వయసు పెరుగుతుంటే నిద్ర సరిగా పట్టదు అంటుంటారు. అయితే ఈ మద్య కాలంలోటినేజ్ పిల్లలనుంచి మద్య వయస్కుల దాకా వయసుతో సంబంధం లేకుండా నిద్రలేమితో భాదపడుతున్నారు. అందుకు మారిన జీవన విధానం, ఒత్తిడి, వేళకి ఆహారం తీసుకోకపోవడం ఇలా ఎన్నో కారణాలు వున్నాయి. అయితే తరచూ నిద్రలేమితో భాదపడుతుంటే ఒక్కోసారి మీరు తీసుకునే ఆహరం గురించి ఆలోచించండి అంటున్నారు నిపుణులు. ఉదాహరణకి పిండి పదార్ధాలు,ఖనిజాలు, తక్కువ వుండే ఆహరం తీసుకోవటం, వంటివి నిద్రపట్టక పోవటానికి కారణం కావచ్చుట.

 

 మంచి నిద్ర పట్టాలంటే  పిండి పదార్ధాలు ఎక్కువగా వుండే ఆహారం తీసుకోవలి ఎందుకంటే పిండి పదార్ధాలు ఎక్కువగా వుండే ఆహారం తీసుకుంటే అవి   "ట్రిస్టోఫాన్ "అనే అమినో  ఆమ్లాలను మెదడుకు పంపిస్తాయి. దాంతో నిద్ర ముంచుకువస్తున్నభావన కలుగుతుందట. సో పిండి పదార్ధాలు అధికంగా వుండే బియ్యం, గోధుమలు, బ్రెడ్, రాగి, కార్నెఫ్లెక్స్ వంటివి రోజూ నిద్రపోయే ముందు మన ఆహారంలో  వుండేలా చూసుకోవాలట. అలాగే కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ మన శరీరంపై మత్తుగా ఉండేలా ప్రభావం చూపిస్తాయట. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో వీటి శాతం తగ్గితే నిద్రలేమి కలగచ్చు. సో పాలు , ఆకు కూరలు, బాదం, జీడి పప్పు, వంటివి ఆహారంలో చేర్చటం తప్పని సరి, మంచి నిద్ర కావలంటే తీసుకునే ఆహారం పై శ్రద్ద పెట్టక తప్పదు.



 పడుకునే ముందు మాంసకృతులు అధికంగా వుండే స్నాక్స్ తినకపోవటమే మంచిది. ఎందుకంటే ఈ మాంసకృతులు మనం తిన్న ఆహరం నుంచి  "ట్రిస్టోఫాన్స్" మెదడును చేరకుండా అడ్డుకుంటాయట. దాంతో  సరిగా నిద్రపట్టదు. కాబట్టి రాత్రిపూట ప్రోటీన్లు ఎక్కువ గా వుండే ఆహరం తీసుకుంటే అజీర్ణంతో నిద్రపట్టదు. కాబట్టి రాత్రిపూట ప్రోటీన్లు ఎక్కువగా ఆహరం తీసుకుంటే అజీర్ణంతో నిద్ర పట్టదు. అసలు  తినకపోతే ఆకలికి నిద్రపట్టదు. కాబట్టి సమతులాహారం  సరిపడా తీసుకోవడం ఉత్తమం అని సూచిస్తున్నారు నిపుణులు.

...రమ