Beat the heat with healthy food Body heat is the byproduct of our body's normal metabolism. When the energy sources (sugars, fats, proteins) are broken down and metabolized to produce ATP, some of the energy is lost as heat. Cells which require more ATP produce more heat. There are few home remedies, particularly the food how to reduce or control the excessive body heat symptoms in men, women and children naturally, which can be used. Some people inherently have more heat in their bodies while some are affected by it due to physical strain, consuming foods with hot propensity, or due to medication. Body heat manifests itself in various forms like anger, disturbed sleep, rashes and boils, acidity, heartburn, or stomach ulcers. It may also lead to headaches and sometimes dizziness and episodes of fainting. There are more severe problems like changes in blood pressure, seizure, high body temperature, and rapid heartbeats that also indicate increased body heat. So, it’s very important to keep one’s body heat under control at all times. And one of the simplest ways of doing that is staying hydrated by having particular food which helps to maintain body heat. Cardamom According to traditional wisdom of Ayurveda, cardamom is very effective in improving digestion and also expert in reducing the body heat. you can mix cardamom powder while preparing tea, sweets or even you can add cardamom to spicy foods also. Peaches Over heat in your body will effect your skin first. Peaches are advisable to avoid skin rashes as well as it is good to adding peaches to your breakfast will fulfill the requirements of vitamin A, vitamin B2, and potassium. Dry peaches are great resources to reduce the heat in the body and helps to regain the energy. Apricot Make it a habit of Apricot juice with glucose or honey can help cool your body and also quench your thirst, eliminate the waste products from your body, tone up your eyes, stomach, liver, heart and nerves by supplying vitamins and minerals. Buttermilk Buttermilk is also efficient in reducing body heat. Therefore, buttermilk is quite effective and beneficial during the summer season. It has valuable nutrition’s like potassium, vitamin B-12, calcium, phosphorous and probiotics which help strengthen the digestive system and the immunity of the body. Watermelon Watermelon is a super-sized and super-packed with nutritional goodies such as iron, potassium, beta carotene and vitamin C, watermelon has 95 per cent water content which helps to reduce the body heat and it contains lycopene which will keep away from the risk of several cancers. Coconut water Coconut water contains organic compounds processing healthy growth promoting properties that helps to orally re-hydrate your body, it is an all natural isotonic beverage, carries nutrients and oxygen to cells. Cucumber Cucumbers are the most wonderful and natural high water content edible fruit, Adding a crunchy cool cucumber to your salads is a good way to maintain the water level in your body. The regular intake of cucumber juice is very useful both internally and externally. Sugarcane Sugarcane is rich in Phosphorus, calcium, iron, magnesium and potassium. Sugar cane is ideal for those people who often suffer from burning sensation when urinating, or all over the body, who are tired due to excess sun exposure during summer. Banana Banana contains three natural sugars are surcose, fructose and glucose. These natural sugars combined with fiber in a banana gives an instant, sustained and substantial boost of energy. It has a natural antacid effect in the body, so if you suffer from heat in the body, try eating a banana for soothing relief. Bottle gourd Its high water content makes it very cooling. The cooked Bottle Gourd is cooling, calming, diuretic and easy to digest. It is also effective against constipation and other digestive disorders.
