కూర్చునే ఉంటే ముసలివారైపోతారు     కొంతమందిని చూడండి. ఎంత పెద్దవారైనా కూడా వయసు మీద పడినట్లే అనిపించదు. మరికొందరేమో కుర్రతనంలోనే నడివయసు మీదపడినట్లు కనిపిస్తారు. అలాంటి స్థితికి ఒకానొక కారణం తెలిసిపోయిందంటున్నారు పరిశోధకులు. అమెరికాకు చెందిన కొందరు వైద్యులు నిరంతరం కూర్చుని ఉండే జీవనశైలికీ, ముసలితనానికీ మధ్య ఏమన్నా సంబంధం ఉందేమో అని పరిశీలించారు. ఇందుకోసం వారు 64 నుంచి 95 ఏళ్ల వయసు మధ్య ఉన్న ఓ 1500 మంది స్త్రీలను ఎన్నుకొన్నారు. వీరందరి జీవనశైలికి సంబంధించి అనేక వివరాలను సేకరించారు. వీరు రోజులో ఎంతసేపు కూర్చుని ఉంటారు, ఎలాంటి వ్యాయామం చేస్తారు వంటి గణాంకాలను నమోదు చేశారు. అంతేకాకుండా వీరి శరీర కదలికలను గమనించేందుకు నడుముకి accelerometer అనే పరికరాన్ని జోడించారు. రోజుకి నలభై నిమిషాలన్నా శరీర శ్రమ లేకుండా కనీసం పదేసి గంటలపాటు కూర్చునే ఆడవారి డీఎన్‌ఏలో ఓ వింతమార్పుని గమనించారు పరిశోధకులు. వీరి డీఎన్‌ఏలోని telomeres అనే వ్యవస్థ త్వరగా దెబ్బతింటున్నట్లు తేలింది. ఈ telomeres మన డీఎన్‌ఏ చివరన ఓ తొడుగులా ఉండి అవి త్వరగా నిర్వీర్యం అయిపోకుండా కాపాడతాయి. మనలోని వయసు పెరిగే కొద్దీ telomeres అరిగిపోతాయి. దాంతోపాటుగానే శరీరంలో కణాలకి రక్షణ కరువై అనేక సమస్యలు మొదలవుతాయి. వయసు మీరే కొద్దీ సహజంగా రావాల్సిన ఈ మార్పు మన బద్ధకం వల్ల త్వరగా వచ్చేస్తుందంటున్నారు. దీని వల్ల శరీరం పైకి చూడ్డానికి ఎలా ఉన్నా, అంతర్గతంగా దాదాపు ఎనిమిదేళ్లు ఎక్కువ ఆయుష్షుకి చేరుకుంటుందట. ఫలితంగా డయాబెటిస్, గుండెజబ్బులు, కేన్సర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులు దాడిచేసే ప్రమాదం ఉందంటున్నారు. పొగతాగే అలవాటు ఉన్నవారిలో కూడా ఇలా telomeres త్వరగా అరిగిపోవడాన్ని గమనించారు. అదీ విషయం! మన నిస్తేజం వల్ల శరీరం లోలోపల ఇంత అనర్థం జరుగుతుందన్నమాట. అందుకని బద్ధకాన్ని వీడి రోజుకి కనీసం ఓ అరగంటన్నా వ్యాయామం చేయమని సూచిస్తున్నారు. అప్పుడు ఆరోగ్యమేం కర్మ వయసు కూడా పదహారేళ్ల దగ్గరే ఆగిపోతుంది.   - నిర్జర.

Best Foods For Flat Stomach The secret for a flat stomach is eating supportively . In addition to regular exercise, you have to add some fat burning foods to your diet to help trim your waistline. Foods that are high in protein and fiber are the best kinds of food to eat if you want to burn fat around your middle. Almonds Almonds contain protein, fiber, and vitamin E, a powerful antioxidant. They’re also a good source of magnesium which is a mineral your body must have in order to produce energy, build and maintain muscle tissue, and regulate blood sugar. Eggs Eat at least one egg day, Eggs are the perfect protein source and if you have an egg in the morning you will feel less hungry throughout the day. Soy Soybeans are a great source of antioxidants, fiber, and protein. Liquid soy also makes a good meal replacement. Try a soy protein shake to lose more weight. Apples A large apple contains 5 grams of fiber, but it’s also nearly 85 percent water which helps you feel full. Apples also contain quercetin, a compound shown to help fight certain cancers, reduce cholesterol damage, and promote healthy lungs. Berries Berries are full of fiber which helps with calorie absorption and are also high in antioxidants which can help blood flow in turn making muscles contract more efficiently. Leafy Greens Leafy greens are also a good source of calcium, an essential ingredient for muscle contraction. In other words, they help fuel your workouts. Yogurt The probiotic bacteria in most yogurts helps keep your digestive system healthy, which means a lower incidence of bloating and constipation which is good for your stomach. Walnuts loaded with heart-healthy omega-3s, and anti-inflammatory polyphenols and muscle-building protein, walnuts are one of the healthiest snacks you can eat. They also help curb your appetite if you eat a handful about a half hour before a meal. Salmon Seafood, especially fatty fish like salmon, tuna, and mackerel, is an excellent source of omega-3 fatty acids. These uber-healthy fats may help promote fat burning by making your metabolism. Seafood is an excellent source of abs-friendly protein. Oats Oats are packed with soluble fiber and protein, oats help lower the risk of heart disease and feed your muscles with energy. There’s a reason for the sayings “sow your oats” and “feel your oats.” Oats rock.

