మనం తినే ఆహారంలో ఉప్పు ఎక్కువగా వాడితే వచ్చే సమస్యలు !!
ఆహారంలో ఉప్పు ప్రాధాన్యత మనకు తెలిసిందే. అయితే, ఉప్పు సరయిన మోతాదులో వేస్తేనే కూరలు రుచిగా ఉంటాయి. ఉప్పు ఎక్కువయినా ప్రాబ్లమ్, తక్కువయినా టేస్టీ గా ఉండదు. మరి, మనం తినే ఆహారంలో ఉప్పు ఎంత వాడాలి. ఎక్కువ వాడితే వచ్చే సమస్యలు ఏంటి? ఈ వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?v=X4qx29YBtw0
read moreఉగాది పచ్చడిలో అశోక మొక్క చిగుళ్లు!
కొన్ని ఆచారాలను చెక్కుచెదరకుండా శతాబ్దాల తరబడి పాటిస్తూ ఉంటాము. మరికొన్ని ఆచారాలు మాత్రం కాలానుగుణంగా మరుగున పడిపోతుంటాయి. అశోక వృక్షపు ప్రాధాన్యత తగ్గిపోవడం వాటిలో ఒకటి. ఒకప్పుడు వసంత రుతువు వచ్చిందంటే చాలు... హోళీ పండుగ సందర్భంగా, ఉగాది సమయంలోనూ అశోక వృక్షం లేనిదే పనిజరిగేది కాదు. మన్మధుని అయిదు బాణాలలో అశోక పూలు కూడా ఒకటని చెబుతారు. అలాగే ఉగాది పచ్చడిలో అశోక వృక్షపు చిగుళ్లు కూడా వేసుకోవాలని శాస్త్రంలో కనిపిస్తుంది. అశోక వృక్షం భారత ఉపఖండంలోనే అవిర్భవించిందన్నది శాస్త్రవేత్తల మాట. అందుకే దీనిని Saraca Indica అనే శాస్త్రీయ నామంతో పిల్చుకుంటారు. భారతదేశానికి చెందిన SARACA జాతి వృక్షమని దీని అర్థం. ఇందుకు అనుగుణంగానే మన దేశ చరిత్రలో, పురాణాలలో అశోక వృక్షం పెనవేసుకుపోయి కనిపిస్తుంది. బుద్ధుడు జన్మించినది, హనుమంతుడు సీతమ్మ జాడ కనుగొన్నదీ అశోక వృక్షం దిగువునే అని చెబుతారు. అశోక వృక్షం ఏడాది పొడవునా పచ్చగా ఉంటుంది. ఎన్నో ఆరోగ్య సమస్యలను ఔషధంగా పనిచేస్తుంది. అందుకనే దానికి అశోకము అన్న పేరు వచ్చి ఉండవచ్చు. గత ఏడాది బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కు చెందిన పరిశోధకులు అశోక వృక్షంలో క్యాన్సర్ను నివారించే రసాయనాలు ఉన్నాయని కనుగొన్నారు. కానీ ఇలాంటి ఆధునిక పరిశోధనలు జరగక పూర్వమే... మన పెద్దలు అశోక వృక్షంలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని తెలుసుకొన్నారు. వాటిలో కొన్ని... * అశోక వృక్షం స్త్రీలకు గొప్ప వరం. స్త్రీలలో రుతుక్రమం, గర్భధారణకి సంబంధించి అనేక సమస్యలకి అశోక బెరడు, పువ్వులతో చేసిన మందులని సూచిస్తుంటారు. అధిక రక్తస్రావం, సంతానం కలగకపోవడం, రుతుస్రావం సమయంలో కడుపులో నొప్పి, రుతుస్రావం తరువాత కండరాల నొప్పులు... వంటి అనేక సమస్యలకు అశోక వృక్షం అధిక ఫలితాన్నిస్తుందట. గర్భవతులు ఈ మందుల జోలికి పోతే మాత్రం గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంది.. * అశోకపూలని కాస్త నీటితో కలిపి రుబ్బి.... ఓ పావు గ్లాసుని తీసుకుంటే విరేచనాలు తగ్గుముఖం పడుతాయని ప్రాచీన వైద్యం చెబుతోంది. * అశోక వృక్షం నుంచి తయారుచేసిన లేపనాలతో చర్మరోగాలు తగ్గిపోతాయనీ, చర్మం మృదువుగా మారుతుందనీ అంటారు. అశోక వృక్షపు బెరడుతో చేసిన కషాయంతో రక్తం శుద్ధి అవుతుంది కాబట్టి... ఎలాంటి మొటిమలూ, మచ్చలూ లేకుండా చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. * అశోకవృక్షపు గింజలని పొడి చేసుకుని తింటే.. కిడ్నీ, మూత్రాశయంలో ఉన్న రాళ్లు త్వరగా బయటకి వచ్చేస్తాయనీ... అవి మూత్రం ద్వారా వచ్చే సమయంలో నొప్పి కూడా తెలియదనీ చెబుతారు. * పైల్స్ నుంచి ఉపశమన్నా కలిగించే మందులు చాలా అరుదు. కానీ అశోక వృక్షపు పూలు, బెరడు నుంచి తీసిన కషాయంతో పైల్స్ నుంచి రక్తం స్రవించడం, నొప్పి తగ్గుతాయట. అంతర్గతంగా ఉండి బాధపెడుతున్న పైల్స్ కూడా అశోకంతో అదుపులోకి వస్తాయన్నది అనుభవజ్ఞుల నమ్మకం. * మధుమేహంతో బాధపడేవారు అశోక వృక్షపు పూలని ఎండపెట్టి పొడిచేసుకుని తింటే మంచిదని సూచిస్తున్నారు. * అశోక వృక్షపు బెరడుకి యాంటీఫంగల్, యాంటీబ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకని బెరడుతో చేసిన చూర్ణం లేదా కషాయం- క్షయ, కడుపులో నులిపురుగులు, మూత్రకోశ వ్యాధులు వంటి అనేక సమస్యలకి ఔషధంగా పనిచేస్తుంది. ఇన్ని ఔషధ గుణాలున్న అశోక చిగుళ్లని ఉగాది పచ్చడిలో వాడటంలో ఆశ్చర్యం లేదు కదా! అయితే రానురానూ ఈ పద్ధతిని మానుకోవడానికి ఒక కారణం కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో అశోక వృక్షం పేరుతో మనం చూస్తున్న చాలా చెట్లు నిజానికి అశోక చెట్లు కావు. వీటిని FALSE ASHOKA అని పిలుస్తారు. ఇవి అశోక వృక్షంలాగానే ఉంటాయి. కానీ సన్నగా, పొడుగ్గా, దట్టమైన ఆకులతో ఎదుగుతాయి. నిజమైన అశోకవృక్షం కాస్త విశాలంగా ఎర్రటిపూలతో కనిపిస్తే... FALSE ASHOKA ఆకుపచ్చని పూలతో ఉంటుంది. FALSE ASHOKA ఆకులు, పూలు విషప్రాయం కావచ్చు. వృక్షాల గురించి అంత అవగాహన లేని వ్యక్తులకు, అందునా... ఇప్పటి తరం వారికి ఏది నిజమైన అశోక చెట్టు, ఏది FALSE ASHOKA అని గుర్తించడం కష్టం కావచ్చు. ఇలాంటి సమస్యను నివారించేందుకే పెద్దలు క్రమేపీ ఉగాది పచ్చడి నుంచి అశోక చిగుళ్లని తొలగించి ఉంటారు. - నిర్జర.
read moreBrain Exercise ఎలా చేయాలో తెలుసా..?
ఈ మధ్య అందరికీ మతిమరుపు పెరిగి పోతుంది. మరి, మతి మెరుపు పోవాలన్నా, లేదా జ్ఞాపకశక్తి పెరగాలన్నా, బ్రెయిన్ జిం చేయాలి అంటున్నారు నిపుణులు. మరి ఈ బ్రెయిన్ జిమ్ ఆర్ ఎక్సర్సైజ్ అంటే ఏమిటి? అది ఎలా చేయాలి అని తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. http:// https://www.youtube.com/watch?v=Qumf4JGS8To
read moreకీటో డైట్ అంటే ఏమిటి? అందరికి మంచిదేనా?
మనం చాలా రకాల డైట్ ల గురించి విని ఉంటాం. కానీ, ఈ మధ్య తరచుగా వినిపిస్తున్న పేరు కేటోజెనిక్ డైట్. మరి ఈ పద్దతిని డాక్టర్లు ఆమోదించారు లేదా. డాక్టర్ జానకి శ్రీనాథ్ గారు కేటోజెనిక్ డైట్ ఇప్పుడు కాదు కొన్ని దశాబ్దాల నుండి ప్రాచుర్యంలో ఉంది అని చెబుతున్నారు. మరి, ఈ డైట్ అందరికీ మంచిదా కాదా తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?v=nJQdP9fJNoU
read moreఆమెకి సహనం ఎక్కువ..
