ఆడవారు ఎక్కువసేపు ఉద్యోగం చేస్తే!

  మారుతున్న సమాజంలో స్పష్టంగా కనిపించే అంశం... ఆడవారు కూడా ఉద్యోగసోపానంలో ఉన్నత శిఖరాలను అందుకోవడం! మరి తమను తాము నిరూపించుకునే క్రమంలో వారు ఛేదిస్తున్న లక్ష్యాలతో పాటుగా వెంటాడుతున్న అనారోగ్యాలు కూడా ఉన్నాయంటున్నారు పరిశోధకులు.   ఆదివారం మినహా రోజుకి పదేసిగంటలపాటు ఉద్యోగం చేస్తూ ఉంటే... ఎవరికైనా చిన్నాచితకా ఆరోగ్య సమస్యలు రావడం సహజం. అలాంటివారు అజీర్ణం, ఊబకాయం... లాంటి అనారోగ్యాలను గమనించుకోక తప్పదు. ఈ విషయాన్ని శాస్త్రీయంగా రుజువు చేసేందుకు అమెరికాలోని ఓహియో స్టేట్ యూనివర్సిటీకి చెందిన ‘అలార్డ్‌’ అనే పరిశోధకుడు పూనుకున్నాడు. తన పరిశోధన కోసం దాదాపు 7,500 ఉద్యోగులను మూడు దశాబ్దాల పాటుగా గమనించాడు. వీళ్లలో గుండెజబ్బులు, కీళ్లనొప్పులు, ఉబ్బసం, రక్తపోటు, డిప్రెషన్‌ లాంటి సమస్యలు ఏర్పడటానికీ... పనిగంటలకీ మధ్య ఏమన్నా సంబంధం ఉందా అని పరిశీలించాడు.   అలార్డ్‌ పరిశోధనల్లో... పనిగంటలకీ, పైన పేర్కొన్న వ్యాధులకీ కొంత సంబంధం ఉందని తేలింది. అయితే విచిత్రంగా ఆడవారిలో ఈ సంబంధం మరింత స్పష్టంగా కనిపించింది. ఇలా ఎందుకు జరుగుతోందన్న దాని మీద అలార్డ్‌ దగ్గర స్పష్టమైన సమాధానం లేకపోయింది. ‘బహుశా ఉద్యోగిగా, గృహిణిగా, తల్లిగా... ఇన్ని బాధ్యతలను ఒక్కసారిగా సమర్థవంతంగా మోయాలనుకునే ప్రయత్నంలో వారి ఆరోగ్యం త్వరగా దెబ్బతింటోందేమో’ అని ఊహిస్తున్నారు అలార్డ్‌. అయితే డా॥ గోల్డ్‌బర్గ్‌ అనే వైద్యరాలు మాత్రం అధికపనిగంటల వల్ల ఆడవారు అనారోగ్యం పాలవ్వడానికి స్పష్టమైన కారణాలు ఉన్నాయని అంటున్నారు.   పని ఒత్తిడిలో పడిపోయి ఆడవారు తమ ఆరోగ్యాన్ని పట్టించుకోరనీ. స్త్రీలకు అవసరమైన మేమోగ్రాం వంటి పరీక్షలు చేయించుకునేందుకు కూడా అశ్రద్ధ చూపిస్తూ ఉంటారనీ గోల్డ్‌బర్గ్‌ విశ్లేషిస్తున్నారు. అంతేకాదు! ఉద్యోగం చేసే ఆడవారు ఆకలిని తీర్చుకునేందుకు ఏదో ఒక చిరుతిండితో సరిపెట్టేసుకుంటారనీ అంటున్నారు.   మరి అధిక పనిగంటలు ఉన్నాయి కదా అని ఆడవారు ఉద్యోగాలలో వెనుకంజ వేయాలా? అంటే అదేమీ అవసరం లేదంటున్నారు నిపుణులు. ఉద్యోగ బాధ్యతలలో ఏది అవసరం, ఏది అనవసరం అని బేరీజు వేసుకుని అనవసరమైన బాధ్యతలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. రోజులో కాస్త సమయాన్నైనా తమకోసం వెచ్చించుకోవాలని సలహా ఇస్తున్నారు. వ్యాయామం చేయడమో, పుస్తకాలు చదవడమో, టీవీతో కాలక్షేపం చేయడమో, ధ్యానంలో ఉండటమో... ఇలా ఉద్యోగపరమైన ఆలోచనల నుంచి కాసేపు మనసుకి విశ్రాంతిని కలిగించమంటున్నారు.   - నిర్జర.

read more
ఎప్పుడూ కూర్చుని వుంటే రిస్క్

        నడుము పూసలు, డిస్కులు వయసుతోపాటు అరిగే అవకాసం ఉన్న మనం సరైన జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని సాద్యమైనంత ఎక్కువ కాలం వాయిదా వేయచ్చు. కూర్చునిచేసే శరీరానికి నష్టం ఏముంటుంది అనుకుంటాం కాని, ఎప్పుడు కూర్చుని ఉండే వాళ్ళకే డిస్కుల అరుగుదల ఎక్కువగా వుంటుంది అంటున్నారు నిపుణులు.   మన వెన్నుపూస డిస్కుల మిద భారం పడేది కూర్చుని ఉన్నపుడే  - నడక వల్లకాని, పనులవల్ల కాని సైక్లింగ్ వల్ల కాని డిస్కుల మీదభారం పడదు. ఎప్పుడు కూర్చుని ఉండడం వల్ల డిస్కుల మీద తీవ్రమైన ఒత్తిడి పడుతుంది .దీంతో ఆ డిస్కులు త్వరగా క్షీణించటం ప్రారంభిస్తాయట. అలా కాకుండదంటే  నడుముకు సంబందించిన వ్యాయామాలు తప్పక చేసి తీరాల్సిందే అంటున్నారు వైద్య నిపుణులు . వ్యాయామంవల్ల కండరాలు బలపడతాయి  - అప్పుడు అవి భారాన్ని పంచుకోగలుగుతాయి . దాని వలన  పూసలు, డిస్కులు  మీద ఒత్తిడి తగ్గుతుంది అందుకే ప్రాధమిక కదలికలు ఉండే వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలని హెచ్చరిస్తున్నారు  వైద్య నిపుణులు . ...రమ

read more
రాత్రిపూట వెలుతురుతో క్యాన్సర్‌!

