తెల్లజుట్టు ఎక్కడైనా కనబడగానే చాలామంది గాభరా పడిపోతారు. ఒకే ఒక్కటి ఉంటే దాన్ని లాగేయడం చేస్తారు. ఒకటి కంటే ఎక్కువ తెల్ల వెంట్రుకలు ఉంటే వాటిని కవర్ చేయడానికి నానా తంటాలు పడతారు. అయితే తెల్లజుట్టును కవర్ చేయడానికి వాడే చాలా వాణిజ్య ఉత్పత్తులలో రసాయనాలుంటాయి. ఇవి జుట్టుకు రంగును తాత్కాలికంగా ఇస్తాయి కానీ మెదడులోపలి నరాలను చాలా దెబ్బతీస్తాయి. అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టును నల్లగా మార్చే ఆకులు ఉన్నాయి. అవే గోరింట, నీలిమందు..
గోరింట..
గోరింట సాధారణంగా అందరికీ తెలిసిందే. ఇది చేతులకు మాత్రమే కాకుండా తెల్లజుట్టు కవర్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇది చాలా సహజమైన కలర్ గా పేర్కొనబడుతుంది.
నీలిమందు..
సాధారణంగా నీలిమందును బట్టలకు వాడటమే తెలిసి ఉంటుంది. కానీ నీలిమందును గోరింటలో కలిపి జుట్టుకు పెట్టుకుంటే తెల్లజుట్టు నల్లగా మారుతుంది.
గోరింట, నీలిమందు హెయిర్ డై..
జుట్టు పరిమాణాన్ని బట్టి గోరింట పొడిని తీసుకోవాలి. ఈ గోరింట పొడిలో టీ పొడి ఉడికించిన నీటిని వేసి పేస్ట్ లాగా కలపాలి. ముదురు రంగు రావడం కోసం ఇందులో కాస్త నిమ్మరసం కూడా కలపవచ్చు. గోరింట మిశ్రమాన్ని రాత్రంతా ఒక ఇనుప బాండిలోనే ఉంచాలి. మరుసటి రోజు గోరింట మిశ్రమంలో గోరింట పొడి కంటే ఎక్కువ నీలి మందు పొడి వేయాలి. దీన్ని పేస్ట్ లా చేసుకోవడానికి ఇందులో పెరుగు వేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి ఓ గంటసేపు అలాగే వదిలేయాలి. ఆ తరువాత దీన్ని జుట్టును పాయలు పాయలుగా తీసుకుంటూ జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు అప్లై చేయాలి. కనీసం రెండు నుండి మూడు గంటల పాటూ దీన్ని ఉంచుకోవాలి.
ఈ హెయిర్ డై ని 15 నుండి 20 రోజులకు ఒకసారి జుట్టుకు అప్లై చేస్తుంటే మూడు లేదా నాలుగు సార్లకే తెల్లజుట్టు పూర్తీగా నలుపురంగులోకి మారుతుంది. ఇది కేవలం జుట్టును నల్లగా మార్చడమే కాదు.. గోరింటలోని గుణాలు, నిమ్మరసం, టీ డికాషన్ ఇవన్నీ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.
*నిశ్శబ్ద.