పట్టిసీమ పైప్ లైన్ లీక్

పశ్చిమగోదావరి, కృష్ణాజిల్లా రైతులకు  సాగునీరు, తాగునీటికి ఊరటనిచ్చే  పట్టిసీమ ఎత్తిపోతలతో పథకాన్ని గత అయిదేళ్లుగా ప్రభుత్వం పక్కన పెట్టివేసింది. గత ఏడాది తాగునీటి ఎద్దడిని తట్టుకోలేక  కొద్ది రోజులు పట్టిసీమను  వినియోగించి ప్రభుత్వం మమ అనిపించింది.  ఈ ఏడాది నాగార్జున  ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరటంతో .. కృష్ణా, గుంటూరు జిల్లాలు  తాగునీటి కోసం తల్లడిల్లిపోతున్నాయి. కనీసం కృష్ణాజిల్లా  రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో   పట్టిసీమ మోటార్లతో  నీటి తరలింపు ప్రారంభించారు. ఏలూరు జిల్లా పోలవరం  మండలం విక్కిసిరావుపేట వద్ద శుక్రవారం ఉదయం పట్టిసీమ  పైప్ లైన్ పగిలిపోయింది. ఎయిర్ వాల్ లీక్  ఘటనతో  20 అడుగులు ఎత్తులో  నీళ్లు ఎగిసి పడుతున్నాయి. పట్టిసీమ ఎత్తిపోతల నుంచి పైప్ లైన్ ద్వారా కుడి కాల్వలోకి నీళ్లు వెళ్లే మార్గంలో పైప్ లైన్ ధ్వంసమైంది. జగన్ సర్కార్ నాలుగేళ్లుగా పట్టిసీమను నిర్లక్ష్యం చేసి వినియోగించకుండా వదిలేయడం వల్లే ఈ ఘటన జరిగిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైప్ లైన్ లీక్ తో   గోదావరి జలాలు పంట పొలాలను ముంచెత్తుతున్నాయి.  గోదావరి నది నుంచి పోలవరం కుడి కాల్వ వరకు డెలివరీ ఛానల్‌ ఏర్పాటు చేశారు. రెండు రోజుల కిందట  మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి 2,800 క్యూసెక్కుల గోదావరి జలాలు పోలవరం ప్రాజెక్టు కుడి కాలవకు  విడుదల చేశారు.   పట్టిసీమ వద్ద గోదావరి నీటిమట్టం 14.74 మీటర్లకు పైబడి ఉండడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 8 పంపులు 8 మోటార్ల ద్వారా నీటి పంపిణీ చేశారు. ఈ క్రమంలోనే పైప్‌లైన్ లీకేజీ జరిగింది. ఇటుకల కోట డెలివరీ ఛానల్‌కు వెళ్లే పైపు లైన్ వాల్ ప్లేట్ ఊడిపోయింది.      పైప్ లైన్ లీకేజీతో తమ పొలాలు మునిగిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు నీటి లీకేజీ అరికట్టాలని కోరుతున్నారు. మరోవైపు పైప్‌లైన్ పగిలిపోయిన ప్రాంతానికి వెళ్లే మార్గం కూడా మూసుకుపోయింది. చెట్లు, పొదలతో నిండిపోయిన ప్రాంతానికి చేరాలంటే జంగిల్ క్లియర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మోటార్లను నిలుపుదల చేస్తే తప్ప ఏ లైన్ పగిలిందో గుర్తించలేని పరిస్థితి ఉంది. దీంతో జలవనరుల శాఖ అధికారులు పైప్‌లైన్లలో ఏ మేరకు నష్టం జరిగిందో గుర్తించే పనిలో పడ్డారు.  అటు, ఈ ఘటనపై స్పందించిన మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత జలవనరుల శాఖ ఇంజినీర్‌లతో నిమ్మల ఫోన్‌లో మాట్లాడారు. వెంటనే లీకేజిని అరికట్టాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాలతో లీకేజీ నివారించే చర్యలను అధికారులు చేపట్టారు. నీటి విడుదలను తాత్కాలికంగా నిలిపి జలవనరుల శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు.  
Publish Date: Jul 5, 2024 6:21PM

