DIABETES ఉన్న చిన్న పిల్లలకు ఎలాంటి ఆహారమివ్వాలి?
మధుమేహానికి వయస్సుతో నిమిత్తం లేదు. పిల్లలకు కూడా వచ్చేస్తుంది. దానికి కుటుంబ నేపథ్యం ఓ కారణమైతే... ఆహారపు అలవాట్లు మరో కారణం. అంతేకాదు.. అధిక బరువు కూడా షుగర్ వ్యాధికి కారణమవుతోంది. పిల్లలకు షుగర్ వచ్చిందని తెలియగానే పెద్దల్లో ఎక్కడలేని కంగారు కనిపిస్తుంది. నిజానికి కంగారు అనవసరం. ముందు దానిపై మనం అవగాహన పెంచుకోవాలి. పిల్లలకు అందించే ఆహారం ఎంత మోతాదులో ఉండాలి, ఎప్పుడెప్పుడు వారు ఆహారం తీసుకోవాలీ... ఎంత తీసుకోవాలి.. ఈ విషయాలపై మనకు అవగాహన వస్తే చాలు. షుగర్ ని నియంత్రించడం పెద్ద పనేం కాదు. అంతేకాదు... ఆ అవగాహన పిల్లల్లో కూడా తీసుకురావాలి. అప్పుడు వాళ్లు డయాబెటీ అయినా.. చక్కగా మేనేజ్ చేయగలుగుతారు. మిగతా పిల్లలతో పోటీగా ఎదగగలుగుతారు. అసలు పిల్లల్లో మధుమేహం కనిపిస్తే... మనం ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి? మందులు ఎలా వాడాలి? ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే... ఇక్కడున్న లింక్ ని ఒక్కసారి క్లిక్ అనిపించండి. https://www.youtube.com/watch?v=JVNNJVQrS-0
read moreమిక్స్డ్ డైట్..
సాంప్రదాయకమయిన ఆహరం లేదా మిక్స్డ్ డైట్ గురించి మీరెప్పుడయినా విన్నారా? మన పూర్వీకుల నుండి వస్తున్న ఆహారపు అలవాట్లనే సాంప్రదాయకమయిన ఆహరం అంటారు. 4 లేదా 5 ఫుడ్ గ్రూప్స్ కలిపి ఆహారంగా తీసుకోవడాన్ని మిక్స్డ్ డైట్ అంటారు. ఒకవేళ మిక్స్డ్ డైట్ ప్లేస్ లో వేరే ఆహరం తీసుకుంటే అది కొవ్వుగా మారుతుంది. సో, మిక్స్డ్ డైట్ తీసుకునేప్పుడు కొత్త ఆహారపు అలవాట్లు చేసుకోకూడదు. మిక్స్డ్ డైట్ గురించి మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?v=qy26kCg1c_A
read moreకొలెస్ట్రాల్ స్థాయిలను ఎలా నియంత్రించాలి..?
దాదాపు చాలా జబ్బుల గురించి మాట్లాడేటప్పుడు కొలెస్ట్రాల్ కూడా ఖచ్చితంగా ప్రస్తావన లోకి వస్తుంది. అయితే, ఈ కొలెస్ట్రాల్ గురించి చాలా పెద్ద అపనమ్మకం ఉంది. వాస్తవానికి, కొలెస్ట్రాల్ కేవలం ఆనిమల్ ఫుడ్ లోనే ఉండదు. ఆయిల్స్ విషయానికి వస్తే కూడా ఒక కల్పితం ఉంది. సన్ ఫ్లవర్ ఆయిల్ లో కొలెస్ట్రాల్ ఉండదు అని, పల్లి నూనెలో అయితే అధికంగా ఉంటుంది అని. మరి కొలెస్ట్రాల్ గురించి మరింత అవగాహన కోసం ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?v=br7yEA8FF50
read moreసమతౌల్య ఆహరం లేకపోవడం వల్ల కలిగే ఇబ్బందులు ఏమిటి?