  ఒకప్పుడు సముద్రంలో ప్రయాణాలు చేసే నావికులు ఆకాశంలోని చుక్కల సాయంతోనే ముందుకు సాగేవారు. రాత్రిపూట నేల మీద సంచరించే బాటసారులు సైతం ఆకాశాన్ని చూసి సమయాన్ని, రుతువునీ చెప్పగలిగేవారు. కానీ ఇప్పుడు ఆ అవసరం మనిషికి లేకపోయింది. చిన్న చిన్న పడవుల్లో కూడా ఇప్పుడు జీపీఎస్‌ సిస్టంలు వచ్చేశాయి. ఇక నేల మీద ఉండే మనిషి తల ఎత్తి ఆకాశాన్ని చూడటమే మానేశాడు. ఇప్పుడు ఆకాశం కూడా వెలుగుల మయం అయిపోతోంది. నాగరికత పుణ్యమా అని చీకటి రాత్రులు కృత్రిమ వెలుగులతో నిండిపోతున్నాయి. కానీ ఈ స్థితి శృతి మించిపోతోందనీ, కాంతి కాలుష్యానికి దారి తీస్తోందని శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు.   కాంతి కాలుష్యం వల్ల జీవవైవిధ్యానికి (బయో డైవర్సిటీ) ముప్పు వాటిల్లుతుందన్నది తెలిసిందే! గూళ్లకు చేరుకునే పక్షులు, రాత్రిపూట సంచరించే జీవులు, చెట్టూచేమా, సముద్ర జీవులూ, కోరల్‌ రీఫ్స్‌... వీటన్నింటికీ లెక్కలేనంత నష్టం జరుగుతోందని చెబుతున్నదే! కానీ తన దాకా వస్తేకానీ పట్టిచుకోని మనిషికి... ఈ కాంతి కాలుష్యం తన దాకా వచ్చేసిందని ఇప్పుడు తేలింది. ఈ విషయమై ఐరోపాలో జరుగుతున్న కొన్ని పరిశోధనలు, మనిషి ఆరోగ్యం మీద కాంతి కాలుష్యం తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని తేల్చి చెబుతున్నాయి.   మనిషి మీద కాంతి కాలుష్య ప్రభావాన్ని అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్న వాస్తవాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. వీరి అంచనా ప్రకారం ప్రపంచంలో దాదాపు మూడో వంతు మంది కృత్రిమ కాంతి వల్ల, రాత్రిపూట పాలపుంతని సైతం చూడలేకపోతున్నారట. ఇక ఉత్తర అమెరికాలో అయితే 80 శాతం మంది ఈ దురదృష్టానికి నోచుకుంటున్నారు. రాత్రిపూట నక్షత్రాలని చూసి ఆస్వాదించలేకపోవడం, ఖగోళ శాస్త్రవేత్తలు పరిశోధనలని సాగించలేకపోవడం అటుంచితే.... కాంతి కాలుష్యం మన స్పందనల మీద ప్రభావం చూపుతుందన్నది పరిశోధకుల వాదన.   పరిశోధకులు చెబుతున్నదాని ప్రకారం మన శరీరంలో `circadian rhythm’  అనే వ్యవస్థ ఉంటుంది. ఇది ఒక రకంగా జీవగడియారం వంటిదన్నమాట. బయట ఉన్న వెలుతురు, వేడి ఆధారంగా ఇది శరీరానికి అవసరమైన సూచనలు చేస్తుంది. కాంతి కాలుష్యం ఈ సర్కేడియన్‌ రిథమ్‌ మీద ప్రభావం చూపుతుందంటున్నారు. దాంతో నిద్రలేమి, మానసిక క్రుంగుబాటు మొదలుకొని క్యాన్సర్‌, గుండెజబ్బుల వరకూ మన మీద దాడి చేసే అవకాశం ఉందట. మన శరీరంలో పదిశాతానికి పైగా జన్యువులను ఈ సర్కేడియన్‌ రిథమ్‌ ప్రభావితం చేస్తుంది కాబట్టి, శాస్త్రవేత్తలు చెబుతున్న విషయాలని నమ్మక తప్పదు.   ఇన్ని నష్టాలకు కారణమైన కాంతికాలుష్యం నుంచి ప్రపంచాన్ని తప్పించడానికి శాస్త్రవేత్తలు చాలా సూచనలే చేస్తున్నారు. అవసరం లేని చోట్ల లైట్లు వేయడం తగ్గించుకోవాలనీ, ఆర్భాటం కోసం విద్యుత్తుని వెలిగించకూడదనీ సలహా ఇస్తున్నారు. వీధి దీపాలు కూడా నేల వైపు వెలుగులు ప్రసరించేలా చూడాలని కోరుతున్నారు. ఇవన్నీ ఏ ఒక్కరో ఆచరిస్తే సాధ్యమయ్యేవి కావు. పౌరులను బెదిరించి సాధ్యం చేసుకునేవీ కావు. కాంతి కాలుష్యాన్ని తగ్గించాలన్న స్పృహ వ్యక్తిగత విచక్షణతోనే సాధ్యపడుతుంది. అప్పటిదాకా రాత్రివేళల్లో బయట నుంచి వచ్చే కాంతి నుంచి కాపాడుకునేందుకు మందపాట కిటికీ తెరలను తెచ్చుకుందాం!   - నిర్జర.

read more
Chronic Sinusitis and its effect on Teeth

  Sinusitis that occurs due to immune system reaction to fungi causes oh-so many irritations...the cheek bones hurt, mainly due to inflammation and clogging of the sinus glands, the eye brows hurt as the sinuses behind the eye brows swell..breathing might be difficult for some, blowing the nose could be impossible for few, but strangely for the first time in six years of my stay in USA, i started feeling all symtoms of a Pollen allergy a month ago, and then has Throat irritation followed by a high fever, and after a gap of two days, it recurrence of allergy that triggered a serious sinus issue..i had never experienced a sinus infection and ddnt know what to expect..it took me just few hours to know that my sinuses are hurting...but why were my gums hurting too ?     I was so worried about my teeth health..then i suspect it could be the sinus problem that is causing my gums to hurt...when i research, it is proved that a poor sinus health can cause so much chaos in the jaw region creating sore pain and pressure on the gums..and to my question 'is there a treatment ?'...I found answers routing me to home remedies. Seriously, who could even imagine that Sinusitis causes Gum pain. What happens in there ?!   The upper teeth in our body are placed so close to the maxillary sinuses in the cheek region and even a slight sinus inflammation can be felt in the teeth and gums...the pain varies from person to person. The mucus fills in the pockets above the teeth and creates pressure, which seems like gum pain...ask me and i will tell you, it is not something you ask for !   The only relief options could be home remedies...rubbing Clove oil against the hurting gums, applying pressed ginger juice or garlic juice may offer an pain-reducing effect, however, the initial few minutes of applying these strong agents might be hard to handle. Take the case to your Doctor, he might combine an Aneasthetic with a Anti-histamine drug but pray that you dont get targeted by Sinusitis due to Cold or due to Climatic allergies every year ! Been there, done that !!   ..Prathyusha  

read more
Hic... Hic... Hiccups

  Hiccups might sound funny. Hiccups might just be a passing cloud. But they are a part of our anatomy. We often panic when we get them and confused with their cause. So, it’s always good to know everything about the Hiccups.   The Hic sound   There is an organ in our respiratory system called Diaphragm. This Diaphragm contracts and expands to allow air into our lungs. In the case of Hiccups, this Diaphragm gets into some involuntary contractions. Such sudden movements would also close the vocal cords at once... and that is the reason for the HIC sound.   But why?   Scientists are not sure of the reason for Hiccups. But some say that such reflex has developed in mammals to flush out the air locked up in the stomach while drinking milk. That might be the reason why Hiccups are found only in those mammals that drink milk... and this might also explain why kids feeding on milk are the ones who suffer with Hiccups often. This explanation proves the reason why elders warn us to wait till our kids burp after having milk to avoid Hiccups.   Other Reasons:   There are some other reasons that might trigger Hiccups... - Eating food quickly and in huge quantity. - Intake of Alcoholic beverages. - Swallowing much air while breathing or eating. - Unstoppable laughing. - Getting emotional through fear, excitement, stress.... - Eating dry or spicy food.   Home Remedies:   Hiccups might not be painful but are certainly disturbing. We have a lot of tried and tested methods to treat Hiccups...   - Having a teaspoonful of Sugar or Honey would help to soothe the irritated nerves and thereby calm down the diaphragm.   - Increasing the levels of Carbon dioxide might also solve the problem. This can be done either by holding your breathe for a while or inhaling into a paper bag.   - Let someone surprise or frighten you. We may have seen this in many films and read it in numerous jokes, but trust our elders... it works!   - There is another method called `Vagus nerve stimulation` which is done by swallowing huge chunk of dry bread, provoking a sneeze, dragging the tongue out etc.   When to panic:   Hiccups may not last for more than few hours. But if they last for more than 48 hours, then it might be a situation that should better be sorted out by a doctor. Because! Persistent hiccups might be a symptom of some serious problem in our nervous system. They might even be a hint for malfunctioning of our kidneys. Even if they are not hinting anything dangerous, persistent hiccups might result in fatigue and restlessness.   - Nirjara.

read more
ఇల్లు మారితే పిల్లలు పాడైపోతారా!