మందులు వాడకుండానే హై బి.పి. ని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు Home remedies to control High BP హై బి.పి. నే హైపర్ టెన్షన్ అని కూడా అంటారు. విషయమేమిటంటే మనలో చాలా మంది హై బి.పి. ఉందన్న విషయం తెలియకుండానే గడిపేస్తుంటాం. హై బి.పి. లక్షణాలు అంత తేలిగ్గా తెలియవు. హై బి.పి వల్ల ఆరోగ్యానికి జరిగే నష్టం అంతా ఇంతా కాదు, దాని ప్రభావం శరీరానికి ముఖ్య అవయవాలైన గుండె, కిడ్నీల పైనే మొదట పడుతుంది , అంతే కాదు ఈ హై బి.పి. ఒక లెవెల్ దాటిందంటే హార్ట్ ఎటాక్ వచ్చి ప్రాణాంతకమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనం తినే ఆహారంలో జాగ్రత్తలు పాటిస్తూ, వ్యామామం చేస్తుంటే ఈ బి.పి. నుండి మనల్ని మనం కాపాడుకోవడం పెద్ద కష్టమైన పనేం కాదు. ఆరోగ్యానికి హాని చేసే ఆహారాన్ని, దాంతో పాటు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి మంచి ఆహారం తిన్నామంటే సరి, హై బి .పి ని కూడా మనం మన కంట్రోల్ లో పెట్టుకోవచ్చు . వెల్లుల్లి హై బి.పి. ని కంట్రోల్ లో ఉంచడంలో వెల్లుల్లి ఔషధంలా పని చేస్తుంది. అది బి.పి. ని తగ్గించి శరీరంలోని జీవక్రియలను సమతుల్యం చేస్తుంది . పల్స్ రేట్ , గుండె వేగాన్ని అదుపులో ఉంచుతుంది . అంతేకాదు రోజు ఉదయాన్నే పరగడుపున మూడు వెల్లుల్లి రేకులను మింగితే రోజంతా చలాకీగా ఉంచి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా దరి చేరకుండా చూస్తుంది. ఉసిరికాయ ఉదయం పూట పరగడుపునే ఒక టేబుల్ స్పూన్ ఉసిరి రసంలో కాస్త తేనె కలుపుకుని తాగితే బి. పి. లెవెల్ అవుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. నిమ్మకాయ నిమ్మకాయ హై బి.పి. ఉన్నవారికి చాలా విలువైన ఔషధం , ఎందుకంటే ఉసిరికాయలో ఉండే విటమిన్ పి, బి. పి. ని కంట్రోల్ చేసి, రక్తప్రసరణను క్రమబద్ధం చేస్తుంది. ఖర్బూజ హై బిపి నివారణలో ఖర్బూజా చాలా ముఖ్యమైన ఆహారం, ఖర్బూజా గింజలను రోస్ట్ చేసి లేదా ఎండబెట్టి తినడం వల్ల రక్త నాళాల్లో ఉన్న ప్రెజర్ తగ్గి బి.పి. కంట్రోల్ లో ఉంటుంది. బియ్యం చాలామంది కాస్త బరువు పెరగానే అన్నం తినడమంటేనే భయపడుతుంటారు , కానీ బ్రౌన్ రైస్ లో ఉండే కాల్షియం, శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అందునా హై బి.పి ఉన్నవారికి ఇది పూర్తిగా సోడియం రహిత ఆహారం, కాబట్టి నిర్భయంగా తినవచ్చు. ఇది నరాలను రిలాక్స్ చేసి రక్తప్రసరణను క్రమబద్ధం చేస్తుంది. బంగాళాదుంప బంగాళా దుంపలు బి.పి. ని కంట్రోల్ లో ఉంచడంలో అద్భుతంగా పని చేస్తాయి. బంగాళాదుంపల పొట్టు తీయకుండా ఉడికించడం వల్ల అందులో ఉండే పొటాషియం వల్ల ఉప్పు వేయకపోయినా ఉడికిన బంగాళాదుంపలు ఉప్పగా ఉండి రుచిగా ఉంటాయి. కాబట్టి బంగాళా దుంపలను రోజుకు ఒకసారైనా ఆహారంలో భాగమయ్యేలా జాగ్రత్తపడాలి. కొత్తిమీర కొత్తిమీర లో ఉన్న ఔషధ గుణాలు బి.పి. ని అదుపులో ఉంచుతాయి. కొత్తిమీర జ్యూస్ ను రోజుకు ఒకసారి తాగినా చాలు, బి పి కంట్రోల్ లో ఉంటుంది. కూరగాయలు కూరగాయల జ్యూస్ ముఖ్యంగా క్యారట్ జ్యూస్ గానీ, పాలకూర జ్యూస్ గానీ కలిపి గానీ విడివిడి గా కానీ తీసుకోవడం వల్ల బి.పి. పేషెంట్స్ కి చాలా రిలీఫ్ గా ఉంటుంది. 300 మీ.లీ. ల క్యారట్ జ్యూస్ మరియు 200 మీ.లీ. పాలకూర జ్యూస్ 500 మి.లీ. లీటర్ నీటిలో కలిపి రోజూ తాగడం వల్ల బి పి లెవెల్ లో ఉంటుంది. పైన చెప్పిన డైట్ తో పాటు మరొక సలహా ఏమిటంటే హై బి.పి ఉన్నవారు తినే రొటీన్ ఆహారంలో కాల్షియం , ఉన్న ఆహారాన్ని ఎంచుకోవడంతో పాటు సోడియం ఉన్న ఆహారాన్ని పూర్తిగా వదిలేసినా మంచిదే. మరొక ముఖ్య గమనిక : హై బి. పి కేవలం మనం తినే ఆహారం వల్లే కాదు, నిద్ర సరిగ్గా లేకపోయినా, స్ట్రెస్ ఎక్కువైనా తిరగబడే అవకాశముంది, కాబట్టి ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి.. హై బి పి ని నిర్లక్ష్యం చేయకండి.
వయసును తగ్గించే ఆహారం Anti aging solutions with food మనం తినే ఆహార పదార్థాలను బట్టి మన వ్యక్తిత్వం నిర్దేశించబడుతుంది అనడంలో సందేహం లేదు, జ్ఞాపక శక్తి మెరుగు పడాలన్నా, మానసిక ఒత్తిడులు తట్టుకోవాలన్నా, జేవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలన్న కావలసింది ఆరోగ్యం, ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాం. ఆరోగ్యం వ్యక్తిత్వాన్నే కాదు వృద్ధాప్యాన్ని కూడా నిర్దేశిస్తుంది.. రోజువారి జీవితంలో ఎదురయ్యే సమస్యలు, మానసిక ఒత్తిడులు మన చర్మంపై కూడా ప్రభావం చూపిస్తాయి. అందుకే వయసుతో సంబంధం లేకుండా చర్మం ముడతలు పడి కాంతి లేకుండా తయారవుతుంది.. చర్మ సంరక్షణకు ఎంత విలువైన కాస్మొటిక్స్ వాడినా, మన శరీరంలో చర్మానికి కావలసిన హార్మోన్ ల ఉత్పత్తి సమపాళ్ళలో లేకపోతే ప్రయోజనం ఉండదు. అందుకే చర్మ సంరక్షణకు మనం తినే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చర్మానికి కావలసిన హార్మోన్ ల ఉత్పత్తి మెరుగుపడి చర్మం యవ్వనంగా ఉండటమే కాక కాంతిలీనుతూ ఉంటుంది. చర్మం కాంతివంతంగా, ముడతలు లేకుండా యవ్వనంగా నిగనిగలాడుతూ ఉండాలంటే ఈ సారి మీరు ఇంటికి కావలసిన సరుకులు తెచ్చుకునేటప్పుడు ఇవి తప్పకుండా ఉండేలా జాగ్రత్తపడండి. ఆకుకూరలు ఆకుకూరల్లో విటమిన్ సి, పుష్కలంగా ఉంటుంది, అది చర్మం కాంతివంతంగా ప్రకాశించడంలో దోహదపడుతుంది. అంతేకాదు ఆకుకూరల్లో ఉండే క్యారోటినాయిడ్స్ చర్మం ముడతలను తొలగించి, ఆరోగ్యంగా ఉంచుతుంది. టమాట టమాటాల్లో అధిక మోతాదులో ఉండే లైకోపిన్, చర్మాన్ని కాంతిహీనం చేసే సెల్స్ ని అదుపులో ఉంచుతాయి. పచ్చి టమాటాల్లో కంటే వండిన టమాటాల్లో 5 రెట్లు ఎక్కువ లైకోపిన్ ఉంటుంది. చర్మానికే కాదు రకరకాల గుండెకు సంబంధించిన వ్యాధుల నుండి ఈ లైకోపిన్ దూరంగా ఉంచుతుంది. వెల్లుల్లి వెల్లుల్లిని మించిన యాంటి ఆక్సిడెంట్ లేదు, వెల్లుల్లిని ఏదో రూపంలో ఆహారంలో ఉండేటట్లు చూసుకుంటే చాలు, ఎన్నో రోగాలు మన దగ్గరికి కూడా రావు, వెల్లుల్లిలో ఉండే ఆంటిసెప్టిక్ , ఆంటి బ్యాక్టీరియల్, ఆంటీ వైరల్స్, స్కిన్ ఇన్ఫెక్షన్ నుండి దూరంగా ఉంచుతాయి. రక్తాన్ని శుద్ధపరచి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. బ్లడ్ ప్రెషర్ ను క్రమబద్ధం చేసి రక్తంలో చెడు కొవ్వును తగ్గించి ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడుతుంది . సోయాబీన్ సోయాబీన్ లో ఉండే ఫ్లేవోన్స్ , శరీరంలోని హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల కలిగే రుగ్మతలను దూరంగా ఉంచుతుంది. ఇందులో చర్మానికి కావలసిన పోషకాలన్నీ పుష్కలంగా ఉన్నాయి. వేరుశనగ వేరు శనగల్లో అధిక మోతాదులో ఉండే విటమిన్ ఇ, సిలీనియం, జింక్ శరీర సౌందర్యానికి కావలసిన హార్మోన్ ల ఉత్పత్తిలో సహకరిస్తాయి. రక్తప్రసరణ మెరుగుపరచి మంచి ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యానికి ఉపకరిస్తాయి. ఆపిల్ ఆరోగ్యంగా ఉండటానికి యాపిల్ చేసే మేలు అంతా ఇంతా కాదు, రోజుకు ఒక యాపిల్ తిన్నా గంపెడు ఆరోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టే. కాబట్టి ప్రతి రోజు ఆహారంలో ఏదో ఒకపూట కనీసం ఒక యాపిల్ అయినా తినాలి. ఆపిల్ లో ఉండే సి విటమిన్ చర్మంలోని ముడతలను తగ్గించి యవ్వనంగా ఉంచుతుంది. తెలుఫుకున్నారు కదా.. మరి ఇప్పటి నుండి ఇవి మీ ఆహారంలో తప్పకుండా ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకుంటారు కదూ.. ఇంకో ముఖ్య విషయం, మంచి ఆహారం తింటే ఎంత ఆరోగ్యమో, ఆరోగ్యానికి కీడు చేసే ఆహారం తింటే అంతే అనారోగ్యం ... జంక్ ఫుడ్, సిగరెట్లు, ఆల్కహాల్, ఇవి కూడా మన ఆరోగ్యంతో పాటు, మన అందం పై కూడా ప్రభావం చూపిస్తాయి. కాబట్టి తిండి విషయంలో జాగ్రత్తగా ఉందాం. అందం, ఆరోగ్యం సొంతం చేసుకుందాం.
కీళ్ళ నొప్పిని తగ్గించే పోషకాహారం Healthy food can cure Joint pain సాయంత్రాలు ఇంటిల్లిపాదీతో గడిపే అనుభవమే వర్ణనాతీతం . కాసేపలాగే ఒక చోట కూర్చుని నిలబడితే చాలు ఆ ఆనందమంతా ఒక్కసారిగా హరించుకుపోతుంది. ఏముంది కీళ్ళ నొప్పులు. మామూలుగా కూర్చుని నిలబడ్డప్పుడే కాదు, మెట్లు ఎక్కుతున్నప్పుడు గానీ, ఇంకేదైనా పని చేస్తున్నపుడు గానీ ఈ కీళ్ళ నొప్పులు రావడం సర్వ సాధారణం. ఒకసారి ఈ నొప్పి మొదలైందంటే అడుగు తీసి అడుగు కూడా వేయలేం. ఈ కీళ్ళ నొప్పులు వయసుపై బడ్డవారికి , ఆటలు ఆడేవారికే కాదు, పోషకాహారం లోపించిన వారెవరికైనా ఉండవచ్చు.చిన్నగా మందులతో మొదలై చివరికి ఆపరేషన్ వరకు వెళ్తుంది పరిస్థితి, అప్పటికీ సమస్య తగ్గుతుందా అంటేగ్యారంటీ లేదు. అందుకే పరిస్థితి విషమించక ముందే కీళ్ళ నొప్పుల విషయంలో జాగ్రత్తలు పాటిస్తే కీళ్ళ నొప్పులతో ఉపశమనమే కాదు, అసలు కీళ్ళ నొప్పులు దరికి కూడా రావు. సోయా సోయాలో ఉండే కాల్షియం, మెగ్నీషియం, ప్రోటీన్లు వాటితో పాటు ఉన్న అమినో ఆసిడ్స్ కీళ్ళ నొప్పులు తగ్గడంలో ఔషదంలా పని చేస్తాయి. మూడు నెలల పాటు సోయాను ఆహారంలో ఏదో ఒక రూపంలో తీసుకుంటే కీళ్ళ నొప్పులు తగ్గుముఖం పడతాయి. సోయాను బర్గర్లో , ఉడకబెట్టిన కూరగాయలతో, సలాడ్ లతో పాటు తినవచ్చు. పండ్లు విటమిన్ సి ఉన్న ఏ ఆహారమైనా కీళ్ళ నొప్పులు ఉన్నవారికి ఔషధమే, నారింజ, స్ట్రా బెర్రీ, క్రాన్ బెర్రీ, కిర్నికాయ్, రాస్ప్ బెర్రీ, గ్రేప్ ఫ్రూట్, బొప్పాయి, మరియు బ్లూ బెర్రీస్ ఈ పండ్లన్నీ కలిపి ఫ్రూట్ సలాడ్ ల చేసుకుని రోజుకి ఒకసారి తిన్నా చాలు, కీళ్ళ నొప్పులు ఎంతో కాలం నిలవవు. రోజూ బ్రేక్ ఫాస్ట్ తో పాటు ఒక గ్లాసు ఆరెంజ్ జ్యూస్ ని కూడా తీసుకోవడం అలవాటు చేసుకోండి చాలు, మీరు కీళ్ళ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్టే. ఆకుకూరలు ఆకుకూరలు ఆరోగ్యానికి మంచిదని చెప్పని వారుండరు , వినని వారూ ఉండరు, కానీ పాటించే వాళ్ళే చాలా తక్కువమంది . పాటించని వారిలోనే ఉంటారు కీళ్ళ నొప్పులతో బాధపడేవారు . ప్రత్యేకంగా కీళ్ళ నొప్పుల విషయంలోనే కాదు, శరీరానికి కావలసిన విలువైన పోషకాలు ఆకుకూరల్లో సమృద్ధంగా ఉంటాయి. మీరు తినే ఆహారంలో ఏ రూపంలోనైనా, సాండ్ విచ్ రూపంలోనో, మీరు తాగే వెజ్ టేబుల్ జ్యూస్ లోనో ఏదో రూపంలో ఆకుకూరలు ఉండేలా చూసుకోండి. దినుసులు రోజూ తినే ఆహారం దాల్చిన చెక్క, జిలకర, పసుపు తప్పకుండా ఉండేలా చూసుకోండి, ఇవి తినే ఆహారానికి రుచిని మాత్రమే కీళ్ళకు బలాన్ని కూడా ఇస్తాయి. చేపలు చేపలు, లేదా చేప నూనె కీళ్ళ నొప్పులను తగ్గించే విషయంలో ఔషధకారిగా పని చేస్తుంది. కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్, కాపర్, మాంగనీస్, సిలీనియం, ఫ్లూరైడ్ వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉండే ఆహరం చేపలు, ఇవి మీ ఆహారంలో అధిక మోతాదులో ఉండేటట్లు చూసుకోండి. మరీ కీళ్ళనొప్పి అధికంగా ఉన్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించడం ఉత్తమం, ఈ లోపు ఐస్ గడ్డలను ఒక గుడ్డలో చుట్టి నొప్పి ఉన్న చోట ఉంచితే తాత్కాలికంగా ఉపశమనం కలుగుతుంది.
