DIABETES ఉన్న చిన్న పిల్లలకు ఎలాంటి ఆహారమివ్వాలి?

  మధుమేహానికి వయస్సుతో నిమిత్తం లేదు. పిల్లలకు కూడా వచ్చేస్తుంది. దానికి కుటుంబ నేపథ్యం ఓ కారణమైతే... ఆహారపు అలవాట్లు మరో కారణం. అంతేకాదు.. అధిక బరువు కూడా షుగర్ వ్యాధికి కారణమవుతోంది. పిల్లలకు షుగర్ వచ్చిందని తెలియగానే పెద్దల్లో ఎక్కడలేని కంగారు కనిపిస్తుంది. నిజానికి కంగారు అనవసరం. ముందు దానిపై మనం అవగాహన పెంచుకోవాలి. పిల్లలకు అందించే ఆహారం ఎంత మోతాదులో ఉండాలి, ఎప్పుడెప్పుడు వారు ఆహారం తీసుకోవాలీ... ఎంత తీసుకోవాలి.. ఈ విషయాలపై మనకు అవగాహన వస్తే చాలు. షుగర్ ని నియంత్రించడం పెద్ద పనేం కాదు. అంతేకాదు... ఆ అవగాహన పిల్లల్లో కూడా తీసుకురావాలి. అప్పుడు వాళ్లు డయాబెటీ అయినా.. చక్కగా మేనేజ్ చేయగలుగుతారు. మిగతా పిల్లలతో పోటీగా ఎదగగలుగుతారు. అసలు పిల్లల్లో మధుమేహం కనిపిస్తే... మనం ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి? మందులు ఎలా వాడాలి? ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే... ఇక్కడున్న లింక్ ని ఒక్కసారి క్లిక్ అనిపించండి.  https://www.youtube.com/watch?v=JVNNJVQrS-0

read more
ads
Online Jyotish
Tone Academy
KidsOne Telugu
ఒక్క నెలలో మీ బరువు తగ్గిపోయే చిట్కా..

    ఈ రోజుల్లో ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న సమస్య- అధిక బరువు. మనం తినే ఆహారం దగ్గర్నుంచీ చేసే పని వరకూ అన్నీ అధిక బరువుకే దారి తీస్తున్నాయని మనకి తెలుసు. తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి. ఏదో అప్పుడో చిట్కా అప్పుడో చిట్కా ప్రయత్నించి చూస్తేనే ఉంటాం కానీ... అవేవీ పని చేయడం లేదని నిరుత్సాహపడిపోతూ ఉంటాము. ఎక్కువ నీళ్లు తాగడం దగ్గర నుంచీ రాత్రి తిండి మానేయడం వరకూ ఒబెసిటీ తగ్గించుకు మనం పాటించని చిట్కా అంటూ ఉండదు. కానీ ఇప్పుడు మనం వినబోయే ఒక పద్ధతి నిజంగానే అధిక బరువుని తగ్గిస్తుందని చాలా పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. ఈ పద్ధతిలో ఉపయోగించే రెండు వస్తువులూ ఇంటింటా కనిపించేవే! అవే దాల్చిన చెక్క, తేనె. ఇప్పుడంటే దాల్చిన చెక్కని మసాలాల్లో మాత్రమే వాడుతున్నారు కానీ, దానికి ఉన్న ఉపయోగాలు అన్నీ ఇన్నీ కావు. డయాబెటిస్ దగ్గర నుంచీ డెంటల్‌ సమస్యల వరకూ దాల్చిన చెక్క వల్ల చాలా అనారోగ్యాలు దూరం అవుతాయని వైద్యులు చెబుతూ ఉంటారు. ఇక అధిక బరువు ఉన్నవారికైతే దాల్చిన చెక్క ఓ వరంలా పనిచేస్తుందట. మన ఒంట్లో కొవ్వు కణాలను కరిగించేందుకు, తిన్న ఆహారం త్వరగా జీర్ణం అయ్యేందుకు దాల్చిన చెక్క ఉపయోగపడుతుంది. అంతేకాదు! దాల్చిన చెక్క మన ఒంట్లో మెటబాలిజంను పెంచుతుంది. దాని వల్ల అప్పటివరకూ పేరుకున్న కొలెస్టరాల్‌ కూడా కరిగిపోతుంది. దాల్చిన చెక్క బాగా వేడి చేస్తుందని పెద్దలు చెప్పడానికి కారణం ఇదే! ఇక తేనె సంగతి చెప్పేదేముంది! తేనె వల్ల లివర్‌ పనితీరు మెరుగుపడి, షుగర్‌ లెవెల్స్ అదుపులో ఉంటాయి. దాని వల్ల ఇంట్లో కొవ్వు పేరుకోకుండా ఉంటుంది. అందుకనే ఒక నెల రోజుల పాటు దాల్చినచెక్క, తేనె కలిపి తీసుకుంటే... ఒబెసిటీ సమస్య దూరమైపోతుందని చెబుతున్నారు. దీని కోసం గోరువెచ్చటి నీరు ఉన్న ఒక కప్పులో చిటికెడు దాల్చిన చెక్క పొడి, ఒక స్పూన్‌ తేనె కలిపి తీసుకోవాలి. పరగడుపునే ఖాళీ కడుపు మీద ఈ టానిక్‌ తీసుకుంటే మరీ మంచిది. కానీ కొంతమందికి దాల్చిన చెక్క పొడి వల్ల కడుపులో మంట వచ్చే అవకాశం ఉంది. అలాంటివారు, రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్రపోయే ముందు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే సరిపోతుంది. అధిక బరువు వల్ల కేవలం అందం మాత్రమే దెబ్బతినదు. మన ఆత్మవిశ్వాసం కూడా తగ్గిపోతుంది. ఇక ఆ బరువుతో పాటు పలకరించే అనారోగ్య సమస్యల గురించి తెలసిందే! అందుకే ఈ చిన్న చిట్కాతో మీ బరువు తగ్గించేసుకోండి. లైఫ్‌ ని హ్యాపీగా గడిపేయండి. నిర్జర