కాంగ్రెస్ లోకి విజయమ్మ అడుగు.. జగన్ నెత్తిన పిడుగు

ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఎప్పుడైనా త‌ప్పద‌న్నా..  చేసిన పాపాలకు  అస‌లు వ‌డ్డీతో టి సిస‌లుగా ఫ‌లితంబు అనుభ‌వించుట త‌ధ్య‌మ‌న్నా.. అంటూ సీనియ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన ఓ సినిమాలో ఓ పాట ఉంది.  జీవితంలో మ‌నంచేసే మంచి చెడుల‌కు ఫ‌లితాలు త‌ప్ప‌కుండా అనుభ‌వించాల్సి వ‌స్తుంద‌ని  దీని సారాంశం.   ఈ పాట మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి  అతికినట్లు సరిపోతుంది. అధికారంలో కొన‌సాగిన ఐదేళ్లూ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. త‌న మాట‌కు అడ్డుచెప్పిన వారిని చిత్ర‌హింస‌ల‌కు గురిచేసి రాక్ష‌సానందం పొందారు. ఈ కోవ‌లో ప్ర‌తిప‌క్ష పార్టీల్లోని నేత‌లే కాదు.. సొంత పార్టీలోని కొంద‌రు నేత‌లు సైతం జ‌గన్ బాధితులుగా మారిపోయారు. వీరితో పాటు సొంత తల్లి, చెల్లిని సైతం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అమానించారు. ఫ‌లితంగా సొంత చెల్లి, త‌ల్లిసైతం జ‌గ‌న్ పార్టీకి దూరంగా వెళ్లిపోయారు. త‌ప్పుల‌కు త‌ప్ప‌నిస‌రిగా దండ‌న ఉంటుంద‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం. ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మితో దెబ్బ‌తిన్న జ‌గ‌న్‌కు.. వ‌రుస‌గా షాక్‌ల మీద షాక్‌లు త‌గులుతున్నాయి. 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారంలోకి రావ‌టానికి వైఎస్ ష‌ర్మిల‌, విజ‌య‌మ్మ కూడా ఓ కార‌ణం. అదే స‌మ‌యంలో 2024 ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోర ఓట‌మికి కూడా వారిద్ద‌రూ ఓ కార‌ణం అని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. ఎన్నిక‌ల‌కు కొద్ది నెల‌ల ముందు ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టిన ష‌ర్మిల‌.. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి టార్గెట్ గా త‌న రాజ‌కీయ అడుగులు వేశారు. ష‌ర్మిల‌కు మ‌ద్ద‌తుగా విజ‌య‌మ్మ‌ నిలిచారు. అధికారంలో ఉన్న‌న్ని రోజులూ త‌ల్లి, చెల్లి విలువ‌ను గుర్తించ‌లేని జ‌గ‌న్‌.. ఇప్పుడు వారిని మ‌చ్చిక చేసుకునేందుకు పావులు క‌దుపుతున్న‌ట్లు తెలుస్తోంది. అయితే, ఏపీలో కాంగ్రెస్ పార్టీని బ‌లోపేతం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకెళ్తున్న వైఎస్ ష‌ర్మిల జ‌గ‌న్ ద‌రిదాపుల్లోకి వెళ్లేందుకు  ఇష్ట‌ప‌డ‌టం లేదు. ఇటీవ‌ల స‌యోధ్య‌ కోసం జ‌గ‌న్ మ‌ద్ద‌తుదారులు ప్ర‌య‌త్నించ‌గా.. ష‌ర్మిల ఛీకొట్టిన‌ట్లు స‌మాచారం. దీనికి తోడు ష‌ర్మిల మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. జులై 8వ తేదీన దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌యంతి. ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వాడ వేదికగా  కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ష‌ర్మిల నిర్ణయించారు. ఈ కార్య‌క్ర‌మానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి నేత‌ల‌తోపాటు, తెలుగు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నేత‌ల‌ను స్వ‌యంగా వెళ్లి  మరీ ష‌ర్మిల ఆహ్వానించారు. ష‌ర్మిల నిర్వ‌హించే వైఎస్ఆర్ జ‌యంతి కార్య‌క్ర‌మం స‌క్సెస్ అయితే వైసీపీ మ‌నుగ‌డ‌కే ప్ర‌మాద‌మ‌ని ఆ పార్టీ నేత‌లు ఆందోళ‌న చెందుతున్నారు. దీనికి తోడు గ‌త ఐదేళ్ల కాలంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సీఎంగా త‌న తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి త‌ర‌హాలో పాల‌న అందించ‌లేకపోయాడు. దీంతో వైఎస్ఆర్ అభిమానులుసైతం జ‌గ‌న్ పై ఆగ్ర‌హంతో ఉన్నారు. ప్ర‌స్తుతం ఏపీలో వైసీపీ పాల‌న మ‌ళ్లీ రావాలంటే కాంగ్రెస్ తోనే సాధ్య‌మ‌ని వైఎస్ జ‌యంతి కార్య‌క్ర‌మం వేదిక‌గా ష‌ర్మిల ఏపీ ప్ర‌జ‌ల‌కు బ‌లంగా చెప్ప‌బోతున్నారు. ప్ర‌జ‌లు ష‌ర్మిల మాట‌ల‌ను విశ్వ‌సిస్తే.. జ‌గ‌న్ పార్టీ మ‌నుగ‌డ  క‌ష్ట‌మేన‌న్న వాద‌న ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ష‌ర్మిల దూకుడుకు త‌ల ప‌ట్టుకుంటున్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, వైసీపీ నేత‌ల‌ నెత్తిన మ‌రో పిడుగు పడింది.  ష‌ర్మిల నిర్వ‌హించే కార్య‌క్ర‌మంలో వైఎస్ఆర్ స‌తీమ‌ణి విజ‌య‌మ్మ పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. తద్వారా తాను వైసీపీకి కాదు కాంగ్రెస్ కే మద్దతు పలుకుతున్నానని చెప్పకనే చెప్పడానికి నిర్ణయించుకున్నారని తేటతెల్లమౌతోంది.  ష‌ర్మిల నిర్వ‌హించేది పూర్తిగా కాంగ్రెస్ కార్యక్రమం. అందుకే ఆమె కాంగ్రెస్ అగ్రనేతలను ఈ వేడుకలకు హాజరు కావాలంటూ ప్రత్యేకంగా కలిసి కోరారు.   ష‌ర్మిల నిర్వ‌హించే వైఎస్ఆర్ జ‌యంతి కార్య‌క్ర‌మానికి విజయమ్మ హాజర‌యితే.. అది జగన్ రెడ్డికి కోలుకోలేని దెబ్బే. కొంతకాలంగా  విజయమ్మ రాజకీయంగా షర్మిలకే  అండగా నిలుస్తున్నారు. ప్ర‌స్తుతం జ‌రిగే వైఎస్  జ‌యంతి కార్య‌క్ర‌మంలో విజ‌య‌మ్మ పాల్గొంటే.. రాష్ట్రంలో వైసీపీని కాదని కాంగ్రెస్ ను బలపరచాలని విజయమ్మ పిలుపునిచ్చినట్లే అర్ధం.   అంటే ఏపీలో వైసీపీ భూస్థాపితానికి బీజం ప‌డిన‌ట్లే. ప్ర‌స్తుతం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఎదుర‌వుతున్న ఇబ్బందుల‌ను చూస్తున్న ఏపీ ప్ర‌జలు.. ఎవ‌రు చేసిన క‌ర్మ వారు అనుభ‌వించ‌క త‌ప్ప‌దు.. అంటూ సాగే పాట‌ను గుర్తు చేసుకుంటున్నారు.
Publish Date: Jul 5, 2024 5:21PM

గిన్నెలో కోడి కాదు.. గిన్నీస్‌లో కోడి!

