ఫేస్‌బుక్‌తో డిప్రెషన్ తప్పదా!
ఈ రోజుల్లో ఫేస్‌బుక్ అన్న మాటతో పరిచయం లేని మనిషిని గుర్తించడం కష్టం. కాస్తో కూస్తో కంప్యూటర్ పరిజ్ఞానం కలగగానే ఓ ఫేస్‌బుక్ ఖాతాని తెరిచేయడం... కుదిరితే ఓ పోస్టు, లేకపోతే ఓ లైకు అంటూ ఫేస్‌బుక్కే జీవితంగా గడిపేయడం సహజం. కానీ విచక్షణారహితంగా ఫేస్‌బుక్‌ని వాడితే మానసిక సమస్యలు తప్పవంటూ రెండు తాజా పరిశోధనలు రుజుబుచేస్తున్నాయి. పరిశోధన 1 - చూస్తూ ఉండిపోవద్దు: చాలామంది ఫేస్‌బుక్‌ని ఊరికే అలా చూస్తూ ఉంటారు. అందులో కనిపించే పోస్టులను గమనిస్తూ, ఎవరికెన్ని లైక్‌లు పడ్డాయో లెక్కలు వేసుకుంటూ ఉంటారు. ఇలాంటివారు డిప్రెషన్‌కి లోనయ్యే ప్రమాదం ఉందంటున్నారు పరిశోధకులు. ఈ విషయాన్ని తేల్చుకునేందుకు ‘కోపెన్‌హేగెన్ విశ్వవిద్యాలయాని’కి చెందిన పరిశోధకులు ఓ వెయిమందిని సంప్రదించారు. సోషల్ మీడియాతో వారి అనుబంధం ఎలాంటిదో గమనించారు. ఈ వేయిమందిలో ఎక్కువగా స్త్రీలే ఉండటం గమనార్హం. వాళ్ల పోస్టులూ, వీళ్ల పోస్టులూ చూస్తూ గడపడం వల్ల వాటితో మన జీవితాలను బేరీజు వేసుకునే ప్రమాదం ఉందని తేలింది. సహజంగానే సోషల్‌మీడియాలో ఉండే వ్యక్తులు తమ ఘనతనీ, ఆడంబరాన్నీ చాటుకునేందుకు వీలుగా డాబుసరి పోస్టులు పెడుతుంటారు. వీటితో లేనిపోని పోలికలు ఏర్పడతాయి. ఇక మనలో అసూయ, క్రుంగుబాటు వంటి సమస్యలను రెచ్చగొట్టే పరిస్థితులు కలుగుతాయి. ఇలాంటి చిత్రమైన సమస్యలకు దూరంగా ఉండాలంటే కొన్ని పరిష్కరాలు కూడా ఉన్నాయంటున్నారు పరిశోధకులు. ఊరికనే ఫేస్‌బుక్ వంక అలా చూస్తూ ఉండిపోవద్దనీ... అందులో మీరు కూడా పాలుపంచుకుంటూ ఉండమనీ సూచిస్తున్నారు. అలా కుదరకపోతే అసలు ఓ వారం రోజులపాటు సోషల్‌మీడియా జోలికే పోవద్దని సలహా ఇస్తున్నారు. పరిశోధన 2 - ఎన్ని సైట్లైతే అంత డిప్రెషన్: సోషల్ మీడియా ద్వారా చెలరేగిపోవాలన్న ఆసక్తి ఉండాలే కానీ అందుకోసం చాలా మాధ్యమాలు సిద్ధంగా ఉన్నాయి. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రాం, లింక్‌డ్‌ఇన్, వాట్సప్... ఇలా నానారకాల సైట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఎన్ని సోషల్ మీడియా సైట్లలో పాలుపంచుకుంటే మనిషిలో అంత డిప్రెషన్ ఉంటుందని పిట్స్‌బర్గ్‌కు చెందిన పరిశోధకులు రుజువుచేశారు. పరిశోధకులు తమ అధ్యయనం కోసం 1,787 మంది యువకులను ఎన్నుకొన్నారు. వీరంతా కూడా 19 నుంచి 32 ఏళ్ల లోపువారే! వీరు గూగుల్ ప్లస్, స్నాప్‌చాట్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రాం, లింక్‌డ్‌ఇన్... వంటి 11 