జగన్ హిమాలయాలకు వెళ్తే...?!

ఆలస్యంగా తెలిస్తే తెలిసిందిగానీ, అద్భుతమైన విషయం తెలిసింది. లేటెస్ట్ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత... ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్... తాను ఎందుకు ఓడిపోయానే అర్థం కావడం లేదని, తాను బటన్ల మీద బటన్లు నొక్కి డబ్బు పంచినవాళ్ళంతా తనకు ఓట్లు ప్లస్ ప్రేమ ఎందుకు పంచలేదో అర్థం కావడం లేదని చాలాసార్లు మొత్తుకుంటూనే వున్న విషయం తెలిసిందే. అయితే ఇంతకాలం బయటపడని సరికొత్త పాయింట్ రీసెంట్‌గా బయటికొచ్చింది. జగన్ తన సన్నిహితుల దగ్గర బాధపడిపోతూ, ‘‘ఫలితాలు చూశాక షాకయ్య... ఇదేంటి, ఇంత చేస్తే ఈ రిజల్ట్స్ ఏంటి? అసలు అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోదామనిపించింది’’ అన్నారట. 

జగన్ భజన బ్యాచ్‌ని ఈ పాయింట్ మీద మాట్లాడమన్నామనుకోండి... జనరల్‌గా ఏం చెప్తారంటే, ‘‘మా జగనన్న హిమాలయాలకు వెళ్తే, హిమాలయాల రేంజే పెరిగిపోతుంది. హిమాలయాలు ఇంకా కూల్‌గా అయిపోతాయి. మా జగనన్న ‘స్వామి జగనానంద మహర్షి’గా మారిపోతారు. హిమాలయాల్లో వేలాది సంవత్సరాలు తపస్సు చేస్తారు. హిమాలయాల్లో అద్భుతమైన ఆశ్రమాన్ని స్థాపిస్తారు. ఎంతోమందిని ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్ళిస్తారు. ప్రపంచం మొత్తాన్నీ తన తపశ్శక్తితో కాపాడుతూ వుంటారు. ఓ ఐదు లక్షల సంవత్సరాలు జీవించి, ఈ భూమ్మీదకి తాను వచ్చిన కార్యాన్ని నెరవేర్చి, ఆ తర్వాత బొందితోనే మోక్షాన్ని పొందుతారు. అవసరమైతే మరణాన్ని జయించి, హిమాలయాల్లోనే సెటిలైపోతారు’’. చాలా ఓవర్‌గా చెప్పినట్టు అనిపించినప్పటికీ, జగన్ భజన బ్యాచ్ ఆయన్ని ఈ రేంజ్‌లో ఆకాశంలోకి ఎత్తేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

సరే, ఇప్పుడు జగన్ హిమాలయాలకు వెళ్ళిపోతే అక్కడ నిజంగా ఏం జరుగుతోందో చూద్దాం.. జగన్ హిమాలయాలకు వెళ్ళగానే ఫస్టుఫస్టు చేసేది ఏంటంటే, అక్కడ మంచులో, గుహల్లో, ఆశ్రమాల్లో తపస్సు చేసుకుంటున్న మునులు, మహర్షులు, యోగులు అందర్నీ అక్కడ నుంచి అర్జెంటుగా తరిమేస్తారు. ఎవరైనా ఇదేంటయ్యా అని ప్రశ్నిస్తే, వాళ్ళని జైల్లో వేసి కుళ్ళబొడిపిస్తారు. తర్వాత హిమాలయాల్లో అన్నిటికంటే ఎత్తుగా వున్న శిఖరం తలని నరికేసి అక్కడ ఒక పెద్ద ప్యాలెస్ కడతారు. ఆ ప్యాలెస్‌లో ఫుల్లుగా ఏసీలు బిగిస్తారు. హిమాలయాల్లో ఒక్కో కొండ మీద ఒక్కో పార్టీ ఆఫీసు కడతారు. హిమాలయాలు మొత్తం కబ్జా చేసేస్తారు. పులివెందుల లుంగీ బ్యాచ్‌ని హిహాలయాల మీదకి ఎంటర్ చేసి, లోకల్ వాళ్ళు అక్కడ నుంచి పారిపోయేలా చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో గడచిన ఐదేళ్ళ కాలంలో ఎన్ని దారుణాలు చేశారో హిమాలయాల్లో కూడా అంతకంటే నాలుగు ఎక్కువ దారుణాలే చేస్తారు. హిమాలయాల అదృష్టం బాగుండి జగనన్న హిమాలయాలకు వెళ్ళలేదుగానీ, లేకపోతే... పాపం... హిమాలయాలు ఏమైపోయేవో! ఇదంతా కామెడీయే.. లైట్ తీసుకోండి... జగన్ హిమాలయాలకు వెళ్ళేది లేదు.. ఇవన్నీ జరిగేవీ కావు!