  ఉద్యోగ రీత్యా కొంతమంది నిరంతరం బదిలీలు అవుతూ ఉంటారు. తమతో పాటుగా తమ కుటుంబాన్ని కూడా వెంట తీసుకువెళ్తూ ఉంటారు. దీనికి మనం ఏమీ చేయలేం! పైగా సైన్యంలో పనిచేసే అధికారులు ఇలా బదిలీ అయినప్పుడు వారి జీవనశైలిలో పెద్దగా మార్పు కనిపించకపోవచ్చు. వారి పిల్లల చుట్టూ అదే రకమైన చదువు, అదే రకమైన సైనికుల కుటుంబాలూ తారసపడుతూ ఉంటాయి. కానీ ఎలాంటి స్థిరమైన కారణం లేకుండానే కొందరు ఇళ్లను మార్చేస్తూ ఉంటారు. ఒక వాతావరణానికి అలవాటు పడుతున్న పిల్లలను అకస్మాత్తుగా మరో వాతావరణంలోకి నెట్టివేస్తూ ఉంటారు. దీనివల్ల పిల్లల్లో మానసిక సమస్యలు ఏర్పడవచ్చని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. ఇంగ్లండులోని మాంఛెస్టర్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ‘డాక్టర్‌ రోజర్‌ వెబ్’ ఈ విషయాన్ని నిగ్గుతేల్చేందుకు ఒక భారీ పరిశోధనని చేపట్టారు.   తన పరిశోధన కోసం రోజర్‌ డెన్మార్క్‌ దేశంలోని గణాంకాల మీద ఆధారపడ్డారు. ఎందుకంటే ఆ దేశంలో పౌరుల కదలికలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ ఉంటుంది. ఆ గణాంకాల నుంచి రోజర్ 1971-1997 సంవత్సరాల మధ్య పుట్టిన దాదాపు 14 లక్షల మంది వివరాలను సేకరించారు. ఈ 14 లక్షల మందిలో తమకు 15 ఏళ్ల వయసు వచ్చే లోపల ఎవరు ఎన్నిసార్లు ఇల్లు మారారో లెక్కపెట్టారు. అలా తరచూ ఇల్లు మారడానికీ, తరువాత కాలంలో వారి మానసిక సమస్యలు ఎదుర్కోవడానికీ మధ్య ఏదన్నా సంబంధం (correlation) ఉందేమో పరిశీలించారు.   రోజర్‌ పరిశోధన ఆశ్చర్యకరమైన ఫలితాలను వెలువరించింది. 15లోపు మరీ ముఖ్యంగా 12-14 ఏళ్లలోపు వయసువారు తరచూ ఇల్లు మారి ఉంటే కనుక తరువాత కాలంలో వారిలో ఆత్మహత్య యత్నాలు, హింసాత్మక ధోరణులు, మాదకద్రవ్యాలకు అలవాటుపడటం, మానసిక కుంగుబాటు... తదితర ప్రవర్తన కనిపించిందట. బాల్యంలో ఎంత ఎక్కువగా ఇళ్లు మారితే, అంత ఎక్కువగా ఇలాంటి సమస్యలు కనిపించాయట. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఫలితాలలో పేద పిల్లలు, గొప్పింటి బిడ్డలు అన్న తారతమ్యం కనిపించకపోవడం.   రోజర్‌ పరిశోధనని బట్టి నివాస స్థలాన్ని మార్చేయడం అన్నది ఏమంత ఆషామాషీ వ్యవహారం కాదని తెలుస్తోంది. ఆ మార్పు పిల్లల్లో, ముఖ్యంగా టీనేజిలో ఉన్న పిల్లల జీవితాలలో బహుశా పెను ప్రభావం చూపించవచ్చు. పెద్దవారిదేముంది? ఆఫీసుల్లోనో, ఇంటి పనుల్లోనో కాలం గడిపేస్తారు! కానీ సమాజంతో అనుబంధాన్నీ, తమదైన దృక్పధాన్నీ అలవర్చుకునే సమయంలో పిల్లల జీవితంలో ఇలాంటి మార్పు వారిలో అభద్రతా భావాన్ని కలిగించవచ్చు, చెడుసావాసాలకీ దారితీయవచ్చు. ప్రతి చిన్న మార్పూ పెను ప్రభావాన్ని చూపే కీలక వయసులో ఇల్లు మారడం అన్నది కూడా ముఖ్యమైన విషయమే అంటున్నారు రోజర్‌. అందుకనే కొత్తగా నివాసాన్ని మార్చుకున్న పిల్లలను కాస్త జాగ్రత్తగా గమనించుకోవాలని హెచ్చరిస్తున్నారు.   - నిర్జర.

read more
రంజాన్‌ మాసంలో ఖర్జూరాలు ఎందుకు!