ఈ రోజుల్లో ఎక్కువగా బయట ఆహరం తీసుకోవడం వల్ల మనం ప్రధానంగా ఆకుకూరలు తినడం తగ్గించేశాం. పప్పులో వేశామా లేక పచ్చడి చేసుకున్నామా, ఎలాగయినా సరే రోజూ రెండు కట్టలు తినడం ఆరోగ్యానికి నిజంగా శ్రేయస్కరం. ఇలాగ రోజుకి రెండు ఆకు కట్టలు ఎదో రకంగా తినడం వల్ల మనం తర్వాత అసలు క్యాల్షియం మాత్రలు వేసుకునే అవసరం ఉండదు. కాబట్టి మన రోజువారీ ఆహారంలో ఆకు కూరలు ఖచ్చితంగా ఉండేట్టు చూడండి. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?v=lG8myPLKfV8
read moreటమాటాలు తింటే కేన్సర్ మాయం!
అదే పనిగా టమాటాలు తింటే కిడ్నీ లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉందని చెబుతుంటారు. అలాగని టమాటల్ని పూర్తిగా పక్కకి పెట్టేస్తే వాటి రుచికి దూరం కాక తప్పదు. పైగా దీనివల్ల సంవృద్ధిగా ఉండే విటమిన్ A మరియు C లకి శరీరం దూరం అయిపోతుంది. అయితే, టమాటాలు తింటే క్యాన్సర్ నుండి విముక్తి పొందొచ్చు అనే విషయం తెలుసా. తెలుసుకోవాలంటే మాత్రం ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?v=-PdjY9auJHw
read moreరక్తంలో ప్లేట్ లెట్స్ ని అభివృద్ధి చేసే 9 ఉత్తమ ఆహారాలు..!
రక్తంలో ప్లేట్లెట్స్ సంఖ్య ఉండాల్సిన దానికంటే తక్కువ ఉండటం అనారోగ్యానికి దారితీస్తుంది. మనం తినే ఆహారం పైనే ప్లేట్లెట్స్ సంఖ్య ఆధారపడి ఉంటుంది. ఏం తింటే ప్లేట్లెట్స్ కౌంట్ పెరుగుతుందో తెలుసుకోండి. https://www.youtube.com/watch?v=-Nh-KEnJlK0
read moreరోజుకి 500 కేలరీలు వదిలించుకుంటే వారానికి అరకేజీ తగ్గచ్చు...
మన శరీరం యొక్క బరువు విషయంలో కేర్ తీసుకోవడం అంటే వివిధ జబ్బుల నుండి మనల్ని మనం రక్షించుకోవడమే. మీరు రోజుకి ఎన్ని క్యాలరీల ఆహరం తీసుకోవాలి అనేది చాలా విషయాల పైన ఆధారపడి ఉంటుంది. ఒక రోజుకి మనం రెగ్యులర్ గా తీసుకునే దాని కన్నా 500 ల క్యాలరీల ఆహారం తక్కువగా తీసుకుంటే ఒక వారంలో అరకేజీ పైన బరువు తగ్గే అవకాశం ఉంది. డాక్టర్ జానకి శ్రీనాథ్ గారి మరిన్ని సలహాలు సూచనల కోసం ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?v=a_TZdYl2n-k
read moreఒక్క నెలలో మీ బరువు తగ్గిపోయే చిట్కా..