రకాల సోషల్ మీడియా సైట్లను ఏ తీరున అనుసరిస్తున్నారో గమనించారు. అధ్యయనం చివరికి తేలిన విషయం ఏమిటంటే... ఏడు లేక అంతకుమించి సోషల్ మీడియా సైట్లను అనుసరిస్తున్నవారిలో క్రుంగుబాటుకి సంబంధించిన లక్షణాలు మూడురెట్లు అధికంగా కనిపించాయట. ఒక వ్యక్తిలో మానసిక సమస్యలు ఉండటం వల్ల, వెసులుబాటు కోసం ఇలా రకరకాల సైట్ల వంక పరుగులు తీస్తున్నాడా? లేకపోతే రకరకాల సైట్లని అనుసరించడం వల్ల మానసిక సమస్యలు ఏర్పడుతున్నాయా? అన్న విషయం మాత్రం తేలనేలేదు. అంటే పిల్ల ముందా? గుడ్డు ముందా? అన్న చందాన ఈ సమస్య ఉందన్నమాట. అందుకని ఈ విషయమై మరిన్ని పరిశోధనలు చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఏది ఏమైనా, అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లు సోషల్ మీడియాని కూడా అతిగా అనుసరించడం వల్ల ఏవో ఒక సమస్యలు తప్పవంటూ పై పరిశోధనలు రెండూ రుజువుచేస్తున్నాయి. అన్నింటికీ మించి సోషల్ మీడియాని మంచి విషయాలను పంచుకునేందుకు కాకుండా, ఇతరులతో పోల్చుకుంటూ ఉండేందుకు ఉపయోగిస్తే... ఈర్ష్యాద్వేషాలు తప్పవని నిరూపిస్తున్నాయి. - నిర్జర.
read moreచాక్లెట్లు తింటే బరువు తగ్గుతారా?
బరువు తగ్గాలంటే అవి తినొద్దు... ఇవి తినొద్దు అంటుంటారు కదా... అయితే తియ్యని చాక్లెట్లు తింటూ బరువు తగ్గండి అంటున్నారు పరిశోధకులు. చాక్లట్లకు, శరీర మాస్ ఇండెక్స్‌కు సంబంధం వుందని, వారంలో ఐదుసార్లు చాక్లెట్లు తినేవారు చాక్లెట్లు తిననివారి కంటే బరువు తగ్గే అవకాశం ఎక్కువని చెబుతున్నారు వీరు. కోకోలోని పాలిఫెనాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ మెటబాలిజం పనితీరును మెరుగుపరచడమే అందుకు కారణమట. అయితే ఒక కండీషన్.. రోజుకు 30 గ్రాములకు మించి తింటే క్యాలరీల కౌంట్ పెరుగుతుంది కాబట్టి మితంగా తినాలి. అలాగే మంచి నీరు కూడా ఎక్కువగా తాగితే క్యాలరీల ఖర్చు కూడా పెరుగుతుంది. వీలయినప్పుడల్లా ఓ గ్లాసుడు నీళ్ళు తాగితే చాలు... తెలీకుండా బరువు తగ్గిపోతారుట. -రమ
read moreHow to Prevent Diarrhea in this Season
Description : During the rainy season when there is a sudden change in temperature various viruses and bacterias are produced and they cause Diarrhea says Dr. Rahul. He further says that infants and kids are most affected by this. To know more watch the video.... https://www.youtube.com/watch?v=Ga6fTAvcY00&t=22s
read moreఈ లక్షణాలుంటే మెనోపాజ్ వచ్చినట్లే..