  రంజాన్‌ మాసం రాగానే అందరికీ ఖర్జూరాలే గుర్తుకువస్తాయి. ఎందుకంటే ముస్లిం సోదరులంతా రంజాన్‌ రోజున ఉపవాసాన్ని ఉండి, సాయంత్రం పూట ఆ ఉపవాసాన్ని ఒక ఖర్జూరాన్ని తీసుకోవడంతో ముగిస్తారు. సాక్షాత్తూ మహమ్మద్‌ ప్రవక్తే ఇలాంటి ఆచారాన్ని పాటించేవారని చెబుతారు. ఇస్లాం రూపుదిద్దుకున్న ఎడారి నేలల మీద ఖర్జూర పుష్కలంగా పండే పండు కావచ్చు. కానీ లోతుగా ఆలోచిస్తే, రంజాన్‌ ఉపవాసపు ముగింపుగా ఖర్జూరన్నే ఎంచుకోవడం వెనుక చాలా కారణాలే కనిపిస్తాయి.   - పగలంతా ఉపవాసం ఉన్నవారిలో చక్కెర నిల్వలు పడిపోతాయి. నీరసం, నిస్సత్తువా ఆవహిస్తాయి. ఇలాంటివారికి తిరిగిన శక్తిని అందించే ఔషధంగా ఖర్జూర పనిచేస్తుంది. ఎందుకంటే 100 గ్రాముల ఖర్జూరలో 50 గ్రాములకి పైగా చక్కెర ఉంటుంది. ఇందులో మనిషికి తక్షణ శక్తిని అందించే గ్లూకోజ్ కూడా అధికంగానే ఉంటుంది.   -రోజంతా ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరానికి తగిన పోషకాలు అందవు. దాంతో తలనొప్పి వచ్చే అవకాశం మెండుగా ఉంటుంది. ఖర్జూరలో కావల్సినన్ని పోషకాలు ఉన్నాయి. ఒక అంచనా ప్రకారం ఇందులో 6 రకాల విటమిన్లూ, 15 రకాల ఖనిజాలూ ఉన్నాయి. కాబట్టి రెండు మూడు ఖర్జూరాలు తీసుకుంటేనే శరీరానికి బోలెడంత శక్తి లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఉపవాసంతో శరీరానికి దూరమైన పోషకాలను అందించే బాధ్యత ఖర్జూర తీసుకుంటుందన్నమాట.   - రోజంతా ఉపవాసం ఉన్నాక ఒక్కసారిగా భారీ ఆహారాన్ని తీసుకుంటే జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. కానీ ఖర్జూరం అలా కాదు. ఇందులో ఉండే చక్కెర, పీచు పదార్థాల వల్ల చాలా తేలికగా జీర్ణమవుతుంది. జీర్ణవ్యవస్థను మళ్లీ సాధారణ స్థితికి తీసుకువస్తుంది.   - రోజూ ఒకే సమయానికి ఆహారాన్ని తీసుకునేలా మన శరీరం సిద్ధపడిపోయి ఉంటుంది. మనం అలవాటు చేసిన పనిని శరీరం యథాతథంగా నిర్వర్తిస్తుంది. ఆకలి వేయడం, ఆహారం జీర్ణం కావడం, జీర్ణం అయిన ఆహారం విసర్జన కావడం... ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం జరిగేలా శరీరం చూసుకుంటుంది. ఏదో ఒక రోజు ఉపవాసం అంటే ఫర్వాలేదు కానీ, రోజుల తరబడి ఉపవాసం అంటే శరీర ధర్మం తారుమారైపోతుంది. దీన్ని చక్కబెట్టే బాధ్యతను ఖర్జూర తీసుకుంటుంది. చక్కెర, రుచి ఉన్న ఖర్జూరను నోట్లో ఉంచుకోగానే జీర్ణరసాలు ఊరి రాత్రిపూట ఆహారాన్ని తీసుకునేందుకు సిద్ధపడిపోతాయి. ఖర్జురలో ఉండే పీచుపదార్థం తరచూ ఉపవాసాలు చేయడం వల్ల వచ్చే మలబద్ధకాన్ని అరికడుతుంది.   - రోజంతా నిరాహారంగా ఉన్నప్పుడు ఒక్కసారిగా విపరీతంగా ఆహారం తీసేసుకోవాలన్న తపన కలుగుతుంది. దీని వల్ల ఉపవాస ఫలితం ఉండకపోగా, వ్యతిరేక పరిణామాలకు కూడా దారితీయవచ్చు. ముందుగా ఒకటి రెండు ఖర్జూరాలను తీసుకుంటే కడుపు కాస్త నిండిన భావన కలుగుతుంది. ఆహారం పట్ల తపన తగ్గుతుంది. పైగా ఉపవాస వేళలు ముగిసిన వెంటనే ఆహారాన్ని తీసుకోవడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి ఆహారం తీసుకునే అవకాశం వచ్చేలోగా ఖర్జూరాలతో ఆకలిని తీర్చుకోవచ్చు. - నిర్జర.

read more
దగ్గు మీద దాడి చేయండి!

  ఎండలు తగ్గుముఖం పట్టాయి. కాస్త వర్షాలు, వాటితో పాటుగా చలిగాలులు మొదలయ్యేసరికి దగ్గు విడవకుండా పలకరిస్తుంది. ఓ నాలుగు దగ్గులు దగ్గగానే ఇక దగ్గర్లో ఉన్న ఏదో ఒక మందుల షాపు దగ్గరకి వెళ్లి సిరప్పో, మందుబిళ్లలో తెచ్చుకోవడానికి సిద్ధపడిపోతాం. వీటి వల్ల మగత, నీరసంలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండే అవకాశం లేకపోలేదు. కృత్రిమమైన మందుల వల్ల తాత్కాలిక లాభాలు, దీర్ఘకాలిక నష్టాలు సహజమే కదా! అందుకని ముందుగా ఇంట్లోనే కొన్ని చిట్కాలను పాటించి చూస్తే పోయేదేముంది. ఏళ్లకేళ్లుగా మన పెద్దలు చెబుతున్న, ఆచరిస్తున్న ఈ చిట్కాలు మరోసారి...     తేనె:  పొడి దగ్గుకైనా, కఫంతో కూడిన దగ్గుకైనా తేనె దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే మార్కెట్లో దొరికే కాఫ్‌ సిరప్‌లతో సమానంతా తేనె పనిచేస్తుందని వాదించే నిపుణులూ లేకపోలేదు. నోటి నుంచి గొంతుదాకా తేనె ఒక సన్నటి రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసి దగ్గుని తగ్గిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకని తేనెని నేరుగా కానీ, గోరువెచ్చటి పాలు లేక నీటితో కానీ తీసుకుంటే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.     అల్లం:  పొడి దగ్గుతో బాధపడేటప్పుడు అల్లం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఒక చిన్న ముక్క అల్లాన్ని అలాగ్గా నమిలేసినా కొంత ప్రభావం ఉంటుంది. లేదా నీటిలో ఓ నాలుగు ముక్కల అల్లాన్ని వేసి ఆ నీరు సగానికి మరిగేదాకా ఉంచి, ఆ కషాయాన్ని పుచ్చుకున్నా ఉపశమనం ఉంటుంది. అల్లం ఘాటుకి గొంతులో స్రావాల ఉత్పత్తి ఎక్కువవుతుందనీ, తద్వారా తగినంత తేమ చేరి దగ్గు తగ్గుతుందని అంటున్నారు.     పసుపు: దగ్గుకి పసుపుని వాడటం అనాదిగా వస్తున్నదే! రాత్రిపూట గోరువెచ్చటి పాలలో చిటికెడంత పసుపు వేసుకుని తాగితే దగ్గు చిటికెలో మాయమైపోతుందని పెద్దలు చెబుతూ ఉంటారు. పసుపు వల్ల దగ్గు తగ్గడమూ, పాలతో సుఖంగా నిద్ర పట్టడమూ రెండూ సాధ్యమవుతాయి. ఇక ఊపిరితిత్తులలో కఫం పేరుకున్నప్పుడు వేడి వేడి నీటిలో పసుపుని వేసి ఆవిరి పట్టడం వల్ల కూడా కఫం పల్చబడిపోతుంది.     మిరియాలు: కఫంతో కూడిన దగ్గుకి మిరియాలను మించిన చిట్కా లేదంటోంది సంప్రదాయ ప్రపంచం. ఇంగ్లండు నుంచి చైనా వరకు సనాతన వైద్యంలో దగ్గుని నివారించేందుకు నల్ల మిరియాలను వాడుతూనే వస్తున్నారు. ఇందుకోసం నీటిలో కానీ, పాలల్లో కానీ పొడి చేసిన మిరియాల పొడిన కలుపుని తాగమని చెబుతుంటారు. అయితే మిరాయలు వేడిని కలిగిస్తాయి. పైగా గొంతులో కఫాన్ని పెంపొందిస్తాయి. కాబట్టి పొడిదగ్గు ఉన్నప్పుడే వీటిని వాడాలి.   ఇవేకాదు... తులసి ఆకులు నమలడం, నిమ్మరసాన్ని తీసుకోవడం, బాదం పప్పులు తినడం, పుదీనా టీ తాగడం... ఇలాంటి చిట్కాలెన్నో ఇంగ్లీషు మందులకంటే అద్భుతంగా పనిచేస్తాయి.   - నిర్జర.

read more
గుండె కొట్టుకోవడంలో తేడా ఉండాల్సిందే!