Healthy Foods for Strong Teeth Brushing your teeth twice a day, flossing them daily and having regular check-ups with a dentist can help keep your teeth healthy. Having proper diet can help prevent tooth decay, so a healthy diet is important for your teeth. A healthy diet contains foods from different groups, including fruit and vegetables, starchy foods, some protein-rich food and some dairy foods. Find out more about a balanced diet. Milk Low-fat and fat-free milk has lots of calcium with little or no fat. In addition to calcium, milk and dairy products provide other essential nutrients that are important for strong teeth. Cheese Eating cheese results in a coating of calcium on the teeth that helps protect against caries. Eating a cube of cheese can increase plaque-calcium concentration by up to 112%, helping to harden teeth and discourage softening which leads to caries. It appears that cheese also prevents demineralization and, at the same time, encourages remineralization of the tooth. Food that needs chewing This will not only exercise your gums but is also important for proper cleansing of teeth. Whole grains, and other food products with high roughage content fall in this category. Kiwi is a great source of vitamin C. This fruit holds 100% of the daily recommended dose of vitamin C. Vitamin C helps to prevent your gums from breaking down. Strawberries  strawberries has many benefits for human health, including reducing the accumulation of dental plaque. In general, strawberries contain nutrients such as protein, fat, carbohydrate, and energy. While the potential of minerals it contains are calcium, phosphorus, iron, magnesium, potassium, selenium, vitamin C and folic acid. Sesame Seeds  Sesame seeds are rich calcium food. Which gives enough support to your teeth to be stronger. Carrots Carrots act as natural abrasives, It helps to eliminate the sticky dirt from the teeth and stimulate gums. They also produce a lot of saliva which helps to wash away stains on your teeth. Minerals in carrots help to kill germs in the mouth and prevent tooth damage. Water Fluoride exists naturally in water sources and is derived from fluorine,It is well known that fluoride helps to prevent and even reverse the early stages of tooth decay. Nuts Nuts are rich in calcium, magnesium and phosphate, which are important nutrients for dental health. Nuts good for teeth are cashews, peanuts, almonds and walnuts.

Benefits of  Pawan Muktasan For those who are already into Yoga will be well versed with the Pawan Muktasan . For the uninitiated this position involves the thighs which are pressed against the abdomen and the wrists or elbows are clasped. The neck is bent towards the knees and if possible the forehead or chin is touching the knees. The breath is relaxed. Try to hold for as long as you can. This pose is known to relieve constipation and release any gasses in the intestines and keep the stomach clear. Apart from this Pawan Muktasan has numerous benefits for women which include: 1.  Improves the blood circulation and stimulation of nerves. 2.  Strengthens the lower back muscles and loosens the spinal vertebrae. 3.  Improves Sterility and reduces impotence. 4.  Massages the pelvic muscles and reproductive organs. 5.  Beneficial for menstrual disorders and regulates blood flow. 6.  Reduces fats in the abdominal area, thighs and buttocks. This posture can be practiced anywhere on the floor or also when you just get up from bed. Holding it for at least 1 minute will be highly effective and in the long term you can see visible reduction in belly fat also. NOTE: Must be avoided if there is recent abdominal surgery, suffering from hernia or piles, by pregnant women and any chronic pain in the neck.

  Why Women Gain Weight After Marriage!     All of you have come across people who looked svelte when single and suddenly gain those extra pounds once they are happily married. Ever wondered why is this is such a common phenomenon? While there might be reasons varying from person to person. There are some predominantly similar ones too. After following a group of newlyweds for four years, the researchers recently found that the happier you are in your marriage, the more likely it is that you will gain some extra weight. In other words, people who are dating are more likely to stay slender to keep the attention of their partner. Couples who are happy, satisfied and secure in their marriage are more likely to gain weight because they no longer feel any pressure to attract the partner and are quite assured of their lives with each other. Another reason could be that like they say love comes in through the stomach. Many women, when they get married, start baking and making all sorts of delicious meals, sweet treats and other fattening foods that are really tasty, but pile up fat around the waist. Many people don’t even realize how much weight have they gained until they step on the scale. Until then, they enjoy the taste of amazing meals cooked and served by their beloved partner. Married couples eat most of their meals together, so they're more likely to eat foods that they wouldn't normally eat because their spouse has a craving for them. In fact, partner influence over eating decisions is a large factor in weight gain after marriage. Two additional factors that might come into play are the tendency to eat out together more often and to cook bigger meals when eating at home. Increased time spent watching television together is another factor in post-marital weight gain. Also, in general, post-wedding weight gain is not surprising and is perhaps a result of more relaxed dietary and physical activity habits now that the newlyweds no longer have a special event - and wedding photographs - for which to motivate themselves. The rewards for weight maintenance attention, compliments, gifts often peter out or stop when they marry. And they get older, which makes weight management harder. Gaining weight in marriage can create numerous problems. First, it leads to the loss of confidence of the person who no longer looks as good as he/she used to. Besides that, it is bound to lead to frustration, worse sex life, and many other complications. Married couples should consider their weight a factor in their overall health and well-being instead of just their appearance. Just as married couples can influence each other to eat poorly, they can also influence each other to make healthy choices. Work together to create nutritious menus, shop for healthy foods together and make meal preparation a joint effort because these can help you stay slim, as well as bond over a shared goal. And also work out as couple to stay healthy and keep the spark alive in your marriage.   ..Divya