Description:- Are you getting depressed or getting angry very often? Are you also noticing Irregular periods coupled with excessive bleeding and regular urine infections? Then these might be few of the early changes in the body for menopause says Dr. Manjula Anagani. While going through the phase of menopause – the support from family & friends is a must she adds. To know the early and late changes in the body due to menopause watch the complete video..... https://www.youtube.com/watch?v=P-vKMDpsiQY
read moreకడుపుతో వున్నప్పుడు డాక్టర్ ని అడిగి తెలుసుకోవలసిన విషయాలు
Dr. Kameswari shares a health few tips/frequently asked questions by the couple during their routine checkups during pregnancy Every couple might have experienced this - Soon after the wedding, families of both the bride & the groom are eager to listen to that good news from the couple. For some the little bundle of happiness arrives soon while some have to wait for their bundle of joy. But while visiting the gynecologist - what are the questions to be asked always seems to be a confusion. First visit to the doctor after a positive pregnancy test is the most important one and during this visit the doctors generally spend more time with the couple. What are the routine checkups to be made? What are the common symptoms for which the couple need not panic? What are the warning symptoms for which they need to report to hospital immediately are a few of the lists given by the doctor to the couple......... https://www.youtube.com/watch?v=__fHF2cWZsE
read moreపండు మిర్చి రోజు తింటే ఆయుష్షు పెరుగుతుందిట
Do you use fresh red chillies rather than dry chillies then you are already in the process of keeping a few diseases at the bay says Ayurveda.Few red chillies a day will keep these diseases away says a research done by Vermont University.After analysing over 16000 people for around 23, the researchers have the following conclusions to make.Youngsters/people with good apatite and the ones who have relatively less salaries are the ones who consume slightly more chilli than the others.Surprisingly the rate of heart attacks and paralysis are 13% lesser in people who consume fresh red chilli.Not only will these chillies kill the unwanted bacteria but also increase the blood flow in the body says the research.But be cautious - while appropriate amount of fresh red chilli have these advantages excess consumption have its own disadvantages.... https://www.youtube.com/watch?v=qOYuGFlvCfo
read moreగుండె కి ఆహరం
వయసుతో సంబంధం లేకుండా ఈ మద్య తరచూ మనం వింటున్న అనారోగ్యం పేరు " గుండె జబ్బు " అందుకు అనేక కారణాలు ఉన్నా మనం తీసుకునే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు పాటించడంవల్ల గుండె జబ్బులను చాల వరకు నియంత్రిచవచ్చు. అందులో ముఖ్యంగా చెప్పుకోవలసింది అరటిపండు - రోజుకో అరటిపండు ఆరోగ్యాన్నిస్తుందని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు అయితే రోజుకో అరటి పండు తినడం ద్వారా గుండె జబ్బులను చాల వరకు నియంత్రణలో పెట్టుకోవచ్చు అంటున్నాయి కొన్ని పరిశోధనలు. రోజుకో అరటిపండు తినడం వల్ల ఒక్కసారిగా దాడిచేసే ఆకస్మిక గుండె నెప్పులనుంచి 40 శాతం రక్షణ పొందువచ్చుట దీనికి కారణం అరటిపండులో సమృద్దిగా ఉండే పొటాషియం బి.