  శ్వాస తీసుకునే విధానానికీ ఆరోగ్యానికీ మధ్య ఉన్న సంబంధం మనకి తెలియనిది ఏమీ కాదు. కేవలం శ్వాస తీసుకునే పద్ధతిని నియంత్రించేందుకే భారతీయులు ప్రాణాయామాన్ని కనుగొన్నారన్న విషయం తెలిసిందే! ప్రాణాయామం ద్వారా శ్వాస మీద అదుపు సాధిస్తే కనుక ఊపిరితిత్తుల నుంచి గుండె వరకూ మన శరీర అవయవాలన్నీ చక్కగా పనిచేస్తాయనీ... తద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుందనీ మన పెద్దల నమ్మకం. ఇదే విషయాన్ని మరోసారి మరో పరిశోధన రుజువు చేసింది.   మ్యూనిచ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన జార్జ్‌ ష్మిట్‌ అనే పరిశోధకులు అందిస్తున్న ఈ నివేదిక గుండె కొట్టుకోవడానికీ, ఆయుష్షుకీ ప్రత్యక్ష సంబంధం ఉందని చెబుతోంది. తన పరిశోధన కోసం జార్జ్ 950 మంది గుండె పోటు వచ్చిన రోగులను ఎంచుకున్నారు. వీరందరి గుండె పనితీరునీ కూడా ఐదేళ్ల పాటు నిశితంగా గమనించారు. సాధారణంగా ఒక వ్యక్తి ఊపిరి పీల్చుకునేటప్పుడు ఒకలా, శ్వాసను విడిచేటప్పుడు మరోలా అతని గుండె కొట్టుకుంటుంది. ఈ వ్యత్యాసాన్ని ‘Respiratory sinus arrhythmia’ అంటారు. తాము గమనించిన కొందరు రోగులలో ఈ వ్యత్యాసం పెద్దగా లేకపోవడాన్ని గమనించారు జార్జ్‌. అంటే సదరు రోగుల గుండె నిరంతరం ఒకే తీరున కొట్టుకుంటోందన్న మాట! చూడ్డానికి ఇది చాలా ఆరోగ్యకరమైన విషయంలా తోచవచ్చు. కానీ గుండె ఇలా ఒకే తీరున కొట్టుకునే రోగులు త్వరలోనే చనిపోవడాన్ని గమనించారు జార్జ్‌. అలా కాకుండా కొద్దిపాటి వ్యత్యాసంతో గుండె కొట్టుకునే రోగులు సుదీర్ఘకాలం జీవించినటట్లు తేలింది. ఇలా ఉఛ్వాస నిశ్వాసల మధ్య గుండె పనితీరులో కొద్దిపాటి మార్పు కనిపించడమే ఆరోగ్యకరమంటున్నారు జార్జ్‌. బహుశా గుండె విశ్రాంతి తీసుకోవడానికీ, తన పనితీరుని మెరుగుపరచుకోవడానికే ఇలాంటి వ్యత్యాసం ఉపయోగపడుతుందని పరిశోధకులు అనుమానిస్తున్నారు.   తను చేసిన పరిశోధన ఆధారంగా ఎవరైనా తమ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చునంటున్నారు జార్జ్‌. ముఖ్యంగా గుండె వ్యాధి ఉన్నవారు, తమ గుండె కొట్టుకునే విధానాన్ని అప్పుడప్పుడూ గమనించుకోవాలని సూచిస్తున్నారు. వైద్యుల సాయంతో తమలోని ‘Respiratory sinus arrhythmia’ తగిన వ్యత్యాసంతో ఉందా లేదా బేరీజు వేసుకోవాలని చెబుతున్నారు. ఇందులో అకస్మాత్తుగా ఏదన్నా తేడా కనిపిస్తే నిపుణులను సంప్రదించమని హెచ్చరిస్తున్నారు.   -నిర్జర.

read more
Smoking kills others

Some people might enjoy smoking cigarettes and they may be ready to face the consequences. But what about the one’s around them? From Kids to pregnant women... people around the smokers are the ones who pay a heavy penalty for their addiction. Passive or Second hand smoking is as dangerous as the first hand smoking. Here is why!   Children: Children who are in constant company of smokers tend to acquire all sorts of respiratory diseases. Particularly if you are smoking before a baby less than two years... please do remember that you might alter his respiratory life forever. From Bronchitis to Asthma... children get prone to severe respiratory ailments. They get easily affected with cough, cold and phlegm.     Pregnant women: It’s not just the women who smoke during their pregnancy are responsible for complications in their delivery. Women who are in company of a constant smoker are also prone to too many hitches. They might pose the risk of miscarriage, still birth and premature birth. Even if the child is born... he might be of much lower weight. Even if he is of enough weight... he might be susceptible to unexpected death syndromes.   Passengers: As cars are enclosed, the chemicals from the cigar often hover inside it. According to an estimate, children in such cars are exposed to around three times higher than the normal pollution levels. This is the reason why many countries such as England have banned smoking in cars with children below 18 years of age.   Pets: People might complain at your smoking... but pets can’t. They would just die! Researchers have found that passive smoking is much dangerous to pets than to humans. Scientists at the University of Glasgow have found pets getting prone to weight gain, cell damage and cancer. Pets spend much of their time of carpets and sofa which retains the nicotine particles. Further cats and dogs clean their body by licking... which lets the harmful chemicals into their bodies.   People in the room: Smokers often leave most of the smoke into the room which alters its atmosphere. The particles from the poisonous chemicals hang in the air for longer times... which are of course inhaled by the rest. Such side stream smoke contains much higher levels of chemicals such as carbon monoxide and ammonia. Such chemicals are known to be a cause for ailments such as lung cancers. - Nirjara.    

read more
పచ్చగడ్డి మీద నడిస్తే... ఆరోగ్యం వస్తుందా!