తొందరగా బరువు తగ్గాలంటే...   బరువు తగ్గాలనుకొనే వారు కడుపు మాడ్చుకోవలసిన అవసరం లేదు.కడుపు మాడ్చుకొని ఉపవాసలు చేయాల్సిన పనిలేదు. చిన్న చిన్న నీటి బిందువులే మహా సముద్రం అయినట్లు మనం తీసుకునే కొద్దిపాటి జాగ్రత్తలే ఆరోగ్యాన్ని కాపాడతాయి. సాయంత్రం పిజ్జా, బర్గర్ లు లాగించేసి రాత్రి కేవలం పెరుగన్నం తినేస్తే సరిపోతుంది అన్నది పొరపాటు. పిజ్జా బర్గర్ లతో పాటు పెరుగులో ఉండే వెన్న కూడా శరీరంలోకి చేరి కొవ్వును మరింత పెంచేస్తుంది. డైట్ కంట్రోల్ లో వున్నవారు మీగడను తీసేసిన పాలు, మజ్జిగను మాత్రమే వాడాలి. ఈ ప్రాథమిక సూత్రాన్ని పాటించకపోతే ఎన్ని జాగ్రత్తలు పాటించినా వ్యర్థమే.   నీరు ప్రధానం : నీరు ఎక్కువ తాగడం వలన ఆకలి త్వరగా వేయదు. నీరు ఎక్కువగా తాగడం వల్ల ఎక్కువ తినాలన్న కోరిక కలగదు. తక్కువ పరిమాణంలో ఆహారం తీసుకొంటారు. నాన్ స్టిక్ పాత్రలలో వంట చేయడం వల్ల నూనె తక్కువ పట్టడంతో పాటు పదార్థాలలో పోషకవిలువలు పోకుండా ఉంటాయి. అప్పడాలను వేయించుకునే బదులు కాల్చుకొని తింటే వాటిని తినాలన్న కోరిక తీరుతుంది. నూనెనుండి తప్పించుకున్నట్లు ఉంటుంది.   స్టాట్యుటరీ ఫాట్ ను తగ్గించాలి: నూనె, నెయ్యిలలో స్టాట్యూటరీ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. వంటకాలలో వీటిని సాధ్యమైనంత తక్కువ ఉపయోగిస్తూనే మరికొన్నింటిలో పూర్తిగా మానేయొచ్చు. చపాతీలలోనూనె కన్నా పుల్కాలు ఆరోగ్యకరం. దోశ, వడ కన్నా ఆవిరి మీద తయారు చేసిన ఇడ్లీమేలు. రోజూవారీ భోజనంలో ఉపయోగించే నెయ్యిని కూడా పూర్తిగా నిషేధించాల్సిందే.   మాంసాహారం: మాంసాహారం తప్ప మరేమి తినని వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారి కోసం ఈ చిట్కా. మాంసాహారం వండేటప్పుడు చర్మం తీసేసి వండాలి. దీని వలన వందక్యాలరీలు తగ్గిపోతాయి. దీని తయారీలో నూనెకు బదులు నీటిని వాడితే కొవ్వు చేరకుండా జాగ్రత్తపడవచ్చు. చేపలలో తక్కువ పరిమాణంలో కొవ్వు ఉంటుంది. చికెన్, మటన్ కి బదులుగా చేపలు తినడం అలవాటు చేసుకుంటే మంచిది.   కాల్షియం చాలా అవసరం: బరువు తగ్గడంలో కాల్షియం ముఖ్యం పాత్ర వహిస్తుంది అని మనకు తెలిసిన మనం దానిని పట్టించుకోకుండా ఉంటాము కాని ఆహారంలో కాల్షియం తప్పనిసరిగా వుండేటట్లు చూసుకోవాలి. కొవ్వు తక్కువగా ఉన్న పెరుగు, పనీర్ చాలా బాగా పనిచేస్తాయి. పాలలో వుండే మీగడలో క్యాలరీలు అధికంగా వుంటాయి. పాలను నేరుగా తీసుకోవడం కన్నీ మజ్జిగ రూపంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.  

చిరుధాన్యాలు వాడకంలో మీరు చేస్తున్న పొరపాటేంటో తెలుసా..?   Multigrain Atta is considered good for health & specially weight loss. But this multigrain atta is not safe for everyone – Dr. Srilatha explains...  https://www.youtube.com/watch?v=CarYS5L4nNc  

బరువు తగ్గాలంటే పాటించాల్సిన ఆరు సూత్రాలు     నమిలి తినాలి:- వినటానికి ఆశ్చర్యంగా ఉంటుంది కానీ మనలో చాలామంది ఆహారాన్ని నమిలి తినరు. గబగబ తినేస్తారు. దీని వల్ల ఆహారంలో ఉండే కొన్ని రకాల పీచు పదార్థాలు జీర్ణం కావు. అందువల్లే ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినమని నిపుణులు సూచిస్తూ ఉంటారు. నెమ్మదిగా నమిలినప్పుడు నోటిలో లాలాజలం ఊరుతుంది. దీనిలో ఉండే ఎంజైమ్‌లు ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తాయి.   ఎక్కువ అల్పాహారం:- గబగబ ఆఫీసులకు, కాలేజీలకు బయలుదేరేవారికి కష్టం కానీ.... ఉదయం పూట ఎక్కువ తింటే ఎటువంటి జబ్బులు దగ్గరకు రావంటున్నారు నిపుణులు. దీనికి ఒక కారణముంది. రోజంతా పనిచేయాలంటే మన శరీరానికి పోషక పదార్థాలు అవసరం. లేకపోతే అవసరమైన శక్తి అందదు. అందువల్ల పొద్దుటిపూట వీలైనంత ఎక్కువ తిని.. మధ్యాహ్నం భోజనం తక్కువగా తినమని నిపుణులు సూచిస్తున్నారు.   రాత్రి కొద్దిగానే:- కొంత మంది రాత్రి చాలా ఎక్కువగా తింటారు. దీని వల్ల మన జీర్ణ వ్యవస్థ ఇబ్బంది పడుతుందని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో మిగిలిన అవయవాల మాదిరిగానే మన జీర్ణ వ్యవస్థకు కూడా విశ్రాంతి ఉండాలి. రాత్రి ఎక్కువగా తినటం వల్ల జీర్ణవ్యవస్థకు తక్కువ విశ్రాంతి దొరుకుతుంది. దాని ప్రభావం మర్నాడు ఉదయం శరీరంపై పడుతుంది. రాత్రి ఎక్కువ తినేవారు సాధారణంగా ఉదయం తక్కువగా తింటారు. దీని వల్ల పగలంతా శరీరానికి అవసరమైన పోషక పదార్థాలు లభించవు.   గ్లౌసిమిక్ ఇండెక్స్ కూడా ప్రధానమే:- మనం తినే ఆహారపదార్థాలలో కొన్ని త్వరగా.. కొన్ని ఆలస్యంగా శక్తిని విడుదల చేస్తాయి. ఆలస్యంగా శక్తిని విడుదల చేసే ఆహారపదార్థాల వల్ల మన శరీరంలో చక్కెర నిల్వలు అదుపులో ఉంటాయి. ఆహారపదార్థాలు శక్తిని విడుదల చేసే స్థాయిని నిర్ధారించే టేబుల్‌ను గ్లౌసిమిక్ ఇండెక్స్ అంటారు. ఉదాహరణకు బ్రౌన్ రైస్, గోధుమలు గ్లౌసమిక్ ఇండెక్స్ ప్రకారం నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తాయి. మైదా త్వరగా విడుదల చేస్తుంది. అందువల్ల బ్రౌన్ రైస్, గోధుమతో చేసిన పదార్థాలను తినటం వల్ల శరీరంలోని శక్తి సమతౌల్యంలో సమస్యలు ఏర్పడవు.   సరైన వంట:- మనం తినే పదార్థాలతో పాటు వాటిని వండే పద్ధతి కూడా ముఖ్యమే. ఉడకపెట్టిన పదార్థాలలో తక్కువ కేలరీలు ఉంటాయి. వేయించిన పదార్థాలలో ఎక్కువ కేలరీలు ఉంటాయి. అందువల్ల వేయించటం తప్పనిసరైనప్పుడు ముందు ఆ పదార్థాన్ని ఉడకపెట్టాలి. ఆ తర్వాతే వేయించాలి.   ఎక్కువ నీళ్లు:- ప్రతి రోజు వీలైనన్ని ఎక్కువ నీళ్లు తాగాలి. నీరు మన ఆకలిని నియంత్రించటమే కాకుండా శరీరపు ఉష్ణోగ్రతలను నియంత్రణలో ఉంచుతుంది. శరీరంలో మలినాలను బయటకు పంపటంలో కూడా నీరు చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది.  

