాన్ని కూడా పరిశీలించారు. ఇలా మానసిక ఆరోగ్యాన్ని పరిశీలించేందుకు ఒక ప్రమాణికమైన GHQ-12 అనే విధానాన్ని అవలంబించారు. పెద్దవాళ్లదే పెద్దమనసు - పరిశోధనలో పాల్గొన్నవారిలో 21 శాతం మంది తాము తరచూ స్వచ్ఛంద సేవలో పాల్గొంటామని తెలియచేశారు. - మగవారికంటే ఆడవారే సేవ చేసేందుకు ఎక్కువగా చొరవ చూపుతున్నట్లు తేలింది. - ఈ పరిశోధనలో 15 ఏళ్ల కుర్రవాళ్ల నుంచి 80 ఏళ్లకి పైబడిన వారందరూ పాల్గొన్నారు. అయితే సేవ చేసేందుకు కుర్రవాళ్లకంటే వృద్ధులే ఎక్కువ ఉత్సాహం చూపుతున్నట్లు వెల్లడైంది. అనూహ్యమైన ఫలితాలు ఈ పరిశోధనలో స్వచ్ఛంద సేవ చేయడానికీ, మానసిక ఆరోగ్యానికీ మధ్య స్పష్టమైన సంబంధం కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే యువకుల మానసిక ఆరోగ్యం మీద స్వచ్ఛంద సేవ తాలూకు ప్రభావం పెద్దగా కనిపించకపోగా... 40 ఏళ్లు దాటినవారిలోనే ఇలాంటి ఫలితాలు వెల్లడయ్యాయి. ఇదే రకమైన సానుకూల ప్రభావం 80 ఏళ్లు దాటినవారిలో కూడా కనిపించింది. కారణం పెద్దవారవుతున్న కొద్దీ స్వచ్ఛంద సేవలో పాల్గొనడం వల్ల ఉపయోగాలు ఉండటానికి రకరకాల కారణాలను చెబుతున్నారు పరిశోధకులు. స్వచ్ఛంద సేవ చేయడం వల్ల సామాజిక బంధాలు గట్టిపడతాయనీ, వీటితో ఆరోగ్యమూమెరుగుపడుతుందంటున్నారు. పైగా వయసు పైబడినవారిలో తాము ఎవరికీ, ఎందుకూ పనికిరామన్న భావన కలిగే అవకాశం ఉంది. స్వచ్ఛంద సేవ చేయడం ద్వారా తమ అవసరం ఈ సమాజానికి ఉందన్న నమ్మకం కలుగుతుంది. ఇక చాలామంది వృద్ధులు ఒంటరితనంలో మగ్గిపోతుంటారు. ఇలాంటివారికి నలుగురితో కలిసి నాలుగు మంచి పనులు చేసే అవకాశాన్ని స్వచ్ఛంద సేవలు కల్పిస్తాయి. అదీ సంగతి! సేవ చేస్తే పుణ్యం లభిస్తుందో లేదోగానీ.... మానసిక ఆరోగ్యం మాత్రం పదిలంగా ఉంటుందన్నమాట. అలాగని ఏదో పక్కింటివారికి కాసేపు సాయం చేసి రావడం కాదట. నిబద్ధతతో సమాజానికి చేసే సేవే సత్ఫలితాలనిస్తుందంటున్నారు పరిశోధకులు. - నిర్జర.
read more