ముఖ చర్మం మెరిసిపోవాలంటే.. ఈ ఫేస్ మాస్క్ బెస్ట్!

అమ్మాయిలు తమ ముఖం చాలా అందంగా కనిపించాలని అనుకుంటారు. ఇక ఫంక్షన్లు, ప్రత్యేక సందర్భాలలో ముఖం కాంతివంతంగా కనిపించడం కోసం చాలా రకాల ఫేస్ ప్యాక్ లు, క్రీములు, బ్యూటీ థెరపీలు తీసుకుంటారు. అయితే ముఖం కాంతివంతంగా కనిపించడానికి  కొన్ని రకాల ఫేస్ మాస్క్ లు చాలా బెస్ట్ గా పనిచేస్తాయి. అలాంటి వాటిలో మందార పువ్వుల ఫేస్ మాస్క్ చాలా బెస్ట్ ఫలితాలు ఇస్తుంది. ఇంతకీ ముఖం మెరిసిపోవాలి అంటే మందార ఫేస్ మాస్క్ ఎలా వేసుకోవాలి? దీని వల్ల కలిగే ఇతర బెనిఫిట్స్ ఏంటి?  తెలుసుకుంటే..

మందార పువ్వులను హైబిస్కస్ అని కూడా అంటారు. ఇది జుట్టుకు, చర్మానికి చాలా గొప్పగా సహాయపడుతుంది. మందార పువ్వులతో ఫేస్ మాస్క్ వేస్తుంది ముఖం యవ్వనంగా మారుతుంది.  ముఖం మీద ముడుతలు, గీతలు, మచ్చలు తగ్గుతాయి. ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.

మందార ఫేస్ మాస్క్ వేసుకోవడానికి కావలసిన పదార్థాలు..

మందార పొడి 2 టేబుల్ స్పూన్లు..
పచ్చి తేనె 1 టేబుల్ స్పూన్..  
పాలు.. 1 టేబుల్ స్పూన్..

పై మూడు పదార్థాలను ఒక చిన్న గిన్నెో వేసి బాగా మిక్స్ చేసి మెత్తని పెస్ట్ లా చేసుకోవాలి.  

మొదట ముఖాన్ని చల్లని నీటిలో శుభ్రపచుకోవాలి. ఏ ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి ముందైనా ఇదే పని చేయాలి. ఇలా చేస్తే ఫేస్ ప్యాక్ తాలూకు మెరుపు, వాటిలోని గుణాలు చర్మానికి బాగా పనిచేస్తాయి.

ముఖం  శుభ్రం చేసుకున్నతరువాత తయారుచేసుకున్న మందార పువ్వుల మిశ్రమాన్ని ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి.

ఫేస్ ప్యాక్ ను ముఖం మీద 20నిమిషాల పాటూ  అలాగే ఉంచి ఆ తరువాత గోరు వెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి.

మందార ఫేస్ ప్యాక్ ను పాలతోనే కాకుండా మరొక విధంగా కూడా ట్రై చేయవచ్చు..

మందార పొడి 2 టేబుల్  స్పూన్లు..

తేనె 1 టీ స్పూన్..

పెరుగు కొద్దిగా..

పై మూడు పదార్థాలను బాగా మిక్స్ చేసి ముఖానికి, మెడకు  ఫేస్ ప్యాక్ వేసుకోవాలి.  సుమారు 15 నిమిషాలు దీన్ని అలాగే ఉంచి ఆ తరువాత కాటన్ సహాయంతో ముఖం మీద ఉన్న ఫేస్ మాస్క్ ను తొలగించాలి.  దీని తరువాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

ఫేస్ ప్యాక్ వేసుకున్న రోజు మొత్తం ముఖానికి ఎలాంటి సోప్ కానీ, ఫేస్ వాష్ కానీ ఉపయోగించకూడదు.

                                          *నిశ్శబ్ద.