  Rules in Friendship??   (Friendship Day Special)   From last two days, both print and electronic media are bombarding with ads on celebrating “Friendship Day”; creative ways of celebrating this occasion like buying lunch/ dinner, gifts and clothing etc. But is this what is called celebrating friendship? I don't think so; rather, friendship day is one special day comes once in a year to pause for a while in this busy schedules and give a thought on what friendship and friends are all about. Every one will have so many friends in this journey called life, however varies in number. But in major cases, life starts with many friends as one will have so many in childhood and slowly by the end of schooling we will remain with few friends who are in line with our thought process or people whose choices, are likes and dislikes same like ours. Once, we grow up, we start categorising our friends like close friends, known friends and just familiar persons. Though our friends change through out this journey, one thing is very constant here; i.e.we make friends who have similar taste like us or people who think same like us. Friendship differs with gender where as men will be able to continue with old friendships; some how, for women, this above equation suddenly changes when they have the knot tied. Few relocate to husband's place, few move to in laws house. Suddenly whole life changes with new role and responsibilities and so as friends circle.Though women try to stay in touch with old group, there will be so many constraints; few still try to manage to connect with old friends but majority of women have to forego their friends in the transition phase of life. This very simple change can put women under tremendous pressure and can also create lot of insecurities about life. To avoid, this stage, “being organised is the only way” say experts. According to them, people who lead life in a systematic way will always have clarity in every thing. And women who have efficiency in multi tasking, will be able to manage different groups of people in life. Once this happen, then you will not have to choose one between friends and family but you will learn to balance both successfully. There are few more scenarios like, you make new friends when you are growing in life. Your colleagues or neighbours may become your friends in due course of time. This is the time where each one has to respect their relationship and space. When friendship blossoms among matured minds, we have to be more matured to construct this beautiful bond which is long lasting. Never ever take people for granted. Not you be available to others to do so. Even when you take utmost care in friendship, sometimes you end up with few misunderstandings. But never go personal, even when you argue on issues, make it subjective. When you practice this , it takes no time to patch up. Leave no space for EGO. If you are right or wrong accept it and explain to other person why you are taking that stand. Sometimes, when you can't make the other person understand your point, don't blame the person or your choice of friends. But stay calm for a while and leave space for others. This matured act of your will surely make your friends hook to you. If not, still never find fault with any.. Remember, we meet many people in this beautiful journey called life, few travel along with us till the end and few get down when their destination is different from ours. Keep moving and spreading smiles is the only thing we have to do all the time. Happy friendship day!! Note: Silence kills any form of relationship including Friendship, so learn to communicate. - Bhavana   Click here for more Friendship Day Special articles   Trends in Friendship Long live - friends! A True Friendship is good for your Health ! స్నేహం పేరుతో ఒక దేవుడు స్నేహం