read more
ఎడమవైపు పడుకుంటే ఎన్ని లాభాలో!

  మనం తల ఎటువైపు పెట్టి పడుకుంటే మంచిదో ఆలోచిస్తాం. కానీ ఎటువైపు తిరిగి పడుకోవాలో పట్టించుకోము. కుడివైపు అయినా, ఎడమవైపు అయినా పెద్దగా తేడా ఉండదన్నది మన నమ్మకం. నిజానికి ఎడమవైపు తిరిగి పడుకుంటే చాలా లాభాలే ఉన్నాయంటున్నారు వైద్యులు. Digestion బాగుంటుంది:- మనం తినే ఆహారాన్ని జీర్ణం చేసుకునే పాంక్రియాస్‌ ఎడమచేతి వైపే ఉంటాయి. కాబట్టి అటువైపు తిరిగి పడుకోవడం వల్ల, ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. జీర్ణం కాని ఆహారం పెద్ద పేగుల్లోకి త్వరగా చేరిపోతుంది. దాని వల్ల ఎసిడిటీ, కాన్‌స్టిపేషన్‌లాంటి సమస్యలు రావు. అందుకే ఎప్పుడన్నా భుక్తాయాసంగా ఉన్నప్పుడు, ఎడమవైపు తిరిగి కాసేపు పడుకోమని పెద్దలు చెబుతూ ఉంటారు. గర్భవతులకి మంచిది:- గర్భవతులు, ముఖ్యంగా నెలలు నిండినవారు ఎడమవైపు తిరిగి పడుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. దీని వల్ల వెన్నెముక మీద భారం తగ్గుతుంది. పైగా కడుపులోని బిడ్డకు రక్తప్రసారం కూడా మెరుగవుతుంది. కడుపులో ఉన్న బిడ్డ లివర్‌కు నొక్కుకుపోవడం వల్ల, లివర్‌ పనితీరు దెబ్బతినవచ్చు. ఎడమవైపు పడుకోవడం వల్ల ఈ సమస్య కూడా దరిచేరదు. గుండె బాగుంటుంది:- ఎడమవైపు అనగానే మనకి గుర్తుకి వచ్చే భాగం గుండెకాయే! ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల గుండె తన సహజమైన స్థితిలో పనిచేసే అవకాశం ఉంటుంది. అలా పడుకోవడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడి, అందులో ఆక్సిజన్ నిల్వలు కూడా పెరుగుతాయట. అంతేకాదు... * వెన్ను సమస్యలు ఉన్నవారిలో కుడివైపు కంటే ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్లే ఎక్కువ ఉపశమనం ఉంటుందని తేలింది. * కడుపులో ఉన్న యాసిడ్స్ గొంతులోకి రావడం వల్ల రాత్రిళ్లు గుండె మంట వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల, కడుపులో రసాయనాలు పైకి వచ్చే అవకాశమే ఉండదంటున్నారు. * మన శరీరంలోని పనికిమాలిన పదార్థాలను బయటకు పంపేందుకు లింఫ్‌ గ్రంధులు చాలా ఉపయోగపడతాయి. ఎడమవైపు తిరిగి పడుకున్నప్పుడు ఈ లింఫ్‌ గ్రంధులు మరింత ప్రభావంగా పనిచేస్తాయట. * ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొనే సమస్య గురక. మనం పడుకున్నప్పుడు, గొంతులో ఉండే కొండనాలుక వైబ్రేట్‌ అవ్వడం వల్ల గురక ఏర్పడుతుంది. అయితే ఎడమవైపు తిరిగి పడుకుంటే కొండనాలుక సరైన పొజీషన్‌లోనే ఉండి, గురక రాదని చెబుతున్నారు. చూశారుగా! ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి, నిద్రపోయేటప్పుడు కాస్త ఎడమవైపుకి తిరిగి పడుకుని చూడండి... - నిర్జర.

read more