కోడి సాధారణంగా పొయ్యి మీద వున్న గిన్నెలోకి చేరుతుంది.. కానీ, బ్రిటీష్ కొలంబియాలో ఒక కోడి గిన్నిస్ బుక్కులోకి చేరింది. ప్రపంచం మొత్తంలో అంకెలను, రంగులను గుర్తుపట్టి చెప్పగలిగే కోడిగా ఈ కోడి గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించింది. ఈ కోడి ఈ ఘనతను సొంతగా ఏమీ సాధించలేదు. ఎమీలా అనే ఒక పశువైద్యురాలికి, కోడికి అంకెలను, రంగులను గుర్తుపట్టే విధంగా ట్రైనింగ్ ఇస్తే ఎలా వుంటుందన్న ఆలోచన వచ్చింది. ఆమె వెంటనే తన ఆలోచనని అమల్లో పెట్టేసింది. దీని కోసం ఒక కోడి గుడ్డును ఎంపిక చేసుకుంది. ఆ గుడ్డులోంచి కోడిపిల్ల బయటకి వచ్చినప్పటి నుంచి దానికి ట్రైనింగ్ ఇవ్వడం ప్రారంభించింది. ఆ కోడి పిల్ల పెరిగి కోడి పుంజు అయ్యే నాటికి చాలా అంకెలని, రంగులని గుర్తుపట్టగలిగే టాలెంట్ సంపాదించుకుంది. అందుకే, గిన్నెలోకి వెళ్ళాల్సిన ఆ కోడి గిన్నిస్ బుక్కులోకి చేరింది. ఈ కోడిని కోసుకుని కూర వండుకునే ఉద్దేశం తనకు ఎంతమాత్రం లేదని, అది బతికి వున్నంతకాలం తనతోనే వుంచుకుంటానని డాక్టర్ ఎమీలా చెబుతోంది.
Publish Date: Jul 5, 2024 5:18PM

జైల్లో రేపిస్టు సుధాకర్‌.. పరామర్శకు వెళ్లనున్న జగన్?

గత మూడేళ్ళుగా మైనర్ బాలికను వేధిస్తున్న కోడుమూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ జరదొడ్డి సుధాకర్‌ని పోలీసులు అరెస్టు చేశారు. పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కి పంపించారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి రిమాండ్‌లో వున్న రేపిస్టు సుధాకర్‌ని పరామర్శించాల్సిన అవసరం వుంది. హత్యాయత్నం కేసులో జైల్లో వున్న తన పార్టీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పాతిక  లక్షల రూపాయల ఖర్చు పెట్టించి పరామర్శించిన జగన్, ఇప్పుడు రేప్ కేసులో అరెస్టు అయిన సుధాకర్‌ని కూడా పరామర్శించాలి. పిన్నెల్లిని పరామర్శించి బయటకి వచ్చిన తర్వాత జగన్, పిన్నెల్లి ఈవీఎంలు పగలగొట్టడాన్ని సిగ్గులేకుండా సమర్థించారు. అలాగే రేపిస్టు సుధాకర్ని పరామర్శించి, జైల్లోంచి బయటకి వచ్చిన తర్వాత సుధాకర్ చేసిన రేప్‌ని కూడా సమర్థిస్తూ మాట్లాడాలి. ‘‘పాపం సుధాకర్‌కి రేప్ చేయక తప్పని పరిస్థితి వుంది కాబట్టి రేప్ చేశాడు... రేప్ చేయాల్సిన అవసరం లేకపోతే ఎందుకు రేప్ చేస్తాడు?’’ అని సిగ్గులేకుండా మాట్లాడే శక్తి జగన్‌కే వుంది కాబట్టి... జగన్ అలా మాట్లాడాలి. చంద్రబాబుని తిట్టడానికి జగన్ ఏ సాకు దొరుకుతుందా వెతుక్కుంటున్నాడు కదా... ఈ రేపిస్టు దగ్గరకి వెళ్ళినప్పుడు కూడా, ‘‘ఇదంతా వైసీపీ వాళ్ళమీద చంద్రబాబు కుట్ర’’ అని రంకెలు వేయాలి.. ఇదంతా విని జనం జగన్ ముఖం మీద మరోసారి ఊయాలి!
Publish Date: Jul 5, 2024 4:28PM

తెలంగాణ బీజేపీలో కుమ్ములాటలు?