మనిషి ఈ ప్రకృతిలో ఒక చిన్న భాగమే! కానీ ఈ ప్రకృతికీ తనకూ ఏమాత్రం సంబంధం లేదన్నంతగా అతని జీవనశైలి మారిపోయింది. ఒక పక్క ప్రకృతిని తనకు అనుకూలంగా ఎడాపెడా వాడేసుకుంటూనే, నాలుగ్గోడల మధ్యే జీవితాన్ని గడిపేస్తున్నాడు. ఫలితం... కృత్రిమమైన జీవితంలాగానే, కృత్రిమమైన జబ్బులూ వచ్చేస్తున్నాయి.   మరే ఇతర జీవికీ లేనంతగా, మనిషి చిన్న వయసు నుంచే నానారకాల వ్యాధుల పాలిట పడుతున్నాడు. అందుకే ప్రకృతికి తిరిగి చేరువయ్యే మనిషికి ఆరోగ్యం కూడా దక్కుతుందంటూ కొత్త కొత్త పరిష్కారాలను సూచిస్తున్నారు. వాటిలో ఒకటే పచ్చగడ్డి మీద నడక! రోజురోజుకీ ప్రచారంలోకి వస్తున్న ఈ విధానం వల్ల చాలా ఉపయోగాలే ఉంటాయంటున్నారు నిపుణులు. అవేమిటంటే...   - రిఫ్లెక్సాలజీ అనే శాస్త్రం ప్రకారం మన శరీరంలోని నాడులన్నీ కూడా పాదాల దగ్గరకి వచ్చి ఉంటాయి. కాబట్టి మన పాదంలోని ఒకొక్క భాగం మీద ఒత్తిడిని తీసుకువచ్చినప్పుడు, అక్కడ ఉన్న నాడికి చెందిన అవయవం మీద అనుకూల ప్రభావాన్ని చూపుతుంది. పచ్చగడ్డిలో నడిచేటప్పుడు మన పాదంలోని ప్రతి అణువు మీదా ఒత్తిడి కలిగి తీరుతుంది కాబట్టి... రిఫ్లెక్సాలజీ ప్రకారం ఇది మన శరీరం మొత్తాన్నీ స్వస్థత పరుస్తుంది.   - పచ్చటి నేల మీద నడిచేటప్పుడు భూమితో ఒక అనుబంధం ఉన్న భావన కలుగుతుంది. మనం ప్రకృతి ఒడిలో ఉన్నంత తృప్తిగా ఉంటుంది. ఇలాంటి అనుభూతి వల్ల మనసు చాలా ప్రశాంతని పొందుతుందంటున్నారు నిపుణులు. రోజువారీ జీవితంతో ఏర్పడే ఒత్తిడి, భయాందోళనలన్నీ... ఇలా ప్రకృతిలో మమేకం అవ్వడం వల్ల దూరమవుతాయంటున్నారు.   - నిరంతరం పాదాలకు తోలుతోనో, ప్లాస్టిక్‌తోనో చేసిన చెప్పులను ధరించడం వల్ల... మన శరీరం మీద భూమిలోని అయస్కాంత క్షేత్రం చూపించే ప్రభావంలో అనుకూల/ ప్రతికూల మార్పులు రావచ్చు. రోజులో కాసేపన్నా ఇలా గడ్డి మీద నడవడం వల్ల మన శరీరం మీద ఈ ప్రభావం సానుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది.   - పచ్చగడ్డి మీద నడవడం వల్ల కంటిచూపు మెరుగుపడుతుందని తేలింది. ఇందుకు రెండు కారణాలు చెప్పుకోవచ్చు. ఒకటి- రిఫ్లెక్సాలజీ ప్రకారం పచ్చగడ్డి మీద నడిచేటప్పుడు, మన పాదంలో... కంటినాడి మీద ప్రభావం చూపే స్థానాల మీద ఒత్తిడి కలుగుతుంది. రెండు- నిరంతరం కంప్యూటర్ ముందో, పుస్తకం ముందో, పేపరు పట్టుకునో కూర్చునే మనకి అప్పుడప్పుడూ కాస్త దూరంగా, పచ్చగా ఉండే వస్తువులు కనిపిస్తూ ఉండాలని వైద్య శాస్త్రం చెబుతోంది.   - నిరంతరం బూట్లు లేదా చెప్పులు ధరించి ఉండేవారికి... అరికాళ్లలో రక్తప్రసారం తగ్గిపోయి, పాదాలు మొద్దుబారిపోయి ఉంటాయి. ఇలాంటి వాళ్లు రోజులో కాసేపన్నా పచ్చగడ్డి మీద నడిస్తే అప్పుడు తెలుస్తుంది... ఆ స్పర్శలో ఉన్న హాయి ఏమిటో. ఒక రకంగా చెప్పాలంటే పచ్చగడ్డిలో నడక మన పాదాలకు మంచి మసాజ్‌లాంటిది.   - ఉదయాన్నే కాసేపు అలా పచ్చగడ్డి మీద నడిస్తే ఆ తాజా గాలి, పచ్చగడ్డి మీద నుంచి వచ్చే పసిరిక వాసనా, మెత్తటి గడ్డి అందించే స్పర్శా... ఇవన్నీ కూడా మానసిక ప్రశాంతతని అందిస్తాయి. ఇక ఆ సమయంలో పై నుంచి వచ్చే సూర్యరశ్మి కూడా మనకు రోజువారీ అవసరమయ్యే విటమిన్‌ ‘డి’ను అందిస్తుంది. నేటి జీవనశైలితో వస్తున్న కీళ్ల వ్యాధి నుంచి డయాబెటిస్‌లకు ‘డి’ విటమిన్‌ లోపం కూడా ఓ కారణం అని ఇప్పటికే తేలింది. నిరంతరం నాలుగ్గోడల మధ్యే ఉంటున్న జనానికి సహజమైన ఈ విటమిన్‌ అందడం లేదని వెల్లడైంది. దీనికి ఉదయపు నడకే అత్యుత్తమ పరిష్కారం అని చెబుతున్నారు.   చెప్పుకుంటూ పోతే... పచ్చగడ్డి మీద నడిస్తే వేస్తే కలిగే లాభాలు చాలానే ఉన్నాయి. కావాలంటే మీరు కూడా ఓ నాలుగడుగులు అలా వేసి చూడండి. ప్రత్యేకించి కాకపోయినా... ఎప్పుడన్నా పచ్చగడ్డి కనిపిస్తే దాని మీద పాదం మోపి చూడండి. మీరే ఒప్పుకుంటారు... ఆ స్పర్శలో ఏదో మాయ ఉందని! - నిర్జర.  

read more
PROBIOTIC is the latest trend... BUT

This is the age of medical awareness. And people get crazy at a product if they find it to be of some good to their health. Probiotic products seem to be the latest trend for such people. But what are Probiotics and are they really useful and needed for us. Let’s check out...   Nothing but Bacteria: The word BACTERIA don’t always mean to be negative. From fermentation of milk to digestion of food... we need the help of good bacteria. Probiotics are nothing but the good bacteria that is useful for our health, particularly the digestive system. The benefit of probiotics was known for over a century. But it was only after 1980, people began to look for alternative means to consume Probiotics.   PROBIOTIC products: Though Probiotics are found naturally in products such as curd, soya milk and dark chocolate... products enriched with Probiotics began to enter the market. Products added with Probiotics are believed to be miraculous. From eczema to diarrhea... Probiotic products boast of curing too many ailments. But is that true?   Rubbish: Probiotic foods may certainly be useful in curing diseases like Irritable bowel syndrome and diarrhea. But there is very little scientific evidence to prove them to be useful in other cases. Researchers are now advising not go mad over Probiotic products. They feel that Probiotic products are helpful for only those patients with digestive problems. Recently, a team of researchers from Denmark has rubbished down the healing powers of Probiotic products.   Doctor! Doctor!: If you are suffering from some digestive ailment, and if you feel that Probiotics could help... then your Doctor could certainly advice them! Medicines filled with Probiotics are not new for us. For example, Sporlac- a common medicine used to treat diarrhea is nothing but a Probiotic. It is filled with bacteria called lactobacilli that help the digestion process in small intestine. Doctors even administer Probiotic medicines to patients who are taking antibiotics in huge doses. It’s a known fact that antibiotics kills the good bacteria in our intestines and might result into a situation called antibiotic induced diarrhea. So! It’s good to be health conscious. But such conscious should always be supported by reason and knowledge. It should be out of necessity but not out of fashion should one run after the latest trends in health products. Moreover, it’s always good to have natural substitutes that give us necessary nutrients without harming our health and wealth. - Nirjara  

read more
కలసి ఉంటే కలదు సంతోషం!

