మచ్చలేని ముఖం కావాలా? ఇంట్లోనే ఈ టిప్స్ ఫాలో అయిపోండి చాలు..!

ప్రతి ఒక్కరూ శుభ్రమైన,  మొటిమలు లేని చర్మాన్ని కోరుకుంటారు. కానీ బిజీ రొటీన్‌లో చర్మ సంరక్షణకు సమయం దొరకడం చాలా కష్టం. ఈరోజుల్లో చర్మసంరక్షణకు బోలెడు రకాల ఉత్పత్తులు మార్కెట్లో ఉన్నాయి.  వీటని చర్మంలో మెరుపు కనిపించాలని, చర్మం యవ్వనంగా కనిపించాలని వాడతారు. ఇవి వాడినప్పుడు నిజంగానే అనుకున్న ఫలితాలను కేవలం క్షణాలలో ఇస్తాయి. అయితే వీటని ముఖానికి పట్టింటి రిమోవ్ చేస్తే ఆ తరువాత ముఖం చాలా చండాలండా మారుతుంది. ముఖ చర్మం దారుణంగా మారుతుంది. డ్యామేజ్ అవుతుంది. అమ్మాయిలు, పెళ్లిళ్లు, ఫంక్షన్లు, డేట్ నైట్లు మొదలైనవాటి కోసం చాలా అందంగా తయారవుతారు కూడా. అయితే అలాంటి సందర్భాలలో సహజంగానే అందంగా, మచ్చలేని చర్మంతో మెరిసిపోవాలంటే మాత్రం ఈ కింది టిప్స్ ఫాలో అవ్వాలి.

గంధం,  గులాబీ రేకుల పేస్ట్..

గంధం,  గులాబీ రేకుల పేస్ట్  శతాబ్దాలుగా చర్మ సంరక్షణకు ఉత్తమ ఎంపిక. ఇది  సహజంగా మంచి సువానసను కలిగి ఉంటుంది.   గంధం,  గులాబీ రేకులతో తయారు చేసిన పేస్ట్  చర్మానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇది ముఖంలోని మురికిని శుభ్రపరచడమే కాకుండా మృతచర్మాన్ని కూడా తొలగిస్తుంది.

కావలసినవి -
2 టేబుల్ స్పూన్లు గంధపు పొడి
ఒక పిడికెడు  ఎండు గులాబీ రేకులు
1 టేబుల్ స్పూన్  పెరుగు

ఎలా చేయాలి
ముందుగా ఎండిన గులాబీ రేకులను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గంధపు పొడికి గులాబీ రేకుల పొడి కలపాలి. దీన్ని పేస్ట్ చేయడానికి  పెరుగును ఉపయోగించవచ్చు. ఈ పేస్ట్‌ను  చర్మంపై అప్లై చేసి 20-30 నిమిషాలు అలాగే ఉంచాలి. తరువాత చల్లటి నీటితో కడగాలి. దీని తర్వాత పొడి టవల్‌తో ముఖాన్ని తుడుచుకుని ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకోవాలి.  

కుంకుమ పువ్వు, పాలు..

సహజ పదార్థాలు ఎల్లప్పుడూ ముఖ సంరక్షణ కోసం చాలా మంచి ఎంపిక. కుంకుమపువ్వు అలాంటి  సహజ పదార్ధాలలో ఒకటి. ఇది చర్మాన్ని సహజంగా మెరిసేలా చేస్తుంది. కుంకుమపువ్వు కేవలం రంగు మాత్రమే కాదు.. యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఇక పాలలోని పోషక గుణాలు చర్మాన్ని తేమగా మార్చడానికి పని చేస్తాయి. ఈ రెండూ కలిస్తే ముఖ చర్మానికి చక్కగా పనిచేస్తాయి.

కావలసినవి:

 కుంకుమపువ్వు రేకలు
 2 టేబుల్ స్పూన్ల పాలు
  1టేబుల్ స్పూన్  శనగపిండి

ఎలా చేయాలి..

 కుంకుమపువ్వు రేకలను పాలలో కొన్ని  నానబెట్టాలి.
ఇప్పుడు శనగపిండిని అందులో  వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి పట్టించి 30 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత కడిగేయాలి.

వేప తులసి పేస్ట్..

వేప,  తులసితో చేసిన పేస్ట్ చర్మ కాంతిని పెంచడానికి సహాయపడుతుంది. దీన్ని  ముఖానికి అప్లై చేయడం వల్ల మెరుపుతో కూడిన ఆరోగ్యకరమైన చర్మం  సొంతం అవుతుంది.

కావలసినవి..

ఒక పిడికెడు వేప ఆకులు
ఒక పిడికెడు తాజా తులసి ఆకులు
1 టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి

ఎలా చేయాలి..

 వేప,  తులసి ఆకులను గ్రైండ్ చేసి పేస్ట్ చేయాలి. ఇప్పుడు ముల్తానీ మట్టిని పేస్ట్‌లో కలపాలి. ఈ పేస్ట్‌ను  చర్మంపై అప్లై చేసి 15-20 నిమిషాల పాటు ఆరనివ్వాలి.  ఇప్పుడు గోరువెచ్చని నీటితో కడిగి, టవల్ తో తుడుచుకుని మైల్డ్ లోషన్ లేదా క్రీమ్ రాయాలి.

గంధం, బాదం పేస్ట్..

గంధం,  బాదంతో  తయారుచేసుకున్నపేస్ట్  చర్మ కాంతిని పెంచడమే కాకుండా చర్మానికి చలువదనాన్ని   ఇస్తుంది

కావలసినవి..

2 టేబుల్ స్పూన్ గంధపు పొడి
1 టేబుల్ స్పూన్  బాదం పొడి
1 టేబుల్ స్పూన్  తేనె
కొన్ని చుక్కల పాలు

ఎలా తయారు చేయాలి..

గంధం  బాదం పేస్ట్  కోసం చందనం, బాదం పొడి  ఒక గిన్నెలో వేయాలి. దీన్ని పేస్ట్ చేయడానికి తేనె,  తగినంత పాలు జోడించాలి.  దీన్ని ముఖానికి పట్టించి, 20 నిమిషాల పాటు ఆరిన తర్వాత కడిగేయవచ్చు.


ఇక్కడ పేర్కొన్న  స్క్రబ్స్  చర్మానికి మెరుపు అందించడానికి, చర్మం మీద మురికి తొలగించడానికి సహజమైన చిట్కాలలా పనిచేస్తాయి.  ఇవన్నీ  సహజ పదార్ధాలతో తయారు చేయబడినప్పటికీ, ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా ఉండటం కోసం . వీటిని ఉపయోగించే  ముందు చర్మంపై ప్యాచ్ టెస్ట్ చేయడం చాలా అవసరం.

                                          *నిశ్శబ్ద.