బాబోయ్.. బన్నీ అంత త్యాగం చేశాడా ?
on May 26, 2017
అల్లు అర్జున్ కు మాంసహారం అంటే మహా ప్రీతి. తన ఫుడ్ గురించి మాట్లాడే సందర్భల్లో 'భోజనంలో నాన్ వెజ్ వుండాల్సిందేనండీ''అని చెబుతుంటాడు బన్నీ. అయితే అలాంటి బన్నీ ఇప్పుడు నాన్ వెజ్ ను పక్కన పెట్టేశాడట. ఇదంతా డిజే కోసమే .
అల్లు అర్జున్ హరీశ్‌శంకర్ కలయికలో రూపొందుతున్న చిత్రం ‘డీజే.. దువ్వాడ జగన్నాథమ్’. ఈ చిత్రంలో అల్లు అర్జున్ వంట బ్రాహ్మణుడి పాత్రలో కనిపిస్తున్నాడు. బ్రాహ్మణుడి పాత్రలో నేచురల్ గా కన్పించేందుకు బన్నీ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడట. ఈ ప్రాతలో లీనమై మరింత సమర్థంగా నటించేందుకు తనకు ఇష్టమైన నాన్ వెజ్ పక్కన పెట్టేశాడట. బ్రాహ్మణులు పాటించే పద్ధతులను పాటించడం ద్వారా ఆ పాత్ర తెరపై అత్యంత సహజంగా కనపడేలా వీలుంటుందనని భావించిన బన్నీ ఈమేరకు నాన్ వెజ్ ను త్యాగం చేసేశాడట. బన్నీ తీసుకున్న నిర్ణయంపై ఇంట్లో అంతా సర్ ప్రైజ్ అయిపోయారని చెప్పుకుంటున్నారు.
దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రమిది. దేశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వచ్చేనెల 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