కాలేజీ కుర్రవాళ్లను ఎప్పుడన్నా గమనించారా? వాళ్లు ఒక్క నిమిషం కూడా తమ స్నేహితులని విడిచి ఉండేందుకు ఇష్టపడరు. తమ కుటుంబానికి ఎంత విలువని ఇస్తారో, మిత్రబృందానికి కూడా అంతే విలువని ఇస్తారు. ఇక ఆ కుర్రవాళ్లు ఏ క్రికెట్‌ జట్టులో అన్నా ఉంటే, ఆట ఆడినా ఆడకపోయినా... జట్టంతా ఒకే చోట కనపడుతూ ఉంటుంది. ఒక జట్టుతో కలిసి ఉండటం వల్ల బహుశా ఆ కుర్రవాళ్లు చాలా సంతోషంగా ఉంటారేమో అన్న అనుమానం కలుగక మానదు. ఈ మధ్య జరిగిన ఓ పరిశోధన ఆ అనుమానం నిజమే అని తేలుస్తోంది.   ఇంగ్లండుకి చెందిన నాటింగామ్‌ ట్రెంట్‌ విశ్వవిద్యాలయం, మనుషులను సంతోషంగా ఉంచేది ఏమిటి? అంటూ ఒక పరిశోధనని నిర్వహించింది. విశ్వవిద్యాలయానికి చెందిన డా॥ జూలియట్‌ వేక్‌ఫీల్డ్‌ ఈ పరిశోధన కోసం 4000 మంది జీవితాలను పరిశీలించారు. వేక్‌ఫీల్డ్‌ పరిశోధనలో తేలిన విషయం ఏమిటంటే... ఏదన్నా బృందంతో కలిసి ఉండేవారు మిగతావారితో పోలిస్తే సంతోషంగా ఉంటారట. బృందం అంటే ఏదో తూతూమంత్రంగా తీసుకునే సభ్యత్వం కాదు. అలా అనుకుంటే ప్రతి మనిషీ ఏదో ఒక బృందంలో సభ్యుడిగా ఉండే ఉంటాడు. తన కుటుంబంతోనో, మిత్రులతోనో, సత్సంగంలాంటి ఆధ్యాత్మిక సమాజంతోనో, ఆటలు ఆడే జట్టుతోనో, వీధిలోని వారితోనో... ఇలా సమాజంలో ఏదో ఒక భాగంతో కలిసిమెలిసి మెలిగేవారు సంతోషంగా ఉంటారని తేలింది.   ఏదో ఒక బృందంతో అనుబంధంగా ఉండేవారు సంతోషంగా ఉంటారని తేలింది నిజమే! కానీ దానికి కారణం ఏమిటి? అన్న ప్రశ్నకు సుదీర్ఘమైన జవాబులని ఇస్తున్నారు వేక్‌ఫీల్డ్‌. ఎంతసేపూ నేనూ, నా జీవితం అనుకుంటే కష్టాలు, సుఖాలు అన్నీ కూడా వ్యక్తిగతమైపోతాయి. అలా కాకుండా నా చుట్టూ ఉన్నవారి బాగోగులను గమనించుకోవాలనే బాధ్యత, నాకేమన్నా అయితే ఇంతమంది ఉన్నారన్న భరోసా... మనిషికి ఏనుగంత బలాన్నిస్తాయట. నలుగురితో కలిసిమెలిసి ఉండటం వల్ల... ఇచ్చిపుచ్చుకునే ధోరణి, కష్టసుఖాలను పంచుకునే అలవాటు ఏర్పడుతుందట. ఇవన్నీ కూడా మనసుకి సంతోషాన్ని కలిగించేవే కదా! పైగా తనలో తాను కృంగిపోయేవారి కంటే నలుగురిలో కలిసిపోయేవారే ప్రశాంతంగా ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే మీ చుట్టూ ఉన్న ఏదో ఒక బృందంలో కాస్త కలుపుగోలుగా మెలిగి చూడమంటూ సూచిస్తున్నారు వేక్‌ఫీల్డ్‌. వేక్‌ఫీల్డ్‌ చెప్పిన మాటలు పాశ్చాత్యులకు కొత్తగా కనిపించవచ్చు. కానీ మన భారతీయ సమాజానికి కొత్త కాదు కదా! నిన్న మొన్నటి దాకా ఉమ్మడి కుటుంబాల్లో కలిసి మెలిసి జీవించిన మనకి అందులోనే సంతోషం కనిపించేది. కుటుంబంలోని మిగతావారి ఔన్నత్యమే తన అభివృద్ధి అన్న ఉదారభావంతో ఇంట్లోని వారంతా మెలిగేవారు. కుటుంబాల దాకా ఎందుకు! పల్లెటూళ్లలో ఉండేవారంతా ఒకే కుటుంబంగా మెలుగుతూ ఉండేవారు. ఇక పేరంటాలతోనో, గుడిలో పురాణ కాలక్షేపాలతోనో, రచ్చబండ దగ్గరో నలుగురూ ఒక చోట కలవడం అనేది సర్వసాధారణంగా ఉండిపోయేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేకపోవడమే దురదృష్టం. కలిసి ఉండటంలోని సంతోషం గురించి పాశ్చాత్యులు పరిశోధనలు చేస్తుంటే..... మనం మాత్రం విడిపోయి కష్టాలను కొనితెచ్చుకోవడంలో వారిని అనుసరిస్తున్నాము. - నిర్జర.  

read more
Forest Bathing- ఆరోగ్యంలో కొత్త సంచలనం!

  అడవి గాలి అన్న మాట మనకి కొత్తేమీ కాదు. కానీ ఆ గాలికి దూరం కావడమే ఓ చిత్రం. మనిషి నాగరికతకి నిదానంగా అలవాటుపడుతున్న కొద్దీ, ప్రకృతికి వీలైనంత దూరంగా జరుగుతున్నాడనడంలో అతిశయోక్తి ఏదీ లేదు. కానీ అలా నాగరిక ప్రపంచంలో మునిగిపోయిన ఉన్న మనిషి ప్రశాంతంగా ఉన్నాడా అంటే అదీ లేదు. ఒత్తిడి- ఒత్తిడి నుంచి రక్తపోటు- రక్తపోటు నుంచి గుండెజబ్బులు... ఇలా నానారకాల వ్యాధులూ అతన్ని నిర్వీర్యం చేస్తున్నాయి. ఆ మధ్య ఎప్పుడో అమెరికాలో నిర్వహించిన ఒక పరిశోధన ప్రకారం ఆ దేశంలోని జనం 87 శాతం సమయాన్ని నాలుగ్గోడల మధ్యే గడిపేస్తున్నారట. ఇలా నాలుగ్గోడల మధ్య నలిగిపోతున్న మనుషుల కోసం ఇప్పుడు ఓ కొత్త చికిత్సా విధానం ప్రచారంలోకి వస్తోంది. అదే Shinrin-yoku... అంటే జపాను భాషలో అడవీ స్నానం (ఫారెస్ట్‌ బాతింగ్‌) అన్నమాట!   Shinrin- Yoku ఎక్కడో ప్రాచీన కాలం నాటి పదం కాదు. అసలు అప్పట్లో ఇలాంటి అవసరమే లేదు కదా! 1980ల్లో జపాను అటవీ శాఖ మొదలుపెట్టిన కార్యక్రమం ఇది. ఇదే క్రమంగా ఇప్పుడు ప్రపంచమంతటా విస్తరిస్తోంది. ఇలా అడవీ స్నానం చేయాలనుకునే వ్యక్తులను, అందులో నిష్ణాతులైనవారు అడవుల్లోకి తీసుకువెళతారు. కేవలం అడవుల్లోకి అలా నడుస్తూ వెళ్లడమే కాదు... తమ చుట్టుపక్కల ఉన్న ప్రకృతిని ఆస్వాదిస్తూ, చెట్టూచేమల్ని గమనిస్తూ సాగాలి. నిదానంగా ఊపిరిని పీల్చుకుంటూ, అడవిలో లీనమవుతూ నడవాలి. ఇలా ప్రయాణం సాగిస్తున్నప్పుడు తాము కూడా ఈ అనంతమైన ప్రకృతిలో భాగమే కదా అనిపిస్తుంది మనిషికి. ప్రకృతిలో ఉన్న జీవమే తనలోనూ తొణికిసలాడుతున్నట్లు తోస్తుంది. ఒత్తిడి స్థానంలో ప్రశాంతత చోటు చేసుకుంటుంది.   Shinrin- Yoku వల్ల ఒత్తిడి మాయమైపోతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనికి తోడు మెదడు చురుగ్గా పనిచేయడం మొదలుపెడుతుందని తేలింది. ఒత్తిడిని కలిగించే కార్టిజాల్‌, అడ్రినలిన్‌ వంటి హార్మోలన్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవడాన్ని కూడా గమనించారు. ఇక అడవిలో Shinrin- Yoku తరహా చికిత్సను తీసుకున్నవారిలో రోగనిరోధక శక్తి కూడా పెరిగినట్లు తేలింది. అందుకని ఇప్పుడు కొరియా మొదలుకొని ఆస్ట్రేలియా వరకూ దేశదేశాలన్నింటిలోనూ Shinrin- Yoku శిబిరాలు వెలుస్తున్నాయి. కానీ మనకు ఇలాంటి చికిత్స గురించి తెలియకుండానే మనం దానిని పాటించేస్తూ ఉన్నాము. ఏ తిరుపతికో, మేడారానికో, శ్రీశైలానికో... వెళ్తే Shinrin- Yoku శిబిరంలో పాల్గొన్నట్లే కదా! అక్కడ ఉండే అడవులూ, జలపాతాలూ, కొండకోనలూ అన్నీ మనలోని ప్రకృతిని తట్టిలేపేవేనయ్యే! కాకపోతే ఈసారి కాస్త మనసు పెట్టి వాటిలో లీనమైతే సరి... మనం కూడా అడవీ స్నానాన్ని ఆచరించినట్లే! - నిర్జర.

