న్యూ ఇయర్, క్రిస్టమస్ హడావిడిలో మిమ్మల్ని తళుక్కున మెరిపించే చిట్కాలు..!

డిసెంబర్ నెలను పార్టీ సీజన్ అని చెప్పవచ్చు. ఒకవైపు క్రిస్మస్ వేడకలు, మరొకవైపు న్యూ ఇయర్ వేడుకలు.. ఈ పార్టీ సీజన్ దగ్గరకు వచ్చే కొద్దీ ప్రతి అమ్మాయి ప్రతి చోట చాలా ఆకర్షణీయంగా, అందంగా కనిపించాలని కోరుకుంటుంది. అది ఫ్రెండ్ పార్టీ అయినా, ఆఫీస్ పార్టీ అయినా, లేదా ఫ్యామిలీ మీట్ అయినా ప్రతి ఒక్కరూ తమ ఎంట్రీ స్టైలిష్‌గా, రాయల్ గా కనిపించాలని కోరుకుంటారు. అయితే వీటికి అటెండ్ అవ్వడానికి ఖరీదైన మేకప్ ఉత్పత్తులు, బ్యూటీ ట్రీట్మెంట్ ఉండాలని అనుకుంటూ ఉంటారు. కానీ నిజమేంటంటే అలాంటివి అవసరం లేదు. స్మార్ట్ స్కిన్ కేర్, సరైన మేకప్ చిట్కాలు, గ్లో ట్రిక్స్‌తో.. ఇంట్లోనే పర్పెక్ట్ పార్టీ లుక్స్ ను మీ సొంతం చేసుకోవచ్చు. ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకుంటే..
అందాన్ని పెంచే సులభమైన గ్లో చిట్కాలు..
పార్టీకి ముందు..
ఏదైనా మేకప్‌కి బలమైన బేస్ అవసరం. ఇందుకోసం చర్మం ప్రిపేర్ కాకపోతే, మేకప్ ఎంత బాగున్నప్పటికీ, అది అంత బాగా కనిపించదు. పార్టీకి ముందు చర్మాన్ని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. చర్మ రంధ్రాలను క్లియర్ చేయడానికి, చర్మాన్ని మృదువుగా చేయడానికి టోనర్‌ను అప్లై చేయాలి. దీని తర్వాత తేలికపాటి మాయిశ్చరైజర్‌ను వాడాలి. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా మేకప్ ఎక్కువసేపు ఉండటానికి కూడా సహాయపడుతుంది.
బేస్ మేకప్..
బేస్ మేకప్‌లో ఫస్ట్ స్టెప్ ప్రైమర్ అప్లై చేయడం. ప్రైమర్ ఫౌండేషన్ సజావుగా కలపడానికి, క్రాక్స్ నివారించడానికి సహాయపడుతుంది. చర్మపు రంగుకు సరిపోయే ఫౌండేషన్‌ను ఎంచుకుని, దానిని పూర్తిగా బ్లెండ్ చేయాలి. నల్లటి మచ్చలు లేదా పిగ్మెంటేషన్ ఉంటే వాటిని తేలికపాటి కన్సీలర్‌తో కప్పాలి. ఇది ముఖాన్ని తాజాగా, కంప్లీట్ గా కనిపించేలా చేస్తుంది.
ఐ మేకప్..
పార్టీ లుక్ కోసం ఐ మేకప్ చాలా ముఖ్యం. కళ్ళకు మెరుపు, కళ్ల సైజ్, కళ్లు అట్రాక్షన్ గా కనిపించడానికి ఐషాడోను ఉపయోగించవచ్చు. ఐలైనర్ అంచులుగా ఉండేలా చేసి, హెవీ మస్కారాను అప్లై చేయడం ద్వారా కంటి మేకప్‌కు గ్లామర్‌ను జోడించవచ్చు. కావాలనుకుంటే లుక్‌ను డ్రామాటిక్ గా, పార్టీకి తగ్గట్టు మరింత హైలెట్ చేయడానికి ఐ లాషెస్ కూడా పెట్టుకోవచ్చు.
మెరిసే లుక్ కోసం..
చర్మం సహజంగా, తాజాగా మెరిసిపోవాలంటే హైలైటర్, బ్లష్, డ్యూయ్ ఫినిష్ సెట్టింగ్ స్ప్రే చాలా ముఖ్యం. చెంప ఎముకలు, ముక్కు, గడ్డంపై తేలికపాటి హైలైటర్‌ను అప్లై చేయాలి. ఇది ముఖాన్ని మెరిసేలా చేయడమే కాకుండా పార్టీ లైట్లలో షైనింగ్ ఇస్తుంది. లుక్‌ను తాజాగా, యవ్వనంగా ఉంచడానికి బ్లష్‌ను లైట్ గా, నాచురల్ గా ఉంచాలి.
మేకప్ ఎక్కువ సేపు ఉండాలంటే..
మేకప్ వేసుకున్న తర్వాత సెట్టింగ్ స్ప్రే వేయడం చాలా అవసరం. ఇది లుక్‌ను తాజాగా ఉంచుతుంది, అలాగే తొందరగా చెదిరిపోకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. పార్టీ సమయంలో ముఖాన్ని పదే పదే తాకకుండా ఉండటం చాలా ముఖ్యం. ఇది మేకప్ ఎక్కువసేపు చెదిరిపోకుండా ఉండటంలో సహాయపడుతుంది.
*రూపశ్రీ.