ఇంట్లోనే ఫిట్ నెస్ టిప్స్..     బయట జోరుగా వర్షం కురుస్తున్నపుడు జిమ్‌కు వెళ్లాలన్నా, రన్నింగ్, వాకింగ్‌కు వెళ్లాలన్నా ఇబ్బందే. అందుకే ఇంటినే జిమ్‌గా మార్చుకొని వ్యాయామాన్ని కొనసాగించవచ్చు. మరి అది ఎలాగో చూద్దామా...?   * వాకింగ్‌కు బదులుగా ఇంట్లోనే స్కిప్పింగ్‌, సైక్లింగ్‌ వంటివి చేయాలి.ఇంట్లోనే కనీసం 40 నిముషాలకు తగ్గకుండా వ్యాయామం చేసుకోవాలి. * వర్షాలు కురుస్తున్నప్పుడు శారీరిక శ్రమ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి తప్పని సరిగా ఉదయం, సాయంత్రం వ్యాయామం చేయాలి. ఇంట్లో మిగిలిన వ్యాయామాలు చేసే అవకాశం లేని వారికి యోగా ఉత్తమం. * ఓ అరగంట సేపు యోగాసనాలు వేయాలి. వర్షాకాలంలో క్రమం తప్పకుండా ఇంట్లోనే యోగా, మెడిటేషన్, ప్రాణాయామం చేయటం ఆరోగ్యానికి మంచిదంటున్నారు నిపుణులు. * ప్రాణాయామం వంటి శ్వాసపరమెన వ్యాయామాలు ఈ కాలంలో చాలా మంచివి. * వర్షాకాలంలోనూ వ్యాయామాన్ని కొనసాగించటం వల్ల మీరు ఆరోగ్యంగా, చురుకుగా ఉండవచ్చని ఫిట్‌నెస్ నిపుణులు చెపుతున్నారు. ఇంట్లోనే మీ శరీర దారుఢ్యాన్ని పెంచేందుకు వీలుగా డంబెల్స్‌తో కొద్దిసేపు వ్యాయామం చేయటం ఉత్తమం. * కాస్త ఎండ వచ్చిన రోజున తప్పనిసరిగా వాకింగ్‌కు వెళ్లండి. ఇది ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి ఈ కాలంలో రెగ్యులర్‌గా వాకింగ్‌ కుదరదు కాబట్టి, వారు తప్పనిసరిగా ఇంట్లోనే వ్యాయామాలు చేసుకోవాలి.  

బరువు తగ్గడానికి ఎలాంటి ఆహరం తీసుకోవాలి?   బరువు తగ్గడానికి చాలామంది చాలా రకాల కార్యక్రమాలు చేస్తుంటారు. కానీ మనం తీసుకునే ఆహరం సమానంగా తీసుకుంటేనే బరువు పెరుగుదలను తగ్గించవచ్చు. దీనికి కావలసింది కేవలం సరైన మాంసకృత్తులు మరియు పోషక విలువలున్న ఆహరం మాత్రమే. మీరు తీసుకునే ఆహరం యొక్క ప్రణాళిక అనేది మీ యొక్క బరువు తగ్గడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. బరువు తగ్గడానికి మరి ఎలాంటి డైట్ ప్రణాళికను వాడాలో ఇపుడు తెలుసుకుందాం.   వెజ్ - శాకాహారం:- ఉదయం వేళలో... బ్రేక్ ఫాస్ట్ : 1: ఒక కప్పు కాఫీ లేదా పాలతో బ్రెడ్ ను తీసుకోవడం. 2: పండ్లు లేదా టమాటాలు వంటి తాజా కూరగాయలు తీసుకోవడం. మధ్యాహ్నం - లంచ్ : 1: గ్రీన్ వెజిటబుల్ సోర్ మిల్క్ (దహి) తో రెండు చిన్న చపాతీలు తినాలి. 2: రెండు లేదా మూడు చిన్న దోసకాయలు, క్యారెట్ వంటివి తినాలి. 3: ఒక కప్పు అన్నం మరియు ఒక కప్పు పప్పు ఆహారంగా తీసుకోవాలి. రాత్రి - డిన్నర్ : 1: సూప్ (టమోటా, పాలకూర మరియు స్వీట్ కార్న్) మరియు పాపడ్ తీసుకోవచ్చు. 2: ఒక కప్పు శాకం మరియు రెండు చపాతీలు తీసుకోవాలి.   మాంసాహారం:- ఉదయం వేళలో... బ్రేక్ ఫాస్ట్ : 1: రెండు లేదా మూడు ఉడికించిన గుడ్లు తీసుకోవచ్చు. 2: ఒక కప్పు కాఫీ లేదా పాలతో బ్రెడ్ ను తీసుకోవడం. మధ్యాహ్నం - లంచ్ : 1: మాంసం లేదా ఒక ఫిష్ యొక్క చిన్న చిన్న ముక్కలు, రెండు చపాతీ మరియు దాల్ తీసుకోవాలి 2: ఏదైనా తక్కువ కాలరీలు మాంసాహార క్రమాలలో సూప్ మరియు పాపడ్ తీసుకోవచ్చు. రాత్రి - డిన్నర్ : 1: తక్కువ కాలరీలు కల్గిన మాంసాహార సూప్ మరియు పాపడ్ తీసుకోవచ్చు. 2: చికెన్ 100గ్రాములు మరియు రెండు చపాతీలు, ఒక కప్పు సూప్ ఆహారంగా తీసుకోవచ్చు. ఈ విధంగా చేయడం వలన ఎలాంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ లేకుండానే, ఆరోగ్యంగా ఉంటూనే మీ బరువును మీరు తగ్గించుకోవచ్చు.

కూర్చున్న చోటే ఎక్సర్ సైజ్   రోజూ వ్యాయామం ఆరోగ్యానికి మంచిదని తెలిసినా కూడా.. ఈ ఉరుకుల పరుగుల రొటీన్ జీవితంలో ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోం. అయితే కదలకుండా ఒకేచోట కూర్చుని చేసే ఉద్యోగాల్లో స్టిఫ్ షోల్డర్ వంటివి చాలా ఇబ్బంది పెడుతున్నాయి ఈమధ్య. ఆ ఇబ్బందులని అధిగమించాలంటే... ఎప్పుడు, ఎక్కడ, ఏ కాస్త సమయం దొరికినా కూడా కూర్చున్న చోటనే చిన్న చిన్న కదలికల్ని చేయటం మంచిది అంటున్నారు నిపుణులు. ఎలా అంటే ...   1. ప్రతి అరగంటకి ఒకసారి కూర్చున్న భంగిమను మార్చాలి. అలాగే కళ్ళు ఆర్పి, తెరవటం చేయాలి. 2. ప్రతి గంటకి ఒకసారి కుర్చీలోంచి లేచి అటు, ఇటు నడవాలి. వీలు కాకపొతే ఓ ఐదు నిముషాలు నిల్చోవాలి. 3. అలాగే కుర్చీలో కూర్చుని మెడని పైకప్పు కేసి సాగదీయాలి. అంటే పైకప్పు వైపు చూస్తుండాలి అన్నమాట. 4. ఇక అప్పుడప్పుడు మెడని ఒక పక్కనుంచి మరో పక్కకి అడ్డంగా తిప్పాలి. 5. భుజాలని అప్పుడప్పుడు గుండ్రంగా తిప్పాలి. అలాగే మణికట్టు దగ్గర చేతుల్ని తిప్పాలి. ఇలా ఆఫీసులో, ఇంట్లో, బయట ఎక్కడ వున్నా మోచేతులు, మోకాళ్ళు, భుజాలు, మణికట్టు, మెడ ఇలా జాయింట్స్ ని కదుపుతూ చిన్న చిన్న ఎక్సర్ సైజులు చేస్తే ... పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలనుంచి బయటపడచ్చు అంటూ సూచిస్తున్నారు నిపుణులు. - రమ