పి ని అదుపు లోవుంచి రక్త పోటు రాకుండా కాపాడుతుందని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఇక క్యారెట్లు కూడా అరటిపండ్లతో సమానంగా గుండె జబ్బులను నియంత్రిస్తుంది, అంటున్నారు ఆహార నిపుణులు క్యారేట్లోని కెరోటినాయిడ్లకు గుండె జబ్బులు నివారించే శక్తి ఉంటుంది రోజుకి 5 పచ్చి క్యారెట్లను తినాలని ఇలా తినటం వల్ల గుండె జబ్బులను 68 శాతం నియంత్రిచవచ్చునని గట్టిగ చెబుతున్నారు హార్వర్డ్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ' అలాగే ఎక్కువ శాతం గుండె జబ్బులకు రక్తం గడ్డ కట్టడమే ముఖ్య కారణంగా వుంటుంది - అందుకు " బ్లాక్ టీ " చక్కటి పరిష్కారమట రోజుకి రెండు కప్పుల బ్లాకు టీ 60శాతం గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది అలాగే మంచి నీళ్ళు ఎక్కువగా తీసుకోవడం కూడా మంచిది. అంతే కాదు వీటన్నిటితో పాటు కంటినిండా చక్కటి నిద్రకూడా ఎంతో ముఖ్యం. పనుల్లోపడి నిద్రపోయే సమయం తగ్గిపోతే గుండె జబ్బులు దాడి చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారువైద్య నిపుణులు. మరి గుండెని భద్రంగా చూసుకోవడానికి ఈ జాగ్రత్తలు పాటిస్తారు కదు. - రమ
read moreఅంతరిక్షంలో యోగా
యోగా గొప్పతనం గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రతి ఆరోగ్య సమస్యకీ యోగా కూడా తగిన పరిష్కారం చూపగలదని నమ్ముతున్నారు. కానీ అంతరిక్షంలో సంచరించే వ్యోమగాములకి కూడా యోగా ఉపయోగపడుతుందని తేలడం మాత్రం ఆశ్చర్యమే! వ్యోమగాములకీ కష్టాలు హాయిగా రెక్కల్లేని పక్షుల్లాగా శూన్యంలో విహరించే వ్యోమగాములకీ అనారోగ్య సమస్యలు వస్తాయి. అంతరిక్షంలో ఉండే రేడియేషన్ వల్లా, గురుత్వాకర్షణ శక్తిలో మార్పుల వల్లా రకరకాల ఆరోగ్య సమస్యలు వారిని చుట్టుముడతాయి. ఇక ఒంటరితనం వల్ల, ఒకే పెట్టెలో బందీగా ఉండటం వల్ల మానసిక సమస్యలూ తలెత్తుతాయి. వీటన్నింటినీ తట్టుకొనేందుకు వారికి రకరకాల సౌకర్యాలను అందిస్తూ ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ఉంటారు. కానీ ఇంచుమించుగా ప్రతి అంతరిక్ష వ్యోమగామికీ వస్తున్న నడుం నొప్పికి మాత్రం ఇప్పటివరకూ సరైన కారణం కానీ, చికిత్సను కానీ కనుగొనలేకపోయారు. కారణం తేలింది ఇంతవరకూ వ్యోమగాల వెన్నుపూసలో ఉండే డిస్కులు వాయడం వల్లే వారికి నడుంనొప్పి వస్తుందని భావించేవారు. భూమ్మీదకు తిరిగి వచ్చిన తరువాత కూడా వ్యోమగాములు వారాల తరబడి నడుంనొప్పితో బాధపడాల్సి వచ్చేది. కానీ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు దీనికి తగిన కారణాన్ని కనుగొనేందుకు ఒక ఆరుగురు నాసా వ్యోమగాములను పరిశీలించారు. వారు అంతరిక్షంలోకి బయల్దేరక ముందు, అంతరిక్షంలో కొన్ని నెలలు గడిపి తిరిగి వచ్చిన తరువాత వారికి MRI పరీక్షలు నిర్వహించారు. వీటిలో నడుంనొప్పికి డిస్క్ వాపు కారణం కాదని తేలింది. వెన్ను చుట్టూ ఉండే కండరాలు దాదాపు 20 శాతం కుంచించుకుపోవడం వల్ల ఈ నొప్పి ఏర్పడుతోందని బయటపడింది. ఇలా దెబ్బతిన్న కండరాలు కొన్ని నెలలు గడిచిన తరువాత కానీ తిరిగి సాధారణ స్థితికి చేరుకోలేదట. యోగాతో బాగు వ్యోమగాములు నడుముకి సంబంధించిన సమస్యలకు దూరం కావాలంటే యోగా మంచి మార్గం అని తేలుస్తున్నారు పరిశోధకులు. అంతరిక్షంలో సరైన కదలికలు లేకపోవడం, వెన్ను మీద అధిక ఒత్తిడి పడటం వంటి ఇబ్బందుల కారణంగా తలెత్తే సమస్యలన్నింటికీ యోగా తగిన ఉపశమనాన్ని కలిగించగలదని సూచిస్తున్నారు. వ్యోమగాములు అంతరిక్షంలో గడిపేటప్పుడు వారి దినచర్యలో భాగంగా యోగాను చేర్చమంటున్నారు. ఏదో ఒకటి రెండు నెలలు అంతరిక్షంలో గడిపేసి వచ్చే రోజులు పోయాయి. ఇక ముందు ఏళ్లతరబడి వారు అంతరిక్షంలో ప్రయాణించాల్సిన సందర్భాలు రానున్నాయి. అలాంటి కలలు ఎలాంటి ఉపద్రావాలూ లేకుండా నిజం అయ్యేందుకు యోగా కూడా వారికి సాయపడేట్లే ఉంది. - నిర్జర. International Yoga Day 2018 Special Videos