తెలంగాణ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు పీక్స్ కు చేరాయి.  హిందుత్వ భావజానం, ఆర్ఎస్ఎస్ బీజేపీకి మెంటార్ గా వ్యవహరించడం.. అన్నిటికీ మించి బీజేపీలోకి బయటి పార్టీలకు వచ్చిన వారిని తొలి నుంచీ పార్టీలో ఉన్నవారు మనస్ఫూర్తిగా కలుపుకునే పరిస్థితి లేకపోవడం సహజప రిణామంగా అంతా భావించేవారు. వామపక్ష పార్టీలు, బీజేపీలు కన్జర్వేటివ్ పొలిటికల్ పార్టీలకు భిన్నంగా సైద్ధాంతిక నిబద్ధతతో ఉంటాయని భావించేవారు. అయితే బీజేపీలో ఇప్పుడా పరిస్థితి లేదు. మిగిలిన రాజకీయ పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీలకు పెద్ద తేడా లేకుండా పోయింది. ప్రధానంగా  బీజేపీ నాయకత్వం మోడీ  చేతులలోకి వచ్చిన తరువాత పార్టీకి మిగతా పార్టీలకీ ఉండే తేడా మాయమైపోయింది. సిద్ధాంతం కంటే ఓట్లు, సీట్ల లెక్కలకే బీజేపీ హైకమాండ్ ప్రాధాన్యం ఇవ్వడంతో దేశ వ్యాప్తంగా బీజేపీకీ ఇతర పార్టీలకీ, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ కూ తేడా లేని పరిస్థితి ఏర్పడింది. నాలుగు ఓట్లు, ఓ రెండు సీట్లు వస్తాయనుకుంటే.. బీజేపీ మౌలిక సిద్ధాంతాలతో విభేదించే వారిని కూడా కాషాయ కండువా కప్పి, రెడ్ కార్పెట్ పరిచి మరీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. దీంతో తొలి నుంచీ బీజేపీ సిద్ధాంతాలను నమ్మి ఆ పార్టీలో కొనసాగుతున్న వారికీ, మధ్యలో రాజకీయ కారణాలతో వచ్చి చేరిన వారికీ మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తోంది. ఈ పరిస్థితి  దేశంలో మిగిలిన అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలో  ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల తరువాత తెలంగాణ బీజేపీలో పాత వారు కొత్తవారు అన్న విభజన మరింత స్పష్టంగా గోచరిస్తోంది. ఇక ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక దగ్గరకొచ్చేసరికి తొలి నుంచీ బీజేపీలో కొనసాగుతున్నవారు, మధ్యలో ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారి మధ్య విభేదాలు రచ్చకెక్కి ఘర్షణలకు, వాగ్యుద్ధాలకూ దారి తీసే పరిస్థితి ఏర్పడింది. బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి విషయంలో  మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్,  గోషామహల్ ఎంపీ రాజాసింగ్ ల మధ్య మాటల యుద్ధమే జరిగింది. అంతే కాకుండా తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ముందన్న వారంతా బయట నుంచి వచ్చి పార్టీలో చేరిన వారే ఉండటంతో తొలి నుంచీ పార్టీలో ఉన్న వారిలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం కావడంతో పాటు బాహాటంగా తమ వ్యతిరేకతను వ్యక్తం చేసే పరిస్థితి ఏర్పడటంతో బీజేపీ హైకమాండ్ అధ్యక్షుడి నియామకాన్ని వాయిదా వేయాలని నిర్ణయించుకుంది. దీనిని బట్టే పార్టీలో వర్గ విభేదాలు ఏ స్థాయికి చేరాయో అర్థమౌతుంది.  ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా నియమితులు కావడంతో పార్టీ ఆయనను రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించాలని నిర్ణయించింది. తదుపరి అధ్యక్షుడిగా ఎవరు అన్నదానిపై రాష్ట్ర నేతల అభిప్రాయాలను సేకరించడానికి ఉపక్రమించింది. ఈ తరుణంలోనే పార్టీలో ఒక్క సారిగా విభేదాలు భగ్గుమన్నాయి. తొలి నుంచి పార్టీలో ఉన్నవారు, ఆ తరువాత వచ్చిన వారూ రెండు గ్రూపులుగా చీలిపోయారు. దీంతో పార్టీలో నిట్టనిలువుగా చీలిక వచ్చే పరిస్థితి ఏర్పడింది. అధ్యక్ష పదవి రేసులో ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందనరావు,  ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్సీ రామచంద్రరావు వంటి వారు ముందు వరుసలో ఉన్నారు. వీరంతా ఎవరికి వారు తమతమ లాబీయింగ్ ప్రారంభించినట్లు చెబుతున్నారు.  ఈ పరిస్థితి రాష్ట్రంలో బీజేపీని బలహీనపరిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని క్యాడర్ లో ఆందోళన వ్యక్తం అవుతోంది.  
Publish Date: Jul 5, 2024 4:09PM

అడవిబిడ్డకు అందలం... మిరియాల శిరీష...!