ఆరోగ్యానికి చిన్న చిట్కాలు     1. వంటింట్లో పొరపాటున వేడి గిన్నెలను ముట్టుకుంటే చాలా మంటగా వుంటుంది. బర్నాల్ వంటివి అందుబాటులో లేకపోతే కొంచెం టూత్ పేస్ట్ రాసి చూడండి. నొప్పి త్వరగా తగ్గిపోతుంది. 2. వేడి వేడి టీ, కాఫీ గబుక్కున తాగితే నాలుక కాలినట్టు అవుతుంది. అప్పుడు ఒక చెంచా పంచదార నోట్లో వేసుకుంటే నొప్పి తగ్గుతుంది. 3. ఏదైనా కుట్టినట్టు మంటగా వుంటే వంట సోడాలో కొంచెం నీళ్ళు పోసి కలిపి ఆ పేస్ట్‌ను చీమ, దోమ కుట్టినచోట రాస్తే ఆ దద్దురు, మంట తగ్గుతాయి. 4. ఆగకుండా ఎక్కిళ్ళు వస్తుంటే ఒక చెంచా  చక్కెర నాలుక మీద వేసుకుని చప్పరిస్తే చాలు. నెమ్మదిగా ఎక్కిళ్ళు పోతాయి. 5. కడుపు బరువుగా వుంటే పుదీనా ‘టీ’ తాగితే రిలాక్స్‌గా వుంటుంది. పుదీనా ఆకులను శుబ్రంగా కడిగి చిన్నచిన్న ముక్కలుగా తరగాలి. తెర్లుతున్న నీటిలో పుదీనా ఆకులను వేసి మూత పెట్టాలి. ఆ తర్వాత పాలు, పంచదార కలిపితే పుదీనా టీ రెడీ. పాలు లేకుండా తాగితే ఇంకా మంచిది.   - రమ

  పనితోపాటు ఆహారమూ ముఖ్యమే   ఉద్యోగం చేసే ఆడవారు ఇంట్లో, బయటా పని ఒత్తిడితో తమ ఆహారం విషయంలో పెద్దగా శ్రద్ధ పెట్టరు. దాంతో వయసు పెరిగినకొద్దీ అనారోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. రోజువారీ తీసుకునే ఆహారం విషయంలో చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే ఆ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు అంటున్నారు పోషకాహార నిపుణులు. సాధారణంగా రెండుపూటలా తీసుకునే ఆహారంతోపాటు మధ్యమధ్యలో తప్పనిసరిగా ఏదో ఒకటి తింటుండాలిట. అయితే ఆ ఏదో ఒకటి అధిక క్యాలరీలని పెంచేది కాక ఆరోగ్యాన్నీ, శక్తినీ ఇచ్చేది అయితే మంచిది అంటూ కొన్ని సూచనలు చేస్తున్నారు. 1. సాయంత్రం వేళ ఆకలిగా అనిపించినప్పుడు సలాడ్ల వంటివి తీసుకోవాలి. సలాడ్ల వల్ల శరీరానికి తక్కువ కేలరీలు అందుతాయి. ఆకలి తీరుతుంది కూడా. అందులోనూ క్యాబేజీని సలాడ్‌లో కలిపి తీసుకుంటే దీనిలోని ‘గ్లాటామైన్’ అనే అమినో యాసిడ్ చిన్న పేగు ఆరోగ్యంగా పనిచేసేట్టు చూస్తుంది. డైజేషన్ ఇబ్బందుల వంటివి తగ్గుతాయి. 2. బాదం, జీడిపప్పు తదితర డ్రై ఫ్రూట్స్ నేరుగా తీసుకోవడం వల్ల  కొలెస్ట్రాల్ సమస్య వుండదు. వీటిలో విటమిన్ ‘ఇ’తోపాటు మాంనీస్, విటమిన్ బి2, ఫాస్పరస్, మెగ్నీషియం, కాపర్ ఉంటాయి. డ్రై ఫ్రూట్ర్‌ని మధ్యాహ్నం వేళ తీసుకుంటే శక్తి లభిస్తుంది. 3. వేరుశనగలు కూడా ఆరోగ్యానికి మంచివి. వీటిలో మాంసకృత్తులతోపాటు బి3, కాపర్, మాంగనీస్ వంటి పోషక విలువలు సమృద్ధిగా వుంటాయి. కాబట్టి వేరుశనగలని వేయించి లేదా ఉడికించి ఓ చిన్న బాక్సులో వేసుకుని ఆకలి అనిపించినప్పుడు నాలుగు గింజలు నోట్లు వేసుకుంటే చాలు ఆకలి తీరుతుంది. ఓపిక వస్తుంది. 4. ఇక పండ్లు తింటే శరీరంలోకి అనవసర కేలరీలు చేరవు. ఆకలి అదుపులో వుంటుంది. అరటిపండుని ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌తోపాటు తీసుకుంటే రోజంతటికీ కావలసిన శక్తి లభించినట్టే. ఎందుకంటే అరటిపండ్లలోని కాల్షియం, ప్రొటీన్లు, ఐరన్‌లతోపాటు కార్బొహైడ్రేట్లు త్వరితగతిన శక్తినిస్తాయి. ఇక ఆపిల్స్‌లోని విటమిన్ ‘ఎ’, ఐరన్, బొప్పాయిలోని విటమిన్ ఎ, కె, ఇ తదితర పోషకాలు శక్తినివ్వడమే కాకుండా ఆరోగ్యానికీ మేలు చేస్తాయి. 5. మొలకెత్తిన గింజల్ని ఓ గుప్పెడు నోట్లో వేసుకుంటే చాలు వీటిలో సమృద్ధిగా లభించే మాంసకృత్తులు శరీరానికి శక్తినిస్తాయి. చురుగ్గా వుంచుతాయి. ఇలా రోజు మొత్తంలో అప్పుడప్పుడు ఏదో ఒకటి నోట్లో వేసుకుంటే ఓపిక లేకపోవడం అన్న సమస్య వుండదు. బరువు పెరుగుతామనే భయమూ వుండదు. చలాకీగా రోజువారీ పనులు ఏ ఆటంకం లేకుండా చేసుకోవచ్చు. -రమ

