వర్షాకాలంలో మొటిమలు ఎందుకు వస్తాయి?
వేసవి కాలంలో పనిచేసే చర్మ సంరక్షణ ఉత్పత్తులు వర్షాకాలంలో పనికిరావు. వర్షాకాలంలో చర్మ సమస్యలు పెరుగుతాయి. ఈ సీజన్‌లో.. మారుతున్న వాతావరణం చర్మంపై చాలా ప్రభావం చూపుతుంది.
వాతావరణం మారినప్పుడు చర్మ సంరక్షణ ఉత్పత్తులలో కూడా మార్పులు చేయాల్సి ఉంటుంది. వర్షాకాలంలో చర్మ సమస్యలు పెరుగుతాయి. ఈ సీజన్‌లో వాతావరణంలో ఉండే తేమ, బ్యాక్టీరియా చర్మాన్ని అంటుకునేలా చేస్తుంది, దీని కారణంగా ముఖంపై మొటిమలు కనిపిస్తాయి.
1. రోజూ ఫేస్ వాష్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. లేదా సున్నిపిండి తో అయిన ఫేస్ వాష్ చేసుకోవచ్చు.
2. వర్షాకాలంలో చర్మంపై జిగట ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మన ముఖం తేమగా ఉండదు.
అయితే వర్షాకాలంలో కూడా ముఖం తేమగా ఉండాలి. అందుకు ముఖానికి తగిన మాయిశ్చరైజర్ వాడటం చాలా ఉత్తమం.
3. ఎక్కువ నీరు త్రాగడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. చర్మ సమస్యల నుంచి బయటపడుతారు.
నీరు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ ఎక్కువగా మూత్రం ద్వారా శరీరం నుంచి బయటకు వెళ్లిపోతాయి. నీరు ఎక్కువగా తాగడం వల్ల మొటిమల సమస్య దూరమవుతుంది. అలాగే మీ స్కిన్ కూడా మెరుస్తూ ఉంటుంది.
4. ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న వేపను ఉపయోగించడం వల్ల ముఖంపై ఉన్న మొటిమలు, బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్న వేప, దాని ప్యాక్లా చేసుకుని ఉపయోగించవచ్చు.
వేప ప్యాక్ చేయడానికి..
10-12 వేప ఆకులను తీసుకొని మిక్సీలో మెత్తగా పేస్ట్ లాగా చేయాలి. ఈ పేస్ట్‌లో 3 టీస్పూన్ల పసుపు పొడిని మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల పాటు వుంచాలి. 20 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి . ఇలా వారానికి ఒకసారి చేస్తే మొటిమలు తొలగిపోతాయి.