వర్మతో వర్కవుట్ అవ్వక వేశ్యగా మారింది!
on Jul 29, 2016
రాంగోపాల్ వర్మ సంచలన దర్శకుడిగానే కాక మాంచి రసిక పురుషుడిగానూ అందరికీ తెలుసు. తన సినిమాలోని హీరోయిన్లను మదనమోహీనులుగా శృంగార దేవతలుగా వెండితెరపై ఆవిష్కృతం చేయడంలో వర్మది ప్రత్యేకమైన శైలి. అందుకే అతడి సినిమాలు ఫ్లాపైనా ఆ సినిమాల ద్వారా పరిచయమైన హీరోయిన్లు మాత్రం వరుస ఆఫర్లతో తారాపధంలో దూసుకుపోతుంటారు. కానీ.. ఏం పాపం చేసుకుందో తెలియదు కానీ.. వర్మ దర్శకత్వంలో వచ్చిన "సత్య2, 365 డేస్" సినిమాల్లో హీరోయిన్ గా నటించిన అనైక సోటిని మాత్రం పట్టించుకొనే దర్శకానాధడే లేకపోయాడు.
ఎక్స్ పోజింగ్ విషయంలో ఏమాత్రం మొహమాటపడని అనైక మునుపటి చిత్రాల్లో గ్లామర్ డోస్ ను కాస్త దిట్టంగానే దట్టించింది. అయితే.. సినిమాలు సూపర్ ఫ్లాప్ అవ్వడంతో.. ఆమె ఆరబోసిన అందాలు అడవి కాచిన వెన్నెల్లా నీరుగారిపోయాయి. దాంతో ఇప్పుడు అమ్మడు హీరోయిన్ గా మానేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తమిళంలో నటించడానికి ఒప్పుకొంది. బద్రి వెంకటేష్ అనే కొత్తబ్బాయి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో అనైకా వేశ్య పాత్రలో కనిపించనుందట. సగటు యువతిగా నటించిన మునుపటి చిత్రాల్లోనే జనాలు నోరెళ్ళబెట్టుకొనే రేంజ్ లో రెచ్చిపోయిన అనైక ఇప్పుడు వేశ్యగా ఇంకెంతగా రెచ్చిపోతుందో, రెచ్చగొడుతుందో చూడాలి!