read moreసూర్యనమస్కారాలు – ఆరోగ్యానికి సోపానాలు
రథసప్తమి వస్తోందంటే చాలు... ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణుడే గుర్తుకువస్తాడు. జీవానికి ఆలంబనగా, కర్మలకు సాక్షిగా ఉండే ఆ భగవానుని కొలిస్తే ఆయురారోగ్యాలలో లోటు ఉండదని పెద్దల నమ్మకం. అది ఒట్టి నమ్మకం మాత్రమే కాదనేందుకు ఆయన ఎదుట నిలబడి చేసే సూర్యనమస్కారాలే సాక్ష్యం. పైకి యాంత్రికంగా కనిపించే ఈ సూర్యనమస్కారాల వెనుక యోగశాస్త్రంలోని సారాంశం దాగి ఉందంటే ఆశ్చర్యం కలగక మానదు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో రోజుకి ఒక్క పదిహేను నిమిషాల పాటు సూర్యనమస్కారాలు చేస్తే చాలు అంతులేని ఆరోగ్యం, చురుకుదనం మీ సొంతం. కొన్ని సూచనలు... ఉదయాన్నే నిద్రలేచి, ధారాలంగా గాలి వెలుతురు లభించే చోట ఈ ఆసనాలు వేయాలి. కాలకృత్యాలను తీర్చుకుని ఖాళీకడుపుతో వీటిని ఆచరించాలి. దుస్తులు మరీ బిగుతుగా కాకుండా కాస్త వదులుగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సూర్యనమస్కారాలను చేసే సమయంలో ఒకో నమస్కారానికీ ఒకో మంత్రం ఉంది. ఆ మంత్రాలన్నీ సూర్యుని వివిధ నామాలను ప్రతిఫలిస్తాయి. అంతమాత్రాన తప్పకుండా మంత్రాలను చదువుతూ చేయాలన్న నియమం ఏదీ లేదు. కాబట్టి వీటిని కులమతాలకు అతీతంగా ఎవరైనా ఆచరించవచ్చు. 01) ఓం మిత్రాయనమః సూర్యునికి అభిముఖంగా నిటారుగా నిలబడాలి. చేతులను నమస్కార భంగిమలో ఉంచి, బొటనవేళ్లు రెండూ ఛాతీకి తగిలేలా ఉంచాలి. నిదానంగా శ్వాసని తీసుకుంటూ మనసుని ఆ శ్వాస మీద కేంద్రీకరించాలి. 02) ఓం రవయేనమః చేతులను పైకెత్తి నిదానంగా వెనక్కి వంచాలి. ఆ సమయంలో నడుమూ, చేతులూ విల్లులాంటి ఆకారాన్ని తలపిస్తాయి. మన చూపులు కూడా పైకెత్తిన చేతులను అనుసరించాలి. దీనిని అర్ధచంద్రాసనం అని అంటారు. 03) ఓం సూర్యాయనమః రెండో ఆసనంలో పైకెత్తిన చేతులను, కాళ్లకు తగిలేలా పూర్తిగా కిందికి వంచాలి. వీలైతే ఈ సమయంలో ఊపిరి బిగపట్టమని చెబుతూ ఉంటారు. ఇలా చేతులను కిందకి వంచే సమయంలో తల కూడా మోకాళ్లకు తగిలేలా ఉంటే మరీ మంచిది. దీనికి పాదహస్తాసనం అని పేరు. 04) ఓం భానవేనమః పరుగుల పోటీకి సిద్ధపడినవారిలా కుడి పాదాన్ని వీలైనంత వెనక్కిలాగి, ఎడమ పాదాన్ని మాత్రం ముందుకు ఉరుకుతున్నట్లుగా సిద్ధంగా ఉంచాలి. ఈ సమయంలో తలను మాత్రం పైకెత్తి చూడాలి. దీనిని అశ్వసంచలనాసనం అంటారు. 05) ఓం ఖగాయనమః ఇప్పుడు ఎడమ పాదాన్ని కూడా వెనక్కి పెట్టి నడుము భాగాన్ని ఏటవాలుగా పైకి లేపాలి. ఈ సమయంలో మన శరీరం ఓ పర్వతాన్ని తలపిస్తుంది. అందుకే దీనికి పర్వతాసనం అని పేరు. 06) ఓం పూష్ణేనమః పర్వతాసనంలో ఉన్న శరీరాన్ని నిదానంగా నేలకు ఆన్చాలి. ఈ సమయంలో పొట్టభాగం మాత్రం నేలకు ఆన్చకుండా రెండు అరచేతులూ, కాళ్లూ, గడ్డం, ఛాతీ నేలకు ఆనేలా జాగ్రత్త తీసుకోవాలి. 07) ఓం హిరణ్యగర్భాయనమః వెల్లికిలా నేల మీద ఉన్న శరీరాన్ని శిరసు నుంచి నాభిదాకా పైకి లేపాలి. ఈ సమయంలో మన భంగిమ పడగ ఎత్తిన పాముని తలపిస్తుంది. అందుకే ఈ ఆసనానికి భుజంగాసనం అని పేరు. 08) ఓం మరీచయేనమః ఐదో ఆసనం (పర్వతాసనం) ఇప్పుడు పునరావృతం అవుతుంది. శ్వాసను వదిలిన తరువాతే ఈ ఆసనం చేయడం మంచిది. 09) ఓం ఆదిత్యాయనమః ఈసారి నాలుగో ఆసనం (అశ్వసంచలనాసనం) పునరావృతం అవుతుంది. కాకపోతే ఈసారి కుడిపాదం బదులు ఎడమపాదాన్ని వెనక్కి వంచి, కుడి పాదాన్ని ముందుకు ఉంచాలి. 10) ఓం సవిత్రేనమః ఈ భంగిమలో మూడో ఆసనం (అశ్వసంచలనాసనం) పునరావృతం అవుతుంది. 11) ఓం అర్కాయనమః ఈ దఫా రెండో ఆసనాన్ని (అర్ధచంద్రాసనం) తిరిగి వేయాలి. 12) ఓం భాస్కరాయనమః మొదటి ఆసనంలో ఉన్నట్లుగా నమస్కార భంగిమకు తిరిగిరావాలి. ఈ ప్రకారంలో చేసే సూర్యనమస్కారాల పరిక్రమతో శరీరంలోని ప్రతి అవయవమూ బలాన్నీ, స్వస్థతనూ పొందుతుందన్నది పెద్దల మాట. ఆ మాట నూటికి నూరు పాళ్లూ నిజమన్నది వాటిని ఆచరిస్తున్న వారి అనుభవం. - నిర్జర.