చురుకైన మెదడుకు కావలసిన పోషకాలు Nutritious food for Sharp mind మనం తినే ఆహారాన్ని బట్టి మన శరీర తత్త్వం ఉంటుంది. అందుకే మన ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండేలా జాగ్రత్త పడాలి. తినే ఆహారానికి సరిపడా వ్యాయామం ఉంటే ఎటువంటి రోగాలు దరికి రాకుండా ఉంటాయి. ఆరోగ్యం ఉంటేనే మెదడు చురుగ్గా పని చేస్తుంది. ఏకకాలంలో అనేక పనులను చేయగల సామర్ధ్యం కలిగింది. ఆధునిక కాలంలో మానవుడు సృష్టించిన కంప్యూటర్ కన్నా మన మెదడు ఎన్నో రెట్లు సామార్తవంత మైనది. దాని పని తీరు కేవలం మనం తినే ఆహారంలోని పోషకాల పై ఆధారపడి ఉంటుంది. అందుకే మనం తినే ఆహారంలో మెదడుకు కావాల్సిన పోషకాలు ఉండేలా ఆహారాన్ని తినాలి. మెదడుకు కావలసిన పోషకాలు పుష్కలంగా లభించే ఆహార పదార్థాలు కొన్ని... ఆల్చిప్పలు ఏ వయసులో ఉన్న వారికైనా ఆల్చిప్పలు మంచి పోషకాలు ఉన్న ఆహారం . ఆల్చిప్పల్లో ఉండే ఐరన్, మరియు జింక్ మెదడును చురుగ్గా పని చేయడంలో సహకరిస్తుంది. . తద్వారా కాన్సంట్రేషన్ పెరిగి జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది ఆహార ధాన్యాలు ఆహార ధాన్యాలు ఆరోగ్యానికి మంచివని మనకు తెలిసిందే. అందునా అధిక బరువుతో బాధపడే వారు వీటిని తినడం ఉత్తమం. మెదడు విషయానికి వస్తే ఈ ఆహారపు ధాన్యాల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. బియ్యం, ఓట్ మీల్, మరియు బార్లీలో మెదడుకు కావలసిన ఎన్నోపోషకాలు ఉన్నాయి. ఆహారపు ధాన్యాల్లో ఉండే విటమిన్ B6, థయామిన్, రక్తప్రసరణను మెరుగుపరిచి జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. టీ టీ తాగడం వల్ల మెదడు చురుకుగా పని చేస్తుందని సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది. ఫ్రెష్ గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ మెదడుకి చాలా మంచిది. టీలో ఉండే క్యాటెకిన్స్ మెదడును షార్ప్ గా,హెల్దీగా ఉంచడంలో తోడ్పడతాయి. కాబట్టి ప్రతి ఉదయం టీ తాగడం వల్ల రోజంతా హుషారుగా ఉండొచ్చు. గ్రుడ్లు మానవునిలో సహజంగా జరిగే మార్పులు ఉదాహరణకి, వయసులో మార్పు, ముఖ్యంగా వృద్ధాప్యాన్ని తగ్గించే గుణం గుడ్లలో ఉందని ప్రూవ్ అయింది. గుడ్డులో ఉండే విటమిన్ B12, లెసిథిన్ వయసును తగ్గించడంతో పాటు, అల్జేమేర్ అనే డిసీజ్ నుండి కూడా దూరంగా ఉంచుతుంది. మెదడుపై అధిక ప్రభావాన్ని చూపే గుడ్డు మంచి పోషక విలువలున్న ఆహారమే కాదు, యాంటీ ఏజింగ్ గా కూడా పనిచేస్తుందన్న మాట. కూరలు స్పైసీ ఫుడ్ ని ఇష్టపడే వారికి ఇది నిజంగా శుభవార్తే అని చెప్పవచ్చు. కూరలు వండేటప్పుడు వాడే పౌడర్ లలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా పసుపులో ఉండే రోగనిరోధక శక్తి, మెదడుకు శక్తినిస్తాయి. అందుకే స్పైసీ ఫుడ్ తినడానికి ఇష్టపడే వారు సాధారణంగా చలాకీగా ఉంటారు. బెర్రీస్ బ్లూ బెర్రీస్ జ్ఞాపక శక్తిని పెంపొందించడమే కాక మెదడు చురుగ్గా ఉండటంలో సహకరిస్తాయి. అన్ని రకాల బెర్రీస్, బ్లాక్ బెర్రీస్, బ్లూ బెర్రీస్, రాస్ప్ బెర్రీస్ లలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. మెదడుకు కావలసిన అన్ని పోషకాలు వీటిలో పుష్కలంగా ఉన్న ఈ బెర్రీస్ జ్ఞాపక శక్తిని మెరుగుపరచడంలో తోడ్పడతాయి. నట్స్ అండ్ సీడ్స్ సాయంత్రం పూట స్నాక్స్ తినే అలవాటు ఉన్నవారు , స్నాక్స్ కి బదులు వేరుశనగ, జీడిపప్పు, బాదంపప్పు , పీకన్స్, వాల్ నట్స్ , సన్ ఫ్లవర్ సీడ్స్ మరియు పంప్ కిన్ ని తినడం అలవాటు చేసుకోవడం మంచిది. వీటిలో ఉండే పోషకాలు ఒమెగా- 6, ఫ్యాటీ ఆసిడ్స్, ఫోలేట్, విటమిన్ e, మరియు B6, థయామిన్ మరియు మెగ్నీషియం మెదడుకు చురుకుదనాన్ని ఇస్తుంది. పైన సూచించిన ఆహారపదార్థాలు మీ రోజువారి ఆహారంలో భాగమయ్యేలా జాగ్రత్త తీసుకోండి. చురుకుగా, ఆరోగ్యంగా జీవించండి.