ఎక్కడో రంపచోడవరం దగ్గర గిరిజన గ్రామంలో అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేసే ఒక యువతి ఎమ్మెల్యే అవుతుందని ఎవరైనా ఊహించగలరా? ఎవరో వేరేవారు ఊహించడం కాదు.. సాక్షాత్తూ ఆ యువతి కూడా ఊహించలేదు. ప్రజలకు సేవ చేయాలన్న తపన.... ఊహించడానికి కూడా వీలుకాని విషయాన్ని నిజం చేసింది. ఒక సామాన్యురాలిని అసామాన్యురాలిగా మార్చింది.. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపింది. ఆమె ఎవరో కాదు.... రంపచోడవరం తెలుగుదేశం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి. రంపచోడవరం నియోజకవర్గం నుంచి 2014, 2019 ఎన్నికలలో వరుసగా విజయం సాధించిన సీనియర్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి మీద.... రాజకీయ నేపథ్యం లేని, రాజకీయాలంటే ఎంతమాత్రం అవగాహన లేని మిరియాల శిరీష దాదాపు పదివేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక సంచలన విజయం. ఆర్థికంగా బలం, రాజకీయంగా బలగం వున్న చాలామంది ఓటమిపాలైన ఈ ఎన్నికలలో ఒక సామాన్య యువతి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టడం అనేది సామాన్యమైన విషయం కాదు.. ఆనాడు అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రారంభించినప్పుడు ఇలాంటి సామాన్యులనే తన తోటి ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి తీసుకెళ్ళారు. ఇప్పుడు అదే బాటలో మిరియాల శిరీషను అసెంబ్లీకి తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు, లోకేష్‌కి దక్కింది.  రాజవొమ్మంగి మండలం అనంతగిరికి చెందిన మిరియాల శిరీష గిరిజన కోయ తెగకు చెందిన యువతి. బీఈడీ పూర్తి చేసిన తర్వాత తన ప్రాంతంలోనే అంగన్‌వాడీ టీచర్‌గా ఉద్యోగాన్ని సంపాదించారు. ఉద్యోగ నిర్వహణలో ఆమెకు అంగన్‌వాడీ టీచర్లు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల మీద పూర్తి అవగాహన ఏర్పడింది. అలాగే స్థానిక సమస్యల విషయంలో కూడా శిరీషకు పూర్తి అవగాహన వుంది. శిరీష భర్త మఠం విజయభాస్కర్ తెలుగుదేశం పార్టీలో చురుకైన కార్యకర్త.  నారా లోకేష్ నిర్వహించిన యువగళం పాదయాత్ర నిర్వహించిన సందర్బంగా శిరీష తన భర్తతో కలసి వెళ్ళి నారా లోకేష్‌ని కలిశారు. అక్కడ లోకేష్, శిరీష మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. రంపచోడవరం ప్రాంత ప్రజలు, అంగన్‌వాడీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యల ప్రస్తావన వచ్చింది. స్వతహాగా ధైర్యవంతురాలైన శిరీష... లోకేష్‌తో మాట్లాడుతున్న సందర్భంలో, రంపచోడవరం ఎమ్మెల్యే టిక్కెట్ తనకు ఇస్తే ఇక్కడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని శిరీష అన్నారు. అది విని నారా లోకేష్ నవ్వి ఊరుకున్నారు. శిరీష తిరిగి తన గ్రామానికి వచ్చిన తర్వాత వైసీపీ వర్గాల నుంచి బెదిరింపులు ప్రారంభమయ్యాయి. అంగన్‌వాడీ టీచర్‌గా వున్న నువ్వు లోకేష్‌ పాదయాత్రకి ఎందుకు వెళ్ళావని బెదిరించారు. అధికారుల వైపు నుంచి కూడా శిరీషకు రాజకీయాల వైపు వెళ్ళొద్దని ఒత్తిళ్ళు వచ్చాయి. కాలం గిర్రున తిరిగింది.. అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. శిరీషకు తెలుగుదేశం పార్టీ ఆఫీసు నుంచి పిలుపు వచ్చింది. అక్కడకి వెళ్ళిన శిరీషకి నారా లోకేష్ బీఫామ్ ఇచ్చారు.. రంపచోడవరం తెలుగుదేశం అభ్యర్థివి నువ్వే అన్నారు. శిరీషకి అది కలా.. నిజమా అనేది అర్థం కాలేదు. తెలుగుదేశం పార్టీ అండతో ఎన్నికల బరిలోకి దిగిన శిరీషకి వైసీపీ వర్గాల నుంచి ఎన్నో బెదిరింపులు.. కోట్ల రూపాయలు ఇస్తాం.. ఎన్నికల బరినుంచి తప్పుకొమ్మంటూ ప్రలోభాలు... వాటినుంచి తప్పుకుంటూ, ధైర్యంగా ముందుకు అడుగు వేసిన శిరీష ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అసెంబ్లీలో మిరియాల శిరీషాదేవి ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో ఆమెలో కనిపించిన ధైర్యం, ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోకి ఒక ధైర్యవంతురాలైన నాయకురాలు వచ్చారన్న అభిప్రాయాన్ని కలిగించింది. ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత కూడా శిరీష వారానికి ఒకసారి తాను టీచర్‌గా పనిచేసిన అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్తున్నారు. అక్కడ వున్న పిల్లలకు చదువు చెబుతున్నారు. తాను ఎమ్మెల్యే అయినప్పటికీ, సాధారణ మహిళనని, సాధారణంగానే జీవిస్తానని ఆమె చెబుతున్నారు. తన ప్రాంత ప్రజలకు, అంగన్‌వాడీ ఉద్యోగులకు మేలు చేయాలన్న తపనే తనను ముందుకు నడిపిస్తోందని మిర్యాల శిరీషాదేవి చెబుతున్నారు.
Publish Date: Jul 5, 2024 3:55PM

అమరావతి కోసం ఎంపీగా తన తొలి వేతనం విరాళం!

ఆయన తొలి సారి ఎంపీగా ఎన్నికయ్యారు. అతి సామాన్య కుటుంబ నేపథ్యం ఆయనది. రెండు దశాబ్దాల కిందట తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి విధేయుడిగా పని చేస్తూ వస్తున్నారు. ఎన్నడూ పదవుల కోసం పాకులాడలేదు. తన పనితీరు ద్వారానే పార్టీ అధినేతను మెప్పించారు. పార్టీ పట్ల ఆయన అంకిత భావాన్ని గుర్తించి తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఇటీవలి ఎన్నికలలో ఆయనను విజయనగరం లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా పోటీలో నిలిపారు. ఆయన పేరు కలిశెట్టి అప్పలనాయుడు. విజయనగరం లోక్ సభ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ఆయన పార్లమెంటులో అడుగుపెట్టారు. తొలి సారి లోక్ సభకు వెళ్లిన సమయంలో కూడా ఆయన పార్టీ జెండాను పట్టుకుని సైకిల్ పైనే వెళ్లారు. ఢిల్లీ వీధుల్లో ఆయన సైకిల్ పై లోక్ సభకు వెడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.   అత్యంత సామాన్య కుటుంబ నేపథ్యం ఉన్న అప్పల నాయుడు లోక్ సభకు ఎన్నిక కావడం ఒకెత్తు అయితే.. ఎంపీగా తన తొలి నెల వేతనాన్ని అమరావతి నిర్మాణానికి విరాళంగా ఇవ్వడం మరోఎత్తుగా చెప్పుకోవాలి.  ఔను ఎంపీగా తన తొలి నెల వేతనాన్ని కలిశెట్టి అప్పలనాయుడు అమరావతి నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు లక్షా 57వేల రూపాయల చెక్కును ఆయన చంద్రబాబుకు అందించారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఆయన ను కలిసిన అప్పలనాయుడు ఆ చెక్కును చంద్రబాబుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం ఎంపీలు కూడా ఉన్నారు. చంద్రబాబు అప్పలనాయుడిని అభినందించారు. కాగా అప్పలనాయుడు ఎంపీగా తన తొలి నెల వేతనాన్ని అమరావతికి విరాళంగా ఇవ్వడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. గతంలో పొందూరు మార్కెట్ కమిటీ చైర్మన్ గా పని చేసిన అప్పలనాయుడు ఆ తరువాత తెలుగుదేశం ఉత్తరాంధ్ర ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ గా కూడా పని చేశారు. పార్టీ పట్ల అంకిత భావం, విధేయతతో పని చేసిన అప్పలనాయుడి సేవలను గుర్తించిన చంద్రబాబు ఆయనకు విజయనగరం ఎంపీ టికెట్ ఇచ్చారు. చంద్రబాబు నమ్మకాన్ని నిలబెడుతూ అప్పలనాయుడు దాదాపు 2 లక్షల 50 వేల ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. 
Publish Date: Jul 5, 2024 3:54PM

ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లోకి జంప్

తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ  మెజార్టీ సీట్లు కైవసం చేసుకున్న నేపథ్యంలో బిఆర్ఎస్ ఎల్ పిని కాంగ్రెస్ ఎల్ పిలో చేర్చుకునే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు  ఒక్కొక్కరూ  కాంగ్రెస్ పార్టీలో చేరుతుంటే బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు  ఒక్కసారిగా ఆరుగురు కాంగ్రెస్ లో   చేరిపోయారు. ఎమ్మెల్సీలు దండే విఠల్, భాను ప్రసాద్, దయానంద్, ప్రభాకర్ రావు , బస్వ రాజు సారయ్య అర్థరాత్రి దాటిన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటివరకు మండలిలో  బిఆర్ఎస్ బలంగా ఉంది. బిఆర్ ఎస్ ఎమ్మెల్యేలు  ఆరుగురు ఇప్పటికే ఆరుగురు కాంగ్రెస్ లో చేరారు. బిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల వలసలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్సీల వలస కెసీఆర్ కు పెద్ద షాక్ అని చెప్పొచ్చు. 
Publish Date: Jul 5, 2024 2:44PM

వామ్మో.. బొద్దుగుమ్మ!

ఎవరైనా అమ్మాయిలు ఏమనుకుంటారు? స్లిమ్ముగా వుండాలని అనుకుంటారు. ఒకవేళ కొద్దిగా బొద్దుగా అయ్యారనుకోండి.. వెంటనే బరువు తగ్గిపోవడానికి డైటింగులూ... వాకింగులూ చేసేస్తూ వుంటారు. కానీ, టెక్సాస్‌లో వుండే మోనికా రిలే అనే ఓ బొద్దుగుమ్మ మాత్రం ఇలా అనుకోవడం లేదు. తాను బరువు బాగా పెరిగిపోవాలని కోరుకుంటోంది. అలా బరువు పెరగడం కోసం.... మూడు పూటలా కాదు... ఆరుపూటలా తింటూ కృషి చేస్తోంది. మోనిక ఆల్రెడీ మూడు వందల ఇరవై కిలోల బరువుంది. ఈ బరువుతో మోనిక శాటిస్ఫై అవడం లేదు. తన బరువుని నాలుగు వందల యాభై కిలోలకు పెంచుకోవాలన్నదే తన జీవితాశయం అని చెబుతోంది. తన బరువు అన్ని కిలోలకు చేరుకుంటే, ప్రపంచంలోనే బరువైన యువతిగా తాను వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయొచ్చని ముచ్చటపడుతోంది. ఆమె బోయ్ ఫ్రెండ్ కూడా మోనిక బరువు పెరగడానికి అవసరమైన ఫుడ్డు సప్లయ్ చేయడంలో బిజీగా వున్నాడు. ఇప్పటికే మోనిక చిన్నసైజు పర్వతంలా వుంది.. ఇంకా బరువు పెరిగితే పరిస్థితి ఎలా వుంటుందో... ఏంటో.. ఈ మోనిక పాప జీవితాశయం సంగతి ఏమోగానీ, అంత బరువు పెరిగితే, అసలు జీవితమే ఉండదేమో! పుర్రెకోబుద్ధి అని పెద్దలు ఊరికే అనలేదు మరి!
Publish Date: Jul 5, 2024 2:38PM