read moreమత్తు వైన్ లో కాదు… బ్రెయిన్ లో వుంటుందట!
అంతా మాయ! ఈ జగమంతా మాయ! ఏంటీ… ఇదేదో వేదాంతం అనుకుంటున్నారా? అస్సలు కాదు! ప్రాక్టికల్ సైన్స్! ఇంతకీ… విషయం ఏంటంటే… మనం ప్రపంచంలో వుంటాం. కాని, నిజంగా జరిగేది ఏంటంటే… ప్రపంచం మన మనస్సులో వుంటుంది! మన మనస్సు లేదా మెదడు ఎలా భావిస్తే ప్రపంచం కూడా అలాగే వుంటుంది! అందుకే మన పెద్దలు అంతా మిథ్యా అనేశారు! మనం ఎలా భావిస్తే మన చుట్టూ పరిస్థితులు కూడా అలానే వుంటాయి! ఇందుకు వైన్ కూడా మినహాయింపు కాదు! వైనుకు , వేదాంతానికి లింకేంటి అనుకుంటున్నారా? జర్మనీలో తాజాగా కొందరు రీసెర్చర్స్ చేసిన అధ్యయనం ప్రకారం సంబంధం వుంది! జర్మనీలోని ఓ యూనివర్సిటీలో కొందరు శాస్త్రవేత్తలు ఓ పరిశోధన చేశారు. దానిలో భాగంగా కొందరు వ్యక్తుల్ని ఎమ్ఆర్ఐ స్కానింగ్ చేసే మిషన్ లో ప్రవేశపెట్టారు. తరువాత వారికి సాధారణ వైన్ తాగించారు. కాని, ఒక చిన్న ట్రిక్ ప్లే చేశారు! మార్కెట్లో కేవలం 12యూరోలు వుండే ఆ వైన్ ని 18 నుంచి 36యూరోల దాకా వెల వున్నట్టు బాటిల్స్ పై అచ్చు వేయించారు! ఆ రేట్ చూస్తూ వైన్ పుచ్చుకున్న సదరు వ్యక్తులు తమ మెదళ్లలో టేస్ట్ అదిరిపోయినట్టుగా ఫీలయ్యారట! కాని, నిజంగా వారు ప్రతీసారీ తాగింది 12యూరోలు విలువ చేసే మామూలు వైనే! బాటిల్ పై వున్న రేటు చూసి ఒకే రకమైన వైన్ని రకరకాలుగా ఎందుకు ఫీలయ్యారు? ఎంత ఎక్కువ రేటు వుంటే అంత టేస్టీగా వున్నట్టు ఎందుకు అనిపించింది? ఎమ్ఆర్ఐ స్కాన్ లో తేలింది ఏంటంటే… వైన్ తీసుకున్న వారి మెదళ్లలో కొన్ని ప్రత్యేక భాగాల్లో అదిక ధర కారణంగా చలనం వచ్చిందట! తాము తాగుతున్నది కాస్ట్ లీ వైన్ అనే ఫీలింగ్ కారణంగా వారికి టేస్ట్ కూడా బావున్నట్టు అనిపించిందట! ఈ కారణంగానే కొన్ని కంపెనీలు కావాలని అదిరిపోయే లేబుల్స్ పెట్టి, గొప్ప గొప్ప బ్రాండ్ నేమ్స్ చూపించి అధిక ధర వసూలు చేస్తాయని రీసెర్చర్స్ అంటున్నారు! మనిషి సుఖం, దుఃఖం, కష్టం, నష్టం అన్నీ మనసులోనే వుంటాయని మన పూర్వులు ఎప్పుడో చెప్పారు. పాశ్చాత్యులు కూడా అన్ని ఫీలింగ్స్ బ్రెయిన్లోనే వుంటాయని ఒప్పుకుంటారు! కానీ, ఈ తాజా పరిశోధనతో మరో కొత్త విషయం తేలింది! అదేంటంటే… మత్తు వైన్ లో కాదు నిజంగా మెదళ్లలో వుంటుంది! దానికి ఒక్కసారి అధిక ధర వల్ల అద్భుతమైన టేస్ట్ లభిస్తుంది అన్న మత్తు ఎక్కించామంటే… ఇక మంచి నీళ్లు తాగినా మందు తాగినట్టే అనిపిస్తుంది! ఇదే మనసు చేసే మాయ అంటే!
