కాజల్ కోసం క్యూ కడుతున్నారు!
on Jul 30, 2016
కాజల్ కి శుక్రమహర్ధశ పట్టినట్లుంది. ఆమె నటించిన మూడు సినిమాలూ డిజాస్టర్లు అయినప్పటికీ.. ఆ రిజల్ట్స్ తో సంబంధం లేకుండా మళ్ళీ వరుసగా భారీ చిత్రాల్లో అవకాశాలు అందుకోంటోంది. కెరీర్ ఎండ్ అయిపోయింది అనుకొన్న టైమ్ లో "సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం" చిత్రాల్లో హీరోయిన్ గా నటించే అవకాశం సొంతం చేసుకొని విమర్శకులకు షాక్ ఇచ్చింది. ఇప్పుడు ఆ సినిమాలు డిజాస్టర్లు అయినా సరే తమిళంలో జీవా సరసన ఒక చిత్రం, విశాల్ సరసన మరో చిత్రం సైన్ చేసిన కాజల్.. తెలుగులో రెండు క్రేజీ ప్రోజెక్ట్స్ దక్కించుకొంది.
మెగాస్టార్ రీఎంట్రీ చిత్రమైన మెగా150వ చిత్రం "ఖైదీ నెం.150" (వర్కింగ్ టైటిల్) లో హీరోయిన్ గా నటించే సువర్ణావకాశం సొంతం చేసుకోవడంతోపాటు.. విపరీతమైన పాజిటివ్ టాక్ ఉన్న ఎన్టీయార్ "జనతా గ్యారేజ్" చిత్రంలోనూ ఓ స్పెషల్ సాంగ్ లో ఎన్టీయార్ తో కలిసి స్టెప్పులేసే ఛాన్స్ దక్కించుకొంది. ఇది కాకుండా తమిళంలో సూపర్ స్టార్ అజిత్ తో ఆడిపాడనుంది. చూస్తుంటే.. కాజల్ కి హిట్, ఫ్లాప్ అనే దానితో సంబంధం లేనట్లుగా ఉంది. మిత్రవిందా మజాకా!

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