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న సమస్య- అధిక బరువు. మనం తినే ఆహారం దగ్గర్నుంచీ చేసే పని వరకూ అన్నీ అధిక బరువుకే దారి తీస్తున్నాయని మనకి తెలుసు. తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి. ఏదో అప్పుడో చిట్కా అప్పుడో చిట్కా ప్రయత్నించి చూస్తేనే ఉంటాం కానీ... అవేవీ పని చేయడం లేదని నిరుత్సాహపడిపోతూ ఉంటాము. ఎక్కువ నీళ్లు తాగడం దగ్గర నుంచీ రాత్రి తిండి మానేయడం వరకూ ఒబెసిటీ తగ్గించుకు మనం పాటించని చిట్కా అంటూ ఉండదు. కానీ ఇప్పుడు మనం వినబోయే ఒక పద్ధతి నిజంగానే అధిక బరువుని తగ్గిస్తుందని చాలా పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. ఈ పద్ధతిలో ఉపయోగించే రెండు వస్తువులూ ఇంటింటా కనిపించేవే! అవే దాల్చిన చెక్క, తేనె. ఇప్పుడంటే దాల్చిన చెక్కని మసాలాల్లో మాత్రమే వాడుతున్నారు కానీ, దానికి ఉన్న ఉపయోగాలు అన్నీ ఇన్నీ కావు. డయాబెటిస్ దగ్గర నుంచీ డెంటల్ సమస్యల వరకూ దాల్చిన చెక్క వల్ల చాలా అనారోగ్యాలు దూరం అవుతాయని వైద్యులు చెబుతూ ఉంటారు. ఇక అధిక బరువు ఉన్నవారికైతే దాల్చిన చెక్క ఓ వరంలా పనిచేస్తుందట. మన ఒంట్లో కొవ్వు కణాలను కరిగించేందుకు, తిన్న ఆహారం త్వరగా జీర్ణం అయ్యేందుకు దాల్చిన చెక్క ఉపయోగపడుతుంది. అంతేకాదు! దాల్చిన చెక్క మన ఒంట్లో మెటబాలిజంను పెంచుతుంది. దాని వల్ల అప్పటివరకూ పేరుకున్న కొలెస్టరాల్ కూడా కరిగిపోతుంది. దాల్చిన చెక్క బాగా వేడి చేస్తుందని పెద్దలు చెప్పడానికి కారణం ఇదే! ఇక తేనె సంగతి చెప్పేదేముంది! తేనె వల్ల లివర్ పనితీరు మెరుగుపడి, షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. దాని వల్ల ఇంట్లో కొవ్వు పేరుకోకుండా ఉంటుంది. అందుకనే ఒక నెల రోజుల పాటు దాల్చినచెక్క, తేనె కలిపి తీసుకుంటే... ఒబెసిటీ సమస్య దూరమైపోతుందని చెబుతున్నారు. దీని కోసం గోరువెచ్చటి నీరు ఉన్న ఒక కప్పులో చిటికెడు దాల్చిన చెక్క పొడి, ఒక స్పూన్ తేనె కలిపి తీసుకోవాలి. పరగడుపునే ఖాళీ కడుపు మీద ఈ టానిక్ తీసుకుంటే మరీ మంచిది. కానీ కొంతమందికి దాల్చిన చెక్క పొడి వల్ల కడుపులో మంట వచ్చే అవకాశం ఉంది. అలాంటివారు, రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్రపోయే ముందు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే సరిపోతుంది. అధిక బరువు వల్ల కేవలం అందం మాత్రమే దెబ్బతినదు. మన ఆత్మవిశ్వాసం కూడా తగ్గిపోతుంది. ఇక ఆ బరువుతో పాటు పలకరించే అనారోగ్య సమస్యల గురించి తెలసిందే! అందుకే ఈ చిన్న చిట్కాతో మీ బరువు తగ్గించేసుకోండి. లైఫ్ ని హ్యాపీగా గడిపేయండి. నిర్జర
read moreఎడమవైపు పడుకుంటే ఎన్ని లాభాలో!
మనం తల ఎటువైపు పెట్టి పడుకుంటే మంచిదో ఆలోచిస్తాం. కానీ ఎటువైపు తిరిగి పడుకోవాలో పట్టించుకోము. కుడివైపు అయినా, ఎడమవైపు అయినా పెద్దగా తేడా ఉండదన్నది మన నమ్మకం. నిజానికి ఎడమవైపు తిరిగి పడుకుంటే చాలా లాభాలే ఉన్నాయంటున్నారు వైద్యులు. Digestion బాగుంటుంది:- మనం తినే ఆహారాన్ని జీర్ణం చేసుకునే పాంక్రియాస్ ఎడమచేతి వైపే ఉంటాయి. కాబట్టి అటువైపు తిరిగి పడుకోవడం వల్ల, ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. జీర్ణం కాని ఆహారం పెద్ద పేగుల్లోకి త్వరగా చేరిపోతుంది. దాని వల్ల ఎసిడిటీ, కాన్‌స్టిపేషన్‌లాంటి సమస్యలు రావు. అందుకే ఎప్పుడన్నా భుక్తాయాసంగా ఉన్నప్పుడు, ఎడమవైపు తిరిగి కాసేపు పడుకోమని పెద్దలు చెబుతూ ఉంటారు. గర్భవతులకి మంచిది:- గర్భవతులు, ముఖ్యంగా నెలలు నిండినవారు ఎడమవైపు తిరిగి పడుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. దీని వల్ల వెన్నెముక మీద భారం తగ్గుతుంది. పైగా కడుపులోని బిడ్డకు రక్తప్రసారం కూడా మెరుగవుతుంది. కడుపులో ఉన్న బిడ్డ లివర్‌కు నొక్కుకుపోవడం వల్ల, లివర్ పనితీరు దెబ్బతినవచ్చు. ఎడమవైపు పడుకోవడం వల్ల ఈ సమస్య కూడా దరిచేరదు. గుండె బాగుంటుంది:- ఎడమవైపు అనగానే మనకి గుర్తుకి వచ్చే భాగం గుండెకాయే! ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల గుండె తన సహజమైన స్థితిలో పనిచేసే అవకాశం ఉంటుంది. అలా పడుకోవడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడి, అందులో ఆక్సిజన్ నిల్వలు కూడా పెరుగుతాయట. అంతేకాదు... * వెన్ను సమస్యలు ఉన్నవారిలో కుడివైపు కంటే ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్లే ఎక్కువ ఉపశమనం ఉంటుందని తేలింది. * కడుపులో ఉన్న యాసిడ్స్ గొంతులోకి రావడం వల్ల రాత్రిళ్లు గుండె మంట వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల, కడుపులో రసాయనాలు పైకి వచ్చే అవకాశమే ఉండదంటున్నారు. * మన శరీరంలోని పనికిమాలిన పదార్థాలను బయటకు పంపేందుకు లింఫ్ గ్రంధులు చాలా ఉపయోగపడతాయి. ఎడమవైపు తిరిగి పడుకున్నప్పుడు ఈ లింఫ్ గ్రంధులు మరింత ప్రభావంగా పనిచేస్తాయట. * ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొనే సమస్య గురక. మనం పడుకున్నప్పుడు, గొంతులో ఉండే కొండనాలుక వైబ్రేట్ అవ్వడం వల్ల గురక ఏర్పడుతుంది. అయితే ఎడమవైపు తిరిగి పడుకుంటే కొండనాలుక సరైన పొజీషన్‌లోనే ఉండి, గురక రాదని చెబుతున్నారు. చూశారుగా! ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి, నిద్రపోయేటప్పుడు కాస్త ఎడమవైపుకి తిరిగి పడుకుని చూడండి... - నిర్జర.
read moreSummer Superfood Cucumber's Health Benefits
Helps in hair growth: Cucumber contains silicon and sulfur, these two are very beneficial to our healthier hair. For best results when cucumber is used to the hair, you can create a combination of the cucumber juice with carrots, lettuce and spinach. Rather than using expensive health care products, this really is another best alternative to take care of hair the natural way. Protects Your Brain: Cucumbers contain an anti-inflammatory flavonol called fisetin that appears to play an important role in brain health. In addition to improving your memory and protecting your nerve cells from age-related decline, fisetin has been found to prevent progressive memory and learning impairments in mice with Alzheimer's disease. Helps You from Dehydration: Due to the high water content inside cucumber, it supplies the water needed by the body when u consume the fruit. So, it helps you from dehydrating. Always keep some cucumbers during travelling. Even if you finish water you will have cucumber to hydrate yourself up. Helps You Manage Your Stress Levels: Cucumbers contains B vitamins which are known to help ease feelings of anxiety and buffer some of the damaging effects of stress. There are multiple B vitamins, including vitamin B1, vitamin B5, and vitamin B7. Lts a Skin Lightening Agent: Cucumber is used in a number of skin lightening creams, soaps, and lotions. This is done as cucumber helps lighten the sun burnt skin effectively. For a home made pack, use the juice of cucumber on the affected area everyday for 30minutes for best possible results. Helps You In Weight Loss: One cup of sliced cucumber contains just 16 calories. Though cucumbers are very low in calories, yet they make a filling snack. The soluble fiber in cucumbers dissolves into a gel-like texture in your gut, helping to slow down your digestion. This helps you to feel full longer and is one reason why fiber-rich foods may help with weight control. ...Divya
read more


.jpg)






.jpg)
.jpg)





.jpg)
.jpg)



