బాహుబలి కోసం.. 5వేల థియేటర్లు
on Jul 1, 2015
సరికొత్త చరిత్ర దిశగా బాహుబలి అడుగులు వేస్తోంది. విడుదలకు ముందే అన్ని రికార్డులనూ తన పేర లిఖించుకోవడానికి ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే... బడ్జెట్ విషయంలో బాహుబలి సరికొత్త రికార్డులు సృష్టించింది. రూ.250 కోట్ల సినిమా అంటూ.. అందరూ బాహుబలిని కీర్తిస్తున్నారు. మరి ఇంత భారీ బడ్జెట్ సినిమాని ఎక్కువ మందికి చేరువ కావాలి కదా. అందుకే విడుదల విషయంలోనూ చిత్రబృందం కనీవినీ ఏర్పాట్లు చేస్తున్నట్టు టాక్.
బాహుబలిని ప్రపంచ వ్యాప్తంగా 5000 థియేటర్లలో విడుదల చేయడానికి ఆర్కా మీడియా ప్లాన్ చేస్తోంది. ఆంధ్ర, తెలంగాణా రాష్ట్ర్రాల్లోనే దాదాపుగా 1900 థియేటర్లలో బాహుబలిని ప్రదర్శిస్తారు. బాలీవుడ్‌తో పాటు... అన్ని రాష్ట్ర్రాల్లోనూ, విదేశాల్లోనూ మొత్తంగా 3వేల థియేటర్లలో విడుదల చేస్తారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయని టాక్.
మొత్తంగా తొలి మూడు రోజుల్లోనే వంద కోట్లు వసూలు చేయడానికి బాహుబలి టీమ్ పక్కా ప్రణాళికలు వేసుకొంది. మరి రాజమౌళి ప్లాన్ ఎంత వరకూ వర్కవుట్ అవుతుందో తెలియాలంటే ఇంకో పది రోజులు ఆగితే సరిపోతుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