రాగి జావతో ఎన్ని లాభాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు..    

ఫిట్‌నెస్ రహస్యం మన చేతుల్లోనే బాడీ ఫిట్‌నెస్‌తో మైండ్ ఫిట్‌నెస్ కూడా సాధ్యపడుతుంది. అది ఎలా అంటే...మంచి ఆహారం, వ్యాయామం శరీరానికి కావలసిన శక్తినివవడమే గాక ఉత్సాహాన్ని పెంచి మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. తద్వారా ఎంతటి క్లిష్ట సమస్యనైనా ఎదుర్కోగలిగే సామర్థ్యం పెరుగుతుంది. అందుకే ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండాలంటే క్రమం తప్పక వ్యాయామం, పోషకాహారం చాలా అవసరం. * బరువు పెరుగుతున్నట్లు తెలియగానే చాలామంది వెంటనే తినడం తగ్గించేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకోవలసి వస్తుంది. * ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల గంటలో జీర్ణమవగా మిగిలింది కొవ్వుగా మారిపోయి శరీరంలో నిలవ ఉంటుంది. తద్వారా కొవ్వు పరిమాణం పెరిగి బరువు పెరుగుతారు. * దృఢమైన శరీరానికి ఉపయోగపడే ముఖ్య పోషకాలు కార్బోహైవూడేట్లు. ఈ చక్కెర పదార్థాలు దాదాపు అన్ని రకాల ధాన్యాలు, పప్పులు, కూరగాయల్లో లభిస్తాయి. * 50 శాతం శక్తి వీటి ద్వారానే చేకూరుతుంది. కొవ్వు పదార్థాల నుంచి 35 శాతం, ప్రొటీన్ల నుంచి 15 శాతం శక్తిని పొందగలుగుతాం. * పైగా బరువు పెరిగే ప్రమాదం పెరుగుతుందే కానీ తగ్గదు. ఎందుకంటే మనం ఆహారం తీసుకున్న ఒక గంట వరకు మన శరీరంలోని ఎంజైములు అతి చురుకుగా పనిచేస్తాయి. * కాబట్టి ఒక్కసారి ఎక్కువ లాగించేకన్నా కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తినడం మంచిది.   ఇకపోతే ఫిట్‌నెస్‌ను పెంచే మరో ముఖ్య కారకం వ్యాయామం. కావలసినదాని కన్నా ఎక్కువ శక్తి చేరినప్పుడు ఆ కేలరీలన్నీ కొవ్వులుగా మారి ఫిట్‌నెస్‌ను తగ్గిస్తాయి. కాబట్టి వాటిని కరిగించాలంటే క్రమం తప్పని వ్యాయామం అవసరం. వేగంగా నడవడం, జాగింగ్, సైక్లింగ్ వంటి ఏరోబిక్ ఎక్సర్‌సైజులు దృఢత్వాన్ని పెంచుతాయి. వ్యాయామం వల్ల మెదడులో ఎండోమార్ఫిన్లనే రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. ఫలితంగా రోజంతా ఉత్సాహంగా, ఆనందంగా ఉంటుంది. వ్యాయామం ఇలా చేయండి. * వ్యాయామం ప్రారంభించే ముందు ఒకేసారి పెద్ద పెద్ద ఎక్సర్‌సైజులు కాకుండా కనీసం వారానికి మూడుసార్లు ఒక అరగంట సేపు మీరు ఇష్టంగాచేయగలిగే పద్ధతిని ఎంచుకోండి. * కొద్దిరోజులు చేసి మానేయడం కాకుండా మెల్లమెల్లగా రోజూ చేయడానికి ప్రయత్నించండి. * యోగా, వాకింగ్, స్విమ్మింగ్.. ఇలా ఏదో ఒకటి మీకు సరిపోయే వ్యాయామ పద్ధతిని ఎంచుకోండి. * మీరొక్కరే చేయడానికి విసుగ్గా ఉంటే టీమ్‌గా, ఒకాటలాగా చేయండి. మెల్లగా అలవాటవుతుంది. * ఒక్కటి కన్నా ఎక్కువ వెరైటీలలో ఉండే వ్యాయామ పద్ధతులు ఆసక్తిని పెంచుతాయి. మెదడుకు చురుకుదనం. మనం తీసుకునే ఆహారం మన మెదడు పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి తీసుకునే ఆహారాన్ని బట్టి మన మానసిక దృఢత్వం, చురుకుదనం ఆధారపడి ఉంటాయి. కార్బోహైవూడేట్లు ఎక్కువగా ఉన్న ఆహారం మెదడును మత్తుగా ఉంచుతుంది. అన్నం తినగానే నిద్ర ముంచుకురావడానికి కారణం ఇదే. అందుకే సాయంకాలం కార్బోహైవూడేట్‌లను తీసుకోవడం వల్ల సుఖనివూదకు ఆస్కారం ఉంటుంది. ప్రొటీన్లు మెదడు చురుకుదనాన్ని పెంచుతాయని ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి మానసిక సామర్థ్యం పెంచుకోవాలంటే ప్రొటీన్లు ఎక్కువగా తీసుకోవాలన్నమాట. ఇక కాఫీ, టీలు మోతాదుకు మించి తీసుకుంటే ప్రమాదమే. ఒక కప్పు కాఫీ మెదడును చైతన్యవంతం చేస్తుంది. కానీ గంటకో కప్పు తీసుకోవడం వల్ల అలసట, ఉద్రేకం, నిద్రలేమి వంటి దుష్ఫలితాలు కలుగుతాయి. అలాగని హఠాత్తుగా మానివేస్తే తలనొప్పి, వికారం వంటివి కనిపిస్తాయి.

