ట్రంప్ ఇంట్లో నితిన్..!
on May 27, 2017

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాపార సామ్రాజ్యానికి వేదిక..అమెరికాలోని అతిపెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ అయిన ట్రంప్ టవర్లో తెలుగు యంగ్ హీరో నితిన్ హల్ చల్ చేశాడు. అసలు మ్యాటర్ ఏంటంటే..హనురాఘవపూడి దర్శకత్వంలో నితిన్ " లై " అనే సినిమా చేస్తున్నాడు. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రయూనిట్ తదుపరి షెడ్యూల్ కోసం అమెరికా వెళ్లింది. ప్రస్తుతం చికాగోలోని ట్రంప్ టవర్లో షూటింగ్ జరుగుతోంది. ప్రధాన పాత్రధారులపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అనిల్ సుంకర నిర్మిస్తోన్న ఈ సినిమాలో నితిన్ సరసన మేఘా ఆకాశ్ హీరోయిన్‌గా నటిస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