ఆరోగ్యమే మనిషి ఎదుగుదలను నిర్దేశిస్తుంది. కెరీర్ లో కానీ, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత విషయంలో గాని ఆరోగ్యంగా ఉండే వారి ఆలోచనా విధానంలోను, అనారోగ్యంగా ఉన్న వారి ఆలోచనా విదానాల్లోను చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి కాన్ఫిడెంట్ గా ఉంటాడు. క్లిష్ట సమయాల్లో కంగారు పడకుండా సరైన నిర్ణయాలు తీసుకుంటాడు. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు, ఆరోగ్యంగా ఉన్నవారికి అన్ని సిరులు దక్కినట్టేనని దానర్థం . బాధ్యతల నడుమ ఒత్తిడి వల్లనో , టైం లేకపోవడం వల్లనో, ఒక్కోసారి మనం ఆహారం గురించి అసలు పట్టించుకోం. ఆ చిన్నపాటి నిర్లక్ష్యం మనల్ని ఎన్నో రకాల వ్యాధులకు గురి చేస్తుంది. అందులో మొదటిది... ఐరన్ డెఫీషియన్సీ ఎనీమియా ఐరన్ డెఫీషియన్సీ ఎనీమియా అనేది చాలా ప్రభావాన్ని చూపుతుంది. ఇది 6 నెలల పిల్లల నుండి వృద్ధుల వరకు కలగవచ్చు.ఈ ఐరన్ డెఫీషియన్సీ ఎనీమియా వల్ల త్వరగా అలసిపోవడం, ఏ పని చేయలేకపోవడం, చీటికి మాటికీ చిరాకు పడటం దానికి తోడు మనిషిలో సత్తువ తగ్గి ఉత్సాహం లేకుండా పోతుంది. ఫలితంగా దేనిపై కాన్సంట్రేట్ చేయలేరు. అధిక బరువు (ఒబెసిటీ ) ఒబెసిటీ ఇప్పుడు చాలా మందిలో పెద్ద సమస్యగా తయారయింది. ఇది ప్రత్యేకంగా పెద్దల్లోనే కాదు చిన్నపిల్లల్లోను కనిపిస్తుంది, దీనిని మనం ప్రారంభదశలోనే కంట్రోల్ లో ఉంచుకోకపోతే హార్ట్ డిసీజ్, హైపర్ టెన్షన్, మరియు క్యాన్సర్ వంటి వ్యాధులకు దారి తీస్తుంది. దంత క్షయం దంత క్షయానికి దంతాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం ఒక కారణమైతే, కాల్షియం లేకపోవడం కూడా మరో కారణం. దంత క్షయం తో మొదలై అనేక రకాల దంతాలకు సంబంధించిన ఇబ్బందులు కలుగుతాయి. పొట్టలో ఇబ్బంది మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ తగ్గితే కడుపులోని అవయవాల పై ప్రభావం పడుతుంది. ఫలితంగా మలబద్ధకం, అపెండిసైటిస్, అజీర్తి మరియు శ్వాసకోశవ్యాధులకు దారి తీస్తుంది. కొలెస్ట్రాల్ ఈ రోజుల్లో చాలా మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఇది ఎక్కువగా మనం తీసుకునే మాంసాహారం వల్ల మన శరీరంలో పేరుకుపోయే కొవ్వు కారణంగా వస్తుంది. హై బ్లడ్ ప్రెషర్ హై బ్లడ్ ప్రెషర్ సాధారణంగా శరీరంలో ఉప్పు శాతం పెరిగిపోయినా, లేదా మనం తీసుకునే ఆహారంలో కాల్షియం శాతం తగ్గినా ఎక్కువగా కనిపిస్తుంది. దీనిని అదుపులో ఉంచుకోకపోతే హైపర్ టెన్షన్ కి దారి తీస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎప్పుడో ఒకసారి ఏవో వ్యాధులకు గురవుతూనే ఉంటాం, చికిత్సలు తీసుకుంటూనే ఉంటాం., కానీ పైన చెప్పిన ఆరోగ్య సమస్యలు మాత్రం కేవలం మనం తీసుకునే ఆహారంలో లోపాల వల్లే కలుగుతాయి. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో అన్ని రకాల పోషకాలు సమపాళ్ళలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య పరిరక్షణకు మన ఆహారంలో తప్పనిసరిగా ఉండాల్సినవి: : పాల ఉత్పత్తులు : పాలు, చీజ్, పెరుగు, మరియు ఐస్ క్రీమ్స్ మాంసకృత్తులు : మాంసం, చేపలు, గ్రుడ్లు. గ్రేన్స్ : బ్రెడ్, పాస్తా , ధాన్యం. పండ్లు, కూరగాయలు : జ్యూస్ రూపంలోగాని, వండిన లేదా అదే యధావిధిగా గాని. తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవాల్సినవి: : మనం ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో 20% పాల ఉత్పత్తులు తీసుకుని, తక్కిన 