read moreమన రోజువారీ డైట్లో ఏం ఉండాలి..?
మనం తీసుకునే రోజువారీ ఆహారంలో (డైట్) లో ఏవి ఉండాలి, ఏవి ఉండకూడదు అనే విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మధ్య తరచుగా డైట్ విషయంలో వినిపిస్తున్నది ఏంటంటే మిల్లెట్స్ (చిరు ధాన్యాలు). మనల్ని ఆరోగ్యముగా ఉంచడంలో మిల్లెట్స్ యొక్క పాత్ర ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?time_continue=4&v=nPnvmLnC0D8
read moreతండ్రి పోలికలతో పుడితే ఆరోగ్యం
ఇంట్లో పసిపిల్లలు ఉంటే చాలు... వాళ్లని చూడ్డానికి వచ్చిన వాళ్లందరినీ ఒకే ఒక్క ప్రశ్నతో చావగొట్టేస్తాం. ఆ ప్రశ్నేమిటో ఈపాటికి తోచే ఉంటుంది కదా! అదేనండీ... ‘పిల్లవాడిది తండ్రి పోలికా తల్లి పోలికా?’ అని. పిల్లలు నా పోలిక అంటే నా పోలిక అంటూ భార్యాభర్తల మధ్య చిన్నపాటి యుద్ధాలే జరుగుతుంటాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకొంటున్నామంటే... పిల్లలు కనుక తండ్రి పోలికతో ఉంటే వాళ్ల ఆరోగ్యానికి ఢోకా ఉండదట! అమెరికాలో బింగామ్టన్ అనే ఓ యూనివర్శిటీ చేసిన పరిశోధనలో ఈ విషయం బయటపడింది. బిడ్డ పోలికలకీ, ఆరోగ్యానికీ మధ్య సంబంధం ఉందేమో తెలుసుకునేందుకు వీళ్లు ఓ పరిశోధన నిర్వహించారు ఇందుకోసం పదీ, వందా కాదు ఏకంగా 715 కుటుంబాలని ఎన్నుకున్నారు. ఈ పరిశోధన కోసం బిడ్డ ఒక చోట తండ్రి మరో చోట ఉండే కుటుంబాలని ఎంచుకున్నారు. తండ్రి తన కుటుంబాన్ని చూసేందుకు ఎన్నిసార్లు తిరిగివస్తున్నాడో తెలుసుకునేందుకే అలాంటి కుటుంబాలను ఎంచుకున్నారన్నమాట. పిల్లలు తండ్రి పోలికతో ఉంటే... వాళ్ల మీద తండ్రికి ఎక్కువ ప్రేమ కలుగుతుందని ఈ పరిశోధనలో తేలింది. దాంతో వాళ్లతో పాటు ఎక్కువ రోజులు గడిపేందుకు ఇష్టపడతాడట. ఇలాంటి తండ్రులు నెలలో నెలలో దాదాపు రెండున్నర రోజుల పాటు తమ పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడిపినట్లు తేలింది. పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడపడం అంటే, వాళ్ల మంచిచెడులను కూడా జాగ్రత్తగా గమనించుకోవడమే కదా! అందుకే ఏడాది గడిచేసరికి తండ్రి పోలికలు ఉన్న పిల్లలు మరింత ఆరోగ్యంగా కనిపించారట. -Niranjan
read moreతేనెని ఎలా తీసుకుంటే బరువు తగ్గుతారో తెలుసా!