పూటకో మాట.. రోజుకో ఆరోపణ.. ఓటమి షాక్ లోనే జగన్!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడి నెల రోజులు గడిచిపోయాయి. జగన్ పార్టీ అత్యంత ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.   జనం తీర్పుతో జగన్ మైండ్ బ్లాక్ అయ్యింది. ఓటమి షాక్ నుంచి నెలరోజులైనా తేరుకోలేదు. అసలు ఓటమికి కారణాలేమిటి అన్నది సమీక్షించుకుని, ఆత్మ విమర్శ చేసుకుని పోరపాట్లు, తప్పులను సరిదిద్దుకుని మళ్లీ ప్రజాభిమానాన్ని చూరగొనాలన్న దిశగా ఆయన అడుగులు పడటం లేదు. అసలు ఆయన తన పార్టీ అధికారం కోల్పోవడం వెనుక ఎదో కుట్ర, ఎవరిదో హస్తం ఉందన్న భ్రమల్లోనే ఉన్నారు. నెల రోజుల వ్యవధిలో తన పార్టీ ఘోర పరాజయానికి ఆయన పలు రకాల కారణాలు చెప్పారు. ఒక సారి చెప్పిన కారణం మరోసారి చెప్పకుండా తానెంత అయోమయంలో ఉన్నారో స్వయంగా చాటుకుంటున్నారు. ప్రజలు తనను తిరస్కరించారన్న విషయాన్ని జీర్ణించుకోలేక ఆయన చేస్తున్న విన్యాసాలు, బెబుతున్న మాటలతో మరింతగా నవ్వుల పాలవుతున్నారు. నిజానికి రాజకీయ నాయకుల కంటే జనం ఎంతో తెలివైన వారు. ఒక పార్టీ గెలుపు ఓటములను జనం నిర్దేశించడం వెనుక బలమైన కారణం ఉంటుంది. సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా జనం కోరుకుంటారు. తమ ఆకాంక్షలకు భిన్నంగా వ్యవహరించే నేతలకు ఓటుతో బుద్ధి చెబుతారు. జగన్ విషయంలో అదే జరిగింది. ఎంత సేపూ ఉచితాలు అందించాను. అప్పనంగా సొమ్ములు పందేరం చేశారు. తానందించిన సంక్షేమాన్ని అందుకుని ఓట్లేయలేదంటూ జనాన్ని నిందించి ప్రయోజనం లేదు. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు సాయంత్రం జగన్ ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో తనను ఓడించిన ప్రజలను నిందించారు. కోట్ల రూపాయలు పందేరం చేశా, ఆ సొమ్ములు అందుకున్న అక్క చెల్లెమ్మలు, అవ్వాతాతల ఓట్లేమయ్యాయి? అంటూ అతి కష్టంమ్మీద కన్నీళ్లను ఆపుకుంటూ ప్రశ్నలు సంధించారు. అంతే కాదు.. నా చేతుల్లో ఏం లేదు. అంటూ నిర్వేదం ప్రదర్శించారు.  ఆ తరువాత జూన్ 13న జగన్  పార్టీ నేతలతో తాడేపల్లి ప్యాలెస్ లో సమావేశం అయ్యారు. ఆ సమావేశంలో  ఆయన తమ ఓటమికి ఈవీఎంలను నిందించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ కారణంగానే ఓటమిపాలయ్యానని చెప్పారు. ఐదు రోజుల తరువాత ఆయన అంటే జూన్ 18న జగన్ ఎక్స్ వేదికగా విడుదల చేసిన ఓ సందేశంలో ప్రపంచ వ్యాప్తంగా  అన్ని దేశాలూ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నాయనీ, నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి నిలబడాలంటే ఈవీఎంల ద్వారా కాకుండా పేపర్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరగాలని పేర్కొన్నారు.  ఇక తాజాగా గురువారం (జులై 4) నెల్లూరు జైలులో  వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ములాఖత్ తరువాత బయటకు వచ్చి చేసిన ప్రసంగంలో ఎక్కడా ఈవీఎంల ప్రస్తావన తీసుకురాలేదు. చంద్రబాబు హామీలను నమ్మి జనం ఆయనను గెలిపించారని చెప్పుకొచ్చారు. అయితే చంద్రబాబు తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చారని నిందించారు. అంటే ఒక నెల రోజుల వ్యవధిలోనే జగన్ తన ఓటమికి ప్రజలను నిందించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే ఓటమి పాలయ్యానని భోరుమన్నారు. ఇప్పుడు జనం చంద్రబాబు మాయలో పడి తనను ఓడించారని చెప్పుకొచ్చారు. కానీ తన విధానాలు, వేధింపులు, కక్ష పూరిత రాజకీయాలు, అభివృద్ధి ఊసే లేకుండా సాగించిన పాలన కారణంగానే జనం తనను తిరస్కరించాన్న గ్రహింపునకు మాత్రం రాలేదు.  
Publish Date: Jul 5, 2024 2:07PM

బిఆర్ఎస్ ఎమ్మెల్యే  మహిపాల్ రెడ్డి  బిజెపిలోకి?

పటాన్ చెరు బిఆర్ఎస్ ఎమ్మెల్యే  గూడె మహిపాల్ రెడ్డి పార్టీ మారతారనే చర్చ తీవ్రంగా జరుగుతోంది. మైనింగ్ శాఖకు 300 కోట్ల రూపాయలు  ఆయన ఎగ్గొట్టారని ఈఢీ ఆరోపించిన సంగతి తెలిసిందే. మహిపాల్ రెడ్డి అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. ఈడీ దాడుల నేపథ్యంలో పార్టీ మారాలని మహిపాల్ రెడ్డి నిర్ణయించుకున్నారు. తొలుత కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్న మహిపాల్ రెడ్డిని స్థానిక కాంగ్రెస్ కేడర్ అడ్డుకుంది. ఆందోల్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటి సీఎం దామోదర రాజనర్సింహ గట్టిగా వ్యతిరేకించడమే గాకుండా పార్టీ అధిష్టానాన్ని కోరారు. దీంతో గాంధీభనన్ గేట్లు క్లోజ్ అయ్యాయి. చేసేదేమి లేక మహిపాల్ రెడ్డి  బిజెపిలోకి  చేరాలని యోచిస్తున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. . మహిపాల్ రెడ్డి  సోదరుడు ఇటీవల  మైనింగ్ కేసులో జైలు పాలయ్యాడు. అక్రమ మైనింగ్ వ్యాపారం చేసి కూడబెట్టిన డబ్బుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు ఈడీ గుర్తించింది.  మహిపాల్ రెడ్డి బ్యాంకు లాకర్లను ఈడీ తెరిపించి చూసింది.  యాక్సిస్ బ్యాంకు నుంచి కీలక పత్రాలను ఈడీ  స్వాధీనం చేసుకుంది. పటాన్ చెరు నియోజకవర్గం నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన గూడె మహిపాల్ రెడ్డి పై ఈడీ ఉచ్చు బిగుస్తోంది. మహిపాల్ రెడ్డి అక్రమ సంపాదనపై  ఇప్పటికే ఈడీ నోటీసులు ఇచ్చింది. మైనింగ్ శాఖకు బకాయిపడ్డ కేసులో ఈడీ నోటీసు ఇచ్చింది. ఈ కేసులో మహిపాల్ రెడ్డి జైలు పాలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ , బిజెపి పెద్దలను వేర్వేరుగా కలుస్తున్నారు. మహిపాల్ రెడ్డి  కొనుగోలు చేసిన బంగారానికి రసీదులు లేవు. అక్రమ మైనింగ్ వ్యాపారం చేసి అక్రమ ఆస్తులను కూడబెట్టిన  ఆరోపణలు మహిపాల్ రెడ్డి మూటగట్టుకున్నారు. దీంతో ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. రాజకీయ పునరావాసం కోసం బిజెపిలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.  జహిరాబాద్ బిజెపి  మాజీ ఎంపీ బీబీ పాటిల్ తో మహిపాల్ రెడ్డి పలు దఫాలు సమావేశమైనట్లు తెలుస్తోంది. బిజెపిలో చేరాలంటే మహిపాల్ రెడ్డి  తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బిజెపి అధిష్టానం కండిషన్ పెట్టినట్టు భోగట్టా. 
Publish Date: Jul 5, 2024 1:47PM

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోండి.. నిర్మలా సీతారామన్ తో చంద్రబాబు భేటీ!