80% ఆహారంలో కూరగాయలు , పండ్లు, మాంసకృత్తులు ఉండేలా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా ఫైబర్ కూరగాయల్లోను, పండ్లలోను పుష్కలంగా ఉంటుంది. ప్రతిరోజూ మూడుపూటలా అన్నం తినాలి. చాలా మంది టైం లేదనో, ఆలస్యంగా లేచామనో, ఏవేవో సాకులతో బ్రేక్ ఫాస్ట్ తినకుండా ఉండిపోతారు. కానీ అలా చేయడం వల్ల ఆలోచనా శక్తి మందగించే ప్రమాదముంది, దానికి తోడు శరీర భాగాలకు సరిపడా శక్తి అందక ఎనీమియాకి దారి తీస్తుంది. అందుకని బ్రేక్ ఫాస్ట్ కంపల్సరిగా తినాలి. మన భోజనంలో కంపల్సరిగా ఏదో రూపంలో, పాలు, కూరగాయలు, పండ్లు ఉండేలా జాగ్రత్తపడాలి. కూరగాయలను, పండ్లను సలాడ్ రూపంలో నైనా సరే కనీసం రెండు సార్లు తీసుకోవాలి. ముఖ్యంగా పిల్లల విషయంలో ఈ పద్ధతులను పాటించడం కాస్త కష్టమైన పనే. చిరుతిళ్ళకు అలవాటు పడి సరిగ్గా భోజనం దగ్గరే పేచీ పడతారు. వారికి చిరుతిళ్ళ విషయంలో ఫ్రూట్ సలాడ్ కానీ స్ప్రౌట్స్ కానీ బ్రెడ్, జాం లాంటివి అలవాటు చేయండి. ముఖ్యంగా భోజనానికి రెండు గంటలు ముందుగా ఎటువంటి స్నాక్స్ పెట్టొద్దు. మనం తీసుకునే ఆహారంలో వీలైనంతగా కొవ్వు పదార్థాలు లేకుండా చూసుకోవాలి. . కొవ్వు పదార్థాలను తగ్గించడం అంటే పాల ఉత్పత్తులను, మాంస కృత్తులను కాస్త తక్కువ మోతాదులో తీసుకోవడం. రోజులో రెండు పూటలకు మించి తినకూడదు. మాంసం వండే ముందు స్కిన్ లెస్ ఉండేలా చూసుకోవడం మంచిది, తద్వారా కొవ్వును కాస్త అవాయిడ్ చేసుకోవచ్చు. రెండు పూటలకు మించి పాలను తాగరాదు. అలాగని కొవ్వు పేరుకుపోతుందన్న భయంతో పూర్తిగా మాంసకృత్తులకు,పాల పదార్థాలకు దూరంగా ఉండకూడదు. సరియైన మోతాదులో తీసుకుంటే శ్రేయస్కరం. ఎనీమియా రాకుండా జాగ్రత్తలు శరీరంలో ఐరన్ కొరత ఉన్నప్పుడే ఎనీమియా ఏర్పడుతుంది. మనం తీసుకునే ఆహారంలో తప్పకుండా ఐరన్ ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలి. దానికన్నా ముందు ఏ ఆహారంలో ఐరన్ పాళ్ళు ఎక్కువగా ఉంటాయో ముందుగా తెలుసుకోవాలి. రెడ్ మీట్స్, చేపలు, పౌల్ట్రి మంచివి. ఆహారంలో రోజుకి ఒకసారైనా ఇవి తీసుకుంటే శరీరానికి కావలసిన ఐరన్ దొరికినట్టే. అందునా లివర్ ఐరన్ పుష్టిగా ఉన్న ఆహారం. కాకపొతే కొలెస్ట్రాల్ చాలా ఎక్కువగా ఉంటుంది. శాకాహారులు ఆకుకూరలు విరివిగా తినడం, కందగడ్డ, పీనట్ బటర్, ఎండు ద్రాక్ష, నల్ల ద్రాక్ష, తాజా కూరగాయలు ఆహారంలో తప్పకుండా ఉండేలా జాగ్రత్త పడాలి. వీలైనంత ఉప్పు వాడకాన్ని తగ్గించాలి . సాధారణంగా హైపర్ టెన్షన్ ఉన్న వారు తప్ప తక్కిన వారు ఉప్పును నిర్భయంగా వాడవచ్చు. కానీ అవకాశం ఉన్నప్పుడల్లా కాస్త అవాయిడ్ చేయడం ఆరోగ్యానికి మంచిది. చక్కర మోతాదును తగ్గించడం మంచిది. తీపి తినడం ఆరోగ్యానికి హానికరమేమీ కాదు. కాకపోతే మనలో చాలా మంది తీపి వస్తువులను అస్తమానం తింటూనే ఉంటారు. అది మంచిది కాదు ఎందుకంటే అస్తమానం తీపి పదార్థాలను తినడం వల్ల కొరోనరీ ఆర్టరీ డిసీజ్ లేదా క్యాన్సర్ కి దారి తీసే అవకాశాలు ఉన్నాయి. వ్యాయామానికి ముందు తీసుకోవాల్సిన ఆహారం వ్యాయామానికి ముందు మాంసాహారం మంచిది కాదు, రెండు మూడు గంటలకు ముందుగా కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉన్న ఆహారం తీసుకుంటే మంచిది. ఈ కార్బోహైడ్రేట్లు బ్రెడ్, నూడుల్స్, ఆలుగడ్డ, మరియు రైస్ లో ఉంటాయి. ఆహారం తీసుకున్న రెండు గంటల తర్వాత వ్యాయామం చేయడం మంచిది. ప్రతి 20 నుండి 30 నిమిషాలకొకసారి నీళ్ళు తాగుతుండటం ఉత్తమం.