read more
Foods that resembles Organs

There is a belief called ‘Doctrine of Signatures’ which means that some parts of the plants resembles the organs which they are good for when consumed. Though such belief is not vouched by modern scientists, folk medicine still believes in the doctrine. Here are a few examples they give us that can’t be ignored. Carrots and Eyes: Slice the carrot and have a close look at its rings. They surely resemble our eyes with pupil and iris. It’s a known fact that carrots are abundant with vitamin A which keeps your eyes healthy. The beta carotene in carrot would reduce the chance of muscular degeneration in eyes... a symptom that is so common in older people.   Walnuts and Brain: Walnuts pose a striking resemblance with brain including its wrinkles and cross sections. Walnuts not just resemble brain, but also help in retaining a healthy brain. Walnuts are rich with omega-3 fatty acids which support the functioning of brain. Walnuts are strictly suggested to pregnant women to develop a healthy baby with healthy brain. Even elder people are advised to have walnuts to get rid of diseases like Alzheimer’s.   Tomatoes and Heart: Cut through a tomato and have a close look at it. The cross section of a tomato represents the chambers of our heart. Besides Vitamin C, tomatoes are rich in a chemical called Lycopene.  Studies have found that Lycopene is highly effective in reducing the risk of coronary blockages and cancer. Ginger and Stomach: Indians and Chinese always knew about the effect of ginger over stomach. Gingerol, a main ingredient in Ginger which is the cause for its pungent smell is also the reason for its medicinal value. Ginger helps the digestive process by increasing the appetite.   Grapes and Lungs: A bunch of grapes represent the alveoli of lungs. The alveoli are the end parts of the lungs which pass on the oxygen to blood stream. Fresh fruit like grapes would always help for healthy lungs. Besides, proanthocyanidin- a chemical which appears in grape seeds is found to be highly beneficial in asthma.   Mushrooms and Ears: Ears are the only organs that strike us when we look at mushrooms. Mushrooms are one of those rare foods that are rich in Vitamin D. Since the structure of our ears and their audibility is highly dependent on the tiny bones within them, mushrooms provide them with Vitamin D needed for healthy bones.   Well! These are just a few examples to represent `Doctrine of Signatures’. Onions and Blood cells; Red Wine and Blood; Sweet Potatoes and Pancreas; Avocados and Uterus... are all form a part of the list of foods that resemble the organs they benefit. - Nirjara  

read more
Basic Rules for Good General Health

  Health is Wealth...it is highly impossible to achieve anything or even enjoy the fruits of an existing wealth if ones health is not well. Sickness is a black hole...Good Health is a treasure..it is like a Fertile Land, grow anything on it and it florishes ! There are a few basic rules to maintaining ones health..for any age group.   Maintain everyday fitness..everyone needs to exercise, atleast for 30mins a day if it is a one year old, and get fit through some physical activity games or fitness moves for the adults.   Eat 70% more vegetables and fruits, than snacks and junk food, per day.   Replace every sweet item, such as is made with Sugar, containing High fructose corn syrup, Dextrose, Fructose etc..with Water or plain milk or buttermilk, coconut water..whenever possible, in a day.   Replace every fried, fatty food with a fresh veggie or fruit.   Consume healthy fats such as coconut oil, avocado oil, olive oil, dried nuts, keeping butter and egg yolks at the minimum, overall these are healthier fats compared to vegetable oils and beef oil etc.   Avoid Geneticall Altered Foods such as Soy, Alfalfa, Corn, Cotton seed etc..though a recent study proved that GMO foods are not as harmful as they are considered, it is better to keep such foods at bay until the study is established deeply.   Get ample sleep of 7-8 hours per day.   Keep stress away.   By following these simple guidelines, managing ones health becomes a discipline and easier to deal with certain ailments that come with age or due to climatic conditions. - Prathyusha

read more
Black Seed- A cure for everything!

It is not new for the human civilization! Nigella Sativa- commonly known as Black Seed is being used as folk medicine for hundreds of years. From the tomb of Tutankhamun to the pages of Old Testament, Black Seed is mentioned everywhere in the Eastern civilisation. From allergies to Asthma, people believed that Black Seed is miraculous in treating many ailments. Researchers have found three chemicals namely Thymoquinone (TQ), Thymohydroquinone (THQ) and Thymol are responsible for the medicinal affects of Black Seeds. These three chemicals let Black Seeds fight against fungus, bacteria, inflammation, oxidants and even cancerous cells. More than 600 scientific articles were published to date to throw some light on Black Seeds. Numerous researches were made on the affect of these seeds over various ailments.   Nestle has even applied for a patent to use ‘Thymoquinone’ in treating food allergies. Black Seeds are seen as a hope for the future in treating Superbugs which are on rise. Superbugs are those residues of bacteria which develop resistance for antibiotic drugs. Patients of HIV, TB who undergo long term treatment could easily generate superbugs and get succumbed to them. - A study on mice showed that extract of Black Seeds was able to reduce tumour cells by more than 50 percent. - Black Seed was known to improve the functioning of liver and thereby helping it to get rid of toxins from the body. - Indian Council of Medical Research has found Black Seed extracts to be useful in both type I and type II diabetes.   The researchers have felt that the Black Seed extract is as effective as a drug named ‘Metformin’ which is the most common drug prescribed for type II diabetic patients. - Due to the antioxidant and antimicrobial properties, Black Seeds are believed to strengthen hair fossils and restore hair growth. Being anti fungal and anti bacterial Black Seed oil can be trusted as a natural skin cream. From headache to hypertension....from cough to conjunctivitis... from obesity to arthritis... Black seeds are known to be useful in numerous health disorders. Researches were indicating that Black Seed extracts were useful in conditions such as Alzheimer’s, Autism, Parkinson’s... the treatment of which are not only complex but also expensive. As the popularity of Black Seed oil has been growing by leaps and bounds, many companies were offering it online. Have a chat with your doctor and try it! (Black Seeds are known as Kalonji in Hindi and Nalla Jeelakarra in Telugu) - Nirjara  

read more