సన్నబడాలనుకుంటున్నారా   " అర్జంటుగా సన్నబడాలి" అనుకుంటే, ఎం చెయ్యాలో  తెలీక  అవస్థాపడుతుంటాం. అయితే తీసుకునే ఆహారాన్ని తగ్గించటంలో పాటు క్రమం తప్పని వ్యాయామం మాత్రమే అధిక బరువును ఆడుతూ,పాడుతూ తగ్గిస్తుంది అంటున్నారు నిపుణులు. అయితే వ్యాయామం ద్వారా ఎన్ని కెలోరీలు ఖర్చు చేయొచ్చో తెలిస్తే చక్కగా ప్లాన్ చేయొచ్చు కదా! ఇదిగో ఆ వివరాలు చదవండి- పాటించండి- సన్నబడండి.   నడక: బరువు తగ్గాలనుకునే వారికీ అందరూ చెప్పే సలహా నడవమని నడక వాళ్ళ అంత లాభం ఉంటుందా అని అనుమానం వస్తుంటుంది కదా మనకి కాని నిజంగా చాలా లాభం వుంటుందట. ఎందుకంటే ఒక గంట నడిస్తే చాలు 300 కెలోరీలు ఖర్చవుతాయి. ఇంకాస్త ఓపిక ఉంటె కాస్త ఎత్తైన ప్రదేశాలవైపు నడిస్తే చాలు 400 దాకా కెలోరీలు కరిగిపోవడం ఖాయం.     ఇక నడుము కింద భాగం నాజుకుగా, ఉండాలంటే రోజు హాయిగా సైకిల్ తొక్కండి చాలు 350 కెలోరీలు  వద్దన్నా కరిగిపోతాయి.400 వందలకు పైగా కెలోరీలు ఖర్చు కావాలంటే పరుగుకు మించిన వ్యాయామం లేదు.   అలాగే మంచి మ్యూజిక్ పెట్టుకుని  నచ్చిన డ్యాన్స్ చేస్తే చాలు కెలోరీలు ఇట్టే కరిగిపోతాయంటే ఎవరు మాత్రం డ్యాన్స్ చేయకుండా ఉంటారు చెప్పండి. అలా డ్యాన్స్ చేస్తే చేస్తే గంటకు మూడొందల కెలోరీలకు పైగా ఖర్చవుతాయి. నచ్చిన మ్యూజిక్ పెట్టి సాల్సా, రాక్ఎన్రోల్ , బెల్లి డ్యాన్సింగ్ ఇలా వచ్చినది చేసేయండి.చాలు ఇక , స్కిప్పింగ్, స్పీడ్ జాగింగ్ , ఈత, ఆటలు, ఇవన్ని కూడా మానసిక ఆనందాన్నిచ్చెవె. వీటిలో గంటపాటు ఏ ఒక్కటి చేసినా 400  పైగా కెలోరీలు ఖర్చవటం ఖాయం. కాబట్టి కష్టంగా కాక ఇష్టంగా శరీరాన్ని కదిలించి బరువు తగ్గించండి అంటున్నారు నిపుణులు ఆలోచించండి ఆచరణలో పెట్టండి. - రమ.

  * ఏరోబిక్ వ్యాయామం మొదలు పెట్టే ముందు అప్పటి వరకు చేస్తున్న వ్యాయామాన్ని, ఆరోగ్యస్థితిని, బరువును దృష్టిలో పెట్టుకుని తగిన జాగ్రత్తలు పాటించాలి. ఏరోబిక్ వ్యాయామం ద్వారా లభించే ప్రయోజనాలను పొందాలంటే కనీసం 12 వారాల పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. * ఏరోబిక్ వ్యాయామం వల్ల శరీరంలో పేరుకొన్న అదనపు కొవ్వులను కరిగిస్తుంది. అలసటను తగ్గిస్తుంది మరియు స్టామినాను పెంచుతుంది. * ఏరోబిక్ వ్యాయామం వల్ల మధుమేహం వలన వచ్చే సమస్యలను తగ్గిస్తుంది. శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. * గుండె పనితీరులో మెరుగుదల ఉంటుంది. శరీర కండరాల బలానికి తోడ్పడుతుంది. * క్రమం తప్పని ఏరోబిక్‌ వ్యాయామాలు అధిక రక్తపోటును తగ్గించడమేకాదు, అసలు అధిక రక్తపోటు రాకుండా నిరోధిస్తాయి. * శ్వాస సంబంధ సమస్యల నివారిణిగా, ఆక్సిజన్‌ను తొందరగా గ్రహించేవిధంగా శరీర స్ధాయిని పెంచుతుంది.