డైట్ కేర్ ఆహారం విషయంలో మనం ఉండాల్సినంత జాగ్రత్తగా ఉంటున్నామో లేదో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఎత్తుకు తగ్గ బరువుతో బలంగా, శక్తిగా ఉన్నామో లేదో చూసుకోవాలి. బరువు ఎక్కువై, ఊబకాయం తెచ్చుకుంటే ఎంత కష్టమో, తక్కువై బలహీనంగా ఉన్నా అంతే కష్టం. కనుక సమతుల్యతను కాపాడుకోవాలి. ఆహారంలో ఉండే పోషకాలు శక్తిని విడుదల చేస్తాయి. ఏదైనా అనారోగ్యంతో బాధపడుతుంటేనో, లేక హార్మోన్ల అపసవ్యత చోటుచేసుకుంటేనో తప్పించి సాధారణంగా మనం తీసుకున్న ఆహారాన్ని బట్టి బరువులో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఆహార నియమాలను పాటించాలి. తీసుకున్న ఆహారం సవ్యంగా జీర్ణమయ్యేందుకు కొంత వ్యాయామం తప్పనిసరి. లేకుంటే బరువు విపరీతంగా పెరిగిపోతుంటుంది. కొవ్వు నిల్వలు చేరతాయి. శరీరానికి అవసరమైన శక్తి సరిగా విడుదల కాదు. దాంతో బరువు తగ్గించుకోడానికి నానా యాతనా పడాలి. అవసరమైన కంటే ఎక్కువ ఆహారం ఎలా మంచిది కాదో, తక్కువ తినడమూ శ్రేయస్కరం కాదు. శరీరం శుష్కించుకు పోయి, నీరసం ముంచుకొస్తుంటుంది. ఏ పనిమీదా శ్రద్ధాసక్తులు ఉండవు. ఈ దశ ముదిరితే అసలు జీవితం మీదే ఆసక్తి నశిస్తుంది. కనుక ఏవిధంగా చూసినా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకునేందుకు ప్రణాళిక వేసుకోవాలి. మనలో చాలామంది చేసే తప్పు ఏమిటంటే, ఆహారం రుచిగా ఉంటె సరిపోతుంది అనుకుంటాం. కానీ ఆహారం శుచిగా ఉండటం అంతకంటే ముఖ్యం. పరిశుభ్రంగా లేని పదార్ధాల వల్ల లేనిపోని జబ్బులొస్తాయి. అలాగే నిలవున్న పదార్ధాలు విషతుల్యం అయ్యి, ఫుడ్ పాయిజన్ గా మారే ప్రమాదం ఉంది. ఇక ముఖ్యమైన అంశం ఆహారంలో పోషక విలువలు ఉండాలి. కింది కనీస జాగ్రత్తలు పాటించాలి. 1. ప్రోటీన్లు ఉండే ఆహారం తీసుకోవడంవల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్సు అందుతాయి. 2. వీలైనంతవరకు ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోకపోవడం మంచిది. 3. రుచికి, చూపులకు బాగుంటుంది కదాని పోలిష్ పట్టిన తెల్లటి బియ్యాన్ని వాడతాం. కానీ దంపుడు బియ్యపు అన్నం ఎంతో శ్రేష్టం. 4. అన్నం కంటే ఎక్కువగా కూరలను తినడం మంచిది. 5.ఆయా సీజన్లలో దొరికే పండ్లను సేవిస్తుండాలి. 6. నీళ్ళు బాగా తాగాలి. రోజుకు నాలుగు లీటర్లకు తక్కువ కాకుండా తాగితే మంచిది. 7. ఎక్కువ నీళ్ళు తాగి, తరచుగా యూరిన్ పాస్ చేయడంవల్ల శరీరంలో చోటు చేసుకున్న మలినాలు చాలావరకూ వెళ్ళిపోతాయి. 8. ఆహారం ఎక్కువ మొత్తంలో ఒకేసారి తీసుకోవడం కంటే కొంచెం మోతాదులో ఎక్కువసార్లు తినడం మంచిది. 9. తిన్న ఆహారం సక్రమంగా జీర్ణమయ్యేందుకు తగిన వ్యాయామం చేయాలి. 10. ఉదయం, సాయంత్రం వాకింగ్ చేస్తే దాన్ని మించిన ఆరోగ్య రహస్యం ఇంకొకటి లేదు. ఈమాత్రం కనీస సూత్రాలు పాటించి ఆరోగ్యాన్ని సంరక్షించుకుందాం.
ఆహారంలో ఆమ్లా Amla in food మనం తినే ఆహారాన్ని బట్టి ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్స్ లాంటివి జబ్బులపాలు చేస్తాయి. పోషక విలువలు లేని ఆహారం తిన్నందువల్ల ప్రయోజనం ఉండదు. కొన్నికొన్ని పదార్థాలు మంచి పోషకాలతో శక్తిని చేకూరుస్తాయి. మరికొన్ని పదార్థాల్లో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. అలాంటివాటిని తప్పక తినాలి. ఉసిరికాయల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. కనుక ఉసిరికాయలు తినడం అవసరం. దానివల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసుకుందాం. * శరీరంలో ఉండే వేడిని తగ్గించి చల్లబరుస్తుంది. * కాన్స్టిపేషన్ సమస్య ఉంటే తగ్గుతుంది. * సి విటమిన్ అధికంగా ఉన్న ఉసిరికాయలు ఐరన్ , ఇంకా ఇతర ఖనిజాలను శరీరం గ్రహించేలా చేస్తాయి. * అజీర్ణం, కిడ్నీ సమస్యల్లాంటివి ఉసిరితో తగ్గుతాయి. * మధుమేహ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. * ఎర్ర రక్తకణాలు పెరిగేందుకు ఉసిరి తోడ్పడుతుంది. * ఆమ్లాలో రోగ నిరోధక శక్తి పుష్కలంగా ఉంటుంది. * ఆకలి మందగించడం, నోరు సహించకపోవడం లాంటివి తిగ్గుతాయి. * ఉసిరితో కంటిచూపు మెరుగవుతుంది. * ఉసిరికాయలు తిన్నా, ఆమ్లా ఆయిల్ వాడినా జుట్టు రాలదు. బాగా పెరుగుతుంది కూడా. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. ఇన్ని లాభాలు ఉన్నాయి కనుక ఉసిరికాయల సీజన్లో వాటిని సంపాదించి ఏదో ఒక రూపంలో సేవిద్దాం.
అందాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చే డ్రై ఫ్రూట్స్ Health and Beauty with Dry Fruits మనలో చాలామంది ఆకలి తీర్చుకోడానికి ఏదో ఒకటి తింటాం. అంతేతప్ప మనం తీసుకున్న ఆహారంలో ఎన్ని కాలరీలు ఉన్నాయి, ఎంత ఆరోగ్యకరంగా ఉంది, శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుందా, మానసికంగా ఏమైనా మేలు చేస్తుందా లాంటివి బొత్తిగా ఆలోచించం. కొందరు ఆహారం విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటారు. అందుకు తగ్గట్టు వాళ్ళు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు. కనుక ఆకలి తీరితే సరిపోతుంది అనుకోకుండా ఎం తింటున్నాం, ఎంత పరిమాణంలో తింటున్నాం అనేది కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఇప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ ఎలా, ఎంత పరిమాణంలో తినాలో, వాటివల్ల ప్రయోజనం ఏమిటో తెలుసుకుందాం. ఖర్జూరం , అత్తి పండు , సీమబాదం అత్తిపండు, సీమబాదం డ్రైఫ్రూట్స్ చాలా మేలైనవి. వీటిల్లో ఏదో ఒకదాన్ని క్రమం తప్పకుండా ప్రతిరోజూ తీసుకోవాలి. వీటిలో ఐరన్, ఫైబర్, విటమిన్ ‘ఎ’, విటమిన్ ‘సి’ ఉన్నాయి. కంటి చూపును మెరుగుపరుస్తాయి. వీటిని కడిగి నీళ్ళలో నానబెట్టండి. మర్నాడు ఉదయాన ఆ నీళ్ళు తాగండి.. ఒకసారి ఒక రకం సరిపోతుంది. ప్రతిదీ టానిక్ లా పనిచేస్తుంది. బాదం బాదంలో పోషక విలువలు చాలా ఎక్కువ. కనుక రోజుకు ఐదు, ఆరు బాదం పప్పులు తినండి. విడిగానే కాదు, ఏ రూపంలో అయినా తినొచ్చు. బాదం పైపొరలో వగరు ఉన్నప్పటికీ దానిలో ఉండే ఫ్యాట్ అన్ స్యాచురేటెడ్ కావడంతో అది కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఎంతో సహాయకారిగా ఉంటుంది. బాదంలో ఉండే కాపర్ పరిమాణం ఎనీమియాను పోగొడుతుంది. బాదంవల్ల ముఖానికి గ్లో వచ్చి సౌందర్యం ఇనుమడిస్తుంది.
లెంటిల్ డిష్ రెసిపీస్ -- బెస్ట్ డైట్ లెంటిల్ డిష్ రెసిపీస్ బెస్ట్ డైట్ అని చాలామందికి తెలీదు. నాన్ వెజ్ తినేవాళ్ళు సాధారణంగా ఇతర కూరగాయలు, లెంటిల్ డిష్ రెసిపీస్ (పప్పు ధాన్యాలు) ఇష్టపడరు. పైగా "అబ్బే వాటిల్లో ఏముంటుంది, గడ్డి?" అని చులకన చేసి మాట్లాడతారు. నిజానికి మాంసాహారం కంటే కూరగాయలు, లెంటిల్ డిష్ రెసిపీస్ ఉత్తమం అని చెప్తున్నారు పోషకాహార నిపుణులు. కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు ఏదైనా కావచ్చు... లెంటిల్ డిష్ రెసిపీస్ ప్రొటీన్లు, ఫైబర్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. కనుక ప్రతిరోజు లెంటిల్స్ ను ఏదో ఒక రూపంలో తీసుకోవాలి. భోజనంలో రోజూ ఒక కప్పు పప్పు ఉండేట్టు చూసుకోండి. పప్పుల్ని ఉడకబెట్టి, పకోడీలుగా చేసుకుని, కూరగా వండుకుని, లేదా కిచిడీ చేసుకుని తినవచ్చు. లెంటిల్స్ వేయించడం కంటే ఉడకబెట్టి తినడం మంచిది. అలా కూడా కాకుండా నీళ్ళల్లో నానబెట్టి మొలకలు వచ్చాక తింటే ఇంకా ఉత్తమం. అందువల్ల పోషకవిలువలు నశించవు. వీటిల్లో సమృద్ధిగా ఉండే మాంసకృత్తులు, కాల్షియమ్, ఫైబర్ శరీరానికి చక్కగా అందుతాయి. పెసలు, శనగలు లాంటి పప్పు ధాన్యాల మొలకల్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. తేలికగా అరుగుతాయి. మొలకెత్తిన గింజల్లో సన్నగా తరిగిన కీరా, కారెట్, టొమాటో ముక్కలు, అరటి ముక్కలు, వేసి, చాట్ మసాలా చల్లండి. కొద్దిగా నిమ్మరసం పిండి చూడండి. ఆహా ఏమి రుచి అనుకోక మానరు. తీపిదనం ఇష్టపడేవారు ఇందులో దానిమ్మ గింజలు, కిస్ మిస్ ముక్కలు, అంజీరా ముక్కలు వేసుకోవచ్చు. ఇది మరింత పుష్టికరం.
How to Lose Belly Fat Tips However, even a thin layer of loose belly fat can be hard to shift. If you are looking for advice on how to lose stomach fat then following these tips and tricks. * Water Indeed you might think that water is in itself extremely important in our life. However it seems that professionals just can emphasize enough its miraculous effect in flushing out the excessive fat from our organism. The stomach is one of the areas that is more prone to water-retention, therefore it might leave you with the necessary hydration when neglecting the normal water intake. As one of the most important diuretic ingredients it will have the ability to eliminate the excessive fluids as well as toxins from the body. The daily intake should be at least 8 glasses or more, in order to secure the proper functioning of the main body and digestive systems. * Apple Cider Vinegar It might sound funny that a similar common ingredient is able to help us reduce belly fat. However it seems that more and more professionals decipher the miraculous effect of this element in nutrition. Therefore besides the other disorders treated with apple cider include the belly fat loss also in the prominent list. Due to the magical digestive abilities vinegar will be able to both tame our appetite as well as boost our metabolism. Whether you use it in various dishes or create a simple drink of 1 large glass of water and 2 tsp of apple cider vinegar and you drink it on a daily basis for at least a few weeks you'll notice the fabulous effect of this ingredient in your healthy diet. Moreover it is also extremely useful to drink this mixture before every meal in order to facilitate the organism the best digestion.