నొప్పి అన్న మాట రాగానే ప్రసవ వేదన గుర్తుకు వస్తుంది. ఆడవారు పడే ప్రసవ వేదన ముందు ఎలాంటి నొప్పి అయినా బలాదూరే అంటారు. ఒక అధ్యయనంలో నొప్పిని భరించడంలో ఆడవారి ముందు మగవారు దిగదుడుపే అని తేలింది. సహనానికి నిలువెత్తు రూపం ఆడవాళ్లు అంటున్నారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?v=n33di5BCuiw
read moreపొటాషియంతో అదుపులో హైబీపి
పొటాషియం ఎక్కువగా ఉండే పళ్ళు, కూరగాయల రసాలు తరచూ తీసుకోవడం ద్వారా హైబీపి ని అదుపులో పెట్టొచ్చుట - ఇందుకు రక్త నాళాలు వెడల్పు అయ్యి రక్త ప్రసరణ నిరాటంకంగా, వేగంగా జరగటమే కారణం. బ్లాకు బెర్రీస్, డేట్స్, గ్రేప్స్, ఆపిల్, ఆరెంజ్, అరటిపండు, పుచ్చకాయ, బీట్స్, సోయా, బీట్ రూట్ , క్యాబేజి , కాలీఫ్లవర్ వంటి కూరలు ఎక్కువగా తీసుకోవడం వాటి రసం తాగడం మంచిది అంటున్నారు నిపుణులు - మనం ఎప్పుడు ఏం తినకూడదు అని చూస్తాం కాని ఏం తినాలి అన్న విషయంపై శ్రద్ద పెట్టం, కాని ఏం తినాలన్న విషయంపై శ్రద్ద పెట్టడం ముఖ్యం అంటున్నారు నిపుణులు. ....రమ
read moreహోళీ ఆడుతున్నారా..? ఈ జాగ్రత్తలు తప్పనిసరి...
హోళీ ఓ రంగుల పండుగ. కానీ అజాగ్రత్తగా ఉంటే, అవే రంగుల ఇతరుల జీవితాలలో చీకటిని నింపుతాయని హెచ్చరిస్తున్నారు. పిల్లవాడు తాగే పాల దగ్గర నుంచీ అంతా కలుషితం అయిపోతున్న ఈ రోజులలో, హోళీ సందర్భంగా ఎక్కడపడితే అక్కడ చవకగా దొరికే రంగుల గురించి చెప్పేదేముంది. మరి హోళీలో వాడే రంగులలో ఎలాంటి రసాయనాలు ఉంటాయో, వాటికి ఎలాంటి ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలో ఆలోచించాల్సిందే. ఆ వివరాల కోసం ఈ వీడియో లో చూడండి... https://www.youtube.com/watch?v=v47PXW86_C8
read moreహోలీ రంగుల్లో ఉండే ప్రమాదకర రసాయనాలు ఇవే...
హోళీ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేవి రంగులు. అందరూ ఒకరిమీద ఒకరు రంగులు చల్లుకుంటూ..చాలా సంతోషంతో.. ఆనందంతో ఆ పండుగను జరుపుకుంటారు. అయితే అదే సమయంలో ఈ కెమికల్ రంగుల వల్ల జరిగే నష్టాలు మాత్రం మర్చిపోతారు. మరి కెమికల్ రంగుల కాకుండా.. హోళీని అంతే సంతోషంతో ఎలా జరుపుకోవచ్చో ఆ వీడియో ద్వారా కొన్ని టిప్స్ ఇచ్చారు నిపుణులు. ఈ వీడియో చూసి అవేంటో తెలుసుకోండి...
read moreచిన్న మార్పులతో బరువు పెరగకుండా చూసుకోవచ్చు...
సన్నబడాలి కానీ.. కష్టపడకూడదు బద్దకం వేసి కాదు..టైం లేక ఇప్పుడు ఇదే చాలా మందికి ఉన్న సమస్య. బరువు పెరుగుతున్నామని తెలిసినా .. తగ్గడానికి సమయం వెచ్చించలేని పరిస్థితి. అలాంటి వారి కోసం చాలా సులభంగా బరువు తగ్గే మార్గాలు.. తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. https://www.youtube.com/watch?v=o8gbceaFGww
read more


.jpg)





.jpg)
.jpg)
.jpg)


.jpg)





.jpg)
.jpg)
.jpg)
.jpg)