హస్తిన పర్యటనలో క్షణం తీరిక లేకుండా ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలకు దోహదపడేలా సహకరించాల్సిందిగా కేంద్ర మంత్రులతో వరుస భేటీలలో కోరుతు న్నారు. అందులో భాగంగానే కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ లో జరిగిన భేటీలో చంద్రబాబు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరారు. జగన్ ప్రభుత్వ దుష్పరిపాలన కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని బడ్జెట్ లో కేటాయింపులు పెంచాలని కోరారు. రాష్ట్ర ప్రగతిని  కేంద్ర ప్రభుత్వం చేయూత ఇవ్వాలన్నారు.   కేంద్ర బడ్జెట్‌లో ఏపీ అంశాలకు ప్రాధాన్యత నిధుల కేటాయింపు చేయాలని ఆర్ధికమంత్రిని ఏపీ ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, ఎన్డీయే ఎంపీలతో కలిసి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీ ఆర్ధికమంత్రి పయ్యావుల కేశవ్, టీడీపీ ఎంపీలు, చీఫ్ సెక్రటరీ నీరాబ్ కుమార్ ప్రసాద్,ఏపీ ఫైనాన్స్ సెక్రటరీ పీయూష్ కుమార్,కేంద్రమంత్రితో భేటీ అయ్యారు. అంతకుముందు నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యంను చంద్రబాబు కలిశారు.   నిర్మలా సీతారామన్‌తో భేటీ అనంతరం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాతో , అలాగే కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో చంద్రబాబు భేటీ  అయ్యారు.
Publish Date: Jul 5, 2024 1:27PM

దుష్ప్రచారం కోసమే మార్గాని ప్రచార రథం దగ్ధం

వైసీపీ అరాచకాలు అధికారం కోల్పోయిన తరువాత కూడా కొనసాగుతున్నాయి. దొంగే దొంగ దొంగ అని అరిచిన చందంగా ఆ పార్టీ వ్యవహారశైలి ఉంది. ఇందుకు తాజా ఉదాహరణ రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రచార రథం దగ్ధం ఘటనే. గత నెల 28న అంటే వైసీపీ ఘోర పరాజయం పాలై అధికారం కోల్పోయిన తరువాత ఈ ఘటన జరిగింది. రాజమహేంద్రవరం వీఎల్ పురంలోని మార్గాని భరత్ ఎస్టేట్స్ ప్రాంగణంలోనే ఉన్న ఆయన కార్యాలయం వద్ద ఉన్న ఆయన ప్రచార రథం దగ్ధమైంది. ఈ రథం దగ్థం ఘటనపై పోలీసులకు ఈ నెల 2న ఫిర్యాదు అందింది. ప్రచార రథం దగ్థం ఘటనపై అంత ఆలస్యంగా ఫిర్యాదు అందడంపై అప్పట్లోనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. సరే ఆ సంగతి పక్కన పెడితే.. తెలుగుదేశం వారే మార్గాని భరత్ ప్రచార రథాన్ని దగ్ధం చేసేశారంటూ ఊరూ వాడా ఏకమయ్యేలా నానా యాగీ చేశారు. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. వారి దర్యాప్తులో వైసీపీ వాళ్లే రథాన్ని దగ్థం చేసి నెపాన్ని తెలుగుదేశంపై నెట్టేందుకు ప్రయత్నించారని వెల్లడైంది. ఇక రథం దగ్ధానికి సినీ ఫక్కీలో ప్రణాళిక రచించినట్లు కూడా పోలీసు దర్యాప్తులో తేలింది. ఇంతకూ రథాన్ని దగ్థం చేసింది ఎవరంటే మార్గాని భరత్ తండ్రి మార్గాని నాగేశ్వరరావు ముఖ్య అనుచరుడు శివేనని కూడా తేలింది. మార్గాని ఎస్టేట్స్ లో మార్గాని భరత్ కార్యాలయానికి సమీపంలోని షెడ్ లో ఉన్న రథం తగుల బెట్టడానికి  శివ పోలీసులు సైతం దిగ్భ్రమ చెందేలా ప్రణాళిక రచించారు. అల్యూమినియం ఫాయిల్‌ కవర్‌లో పెట్రోలు నింపి దానిని రథం ముందు టైరుపై పెట్టాడు. ఒక్క సారిగా మంటలు ఎగసిపడకుండా మస్కిటో కాయిల్ ను ఆ కవర్ కు కట్టి దానిపై అగ్గిపుల్లలు పేర్చాడు. మస్కిటో కాయిల్ మెల్లిగా కాలుతూ అగ్గిపులల వరకూ వచ్చి ఒక్కసారిగా పెట్రోలు అంటుకుని మంటలు వ్యాపించాయి.  సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు ఛేదించారు. నిందితుడు శివను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. విచారణలో మార్గాని భరత్ పై ప్రజలలో సానుభూతి కలిగేలా చేయడం కోసమే రథాన్ని దగ్థం చేసినట్లు శివ వెల్లడించాడు. 
Publish Date: Jul 5, 2024 12:43PM