రామోజీని బాగా వాడేస్తున్న రాజమౌళి
on Jul 1, 2015
బాహుబలిలో ఈనాడు గ్రూపు సంస్థల అధిపతి రామోజీరావు వాటా కూడా ఉందన్నది బహిరంగ రహస్యమే. `ఈనాడు` ప్రారంభమైనప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఏ సినిమాకీ ఇవ్వనంత ప్రమోషన్ `బాహుబలి`కి ఇస్తుండాన్ని చూస్తుంటే.. ఆ సంగతి ఎవ్వరికైనా అర్థమైపోతుంది. బాహుబలికి సంబంధించిన ఏ చిన్న విషయాన్నీ `ఈనాడు` వదలడం లేదు. ప్రతిరోజూ ఏదో ఓ కథనంతో `బాహుబలి`ని ఆకాశాన్ని ఎత్తేయడానికి తనవంతు కృషి చేస్తోంది. రామోజీరావుని ఈ సినిమాలో భాగస్వామిగా చేయడం వెనుక... రాజమౌళి వేసిన స్కెచ్ ఇది అనుకొంటే పొరపాటే. జక్కన్న అంతకంటే పెద్ద స్కెచ్ వేశాడని టాలీవుడ్ టాక్.
బాహుబలి లాంటి సినిమా రామోజీ ఫిల్మ్‌సిటీలోనే తీయడం సాధ్యపడుతుంది. పైగా ఒకటా రెండా...? దాదాపు మూడేళ్ల ప్రాజెక్టు. అక్కడ భారీ సెట్లు వేయాలి. ఇఫ్రాస్టక్చర్ చాలా కావాలి. దాదాపుగా సగం బడ్జెట్ ఈ సెట్టింగులు, ఫిల్మ్‌సిటీ అద్దెలకే సరిపోతాయి. అక్కడే రాజమౌళి భారీ స్కెచ్ వేశాడు. రామోజీరావుని పార్టనర్ చేసి అతని ఖాతాలో... సెట్టింగులు ఖర్చు వేసేశాడు. అంటే ఫిల్మ్‌సిటీలో వేసే ఏ సెట్టుకీ... డబ్బులు కట్టక్కర్లేదన్నమాట. అది.. రామోజీరావు వాటా కిందకు వచ్చేస్తుంది. సో... `బాహుబలి` సినిమాకి అత్యంత భారమైన సెట్టింగుల ఖర్చు ఇలా తగ్గించుకొన్నాడు. ఇంతా పోజేస్తే.. ఈ సినిమా రామోజీ వాటా 20 శాతానికి మించి లేదని టాక్.
ఎప్పుడైతే ఈ సినిమాలో వాటా దక్కిందో... అప్పటి నుంచీ ఈ సినిమాని సొంత సినిమాకంటే మిన్నగా ప్రమోట్ చేస్తూ వస్తోంది ఈనాడు. నెలరోజుల క్రిందటి నుంచే బాహుబలి ప్రమోషన్లను మొదలెట్టేసింది. రాజమౌళి ఇంటర్వ్యూకి ఫుల్ పేజీ కేటాయించి అందరికీ షాక్ ఇచ్చింది. ఎందుకంటే... ఈనాడు చరిత్రలో ఫుల్ పేజీ ఇంటర్వ్యూ దక్కింది ఒక్క రాజమౌళికి మాత్రమే. ఇక మీదటా.. ఈనాడులో ఇలానే ఫుల్ పేజీ ఇంటర్వ్యూలు దర్శనమిచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. మొత్తానికి రామోజీని అడ్డుపెట్టుకొని సెట్టింగుల ఖర్చు తగ్గించుకొన్న జక్కన్న.. ఇటు ఈనాడుని అడ్గుపెట్టుకొని ఎడాపెడా ప్రమోషన్లూ చేయించుకొంటున్నాడు. బుర్రంటే అలా ఉండాలి.