మనకి అందుబాటులో ఉన్న పదార్థాల్లో తేనెని మించిన మందు లేదు. దగ్గు తగ్గాలన్నా, డైజషన్ బాగుపడాలన్నా, నేచురల్ యాంటీబయాటిక్‌లా పనిచేయాలన్నా... తేనె గొప్ప మెడిసిన్‌లా పనిచేస్తుంది. తేనెలో ఉండే ప్రొటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఒంటికి కావల్సిన బలాన్ని కూడా అందిస్తాయి. తేనెలో ఫ్రక్టోజ్ అనే షుగర్ ఉంటుంది. ఇది ఒకేసారి ఒంట్లో కలిసిపోకుండా, నిదానంగా కలుస్తుంది. దాని వల్ల ఒబెసిటీ కూడా అదుపులో ఉంటుంది. కానీ తేనెని దేనిలో కలిపితే effectiveగా ఉంటుందో మీకు తెలుసా! - పరగడుపునే ఓ చెంచాడు తేనెని గోరువెచ్చటి నీటిలో తీసుకుంటే చాలా ఉపయోగం. గోరువెచ్చటి నీటిలో తేనె పూర్తిగా కరిగిపోతుంది. నాలుక దగ్గర నుంచి కడుపు దాకా అన్ని అవయవాలను ఇది కవర్ చేసేస్తుంది. క్రమం తప్పకుండా ఇలా తీసుకోవడం వల్ల లివర్లో ఉన్న toxins అన్నీ బయటకి వెళ్లిపోతాయి. క్రమంగా కొవ్వు కణాలు కూడా కరగడం మొదలుపెడతాయి. - అవకాశం ఉంటే తేనెని గోరువెచ్చని నీటితో పాటు నిమ్మరసం కూడా కలిపి తీసుకోవాలి. నిమ్మరసంలో విటమిన్ C ఉంటుందన్న విషయం తెలిసిందేగా! చాలామందికి రోజూ, కావల్సినంత విటమిన్ C అందదు. నిమ్మరసాన్ని తీసుకోవడం వల్ల ఆ లోటు తీరిపోతుంది. ఒంట్లో ఇమ్యూనిటీ పెరగాలన్నా, గుండెజబ్బుల సమస్య తగ్గాలన్నా, చర్మంలో గ్లో ఉండాలన్నా C విటమిన్ చాలా అవసరం. అంతేకాదు! నిమ్మరసంలో ‘గ్లూటధియోన్’ అనే పదార్థం ఉంటుందట. ఇది శరీరాన్ని detoxify చేసేందుకు, బరువు తగ్గించేందుకు చాలా ఉపయోగపడుతుంది. - గోరువెచ్చటి నీటిలో ఓ స్పూన్ తేనెతో పాటు చిటికెడు దాల్చిన చెక్క పొడిని వేసుకున్నా మంచిదే! దాల్చిన చెక్క మన ఒంట్లో మెటాబాలిజం రేట్‌ని పెంచుతుంది. దానివల్ల కొవ్వు కణాలు త్వరగా కరిగిపోతాయి. పైగా ఆహారం కూడా త్వరత్వరగా జీర్ణమైపోతుంది. - వెచ్చటి నీళ్లలోనే కాదు, గోరువెచ్చని పాలల్లో తేనె కలిపి తీసుకున్నా ఉపయోగమే! పాలల్లో ఎన్ని విటమిన్స్ ఉంటాయో చెప్పక్కర్లేదు. ఇందులో తేనె కూడా కలిపడం వల్ల respiratory problems తో పాటు చాలారకాల digestion problems కూడా తగ్గిపోతాయి. తేనె, పాల కాంబినేషన్ రాత్రిపూట తీసుకోవడం వల్ల నిద్ర కూడా త్వరగా పడుతుంది.
read moreHigh Protein Supplements
ఇటీవలి కాలంలో జిమ్‌లకు వెళ్లడం.. సిక్స్ ప్యాక్‌లకు వెళ్లే వారి సంఖ్య బాగా పెరిగింది. మరి మజిల్స్ పెరగాలన్నా.. శరీరంలో శక్తి తగ్గకుండా ఉండాలన్నా ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటో తెలియాలంటే ఈ వీడియో చూడండి. https://www.youtube.com/watch?v=0kdBZBuRn7Q
read more













.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)

.jpg)

.jpg)
